
Bank Rules: ఒకేబ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?
Bank Rules: ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?
© 2026 nimisham.in

Bank Rules: ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండవచ్చా? లాభనష్టాలు ఏంటి?

Canara Bank: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. ఏటీఎం సేవల ఛార్జీలు పెంపు.. కొత్త నిబంధనలు ఇవే!

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి... బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

HDFC బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వడ్డీ రేటును పెంచింది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీని 0.10 శాతం పెంచింది. గతంలో ఈ కాలపరిమితిలో సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభించేది. ఇప్పుడు దానిని 7.10 శాతానికి పెంచారు. ఈ కొత్త రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం. HDFC బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు FD కాలపరిమితిని బట్టి 3.25 శాతం నుంచి గరిష్టంగా 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FDలపై 6.65 శాతం వడ్డీ అందుతోంది. సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ కూడా రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు అందుతున్న కొన్ని ముఖ్యమైన FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 నుంచి 29 రోజులకు 3.50%గా ఉండగా, 30 నుంచి 45 రోజులు 3.75%, 46 నుంచి 90 రోజులకు 4.75%, 91 నుంచి 180 రోజులకు 5%, 181 రోజులకు 6.50%, ఏడాదికి 6.75%, 1 సంవత్సరం కంటే ఎక్కువ నుంచి 15 నెలల లోపు 6.90%, 15 నెలలకు గాను 7.15%, 15 నుంచి 24 నెలలకు 6.90%, 24 నెలల కంటే ఎక్కువ నుంచి 48 నెలల లోపు పెట్టుబడికి 7%, 48 నెలలకు 7.20% వడ్డీ లభిస్తుంది. అదే 48 నెలల కంటే

ప్రపంచంలో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. 2016లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కొత్తగా 5, 10 పౌండ్ల పాలిమర్ నోట్లను విడుదల చేసింది. అయితే వాటి తయారీలో ఉపయోగించిన పదార్థాల్లో టాలో (Tallow)కు సంబంధించిన అంశాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. టాలో అంటే సాధారణంగా మాంసం, ముఖ్యంగా పశువుల కొవ్వు నుంచి లభించే కొవ్వు పదార్థం. ఈ విషయం బయటకు రావడంతో బ్రిటన్‌లోని కొన్ని శాఖాహార సంఘాలు, హిందూ, సిక్కు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై పెద్ద చర్చ జరిగింది. పాలిమర్ నోట్లను తొలిసారిగా పెద్ద స్థాయిలో ప్రవేశపెట్టిన దేశాల్లో ఆస్ట్రేలియా ముందుంది. 1988లో అక్కడ పాలిమర్ కరెన్సీ నోట్ల వినియోగం ప్రారంభమైంది. ప్రారంభ దశలో వాటి తయారీకి ఉపయోగించిన కొన్ని పదార్థాల్లో జంతువుల నుంచి లభించే కొవ్వు ఆధారిత సమ్మేళనాలు ఉన్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా పాలిమర్ కరెన్సీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో జంతువుల కొవ్వు ఆధారిత పదార్థాల ఉనికిపై చర్చ జరిగింది. అయితే నోట్లలో నేరుగా జంతువుల కొవ్వును కలుపుతారని అర్థం చేసుకోవడం సరికాదు. తయారీ ప్రక్రియలో ఉపయోగించే కొన్ని రసాయన పదార్థాల్లో జంతువుల కొవ్వు నుంచి వచ్చిన భాగాలు ఉండే అవకాశం ఉంటుంది. పాలిమర్ నోట్ల తయారీలో పలుచటి ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తారు. ఈ షీట్లకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండటంతో అవి ఒకదానికొకటి అతుక్కోవడం, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. వీటిని నియంత్రించేందుకు తయారీ ప్రక్రియలో కొన్ని రకాల స్లిప్ ఏజెంట్లు, యాంటీ స్టాటిక్ ఏజెంట్లు ఉపయోగిస్తారు. వీటిలో స్టియరిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉండొచ్చు. స్టియరిక్ యాసిడ్ వివిధ వనరుల నుంచి తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో దీనిని జంతువుల కొవ్వు నుంచి కూడా ఉత్పత్తి చేస్తారు. అందుకే కొన్ని పాలిమర్ కరెన్సీల ముడి

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల పరిమితిని తగ్గించింది. ఇదే కాకుండా సేవింగ్స్ అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ లేకుండా విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఈ కొత్త ఛార్జీలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. ఖాతాదారులు దీనిని గమనించాలని, ఇందుకనుగుణంగా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో కెనరా బ్యాంక్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెనరా బ్యాంక్ ఏటీఎంలో ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి ఆరుగా ఉండేది. ఇప్పుడు దానిని 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు కేవలం ఐదు లావాదేవీలు మాత్రం ఏటీఎంలలో ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైబడి చేస్తే ఛార్జీలు కట్ అవుతాయి. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటిని కూడా ఉచిత పరిమితిలో చేర్చారు. ఉచిత లావాదేవీల తర్వాత అకౌంట్లో డబ్బులు లేకపోయినా విత్ డ్రాకు ప్రయత్నిస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది ఏటీఎంలో ఉచిత లావాదేవీల తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఇప్పటివరకు ఇది రూ.20గా ఉండగా.. ఇప్పుడు మరో రూ.3 పెంచారు. అయితే సీనియర్ సిటిజన్లు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటాక వారికి ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది. సీనియర్ సిటిజన్ల లావాదేవీల పరిమితి ఎప్పటిలాగే ఉంచింది. ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్

న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. మంగళవారం ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. క్వీన్స్‌కు చెందిన ఓ 49 ఏళ్ల మహిళ టైమ్స్ స్క్వేర్ వద్దకు రెండు కత్తులతో వచ్చి అక్కడున్న ఎరిన్‌తో పాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటనలో ఎరిన్ కన్నుమూశారు. తీవ్రగాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న ఎరిన్ ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు. ఇంతలో అనూహ్యంగా ఆమె మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎరిన్ మృతిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్‌లో రెండో అతిపెద్ద బ్యాంకు అన్న విషయం తెలిసిందే. కత్తులతో దాడికి పాల్పడ్డ మహిళ కూడా పోలీసు కాల్పుల్లో కన్నుమూసింది. ఆమెను పామెలా సిస్నెరోస్‌గా (49) పోలీసులు గుర్తించారు. పామెలాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు తెలిపారు. గతంలో ఓసారి ఆమెపై ఫిర్యాదు వచ్చినా కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. పామెలా దశాబ్దాలుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె సోదరుడు చెప్పాడు. అయితే, ఇప్పటివరకూ ఏనాడు ఆమె హింసాత్మక ధోరణి కనబరచలేదని అన్నాడు. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. నేపాల్‌ను వణికిస్తున్న వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం
ATM Charges Hike: ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ (Canara Bank) తమ ఖాతాదారులకు సడెన్ షాక్ ఇచ్చింది. తమ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలు పెంచింది. అలాగే నెలవారీ ఏటీఎం విత్ డ్రాయల్ ఉచిత లావాదేవీల పరిమితులను తగ్గించింది. వీటితో పాటు పొదుపు ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ లేనప్పుడు విత్ డ్రాయల్‌కు ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. సవరించిన ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1, 2026 నుంచే అమలులోకి తెచ్చినట్లు వెల్లడించింది.కెనరా బ్యాంక్ కొత్త ఛార్జీలు ఇలా.. కెనరా బ్యాంక్ ఏటీఎంలలో నెలకు లభించే ఉచిత లావాదేవీల పరిమితి ఇప్పటి వరకు 6 ట్రాన్సాక్షన్లుగా ఉండగా దానిని 5కు తగ్గించారు. అంటే 5 ట్రాన్సాక్షన్ల తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఫైనాన్షియల్, నాన్- ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అన్నింటికీ ఈ లిమిట్ వర్తిస్తుంది. బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ వంటివి చేసిన ట్రాన్సాక్షన్ గానే లెక్కిస్తారు. ఏటీఎం (ATM)లో నగదు ఉపసంహరణ చేయడానికి ప్రయత్నించినప్పుడు సేవింగ్స్ అకౌంట్లో సరిపడా డబ్బులు లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే భారీగా పెనాల్టీ పడనుంది. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఇలా ఫెయిల్ అయితే ఇప్పటి వరకు రూ.17 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుండగా ఈ పరిమితిని రూ.23 ప్లస్ జీఎస్టీకి పెంచారు. నెలవారీ ఉచిత లిమిట్ దాటిన తర్వాత నగదు విత్ డ్రాయల్స్ (ICCW, UPI క్యాష్ విత్ డ్రాయల్స్తో సహా) చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ GST ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు రూ.20 ఛార్జీ వసూలు చేసే వారు. అయితే, సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ ఊరట కల్పించింది. ఏటీఎంలలో నెలకు లభించే ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. నెలకు 8 ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. పరిమితి దాటిన తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.5

