
Nanded Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్
Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్
© 2026 nimisham.in

Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్

Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇన్చార్జి ఏఈవో మృతి

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్‌షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

ఓ రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బైక్‌పై ప్రియురాలు వెనుక కూర్చుంటే, నడిపే ప్రియుడికి ఉత్సాహం రావడం సహజమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రమాదంలో మరణించిన యువకుడికి పాక్షిక బాధ్యత ఉందని నిర్ధారించింది.2018 మే 10న తేని జిల్లాకు చెందిన 19 ఏళ్ల గోపాల్, తన ప్రియురాలు రాజేశ్వరితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. వీరపాండి-వాయల్‌పట్టి మార్గంలో అర్ధరాత్రి సమయంలో వారి బైక్‌ను ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేశ్వరి గాయపడ్డారు. దీంతో గోపాల్ తల్లిదండ్రులు పరిహారం కోసం తేని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్, 2021లో మృతుడి కుటుంబానికి రూ. 25.5 లక్షలు చెల్లించాలని వ్యాన్ బీమా సంస్థను ఆదేశించింది.ఈ తీర్పుపై బీమా సంస్థ హైకోర్టులో అప్పీల్ చేసింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎం.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడికి 25 శాతం పాక్షిక నిర్లక్ష్యం ఉందని కోర్టు తేల్చింది. "మృతుడు 19 ఏళ్ల యువకుడు. అతడి ప్రియురాలు వెనుక కూర్చుని ఉన్నారు. ప్రియురాలు వెనుక కూర్చున్నప్పుడు ఏ రైడర్‌కైనా ఉత్సాహం రావడం సహజం" అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. దీనికి తోడు, మృతుడు రోడ్డుకు కుడివైపున బైక్ నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించకపోవడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ట్రైబ్యునల్ విధించిన

Kakinada: తునిలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు! ఈ వార్తకు సంబంధించిన

రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో అమె ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆ కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు సంజుష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి, తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించాడని ఎంపీ తెలిపారు. అనంతరం పోలీసులకు స్వయంగా ప్రమాదం గురించి సమాచారం అందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజుష్‌కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారులకు తన కుమారుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తప్పించుకునే ఉద్దేశం గానీ ప్రయత్నం గానీ తమకు లేదని ఎంపీ లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. పోలీసుల నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 16 మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే భారతి తన ఫ్రెండ్‌తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా

బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తూ ప్రమాదావశాత్తు బావిలో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయంపై మృతుడు రాజు అన్న రవి బాధపడిన తీరు అక్కడి స్థానికులను కలిచివేసింది. ఈ హృదయ విధారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వద్దు తమ్మి.. పొద్దున్నే పోదువు ‘సిద్దిపేటలో మా బావ దీశెట్టి మల్లేశం మృతి చెందాడు. 19న దశదిన కర్మ కావడంతో తమ్ముడు రాజు తన భార్య పిల్లలతో సిద్దిపేటకు వచ్చారు. అందరం కలిసి సంతోషంగా భోజనం చేశా’మని మృతుడు రాజు అన్న రవి తెలిపారు. సాయంత్రం కావడంతో ‘అన్నా.. ఇంటికి వెళ్తాం’ అని రాజు చెప్పడంతో.. ‘చీకటి అవుతుంది. వద్దు తమ్మి.. పొద్దున పోదువు’ అని చెప్పా. ‘అన్నా నీకాళ్లు మొక్కుతా’ అంటూ.. వినకుండా తన భార్య పిల్లలతో కారులో బయల్దేరారు. అంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుందంటూ రోదిస్తూ రవి వెల్లడించారు. ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్! ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..? ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

