
AP News | అనంతపురంలో ఉపాధ్యాయుడి అసభ్యప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి
AP News | అనంతపురంలో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి
© 2026 nimisham.in

AP News | అనంతపురంలో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి

AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్

AP News | వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రైతులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం, సెప్టెంబర్ 2: శ్రీశైలం జలాల కోసం వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి పేరుతో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన కొడుకు రవి కిషోర్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎల్ నినో ప్రభావం వల్ల నీరు వచ్చే పరిస్థితి లేదని, అందువల్ల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆరు నెలల క్రితమే స్పష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. కానీ వైసీపీ నాయకులు రైతులను అడ్డం పెట్టుకుని శ్రీశైలం జలాల కోసం పోరాటాలు చేయడం రైతులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని ఆయన అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వైసీపీ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు రైతులకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో నీటి సమస్యలను పరిష్కరించాలని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే మీరేం చేశారు.. పోలీసులతో రైతులను అడ్డగించలేదా..? ఆనాడు ఏం అయింది మీ చిత్తశుద్ధి?’ అని ఎమ్మెల్యే నిలదీశారు. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 55వ జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం రాష్ట్ర నాయకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల సందేశాలు పంపించారు. సినిమా రంగంలో పవర్ స్టార్‌గా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కల్యాణ్, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవలో బిజీగా మారారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు తన పోస్టులో పవన్ కల్యాణ్‌ను ప్రియ మిత్రుడిగా సంబోధిస్తూ ఆయన సేవా నిరతిని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపొందించడం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. దీంతో రాష్ట్ర పునర్నిర్మాణ హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేక పోస్ట్ ద్వారా చాటుకున్నారు. పవన్ కల్యాణ్‌ను దేవుడిచ్చిన అన్నయ్యగా అభివర్ణించిన లోకేశ్, సినీ అభిమానులకు ఆయన పవర్ స్టార్ అయితే జనసైనికులకు మార్గదర్శకుడైన సేనాని అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. ఫలితంగా అభిమానులు, నాయకులు భారీ ఎత్తున సేవా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో తీసుకోల్సిన తదుపరి చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత వైపు వేగంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమంలో నేరుగా పాలుపంచుకోనున్నారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే బడి బయట ఉండిపోయిన పిల్లలను తక్షణమే గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఫలితంగా ప్రతి చిన్నారికి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను పురమాయించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత మరియు ఇతర

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Chandrababu naidu on free ac bus facility for women: ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అయితే పలుచోట్ల రద్దీకి తగ్గట్టుగా బస్సలు లేకపొవడంతో కొన్ని చోట్ల మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు. సీటు కోసం, బస్ స్టాప్ ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొంత మంది అవసరంలేకున్న ఫ్రీఅని చెప్పి బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కూటమి పనిచేస్తుందని అన్నారు. ఇచ్చిన అన్ని హమీలను నెరవేరుస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సహాకారంతో ఏపీ డెవలప్ మెంట్ పథంలో వేగవంతంగా ముందుకుదూసుకుని పోతుందని చెప్పుకొచ్చారు. కేవలం రెండేళ్లలో సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఎన్టీఆర్ భరోసా కింద రూ.73,507 కోట్లను పేదలకు అందించామని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి గౌరవంగా అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పుకొచ్చారు. దీపం 2.0 ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 2024 డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ.2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ఎంపీ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఏపీలో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని తెలిపారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటైందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. డీఎస్సీ, గతంలో ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్లో నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో తొలి దశలో 1,523 పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15వ తేదీన రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండో దశలో గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్1కు సంబంధించి 149 పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయనుంది. ఇక పోలీస్ విభాగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశలో పోలీస్ కానిస్టేబుల్ 542, సివిల్ ఎస్ఐ 182 పోస్టుల భర్తీ ఏపీ ప్రభుత్వం చేయనుంది. అక్టోబర్ 15వ తేదీన దసరా, దీపావళి కానుకగా నిరుద్యోగులకు మూడో దశలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 2,311 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మూడో దశలో గ్రూప్-2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నట్లు.. వాటిలో డిప్యూటీ తహశీల్దార్ 200 పోస్టులు ఉన్నాయి. మూడో దశలో ఇంజినీరింగ్ సహా ఇతర విభాగాల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం ఏపీ ప్రభుత్వం డీఆర్డీఏ-సెర్ప్ ఆయా రంగాల్లో అనుభవం ఉన్న సంస్థలతో రాష్ట్రస్థాయిలో ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. తాజాగా మహిళలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా చాయ్‌రాస్తా పేరుతో టీస్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేలా అనంతపురం జిల్లాలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. సెర్ప్ చాయ్ రాస్తా బ్రాండ్‌తో టీస్టాల్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది.ఈ చాయ్ రాస్తా బ్రాండ్‌తో టీస్టాల్ ఏర్పాటుకు ఫ్రాంచైజ్ తీసుకుంటే కంటైనర్‌తో పాటుగా సామాగ్రి అందిస్తారు. టీ, కాఫీ కోసం పంచదార, పాలు.. బిస్కెట్లు, కూల్డ్రింకులు విక్రయించొచ్చు. అలాగే చాయ్ రాస్తా ఏర్పాటుకు సంబంధించి లొకేషన్ సర్వే, డాక్యుమెంటేషన్, లైసెన్సులు, మార్కెటింగ్, వ్యాపార శిక్షణలో ఎదురయ్యే సమస్యల పరిష్కరిస్తారు. ఈ చాయ్ రాస్తా ఏర్పాటు చేసుకునేందుకు డీఆర్డీఏ స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 4 లక్షల వరకు రుణం అందిస్తారు. PMEGP (ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం) కింద రూ. 4 లక్షల రుణం పొందితే రూ. 1.40 లక్షల రాయితీ పొందే అవకాశం కూడా కల్పించారు.ఆయా ప్రాంతాన్ని బట్టి.. ప్రతి రోజూ రూ. 5వేల వ్యాపారం జరిగితే నెలకు రూ. 40వేలు వరకు ఆదాయం వస్తుందనే అంచనా ఉంది. అదే రూ. 10వేలు వ్యాపారం జరిగితే నెలకు రూ. లక్ష వరకు.. రూ. 20వేలు వ్యాపారం జరిగితే నెలకు రూ. 2.50 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మహిళలు చాయ్రాస్తాలు ఏర్పాటు చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యింది. మొత్తం 30చోట్ల అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ చాయ్ రాస్తాలను ప్రధానంగా టోల్గేట్లు, నేషనల్ హైవేలు, రద్దీ ప్రదేశాల్లో పెట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరికొన్నిచోట్ల చాయ్ రాస్తాలు ఏర్పాటు