భారత్ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు మరో దేశానికి పాఠంగా మారే స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. భారత్ సాధించిన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకునే అవకాశాలు పెరిగాయని చెప్పారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో భారత్ పొందే స్థానం కూడా కీలకమని బంగా చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధార్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏర్పడిన డిజిటల్ వ్యవస్థను ఇతర దేశాలు అధ్యయనం చేయవచ్చని చెప్పారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రపంచానికి ఉపయోగపడే మరో నమూనా అని అన్నారు.తాను ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పర్యటించినప్పుడు చిన్న రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్స్ అందించేందుకు సహకార సంఘాలు, గూగుల్, ప్రపంచ బ్యాంకు కలిసి పనిచేస్తున్న విధానాన్ని చూశానని బంగా తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఈ సేవలను పెద్ద సంఖ్యలో రైతులకు చేరువ చేయడం మంచి ప్రయత్నమని చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిజిటల్ వ్యవస్థలతో ప్రాంతీయ ఆసుపత్రులు, వైద్యులతో అనుసంధానించవచ్చని ఆయన వివరించారు. భౌతిక మౌలిక వసతులు, విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, నియంత్రణ సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ వంటి రంగాల్లో భారత్‌తో

అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు. ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఆయనే మసయోషి సన్. సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు. జపాన్‌లో ఉంటున్న సన్‌కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్

నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. ఇంటర్నెట్ డెస్క్: నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. జీతం స్లిప్‌లు లేకపోయినా క్రెడిట్ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు కేవలం శాలరీ స్లిప్‌నే కాకుండా ఆదాయం, బ్యాంకింగ్ చరిత్ర, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తాయి (Credit card without salary slip). క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకుకు ప్రధానంగా కావాల్సింది కార్డు బిల్లులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? అన్నదే. అందుకే ఉద్యోగులకు శాలరీ స్లిప్ సాధారణ ఆదాయ ఆధారంగా ఉపయోగపడినప్పటికీ, స్వయం ఉపాధి పొందేవారికి ఇతర పత్రాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవచ్చు. జీతం స్లిప్‌లు లేని వారికి బ్యాంక్ స్టేట్మెంట్లు ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఆదాయ ఆధారంగా ఉపయోగపడవచ్చు. ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బు జమ అవుతున్నట్లు కనిపిస్తే, దరఖాస్తుదారుడి ఆదాయ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి అది బ్యాంకుకు ఉపయోగపడుతుంది (Self employed credit card). వ్యాపారం లేదా ఇతర పనులు చేసుకునే వారు తమ ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్నులు సమర్పిస్తే, బ్యాంకుకు ఆదాయంపై మరింత స్పష్టత లభిస్తుంది. అర్హత ఉన్న వ్యాపారులు, సేవలందించే వారు జీఎస్టీ రిటర్నులు వంటి పత్రాలను కూడా అవసరమైన సందర్భంలో ఆదాయ ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఏ పత్రాలు అంగీకరిస్తారన్నది బ్యాంకు, క్రెడిట్ కార్డు ఉత్పత్తి, దరఖాస్తుదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది (Credit card without income proof)

సమ్మెకు యూనియన్ల పిలుపు.. కీలక తేదీలు ఇవే సెప్టెంబర్‌లో వరుసగా 5 రోజులు సేవలకు బ్రేక్ 5 రోజుల బ్యాంకింగ్ కోసం ఉద్యోగుల సమ్మెబాట Bank Unions Strike : సెప్టెంబర్‌లో బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్‌లో రెండు విడతల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాల నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. మొదటి విడతగా సెప్టెంబర్ 11, 2026న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల సమ్మె కొనసాగనుంది. అప్పటికీ డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టే అవకాశం ఉందని యూఎఫ్‌బీయూ తెలిపింది. Read Also : Xiaomi 17 Ultra Price : వారెవ్వా.. అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ షావోమీ అల్ట్రా ఫోన్‌పై రూ. 10వేలు డిస్కౌంట్..! 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్ : బ్యాంకు ఉద్యోగులు 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థ అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మార్చి 8, 2024న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్ నోట్లో దీనికి అంగీకారం జరిగినప్పటికీ, రెండేళ్లకు పైగా నిర్ణయం పెండింగ్‌లో ఉందని యూనియన్లు చెబుతున్నాయి. శనివారం సెలవుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పని సమయాన్ని సుమారు 40 నిమిషాలు పెంచే ప్రతిపాదన ఉంది. పీఎల్ఐపై అభ్యంతరం : ప్రభుత్వం సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) విధానాన్ని ఉపసంహరించాలని కూడా యూనియన్ డిమాండ్ చేస్తోంది. సీనియర్ అధికారులకు, ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహకాలలో వ్యత్యాసం ఉందని, తగినంత సంప్రదింపులు లేకుండానే విధానాన్ని

ప్రతీఒక్కరూ బ్యాంక్‌కు ఒక్కసారి అయినా వెళ్లి ఉంటారు. బ్యాంకులో డిపాజిట్ లేదా విత్ డ్రా ఫామ్ నింపి లావాదేవీలు నిర్వహించి ఉంటారు. ఈ ఫామ్స్ నింపేటప్పుడు అమౌంట్‌ను సంఖ్య రూపంలో రాయడమే కాకుండా పదాల రూపంలో కూడా వివరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.10 వేలు డిపాజిట్ చేస్తున్నా లేదా విత్ డ్రా చేస్తుంటే.. టెన్ తౌజెండ్ రూపీస్ ఓన్లీ అని రాస్తూ ఉంటాం. చివరిలో ఓన్లీ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి కానీ చివరిలో 'Only' అనేది రాయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.“Ten Thousand” అని రాసిన తర్వాత ఖాళీగా వదిలేస్తే వేరే పదాలు రాయడానికి అవకాశం ఉంటుంది. అదే చివరిలో ఓన్లీ అనేది రాయడం వల్ల అక్కడితో వాక్యం పూర్తయిందని ఎవరికైనా అర్థమవుతుంది. దీని వల్ల వేరే పదం చేర్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు. దీని వల్ల ఎలాంటి మోసాలు జరగవు. అయితే ఓన్లీ అనేది చివరిలో రాయకపోతే మీ చెక్కు లేదా డిపాజిట్, విత్ డ్రా ఫామ్ చెల్లదని కాదు. మీరు రాయకపోయినా అది చెల్లుతుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రత్యేక నిబంధన విధించలేదు. కేవలం భద్రతాపరమైన కారణాల వల్ల చివరిలో ఓన్లీ అనేది రాయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఖాళీ స్థలం వదలకపోవడం అనేది భద్రత కోసమేనని చెప్పవచ్చు. బ్యాంక్ సిబ్బంది కూడా చివరిలో ఓన్లీ అనేది చేర్చాలని సూచిస్తూ ఉంటారు. కేవలం సాధారణంగానే దీనిని సూచిస్తూ ఉంటారు. ఇక బ్యాంక్ సిబ్బంది స్వీకరించిన తర్వాత అమౌంట్, పదాల్లో ఒకేలా ఉందా.. లేదా అనేది పరిశీలిస్తారు. అంకెల్లో అమౌంట్ ఒకలా.. పదాల్లో ఒకలా ఉంటే సులువుగా గుర్తు పడతారు. చెక్ ప్రాసెసింగ్ సమయంలో దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చెక్కు జమ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు దీనిని పరిశీలించుకోవాలి. రెండు చోట్ల ఒకేలా ఉందా..లేదా అనేది చూసుకోవాలి. రెండు చోట్ల

దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు షాకిచ్చింది. నగదు విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ తెరిచినవారికి నగదు విత్ డ్రా ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు విధించేవారు కాదు. ఇప్పటివరకు ఎన్ని నగదు ఉపసంహరణ లావాదేవీలు అయినా ఉచితంగా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్బీఐ పరిమితులు విధించింది. ఈ అకౌంట్ ఉన్నవారు అక్టోబర్ 1వ తేదీ నుంచి నెలకు నాలుగుసార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ విత్ డ్రా లావాదేవీకి రూ.15 ఛార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ఒక నెలలో నగదు ఉపసంహరణ లావాదేవీలు నాలుగు కంటే ఎక్కువ దాటినప్పుడు మాత్రమే ఛార్జీలు విధిస్తారు. అయితే డిజిటల్ లావాదేవీలు మాత్రం ఉచితంగా కొనసాగుతాయి. వీటికి ఎలాంటి ఛార్జీలు విధించమని ఎస్బీఐ తెలిపింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా ఉచితంగా లావాదేవీలు చేసుకోవచచ్చు. బ్రాంచ్ ఛానెల్ ద్వారా బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ తెరిచినవారికి నగదు విత్ డ్రాకు సంబంధించి ఛార్జీలు వర్తిస్తాయి. అయితే నెలకు నాలుగు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే అవకాశం ఉండటంతో.. దీని ప్రభావం పెద్దగా కస్టమర్లపై పడకపోవచ్చు. అయితే లిమిట్ దాటితే బ్యాంకింగ్ ఖర్చులు పెరిగే అవకాశముంది. ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవాలంటే డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడం మంచిది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే జీరో అకౌంట్ అని అర్థం. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు. ఉచితంగా ఏటీఎం కార్డు అందిస్తారు. అలాగే డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు కూడా ఎలాంటివి ఉండవు. బేసిక్ అకౌంట్ ఉండాలనుకునేవారికి

