
దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే లక్షలాది మంది చిన్న వ్యాపారులకు త్వరలోనే పెద్ద సమస్య వచ్చిపడేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రీ-కేవైసీ (Re-KYC) గడువు సెప్టెంబర్ 15తో ముగియనుండటమే దీనికి కారణం. నిర్ణీత సమయంలోగా కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే క్యూఆర్‌ కోడ్స్ , సౌండ్‌బాక్స్‌ల ద్వారా జరిగే పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందనే వార్తలు పేమెంట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పేమెంట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. వీధుల్లో, చిన్న చిన్న షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్‌లు వాడే ఆఫ్‌లైన్ చిన్న వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా, ఆన్‌లైన్‌లో చిన్న వ్యాపారాలు చేసుకునే మరో పది లక్షల మంది కూడా తమ అకౌంట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడంలో వెనుకబడి ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, విదేశీ పేమెంట్ సేవలు అందించే అన్ని కంపెనీలు సెప్టెంబర్ 15, 2026 నాటికి తమ వ్యాపారుల అందరి రీ-కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చిల్లర కొట్టు యజమానులకే అసలు కష్టం!ఈ కేవైసీ నిబంధనల వల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టు యజమానులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్‌బీఐ అడిగే డాక్యుమెంట్స్ వీరిలో చాలామంది దగ్గర లేకపోవడం, అలాగే ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సౌండ్‌బాక్స్ వాడుతున్న వారిలో 85-90 శాతం మంది కేవైసీ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం క్యూఆర్ కోడ్ బోర్డులు మాత్రమే వాడే చిన్న వ్యాపారులే దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేలా ఉన్నారు.RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు విలవిల..కంపెనీలకు సిబ్బంది కొరత!మరోవైపు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి ప్రధాన పేమెంట్ రంగానికి చెందిన సంస్థలకు ఈ కేవైసీ ప్రక్రియ పెద్ద సవాలుగా మారింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ ఏజెన్సీలతో కాకుండా తమ సొంత ఉద్యోగులతోనే నేరుగా కేవైసీ పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో కొత్త సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తోంది. దీంతో సమయానికి పనులు పూర్తి చేయడం పేమెంట్ అగ్రిగేటర్లకు కత్తిమీద సాములా మారింది. గడువు తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఏమైనా ఉపశమనం ఇస్తుందో లేదో వేచి చూడాలి.