Rajahmundry: పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ Rajahmundry: విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 24వ డివిజన్ మెరకలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు సీఎస్ఆర్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం పాఠశాల వెనుక గోడ శిథిలావస్థకు చేరడంతో పాటు తరగతి గదుల స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడటం, వాటర్ లీకేజీలు, కిటికీలు, తలుపులు దెబ్బతినడం, గ్రిల్స్‌కు తుప్పు పట్టడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. స్థానిక వార్డు ఇన్చార్జి కాశీ సూచనతో పాఠశాల సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలలో అప్పట్లో కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 36కు పెరిగిందని చెప్పారు. విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులు అందించిన ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యానికి ఎమ్మెల్యే వాసు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో తాను, అధికారులు, స్థానికులు గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అవసరమైన అదనపు పనులను కూడా చేపట్టామని చెప్పారు. పాఠశాల ఆవరణలో శానిటేషన్ సిబ్బంది మస్టర్ రూమ్ కోసం ఉపయోగించాలనుకున్న ప్రాంతాన్ని విద్యార్థుల అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్కడ వంటశాల, విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్డు, ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని చర్చిస్తున్న సమయంలో గ్లాస్ వరల్డ్ అధినేత కమల్ ముందుకు వచ్చి తన సొంత నిధులతో గది, షెడ్డు

Vatapalem: వేటపాలెం బిసి గురుకుల పాఠశాలలో సదా భార్గవి ఆకస్మిక తనిఖీ! Vatapalem: మెరుగైన విద్యాబోధనకు తరచూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని నేషనల్ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి అన్నారు. బుధవారం స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించాలని సూచించారు. పదవ తరగతి అనుమతులు గత సంవత్సరంలోనే వచ్చినప్పటికీ మంచి ఫలితాలు సాధించడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇంకా మంచి ప్రతిభ చూపేందుకు సమిష్టి కృషి అవసరమన్నారు. 500 మంది విద్యార్థులకు సరిపడా పాఠశాలలో ఏర్పాటులు ఉన్నాయని, 150 మంది విద్యార్థులకు నాలుగు టాయిలెట్లు, నాలుగు బాత్రూములు, ఆ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, దార్మిటరీ కూడా మంజూరు చేయడం జరిగిందని, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతుందని, విద్యార్థులు వంట పనుల్లో భాగస్వామ్యం కాకుండా అదనంగా వంట మనుషులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అందరూ సమిష్టి కృషితో మరింత మెరుగైన విద్యాబాధన చేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఒక నెలలో ఇంకా మెరుగైన విద్యాబోధన నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. విధులలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు, పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించేందుకు విద్యార్థులను భాగస్వాములు చేసి వారికి మానసిక వికాసం పెంపొందించేందుకు తోడ్పడాలని సూచించారు. ప్రస్తుతం 10వ తరగతిలో 23 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని , వచ్చే సంవత్సరానికి 40 మంది ఉండేవిధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ప్రతినిధి దేవరకొండ రాంబాబు ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి కే సురేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ ప్రతినిధి కె వి ప్రసాద్, పాఠశాల ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తాను కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల గొంతుకను వినిపించే లక్ష్యంతో ఈ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. ఇప్పటికే వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడిగా సేవలందించిన విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంతంగా గళం విప్పనున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ స్థాపనకు అవసరమైన కసరత్తును ఆయన ఇప్పటికే మొదలుపెట్టారు. తిరుమల క్షేత్రం నుండి వెలువడిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను ప్రభావం చూపుతోంది. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆయన ప్రకటించిన కొత్త పార్టీకి ఏ పేరు పెట్టబోతున్నారనే అంశంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలన్నది ఆయన ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ పరిణామం ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన అనుసరించబోయే వ్యూహాలు మరియు ఎజెండాపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా ఆయన నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన పార్టీ ప్రధాన అజెండా అని ఆయన పదేపదే చెబుతున్నారు. పార్టీ స్థాపనకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రిజిస్ట్రేషన్ మరియు విధివిధానాల రూపకల్పనపై దృష్టి సారించినట్లు సమాచారం. అతి త్వరలోనే పార్టీ పేరు, జెండా మరియు అజెండాను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. దీనివల్ల రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. మొత్తంగా

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirumala SSD Tokens: ఆపద మొక్కులవాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి దాదాపు ఒక రోజు సమయం పడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అంటే బుధవారం ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ సర్వదర్శనానికి వెళ్లాలని సూచించారు. రేపు గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లు బుధవారం జారీ చేయడం లేదని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని నిలిపేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఎస్ఎస్డీ టోకెన్లు ఇవ్వకపోవడంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని సూచించింది. ఇక శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లు యథావిధిగా గురువారం మధ్యాహ్నం జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. కాగా ఎస్ఎస్డీ టోకెన్ల జారీని పూర్తిగా రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో టీటీడీ 8 వారాలుగా అధ్యయనం చేస్తోంది. కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకోగా.. 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం లభించింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో హుండీ

