
Bank Rules: ఒకేబ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?
Bank Rules: ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?
© 2026 nimisham.in

Bank Rules: ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?

Safety Rules | 47 అంతస్తుల నిర్మాణ స్థలంలో నో సేఫ్టీ రూల్స్.. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు

ICC Ratings: ప్రతి వారం ఐసీసీ విడుదల చేసే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఆటగాళ్ల స్థానాలు తలకిందులవ్వడం చూస్తూనే ఉంటాం. తాజాగా బుమ్రా మూడో స్థానానికి పడిపోగా ఒలీ రాబిన్సన్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. అసలు ఈ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ఎలా లెక్కిస్తుందో, దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతివారం మహిళలు, పురుషుల క్రికెట్ విభాగాల్లో టీమ్‌లతో పాటు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తూనే ఉంటుంది. సాధారణంగా మహిళల ర్యాంకింగ్స్ మంగళవారం, పురుషుల జాబితా బుధవారం విడుదలవుతాయి. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయిస్తారు. జీవితకాల రికార్డుల కంటే కూడా ఆటగాళ్లు ఇటీవల కాలంలో కనబరిచిన ఫామ్‌కే ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు నిర్ణీత సమయంలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలి. టెస్టులకు 12 నుంచి 15 నెలలు, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 9 నుంచి 12 నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ ఆటగాడు గాయం వల్ల లేదా జట్టులో చోటు దక్కక సుదీర్ఘకాలం మ్యాచ్‌లు ఆడకపోతే అతడి పేరును ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. ఉదాహరణకు 2008లో పార్థివ్ పటేల్ జట్టుకు దూరమైనప్పుడు 2009లో అతడి పేరును తొలగించారు. తిరిగి 2016లో పునరాగమనం చేసినప్పుడు పాత రేటింగ్‌తో మళ్లీ జాబితాలోకి చేర్చారు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లను ఆయా ఫార్మాట్ల నుంచి మినహాయిస్తారు. రేటింగ్ పాయింట్లు ఇచ్చే ప్రత్యేక ఆల్గారిథమ్ ర్యాంకింగ్స్ నిర్ణయించడానికి ఐసీసీ ఒక సంక్లిష్టమైన ఆల్గారిథమ్ను ఉపయోగిస్తుంది. 0 నుంచి 1000 పాయింట్ల స్కేలుపై ఆటగాళ్లకు రేటింగ్ ఇస్తారు. ఏ ఆటగాడైనా 900 పాయింట్లు దాటితే దాన్ని అత్యంత అరుదైన ఘనతగా భావిస్తారు. సాధారణంగా 750 పాయింట్లు సాధించిన వారు టాప్-10లో చోటు దక్కించుకుంటారు. 500 పాయింట్లకు పైన ఉంటే మంచి ప్రదర్శనగా

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్‌కు సొంత యూనిఫామ్ ఉంటుంది… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి. యూనిఫామ్ డిజైన్‌ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది. స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది. ప్రతి స్కూల్‌కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్‌పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్‌నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్‌ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల పరిమితిని తగ్గించింది. ఇదే కాకుండా సేవింగ్స్ అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ లేకుండా విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఈ కొత్త ఛార్జీలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. ఖాతాదారులు దీనిని గమనించాలని, ఇందుకనుగుణంగా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో కెనరా బ్యాంక్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెనరా బ్యాంక్ ఏటీఎంలో ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి ఆరుగా ఉండేది. ఇప్పుడు దానిని 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు కేవలం ఐదు లావాదేవీలు మాత్రం ఏటీఎంలలో ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైబడి చేస్తే ఛార్జీలు కట్ అవుతాయి. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటిని కూడా ఉచిత పరిమితిలో చేర్చారు. ఉచిత లావాదేవీల తర్వాత అకౌంట్లో డబ్బులు లేకపోయినా విత్ డ్రాకు ప్రయత్నిస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది ఏటీఎంలో ఉచిత లావాదేవీల తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఇప్పటివరకు ఇది రూ.20గా ఉండగా.. ఇప్పుడు మరో రూ.3 పెంచారు. అయితే సీనియర్ సిటిజన్లు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటాక వారికి ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది. సీనియర్ సిటిజన్ల లావాదేవీల పరిమితి ఎప్పటిలాగే ఉంచింది. ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్

అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ఆటోమేటిక్ పౌరసత్వం విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో సంచలన నిర్ణయానికి తెరదీస్తోంది. అమెరికాలో జన్మించిన చిన్నారులకు పాస్‌పోర్ట్ కావాలంటే ఇకపై కేవలం వారి బర్త్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. దరఖాస్తు చేసుకునే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పౌరసత్వాన్ని లేదా అధికారిక ఇమ్మిగ్రేషన్ హోదాను కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుందనే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తోంది.బర్త్ టూరిజంకు చెక్ పెట్టడమే లక్ష్యం!కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం సంపాదించడం కోసమే చాలామంది విదేశీయులు గర్భవతిగా ఉన్న సమయంలో పర్యాటక వీసాలపై యూఎస్ వస్తుంటారు. దీనిని అరికట్టడానికే ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 6న ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసింది. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో భాగంగానే స్టేట్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ రూపకల్పన చేస్తోంది. అమెరికన్ పౌరసత్వానికి ఉన్న విలువను కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు. Passport అక్కర్లేదు.. ఐడీ కార్డుతోనే భారత్‌లోకి ఎంట్రీ? కొత్త ప్రపోజల్..ఏయే ఆధారాలు చూపించాలి?ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. పిల్లలకు పాస్‌పోర్ట్ అప్లై చేసేటప్పుడు తల్లిదండ్రులు తాము అమెరికన్ పౌరులమని నిరూపించుకోవడానికి చెల్లుబాటు అయ్యే యూఎస్ పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు విదేశీయులైతే తమ ఇమ్మిగ్రేషన్ హోదాను స్పష్టం చేసే ఐ-94 (I-94) ఫారం లేదా గ్రీన్ కార్డ్ వంటి కీలక పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఫోటో ఐడీ మాత్రమే అడుగుతున్నారు తప్ప, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక ఆధారాలు అడగడం లేదు.Passport, Visa సేవలు బంద్! ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..కోర్టు వివాదాలు.. న్యాయపోరాటాలు!పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ గతంలో తెచ్చిన ఆదేశాలను అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు.. ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది.. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.. మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు.. కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. AP Rural Drinking Water Citizen Charter 2026:గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాగునీటి సరఫరాలో సమస్యలు, పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ల రిపేర్లు వంటి సమస్యలకు ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు “రూరల్ డ్రింకింగ్ వాటర్ సిటిజన్ ఛార్టర్ 2026 (G.O. 829)”ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రజలు తమ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే దానికి కంప్యూటర్ రసీదు లేదా కంప్లైంట్ నంబర్ ఇవ్వాలి. దీంతో తమ ఫిర్యాదు నమోదు అయిందా లేదా అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉంటుంది. అలాగే సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిన్నపాటి నీటి సరఫరా సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించాలి. గ్రామాల్లో నీటి సరఫరాకు ఉపయోగించే మోటార్లలో సమస్య వస్తే దాన్ని 48 గంటల్లోపు రిపేర్ చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో మోటార్ సమస్యల కారణంగా ఎక్కువ రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. పైప్‌లైన్ లీకేజీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించింది. చిన్న లీకేజీలను 24 గంటల్లో, పెద్ద లీకేజీలను 72 గంటల్లోపు సరిచేయాలి. దీనివల్ల నీటి వృథాను తగ్గించడంతో పాటు ప్రజలకు నీటి సరఫరా త్వరగా పునరుద్ధరించే అవకాశం
Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్‌లను పూర్తిగా నిషేధించారు. విండ్‌షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు

సాధారణంగా మనం ఏ గుడికి వెళ్లినా.. కాళ్లకు ఉన్న చెప్పులను బయటే విడిచి పెట్టి, భక్తి శ్రద్ధలతో లోపలికి వెళతాం. ఇది మన ఆచారం. కానీ, మన దేశంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో చెప్పులు వేసుకొని లోపలికి వెళతారని మీకు తెలుసా? వినడానికి కాస్త వింతగా అనిపించినా నిజంగానే ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. వేరే ఏ ఇతర ఆలయాల్లో లేని ఈ రూల్... ఈ టెంపుల్స్ లో మాత్రం ఎందుకు ఉంది? దీని వెనక ఉన్న కారణం ఏంటి? ఈ దేవ్‌జీ మహారాజ్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా, మాలాజ్ పూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు చెప్పులు ధరించే.. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకు వెళ్లే భక్తులు.. పాదరక్షలను ధరించే ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు. అయితే.. రోజువారీ సాధారణ పూజల సమయంలో చెప్పులు ధరించరు. కానీ, సంవత్సరానికి ఒకసారి నిర్వహించే జాతరకు వెళ్లే వారు మాత్రం.. చెప్పులు ధరిస్తారు. అసలు కారణం: స్థానిక నమ్మకాల ప్రకారం, దుష్టశక్తులు, చేతబడులు లేదా శారీరక/మానసిక సమస్యలతో బాధపడేవారు దేవ్‌జీ మహారాజ్‌ను దర్శించుకుంటే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అక్కడ పాదరక్షలతో నడవడం వల్ల తమను ఆవహించిన దుష్టశక్తులు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ జిల్లా, భోపాల్‌పూర్ ప్రాంతంలో ఉన్న కాళీమాత దేవాలయం.భక్తులు తమ కాళ్లకు ఉన్న చెప్పులను తీయకుండానే అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. అసలు కారణం: ఈ ప్రాంతంలో అమ్మవారిని చాలా ఉగ్రరూపిణిగా, అలాగే భక్తులను కంటికి రెప్పలా కాపాడే తల్లిగా భావిస్తారు. భక్తులు ముళ్ల బాటలు, కఠినమైన దారుల్లో నడిచి వస్తారు కాబట్టి వాళ్లకు పాదరక్షల వల్ల ఎలాంటి హాని కలగకుండా, అమ్మవారే స్వయంగా చెప్పులతో రావడానికి అనుమతి ఇచ్చిందని ఇక్కడి స్థానిక జానపద కథనం చెబుతుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథుని ప్రధాన ఆలయంలోకి