రోజుకు ఐదు నిమిషాలు.. అంతే పని. కానీ నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి! ఈ మాట వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. కాలేజీ రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఓ యువకుడు. స్నేహితులు కూడా అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐదు నిమిషాల పని అంటే ఐదు నిమిషాలే.. ఆ సమయంలో ఏం ఆలోచించాలో నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన ఓ చిన్న పరికరానికి దారి తీసింది. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.ఆ యువకుడే మసయోషి సన్. నేడు సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు. 2026 సెప్టెంబరు 1 నాటికి ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన సంపద 63.2 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.3 లక్షల కోట్లు. కానీ ఈ స్థాయికి ఆయన ప్రయాణం మాత్రం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీలో ఓ విద్యార్థిగా ఉన్నప్పుడే మొదలైంది.ఐదు నిమిషాల ఆలోచన..1970ల చివర్లో బెర్క్లీలో ఆర్థికశాస్త్రం చదువుతున్న సన్ తనకు తానే ఓ సవాల్ విసిరుకున్నారు. రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించి నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి. ఉద్యోగం చేస్తే అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఓ వినూత్న ఆదాయ మార్గం కోసం ఆలోచించారు.ఆ ఐదు నిమిషాల్లో ఓ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ ఆలోచన వచ్చింది. బెర్క్లీలోని పరిశోధకులు, ప్రొఫెసర్ ఫారెస్ట్ మోజర్ సహకారంతో దాన్ని అభివృద్ధి చేశారు. చివరకు ఆ పరికరాన్ని జపాన్‌కు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fake Currency: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్న సామెత నిజం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సామెత నిజం అవుతోందా…? అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే యూపీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత కలిగిన కరెన్సీ వాల్ట్ నుంచి రూ. 7.4 కోట్ల విలువైన అసలైన కరెన్సీని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో ఈ భారీ అక్రమం చోటుచేసుకుంది. అత్యంత భద్రత కలిగిన వాల్ట్ నుంచి సుమారు రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూ. 4.36 లక్షల వ్యత్యాసంతో బయటపడ్డ కుంభకోణం… పీఎన్బీ చీఫ్ డిప్యూటీ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10న బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిన నగదు రెమిటెన్స్‌లో రూ. 4.36 లక్షల కొరత కనిపించింది. ఈ తేడాపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించగా, కరెన్సీ వాల్ట్‌లో భారీ ఎత్తున నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నిషా సింగ్ మాట్లాడుతూ, విచారణ వేగవంతం చేశాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. 'సిట్' ఏర్పాటు పీఎన్బీ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో

Janmashtami 2026 Holiday: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 2026లో జన్మాష్టమి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున వచ్చింది. దీంతో ఈ పండుగ సందర్భంగా స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుందా అనే ఆసక్తి చాలామందిలో ఉంది. జన్మాష్టమి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవు ఉండే అవకాశం ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన సెలవు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, స్కూల్ బోర్డు నిర్ణయాలను బట్టి సెలవు మారవచ్చు. అందుకే విద్యార్థులు తమ స్కూల్ హాలిడే క్యాలెండర్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4న పలు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, జైపూర్, భువనేశ్వర్, చండీగఢ్, కోచి, పాట్నా, రాంచీ, తిరువనంతపురం, శ్రీనగర్ వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే తమ బ్రాంచ్‌కు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణుడి జన్మస్థలమైన మథుర, వృందావన్ ప్రాంతాల్లో వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, CBSE, ICSE, రాష్ట్ర బోర్డు పాఠశాలలకు సెలవుల విషయంలో తేడాలు ఉండవచ్చు. జన్మాష్టమి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మూసి ఉండవచ్చు. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సెలవుల జాబితానే తుది నిర్ణయంగా భావించాలి. ఈసారి సెప్టెంబర్ 4 శుక్రవారం కావడంతో శని, ఆదివారాలు సెలవుగా ఉండే

బ్యాంకులు 14 రోజులు సెలవులు.. రాష్ట్రాల వారీగా పూర్తి హాలిడే లిస్ట్ ఏపీ, తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు సెప్టెంబర్ హాలిడే లిస్ట్ ప్రకటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా September 2026 Bank Holidays : సెప్టెంబర్‌లో బ్యాంకు పనులు పెట్టుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఈ నెలలో బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగానే ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉందో తెలుసుకోవడం బెటర్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకు శాఖలకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజున బ్యాంకులు మూతపడవు. స్థానిక పండుగలు, ప్రాంతీయ (September Bank Holidays) కార్యక్రమాలను బట్టి ఆయా రోజుల్లో సెలవుల్లో మార్పులు ఉంటాయి. సెప్టెంబర్‌లో వచ్చే వినాయక చవితితో పాటు ఇతర పండుగ సెలవులు, సాధారణ వారాంతపు సెలవులతో కలిపి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు మొత్తం 14 రోజుల వరకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ బ్యాంకు సెలవులన్నీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. మీరు ఉండే ప్రాంతంలో మీ హోం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లే ముందు బ్యాంకు సెలవు జాబితాను చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. సెప్టెంబర్‌లో వీకెండ్ హాలిడేస్ ఇవే : సెప్టెంబర్ 2026లో 4 ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 6 జనరల్ హాలిడేస్ ఉన్నాయి. సెప్టెంబర్ 6 : ఫస్ట్ ఆదివారం సెప్టెంబర్ 12: రెండో శనివారం సెప్టెంబర్ 13: రెండో ఆదివారం సెప్టెంబర్ 20: మూడో ఆదివారం సెప్టెంబర్ 26: నాల్గవ శనివారం సెప్టెంబర్ 27: నాల్గవ ఆదివారం పండుగలు, ప్రత్యేక సెలవులివే : సెప్టెంబర్ 4 – జన్మాష్టమి : జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీఎన్బీ కరెన్సీ చెస్ట్‌లో భారీగా నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో స్వీపర్ పాత్ర ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన అధికారులు.. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కరెన్సీ చెస్ట్‌లో భారీగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్ సహారన్‌పూర్‌లోని పీఎన్బీ కరెన్సీ చెస్ట్‌లో సుమారు రూ.7.40 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నట్లు ఆడిట్లో తేలినట్టు తెలుస్తోంది. బ్యాంకు భద్రతా వ్యవస్థను దాటి నకిలీ నోట్లు కరెన్సీ చెస్ట్‌లోకి ఎలా వచ్చాయనే విషయం కలకలం రేపుతోంది. కరెన్సీ చెస్ట్‌లో భద్రపరిచిన అసలు నోట్లను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెన్సీ చెస్ట్ నుంచి బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి పంపిన సొమ్ములో సుమారు రూ.4.30 లక్షల వ్యత్యాసం కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పీఎన్బీ నోడల్ అధికారి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ డివిజనల్ మేనేజర్ సహా ఇద్దరు కరెన్సీ చెస్ట్ మేనేజర్లను బ్యాంక్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే.. ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయి? అసలు నోట్ల స్థానంలో వాటిని ఎవరు ఉంచారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. మరోవైపు.. కరెన్సీ చెస్ట్‌లోని నోట్ల కట్టల నుంచి అక్కడి స్వీపర్ నగదు తీస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో సదరు నోడల్ అధికారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో బ్యాంకు అధికారులతో పాటు స్వీపర్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా కరెన్సీ చెస్ట్‌లోని నగదు లెక్కలు, రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, నగదు తరలింపు వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు ఎవరనేది దర్యాప్తులో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. New ATM Rules 2026: ఏటీఎం కార్డు వినియోగదారుల విషయానికి వస్తే, ఆర్బీఐ ఆమోదంతో వినియోగదారులపై అదనపు చార్జీల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు, మీరు మీ సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం యంత్రాల వద్ద బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా నగదు విత్ డ్రా చేయాలన్నా, వారు అధిక చార్జీలను వసూలు చేస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఆర్బీఐ ఆమోదంతో ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై విధించనున్నారు. మీరు ఏటీఎం కార్డును తరచూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, కచ్చితంగా అదనపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ ఛార్జీలను రూ.17 నుండి రూ.19 వరకు పెంచారు. కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ.7 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారిగా లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలను వసూలు చేసేవారు. సాధారణంగా మెట్రో నగరాల్లో నివసించే కస్టమర్లకు ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తే, నాన్-మెట్రో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంపీసీఐ (MPCI) ఆమోదం, ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఈ అదనపు చార్జీల విషయంలో ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం ఎంపీసీ ముందుకు వెళ్ళింది. ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల, పాత ధరల పద్ధతిని కాకుండా కొత్తగా ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి అధికారిక