Odalarevu: ఓడలరేవు వద్ద సముద్రంలో గల్లంతైన 7 గురు మత్స్యకారుల కోసం గాలింపు ఈ వార్తకు సంబంధించిన

Pamidi: ఖేల్కుద్ క్రీడల్లో పామిడి సరస్వతి విద్యామందిరం విద్యార్థుల ఘన విజయం Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం నిట్టూరు నిలయం లోని సరస్వతి విద్యామందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.ఈ పాఠశాలకు చెందిన దిలీప్ కుమార్, రీతిక్, శ్రీముఖి అనే ముగ్గురు విద్యార్థులు పరుగు పందెంలో 200 మీ, 400 మీ విభాగాల్లో ప్రథమ స్థానం సాధించారు. సరస్వతీ విద్యాపీఠం ప్రతి సంవత్సరం నిర్వహించే ఖేల్కుద్ క్రీడా పోటీల్లో వీరు ముగ్గురు జిల్లా స్థాయి పోటీల్లో, అనంతరం రాయలసీమ జోన్ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని రెండింటిలోనూ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. వీరి విజయాన్ని అభినందిస్తూ పాఠశాల యాజమాన్యం తరపున ఉపాధ్యక్షులు శ్రీ బొల్లు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి శ్రీ బసవరాజు, శ్రీమతి తులసిబాయి విద్యార్థులకు మెడల్స్ బహుకరించి ప్రశంసించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Assembly Session Today Agenda: ఆంధ్ర ప్రదేశ్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ సమావేశం కానుంది. ఈ భేటిలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది. అనంతరం వాటిని సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు శాసన సభ..ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానుంది. వడ్డీ లేని రుణ పరిమితి పెంపుతో పాటు స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు.. కొబ్బరి తోటల పరిస్థితి.. ఉన్నతి పథకం .. కాఫీ రైతులకు పరిహారం.. రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు ... విశాఖలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు.. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై సభ్యుల ప్రశ్నలుండన్నాయి. ఇక వెనకబడిన వర్గాలు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. అటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామిని కూడా క్యాబినేట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 24.15 శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి. వాటిని మరో 9.75 శాతం పెంపు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు.. అటు మున్సిపల్ కార్పోరేషన్లకు సంబంధించిన మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే బిల్లుకు క్యాబినేట్ ఆమోదం తెలిపి ఉభయ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirumala VIPs Darshan: ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. వారాంతం ముగిసినా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంగళవారం పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎవరెవరు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో భారత క్రికెట్ జట్టు ఆటగాడు తిలక్ వర్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సుప్రభాత సేవ అనంతరం ప్రముఖులకు రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. దర్శనం అనంతరం ప్రముఖులు తిరుమల ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో తిరుమల ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ ఇక తిరుమలలో దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆగస్టు 17వ తేదీన శ్రీవారిని మొత్తం 79,445 భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 36,834 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.80 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. లడ్డూ విక్రయాలు 3.95 లక్షలు జరగ్గా.. అన్నప్రసాదాలు 3.39 లక్షల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో సుమారు సర్వదర్శనం కోసం అంటే ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులకు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటుచేసుకుంది. జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ సైంటిఫిక్ అండ్ ఎకోలాజికల్ గ్రీనింగ్, రీఫారేస్టేషన్ ప్రాజెక్ట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నాగబాబును నియమిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారిక ఉత్తర్వులు (G.O. Rt No. 93) జారీ చేసింది. అంతేకాకుండా, ఈ పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ప్రత్యేకంగా కేబినెట్ హోదా ర్యాంకును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ, అటవీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ శాఖ పరిధిలోని ఏపీ గ్రీన్ సొసైటీ గవర్నింగ్ బోర్డు ఛైర్మన్‌గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తుండగా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యతలను తన సోదరుడైన నాగబాబుకు అప్పగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు వెనుక ప్రభుత్వం ఒక భారీ విజన్ ప్రణాళికను రూపొందించింది. 2047 నాటికి రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, చెట్ల కవరేజీని ఏకంగా 50 శాతానికి పెంచడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతమున్న పచ్చదనాన్ని రెట్టింపు చేస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఒక శక్తివంతమైన వ్యవస్థాగత యంత్రాంగం అవసరం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చి హరిత కార్యక్రమాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఈ గ్రీన్ సొసైటీ పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కొణిదెల నాగబాబు పొలిటికల్ జర్నీ వైపు చూస్తే.. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, ధైర్యం వీడకుండా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Monsoon Assembly Session: ఆంధ్ర ప్రదేశ్ వర్షకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. గతంలో మాదిరే వైసీపీ అసెంబ్లీకి రాకూడదనే నిర్ణయం తీసుకుంది. శాసనసభలో తగినంత బలం లేనందున తమ వాదనలు వినిపించుకోరనే ఉద్దేశ్యంతో అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు ఏపీ శాసన మండలిలో తగిన బలం ఉన్నందున అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందకు వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపణ నేపథ్యంలో ఈ సారి సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ , శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను దిశా నిర్ధేశం చేశారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో డిజిటల్ పాసులు.. కాగా ఈ సారి అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులకు డిజిటల్ పాస్‌లు జారీ చేశారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ప్రవేశం, నిష్క్రమణల వద్ద పాసుల స్కానింగ్ చేసిన తర్వాతే లోపలకి అనుమతిస్తారు. అంతేకాదు వెళ్లిటపుడు కూడా స్కానింగ్ చేయడం ద్వారా ఎవరు అసెంబ్లీ, మండలిలో ఎంత సేపు గడిపారనే విషయాన్ని నిర్ధారించుకోనున్నారు. ఎవరు వచ్చారు. ఎవరు వెళ్లారనే దానిపై క్లారిటీ కోసమే వీటిని జారీ చేయనున్నారు. అంతేకాదు మరోవైపు ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా