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లకు స్పష్టం చేసింది. ఇవి అన్ని వేళల పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సు కిటికీ అద్దాలకు కర్టెన్స్ వేయవద్దని పేర్కొంది. అనధికారికంగా కిటికీ అద్దాలకు ఫిల్మ్ అతికించవద్దని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని బస్సు ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి చేరుకునే వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. మహిళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ తదితర సిబ్బందిని నియమించే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించింది. అలాగే బస్సుల్లో పానిక్ బటన్లు, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా పని చేస్తూ ఉండాలంది. ఇవి అన్ని వేళలా పని చేస్తుండాలని తెలిపింది. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా ప్రతి బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వినియోగించే పరికరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలంది. అదే విధంగా రాత్రి లేదా రద్దీ లేని సమయాల్లో బస్సులను సురక్షితమైన, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిలిపి ఉంచేలా చూడాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. బస్సులో సిబ్బంది ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సీపీఆర్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులను కోరింది. ఈ నిబంధనలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని బస్సు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది. “జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మౌలిక వసతులపై దృష్టి ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు

ప్రతీఒక్కరూ బ్యాంక్‌కు ఒక్కసారి అయినా వెళ్లి ఉంటారు. బ్యాంకులో డిపాజిట్ లేదా విత్ డ్రా ఫామ్ నింపి లావాదేవీలు నిర్వహించి ఉంటారు. ఈ ఫామ్స్ నింపేటప్పుడు అమౌంట్‌ను సంఖ్య రూపంలో రాయడమే కాకుండా పదాల రూపంలో కూడా వివరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.10 వేలు డిపాజిట్ చేస్తున్నా లేదా విత్ డ్రా చేస్తుంటే.. టెన్ తౌజెండ్ రూపీస్ ఓన్లీ అని రాస్తూ ఉంటాం. చివరిలో ఓన్లీ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి కానీ చివరిలో 'Only' అనేది రాయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.“Ten Thousand” అని రాసిన తర్వాత ఖాళీగా వదిలేస్తే వేరే పదాలు రాయడానికి అవకాశం ఉంటుంది. అదే చివరిలో ఓన్లీ అనేది రాయడం వల్ల అక్కడితో వాక్యం పూర్తయిందని ఎవరికైనా అర్థమవుతుంది. దీని వల్ల వేరే పదం చేర్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు. దీని వల్ల ఎలాంటి మోసాలు జరగవు. అయితే ఓన్లీ అనేది చివరిలో రాయకపోతే మీ చెక్కు లేదా డిపాజిట్, విత్ డ్రా ఫామ్ చెల్లదని కాదు. మీరు రాయకపోయినా అది చెల్లుతుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రత్యేక నిబంధన విధించలేదు. కేవలం భద్రతాపరమైన కారణాల వల్ల చివరిలో ఓన్లీ అనేది రాయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఖాళీ స్థలం వదలకపోవడం అనేది భద్రత కోసమేనని చెప్పవచ్చు. బ్యాంక్ సిబ్బంది కూడా చివరిలో ఓన్లీ అనేది చేర్చాలని సూచిస్తూ ఉంటారు. కేవలం సాధారణంగానే దీనిని సూచిస్తూ ఉంటారు. ఇక బ్యాంక్ సిబ్బంది స్వీకరించిన తర్వాత అమౌంట్, పదాల్లో ఒకేలా ఉందా.. లేదా అనేది పరిశీలిస్తారు. అంకెల్లో అమౌంట్ ఒకలా.. పదాల్లో ఒకలా ఉంటే సులువుగా గుర్తు పడతారు. చెక్ ప్రాసెసింగ్ సమయంలో దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చెక్కు జమ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు దీనిని పరిశీలించుకోవాలి. రెండు చోట్ల ఒకేలా ఉందా..లేదా అనేది చూసుకోవాలి. రెండు చోట్ల

దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు షాకిచ్చింది. నగదు విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ తెరిచినవారికి నగదు విత్ డ్రా ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు విధించేవారు కాదు. ఇప్పటివరకు ఎన్ని నగదు ఉపసంహరణ లావాదేవీలు అయినా ఉచితంగా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్బీఐ పరిమితులు విధించింది. ఈ అకౌంట్ ఉన్నవారు అక్టోబర్ 1వ తేదీ నుంచి నెలకు నాలుగుసార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ విత్ డ్రా లావాదేవీకి రూ.15 ఛార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ఒక నెలలో నగదు ఉపసంహరణ లావాదేవీలు నాలుగు కంటే ఎక్కువ దాటినప్పుడు మాత్రమే ఛార్జీలు విధిస్తారు. అయితే డిజిటల్ లావాదేవీలు మాత్రం ఉచితంగా కొనసాగుతాయి. వీటికి ఎలాంటి ఛార్జీలు విధించమని ఎస్బీఐ తెలిపింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా ఉచితంగా లావాదేవీలు చేసుకోవచచ్చు. బ్రాంచ్ ఛానెల్ ద్వారా బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ తెరిచినవారికి నగదు విత్ డ్రాకు సంబంధించి ఛార్జీలు వర్తిస్తాయి. అయితే నెలకు నాలుగు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే అవకాశం ఉండటంతో.. దీని ప్రభావం పెద్దగా కస్టమర్లపై పడకపోవచ్చు. అయితే లిమిట్ దాటితే బ్యాంకింగ్ ఖర్చులు పెరిగే అవకాశముంది. ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవాలంటే డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడం మంచిది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే జీరో అకౌంట్ అని అర్థం. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు. ఉచితంగా ఏటీఎం కార్డు అందిస్తారు. అలాగే డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు కూడా ఎలాంటివి ఉండవు. బేసిక్ అకౌంట్ ఉండాలనుకునేవారికి

చెక్‌పై మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత ఖాళీ స్థలం ఉంటే.. దానిని ఉపయోగించి ఎవరైనా అదనపు పదాలను చేర్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు “Ten Thousand” అని మాత్రమే రాసి.. ఆ తర్వాత ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే, అందులో అదనపు పదాలు చేర్చేందుకు ప్రయత్నించవచ్చు. దీంతో అమౌంట్ మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మొత్తాన్ని పదాల్లో రాసిన వెంటనే ‘Only’ అని రాస్తారు. దీనివల్ల ఆ మొత్తానికి సంబంధించిన వాక్యం అక్కడితో పూర్తయిందని స్పష్టమవుతుంది. అదనపు పదాలు చేర్చే అవకాశం ఉండదు. చెక్‌పై ‘Only’ రాయకపోతే చెక్ చెల్లదు అని కాదు. ప్రతి చెక్‌పై ‘Only’ రాయాలని RBI ప్రత్యేకంగా తప్పనిసరి చేసిన నిబంధన అంటూ ఏం లేదు. అయితే చెక్‌లో మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఎలాంటి ఖాళీలు వదలకుండా జాగ్రత్త పడటం వంటి భద్రతా సూచనలు చాలా ముఖ్యమైనవి. అందుకే బ్యాంకులు కూడా చెక్ రాసేటప్పుడు మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత ‘Only’ చేర్చాలని సాధారణంగా సూచిస్తుంటాయి. చెక్‌లో మొత్తాన్ని సాధారణంగా రెండు విధాలుగా రాస్తారు. ఒకటి అంకెల్లో, మరొకటి పదాల్లో. ఈ రెండు చోట్ల ఉన్న మొత్తం తప్పనిసరిగా ఒకేలా ఉండాలి. ఉదాహరణకు రూ.5,000 చెల్లించాలంటే అంకెల్లో రూ. 5,000 అని రాసి.. పదాల్లో “ఐదు వేల రూపాయాలు మాత్రమే” అని రాయాలి. అంకెల్లో ఒక మొత్తం, పదాల్లో మరో మొత్తం ఉంటే చెక్ ప్రాసెసింగ్ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చెక్ ఇచ్చే ముందు రెండు చోట్ల రాసిన మొత్తాన్ని ఒకసారి కచ్చితంగా పరిశీలించాలి. చెక్ నింపేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే మోసాల అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత చివర ‘Only’ రాయడం మంచిది. మొత్తాన్ని రాసే సమయంలో అవసరం లేని ఖాళీ స్థలం వదలకండి. అంకెల్లో, పదాల్లో ఉన్న మొత్తం ఒకేలా ఉందో చూడండి. చెక్‌పై ఉన్న

శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2026లో కృష్ణాష్టమి సెప్టెంబర్ 4న రానుంది. ఈ సందర్భంగా పూజా సమయం, ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. 2026లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సెప్టెంబర్ 4, శుక్రవారం నిర్వహించనున్నారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసం ఉండటంతో.. ఆ సమయానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అష్టమి తిథి: సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:25 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 5న అర్ధరాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం: సెప్టెంబర్ 4న రాత్రి 11:04 గంటల వరకు ఉంటుంది. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని భక్తుల విశ్వాసం. కృష్ణుడి జన్మ సమయం అర్ధరాత్రి కావడంతో.. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. పూజా ముహూర్తం: సెప్టెంబర్ 4న రాత్రి 11:57 గంటల నుంచి 12:43 గంటల వరకు ఉంటుంది. ఈ నిశిత కాలంలో బాలకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి.. జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. జన్మాష్టమి పూజల్లో అర్ధరాత్రి సమయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడు నిశిత కాలంలో జన్మించాడని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఆ సమయంలో భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీకృష్ణుడిని పూజిస్తారు. పూజ అనంతరం బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో వేసి ఊపడం కూడా ముఖ్యమైన ఆచారం. జన్మాష్టమి సందర్భంగా ఇళ్లు, దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి పూజలు చేస్తారు. పూలు, పండ్లు, వెన్న, పాలు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. పిల్లలకు కృష్ణుడు, రాధ వేషాలు వేయించడం కూడా జన్మాష్టమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడనే విశ్వాసంతో జన్మాష్టమి రోజంతా భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి సమయంలో