BIG Debate: సామాన్యుడికి కఠిన నిబంధనలు.. బడాబాబులకు మాత్రం భారీ సెటిల్మెంట్లు! BIG Debate: దేశీయ బ్యాంకింగ్ రంగంలో అమలవుతున్న ద్వంద్వ ప్రమాణాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సామాన్యులు చిన్నపాటి రుణాలు చెల్లించడంలో కొద్దిరోజులు ఆలస్యమైతే బ్యాంకులు, రికవరీ ఏజెన్సీలు తీవ్ర వేధింపులకు గురిచేస్తుండగా.. వేల కోట్లు ఎగ్గొట్టే బడా కార్పొరేట్లు మరియు పారిశ్రామికవేత్తలకు మాత్రం చట్టపరమైన లొసుగుల ద్వారా నామమాత్రపు సెటిల్మెంట్లు లభిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. hmtv నిర్వహించిన ప్రత్యేక డిబేట్లో వక్తలు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు, విద్య మరియు వ్యక్తిగత రుణాల కోసం కష్టపడే సామాన్యులు ఒకట్రెండు ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు సిబిల్ స్కోర్ దెబ్బతీయడంతో పాటు, రికవరీ పేరిట తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కేవలం కొన్ని పైసల బకాయిలను కూడా వడ్డీలతో కలిపి వేల రూపాయలుగా మార్చి వసూలు చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన పర్సనల్ ఇన్సాల్వెన్సీ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఒక సంచలన రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఆయనపై నమోదైన రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణదాతలైన బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని, ఇది ఎంతమాత్రం సరికాదని అంటున్నాయి. మరోవైపు, మీడియాలో ప్రచారమవుతున్న 99.97 శాతం రుణ మాఫీ వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు తనపై ఉన్న క్లెయిమ్ సైజ్ ఇంత పెద్దది కాదని సుభాష్ చంద్ర స్వయంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ వివాదంపై ఢిల్లీలోని NCLT బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఇద్దరు సభ్యుల బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ఈ కేసును మూడో జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) సెక్షన్ 114 కింద ఈ ప్లాన్‌ను క్లియర్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం, సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పూచీకత్తు హోదాలో రూ. 6.25 కోట్లు చెల్లిస్తారు. దీనితో పాటు, రుణం తీసుకున్న ప్రధాన సంస్థలు విడిగా సుమారు రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 80.8 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్‌కు సపోర్టు ఇచ్చారు. అయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు మాత్రం ఈ రీపేమెంట్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. రీజల్యూషన్ ప్రొఫెషనల్ అంచనా ప్రకారం.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ రీపేమెంట్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. IBPS RRB Recruitment 2026: చాలా కాలంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గ్రామీణ బ్యాంకుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది, దీనికి అప్లికేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది. కనీస అర్హతగా డిగ్రీ ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా అవసరం. ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. మొత్తం 8,183 ఆఫీస్ అసిస్టెంట్, 4,256 ఆఫీసర్ స్కేల్-1, 1,472 స్కేల్-2, 250 స్కేల్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. వయస్సు.. వయోపరిమితి విషయానికి వస్తే: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-1 కి 18 నుండి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి..SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, PwD అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. అర్హతలు.. అర్హతల విషయానికి వస్తే, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు డిగ్రీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్

ఇది డిజిటల్ యుగం.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇక వాట్సాప్ వంటి మెసేంజర్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం నుంచి మొదలుకొని.. ఆఫీస్ డాక్యుమెంట్లు పంపుకోవడం వరకు అన్నింటికీ వాట్సాపే మనకు ప్రధాన ఆధారం అయిపోయింది. అయితే, మీకొక షాకింగ్ నిజం చెప్పాలి. లోన్ అప్లై చేయాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా, లేదా ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా.. నేడు ‘కేవైసీ’ అనేది తప్పనిసరి. ఈ క్రమంలో అవతలి వ్యక్తులు, ఏజెంట్లు లేదా సంస్థలు అడిగిన వెంటనే మనం మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి అత్యంత గోప్యమైన పత్రాలను క్షణం ఆలోచించకుండా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం. “ఫైల్ క్షణంలో అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది కదా, పంపిస్తే తప్పేంటి?” అని మీరు తేలికగా తీసుకుంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడినట్లే. మీ ఒక్క వాట్సాప్ మెసేజ్ మీ జీవితాన్నే తలక్రిందులు చేయగలదు. భవిష్యత్తులో మీరు ఊహించని తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది. మనం వాట్సాప్‌లో ఒక డాక్యుమెంట్ పంపిస్తే, అవతలి వాళ్ళు చూసి డిలీట్ చేసేస్తారని అనుకుంటాం. కానీ అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. మనం వాట్సాప్‌లో పంపిన డాక్యుమెంట్లు కేవలం ఆ అవతలి వ్యక్తి వాట్సాప్ చాట్‌లోనే ఉండిపోవు. అవతలి వ్యక్తి ఆ ఫైల్‌ను తన ఫోన్ గ్యాలరీలోకి, లాప్‌టాప్‌లోకి లేదా కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాడు. అంతేకాదు, ఆ ఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ బ్యాకప్ ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఉంటే, మీ పత్రాల కాపీలు ఆటోమేటిక్‌గా క్లౌడ్‌లో సేవ్ అయిపోతాయి. ఒకసారి డాక్యుమెంట్ మీ ఫోన్ దాటి బయటికి వెళ్తే, దానిపై మీ నియంత్రణ పూర్తిగా కోల్పోయినట్టే!

రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

ఇల్లు, ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం చాలా మందికి ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. సంవత్సరాల పొదుపు, బ్యాంకు రుణం లేదా కుటుంబ ఆస్తులను ఉపయోగించి స్థిరాస్తిలో పెట్టుబడి పెడతారు. అయితే, ఈ రంగంలో సరైన సమాచారం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాల నుంచి ఒకే ఆస్తిని పలువురికి అమ్మడం వరకు వివిధ రకాల మోసాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆస్తి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత ముఖ్యం. కొన్ని రకాల మోసాలను ఇక్కడ చూద్దాం. ఇది స్థిరాస్తిలో సాధారణంగా కనిపించే మోసాల్లో ఒకటి. మోసగాళ్లు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లు, గుర్తింపు పత్రాలు లేదా ఇతర భూ రికార్డులను సృష్టించి ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు అసలు యజమాని సంతకాన్ని కూడా నకిలీ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలుదారులు పత్రాలపై మాత్రమే ఆధారపడకుండా, సంబంధిత ప్రభుత్వ రికార్డుల్లో యాజమాన్య వివరాలను స్వతంత్రంగా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో ఒకే ప్లాట్ లేదా ఫ్లాట్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలుదారులకు విక్రయించే మోసాలు జరుగుతాయి. ముందస్తు బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లింపుల సమయంలో కొనుగోలుదారులు పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లు లేదా అపార్ట్మెంట్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒప్పందం చేసుకునే ముందు ఆ ఆస్తిపై ఇప్పటికే ఇతర హక్కులు, ఒప్పందాలు లేదా రుణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. చౌక ధరకు ప్లాట్లు అందిస్తున్నామని చెప్పి అనుమతి లేని లేఅవుట్లను విక్రయించే సంఘటనలు కూడా కనిపిస్తాయి. కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఇల్లు నిర్మించేందుకు అనుమతులు రాకపోవచ్చు లేదా అభివృద్ధి పనులు నిలిచిపోవచ్చు. రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై కూడా హామీలు మాత్రమే ఉండి, వాస్తవంగా అవి అందుబాటులో లేకపోవచ్చు

ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు. చిరంజీవి సినీ రంగంలో సాధించిన విజయాలను, ఆయన సామాజిక సేవను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు."ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్‌గా నిలిచారు" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అంతేకాకుండా, చిరంజీవి సామాజిక స్పృహను కూడా చంద్రబాబు ప్రశంసించారు. "రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరంజీవికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత రూపాయి శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర గందరగోళానికి గురైంది. ఒక్కో దశలో మంచి లాభాల్లోకి దూసుకెళ్లినప్పటికీ... అంతిమంగా స్వల్ప లాభంతో ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కేవలం 3 పైసలు పుంజుకుని 95.71 వద్ద స్థిరపడింది. విదేశీ మార్కెట్లలో డాలర్ కొంత బలహీనపడటం రూపాయికి కలసివచ్చినప్పటికీ, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయి దూకుడుకు అడ్డుకట్ట వేశాయి.ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఉదయం రూపాయి 95.69 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో గరిష్ఠంగా 95.65 స్థాయికి చేరుకుని ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించింది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో వెంటనే కోలుకున్న డాలర్ ధాటికి ఒకానొక సమయంలో 95.75 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి గురువారం నాటి ముగింపు (95.74) కంటే కేవలం 3 పైసలు మాత్రమే మెరుగై 95.71 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.గడువు కుదింపు.. ఒక్కసారిగా $56 బిలియన్ల వరద!గడిచిన 30 రోజుల్లో అతిపెద్ద పరిణామం ఏమిటంటే.. ప్రత్యేక విదేశీ డిపాజిట్ పథకానికి (FCNR-B) ఇచ్చిన గడువును ఆర్బీఐ ఆగస్టు 31 వరకు కుదించింది. ఈ ముందస్తు ఆదేశంతో ఒక్కసారిగా విదేశీ కరెన్సీ భారత్‌కు పోటెత్తింది. దీనిద్వారా దేశంలోకి ఏకంగా 56.84 బిలియన్ డాలర్ల నిధులు రాగా, మొత్తం విదేశీ నిధుల ప్రవాహం 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఈ నిధుల వరద రూపాయి పతనానికి బలమైన అడ్డుకట్టగా మారింది.చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహంతో భారత్‌కు ఊరట!రూ.707 బిలియన్లకు చేరిన విదేశీ కరెన్సీ నిల్వలుగత కొద్ది వారాల్లో భారత్ ఫారెక్స్ నిల్వలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఫారెక్స్ నిల్వలు ఏకంగా $14.13 బిలియన్లు పెరిగి $707 బిలియన్ మార్కును అధిగమించాయి. ఈ బలమైన ఆర్థిక పునాదితో ఆర్బీఐ స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను కట్టడి చేస్తూ, రూపాయి విలువను నిలకడగా

Recurring Deposit: ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా.? ఎక్కువ వడ్డీ ఎందులో వస్తుందో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన
SBI Bulk Fixed Deposits: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కిందటి రోజు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు సంబంధించి కొత్త ఛార్జీల్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇక్కడ నెలకు 4 ఉచిత క్యాష్ విత్‌డ్రా (బ్యాంకులు, ఏటీఎం, డిజిటల్) లావాదేవీలు పూర్తయిన తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 15 ప్లస్ జీఎస్టీ చెల్లించాలని, ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎస్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే ఇది కేవలం బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపైనే, ఎంపిక చేసిన టెన్యూర్లపైనే వర్తిస్తుంది. దీంతో రూ. 3 కోట్లు, ఆపైన డిపాజిట్ చేసే వారికి రాబడి తగ్గుతుందని చెప్పొచ్చు. రూ. 3 కోట్ల లోపు చేసే రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మాత్రం మార్చలేదు. కొత్త వడ్డీ రేట్లు 2026, ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈ మేరకు బ్యాంక్ స్పష్టం చేసింది.వేర్వేరు టెన్యూర్ బల్క్ డిపాజిట్లపై గరిష్ఠంగా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ 7 రోజుల నుంచి 179 రోజుల వరకు వ్యవధి ఉన్న అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. 180 రోజుల నుంచి 210 రోజుల వ్యవధి డిపాజిట్‌పై 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.6 శాతం నుంచి 5.5 శాతానికి చేర్చింది. ఇక 211 రోజుల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు వ్యవధి బల్క్ ఎఫ్డీపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఏ టెన్యూర్‌కు ఎఫ్డీ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.7-14 రోజుల డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 4.25 శాతానికి తగ్గించింది. 15-45 రోజుల బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి వడ్డీ రేట్లను 4.75 శాతానికి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన అప్డేట్. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాల నుంచి బ్రాంచ్ ద్వారా నగదు ఉపసంహరణపై అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఒక నెలలో నాలుగు సార్లు వరకు నగదు తీసుకుంటే ఎలాంటి ఛార్జీ ఉండదు. ఆ తర్వాత చేసే ప్రతి నగదు ఉపసంహరణకు రూ.15 చొప్పున వసూలు చేస్తారు. దీనికి అదనంగా వర్తించే GST కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఛార్జీల ప్రకారం BSBD ఖాతాదారులు ప్రతి నెల మొదటి నాలుగు నగదు ఉపసంహరణలను ఉచితంగా చేసుకోవచ్చు. ఈ పరిమితి పూర్తయిన తర్వాత బ్రాంచ్‌లో నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీపై రూ.15 ఛార్జీ పడుతుంది. దీనికి GST అదనంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఖాతాదారు ఒక నెలలో బ్రాంచ్‌కు వెళ్లి ఆరు సార్లు నగదు తీసుకున్నారని అనుకుందాం. మొదటి నాలుగు విత్‌డ్రాలకు ఛార్జీ ఉండదు. ఐదో, ఆరోసారి నగదు తీసుకున్నప్పుడు ఒక్కో లావాదేవీకి రూ.15 చొప్పున ఛార్జీతో పాటు GST చెల్లించాలి. ఈ మార్పు SBI బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ (బ్రాంచ్ ఛానల్)కు వర్తిస్తుంది. ఈ ఖాతాకు సంబంధించిన ప్రొడక్ట్ కోడ్ 1011-1701. ముఖ్యంగా బ్రాంచ్ ద్వారా నగదు ఉపసంహరణ చేసే ఖాతాదారులపై ఈ కొత్త ఛార్జీ ప్రభావం ఉంటుంది. అయితే సాధారణ సేవింగ్స్ ఖాతాలకు వర్తించే ఛార్జీలతో దీన్ని గందరగోళం చేసుకోవద్దు. అకౌంట్ టైప్, లావాదేవీ విధానం ఆధారంగా బ్యాంకు నిబంధనలు మారవచ్చు. అందువల్ల ఖాతాదారులు తమ అకౌంట్‌కు వర్తించే తాజా ఛార్జీల వివరాలను SBI అధికారిక నిబంధనల్లో ఒకసారి పరిశీలించడం మంచిది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBD) అనేది ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించేందుకు రూపొందించిన సేవింగ్స్ ఖాతా. ఇందులో సాధారణంగా కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. డబ్బు జమ చేయడం, అవసరమైనప్పుడు నగదు తీసుకోవడం వంటి ప్రాథమిక

వరుస నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. రియల్టీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ షేర్లలో కొనుగోళ్లతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 628.04 పాయింట్లు లాభపడి 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 153.55 పాయింట్లు పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ దాదాపు 2 శాతం పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఇటీవలి మార్కెట్ పతనంతో తక్కువ స్థాయికి చేరిన షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు తెలిపారు.రానున్న సెషన్లో నిఫ్టీకి 24,100-24,000 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 24,300, 24,575 వద్ద నిరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. 24,000 స్థాయిని నిలబెట్టుకుంటే కోలుకునే అవకాశాలు కొనసాగుతాయని, దాని కిందకు పడిపోతే మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరగొచ్చని సూచించారు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఒక సంచలనాత్మక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఆలమూరులోని యూనియన్ బ్యాంక్ శాఖలో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గానుగపెంట సుప్రియ (28) ఆకస్మికంగా అదృశ్యమవ్వడం ఇప్పుడు తీవ్ర మిస్టరీగా మారింది. విధి నిర్వహణలో ఉన్న యువతి ఒక్కసారిగా మాయమవ్వడం, ఆమె వస్తువులు పంట కాలువ వద్ద లభించడంతో కోనసీమ వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.ఈనెల 17వ తేదీన ఎప్పటిలాగే విధులకు హాజరైన సుప్రియ, తన మొబైల్ ఫోన్‌ను బ్యాంక్‌లోనే వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన సిబ్బంది, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల సమీపంలో సుప్రియకు చెందిన స్కూటీ, చెప్పులు, కళ్లజోడు పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకులో విధుల్లో ఉన్న వ్యక్తి ఫోన్ కూడా తీసుకెళ్లకుండా, కేవలం తన వస్తువులను లాకుల వద్ద వదిలివెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయిల అదృశ్యం వెనుక ఫ్రీ ఫైర్ గేమ్.. పేరెంట్స్ జాగ్రత్త!కాలువల్లో తీవ్రంగా గాలింపు.. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ దళాలు!చొప్పెల్ల లాకుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా సుప్రియ పంట కాలువలో దూకి ఉంటే ఏమోనన్న ప్రాథమిక అనుమానంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మొదట స్థానిక గజ ఈతగాళ్లతో కాలువను జల్లెడ పట్టించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఘటన తీవ్రతను గుర్తించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఎస్టీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లోకి దిగాయి. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై నరేష్ ల పర్యవేక్షణలో చొప్పెల్ల లాకులకు అనుసంధానంగా ఉన్న అన్ని పంట కాలువల్లో అత్యాధునిక పరికరాలతో గాలింపు ముమ్మరం చేశారు.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్.. కారుపై మాట మార్చిన తాత! పోలీసులకు సవాల్‌గా మారిన

ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ ఖాతా ఉందా? అయితే అక్టోబర్ 1 నుంచి నగదు తీసుకునేటప్పుడు లెక్క చూసుకోవాల్సిందే. నెలలో నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఐదోసారి తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఈ కొత్త నిబంధన సాధారణ సేవింగ్స్ ఖాతాలన్నింటికీ కాదు. ఎస్బీఐ ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్’ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది.నాలుగు ఉచిత నగదు ఉపసంహరణల్లో ఎస్బీఐ ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలు, బ్యాంకు శాఖలు, ఏఈపీఎస్ ద్వారా తీసుకునే నగదు కూడా లెక్కలోకి వస్తుంది. మొత్తం నాలుగు సార్లు ఉచితంగా తీసుకున్న తర్వాత, అదే నెలలో మరోసారి నగదు తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్టీ వసూలు చేస్తారు.కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఇప్పటివరకు నాలుగు ఉచిత లావాదేవీల లెక్కలో డిజిటల్ లావాదేవీలకు మినహాయింపు ఉండేది. తాజా మార్పుతో ఆ మినహాయింపును తొలగించారు. దీంతో బీఎస్‌బీడీ ఖాతాదారులు నెలవారీ లావాదేవీలపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.బీఎస్‌బీడీ ఖాతాకు కనీస నిల్వ నిబంధన లేదు. చెక్‌బుక్ సదుపాయం ఉండదు. రూపే ఏటీఎం-కమ్ డెబిట్ కార్డు ఉచితంగా ఇస్తారు. ఈ ఖాతా ఉన్నవారు ఎస్బీఐలో మరో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండరాదని బ్యాంకు స్పష్టం చేసింది