నలభై ఏళ్లుగా ఎదురుచూసిన కల.. ఎన్నోసార్లు ఆశలు పెట్టుకుని, మళ్లీ నిరాశపడిన లంక గ్రామాల ప్రజలు.. చివరకు వారి కళ్ల ముందే ఆ కల నిజమైంది. రహదారి లేక రాకపోకలకు ఇబ్బందులు పడిన కొల్లేరు లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు రాకతో గ్రామస్తుల కళ్లలో ఆనందంతో పాటూ నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడిన వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఏలూరు, ఆగస్టు 16: జిల్లాలోని కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు లంక గ్రామాల ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. ఇప్పటివరకూ రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెద్దట్లగాడి, పెనుమాక లంక, ఇంగిలిపాక లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏలూరు నుంచి ఈ లంక గ్రామాల వరకూ నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో లంక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులు ఇకపై తగ్గనున్నాయని స్థానికులు పేర్కొన్నారు. బస్సు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వయంగా బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో పాటు కూటమి నాయకులు కూడా బస్సులో ప్రయాణించి లంక గ్రామాల ప్రజలతో మమేకమయ్యారు. తమ ప్రాంతానికి బస్సు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరేందుకు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు ఈ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రజల రవాణా సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికుల్లో ఆనందం నెలకొంది. రహదారి నిర్మాణానికి కృషి చేసిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Congress Party: 'దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేడని.. ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే' మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వైస్రాయ్ హోటల్లో సొంత మామ ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదే అని గుర్తుచేశారు. 'స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని, ఆఖరికి అన్నం పెట్టకుండా పంపించాడు. మహిళలను చంద్రబాబు అవమానించారు, వారికి క్షమాపణ చెప్పాలి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు. 'చంద్రబాబుకు రెండెకరాల ఉంటే తమ్ముడికి ఒకేకరా పోతే ఇక ఒక ఎకరా ఉండేది. ఇప్పుడు రూ.లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చింది?' అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని చెప్పారు. 'నగరిలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను. ఇసుక, మట్టి తమిళనాడు, కర్ణాటకకు తరలించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు. 'మద్యం దుకాణాల పేరుతో బెల్టు పెట్టీ యువతను మత్తుకు బానిస చేస్తున్నారు. ఆ మత్తులో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని.. హోం మంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల చేతిలో చావు దెబ్బ తింటారని హెచ్చరించారు. కారు గ్యారేజీలో ఉండాలి.. ఆడది వంటగదిలో ఉండాలి అన్న కోడెల ఏమయ్యాయో చూశామని మాజీ మంత్రి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Deputy cm Pawan kalyan key directions to officials: తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ప్రాంతంలో ఇటీవల ఏనుగుల గుంపు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై తాజాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు డ్రోన్లతో నిఘా ఉంచాలన్నారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రజలకు సమాచారం అందించా లన్నారు. హనుమాన్ బృందాలను మోహరించాలని ఉప ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, డ్రోన్ల సహాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయన్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పవన్ కళ్యాణ్ గారు అటవీశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అంతే కాకుండా.. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు
ఒక ప్రాంత చరిత్రను చదవడం సులభం. కానీ ఒక ప్రాంతం ఎలా మారుతోందో అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే చరిత్ర గతాన్ని నమోదు చేస్తుంది. అభివృద్ధి మాత్రం గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకే సూత్రంలో ముడిపెడుతుంది. అందుకే ఒక ప్రాంతాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని కంటే, ఇప్పుడు ఎక్కడ నిలిచింది, రేపు ఎటు వెళ్లే అవకాశముంది అన్నదే మరింత ముఖ్యమైన ప్రశ్న. రాయలసీమను కూడా ఈ దృక్కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది.రాయలసీమ గురించి దశాబ్దాలుగా ఒక స్థిరమైన అభిప్రాయం సమాజంలో ఏర్పడింది. కరవు, వర్షాభావం, నీటి కోసం పోరాటం, వలసలు, వెనుకబడిన వ్యవసాయం, ఫ్యాక్షన్ హింస, పరిమిత పెట్టుబడులు— ఇవే రాయలసీమను నిర్వచించే పదాలుగా మారాయి. ఈ అభిప్రాయాలు కల్పితం కావు. అవి ఒక చారిత్రక వాస్తవానికి ప్రతిబింబం. ప్రకృతి పరిమితులు, సాగునీటి కొరత, భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంత అభివృద్ధిని చాలాకాలం నిరోధించాయి.అయితే ఏ ప్రాంత చరిత్ర కూడా ఒకే అధ్యాయంతో ముగియదు. గతాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వర్తమానాన్ని అంచనా వేయడం ఎంత తప్పో, వర్తమానాన్ని మాత్రమే చూసి భవిష్యత్తును నిర్ణయించడం కూడా అంతే ప్రమాదకరం. అందుకే రాయలసీమను నేడు మళ్లీ చదవాల్సిన అవసరం వచ్చింది. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపిస్తున్న మార్పులు గణాంకాల్లో మాత్రమే కాదు, జీవన విధానంలోనూ ప్రతిబింబిస్తున్నాయి. సాగునీటి విస్తరణతో వ్యవసాయ స్వరూపం మారుతోంది. ఉద్యానవన పంటలు రైతు ఆదాయానికి కొత్త దిశ చూపుతున్నాయి. ఖనిజ సంపద పారిశ్రామిక అవకాశాలుగా రూపాంతరం చెందుతోంది. సౌర, పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ వంటి రంగాలు రాయలసీమను దేశ గ్రీన్ ఎనర్జీ పటంలో ప్రముఖ స్థానానికి తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు ప్రకృతి పరిమితులుగా కనిపించిన ఎండ, గాలి నేడు ఆర్థిక వనరులుగా మారుతున్నాయి.కానీ ఈ మార్పును కేవలం పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కోణంలో మాత్రమే అర్థం చేసుకుంటే

