మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడి అంటే రెండు ముడులు ఉన్నదని అర్థం. ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి, పూర్తిగా నెయ్యితో నింపుతారు. అలాగే పూజా సామాగ్రి పెడతారు. రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావాల్సిన బియ్యం పప్పు, పసుపు, కుంకుమ, రవికలను పెడతారు. ఈ రెండూ భక్తి, శ్రద్ధలకు సంకేతంగా భావిస్తారు.
‘భక్తి’, ‘శద్ధ’అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండ భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో, అక్కడ ఓంకారం ఉంటుందని, అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారమనే తాడుతో బిగిస్తారు. భక్తి, శ్రద్ధలతో సాధనతో పొందితే అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.
ఇరుముడిలోని ఒక భాగంలో స్వామివారికి సంబంధించిన సామాగ్రిని ఉంచుతారు. రెండో భాగంలో కొబ్బరికాయలోని నీళ్లను తొలగించి, అందులో ఆవునెయ్యిని నింపుతారు. జీవుని ఆత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యం అని పండితులు చెబుతారు. దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో, అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి. ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్టేనని పండితులు చెబుతున్నారు. అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజులు ముందే మద్యం, మాంసం వంటి వాటి జోలికి వెళ్లకూడదు.
శబరిమలకు ఇరుముడితో వెళ్లే అయ్యప్ప భక్తులు ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు మీద ఒక్కోమాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. తొలి 5 మెట్లు పంచేంద్రియాలకు ప్రతీకగా, తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా, ఆ తర్వాత 3 మెట్లను సత్యం, తామసం, రాజసానికి సూచనగా, చివరి రెండు మెట్లను విద్య, అవిద్యగా పరిగణిస్తారు. ఇరుముడిని కట్టుకునేటప్పుడు, ఇరుముడి తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి




