
బ్యాంకులు 14 రోజులు సెలవులు.. రాష్ట్రాల వారీగా పూర్తి హాలిడే లిస్ట్ ఏపీ, తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు సెప్టెంబర్ హాలిడే లిస్ట్ ప్రకటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా September 2026 Bank Holidays : సెప్టెంబర్లో బ్యాంకు పనులు పెట్టుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఈ నెలలో బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగానే ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉందో తెలుసుకోవడం బెటర్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకు శాఖలకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజున బ్యాంకులు మూతపడవు. స్థానిక పండుగలు, ప్రాంతీయ (September Bank Holidays) కార్యక్రమాలను బట్టి ఆయా రోజుల్లో సెలవుల్లో మార్పులు ఉంటాయి. సెప్టెంబర్లో వచ్చే వినాయక చవితితో పాటు ఇతర పండుగ సెలవులు, సాధారణ వారాంతపు సెలవులతో కలిపి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు మొత్తం 14 రోజుల వరకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ బ్యాంకు సెలవులన్నీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. మీరు ఉండే ప్రాంతంలో మీ హోం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లే ముందు బ్యాంకు సెలవు జాబితాను చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. సెప్టెంబర్లో వీకెండ్ హాలిడేస్ ఇవే : సెప్టెంబర్ 2026లో 4 ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 6 జనరల్ హాలిడేస్ ఉన్నాయి. సెప్టెంబర్ 6 : ఫస్ట్ ఆదివారం సెప్టెంబర్ 12: రెండో శనివారం సెప్టెంబర్ 13: రెండో ఆదివారం సెప్టెంబర్ 20: మూడో ఆదివారం సెప్టెంబర్ 26: నాల్గవ శనివారం సెప్టెంబర్ 27: నాల్గవ ఆదివారం పండుగలు, ప్రత్యేక సెలవులివే : సెప్టెంబర్ 4 – జన్మాష్టమి : జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూతపడతాయి. Read Also : Vivo X500 Pro Max : డిస్ప్లేలో వివో కొత్త ప్రయోగం.. 2K స్క్రీన్.. 200MP కెమెరా.. వివో X500 ప్రో మ్యాక్స్ ఇదేనా? సెప్టెంబర్ 11 – రాజస్థాన్ : జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్లో బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 12 – అస్సాం : శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి సందర్భంగా అస్సాంలో బ్యాంకులు మూతపడతాయి. ఇదే రోజు రెండో శనివారం కూడా సెప్టెంబర్ 14 – వినాయక చతుర్థి : గణేష్ చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఒడిశా, గోవా తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 15 : సంవత్సరి, నువాఖై, గణేష్ చతుర్థి రెండో రోజు సందర్భంగా గుజరాత్, ఒడిశా, గోవాలో బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 21 : శ్రీమంత శంకరదేవ్ జయంతి, శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా అస్సాం, కేరళలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 22 – కర్మ పూజ : కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్లో బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 23 – జమ్మూ కాశ్మీర్ : మహారాజా హరి సింగ్ జీ జన్మదినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో బ్యాంకులకు సెలవు సెప్టెంబర్ 25 – సిక్కిం : ఇంద్రజాతర సందర్భంగా సిక్కింలో బ్యాంకులు పనిచేయవు. ఆన్లైన్ సేవలు అందుబాటులోనే.. : బ్యాంకులు సెలవు రోజుల్లో మూతపడినా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అలాగే కొనసాగుతాయి. బ్యాంకు కస్టమర్లు ఏటీఎంలు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు పనిచేస్తాయి. అయితే, ముందస్తుగా సిస్టమ్ అప్డేట్లు లేదా సాంకేతిక నిర్వహణ సమయంలో డిజిటల్ సేవలకు అంతరాయం కలగొచ్చు. అదేవిధంగా క్యాష్ లేదా డాక్యుమెంట్లను నేరుగా బ్యాంకులో సబ్మిట్ చేయడం, అకౌంట్ వెరిఫికేషన్, ఇతర బ్రాంచ్ ఆధారిత సర్వీసులు వంటి పనులకు బ్యాంకు ఓపెన్ చేసి ఉండాలి. అందుకే, సెప్టెంబర్లో బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగా తమ రాష్ట్రంలో వర్తించే సెలవులను ముందుగానే చెక్ చేసుకోవడం బెటర్.