Rayachoty: రాయచోటిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం! Rayachoty: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీ స్త్రీ శక్తి భవన్లో KIMS–SAVEERA ఆసుపత్రి, అనంతపురం ఆధ్వర్యంలో గుండె, క్యాన్సర్ వ్యాధులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి రాయచోటి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీమతి హరితమ్మ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. గుండె, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని హరితమ్మ పేర్కొన్నారు.ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య పరీక్షలు భారంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.వైద్య శిబిరంలో KIMS–SAVEERA ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురు రోగులను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిపై సూచనలు, సలహాలు అందించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య చికిత్సకు సంబంధించి మార్గనిర్దేశం చేశారు.ఈ మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం కావడానికి విశేషంగా కృషి చేసిన టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు సాహుద్ బాష, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ మురికినాటి వెంకట సుబ్బారెడ్డిలకు ప్రజలు, వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.క్యాంప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం నుంచే

Amalapuram: అమలాపురం కలెక్టరేట్లో ఘనంగా గౌతు లచ్చన్న జయంతి! Amalapuram: అణగారిన, బడుగు వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయమని ఏపీ శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు బొంతు గంగాధర్ రావు అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అమలాపురం కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బొంతు గంగాధర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమంలో గౌతు లచ్చన్న కీలక పాత్ర పోషించారని, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జిల్లా పరిపాలన అధికారి నాగలక్ష్మమ్మ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గౌతు లచ్చన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పి. భగవాన్, రామచంద్రాపురం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ కేఎన్ దొర, శెట్టిబలిజ సంఘం సభ్యులు కడలి వెంకటేశ్వరరావు, గొల్లపల్లి ధర్మారావు, కట్ట జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు

LPG Gas: గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వినియోగదారులు వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈరోజే ఆఖరి అవకాశంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ వెంటనే రద్దు కాకపోవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే నగదు సబ్సిడీ నిలిచిపోతుంది. మళ్లీ ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే వరకు వినియోగదారులు సాధారణ వాణిజ్య ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. పన్ను రాయితీలు కూడా పొందే అర్హతను కోల్పోతారు. ఆందోళన చెందకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. ఇంట్లోనే ఫోన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయడం ఎలా? * గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. * ముందుగా మీరు ఉపయోగిస్తున్న గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. * యాప్‌తో పాటు గూగుల్ ప్లేస్టోర్ నుంచి Aadhaar FaceRD యాప్‌ను కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. * మీ మొబైల్ నంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి. * ఫేస్ స్కానింగ్ కోసం కెమెరా యాక్సెస్ ఇచ్చి మీ ముఖాన్ని సరిగ్గా స్కాన్ చేయాలి. * స్కాన్ పూర్తయిన వెంటనే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది. ఫోన్లో ప్రక్రియ పూర్తి కాకపోతే ఏం చేయాలి? మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైతే సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ ఏజెన్సీని నేరుగా సంప్రదించాలి. ఏజెన్సీకి వెళ్లేటప్పుడు మీ గుర్తింపు కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ పుస్తకాన్ని

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Three Youths Dies In River: స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో సరదాగా ఆడుకుందామని కృష్ణా నదికి కొందరు యువకులు వచ్చారు. నది నీటిలో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు నీటి లోపలికి మునిగిపోయారు. అలా ముగ్గురు మునిగిపోయి నీటిలో గల్లంతయ్యారు. లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో వారంతా విగతజీవులుగా మారారు. ఈ సంఘటన ఏపీలోని తాడేపల్లిలో ఉన్న కృష్ణా నది వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన ముగ్గురు యువకులు వీసం గౌతమ్ (18), గడ్డం జాషువా (17), తీగుళ్ల తేజ (18) తాడేపల్లి సమీపంలోని కృష్ణలంక మెట్లబజారు పద్మావతి ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో మిత్రులంతా కలిసి నదిలో ఈత కొట్టారు. సరదాగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. స్నానానికి నదిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన గత ఈతగాళ్లు, స్థానికులు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభించాయి. ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నదిలోకి స్నానానికి వెళ్లే సమయంలో ప్రజలు, ముఖ్యంగా యువకులు సాహసాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం అనకాపల్లి జిల్లా చోడవరం అంబేడ్కర్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భర్తను భార్య హత్య చేసింది. కొండ్ల వెంకటరావు (58), ఇందిర (54) భార్యాభర్తలు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Womens Andhra Premier League 2026: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ ప్రోత్సాహానికి విశేష కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పురుషులకు విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఇప్పుడు మహిళలకు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు.. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ కూడా ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రకటించింది. భారత మహిళల మాజీ క్రికెట్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరగనుంది. ముఖ్యమైన మైలురాయి భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. 'రెండు మూడేళ్లుగా ఏసీఏతో అనుబంధం పెంచుకున్నా. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఏసీఏలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఏసీఏ తీసుకున్న ఈ నిర్ణయం ఒక ప్రొఫెషనల్ సెటప్ లాంటిది. రాబోయే కాలంలో ఏసీఏ విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా' అని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారని.. వారికి అవకాశం.. ప్రోత్సాహం కావాలని పేర్కొన్నారు. మహిళల క్రికెట్‌కు గుర్తింపు 'ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చర్‌ను ఏసీఏ క్రియేట్ చేస్తోంది. దీనివలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఏర్పడుతుంది. విభిన్న కేటగిరీల ప్లేయర్లు ఈ టీమ్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఉన్న ఫ్రాంచైజీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రతిభ కలిగిన క్రికెటర్లను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తోంది. మహిళల క్రికెట్‌కు బిడ్డింగ్ పెట్టడం ద్వారా దాని విలువ పెరుగుతుంది' అని సీనియర్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan Kalyan High Fever: ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఆయన బిజీ బిజీగా గడిపారు. కానీ వెంటనే అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం బారిన పడడంతో ఆయన గవర్నర్ మర్యాదపూర్వకంగా నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరమయ్యారు. వెంటనే హైదరాబాద్‌కు బయల్దేరారు. రాజమండ్రి పర్యటనకు వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గంలో రాజమండ్రికి చేరుకున్నార. ధవళేశ్వరం ప్రభుత్వ కలప డిపో వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. కాసేపు విశ్రాంతి అనంతరం రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇటీవల కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కల్యాణ్ ఇవాళ పర్యటన సందర్భంగా చేతికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడినట్లు కనిపించింది. ఫిజియోథెరపీ వైద్య నిపుణుల సూచనలు తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరంలో క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు. అనారోగ్యం బారినపడినప్పటి నుంచి పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి ఉంటున్నారు. తీవ్ర జ్వరం కారణంగా లోక్ భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దూరమయ్యారు. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు డిప్యూటీ సీఎం కార్యాలయ

