
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
IBPS RRB Recruitment 2026: చాలా కాలంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గ్రామీణ బ్యాంకుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది, దీనికి అప్లికేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది. కనీస అర్హతగా డిగ్రీ ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా అవసరం. ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. మొత్తం 8,183 ఆఫీస్ అసిస్టెంట్, 4,256 ఆఫీసర్ స్కేల్-1, 1,472 స్కేల్-2, 250 స్కేల్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు.
వయస్సు.. వయోపరిమితి విషయానికి వస్తే: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-1 కి 18 నుండి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి..SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, PwD అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
అర్హతలు.. అర్హతల విషయానికి వస్తే, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు డిగ్రీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టా ఉండాలి. వీటితో పాటు స్థానిక భాష, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ మేనేజర్) పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ విభాగాల్లో పట్టా ఉన్నవారు అర్హులు. ఆఫీసర్ స్కేల్-3 (స్పెషలిస్ట్ ఆఫీసర్) పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం 50 శాతం మార్కులు ఉండాలి, సీఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పని చేసిన వారు అర్హులు.
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 'RRB' ఎంపిక చేసి, సంబంధిత పోస్టుపై క్లిక్ చేయండి. 'Register Now' ద్వారా లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత మరియు విద్యా వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత RRBలో మీ స్టేట్‌ను ఎంపిక చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. నిర్ణీత రుసుము చెల్లించి, వివరాలను ఒకసారి సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేసి అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. SC, ST, PwD రూ.175, ఇతర క్యాటగిరీ అభ్యర్థులు రూ.850 రూపాయల ఫీజు చెల్లించాలి.
పరీక్షా విధానం: IBPS ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు మాత్రమే ఉంటాయి,. ఇంటర్వ్యూ ఉండదు. అయితే మిగిలిన పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహించబడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.