దేశంలో మద్యం ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఓల్డ్ మాంక్ (Old Monk). దశాబ్దాలుగా లిక్కర్ మార్కెట్ లో తన మార్కును చాటుకుంటున్న ఈ బ్రాండ్ లేబుల్‌పై త్వరలోనే ఓ పెద్ద మార్పు రాబోతోంది. బాటిల్‌పై దర్జాగా కనిపించే 7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్ అనే ట్యాగ్‌లైన్‌ను తీసివేయడానికి దీని తయారీ సంస్థ మోహన్ మీకిన్ అంగీకరించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఈ ప్రకటన ఉందంటూ బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ దిగొచ్చింది.ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ - FSSAI లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బాటిల్లో ఉన్న మద్యంలో అసలైన రమ్ స్పిరిట్ కేవలం 2 నుంచి 5 శాతం మాత్రమే ఉంచి, మిగిలినదంతా సాధారణ స్పిరిట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు 7 ఏళ్ల నిల్వ అని ఎలా రాస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 7 ఏళ్లు అంటే ఏడేళ్లే ఉండాలి.. అంతేకానీ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలోనే ఫస్ట్ టైమ్.. లిక్కర్ రేట్లు తగ్గింపుబూతద్దం పెట్టి చూసినా కనపడని అక్షరాలు!కేవలం వయసు అని రాసిన ముద్రణ మాత్రమే కాకుండా.. రుచి, సువాసన కోసం కలిపే ఫ్లేవర్ల వివరాలను బాటిల్‌పై చాలా చిన్న అక్షరాలతో ముద్రించడంపై కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. నేను బూతద్దం పెట్టి మరీ బాటిల్ మూలమూలలా వెతికినా ఆ ఫ్లేవర్ల వివరాలు నాకు కనిపించలేదు అని పేర్కొన్నారు. దీంతో నాణ్యత, ముద్రణ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం- కొత్తగా 121 ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు ఎంట్రీ, ధరలు..!!మహారాష్ట్రలో అమ్మకాలపై నిషేధం!ఈ వివాదం కారణంగా మహారాష్ట్రలో ఓల్డ్ మాంక్ బ్రాండ్ పరిధిలోని కొన్ని వేరియంట్ల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. దీనిపై ఊరట నివ్వాలని కంపెనీ కోరగా, బాంబే హైకోర్టు నిరాకరించింది. ఇరువైపులా ఉన్న

Facilities in Jail : తప్పు చేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు జైళ్లను ఉపయోగిస్తాయి. కోర్టులు జైలు శిక్ష విధించగా పోలీసులు దాన్ని అమలుచేస్తారు... ఇలా ప్రభుత్వం, కోర్టులు, పోలీస్ వ్యవస్థలు కలిసి జైళ్ల పర్యవేక్షణ చూసుకుంటాయి. నేరాలకు పాల్పడినవారిలో పరివర్తన తీసుకువచ్చేలా జైలు శిక్షను అమలుచేస్తారు... అందుకే ఇక్కడ చాలా కఠిన నియమ నిబంధనలు పాటిస్తారు. మరి భారతదేశంలోని జైళ్లలో ఖైదీలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో ఇక్కడ తెలుసుకుందాం. జైళ్ల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం... కాబట్టి ఒక్కోరాష్ట్రంలోని ఖైదీలకు ఒక్కో రకమైన సదుపాయాలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే జైలులోని సాధారణ ఖైదీలకు బెడ్ (మంచం) ఉండదు.. నేలపైనే పడుకోవాలి. అయితే కింద పర్చుకోడానికి బెడ్ షీట్ లేదా చాప ఇస్తారు.... అలాగే కప్పుకోడానికి దుప్పటి కూడా అందిస్తారు. అయితే కోర్టు అనుమతితో లేదా ఆరోగ్య కారణాలతో డాక్టర్ల సూచనమేరకు కొందరు ఖైదీలు బెడ్ సదుపాయం పొందవచ్చు. ఇక విఐపి ఖైదీలను జైలులోని ప్రత్యేక బ్యారక్స్ లో ఉంచుతారు... ఇందులో బెడ్ తో పాటు టేబుల్, కుర్చీ వంటి ప్రత్యేక వసతులు ఉంటాయి. కోర్టు అనుమతితో టీవి, న్యూస్ పేపర్ సదుపాయాన్ని కూడా కొందరు విఐపి ఖైదీలు పొందుతుంటారు. ఇండియాలో ఆధునిక జైళ్లు వస్తున్నాయి... వీటిలో ఖైదీలకు విదేశీ జైళ్ల తరహా సదుపాయాలను కల్పిస్తున్నారు. ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించేందుకు బంక్ బెడ్స్ అంటే ఒకదానిపై ఒకటి ఉండే మంచాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో నిర్మించిన సెంట్రల్ జైళ్ళలో సాధారణ ఖైదీలకు కూడా బెడ్ సదుపాయం కల్పిస్తున్నారు. తెలంగాణ జైళ్లలో ఖైదీలు ఉపయోగించే బెడ్ షీట్స్, దుప్పట్లను స్వయంగా వాళ్లు తయారుచేసుకున్నవే ఉంటాయి. అంటే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలతో వీటిని తయారుచేయిస్తారు... రాష్ట్రంలోని అన్ని జైళ్లకు సరఫరా చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీస్ శిక్షణా కేంద్రాల్లోనూ ఖైదీలు తయారుచేసిన బెడ్ షీట్స్, దుప్పట్లనే

September New Rules: ప్రతి నెలా మొదటి తేదీ సామాన్యుడి ఆర్థిక పరిస్థితికి, దైనందిన జీవితానికి సంబంధించిన అనేక కొత్త మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు, సెప్టెంబర్ 1, 2026 నుండి, వంటగ్యాస్ ధరల నుండి విమాన ఛార్జీలు, అద్దె, కార్ల కొనుగోళ్ల వరకు దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని నిబంధనలు ఉపశమనం కలిగించినప్పటికీ, చాలా నిర్ణయాలు జేబుపై భారాన్ని పెంచడం ఖాయం. ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రధాన మార్పులను నిశితంగా పరిశీలిద్దాం. 1. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు ఖరీదైనవిగా మారాయి: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోగ్రాముల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచాయి. ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది. అయితే, సాధారణ ప్రజలకు ఊరటనిస్తూ, 14.2 కిలోగ్రాముల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 2. విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగాయి: ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు 5.46% (సుమారుగా లీటరుకు రూ.6.28) పెరిగాయి. కొత్త ధరలు ఇప్పుడు లీటరుకు రూ.121.28 గా ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, విమానయాన సంస్థలు భవిష్యత్తులో విమాన ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. 3. ముంబైలో ఆటో, నలుపు-పసుపు టాక్సీ ఛార్జీలు పెరిగాయి: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఆటో-రిక్షా కనీస ఛార్జీని రూ.26 నుండి రూ.27కు, నలుపు-పసుపు టాక్సీల ప్రారంభ ఛార్జీని రూ.31 నుండి రూ.33కు పెంచారు. ఈ కొత్త ఛార్జీలు మొదటి 1.5 కిలోమీటర్ల వరకు వర్తిస్తాయి. 4. టాటా, హ్యుందాయ్ కార్లను కొనడం మరింత ఖరీదైనది: మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ముడిసరుకుల ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపుతూ, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25,000

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. New ATM Rules 2026: ఏటీఎం కార్డు వినియోగదారుల విషయానికి వస్తే, ఆర్బీఐ ఆమోదంతో వినియోగదారులపై అదనపు చార్జీల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు, మీరు మీ సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం యంత్రాల వద్ద బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా నగదు విత్ డ్రా చేయాలన్నా, వారు అధిక చార్జీలను వసూలు చేస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఆర్బీఐ ఆమోదంతో ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై విధించనున్నారు. మీరు ఏటీఎం కార్డును తరచూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, కచ్చితంగా అదనపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ ఛార్జీలను రూ.17 నుండి రూ.19 వరకు పెంచారు. కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ.7 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారిగా లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలను వసూలు చేసేవారు. సాధారణంగా మెట్రో నగరాల్లో నివసించే కస్టమర్లకు ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తే, నాన్-మెట్రో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంపీసీఐ (MPCI) ఆమోదం, ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఈ అదనపు చార్జీల విషయంలో ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం ఎంపీసీ ముందుకు వెళ్ళింది. ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల, పాత ధరల పద్ధతిని కాకుండా కొత్తగా ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి అధికారిక

దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే లక్షలాది మంది చిన్న వ్యాపారులకు త్వరలోనే పెద్ద సమస్య వచ్చిపడేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రీ-కేవైసీ (Re-KYC) గడువు సెప్టెంబర్ 15తో ముగియనుండటమే దీనికి కారణం. నిర్ణీత సమయంలోగా కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే క్యూఆర్ కోడ్స్ , సౌండ్‌బాక్స్‌ల ద్వారా జరిగే పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందనే వార్తలు పేమెంట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పేమెంట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. వీధుల్లో, చిన్న చిన్న షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు వాడే ఆఫ్‌లైన్ చిన్న వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా, ఆన్లైన్లో చిన్న వ్యాపారాలు చేసుకునే మరో పది లక్షల మంది కూడా తమ అకౌంట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడంలో వెనుకబడి ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఆన్లైన్, ఆఫ్‌లైన్, విదేశీ పేమెంట్ సేవలు అందించే అన్ని కంపెనీలు సెప్టెంబర్ 15, 2026 నాటికి తమ వ్యాపారుల అందరి రీ-కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చిల్లర కొట్టు యజమానులకే అసలు కష్టం!ఈ కేవైసీ నిబంధనల వల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టు యజమానులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్బీఐ అడిగే డాక్యుమెంట్స్ వీరిలో చాలామంది దగ్గర లేకపోవడం, అలాగే ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సౌండ్‌బాక్స్ వాడుతున్న వారిలో 85-90 శాతం మంది కేవైసీ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం క్యూఆర్ కోడ్ బోర్డులు మాత్రమే వాడే చిన్న వ్యాపారులే దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేలా ఉన్నారు.RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు
అమెరికాలో డ్రైవింగ్ చేయడం అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది అత్యంత బాధ్యతతో కూడుకున్న విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ట్రాఫిక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపే విషయంలో అమెరికా ప్రభుత్వం- పోలీసులు "జీరో టాలరెన్స్" వైఖరిని అవలంబిస్తారు. సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నట్లుగా, అమెరికాలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అమెరికాలో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే అక్కడ సర్దుబాట్లు ఉండదు, రాజీపడే అవకాశమే లేదు. వారితో వాదించడం, గొడవపడటం లాంటివి చేయకూడదు. చేస్తే విషయం ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు కారును ఆపిన క్షణం నుంచే తమ 'బాడీ కెమెరా' (Body Cam) ఆన్ చేసి ప్రతీ విషయాన్ని రికార్డ్ చేస్తారు. సస్పెక్ట్కు నేలపై నడవమని చెప్పడం (Field Sobriety Test) లేదా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 0.08% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అక్కడికక్కడే చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి అరెస్ట్ చేస్తారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. DUI కేసు నమోదైతే మొదటిసారి నేరానికి కూడా భారీగా ఫైన్ తో పాటు క్రిమినల్ శిక్షలు పడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం తీవ్రతను బట్టి $1,000 నుండి $10,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాదు మొదటిసారి నేరానికైనా కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మద్యం మత్తులో యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా గాయాలైతే అది 'ఫెలోని' (Felony) నేరంగా మారి ఏళ్ల తరబడి జైలు శిక్షకు దారితీస్తుంది. కేసు వాదించడానికి లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులకు మరో $5,000 నుండి $15,000 వరకు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. DUI కేసు

మొబైల్ ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్‌ను ట్యాంపర్ చేయడం లేదా ఆ నంబర్ మార్పులు చేసిన ఫోన్లను వాడటంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని సోమవారం స్పష్టం చేసింది.దేశంలో మొబైల్, డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగం పౌరుల భద్రతకు, నెట్‌వర్క్‌ల సమగ్రతకు పెను సవాలుగా మారిందని టెలికాం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ చట్టంలోని సెక్షన్ 42(3)(c) ప్రకారం IMEI నంబర్లతో సహా ఎలాంటి టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్లను ట్యాంపర్ చేయడం నిషేధం.ఈ నిబంధనలను ఉల్లంఘించడం కాగ్నిజబుల్ (వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయదగిన), నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికే కాకుండా, దానికి సహకరించిన లేదా ప్రోత్సహించిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని సెక్షన్ 42(6) చెబుతోందని వివరించింది. మోసపూరిత మార్గాల్లో, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి సిమ్ కార్డులు పొందడం కూడా నేరమేనని పేర్కొంది.పౌరులకు పలు కీలక సూచనలు చేసింది. మార్పులు చేసిన IMEI నంబర్లు ఉన్న మోడెమ్‌లు, సిమ్ బాక్సులు వంటి పరికరాలను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ముఖ్యంగా, తమ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం

జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ 2016లోని నిబంధనల ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరంగా పేర్కొంటూ షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. హైకోర్టులో పిల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ 2016లోని నిబంధనల ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరంగా పేర్కొంటూ షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్త్రీ శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, హోం, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, పాఠశాల విద్యశాఖల ముఖ్యకార్యదర్శులు, జువైనల్ వెల్ఫేర్ డైరెక్టర్, రాష్ట్ర డీజీపీ, ఆరోగ్యశాఖ కమిషనర్, తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్/ మేనేజింగ్ ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించేవారికి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించబడుతుందని బోర్డులపై స్పష్టంగా పేర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 ప్రకారం విద్యా సంస్థలకు 100గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయించడానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపినందుకు 2025-26లో 35,449 కేసులు నమోదయ్యాయని వివరించారు. చట్టం అమలు
SC Judicial Experience Relief : న్యాయశాస్త్ర పట్టభద్రులకు సుప్రీ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులుగా ఎంపిక అయ్యేందుకు వీలుగా నిర్వహించే ప్రాథమిక స్థాయి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించి కీలక సడలింపులు ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జడ్జి పోస్టులకు పోటీ పడటానికి న్యాయవాదిగా కనీసం మూడేళ్ల వృత్తి అనుభవం తప్పనిసరిగా ఉండాలంటూ గతంలో విధించిన కఠిన నిబంధనను న్యాయస్థానం సడలించింది. ఏడాది అనుభం ఉంటే చాలని తేల్చి చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.మూడేళ్ల నిబంధన సడలింపు..!సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎ.జి.మాసిహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీ ప్రాతిపదికన ఈ తీర్పును వెలువరించింది. కొత్త ఆదేశాల ప్రకారం.. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి ఒక ఏడాది పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంటే చాలు. గతంలో అనగా 2025 మే నెలలో నాటి సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పరీక్ష రాయాలంటే మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలని చెప్పింది. కానీ ఈ నిబంధనను సవరించాలని కోరుతూ ఇటీవలే కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. విచారించిన ధర్మాసనం ఈ కీలక సవరణలు చేసింది.2025 తీర్పు వెలువడి ఇప్పటికే ఒక సంవత్సరం కాలం పూర్తయినందున.. అప్పటి తాజా లా గ్రాడ్యుయేట్లు అందరూ ఇప్పటికే ఏడాది పాటు వృత్తి అనుభవం గడించినట్లుగానే భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దీనికోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ఎలాంటి అనుభవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వీరంతా పరీక్ష రాసేందుకు అర్హత ఉన్నవాళ్లేనని అన్నారు. అయితే ఈ పరీక్ష ద్వారా జడ్జీలుగా ఎంపికైన అభ్యర్థులు నేరుగా విధులు నిర్వహించడానికి వీలుండదు. వారు విధుల్లో చేరే ముందు రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇందులో భాగంగానే.. మొదటి ఏడాది జ్యుడీషియల్ అకాడమీలో

మన సంస్కృతిలో వంటగదికి విశిష్ట స్థానం ఉంది. దీనిని వంట చేసుకునే స్థలంగానే చూడరు. సాక్షాత్ అన్నపూర్ణా దేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇళ్లలో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండటానికి వంటగది రూపకల్పన, అక్కడ ఉపయోగించే వస్తువుల అమరికలోనూ కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆగ్నేయ దిశలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికీ అనేక కారణాలు ఉన్నాయి.ప్రస్తుత ఆధునిక కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ప్రజల అవసరాలు, సమయాభావానికి అనుగుణంగా వంటగది రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే గృహిణుల సౌకర్యార్థం రకరకాల డిజైన్లు, ఎక్కువ బర్నర్లు కలిగిన గ్యాస్ స్టవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్ళలో వేగంగా వంట పూర్తి చేయడానికి రెండు బర్నర్ల కంటే 3-బర్నర్ లేదా 4-బర్నర్ గ్యాస్ పొయ్యిలను కొనుగోలు చేస్తోన్నారు గృహిణులు.ఇక్కడే చాలా మందికి ఓ సందేహం ఎదురవుతోంది. సాధారణంగా మూడు అనే అంకెను కొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తుంటారు. వంటగదిలో 3- బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ స్టవ్‌కు ఇన్ని బర్నర్లు మాత్రమే ఉండాలనే కచ్చితమైన నియమం అంటూ ప్రత్యేకంగా ఏదీ శాస్త్రంలో ఎక్కడా లేదు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!కుటుంబ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి మూడు లేదా అంతకంటే ఎక్కువ బర్నర్లు ఉన్న స్టవ్ ను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని, దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన సనాతన సంస్కృతిలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తారు.అటు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడు సంఖ్యకు అధిపతి దేవగురువు బృహస్పతి. జ్ఞానానికి, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహ ప్రభావం ఈ సంఖ్యపై ఉండటం వల్ల దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మూడు బర్నర్ల గ్యాస్ పొయ్యిని కలిగి
Tata Mutual Fund: బంగారంలో మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు టాటా మ్యూచువల్ ఫండ్ తీపి కబురు అందించింది. తమ టాటా గోల్డ్ ఈటీఎఫ్ (Tata Gold ETF), టాటా గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Tata Gold ETF FoF) స్కీమ్‌లలో పెద్ద ఇన్వెస్టర్లకు లంప్ సమ్ రూపంలో చేసే పెట్టుబడులపై విధించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులను బంగారంపై పెట్టుబడి పెట్టే వెసులుబాటు కలిగింది.పెట్టుబడులు పునః ప్రారంభంగతంలో మార్కెట్ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా పసిడి సరఫరా, ధరల అస్థిరత కారణంగా పెద్ద ఇన్వెస్టర్లు ఒకేసారి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడంపై పరిమితులు విధించారు. అయితే, ప్రస్తుతం పసిడి మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన అనంతరం, టాటా మ్యూచువల్ ఫండ్ యాజమాన్యం ఈ సబ్స్క్రిప్షన్లను తిరిగి యథాతథంగా అనుమతించాలని నిర్ణయించింది.సవరించిన కొత్త నిబంధనలు ఆగస్టు 21, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు టాటా మ్యూచువల్ ఫండ్ (Tata Mutual Fund) తెలిపింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చిన క్రమంలో ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది.జూన్ 5న, టాటా మ్యూచువల్ ఫండ్ చేసిన ప్రకటన ప్రకారం.. రూ. 25 కోట్ల పెట్టుబడితో టాటా గోల్డ్ ఈటీఎఫ్ (Tata Gold ETF)లో నేరుగా పెట్టుబడులు పెట్టే భారీ పెట్టుబడిదారుల సబ్స్క్రిప్షన్ లావాదేవీలపై జూన్ 8, 2026 నుంచి తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. Tata Gold ETF అనేది దేశీయ బంగారం ధరను అనుసరించే ఒక ఓపెన్-ఎండెడ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్. Tata Gold ETF FOF అనేది Tata Gold ETFలో పెట్టుబడి పెట్టే ఒక ఓపెన్-ఎండెడ్ 'ఫండ్-ఆఫ్-ఫండ్స్' పథకం.ఇన్వెస్టర్లకు కలిగే

