
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Sangareddy District Accidents: కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన తీవ్ర విషాదం అలుముకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 12 మంది కూలీలు ఉన్నారు. ప్రతి రోజు కూలీ పని కోసం జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. గాయాలపాలైన మిగతా వారిని జహీరాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వెంటనే వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
తెలంగాణ సీఎం సంతాపం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరో ప్రమాదం సంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించి ఇద్దరు మృతిచెందారు. మూడు కార్లు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు విడవగా.. మరికొందరు గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి ఎగిరి పడింది. ఆ రోడ్డుపై వెళ్తున్న కారుతోపాటు మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దుర్మరణం చెందగా.. కొందరు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కంపెనీలో ప్రమాదం.. ఒకరు మృతి పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని యంఎస్ఎన్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ ప్రమాదంలో వెంకటేశ్వర్లు (45) అనే ఉద్యోగి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కొన్ని సంవత్సరాలుగా ఎంఎస్ఎన్ కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయ్‌గా వెంకటేశ్వర్లు పనిచేస్తుండేవాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




