
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Andhra Pradesh Monsoon Assembly Session: ఆంధ్ర ప్రదేశ్ వర్షకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. గతంలో మాదిరే వైసీపీ అసెంబ్లీకి రాకూడదనే నిర్ణయం తీసుకుంది. శాసనసభలో తగినంత బలం లేనందున తమ వాదనలు వినిపించుకోరనే ఉద్దేశ్యంతో అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు ఏపీ శాసన మండలిలో తగిన బలం ఉన్నందున అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందకు వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపణ నేపథ్యంలో ఈ సారి సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఇప్పటికే అసెంబ్లీ , శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను దిశా నిర్ధేశం చేశారు.
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో డిజిటల్ పాసులు..
కాగా ఈ సారి అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులకు డిజిటల్ పాస్‌లు జారీ చేశారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ప్రవేశం, నిష్క్రమణల వద్ద పాసుల స్కానింగ్ చేసిన తర్వాతే లోపలకి అనుమతిస్తారు. అంతేకాదు వెళ్లిటపుడు కూడా స్కానింగ్ చేయడం ద్వారా ఎవరు అసెంబ్లీ, మండలిలో ఎంత సేపు గడిపారనే విషయాన్ని నిర్ధారించుకోనున్నారు. ఎవరు వచ్చారు. ఎవరు వెళ్లారనే దానిపై క్లారిటీ కోసమే వీటిని జారీ చేయనున్నారు. అంతేకాదు మరోవైపు ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశాలు. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, అసెంబ్లీ చర్చించే వివిధ అంశాలపై చర్చ. వరుసగా 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. తొలి రోజు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఏపీ శాసనసబ సమావేశాలు.
మొదటి రోజు డీఎస్సీ 2025పై చర్చ.. ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయం పంటలు, నీటి లభ్యత అంశాలపై చర్చించనున్నారు. రెండో రోజు అసెంబ్లీ లో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.పంచాయతీ రాజ్, గ్రామీణాభివృది, మున్సిపల్ లలో జరిగే బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు పెంపుపై బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.మూడో రోజు అసెంబ్లీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 ఫలితాల్లో అక్రమాలపై చర్చకు పెట్టనున్న ప్రభుత్వం. మరోవైపు శాంతి భద్రతలపై చర్చించే అవకాశం ఉంది. నాలుగో రోజు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సూపర్ సిక్స్ పథకాలపై చర్చ కొనసాగనుంది. ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
మరి ఈ సారి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నేడు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ సారి కొన్ని కీలకమైన బిల్లును పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 15 రకాల వేధింపుల నుంచి బీసీ వర్గాల్లో ఉన్న 138 కులాలకు రక్షణ కల్పించే అట్రాసిటీ చట్టాన్ని తీసుకురానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం.. ఇప్పటికే జారీ చేసిన పలు ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయనున్నారు. మరోవైపు ఖరీఫ్ కాలం సంక్షోభం, రైతులకు సాయం, పొగాకు సంక్షోభం, ఎల్‌నినో ప్రభావాలపై ప్రభుత్వం చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





