
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పంచముఖి హనుమాన్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు వైపు నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం.. బెల్లంపల్లి వెళ్తేందుకు యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతిఖని గనిలో పనిచేస్తున్న సురేష్(37) అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చిరంజీవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కరీంనగర్‌కు తరలించారు. తిరుమల హిల్స్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సురేష్ మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