Kukunoor: కుక్కునూరు పిఎస్ పరిధిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు! Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కునూరు సిఐ పి. సురేష్ బాబు, ఎస్ఐ కె. రాజారెడ్డి, పోలీసు సిబ్బందితో కలసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, జెండా వందనం నిర్వహించారు. అనంతరం దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాసేవ పట్ల పోలీసు సిబ్బంది తమ నిబద్ధతను చాటుకున్నారు.ఈ వేడుకల్లో స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొని క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీసు సిబ్బంది స్వీట్లు అందించి అభినందించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సమాజంలో దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం పెంపొందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుక్కునూరు సిఐ పి. సురేష్ బాబు, ఎస్ఐ కె. రాజారెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Nagari: నగరిలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు! Nagari: నగరి మున్సిపాలిటీ సత్రవాడ మండల ప్రాథమిక పాఠశాల జిల్లా ఉన్నత పాఠశాలల నందు జరిగిన 80వ స్వాతంత్య్ర వేడుకల్లో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. ఈ నేపథ్యంలో విద్యార్థులచే గౌరవ వందన స్వీకరించి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడుతూ నేటి భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం.ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్య్ర కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని నేటి యువత ప్రజలు ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు

Nellore: నెల్లూరు జనసేన ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ! ఈ వార్తకు సంబంధించిన

Kalyandurg: కళ్యాణదుర్గం రూరల్ పీఎస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు Kalyandurg: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ. గంగాధర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారు చూపిన మార్గంలో ప్రజా సేవకు అంకితమై పనిచేస్తామని తెలిపారు. ప్రజల న్యాయం, ధన, మాన, ప్రాణ రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజలకు నిర్భయమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. “ప్రజల కోసం మేమున్నాం” అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కల్పిస్తూ సేవలందిస్తామని తెలిపారు.అనంతరం పోలీస్ సిబ్బంది, ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 80th Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గొందు గొందులో భారతదేశ గీతాలు వినిపించనున్నాయి. స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శనివారం జరగనున్న 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముస్తాబైంది. ప్రతి గల్లీలో.. ప్రతి ఊరిలో.. ప్రతి జిల్లాలో జరగనున్న వేడుకలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి మంత్రుల నియామకం చేపట్టింది. ఆగస్టు 15న అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా.. ఉదయం 8.30 గంటలకు అమరావతిలోని పరేడ్‌లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. - ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేశ్ - శ్రీకాకుళంలో జెండా ఎగరేయనున్న మంత్రి అచ్చెన్నాయుడు - కృష్ణా జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి కొల్లు రవీంద్ర - పల్నాడులో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్ - పశ్చిమగోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు - కర్నూలులో జెండా ఆవిష్కరించనున్న మంత్రి టీజీ భరత్ - ప్రకాశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి - పార్వతీపురం మన్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో మంత్రి వాసంశెట్టి సుభాష్ - అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి - అల్లూరి సీతారామరాజు

వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీజీరామ్‌జీ) పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్డీఎస్ మెంబర్ సెక్రటరీ ఆదేశించారు. శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో నిర్లక్ష్యమే కారణం అమరావతి: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీజీరామ్‌జీ) పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్డీఎస్ మెంబర్ సెక్రటరీ ఆదేశించారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, వైఎ్‌సఆర్ కడప జిల్లాలకు చెందిన ఏపీవోలకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల డ్వామా పీడీలకు సూచించారు. ఈ ఏడాది జూలై 1 నుంచి వీబీజీరామ్‌జీ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ, శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో ఆయా ఏపీవోలు పూర్తి నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలతో ఇటీవల గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్ అధికారులు సమావేశమై చర్చించారు. వారి వివరణ సహేతుకంగా లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు

అమరావతి: సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, డీపీఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్‌కు అప్పగిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై సంబంధిత అధికారులు సంతకాలు చేశారు. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో నవంబర్ నుంచి పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా అధికారులు భావిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో (Amaravati) సీడ్‌యాక్సెస్ రహదారి ప్రారంభానికి సిద్ధమైంది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ (Jagan) ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ హోంమంత్రి అనిత (Anitha) సవాల్ విసిరారు

Kovur: కోవూరులో 939 మందికి పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ! ఈ వార్తకు సంబంధించిన

బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. కానీ ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు కాస్త దూరంగా, బెంగాల్ సమీపంలో కేంద్రీకృతమై ఉండి, కోల్‌కతా మీదుగా తీరం దాటబోతోంది. దీనివల్ల అక్కడ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ అల్పపీడనం వల్ల ఏర్పడిన ఉపరితల వాయు చక్రవాత తుపాను దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ భారతదేశం వైపుగా చొచ్చుకొచ్చింది. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆగస్టు 12న తెలంగాణ అంతటా మేఘాలు క్రమంగా ఆవరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగవచ్చు. సాయంత్రం వేళ హైదరాబాద్‌తో పాటు మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇక్కడ భారీ వర్షం పడకపోవచ్చు, ప్రధానంగా వాన జల్లులే పడతాయి. ఇక పగటి ఉష్ణోగ్రత 28°C నుండి 30°C మధ్య నమోదు కావచ్చు, రాత్రి వేళల్లో 23°C నుండి 24°C వరకు తగ్గే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్లుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి తేమ వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్రలో సాయంత్రం వేళ ప్రారంభమయ్యే జల్లులు రాత్రి వరకు పడే ఛాన్స్ ఉంది. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడవచ్చు, కానీ రాయలసీమలో మాత్రం ఎక్కువ భాగం పొడి వాతావరణమే కనిపిస్తోంది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల సడెన్‌గా వర్షం స్టార్ట్ అయి కాసేపటికే ఆగిపోయే ఛాన్స్ ఉంది. పగటి ఉష్ణోగ్రత 30°C నుండి 33°C వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, తేమ ప్రభావం వల్ల కొంచెం ఎక్కువ వేడిగా అనిపించవచ్చు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలంగా ఈదురుగాలులు

Guthi: తొండపాడులో ఎంపీడీఓ ప్రభాకర్ తనిఖీలు BLOలకు కీలక ఆదేశాలు! Guthi: అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు , జక్కలచెరువు గ్రామంలో ఈరోజు SIR ప్రక్రియలో భాగంగా MPDO ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని BLO లతో సమావేశమై నోటీసుల పంపిణి గురించి ఆరా తీశారు. నోటీసులను త్వరితగతిన సర్వ్ చేయవలసినదిగా BLO లకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందించే సేవల్లో జాప్యం ఉండకూడదని, అన్ని సేవలు సమయానికి అందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, BLO లు తదితరులు పాల్గొన్నారు

Markapuram: కూటమి నేతల భారీ ర్యాలీ వైఎస్సార్సీపీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం Markapuram: మార్కాపురం లో డీఎస్సీ–2025 నియామకాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ–2025 అభ్యర్థులతో కలిసి మార్కాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి దోర్నాల బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ “దగా డీఎస్సీ” అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల నిరుద్యోగ యువతలో అనవసర గందరగోళం ఏర్పడుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరగలేదని కోర్టులు స్పష్టం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఆన్లైన్ విధానం, జంబ్లింగ్ సిస్టమ్‌లో పరీక్షలు నిర్వహించడంతో ప్రశ్నపత్రం లీక్ అయ్యే అవకాశం లేదని తెలిపారు. డీఎస్సీ–2025 నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి కేవలం 45 రోజుల్లోనే ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రినారా లోకేష్ కు అభ్యర్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అర్హత సాధించిన డీఎస్సీ అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జున, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు
ఏపీలో ప్రజలకు ముఖ్యమైన గమనిక.. వాహన కాలుష్య నియంత్రణ కోసం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వ్యక్తిగత, రవాణా వాహనాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుని పీయూసీసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్) సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇకపై వాహనాలు నిబంధను పాటించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. బీఎస్ 1 నుంచి బీఎస్ 4 వాహనాలకు సంబంధించిన పీయూసీసీ.. బీఎస్ 1, 2, 3, 4 వాహనాలకు ప్రస్తుతం ఆరు నెలలకోసారి తీసుకునేవారు. తాజా నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి పొల్యూషన్ టెస్ట్ చేయించి సర్టిఫికెట్ తీసుకోవాలి. బీఎస్-4 వాహనాలకు మాత్రం ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం ఆరు నెలకోసారి పీయూసీసీ తీసుకోవాలి.బీఎస్ 6 బైక్‌లు, కార్లకు ప్రస్తుతం ఏడాదికోసారి పీయూసీసీ తీసుకోవాలి.. ఇకపై మూడేళ్లకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసినవారు ఆరేళ్లలో రెండుసార్లు పీయూసీసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు ఏడాదికోసారి టెస్టింగ్ చేయించాలి.. పదేళ్ల తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లారీలు బస్సులకు సంబధించి కొత్త వాహణాలకు మొదటి రెండేళ్ల పీయూసీసీ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది టెస్టింగ్ చేయించేవారు. కొత్త నిబంధనల ప్రకారం కొత్త వాహనాలకు ఆరేళ్ల వరకు ప్రతి రెండేళ్లకోసారి పీయూసీసీ తీసుకోవాలి. ఆ తర్వాత 6 నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి.. పదేళ్లు దాటితే ఆరు నెలలకోసారి సర్టిఫికెట్ తీసుకోవాలి.2000లో భారత్ స్టేజ్ (బీఎస్) ప్రమాణాలను తీసుకొచ్చారు. 2000లో తయారైన వాహనాలను బీఎస్-1 వాహనాలు.. 2001-05 మధ్య తయారైనవి బీఎస్-2 వాహనాలు.. 2005 నుంచి బీఎస్-3 వాహనాలు మాత్రమే విక్రయించేలా నిబంధనలు వచ్చాయి. 2010 నుంచి బీఎస్-3 వాహనాలు తీసుకొచ్చారు.. దేశంలోని 13 నగరాల్లో బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించేలా చూశారు. 2017 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-4 వాహనాలు రాగా.. బీఎస్-5 వాహనాలు రాలేదు. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 వాహనాలు రాగా

CM Chandrababu Naidu Distributes Pattadar Passbooks To Farmers : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన అనంతరం నల్లజెర్లలో దుర్గా భవానీ అనే మహిళా రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకానికి ఎలాంటి అత్యాధునిక భద్రతను కల్పించారనే విషయాలను వెల్లడించారు. పాస్ పుస్తకాలకు అత్యాధునిక భద్రత.. రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బుల్లెట్ వేగంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. రైతులకు అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలకు అత్యాధునిక భద్రత కల్పించామని చెప్పారు. పాస్ పుస్తకాలకు కరెన్సీ నోట్లకు ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను అమలు చేస్తున్నామని, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని అన్నారు. క్యూఆర్ కోడ్ తో పాటు ఇతర సాంకేతిక భద్రతా ఫీచర్లను కూడా పాస్ పుస్తకాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందించామని సీఎం తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మొత్తం 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 41 వేల ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, 1.47 లక్షల మందికి పైగా రైతులకు పట్టాలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 5,500 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు అందించినట్లు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు గతంలో కేటాయించిన భూములను 22ఏలో చేర్చిన సందర్భాలను పరిష్కరించి వారికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి రైతుకు, భూ యజమానికి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Kuppam High Tension: డీఎస్సీలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్టవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా వైఎస్సార్సీపీ ర్యాలీ తీసేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించడంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్సీపీ ఆందోళన సందర్భంగా కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద వైసీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైఎస్సార్సీసీ నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడక్కడ అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో భరత్ ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అవకతవకలకు కారణమైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో రాష్ట్రమంతా నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన ర్యాలీకి వారం కిందట పోలీసుల అనుమతి కోరినా అనుమతి మంజూరు చేయలేదని చెప్పారు. మరి టీడీపీ చేపట్టిన విజయోత్సవ ర్యాలీకి పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవరించడం ఏమిటని నిలదీశారు. ఎన్ని ఆంక్షలు విధించినా తాము వెనుకాడమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ర్యాలీకి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీ శ్రేణుల

చనిపోయే ముందు ఇన్‌స్టాగ్రాంలో వైరల్ పోస్టు ఆంధ్రప్రదేశ్: ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్‌రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్.. జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్‌స్ట్రాగామ్ స్టేటస్‌లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది. గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) 'టాక్సిక్'

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Medico Priyanka Death: రాజమండ్రిలో సినిమా థియేటర్ వద్ద మద్యం మత్తులో దుండగులు కారుతో తొక్కించగా మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందడాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదని.. తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ప్రియాంక మృతి తనను కలచివేసిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 'తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పదిమందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండాపోవడం అత్యంత విచారకరం' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారి మీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం' అని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chandrababu Naidu: సినిమా థియేటర్‌కు వెళ్లి చిన్న వివాదంలో కారుతో ఢీకొట్టడంతో రాజమండ్రలిలో మెడికో ప్రియాంక బ్రెయిన్ డెడ్‌కు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర సంచలనం రేపుతోంది. బాధితురాలిని కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ముందుకురాకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందగా సీఎం చంద్రబాబు స్పందించారు. రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సంతాప ప్రకటన చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ప్రియాంక ఘటనపై ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని సీఎం చంద్రబాబుకు ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన

రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి... ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు.Medico Priyaka: మృత్యువుతో పోరాడి ఓడిపోయిన మెడికో ప్రియాంక..!ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా.... నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు వివరించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.అసలేం జరిగిందంటే?తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెకూ, మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆంఢ్రూ విలియం అనే ఇద్దరితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె స్నేహితుడు నడుపుతున్న బైక్ వెనుక కూర్చొన్న ప్రియాంకను.. వారు కారుతో గుద్దేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం మాల్ బయటకు వెళ్లగానే ఆమె బైక్‌ను వారు గుద్దేయడమే కాకుండా ఆమె తలపై నుంచి కారు పోనిచ్చారు. దీంతో

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Prakasam Barrage Water Levels: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వెలవెలబోతున్న కృష్ణా నదిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌లో కలిసిన గోదారమ్మ నీటి పరవళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటి లెక్కల వివరాలు ఆరా తీశారు. తన పర్యటనలో ఆకస్మికంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద సీఎం చంద్రబాబు నిలవడం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్‌పై సీఎం చంద్రబాబు కొద్దిసేపు తన వాహన కాన్వాయ్‌ను ఆపివేయించారు. గోదావరి నీటితో నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు

ఏపీ రాజకీయాల్లో గతంలో యాక్టివ్ గా ఉండి, వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేసిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆ తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అనంతరం బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి .. అది కూడా సాధ్యం కాక తిరిగి రాజకీయాల్లో సొంత పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ తనపై అటెన్షన్ ఉండేలా చూసుకుంటున్నారు.UPI పేమెంట్స్ పై ఛార్జీలు ? కేంద్రానికి సాయిరెడ్డి హెచ్చరికలు..!ఇదే క్రమంలో ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న జెన్ జీ(Gen Z)పై సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం ఉందంటూ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాలను కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా సాధారణంగా చర్చకు రాని పలు విషయాన్ని కూడా సాయిరెడ్డి బయటపెట్టారు. ఆయా కారణాలతో వారి మాటల్ని సానుభూతితో వినాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ తేల్చేశారు. 2.5 లక్షలకు PPF లిమిట్ ?- ఆర్థికమంత్రికి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన..!మనం మన Gen Z మాటలను సానుభూతితో వినాలని సాయిరెడ్డి కోరారు. వారు అనిశ్చిత ఉద్యోగాలు, అందుబాటులో లేని ఇళ్లు, క్షీణిస్తున్న పర్యావరణం, కొరతగా ఉన్న వనరులు, ఉమ్మడి కుటుంబం, స్నేహం వంటి బలహీనపడుతున్న మద్దతు వ్యవస్థలతో కూడిన ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతున్నారని సాయిరెడ్డి తెలిపారు. వారికి ఆశ, అవకాశాలు, వారి ఆందోళనలను తీవ్రంగా పరిగణించే విధానకర్తలు అవసరమన్నారు. తాను ఆ గొంతుకలలో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులో మాటను కూడా సాయిరెడ్డి బయటపెట్టేశారు. తద్వారా తనను తాను జెన్ జీకి మద్దతుదారుడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు