
రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సికింద్రాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక (Medical Student Priyanka Death) ఈరోజు (ఆదివారం) మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులుగా కిమ్స్‌లో ప్రియాంకకు వైద్యులు చికిత్స అందించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోనే ప్రియాంక మృతదేహాన్ని ఉంచారు. రాజమహేంద్రవరం పోలీసులు వచ్చిన తర్వాత ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆస్పత్రికి ప్రియాంక మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత పోస్టుమార్టానికి పోలీసులు తరలించనున్నారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
Read Latest AP News And Telangana News And National News