అరుణాచలంలో కొత్త ఆంక్షల అమలు ఆలయంలోకి మొబైల్స్‌పై నిషేధం రూ.5 కే ఫోన్ క్లాక్‌రూమ్ Arunachalam: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన తమిళనాడులోని తిరువణ్ణామలై అన్నామలైయార్ (అరుణాచలం) (Arunachalam)దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ యంత్రాంగం అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆలయ ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు, గర్భగుడి పరిసరాల్లో భక్తులు ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరించడాన్ని అరికట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. హిందూ మత, ధార్మిక దానాల శాఖ నిబంధనల ప్రకారం వీఐపీల ఫొటోగ్రఫీపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనార్థం వెళ్లే భక్తులు ఈ నిబంధనలను తప్పనిసరిగా గమనించాల్సి ఉంటుంది. Sowcar Janaki: చిత్రసీమలో తీవ్ర విషాదం.. షావుకారు జానకి కన్నుమూత భద్రతా కేంద్రాల ఏర్పాటు, క్లాక్‌రూమ్ రుసుము వివరాలు: భక్తుల సౌకర్యార్థం తమ ఫోన్లను సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఆలయ పరిసరాల్లో ప్రత్యేక మొబైల్ భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు వైపు రాజగోపురం వద్ద రెండు, ఉత్తర వైపు అమ్మని అమ్మన్ గోపురం వద్ద రెండు, దక్షిణ వైపు తిరుమంజన గోపురం సమీపంలో ఒక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి మొబైల్ ఫోన్‌కు రూ.5 రుసుము చెల్లించి, టోకెన్ పొంది ఫోన్‌ను డిపాజిట్ చేయవచ్చు. దర్శనం ముగిసిన తర్వాత ఆ టోకెన్ చూపించి తిరిగి ఫోన్‌ను పొందవచ్చని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, సీసీటీవీల పర్యవేక్షణ: ఆలయ ప్రాంగణంలో మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలు ధిక్కరించి అనధికారికంగా ఫోన్లు లోపలికి తీసుకెళ్తే, వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగిస్తామని యంత్రాంగం హెచ్చరించింది. భక్తులు దర్శనం సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి, ఆలయ ప్రశాంత వాతావరణాన్ని కాపాడటానికి ఈ
మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడి అంటే రెండు ముడులు ఉన్నదని అర్థం. ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి, పూర్తిగా నెయ్యితో నింపుతారు. అలాగే పూజా సామాగ్రి పెడతారు. రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావాల్సిన బియ్యం పప్పు, పసుపు, కుంకుమ, రవికలను పెడతారు. ఈ రెండూ భక్తి, శ్రద్ధలకు సంకేతంగా భావిస్తారు. ‘భక్తి’, ‘శద్ధ’అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండ భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో, అక్కడ ఓంకారం ఉంటుందని, అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారమనే తాడుతో బిగిస్తారు. భక్తి, శ్రద్ధలతో సాధనతో పొందితే అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఇరుముడిలోని ఒక భాగంలో స్వామివారికి సంబంధించిన సామాగ్రిని ఉంచుతారు. రెండో భాగంలో కొబ్బరికాయలోని నీళ్లను తొలగించి, అందులో ఆవునెయ్యిని నింపుతారు. జీవుని ఆత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యం అని పండితులు చెబుతారు. దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో, అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి. ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్టేనని పండితులు చెబుతున్నారు. అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజులు ముందే మద్యం, మాంసం వంటి వాటి జోలికి వెళ్లకూడదు. శబరిమలకు ఇరుముడితో వెళ్లే అయ్యప్ప భక్తులు ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు మీద ఒక్కోమాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. తొలి 5 మెట్లు పంచేంద్రియాలకు ప్రతీకగా, తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా, ఆ తర్వాత 3 మెట్లను సత్యం, తామసం, రాజసానికి సూచనగా, చివరి రెండు మెట్లను విద్య, అవిద్యగా పరిగణిస్తారు. ఇరుముడిని కట్టుకునేటప్పుడు, ఇరుముడి తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని
EPFO Interest Rate: ఉద్యోగం మారినప్పుడు లేదా మానేసినప్పుడు చాలా మంది తమ ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను అలాగే వదిలేస్తుంటారు. అయితే, ఒక నిర్దిష్ట కాలం పాటు జమలు లేని ఖాతాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇనాపరేటివ్ అకౌంట్స్ (Inoperative Accounts) గా గుర్తిస్తుంది. కొన్ని రకాల ఖాతాల్లో ఒక గడువు దటిన తర్వాత వడ్డీ జమ కావడం నిలిచిపోతుంది. దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు, మీ పీఎఫ్ సొమ్ముపై వడ్డీ తగ్గకుండా చూసుకునే మార్గాలు వివరంగా తెలుసుకుందాం.ఇనాపరేటివ్ ఎప్పుడు అవుతుంది?ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం వివిధ పరిస్థితుల్లో ఒక పీఎఫ్ ఖాతా ఇనాపరేటివ్‌గా మారుతుంది. ఉద్యోగికి 55 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత కూడా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోకుండా ఖాతాలో నిధులు అలాగే ఉంటే ఖాతా పని చేయడం ఆగిపోతుంది. ఉద్యోగి శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోవడం లేదా మరణించిన సందర్భాల్లో నిధులు అలాగే ఉండిపోవడం, వరుసగా 36 నెలల పాటు ఖాతాలో ఎలాంటి కొత్త జమలు రాకపోవడం వంటివి జరిగినప్పుడు ఖాతా ఇనాపరేటివ్ గా మారుతుంది.Read Also: ఈరోజు మీ PF వడ్డీ 8.25 శాతం జమ అయిందా? ఒక్క SMSతో ఈజీగా చెక్ చేయొచ్చు.. ప్రాసెస్ ఇదేఏ సందర్భంలో వడ్డీ రావడం ఆగిపోతుంది? 55 ఏళ్ల వయస్సు తర్వాత: ఉద్యోగి పదవీ విరమణ పొంది, 55 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా 36 నెలల పాటు పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకోకపోతే, ఆ ఖాతా ఇనాపరేటివ్ గా మారి వడ్డీ జమ కావడం ఆగిపోతుంది. 55 ఏళ్ల కంటే తక్కువ వయస్సు: 55 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు ఉద్యోగం మనేసినప్పటికీ, వారి ఖాతాలో 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వడ్డీ జమ అవుతుందని ఈపీఎఫ్ఓ గతంలోనే స్పష్టం చేసింది. అయితే 36 నెలల పాటు జమలు లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ గా మారుతుంది. 58

దేశంలో మొబైల్ కనెక్షన్ల జారీలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వీటిని అమల్లోకి తీసుకుని రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు సైతం రూపొందించింది.. టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ. సిమ్ కార్డుల జారీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కఠినంగా ఈ నూతన నిబంధనలను అమలులోకి తేబోతోంది.మొబైల్ కనెక్షన్లు, సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒక వ్యక్తి తన పేరు మీద నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు కలిగి ఉంటే, వారికి నూతనంగా మరో సిమ్ కార్డు జారీ చేయకూడదని కేంద్రం టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. అంటే.. పరిమితి మించిన వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన సిమ్ అనేది ఇవ్వరు. వీటిని పూర్తిగా నిలిపివేయనున్నారు.తాజా టెలికాం నిబంధనల ప్రకారం.. దేశంలో ఒక పౌరుడు తన ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలపై గరిష్టంగా తొమ్మిది మొబైల్ కనెక్షన్లను మాత్రమే పొందేందుకు అనుమతి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రత కారణాల రీత్యా ఈ పరిమితిని గరిష్టంగా ఆరు సిమ్ కార్డులుగా నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల యూజర్లు ఆరుకు మించి ఎక్కువ సిమ్ కార్డులను పొందలేరు. వేర్వేరు టెలికాం కంపెనీల సిమ్ కార్డులను వాడుతున్నప్పటికీ కూడా మొత్తంగా ఉండాల్సిన కనెక్షన్ల సంఖ్య ఈ లిమిట్ దాటకూడదు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్వినియోగదారులకు ఇప్పటికే వివిధ నెట్వర్క్ లలో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని రియల్ టైమ్ లో సరిపోల్చుకోవడానికి టెలికాం కంపెనీలన్నీ కూడా డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ డిజిటల్ డేటాబేస్ ఆధారంగానే నూతన కనెక్షన్లు కోరేవారి అర్హతను ఆపరేటర్లు పరిశీలిస్తారు. ఇప్పటికే గరిష్ట పరిమితిని దాటిన వినియోగదారులు మరో