ముమ్మిడివరం : తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కొమరగిరి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కొమరగిరి - గట్టువారిపేట మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులు ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన ఈతకోట సూర్యకుమార్(39), జి.వేమవరం గ్రామానికి చెందిన ఆకుల సాయి(30)గా గుర్తించారు. మూడో వ్యక్తి నిచ్చినకొళ్ల రంగ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lingamaneni Sanjush Accident Case: ఐటీ కారిడార్‌లో భోజనం చేసి రోడ్డు దాటుతూ వెళ్తున్న యువతిని అత్యంత వేగంగా కారుతో దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఆమె ఎగిరి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం చేసిందెవరో కాదు ఏపీలోని జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్. ప్రమాదం జరిగి నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇన్ఆర్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు భారతి ముఖి (26), పూజా అశోక్ ఆగస్టు 16న భోజనం కోసం రోడ్డు అవతల ఉన్న హోటల్‌కు వెళ్లారు. భోజనం చేసి వారిద్దరూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి విధుల్లో చేరేందుకు వస్తూ రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో స్పోర్ట్స్ కారు (టీజీ09జీ0666) కారు అత్యంత వేగంగా దూసుకువచ్చి భారతి ముఖిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు భారతి ముఖి ఎగిరి కిందపడగా.. పూజా అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రమాదం అనంతరం వెంటనే తీవ్ర గాయాలపాలైన భారతి ముఖికి హుటాహుటిన అదే కారులో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో భారతి ముఖితో ఉన్న పూజా అశోక్ వెంటనే ఈ విషయాన్ని లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం

హైదరాబాద్ నగరంలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించాడు. ఈ ఘటన తన నిర్లక్ష్యం వల్ల జరగలేదని, ఇది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదమని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా వ్యవహరించి, గాయపడిన యువతి భారతిని తానే స్వయంగా ఆసుపత్రికి తరలించానని తెలిపాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రమాద వివరాలను పోలీసులకు తెలియజేశానని వివరించాడు.ఆగస్టు 16న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న భారతి (26) అనే యువతిని సంజూష్ నడుపుతున్న ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. భారతి ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. సంజూష్ కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు సంజూష్‌పై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేరం బెయిలబుల్ కావడంతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని సంజూష్ స్పష్టం చేశాడు. ప్రమాదం తర్వాత పోలీసులు

Kukatpally: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి Kukatpally: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ బస్‌స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదంలో యూసఫ్ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రశాంత్‌నగర్ బస్‌స్టాప్ వద్ద యూసఫ్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన యూసఫ్, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పంచముఖి హనుమాన్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు వైపు నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం.. బెల్లంపల్లి వెళ్తేందుకు యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతిఖని గనిలో పనిచేస్తున్న సురేష్(37) అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చిరంజీవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కరీంనగర్‌కు తరలించారు. తిరుమల హిల్స్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సురేష్ మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగల రాజు, భాగ్య దంపతులకు కుమారుడు నిహాన్ష్, కుమార్తె శాన్విక సంతానం. వీరు పని మీద సిద్దిపేట వెళ్లగా.. బుధవారం అర్ధరాత్రి తర్వాత కారులో స్వగ్రామానికి బయల్దేరారు.అయితే అప్పనపల్లి శివారుకు రాగానే.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అగ్ని మాపక సిబ్బంది సహాయంతో వారిని వెలికితీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో బావిలో నుంచి కారును బయటకు తీయగా.. అప్పటికే నలుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో వారి కుటుంబంలో, బల్వంతాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బాలికలను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో సంచలన తీర్పుబాలికలను ఉద్యోగాల పేరుతో మోసగించి వ్యభిచార కూపంలోకి దించిన కేసులో సైఫాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం ఐదుగురికి జీవిత ఖైదు విదించింది. మరో ముగ్గురికి 14 ఏళ్లు, 14 మందికి పదేళ్లు, 11 మందికి మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది. బాధితులైన తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో 38 మంది బాధితులకు విముక్తి లభించింది. ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీకి పాల్పడే నేరస్థులకు కఠిన హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు

చుంచుపల్లి, ఆగస్టు 18 : చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38) సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించగా, ఈఎంటీ స్రవంతి, పైలట్ సాంబశివరావు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. రక్తస్రావాన్ని అదుపు చేసి మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమయానికి స్పందించి బాధితుడి ప్రాణాపాయం తప్పించిన 108 సిబ్బంది సేవలను స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రశంసించారు

