
Aug 19 2026 9:23 AM | Updated on Aug 19 2026 9:23 AM
బ్యాంకాక్: తీవ్రమైన వ్యాయామం గుండెపై చూపే ప్రతికూల ప్రభావాలు, సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ‘హైరాక్స్ (HYROX) 2026’ ఫిట్నెస్ పోటీల్లో పాల్గొన్న 41 ఏళ్ల ఫిట్నెస్ కోచ్ లెరాయ్ సాండర్స్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన సాండర్స్ బ్యాంకాక్‌లో ‘ఐఏవోటీ క్రాస్‌ఫిట్’ వ్యాయామశాల యజమాని. ‘ఫైట్ బై డిజైన్’ వ్యవస్థాపకుడు.
పోటీల సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన ఆయనకు సీఆర్పీ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, అధికారిక నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర శారీరక శ్రమ గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం తెరపైకి వచ్చింది. తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ప్రాణవాయువును అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం సహజం.
సాధారణంగా వ్యాయామం వల్ల గుండెకు మేలు జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, ముందస్తుగా గుర్తించని గుండె సమస్యలు ఉన్నప్పుడు లేదా శరీర సామర్థ్యానికి మించి శ్రమించినప్పుడు ప్రమాదకరమైన హృదయ స్పందనల లోపాలు (వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటివి), సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కార్డియోమయోపతి, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి, తీవ్రమైన ఆయాసం, మైకం, కళ్లు తిరగడం, అసాధారణ హృదయ స్పందనలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే శిక్షణ ఆపి వైద్యులను సంప్రదించాలి. ఫిట్నెస్గా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు రావనే భావన సరికాదని, శరీర సామర్థ్య పరిమితులను తెలుసుకుని వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాఖీ 27నా? 28నా?.. గ్రహణ ప్రభావమెంత?
సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)
కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు)
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు)
జైలు నుంచి హాస్పిటల్.. ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్
అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే..