బ్యాంకు ఆఫ్ ఇండియాలో FD ఖాతాలపై వడ్డీ రేట్లు సీనియర్, సూపర్ సీనియర్లకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే? 12 నెలల ఎఫ్డీ ఖాతాలపై ఎంత వడ్డీ వస్తుందంటే? FD Interest Rates : సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన స్కీమ్.. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో FD ఖాతాలను కనీసం 7 రోజుల కాలపరిమితితో ఓపెన్ చేయొచ్చు. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో లాంగ్ టైమ్ FD ఖాతాను ఓపెన్ చేయాలనుకుంటే గరిష్టంగా 10 ఏళ్ల టెన్యూర్ FD ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 12 నెలల FDపై బ్యాంక్ ఎంత వడ్డీని అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. 12 నెలల FDపై వడ్డీ ఎంతంటే? : బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు 12 నెలల ఎఫ్డీలపై 6.50శాతం నుంచి 7.15శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 12 నెలలు మెచ్యూరిటీ టెన్యూర్ FD ఖాతాలపై, 59 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లకు బ్యాంకు 6.50శాతం వడ్డీని అందిస్తోంది. Read Also : iQOO Neo 11 Ultra Launch : బ్యాటరీ బీస్ట్ వచ్చేసింది.. కొత్త ఐక్యూ నియో 11 అల్ట్రా అదుర్స్.. ఎంత వాడినా ఛార్జింగ్ దిగదు.. ధర ఎంతంటే? 60 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న కస్టమర్లకు 12 నెలల FD పథకాలపై 7.00శాతం వడ్డీని, 80 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న ఖాతాదారులకు 7.15శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు కేవలం రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ : సాధారణ పౌరులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్ల ఎఫ్డి ఖాతాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తోంది. సూపర్ సీనియర్లు 80 ఏళ్లు లేదా
Yes Essence: దేశీయ ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సరైన ఆర్థిక పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది యెస్ బ్యాంక్. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఈ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకంగా వారి జీవనశైలికి తగినట్లుగా, విలువైన రివార్డులు, ప్రత్యేక సౌకర్యాలను అందించేలా యెస్ ఎసెన్స్ (Yes Essence) పేరుతో క్రెడిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. నేటితరం ఉద్యోగిణులు, యువ వృత్తి నిపుణులు, డిజిటల్ విధానాలను ఎక్కువగా ఉపయోగించే మహిళల ఆకాంక్షలు, వినియోగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించినట్లు వెల్లడించింది.యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు వెల్కమ్ ఆఫర్లు: యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ పొందిన వెంటనే ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, ఫిట్నెస్ బ్రాండ్లపై ప్రత్యేకమైన వెల్కమ్ వోచర్లు లభిస్తాయి. హెల్త్ బెనిఫిట్స్: ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ (క్యాన్సర్ మార్కర్ స్క్రీనింగ్‌తో సహా) లభిస్తుంది. రోజువారీ ఖర్చులపైనా రివార్డులు: డైనింగ్, గ్రోసరీ, షాపింగ్, బ్యూటీ ఉత్పత్తులు, ట్రావెల్ బుకింగ్స్ పై అదనపు రివార్డు పాయింట్లు ఇస్తున్నారు. వినోదం, కాంప్లిమెంటరీ సర్వీసెస్: బై వన్ గెట్ వన్ (Buy One Get One) సినిమా టికెట్లు, ప్రముఖ మాల్స్‌లోని ఎంపిక చేసిన అవుట్ లెట్లలో కాంప్లిమెంటరీ కాఫీ సౌకర్యం లభిస్తాయి. బర్త్ డే స్పెషల్స్: పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. మైల్ స్టోన్ బోనస్: నిర్ణీత టార్గెట్ ఖర్చులపై ప్రతి సంవత్సరం 10 వేల వరకు యెస్ రివార్డ్స్ (YES Rewardz) పాయింట్లు పొందే అవకాశం ఉంది.'యెస్ బ్యాంకులో మా వినియోగదారుల మారుతున్న ఆశయాలను అర్థం చేసుకోవడంలోనే అర్థవంతమైన ఆవిష్కరణలు మొదలవుతాయని మేము నమ్ముతాము. ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ వారికి తగిన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాల అవసరం కూడా పెరుగుతోంది
SBI Basic Savings Bank Deposit Account: భారతదేశంలోనే అతిపెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు సంబంధించి సర్వీస్ ఛార్జీల్ని సవరించింది. బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎంల ద్వారా కలిపి నగదు విత్‌డ్రాలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2026, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఇక మీదట ప్రతి నెలలో 4 ఉచిత నగదు విత్‌డ్రా (బ్యాంకులు, ఏటీఎంలు) లావాదేవీలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 15 ఛార్జ్ ప్లస్ జీఎస్టీ విధిస్తామని వెల్లడించింది.అయితే అంతకుముందు కూడా 4 ఉచిత లావాదేవీల తర్వాత రూ. 15 ఛార్జ్ ఉన్నప్పటికీ, అప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దీని పరిధిలోకి రాలేదు. ఇప్పుడు ఆ మినహాయింపు లేదు. మునుపటిలా కాకుండా డిజిటల్ లావాదేవీలను కూడా ఇప్పుడు ఈ ఉచిత లావాదేవీల పరిమితిలోనే చూస్తారు. అంటే బ్రాంచ్, ఏటీఎం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి ఉచిత క్యాష్ విత్‌డ్రా పరిమితి 4 లావాదేవీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి?ఈ ప్రాథమిక పొదుపు ఖాతాలు (బేసిక్ సేవింగ్స్ అకౌంట్) అనేవి సాధారణంగా సమాజంలో పేద వర్గాల కోసం ఉద్దేశించినవి. ఎలాంటి అదనపు ఫీజులు, ఛార్జీల భారం లేకుండా వారికి పొదుపును ప్రారంభించేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కింద ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటెయన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఛార్జీలు పడవు. చెక్ బుక్ ఫెసిలిటీ ఉండదు. బ్యాంక్ బ్రాంచులు లేదా ఏటీఎంల ద్వారా మాత్రమే నగదు విత్‌డ్రాకు ఛాన్స్ ఉంటుంది. బేసిక్ రూపే ఏటీఎం- కమ్- డెబిట్ కార్డును అకౌంట్ హోల్డర్‌కు ఇస్తారు. నెలకు నాలుగు ఉచిత క్యాష్
Bank Jobs: భారతీయ బ్యాంకింగ్ రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఉద్యోగాల కల్పన తీరుతెన్నులు మారుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశంలోని టాప్-10 ప్రైవేట్ బ్యాంకులు కలిపి 10,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. గత కొన్ని ఏళ్లలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టిన బ్యాంకులు ఇప్పుడు సాంకేతికత అందుబాటులోకి రావడంతో తమ సిబ్బంది సంఖ్యను క్రమబద్ధీకరించడం ప్రారంభించాయని అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.బ్యాంకింగ్‌లో మారుతున్న నియామకాల శైలిగతంలో బ్రాంచుల విస్తరణ, కస్టమర్ సర్వీస్ కోసం భారీగా నియామకాలు చేపట్టిన ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలపై దృష్టి సారించాయి. దేశంలోని ప్రైవేట్ రంగం అతిపెద్ద బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి అగ్రగామి బ్యాంకులు తమ డిజిటల్ నెట్వర్క్ వేగవంతం చేశాయి. దీంతో సాంప్రదాయ పనులను చూసే ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.Read Also: AI Layoffs: ఏఐ దెబ్బకు భారీగా ఉద్యోగాల కోత.. మళ్లీ షురూ.. 3 టెక్ దిగ్గజాల షాకింగ్ ప్రకటన!ఏఐ రాకతో ప్రధాన మార్పులుకస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడం, రుణాల ముందస్తు ఆమోదం, కేవైసీ ప్రక్రియలు, ప్రాసెసింగ్ పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిసెంట్లు చూసుకుంటున్నాయి. తక్కువ సిబ్బందితో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు వేగంగా సేవలు అందించడం బ్యాంకులకు సాధ్యమవుతోంది. డేటా ఎంట్రీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి పనులను రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ పర్యవేక్షిస్తుండడంతో బ్యాక్ ఆఫీస్ నియామకాలు దాదాపుగా నిలిచిపోయాయని చెప్పవచ్చు.ఒక్క ఏడాదిలో 10 వేల జాబ్స్ కట్దేశంలోని టాప్-10 ప్రైవేట్ బ్యాంకుల్లో మార్చి 31, 2026తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ చుట్టూ ఉచ్చ బిగుసుకుంటోన్నట్టే కనిపిస్తోంది. పీఎన్బీలో 13,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసానికి పాల్పడిన మేహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి కరేబియన్ ద్వీపదేశం అంటిగ్వా అండ్ బార్బుడాలో నివసిస్తోన్నారు.2017లో వారికి ఆ దేశ పౌరసత్వం కూడా లభించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉండటం వల్ల మేహుల్ చోక్సీని భారత్‌కు తీసుకుని రావడానికి సీబీఐ, ఈడీ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఈ కుంభకోణంలో ఆయన భార్య ప్రీతి చోక్సీ పేరు కూడా బయటికి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఆమె పేరును దర్యాప్తు జాబితాలో చేర్చింది. ఇదివరకే ఛార్జ్‌షీట్‌ను నమోదు చేసింది.ఈ పరిణామాల మధ్య మేహుల్ చోక్సీ అడ్వొకేట్ విజయ్ అగర్వాల్ అరెస్ట్ అయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనను బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మేహుల్ చోక్సీకి విజయ్ అగర్వాల్ ప్రధాన న్యాయవాదిగా వ్యవహరిస్తోన్నారు. లండన్‌లోని అత్యంత ఖరీదైన మేఫెయిర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వీసా పరిమితులను ఉల్లంఘించారనే ఆరోపణలపై బ్రిటన్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నిలకడలేని బంగారం ధరలతో రిస్క్ రెట్టింపు: నేడు మళ్లీ.. !!మేఫెయిర్‌లోని ఓ లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ భవన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు జరిగాయని అక్కడి మీడియా వెల్లడించింది. ఆ సమయంలో అగర్వాల్‌తో పాటు ఆయన లా సంస్థకు చెందిన కొందరు జూనియర్ అసోసియేట్ లాయర్లు కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం భారత్ లో తీవ్ర చర్చనీయాంశంగా