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా, స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన పవిత్ర శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. మన దేశంలో ఉన్న అత్యంత ప్రాచీన, మహిమాన్వితమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రాన్ని "దక్షిణ కైలాసం" లేదా "దక్షిణ కాశీ" అని ఎంతో భక్తితో పిలుస్తారు. పంచభూత క్షేత్రాలలో ఇది వాయులింగ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు, శాస్త్రీయ రహస్యాలు మిమ్మల్ని షాక్ కు గురిచేస్తాయి. ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. 'శ్రీ', 'కాళ', 'హస్తి' అనే మూడు పదాల కలయికతో శ్రీకాళహస్తి ఏర్పడింది. ఈ మూడు జీవులు తమ తమ రీతుల్లో శివలింగాన్ని పూజించి మోక్షాన్ని పొందాయి. సాలీడు తన నూలు గూడుతో, పాము రత్నాలతో, ఏనుగు స్వర్ణముఖి నది నీరు, పూలతో పరమశివుడిని ఆరాధించాయి. వీరి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో వాయు తత్వానికి ప్రతీక. గర్భగుడిలో ఉండే శివలింగం స్వయంభూ, చతురస్రాకారంలో తెల్లని వర్ణంలో ఉంటుంది. ఇక్కడి అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, గర్భగుడిలో గాలి వీచడానికి ఎలాంటి మార్గాలు లేకపోయినా, శివలింగానికి ఇరువైపులా ఉండే అఖండ జ్యోతుల జ్వాలలు నిరంతరం రెపరెపలాడుతూ ఊగుతుంటాయి. ఇది స్వామివారి వాయు స్వరూపానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రత్యక్ష నిదర్శనమని భక్తులు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడి మూలవిరాట్టును పూజారులు కూడా నేరుగా చేతులతో తాకరు. సాధారణంగా సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణ సమయాల్లో దేశంలో ఉన్న అన్ని చిన్న, పెద్ద ఆలయాలను మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ సమయాల్లో కూడా తెరిచే ఉంటుంది. ఆ సమయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. గ్రహణ ప్రభావం పడని

మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది... హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మార్గదర్శిపై నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును 19 డిసెంబరు 2025న ఉండవల్లి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఉండవల్లి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మార్గదర్శి ఫైనాన్సియర్ ్స ఎలాంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి రూ.2,500 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు ఆర్బీఐ వాదనలను విస్మరించిందని, కేవలం సాంకేతిక కారణాలను చూపుతూనే కేసును కొట్టివేసిందని తెలిపారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎ్‌ఫ అనేది ‘అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్’ కిందకు వస్తుందని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవని ఆర్బీఐ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా రూ.5.23 కోట్లకు పైగా చెల్లింపులు మిగిలి ఉన్నాయని, కొందరు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడం వల్లే ఇది పెండింగ్‌లో పడిందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర వాదనలు వినిపిస్తూ.. ఇప్పటి వరకు డిపాజిటర్లకు సంబంధించి రూ.2,500 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు వివరించారు. ఎవరూ క్లెయిమ్ చేయని మిగిలిన రూ.5.23 కోట్లను నిబంధనల ప్రకారం ఎస్ర్కో ఖాతాలో జమ చేశామనిచెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని, పబ్లిక్ నోటీసు జారీ చేసి, తదుపరి ప్రక్రియ అంతటినీ పారదర్శకంగా నిర్వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Varalakshmi Vratham 2026 Guide: హిందూవులు.. ముఖ్యంగా తెలుగువారు అత్యంత భక్తిప్రపత్తులతో శ్రావణమాసం చేసుకుంటారు. ఈ మాసంలో అత్యంత పవిత్రంగా దైవ చింతనలో మునుగుతారు. శ్రావణమాసంలో ఇప్పటికే నాగులపంచమి ముగిసిపోగా.. ఈ మాసంలో వరాలు కురిపించే వరలక్ష్మిని పూజిస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని మహిళలు కొలుస్తారు. తమ మాంగళ్య బలం బలంగా ఉండాలని.. కోరిన కోరికలు తీరాలని వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. శ్రావణమాసంలో వచ్చిన రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేయనున్నారు. వరలక్ష్మీ వత్రం ఎలా చేయాలి? పూజా విధానం ఏమిటనేది తెలుసుకుందాం. వ్రతానికి ఏర్పాట్లు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజా స్థలం అంటే పూజా మందిరంతోపాటు వ్రతం చేసే ప్రదేశం చోట ముగ్గు వేయాలి. వ్రతానికి సిద్ధం చేసుకున్న పీటపై కొత్త వస్త్రం పరచాలి. అనంతరం వరలక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఉంచాలి. మామిడి తోరణాలు, ఆరటి ఆకులతో వ్రతం ప్రదేశాన్ని అలంకరించండి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించాలి. కలశం ఏర్పాటు అనంతరం అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఎదుట చిన్న కలశం ఏర్పాటుచేయాలి. కలశంలో నీరు పోసి పసుపు, ఒక నాణెం వేయాలి. అనంతరం పైన మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి కొబ్బరికాయ ఉంచాలి. కలశం లేకున్నా అమ్మవారి ఫొటోతో కూడా పూజ చేయవచ్చు. వినాయక పూజ ఏ పూజలో అయినా కూడా మొదట వినాయకుడిని పూజించడం సంప్రదాయం. అదే మాదిరి వరలక్ష్మీ వ్రతం ప్రారంభానికి ముందుగా వినాయకుడిని పూజంచాలి. అనంతరం వరలక్ష్మి అమ్మవారిలి అవాహన చేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మి నమః అని భక్తితో

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్‌కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి

ఎస్బీఐ ఖాతాదారులు తప్పక తెలుసుకోండి అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త రూల్ అమల్లోకి 4 సార్లకు మించి డబ్బులు తీస్తే ఛార్జీలు తప్పవు డిజిటల్ క్యాష్ ట్రాన్సాక్షన్లపై కూడా బాదుడే SBI Cash Withdrawals : మీకు ఎస్బీఐలో ఖాతా ఉందా? అది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్ అయితే ఇది మీకోసమే.. ఇకపై నెలలో 4 సార్లు డబ్బులు ఫ్రీగా తీసుకోవచ్చు. కానీ, ఆ లిమిట్ దాటితే మాత్రం ఛార్జ్ తప్పదు. అక్టోబర్ 1, 2026 నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు BSBD ఖాతాదారులకు నెలకు 4 ఫ్రీ క్యాష్ విత్ డ్రా లిమిట్స్ ఉన్నాయి. ఈ నాలుగు లావాదేవీల వరకు ఎలాంటి ఛార్జీ పడదు. కానీ, ఐదోసారి డబ్బులు విత్‌డ్రా చేస్తే మాత్రం ప్రతి లావాదేవీకి రూ.15తో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అసలు ట్విస్ట్ ఇదే.. : ఇప్పటివరకు డిజిటల్ ఛానల్స్ ద్వారా చేసే క్యాష్ విత్ డ్రా అనేది ఈ 4 ఫ్రీ లావాదేవీల్లో లెక్కలోకి వచ్చేవి కావు. ఇకపై మాత్రం అలా ఉండదు. ఏటీఎంలో చేసే విత్‌డ్రాయల్స్‌తో పాటు డిజిటల్ ఛానల్స్ ద్వారా చేసే క్యాష్ విత్‌డ్రాయల్స్ కూడా 4 లావాదేవీల లిమిట్లోకి వస్తాయి. Read Also : Hyderabad Traffic Alert : వాహనదారులు ఇక తప్పించుకోలేరు.. ఈ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కేసులే..! అంటే.. మీరు ఒక నెలలో ఏటీఎం నుంచి రెండుసార్లు డబ్బులు తీసుకున్నారని అనుకుందాం. మరో 2 సార్లు డిజిటల్ (యూపీఐ ) విత్ డ్రా ద్వారా క్యాష్ తీసుకుంటే 4 లావాదేవీలు పూర్తవుతాయి. ఆ తర్వాత చేసే ఐదో విత్‌డ్రాయల్‌కు ఛార్జ్ పడుతుంది అనమాట. ఇలా నెలలో అవసరానికి మించి చిన్న మొత్తాల్లో డబ్బులు డ్రా చేసే అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండి. లేదంటే ఖర్చు భారీగా

దేవుని పూజలో దీపంతో పాటు అగరబత్తులు (ధూపం) వెలిగించడం మన సనాతన ధర్మంలో పూర్వకాలం నుండి వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. పూజా సమయాల్లో అగరబత్తి నుంచి వచ్చే పరిమళభరితమైన సువాసన ఇల్లంతా వ్యాపించి, పూజా గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని నింపుతుంది. అంతేకాకుండా మనస్సులోని ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. అయితే, దేవుని ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. రోజువారీ పూజలో ఒకటి లేదా రెండు అగరబత్తులు వెలిగిస్తే సరిపోతుంది. పూజలో సంఖ్య కంటే మనస్సులోని నిశ్చలమైన భక్తి, శుద్ధత మాత్రమే అత్యంత ముఖ్యం. దేవుడి అనుగ్రహం పొందడానికి ఎక్కువ సంఖ్యలో అగరబత్తులు లేదా బాహ్య ఆడంబరాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఎక్కువ వెలిగిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? ఎక్కువ సంఖ్యలో అగరబత్తులు వెలిగిస్తేనే ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఎక్కడా పేర్కొనలేదు. మోతాదుకు మించి వెలిగించడం వల్ల అధిక పొగ , ఇంటి వాతావరణం మసకబారడమే కాకుండా శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఏదైనా మితంగా ఉపయోగించడమే శ్రేయస్కరం. ఆధ్యాత్మికంగా, అగరబత్తి సువాసన మనస్సును ఏకాగ్రత వైపు మళ్లించి, ధ్యానం లేదా జపంలో నిమగ్నమవ్వడానికి సహాయపడుతుంది. అలాగే పరిసరాల్లోని ప్రతికూల (నెగెటివ్) శక్తులను తొలగించి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అగరబత్తులను నేలపై కాకుండా ఎల్లప్పుడూ సురక్షితమైన, స్థిరమైన స్టాండ్‌లోనే అమర్చి వెలిగించాలి. అగరబత్తి వెలిగించిన తర్వాత దాని మంటను ఆర్పేసి, కేవలం పొగ (ధూపం) మాత్రమే వచ్చేలా చూడాలి. వెలిగించిన అగరబత్తులను ఎప్పుడూ అజాగ్రత్తగా వదిలేయకూడదు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఘాటైన రసాయనాలు (కెమికల్స్), అధిక పొగను వెలువరించే అగరబత్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. సహజసిద్ధమైన మూలికలతో తయారైన వాటిని ఎంచుకోవడం మంచిది. పూజలో దీపారాధనతో పాటు అగరబత్తి వాడటం శుభప్రదమే అయినప్పటికీ, అగరబత్తి వెలిగించడం తప్పనిసరి నియమమేమీ కాదు. ఒకవేళ అది

