SBI Bulk Fixed Deposits: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కిందటి రోజు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు సంబంధించి కొత్త ఛార్జీల్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇక్కడ నెలకు 4 ఉచిత క్యాష్ విత్‌డ్రా (బ్యాంకులు, ఏటీఎం, డిజిటల్) లావాదేవీలు పూర్తయిన తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 15 ప్లస్ జీఎస్టీ చెల్లించాలని, ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎస్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే ఇది కేవలం బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపైనే, ఎంపిక చేసిన టెన్యూర్లపైనే వర్తిస్తుంది. దీంతో రూ. 3 కోట్లు, ఆపైన డిపాజిట్ చేసే వారికి రాబడి తగ్గుతుందని చెప్పొచ్చు. రూ. 3 కోట్ల లోపు చేసే రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మాత్రం మార్చలేదు. కొత్త వడ్డీ రేట్లు 2026, ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈ మేరకు బ్యాంక్ స్పష్టం చేసింది.వేర్వేరు టెన్యూర్ బల్క్ డిపాజిట్లపై గరిష్ఠంగా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ 7 రోజుల నుంచి 179 రోజుల వరకు వ్యవధి ఉన్న అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. 180 రోజుల నుంచి 210 రోజుల వ్యవధి డిపాజిట్‌పై 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.6 శాతం నుంచి 5.5 శాతానికి చేర్చింది. ఇక 211 రోజుల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు వ్యవధి బల్క్ ఎఫ్డీపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఏ టెన్యూర్‌కు ఎఫ్డీ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.7-14 రోజుల డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 4.25 శాతానికి తగ్గించింది. 15-45 రోజుల బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి వడ్డీ రేట్లను 4.75 శాతానికి తగ్గించింది. 46-179 రోజుల వ్యవధి ఎఫ్డీపై 5.1 శాతం నుంచి 4.85 శాతానికి చేర్చింది. అత్యధికంగా ప్రస్తుతం ఈ బ్యాంకులో ఏడాది నుంచి రెండేళ్ల వరకు వ్యవధి బల్క్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇదంతా సాధారణ ప్రజలకు కాగా, సీనియర్ సిటిజెన్లకు ఈ వడ్డీ రేట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు ఆఫర్ చేస్తోంది. వీరికి అత్యధికంగా 6.75 శాతం వడ్డీ వస్తుంది.Read Also: రూ. 10 వేల సిప్ vs లేదా ఒకేసారి రూ. 10 లక్షల ఎఫ్డీ.. 15 ఏళ్లలో దేంట్లో రాబడి ఎంతొస్తుందో లెక్కలిదిగో..ఎస్బీఐ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లురెగ్యులర్ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. సాధారణ ప్రజలకు వారం నుంచి పదేళ్ల టెన్యూర్ వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కనీసం 3.05 శాతం నుంచి 6.40 శాతం వరకు ఉండగా, సీనియర్ సిటిజెన్లకు 3.55 శాతం నుంచి 7.05 శాతంగా ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ సిటిజెన్లకు అత్యధికంగా 2-3 ఏళ్ల డిపాజిట్లపై 6.40 శాతంగా వడ్డీ రేటు ఉంటే, సీనియర్ సిటిజెన్లకు 5-10 ఏళ్ల FD పై 7.05 శాతం వడ్డీ రేటు ఉంది.