బ్యాంకాక్: తీవ్రమైన వ్యాయామం గుండెపై చూపే ప్రతికూల ప్రభావాలు, సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ‘హైరాక్స్ (HYROX) 2026’ ఫిట్నెస్ పోటీల్లో పాల్గొన్న 41 ఏళ్ల ఫిట్నెస్ కోచ్ లెరాయ్ సాండర్స్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన సాండర్స్ బ్యాంకాక్‌లో ‘ఐఏవోటీ క్రాస్‌ఫిట్’ వ్యాయామశాల యజమాని. ‘ఫైట్ బై డిజైన్’ వ్యవస్థాపకుడు. పోటీల సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన ఆయనకు సీఆర్పీ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, అధికారిక నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర శారీరక శ్రమ గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం తెరపైకి వచ్చింది. తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ప్రాణవాయువును అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం సహజం. సాధారణంగా వ్యాయామం వల్ల గుండెకు మేలు జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, ముందస్తుగా గుర్తించని గుండె సమస్యలు ఉన్నప్పుడు లేదా శరీర సామర్థ్యానికి మించి శ్రమించినప్పుడు ప్రమాదకరమైన హృదయ స్పందనల లోపాలు (వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటివి), సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియోమయోపతి, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి, తీవ్రమైన ఆయాసం, మైకం, కళ్లు తిరగడం, అసాధారణ హృదయ స్పందనలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే శిక్షణ ఆపి వైద్యులను సంప్రదించాలి. ఫిట్నెస్గా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు రావనే భావన సరికాదని, శరీర సామర్థ్య పరిమితులను తెలుసుకుని వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాఖీ 27నా? 28నా?.. గ్రహణ ప్రభావమెంత? సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో

ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ, ఇతర రుణాలు తీసుకున్న వారికి 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. వడ్డీ రేట్ల మార్పులను మరింత వేగంగా రుణగ్రహీతలకు వర్తింపజేసేందుకు కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. అయితే, ఈ ప్రతిపాదనల వల్ల మీ నెలవారీ ఈఎంఐపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని గమనించాలి. ప్రస్తుతం ఇది కేవలం ముసాయిదా దశలోనే ఉంది.ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు 2026 సెప్టెంబర్ 11 వరకు గడువు విధించారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే, 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీనివల్ల వడ్డీ రేట్ల కోత లేదా పెంపు ప్రభావం రుణగ్రహీతలపై చాలా వేగంగా పడనుంది.ప్రతి 3 నెలలకు వడ్డీ రేట్ల సవరణప్రస్తుతం చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సవరిస్తున్నాయి. దీనివల్ల ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా, దాని ప్రయోజనం వినియోగదారులకు చేరడానికి కొన్ని నెలల సమయం పడుతోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను గరిష్ఠంగా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. అంటే.. రెపో రేటు తగ్గితే ఆ ప్రయోజనం త్వరగా అందుతుంది, అదే సమయంలో రేటు పెరిగితే ఆ భారం కూడా అంతే వేగంగా పడుతుంది.ఛాయిస్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "తక్షణమే వడ్డీ రేటు

సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. గ్వాలియర్‌కు చెందిన ఓ కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను క్లిక్ చేసి, నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.98,000 కోల్పోయింది. కేవలం ఒక్క క్లిక్‌తో సైబర్ నేరగాళ్లు వారి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు.పురానీ ఛావనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రపుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జయ ప్రతాప్ సింగ్ బాథమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 11న తన భార్య రచన ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా ఒక ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్ చేయగానే ఆమె ఉపయోగించే మోటోరోలా ఫోన్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది.ఆ సమయంలో వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే రోజు అర్ధరాత్రి బ్యాంకు నుంచి ఓ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయగా, మైనస్ రూ.2,970 చూపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ పరిశీలించగా, మూడు వేర్వేరు యూపీఐ లావాదేవీల ద్వారా రూ.70,000, రూ.20,000, రూ.8,000 చొప్పున మొత్తం రూ.98,000 బదిలీ అయినట్లు తేలింది.దీంతో బాధితులు ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును సైబర్ సెల్‌కు అప్పగించారు. సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి హానికరమైన ప్రకటనలు ఫోన్లలో మాల్వేర్ను ఇన్స్టాల్ చేస్తాయని, తద్వారా సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే యూపీఐ లావాదేవీలు జరుపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని యాడ్స్‌పై క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద
Axis Bank Credit Card Rules: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు ఆగస్టు 28, 2026 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త రూల్స్ వల్ల విదేశీ లావాదేవీల ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, రివార్డ్ పాయింట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సేవలపై ప్రభావం పడనుంది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, కొత్త రుసుములు, పాయింట్ల విధి విధానాలు తెలుసుకుందాం.డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ రుసుము పెంపువిదేశాలలో ఉన్నప్పుడు లేదా అంతర్జాతీయ వ్యాపారులకు (POS టెర్మినల్స్, ఆన్లైన్ ద్వారా) భారతీయ రూపాయిలలో చెల్లింపులు చేసినప్పుడు విధించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ మార్కప్ ఫీజను యాక్సిస్ బ్యాంక్ పెంచింది. ప్రస్తుతం డీసీసీ ఛార్జీలు 1.5 శాతంగా ఉండగా దానిని 3.5 శాతానికి పెంచారు. మాగ్నస్ కార్డుపై అయితే 2 శాతం, ఒలింపస్ కార్డుపై 1.8 శాతం ఛార్జీలు ఉండనున్నాయి.ఆలస్య చెల్లింపు రుసుము పెంపురూ.50 వేలు అంత కంటే ఎక్కువ బకాయిలు ఉన్న కార్డ్ హోల్డర్లకు కొత్త స్లాబును కేటాయించారు. ఈ పరిమితి దాటితే లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1,300గా నిర్ణయించారు. బకాయి మొత్తం ఆలస్య చెల్లింపు రుసుము (Late Payment Fee) రూ.500 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు రూ.501 నుంచి రూ.5000 రూ.500 రూ.5001 నుంచి రూ.10,000 రూ.750 రూ.10,001 నుంచి రూ.50,000 రూ.1,200 రూ.50,000 ఆపైన రూ.1,300 బకాయి చెల్లింపు సర్దుబాటుక్రెడిట్ కార్డ్ యూజర్లు బిల్లును పాక్షికంగా (Partial Payment) చెల్లించినప్పుడు, ఆ బ్యాంక్ ఆ సొమ్మును వివిధ కేటగిరీలుగా సర్దుబాటు చేస్తుంది. వర్తించే రుసుములు, ఛార్జీలు (జీఎస్టీతో కలిపి) విధిస్తారు. ఈఎంఐ (EMI)లుగా మార్చడం వడ్డీపైన ఛార్జీలు పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ అడ్వాన్స్ ఏటీఎం విత్ డ్రాయల్స్ రివార్డ్ పాయింట్లు

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. చిరంజీవి కెరీర్లో మాస్ ఎంటర్టైనర్గా నిలిచిన ‘ముఠామేస్త్రీ’ (muta mestri) ఇప్పుడు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వింటేజ్ సినిమాల రీ రిలీజ్‌లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 4K వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముఠామేస్త్రీ’ 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కూలీ నాయకుడిగా మెగాస్టార్ చేసిన పాత్ర, ఆయన మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మీనా, రోజా కథానాయికలుగా నటించారు. రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో విశేషంగా ఆదరణ పొందింది. పాటల్లో చిరంజీవి డ్యాన్స్, ఆయన ఎనర్జీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు అప్పటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా 4K వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే ఈ సినిమాతో సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారు. ఆగస్టు 21న ‘ముఠామేస్త్రీ’ 4K వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు

Vivo T5 Lite 5g Rakhi Offer: రాఖీ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్ రూ. 3,899కే అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఎక్చేంజ్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ వినియోగిస్తే.. ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. Vivo T5 Lite 5g Rakhi Offer: ఇప్పటికే కొన్ని ఈ కామర్స్ కంపెనీల్లో రాఖీ స్పెషల్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్ చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా vivo బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6,500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6,500mAh బ్యాటరీతో పాటు 44W FlashCharge సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది Sony సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా, 0.08MP సెకండరీ కెమెరా ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు Android 16 ఆధారిత OriginOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో విడుదల కావడం విశేషం.. మిలిటరీ

మనం రోజూ వాడుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీల యుగంలోకి అడుగుపెట్టిన మన దేశంలో.. బ్యాంకింగ్ సాక్ష్యాల కోసం ఇప్పటివరకు 1891 నాటి అంటే ఏకంగా 135 ఏళ్ల నాటి పాత చట్టాన్నే వాడుతున్నామంటే ఆశ్చర్యం కలగక మానదు. బ్రిటిష్ కాలంలో పేపరు ఖాతాలు, పెద్ద పెద్ద రిజిస్టర్లను ఉద్దేశించి చేసిన ఆ పాత చట్టానికి కాలం చెల్లిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో ఇటీవలే బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026ను ఆమోదించి, డిజిటల్ రికార్డులకు చట్టబద్ధమైన పవర్ ఇచ్చింది.ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలు కోర్టులో పక్కా ప్రూఫ్!ఈ కొత్త చట్టం తెచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే.. బ్యాంకుల్లో నిర్వహించే ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను కోర్టు విచారణల్లో పూర్తిస్థాయి సాక్ష్యాలుగా గుర్తిస్తారు. ఒకప్పుడు చేతితో రాసిన పుస్తకాలను మాత్రమే సాక్ష్యంగా తీసుకునేవారు. కానీ ఇకపై బ్యాంకులు భద్రపరిచే కంప్యూటర్ రికార్డులు, ఆన్లైన్ స్టేట్మెంట్లు న్యాయస్థానాల్లో నేరుగా ఆధారాలుగా నిలుస్తాయి. అయితే ఇవి హ్యాకింగ్ కాకుండా, సమాచారం తారుమారు కాకుండా ఉండేలా బ్యాంకులు కచ్చితమైన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఒరిజినల్ బుక్స్ అక్కర్లేదు.. సర్టిఫైడ్ కాపీ ఉంటే చాలు!సాధారణంగా ప్రతి చిన్న కేసుకు బ్యాంకు ఒరిజినల్ రికార్డులను, సర్వర్లను కోర్టుకు మోసుకొని రావడం సాధ్యం కాదు. ఈ సమస్యను నివారించడానికి బ్యాంకులు ఇచ్చే సర్టిఫైడ్ కాపీ ని ఆధారంగా స్వీకరించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల న్యాయస్థానాల్లో కేసుల విచారణ వేగవంతమవుతుంది. అలాగే బ్యాంకు అధికారులు అనవసరంగా రోజుకో కేసుకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పనిలేకుండా వారికి రక్షణ కల్పించారు. రికార్డులపై ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టు వారిని నేరుగా హాజరుకావాలని ఆదేశిస్తుంది.బ్యాంకుల రూపురేఖలు చేంజ్: నిర్మలా సీతారామన్ బిగ్ అనౌన్స్మెంట్!పోలీసులకు డైరెక్ట్ యాక్సెస్.. ప్రైవసీపై కొత్త చర్చ!ఈ చట్టంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక అంశం.. దర్యాప్తు సంస్థలు

కొద్దిపాటి డబ్బుకు ఆశపడి సైబర్ మోసగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకిచ్చిన ముగ్గురు యువకులను పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.25 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన సైబర్ నేరాల్లో కొత్త తరహా మోసాలను వెలుగులోకి తెచ్చింది.వివరాల్లోకి వెళితే.. ప్రభాకర్, అమిత్, దీపక్ అనే ముగ్గురు యువకులు సైబర్ మోసగాళ్లతో చేతులు కలిపారు. నిందితుల్లో ఇద్దరు ర్యాపిడో బైక్-ట్యాక్సీ రైడర్లుగా పనిచేస్తుండగా, మరొకరు ఇదే తరహా నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నాడు. మోసగాళ్లు దొంగిలించిన డబ్బును వీరి ఖాతాల్లోకి జమ చేసి, అక్కడి నుంచి వేరే ఖాతాలకు బదిలీ చేసేవారు. ఇలా జరిగిన ఒక్కో లావాదేవీకి వీరికి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు కమీషన్ అందేది.ఈ వ్యవహారంపై దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ సంగీతా కుమారి నేతృత్వంలో దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించారు. ఇద్దరిని పాట్నాలో, మూడో వ్యక్తిని బీహార్‌లోని బక్సర్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.ఈ లావాదేవీల వెనుక ఉన్న అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠాను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ముఠాకు ఇంకా ఎవరెవరు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు

మన దేశంలో నోట్ల రద్దు తరవాత రూ.2000 నోటు మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని హవానే నడిచింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారత నగదు వ్యవస్థను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఏకైక నోటు.. మన రూ.500 మాత్రమే! మనం పర్సు తెరిచినా, మార్కెట్‌కు వెళ్లినా, ఏటీఎం నుంచి డబ్బులు తీసినా మన చేతికి ఎక్కువగా వచ్చేది ఐదొందల నోటే. అయితే ఈ నోటు భారత కరెన్సీ సామ్రాజ్యంలో ఎంతటి పెద్ద పీట వేసిందో తెలుసా? ఏకంగా 85 శాతానికి పైగా నోట్ల విలువ ఈ ఒక్క నోటుదే కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలే ఈ విచిత్రమైన పరిస్థితిని కళ్ళకు కడుతున్నాయి.ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం.. దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ దాదాపు రూ.42.44 లక్షల కోట్లు. ఇందులో ఒక్క రూ.500 నోట్ల విలువే రూ.36.29 లక్షల కోట్లుగా ఉంది. అంటే శాతాల్లో చెప్పాలంటే మొత్తం నోట్ల విలువలో 85.5 శాతం కేవలం ఐదొందల నోట్లతోనే నిండిపోయింది. మన దేశంలో తిరుగుతున్న మొత్తం నోట్లలో దాదాపు 41.3 శాతం నోట్లు రూ.500 కరెన్సీవే. సంఖ్య పరంగా చూస్తే సగానికంటే తక్కువగానే ఉన్నప్పటికీ, విలువ పరంగా చూస్తే మాత్రం 80 శాతానికి పైగా మార్కెట్‌ను ఈ ఒక్క నోటే ఏలేస్తోంది. RBI ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం ఆమోదం.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనమిగతా నోట్ల పరిస్థితి ఏమిటి?ఐదొందల నోటు అంత పెద్ద పీట వేస్తే, మరి మన పాత రూ.100, రూ.200 నోట్ల పరిస్థితి ఏమిటనే సందేహం రావచ్చు. రూ.500 తర్వాత ఆ స్థాయిలో రూ.100 నోటు రెండో స్థానంలో నిలిచింది. చలామణిలో ఉన్న రూ.100 నోట్ల మొత్తం విలువ రూ.2.80 లక్షల కోట్లుగా ఉంటే, రూ.200 నోట్ల విలువ రూ.2.13 లక్షల కోట్లుగా ఉంది. ఇక చిన్న కరెన్సీ నోట్లయిన

జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా: జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 3వ తేదీన బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 1995 నుండి బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని దక్కించుకున్న పీకే.. బీజేపీకి గట్టి దెబ్బ కొట్టి చరిత్రాత్మక ఎన్నికల రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 64,151 ఓట్లు సాధించిన పీకే.. బీజేపీకి చెందిన నీరజ్ కుమార్‌ను 19,324 ఓట్ల తేడాతో ఓడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు వెళ్లడంతో.. బంకీపూర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో పోటీ చేసిన పీకే.. ఎవరూ ఊహించని రీతిలో విజయం ఢంకా మోగించి.. బిహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారులు.. కోనసీమ జిల్లా యంత్రాంగం అలర్ట్ ఎన్టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే..ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే. Venkatrao Lella Images: Pinterest 17 AUG 2026 దేశంలో కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద చలామణిలోకి తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున తొలుత చలామణిలోకి తీసుకురానుంది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా ఆమోదం లభించింది. నోట్లను చలామణిలోకి తీసుకొచ్చాక ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తారు. విజయవంతమైతే.. కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అయితే ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరెన్సీ నోట్లను తొలగించమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రెండు సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. ఎప్పటిలాగే పేపర్ నోట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ప్లా్స్టిక్ నోట్ల తయారీ అనేది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కేంద్రం తెలిపింది. ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పుడే చెప్పలేమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ నోట్లను సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. నీటిలో తడిచినా లేదా మురికి పట్టినా ఇవి పాడవ్వవు. ప్లాస్టిక్ నోట్లలో అనేక భద్రతా ఫీచర్లు, పారదర్శక విండోలు ఉంటాయి. దీంతో నకిలీ నోట్లను ప్రింట్