Hardik Pandya: ఐపీఎల్ 2027 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు ట్రేడ్ చేసే అవకాశం ఉందంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ముంబై ఇండియన్స్ తమ అధికారిక ఖాతాలో హార్దిక్ పాండ్యా నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి విశ్లేషణలు మొదలు పెట్టారు. ఒక వర్గం ఈ పోస్ట్ ద్వారా పాండ్యాను జట్టులోనే ఉంచుకుంటున్నారని భావిస్తుంటే, మరో వర్గం మాత్రం ఇది కేవలం వీడ్కోలుకు ముందు ఇస్తున్న సంకేతమని కామెంట్లు పెడుతోంది. ముంబై జట్టుతో హార్దిక్ ప్రయాణంలో హెచ్చుతగ్గులు 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా, 2022 సీజన్ నాటికి గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వెళ్లి తొలి ఏడాదిలోనే ట్రోఫీ సాధించిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఆయనకు ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 2024 సీజన్లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో తీవ్రంగా నిరాశపరిచింది. తర్వాతి ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 2 వరకు వెళ్లినప్పటికీ 9వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాల నేపథ్యంలో కెప్టెన్‌గా హార్దిక్ స్థానంపై నిరంతరం అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! ట్రేడింగ్ రూల్స్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ఆటగాళ్లను బదిలీ చేసే ప్రక్రియపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పత్రిక మిడ్-డేకి రాసిన కథనంలో ఆయన ఐపీఎల్ ట్రేడింగ్ పారదర్శకతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు

ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ ఖాతా ఉందా? అయితే అక్టోబర్ 1 నుంచి నగదు తీసుకునేటప్పుడు లెక్క చూసుకోవాల్సిందే. నెలలో నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఐదోసారి తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఈ కొత్త నిబంధన సాధారణ సేవింగ్స్ ఖాతాలన్నింటికీ కాదు. ఎస్బీఐ ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్’ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది.నాలుగు ఉచిత నగదు ఉపసంహరణల్లో ఎస్బీఐ ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలు, బ్యాంకు శాఖలు, ఏఈపీఎస్ ద్వారా తీసుకునే నగదు కూడా లెక్కలోకి వస్తుంది. మొత్తం నాలుగు సార్లు ఉచితంగా తీసుకున్న తర్వాత, అదే నెలలో మరోసారి నగదు తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్టీ వసూలు చేస్తారు.కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఇప్పటివరకు నాలుగు ఉచిత లావాదేవీల లెక్కలో డిజిటల్ లావాదేవీలకు మినహాయింపు ఉండేది. తాజా మార్పుతో ఆ మినహాయింపును తొలగించారు. దీంతో బీఎస్‌బీడీ ఖాతాదారులు నెలవారీ లావాదేవీలపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.బీఎస్‌బీడీ ఖాతాకు కనీస నిల్వ నిబంధన లేదు. చెక్‌బుక్ సదుపాయం ఉండదు. రూపే ఏటీఎం-కమ్ డెబిట్ కార్డు ఉచితంగా ఇస్తారు. ఈ ఖాతా ఉన్నవారు ఎస్బీఐలో మరో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండరాదని బ్యాంకు స్పష్టం చేసింది

డిజిటల్ మోసాలు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికాం విభాగం (డీఓటీ) కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డుల జారీ, వినియోగంపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా, ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలన్న నిబంధనను పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 17న టెలికాం కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది.ఈ నూతన నిబంధనల అమలు కోసం 'డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్' (డీఐపీ) అనే ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎవరైనా తొమ్మిది సిమ్ కార్డుల పరిమితిని మించితే, వారి ఫొటోను ఈ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారు. ఆగస్టు 23 నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. టెలికాం కంపెనీలు కొత్త సిమ్ జారీ చేసే ముందు కస్టమర్ ఫొటోను ఈ డీఐపీ డేటాతో తప్పనిసరిగా సరిపోల్చుకోవాలి. ఒకవేళ పరిమితికి మించి సిమ్ కార్డులు ఉన్నట్లు తేలితే, సదరు వ్యక్తికి కొత్త సిమ్ జారీని నిరాకరించాలి.ఆగస్టు 24 నుంచి టెలికాం ఆపరేటర్లు ఈ డీఐపీ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు నవీకరించాల్సి ఉంటుంది. నవంబర్ 30 నాటికి ఈ ప్రక్రియ అంతా రియల్ టైమ్‌లో పనిచేసేలా చూడాలని డీఓటీ స్పష్టం చేసింది. నిర్ణీత పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారులు వాటిని స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని సూచించింది. లేనిపక్షంలో, సంబంధిత టెలికాం కంపెనీలే వాటిని నిలిపివేస్తాయి.ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం 'సంచార్ సాథీ'

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదయం 8 నుంచి రాత్రి ఒంటిగంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7.1 సౌండ్, 2K/4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ వర్తించనుంది. ప్రతి థియేటర్లో 25 శాతం నాన్-ప్రీమియం సీట్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 నుంచి రాత్రి ఒంటిగంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. చిన్న సినిమాలకు ప్రతి రోజు ఒక షో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. రూ.100 కోట్లు పైబడిన సినిమాలకు ప్రభుత్వం సూపర్ హైబడ్జెట్ హోదా కల్పించింది. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత శాతాన్ని కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని షరతు పెట్టింది. కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి వరకు విరాళం తప్పనిసరి చేసింది. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి రాయదుర్గం పోలీసులకు.. రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు

భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపు ద్వారా అదనంగా వచ్చే వసూళ్లలో 20 శాతం మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ)కు ఇవ్వాలని ఆదేశించింది.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 'పెద్ది', 'రాజాసాబ్', 'మనశంకర వరప్రసాద్ గారు', 'అఖండ 2' వంటి చిత్రాలకు ఇది వర్తించనుంది. ఈ సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్లో 20 శాతాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో పాటు, టీజీఎఫ్డీసీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.ఈ 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల (థియేటర్ల యజమానులు) నుంచి వసూలు చేసి, సంబంధిత ఖాతాల్లో జమ చేయాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇటీవల విడుదలైన భారీ చిత్రాలతో పాటు భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది
SBI Basic Savings Bank Deposit Account: భారతదేశంలోనే అతిపెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు సంబంధించి సర్వీస్ ఛార్జీల్ని సవరించింది. బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎంల ద్వారా కలిపి నగదు విత్‌డ్రాలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2026, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఇక మీదట ప్రతి నెలలో 4 ఉచిత నగదు విత్‌డ్రా (బ్యాంకులు, ఏటీఎంలు) లావాదేవీలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 15 ఛార్జ్ ప్లస్ జీఎస్టీ విధిస్తామని వెల్లడించింది.అయితే అంతకుముందు కూడా 4 ఉచిత లావాదేవీల తర్వాత రూ. 15 ఛార్జ్ ఉన్నప్పటికీ, అప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దీని పరిధిలోకి రాలేదు. ఇప్పుడు ఆ మినహాయింపు లేదు. మునుపటిలా కాకుండా డిజిటల్ లావాదేవీలను కూడా ఇప్పుడు ఈ ఉచిత లావాదేవీల పరిమితిలోనే చూస్తారు. అంటే బ్రాంచ్, ఏటీఎం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి ఉచిత క్యాష్ విత్‌డ్రా పరిమితి 4 లావాదేవీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి?ఈ ప్రాథమిక పొదుపు ఖాతాలు (బేసిక్ సేవింగ్స్ అకౌంట్) అనేవి సాధారణంగా సమాజంలో పేద వర్గాల కోసం ఉద్దేశించినవి. ఎలాంటి అదనపు ఫీజులు, ఛార్జీల భారం లేకుండా వారికి పొదుపును ప్రారంభించేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కింద ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటెయన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఛార్జీలు పడవు. చెక్ బుక్ ఫెసిలిటీ ఉండదు. బ్యాంక్ బ్రాంచులు లేదా ఏటీఎంల ద్వారా మాత్రమే నగదు విత్‌డ్రాకు ఛాన్స్ ఉంటుంది. బేసిక్ రూపే ఏటీఎం- కమ్- డెబిట్ కార్డును అకౌంట్ హోల్డర్‌కు ఇస్తారు. నెలకు నాలుగు ఉచిత క్యాష్

భారతీయులు ఒకప్పుడు కలగా భావించిన అమెరికా ప్రయాణాలు, అక్కడి వీసాలు, గ్రీన్ కార్డుల్ని ట్రంప్ సర్కార్ రానురానూ మరింత కఠినంగా మార్చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులు, ఇతర వలసదారులకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా తీసుకొస్తున్న గ్రీన్ కార్డు నిబంధనల్ని (US Green Card Rules) ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 18 నుండి అమలులోకి రానున్నాయి. దీని ప్రభావం పర్మనెంట్ రెసిడెన్సీ దరఖాస్తులపై తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ సాయం పొందుతున్న వలసదారులకు కష్టాలు తప్పవు.తాజా గ్రీన్ కార్డ్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే స్టేటస్ అడ్జస్ట్మెంట్ దరఖాస్తులకు (ఫారం ఐ-485) మాత్రమే కొత్త మార్గదర్శకాలు వర్తింపజేస్తారు. గడువు ముగిసిన తర్వాత పాత వెర్షన్ ఫారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు స్వీకరించరు. దరఖాస్తుదారుల వయస్సు, ఆరోగ్య స్థితి, నిధులు, విద్య, విభిన్న నైపుణ్యాల ఆధారంగా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు. వలసదారులు తమ స్వయం సమృద్ధిని నిరూపించుకోవడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. ఈ సవరణల వల్ల పబ్లిక్ ఛార్జ్ పరిధి చాలా విస్తృతంగా మారనుంది. సెప్టెంబర్ 18 తర్వాత వలసదారులు పొందే ప్రభుత్వ ప్రయోజనాలు వారి అర్హతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. US వెళ్లాలనుకునే భారతీయులకు షాక్: EB-1 గ్రీన్ కార్డ్ దక్కడం కష్టమేనా?గతంలో తెచ్చిన నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ నగదు రూప సహాయం, వైద్య సంస్థలలో దీర్ఘకాలిక చికిత్స వంటి వాటిని మాత్రమే దీనికి పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇకపై హౌసింగ్ అసిస్టెన్స్, ఫుడ్ స్టాంప్స్, కాలేజీ చదువుల కోసం ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కూడా దరఖాస్తు తిరస్కరణకు ప్రాతిపదికగా మార్చనున్నారు. కుటుంబ ఆధారిత వలసల విషయంలో స్పాన్సర్ల అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ (ఫారం ఐ-864) మరింత కీలకంగా మారింది. గ్రీన్ కార్డ్ పొందే వ్యక్తికి పూర్తి

అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే కీలక మార్పులు రాబోతున్నాయి. 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనను పునరుద్ధరిస్తూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆర్థిక స్థితి, వారు పొందిన ప్రభుత్వ ప్రయోజనాలపై అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. ఇది గ్రీన్ కార్డ్ ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చనుంది.యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఈ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. దీని ప్రకారం.. దరఖాస్తుదారులు ప్రభుత్వ గృహ వసతి సహాయం (హౌసింగ్ అసిస్టెన్స్), ఫుడ్ స్టాంప్స్, కళాశాల విద్యకు ఆర్థిక సహాయం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందితే, వారి దరఖాస్తులను పరిశీలించేటప్పుడు అధికారులు ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. భవిష్యత్తులో వారు ప్రభుత్వానికి భారం (పబ్లిక్ ఛార్జ్) అయ్యే అవకాశం ఉందా? లేదా? అని అంచనా వేస్తారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో 2022లో తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేస్తూ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ కొత్త తుది రూల్‌ను జులై 16న ప్రకటించింది.సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత పోస్ట్‌మార్క్ చేయబడిన లేదా ఆన్లైన్లో సమర్పించిన గ్రీన్ కార్డ్ (ఫారం I-485) దరఖాస్తులకు ఈ కొత్త, కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి. అయితే, 2022 డిసెంబర్ 23 నుంచి 2026 సెప్టెంబర్ 17 మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి పాత (2022)

ఇంటి అద్దెను యూపీఐ లేదా ఇతర ఆన్లైన్ మార్గాల్లో చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించి.. బిల్లును ఆలస్యంగా రీపేమెంట్ చేస్తే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. అందరూ డిజిటల్ చెల్లింపులకే అలవాటు పడ్డారు. కారు దగ్గర నుంచి కాఫీ వరకు ఏది కొనాలన్న నగదు రహిత లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారు. ఇంటి అద్దెను కూడా ఆన్లైన్లో చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆన్లైన్లో అద్దె చెల్లించినంత మాత్రాన క్రెడిట్ స్కోరుకు వాటిల్లే ముప్పేమీ లేదని, కానీ ఈ చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక ప్రవర్తన స్కోరుపై ప్రభావం చూపుతుందని రెంటన్పే సీఈఓ సారిక శెట్టి తెలిపారు. ఒకవేళ అద్దెను క్రెడిట్‌పై తీసుకుని కడితే, దాన్ని సక్రమంగా తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే క్రెడిట్ స్కోరుపై దెబ్బపడుతుందని చెప్పుకోచ్చారు. కొంతమంది నెలవారీ అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించడం వల్ల అద్దె మొత్తం కార్డు బకాయిలో చేరుతుంది. ఆ మొత్తాన్ని గడువులోగా పూర్తిగా చెల్లించకుండా వాయిదా వేస్తే వడ్డీ, ఇతర ఛార్జీలు పెరగడంతో పాటు క్రెడిట్ వినియోగం కూడా పెరగవచ్చు. అధిక క్రెడిట్ వినియోగం, రీపేమెంట్లో ఆలస్యం లేదా మిస్డ్ పేమెంట్లు సిబిల్ స్కోర్(CIBIL)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ అమౌంట్ మాత్రమే చెల్లించడం వల్ల ఆ నెల చెల్లింపు పూర్తయినట్టుగా భావించకూడదు. మిగిలిన బకాయిపై వడ్డీ, ఇతర ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. సిబిల్(CIBIL) కూడా సకాలంలో, పూర్తి చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. అందువల్ల అద్దె కోసం క్రెడిట్ కార్డును తరచూ ఉపయోగించే వారు ప్రతి నెలా వచ్చే

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం నీటిపాలు కాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఆట పూర్తి కాకుండా ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. భారత్ గెలుపునకు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, లేదా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోరు. వికెట్లు లేదా పరుగులు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆట పూర్తవ్వకపోతే విజేతను ప్రకటించే అవకాశం ఐసీసీ నిబంధనల్లో లేదు. ఫలితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా నీరుగారిపోతాయి. ఇది కూడా చదవండి: Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి? చరిత్రలో లేని రికార్డును శ్రీలంక అందుకుంటుందా? గాలే మైదానంలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 342 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. ఆ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. సొంత మైదానంలో శ్రీలంక ఇప్పటివరకు 300 పరుగుల మార్కును కూడా విజయవంతంగా ఛేజ్ చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక, గెలువడానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో వేలాది మంది నాన్ అమెరికన్లు ఓటు వేశారంటూ ఆయన తాజా వాదనను తెరపైకి తెచ్చారు. యూఎస్ సెన్సస్ బ్యూరో ఓటర్ల రికార్డులను పౌరసత్వ వివరాలతో సరిపోల్చినప్పుడు ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ పరిణామం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.దీనికి సంబంధించిన వివరాలను తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు ట్రంప్. యూఎస్ సెన్సస్ బ్యూరో ఇప్పటివరకు సుమారు 128,000,000 మంది ఓటర్ల రికార్డులను వారి పౌరసత్వ వివరాలతో సరిపోల్చి చూసిందని, ఈ ప్రాథమిక తనిఖీల్లోనే 24,000 మందికి పైగా నాన్ అమెరికన్లు చట్టవిరుద్ధంగా 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసినట్లు నిర్ధారణ అయిందని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందనీ చెప్పారు.రానున్న రోజుల్లో ఓటర్ల వివరాల విశ్లేషణను మరింత వేగవంతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సెన్సస్ బ్యూరో త్వరలోనే మరో 32,000,000 కోట్ల మంది ఓటర్ల రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించనుందని వెల్లడించారు. ఆ తదుపరి ప్రక్రియ కూడా పూర్తయితే అక్రమ ఓట్ల సంఖ్య ఊహించని రీతిలో భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవన్నీ కూడా బయటపడితే 2020 నాటి ఎన్నికలలో తానే గెలిచినట్టవుతుందని వ్యాఖ్యానించారు.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండియూఎస్ ఓటింగ్ ప్రక్రియలో కఠినమైన సంస్కరణలు, గుర్తింపు నియమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ పనితీరును సైతం ఆయన ప్రశంసించారు.భారత్ లో ఓటర్ ఐడీ తప్పనిసరిగా ఉండటాన్ని ఆదర్శంగా పేర్కొన్నారు. అమెరికన్ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకునే ముందు ఖచ్చితమైన ఫోటో గుర్తింపు కార్డులను చూపించేలా నిబంధనలను తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారు ట్రంప్.తెలంగాణలో రెండు రోజుల్లో

ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ, ఇతర రుణాలు తీసుకున్న వారికి 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. వడ్డీ రేట్ల మార్పులను మరింత వేగంగా రుణగ్రహీతలకు వర్తింపజేసేందుకు కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. అయితే, ఈ ప్రతిపాదనల వల్ల మీ నెలవారీ ఈఎంఐపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని గమనించాలి. ప్రస్తుతం ఇది కేవలం ముసాయిదా దశలోనే ఉంది.ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు 2026 సెప్టెంబర్ 11 వరకు గడువు విధించారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే, 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీనివల్ల వడ్డీ రేట్ల కోత లేదా పెంపు ప్రభావం రుణగ్రహీతలపై చాలా వేగంగా పడనుంది.ప్రతి 3 నెలలకు వడ్డీ రేట్ల సవరణప్రస్తుతం చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సవరిస్తున్నాయి. దీనివల్ల ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా, దాని ప్రయోజనం వినియోగదారులకు చేరడానికి కొన్ని నెలల సమయం పడుతోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను గరిష్ఠంగా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. అంటే.. రెపో రేటు తగ్గితే ఆ ప్రయోజనం త్వరగా అందుతుంది, అదే సమయంలో రేటు పెరిగితే ఆ భారం కూడా అంతే వేగంగా పడుతుంది.ఛాయిస్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "తక్షణమే వడ్డీ రేటు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. TGSRTC Changes Bus Routes: కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఫ్లైఓవర్ అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ నియంత్రించడానికి ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఈ మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో మళ్లింపులు చేపట్టారు. కీలకమైన ప్రాంతాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మైక్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిన్న ఈ వన్-వే విధానం గురించి తెలియక చాలా మంది వాహనదారులు తమ ఆఫీసులకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈరోజు నుంచి వాహనదారులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మళ్లింపులు చేపట్టడమే కాకుండా బస్సు రూట్లను కూడా మార్చారు. కాబట్టి జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45 వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ రూట్లను ముందుగానే గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ బస్సు మార్గాల్లో కీలక మార్పులు చేస్తూ, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ పరిసరాల్లోని బస్టాపులను కూడా మార్చింది. బస్ నంబర్ 47L రూట్.. సికింద్రాబాద్ లేదా జూబ్లీ బస్ స్టాండ్ నుండి మణికొండకు వెళ్లే ఈ 47L బస్సు.. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, నాగార్జున సర్కిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో హాస్పిటల్, ఫిల్మ్ నగర్, దర్గా, మణికొండకు చేరుతుంది. తిరిగి వచ్చే సమయంలో మణికొండ నుంచి పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్