
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM Chandrababu naidu on free ac bus facility for women: ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అయితే పలుచోట్ల రద్దీకి తగ్గట్టుగా బస్సలు లేకపొవడంతో కొన్ని చోట్ల మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు. సీటు కోసం, బస్ స్టాప్ ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొంత మంది అవసరంలేకున్న ఫ్రీఅని చెప్పి బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు.
మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కూటమి పనిచేస్తుందని అన్నారు. ఇచ్చిన అన్ని హమీలను నెరవేరుస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సహాకారంతో ఏపీ డెవలప్ మెంట్ పథంలో వేగవంతంగా ముందుకుదూసుకుని పోతుందని చెప్పుకొచ్చారు.
కేవలం రెండేళ్లలో సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఎన్టీఆర్ భరోసా కింద రూ.73,507 కోట్లను పేదలకు అందించామని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి గౌరవంగా అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పుకొచ్చారు. దీపం 2.0 ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.
వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేశామన్నారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూస్తామని భరోసా కల్పించారు.
Read more: Tirumala Garuda Seva: తిరుమలలో వైభవంగా శ్రీవారి గరుడ సేవ.. మాడ వీధుల్లో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి!
ఈ నేపథ్యంలో మహిళలకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంకు మంచి స్పందన వస్తుందని అన్నారు. మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. రాబోయే రోజులలో ఏసీ బస్సులలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణంకల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీంతో సభలో హజరైన మహిళలు ఒక్కసారిగా జై చంద్రబాబు అంటూ నినాదాలను హోరెత్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