Road Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భింద్ జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనం, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందగా.. మరో 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ గోహద్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్భేరీకి చెందిన కూలీలు గ్వాలియర్‌లో వరినాట్లు పూర్తి చేసుకొని సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ గ్రామానికి ట్రాలీ వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. భింద్-గ్వాలియర్ జాతీయ రహదారిపై ఛిమ్కా గ్రామం సమీపంలో రహదారిపైకి వచ్చిన పశువులను తప్పించబోయి డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మరణించారు
.webp)
జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఒకదానినొకటి అతి వేగంతో ఢీకొనడంతో ఈ భయానక ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. కరీంనగర్ డిపోకు చెందిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు ప్రయాణికులతో నిజామాబాద్ వైపు వెళ్తుండగా కొండగట్టు ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఊహించని విధంగా లారీ అతివేగంగా వచ్చి బస్సును ముఖాముఖీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఘటన జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు భయాందోళనతో ఆర్తనాదాలు చేశారు. ఈ ప్రమాద తీవ్రత కారణంగా పలువురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు విరగడంతో పాటు శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయ్యి, డ్రైవర్ క్యాబిన్ లోపల ఇరుక్కుపోయాడు. స్థానికులు, ఇతర వాహనదారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎంతో శ్రమించి అతడిని బయటకు తీసుకువచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రవాణా చేశాయి. కొండగట్టు సమీపంలో ఈ ఘోర ఘటన జరగడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొద్దిసేపు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు. కొండగట్టు మార్గంలో ఇదివరకు కూడా అనేకసార్లు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో తరచూ మలుపులు, వేగ పరిమితి దాటడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాధితులకు

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లా: ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతయ్యారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాలువలోకి కారు దూసుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. జాతీయ జెండా సాక్షిగా ఏపీని నంబర్ 1 చేస్తాం

హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇంటర్ విద్యార్థిని శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వందన హోటల్ సమీపంలో స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఓ ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన సురేష్ తన భార్య, కుమార్తె శ్రావణితో కలిసి స్కూటీపై సొంత గ్రామానికి వెళ్తున్నారు. వందన హోటల్ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ వారి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో శ్రావణి రోడ్డుపై పడిపోగా.. ఆమెపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు ఇంటర్ చదువుతున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి.. నిరుపేదలకు రేషన్ కార్డుల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఉత్తమ్ కుమార్

మేడ్చల్: వరంగల్-హైదరాబాద్ హైవేపై ఘట్కేసర్ వద్ద జరిగిన ప్రమాదంలో బాలిక మృతి చెందింది. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో శ్రావణి (17) అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు సురేశ్, ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివారులోని ఆనేకల్ తాలూకా హెబ్బగోడి దగ్గర అనంతనగరలో బైక్‌పై వెళ్తున్న యువతి గుంతల రోడ్డుకు బలైంది. కేరళకు చెందిన మేధ (32) మృతురాలు. ఆమె ఎలక్ట్రానిక్ సిటీలోని కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఆఫీసులో ఉద్యోగిని. వివరాలు.. మేధ తన స్నేహితుడు అజయ్ గురుతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తోంది. ఈ సమయంలో, ముందు వెళ్తున్న కారు డ్రైవర్ గుంతను చూసి హఠాత్తుగా బ్రేకులు వేశాడు. వెనుక వస్తున్న అజయ్ బైక్ గాభరాపడి బ్రేక్ నొక్కగా అదుపుతప్పి కింద పడిపోయారు. వెనుక నుంచి వస్తున్న ఓ గూడ్స్ వ్యాన్ మేధ మెడపై నుంచి దూసుకెళ్లింది. ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది. స్థానికుల నిరసన ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డును దిగ్బంధించారు. కొవ్వొత్తులు వెలిగించి, మేధ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఎలక్ట్రానిక్ సిటీ పరిసరాల్లోని రోడ్లు చాలా అధ్వాన్నంగా, గుంతలతో నిండి ఉన్నాయని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణం రోడ్లను బాగు చేయాలని కోరారు. హెబ్బగోడి, ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం రద్దీ (ఫొటోలు) 'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు) జెన్‌జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు) అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు) వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు) అనంతపురంలో హైటెన్షన్.. 15 గంటల పాటు హైడ్రామా.. లాయర్ గౌతంరాజుకి సీఐ క్షమాపణ ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ కెవ్వు కేక... ఈ సారి అమిత్ షా కాళ్ళు పట్టుకున్న సరే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం కంటైనర్ ఢీకొని ముగ్గురు మృతి గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స Nizamabad Tragedy: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన మరో వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికుల అరుపులతో ఆ ప్రాంతమంతా భయాందోళనకరంగా మారింది. నిజామాబాద్(Nizamabad Tragedy) జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలో జాతీయ రహదారి 44 (NH-44) పై జరిగిన ఈ ఘోర రహదారి ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. Ponnam Prabhakar: బీసీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన టైరు పంచర్‌తో డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులు: పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని కిన్వాట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైరు పంచర్ కావడంతో గోవింద్‌పేట్ వద్ద రోడ్డు పక్కన నిలిపివేశారు. ఉక్కపోతగా ఉండటంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి రహదారి డివైడర్‌పై కూర్చున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ నిలిపి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి ఎక్కడంతో మహారాష్ట్రకు చెందిన సుజాత, మాధవిలతో పాటు మరొకరు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఇద్దరిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం పరారైన కంటైనర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు

సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. బస్సు టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపై నిలిపారు. దీంతో బస్సు ఎదుట డివైడర్‌పై ఇద్దరు మహిళలు కూర్చున్నారు. ఒక్కసారిగా అతివేగంతో వెనుక నుంచి బస్సును కంటైనర్ ఢీకొట్టింది. బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపై బస్సు టైర్ ఎక్కడంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలుకావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) ఇసుక వేస్తే రాలనంత జనం.. దద్దరిల్లిన కర్నూలు కాన్వాయ్ పై టవల్ విసిరిన అభిమాని.. జగన్ ఏం చేశాడో చూడండి జగన్ అన్న వస్తే చరిత్ర మారుతుంది! YS జగన్ పర్యటనలో వైరల్ ఫ్లెక్సీ కొద్దిసేపట్లో జైలు వద్దకు చేరుకోనున్న వైఎస్ జగన్

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్, ఆగస్టు 13: జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు బస్సు టైర్ పంక్చర్ అవడంతో బస్సును డ్రైవర్ రోడ్డుపై నిలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు బస్సు ఎదుట ఉన్న డివైడర్‌పై కూర్చుకున్నారు. ఇదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ లారీ.. వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి బస్సు టైర్ ఎక్కడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత

హైదరాబాద్ అబిడ్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి కారు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.. హైదరాబాద్, ఆగస్టు 13: నగరంలోని అబిడ్స్‌లో బుధవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ బ్యాంకులో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీత.. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో సినిమా నిర్మాత డ్రైవర్ మహానంద నడుపుతున్న కారు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకెళ్లినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో సునీత కాలుకు ఫ్రాక్చర్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని.. ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి యజమాని అని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ఆయనకు ఫోన్ చేసి సునీత చికిత్సకు అయ్యే ఖర్చులను భరించాలని కోరినట్లు చెప్పారు. అయితే డబ్బులు ఇవ్వనని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు వారు వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు.. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు.. రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే

సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాల ప్రకారం.. పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండటంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్న గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు) ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి విజయ్ సంచలన నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిష? కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్? కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలోని యూ-టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఉపాధి నిమిత్తం జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూలి పనుల కోసం హుమ్నాబాద్ నుంచి వచ్చినట్లు సమాచారం.ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉండగా, హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sangareddy District Accidents: కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన తీవ్ర విషాదం అలుముకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 12 మంది కూలీలు ఉన్నారు. ప్రతి రోజు కూలీ పని కోసం జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. గాయాలపాలైన మిగతా వారిని జహీరాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వెంటనే వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తెలంగాణ సీఎం సంతాపం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో ప్రమాదం సంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించి ఇద్దరు మృతిచెందారు. మూడు కార్లు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు విడవగా.. మరికొందరు గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి ఎగిరి పడింది. ఆ రోడ్డుపై వెళ్తున్న కారుతోపాటు మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దుర్మరణం చెందగా
సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో.. అతి వేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. అయితే హైవేపై యూటర్న్ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి ప్రాంతానికి చెందిన కూలీలు.. వ్యవసాయ పనుల కోసం వచ్చి తిరిగి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. వీరు నిత్యం వ్యవసాయ కూలి పనుల కోసం జహీరాబాద్ సహా పరిసర ప్రాంతాలకు వస్తుంటారని స్థానికులు వెల్లడించారు. రోజూ లాగే మంగళవారం కూడా పనులు ముగించుకుని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.హైదరాబాద్ వైపు నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్.. సత్వార్ సమీపంలో కూలీల ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయిల్ ట్యాంక్ ఢీకొన్న వేగానికి ఆటోలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతోపాటు పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న కూలీలు హైవేపై ఎగిరి పడ్డారు. సంఘటనా స్థలంలో రక్తం ఏరులై పారింది. గాయపడ్డ వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారిపోయింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో జాతీయ రహదారిపై వరుసగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు భయానక ప్రమాదాలు తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ దారుణం జరిగిన కొన్ని క్షణాల్లోనే అదే రహదారిపై మూడు కార్లు వరుసగా ఢీకొనడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలోనే ప్రశాంతంగా ఉన్న రహదారి మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో రక్తాసిక్తంగా మారింది. ఘోర రోడ్డు ప్రమాదం: అతీక్ అహ్మద్ కుమారుడితో సహా ఇద్దరు దుర్మరణం!కూలీల కుటుంబాల్లో చీకట్లు: ట్యాంకర్ ధాటికి ఏడుగురు మృతిజహీరాబాద్ మండలం సత్వార్ సరిహద్దుల వద్ద ఈ మొదటి విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన 14 మంది వ్యవసాయ కూలీలు నిత్యంలాగే పొలం పనుల కోసం ఆటోలో జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో వేగంగా వచ్చిన ట్యాంకర్ ఆటోను ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు దారుణంగా ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇలా గుద్దేశాడేంటి..? హైదరాబాద్ లో యాక్సిడెంట్ వీడియో వైరల్అదే హైవేపై మరో విషాదం: కార్లు వరుసగా ఢీకొని ఇద్దరు మృతిఆటో ప్రమాద కలకలం రేగుతుండగానే, అదే జాతీయ రహదారిపై మరో ఘోరం జరిగింది. అదుపుతప్పిన మూడు కార్లు ఒకదానినొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ రెండో ప్రమాదంలో మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇందులో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే రహదారిపై స్వల్ప వ్యవధిలో 9 మంది మృతి చెందడంతో ప్రాంతమంతా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మొగడంపల్లి: సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ సత్వర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులది కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరా గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఆటోలో మొత్తం 10 మంది ప్రయాణిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?

హైదర్ షాకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్‌కు చెందిన క్రాంతి గౌడ్‌గా గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్, ఆగస్టు11: హైదర్ షాకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్‌కు చెందిన క్రాంతి గౌడ్‌గా గుర్తించినట్లు తెలిపారు. మంగళవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. హైదర్ షా కోటలోని తన అత్తగారింటికి బోనాల పండుగ సందర్భంగా అతడు వచ్చారని చెప్పారు. తన బావమరిది వికాస్ గౌడ్‌తో కలిసి పార్టీ చేసుకున్నారని అన్నారు. అనంతరం తెల్లవారుజామున టిఫిన్ చేద్దామని లంగర్ హౌస్ వైపు వారంతా కారులో అతి వేగంగా బయలుదేరారని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే రిటైర్డ్ ఆర్మీ జవాన్ రవీందర్‌తోపాటు బైక్‌ను కారుతో ఢీకొట్టారని తెలిపారు. అయితే రవీందర్ అక్కడికక్కడే మరణించగా.. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. ఈ కేసులో పట్టుబడిన నలుగురికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశామన్నారు. వీరంతా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. అలాగే వీరికి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వీరిపై 204 పార్ట్ 4 ఐపీసీతోపాటు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీయొద్దని ప్రజలకు నార్సింగ్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం తెల్లవారుజామున హైదర్ షాకోట్ ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర ఎస్యూవీ 350 కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్ గాలిలోకి ఎగిరిపడి అక్కడికక్కడే మరణించారు. అనంతరం బైక్ మీదకు

హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి. హైదర్షా కోట్ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందగా.. కొండాపూర్ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది. బ్రిటన్‌లోనూ డ్రంక్ డ్రైవింగ్‌పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి. లెక్కలు చెబుతున్న భయానక నిజం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ AR Rahman son Ameen),కుమారుడు, గాయకుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ AR Rahman son Ameen),కుమారుడు, గాయకుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయనతో ప్రయాణిస్తున్న స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అమీన్ తన పోర్షే కారులో ఓ స్నేహితుడితో కలిసి గిండి వైపు వెళ్తున్నారు. ఒలింపియా టెక్ పార్క్ సమీపంలోని సిగ్నల్ వద్దకు చేరుకోగానే వేగంగా వచ్చిన వాగన్ ఆర్ కారు.. అమీన్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టినట్లు స్థానికుల నుంచి సమాచారం. ఈ ప్రమాదంలో అమీన్, ఆయన స్నేహితుడికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని సమీపంలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. (Ameen road accident) ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్న వాగన్ ఆర్ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అతడిని కళైంగర్ సెంటెనరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన రెండు వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం కారణమనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తండ్రి ఏఆర్ రెహమాన్ బాటలో సంగీత రంగంలోకి అడుగుపెట్టిన అమీన్ గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు

రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమరావతి, ఆగస్టు 10: రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎంతో భవిష్యత్తు ఉన్న అఫిఫా.. 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్డు ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షరీన్ బేగం, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. అఫిఫా మృతి తీవ్రంగా కలిచివేసింది: హోం మంత్రి అనిత విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా రోడ్డు ప్రమాదంలో మృతిపై హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్నా.. 24 ఏళ్ల వయసులోనే నిండు జీవితాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. అఫిఫా మృతి తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. విషాద సమయంలో అఫిఫా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు. అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని హోం మంత్రి అనిత ప్రార్థించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా భౌతికకాయానికి ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివాళులర్పించారు. అజిత్ సింగ్ నగర్‌కు చేరుకున్న డీజీపీ, సీపీ.. అఫిఫాకు నివాళులర్పించి, షరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు. నిన్న(ఆదివారం) స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని కారులో చీరాల బీచ్‌కు బయలుదేరిన అఫిఫా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో జాతీయ

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్లో ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్లో ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఈ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ ఈ కారు ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఒకరికి కాలు విరిగింది. గాయపడిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి నార్సింగి పోలీసులు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలి నలుగురు యువకులు పరారయ్యారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఢీకొట్టిన కారు శంషాబాద్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ కారు అతివేగంగా దూసుకురావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్ సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థుల్లో విషాదం నెలకొంది. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యా మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దుష్యంత్, ఆండ్రూ అనే ఇద్దరు యువకులు కారుతో ప్రియాంకను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత స్థానికంగా చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ప్రియాంకకు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ప్రియాంక మృతితో ఘటనపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత, మాజీ ఎంపీ, రాజమండ్రి సిటీ ఇంచార్జి మార్గాని భరత్ కీలక నిర్ణయం ప్రకటించారు. రేపు రాజమండ్రి బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు కూడా బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరును భరత్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులపై కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆయన ఆరోపించారు. నిందితులను రక్షించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం, పోలీసులు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఉద్యోగం సాధించిన యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జెట్టివారిపల్లెకు చెందిన శ్రీహరి, చాముండి దంపతుల కుమారుడు దిలీప్ కుమార్ అమెరికాలోని కెంట్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న దిలీప్ ఐదు నెలల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో నివసిస్తున్న దిలీప్ కుమార్ శనివారం రోజు స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో వదిలేసి తిరుగు ప్రయాణం అయ్యారు. మెస్డోనియా ఓహెచ్ దగ్గర దిలీప్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఎదురు నుంచి వేగంగా వచ్చిన పికప్ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.దిలీప్ కుమార్ మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం రాగా.. సొంత ఊరిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో దిలీప్ మరణంపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని.. దిలీప్ కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం వారికి అవసరమైన సాయం అందిస్తోందన్నారు.శ్రీహరి, చాముండిలది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం.. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు దిలీప్ కుమార్‌ను ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా పంపారు. అమెరికాలో చదివి ఉద్యోగం కూడా వచ్చింది.. ఇంతలోనే కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో దిలీప్ కుమార్ మృతదేహాన్ని సొంత ఊరికి పంపించడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. జులైలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో తెలంగాణకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోయారు

రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సికింద్రాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక (Medical Student Priyanka Death) ఈరోజు (ఆదివారం) మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులుగా కిమ్స్‌లో ప్రియాంకకు వైద్యులు చికిత్స అందించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోనే ప్రియాంక మృతదేహాన్ని ఉంచారు. రాజమహేంద్రవరం పోలీసులు వచ్చిన తర్వాత ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆస్పత్రికి ప్రియాంక మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత పోస్టుమార్టానికి పోలీసులు తరలించనున్నారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల

రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. గత ఐదు రోజులుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఓ వైద్యురాలిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియాంక అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళితే, ఆగస్టు 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో ప్రియాంక తన స్కూటర్‌పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు ఆమె స్కూటర్‌ను ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు.అక్కడ ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కాగా, తన కుమార్తె మృతికి కారణమైన వారిపై సాధారణ ప్రమాద కేసు కాకుండా, హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక తండ్రి డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారిపై కారు, లారీని ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్: ధార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారి పంచకవాస వద్ద ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కారును లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వాహనాల వద్దకు చేరుకుని క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం బద్నవార్లోని సివిల్ ఆస్పత్రికి బాధితుడిని తరలించారు. సమాచారం అందుకున్న బద్నవార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అమిత్ సింగ్ కుష్వా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో నుజ్జునుజ్జు అయిన కారు నుంచి అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. వాటిని బద్నవార్ సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ స్పందించారు. లారీ ప్రమాదవశాత్తూ కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకరు గాయపడినట్లు వెల్లడించారు. బాధితులంతా గుజరాత్‌లోని వడోదరకు చెందిన వారిగా తెలిపారు. వారంతా ఉజ్జయిన్‌లోని మహాకాలేశ్వర ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ పేర్కొన్నారు. బారామతిలో మరో విమాన ప్రమాదం.. పైలట్లకు తప్పిన ప్రాణాపాయం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటిస్తాం: ఖర్గే

రాజమండ్రిలో సంచలనం సృష్టించిన ప్రియాంక రోడ్డు ప్రమాదం కేసులో కీలక వివరాలను ఎస్పీ నరసింహ కిశోర్ మీడియా ముందు వెల్లడించారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, నిందితులు అత్యంత క్రూరంగా క్రిమినల్ చర్యకు పాల్పడ్డారని ఆయన స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతో కేసును బలంగా నిర్మించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతిని, ఘటన జరిగిన తీరును ఆయన సమగ్రంగా వివరించారు.అసలేం జరిగింది?ఎస్పీ నరసింహ కిశోర్ కథనం ప్రకారం, ఘటన జరిగిన రోజు రాత్రి ప్రియాంక, ఆమె స్నేహితుడు ఉమేష్ స్కూటీపై సినిమా ఫస్ట్ షో చూసి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో నిందితులు ఇద్దరు మరో సినిమా చూసేందుకు అదే మాల్‌కు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు, మాల్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా వారితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దదవడంతో, సెక్యూరిటీ సిబ్బంది తమను పట్టుకుంటారనే భయంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు వేగంగా సెల్లార్‌లోని తమ కారు వద్దకు చేరుకున్నారు.తప్పించుకునే హడావుడిలో కారును వేగంగా పోనిస్తూ, స్కూటీపై వెళుతున్న ప్రియాంక, ఉమేష్‌లను ఒకసారి ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా, కావాలనే మరో రెండుసార్లు వారిపై నుంచి కారును పోనిచ్చి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి పారిపోయారని ఎస్పీ తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయని, అవి చాలా భయంకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.పోలీసుల దర్యాప్తు ఇలా..ఘటన జరిగిన మూడో తేదీ రాత్రి ఆసుపత్రి నుంచి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు

రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. రాజమండ్రి, ఆగస్టు 09: నగరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నిందితులిద్దరూ ప్రసాద్ ఆదిత్య మాల్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయే క్రమంలో కారును నిర్లక్ష్యంగా నడిపారని పేర్కొన్నారు. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను వారు కారుతో బలంగా ఢీ కొట్టారని ఎస్పీ వివరించారు. వరుసగా మూడు సార్లు స్కూటీని ఢీ కొట్టడంతో.. ప్రియాంక తీవ్రంగా గాయపడిందని అన్నారు. అనంతరం నిందితులు దొరక్కుండా పారిపోయారని చెప్పారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి ఈ ప్రమాదంపై తమకు సమాచారం వచ్చిందని వివరించారు. ఆ రోజు రాత్రే ప్రియాంక స్నేహితుడు వెంకట దుర్గ సాయి స్టేట్మెంట్ తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు. నిందితులిద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వారు మద్యం సేవించి కారు డ్రైవ్ చేసినట్లు ఆధారాలు కూడా సేకరించామని చెప్పారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సోమవారం కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. ఈ కేసులో పోలీసులపై ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్ చెప్పారు. భాగ్యనగర మహిళలకు బోనాల
అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామిడి మండలం పొగరూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో రెండూ కూడా కల్వర్టుపై నుంచి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మందిలో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. అటువైపు వెళ్తున్న వారు చూసి విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో, సహాయక చర్యలు మొదలయ్యాయి.హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనతో రెండు వాహనాలు కూడా కల్వర్టులోకి పడిపోయాయి. స్థానికులు వెంటనే రెండు వాహనాల డ్రైవర్లను బయటకు తీశారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పామిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిద్ర మత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు
తెలంగాణలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతకు మరింత సమగ్ర రూపం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైబర్ నేరాల నియంత్రణకు టీజీసీఎస్బీ, మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో (టీమార్స్) పేరుతో ఈ కొత్త విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ట్రాఫిక్ విభాగాలు ఆయా పోలీస్ యూనిట్ల పరిధిలోనే పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణకు ఒకే విధమైన విధానం, ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్ వ్యవస్థను పర్యవేక్షించేలా టీమార్స్ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనల దస్త్రానికి ఆమోదం లభిస్తే కొత్త బ్యూరో ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కూడా ఈ ప్రతిపాదనకు ప్రధాన కారణంగా మారాయి. ఏటా సుమారు 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణ, బ్లాక్స్పాట్ల గుర్తింపు, రోడ్ల భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి, అవసరమైన ప్రాంతాల్లో మార్గాల మార్పులు, సిగ్నల్ వ్యవస్థల మెరుగుదల వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు విధిస్తున్నప్పటికీ.. మరోవైపు సిగ్నళ్లు సరిగా పనిచేయకపోవడం, జీబ్రా క్రాసింగ్‌లు, స్టాప్ లైన్లు చెరిగిపోవడం, రోడ్లపై గుంతలు వంటి సమస్యలపై పోలీస్ శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. మున్సిపల్, ఆర్అండ్బీ తదితర శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ఇందుకు కారణంగా అధికారులు గుర్తించారు.కొత్త బ్యూరోకు అవసరమైన నిధుల కోసం ట్రాఫిక్ చలానాల ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏటా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు చలానాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది

సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం, ఆగస్టు 09: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. దీంతో కల్వర్టుపై నుంచి ఆ రెండు వాహనాలు కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పామిడిలోని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బస్సు- ఐషర్ వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను స్థానికుల సహాయంతో పోలీసులు రక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంతోపాటు నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు