
Varun Tej: మెగా వారసుడిక్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్
Varun Tej: మెగా వారసుడి క్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్
© 2026 nimisham.in

Varun Tej: మెగా వారసుడి క్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Varun Tej Son | వరుణ్ తేజ్-లావణ్య కొడుకు వాయువ్ ఫేస్ రివీల్.. ఫస్ట్ బర్త్‌డేకే మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్!

Varun Tej: కుమారుడి ఫస్ట్ బర్త్ డే.. ఎట్టకేలకు వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

వరుణ్ తేజ్ నటించిన హిట్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి డిజిటల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది

ఆగస్ట్ (August 2026) మొదటివారంలో కొరియన్ కనకరాజు, డీసీ, జీడీ నాయుడు, కేజేక్యూ, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “కొరియన్ కనకరాజు” క్లీన్ హిట్ అనిపించుకుంది. పరిమిత బడ్జెట్ లో తీయడం, మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వరుణ్ తేజ్ ఈ మూవీతో గట్టెక్కాడు. మిగతా సినిమాల్లో “డీసీ”కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తక్కువ రేటుకు అమ్మకాలు సాగడంతో బయ్యర్లకు బాగానే డబ్బులొచ్చాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రెండో వారంలో “విశ్వనాధ్ అండ్ సన్స్,” పళ్ల బురుసు, పాంచాలి పంచ భర్తృక, అగథ, మకుటం, హుషార్ పిట్టలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “విశ్వనాధ్ అండ్ సన్స్” సినిమా సూపర్ హిట్టయింది. తమిళ్ లో కంటే తెలుగులో మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పళ్ల బురుసుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎమ్మెస్ రాజు తీసిన అగధ చిత్రం కూడా ఆడకపోగా.. విశాల్ చేసిన మకుటం కూడా ఫ్లాప్ అయింది. సురేశ్ బాబు రిలీజ్ చేసిన హుషార్ పిట్టలు సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడో వారంలో ఇరుముడి, ఖలీఫా, సర్దార్ సర్వాయి పాపన్న, అమీర్ లోగ్, రెడ్ బ్యాగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. రవితేజ నటించిన “ఇరుముడి” బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలో టాక్సిక్, కికు చిరంజీవి, హాయ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. యశ్ నటించిన “టాక్సిక్” సినిమా డిజాస్టర్ అయింది. మొదటి వారం 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ, సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఆగస్ట్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, 2 సినిమాలు హిట్

సెప్టెంబర్ మొదటి వారంలో వినోదాన్ని అందించడానికి వివిధ డిజిటల్ వేదికలు సిద్ధమయ్యాయి. ఈ వారం సెప్టెంబర్ 1 నుండి 6 వరకు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు మరియు సిరీస్‌లు ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. థ్రిల్లర్, కామెడీ, హారర్ మరియు కోర్ట్‌రూమ్ డ్రామా వంటి వైవిధ్యమైన శైలులలో ఈ లైనప్ రూపుదిద్దుకుంది. కుటుంబ సమేతంగా చూడటానికి మరియు ఒకేసారి వరుసగా వీక్షించడానికి అనువైన అనేక శీర్షికలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 3న తాప్సీ పన్ను నటించిన గాంధారి చిత్రం ప్రసారం కానుంది. కిడ్నాప్ అయిన తన కుమార్తెను వెతుక్కుంటూ చూపు కోల్పోయిన ఒక తల్లి చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాతో చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనితో పాటు ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన వరుణ్ తేజ్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు సెప్టెంబర్ 4న రానుంది. అనంతపురం కనకరాజు శరీరంలోకి కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇదిలా ఉండగా జూలై 10న థియేటర్లలో సందడి చేసిన అజయ్ దేవగన్ మరియు సంజయ్ మిశ్రా ల కామెడీ చిత్రం ధమాల్ 4 కూడా సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. గుప్తనిధి వేట మరియు గందరగోళం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచుతుంది. దీనితో పాటు ద జెంటిల్మెన్ సీజన్ 2 కూడా సెప్టెంబర్ 3న ప్రసారానికి సిద్ధంగా ఉంది. మరొక ప్రముఖ సంస్థ సోనీ లివ్ లో కుంచాకో బోబన్ నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం సెప్టెంబర్ 4న అందుబాటులోకి రానుంది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక పాత కేసు తిరిగి తెరుచుకోవడంతో ఒక పోలీసు అధికారి జీవితంలో వచ్చే మార్పుల చుట్టూ తిరుగుతుంది. ఫలితంగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్‌ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్ కనకరాజు’కు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనతో ఇప్పుడు ఎంతో రిలీఫ్‌గా ఉందన్నారు. నటుడిగా ఒకే తరహా జానర్‌కు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని.. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావం పెరిగినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడు వారికి పూర్తిస్థాయి వినోదాన్ని అందించడం చాలా ముఖ్యమని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చిన తర్వాత తమ ఒత్తిళ్లను మరిచిపోయేలా సినిమా ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ గురించి కూడా వరుణ్ తేజ్ మాట్లాడారు. గతంలో తాను నటించిన ‘గని’లో క్రీడలతో పాటు పలు అంశాలను కలపడం వల్ల కథ కొంత గందరగోళంగా అనిపించిందని అంగీకరించారు. అయితే ‘బరి’ మాత్రం పూర్తిగా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా అని, ఇందులో స్టోరీ ఎంతో సహజంగా, వాస్తవికంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని వరుణ్ తేజ్ వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ రొమాంటిక్ చిత్రానికి అంగీకరించినట్లు వరుణ్ తేజ్ తెలిపారు. తన వయసుకు తగ్గ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని, రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నమైన శైలిలో ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. రామ్ చరణ్‌తో కలిసి సినిమా

మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ (Varun Tej) ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. తెరపై తన నటనతో అభిమానులను అలరిస్తున్న వరుణ్ తేజ్ కు, కెమెరా వెనుక నిలబడి యాక్షన్ చెప్పాలనే బలమైన కోరిక ఉండేదట. అందరిలాగే హీరో కావాలనే కలతో ఇండస్ట్రీకి రాలేదని, ముందుగా ఒక దర్శకుడిగా రాణించాలనే లక్ష్యంతోనే తాను సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆయన స్వయంగా ఒక సందర్భంలో పంచుకున్నాడు. దర్శకత్వంపై ఉన్న అమితమైన ఆసక్తితోనే వరుణ్ తేజ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఒక సినిమాను తెరకెక్కించడం, తెరపై కథను దృశ్య రూపంలో ఆవిష్కరించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అయితే, కుటుంబ వాతావరణం, తోటి నటుల విజయాలు, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన నటన వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అలా దర్శకుడిగా మారాల్సిన వ్యక్తి, హీరోగా మారి తొలి సినిమా ‘ముకుంద’తో ప్రేక్షకులను పలకరించారు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తనలోని డైరెక్టర్ మాత్రం ఎప్పుడూ సజీవుగానే ఉన్నాడని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తన అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి పనిచేయాలనే బలమైన కోరిక తనలో ఉందని వరుణ్ తేజ్ మనసులో మాట బయటపెట్టాడు. ఒకవేళ భవిష్యత్తులో తాను దర్శకత్వం వైపు అడుగులు వేస్తే, రామ్ చరణ్‌ను హీరోగా పెట్టి ఒక అద్భుతమైన సినిమాను తీయాలనే ఆలోచన ఉందంటున్నాడు. రీసెంట్ గా ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో హిట్ కొట్టాడు ఈ మెగా హీరో

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కొత్త ట్యాలెంట్ ని వెతికి పట్టుకోవడంలో, కొత్త కథలని తయారు చేయించుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి దిల్ రాజు కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఒక కథ నచ్చి అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే దిల్ రాజు వదిలిపెట్టరు. అందుకే దిల్ రాజుకి ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువ. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన కథతో దిల్ రాజు సూపర్ హిట్ కొట్టి చూపించారు. దీని గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యాపీ డేస్ టైం నుంచి శేఖర్ కమ్ములతో పరిచయం ఉంది. హ్యాపీడేస్ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి మంచి పబ్లిసిటీ లభించడంలో దిల్ రాజు స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. హ్యాపీడేస్ రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల చిత్రం ఖరారైంది. ఆ సినిమానే ఫిదా. ఈ చిత్రం విషయంలో తెరవెనుక చాలా కసరత్తు, పరిణామాలు చోటు చేసుకున్నాయి అని దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఫిదా స్టోరీ లైన్ విన్నప్పుడు ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. శేఖర్ కమ్ముల ఈ కథని ఎలాగైనా స్టార్ హీరోతోనే చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు. నేను ఎంటర్ కావడానికి ముందే మహేష్ బాబుకి కథ వినిపించారు. మహేష్ కి కథ నచ్చింది. కానీ తన ఇమేజ్ కి సరిపోతుందా అనే డౌట్ తో పక్కన పెట్టారు. నేను ఎంటర్ అయ్యాక రాంచరణ్ కి కథ వినిపించాం. చరణ్ వద్ద కూడా అదే సిట్యుయేషన్. అల్లు అర్జున్ కూడా విని బావుంది అని అన్నారు. కానీ ఒక స్టార్ హీరోకి సరిపడే అంశాలు ఈ సినిమాలో

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా `కొరియన్ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. దీన్ని కామెడీ హర్రర్, థ్రిల్లర్‌గా ఆయన రూపొందించారు. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 7న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 13రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. 13వ రోజు ఎంత కలెక్షన్లని రాబట్టింది, ఇప్పటి వరకు టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కేవలం రూ.12కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కాకపోతే పెద్ద స్థాయిలో సినిమా వసూళ్లని కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో చేయలేకపోయింది. వంద కోట్ల వరకు వెళ్లలేకపోయింది. ఈ మూవీ 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75కోట్లు రాబట్టింది. బుధవారం దీనికి రూ.25లక్షలు మాత్రమే వచ్చాయి. మంగళవారంతో పోల్చితే మూడు లక్షలు తగ్గాయి. ఇది సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అవుతుందనేదానికి సంకేతంగా చెప్పొచ్చు. మహా అయితే ఈ వారాంతం వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా 10 రోజులకే రూ.50కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు మరో కోటి, రెండు కోట్లు యాడ్ చేసి ఉంటారు. చిత్ర బృందం అధికారిక లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.52కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తుంది. ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం దీనికి నాలుగైదు కోట్ల లాభాలు వచ్చి ఉంటాయి. అదే టీమ్ లెక్కల ప్రకారం పది కోట్లకుపైగానే లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన సోలో విజయం కాబట్టి కనకరాజు మూడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వరుణ్ మాట్లాడుతు ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకుంటున్నారనే విషయం బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడంటే తన అప్ కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ఉండబోతున్నాడో తెలుస్తుంది. వరుణ్ తేజ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే తన సోదరి నీహారిక నిర్మాణ సారధ్యంలో కమిటి కర్రోళ్ళు డైరెక్టర్ తో 'బరి' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన లిస్ట్ లో తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుంది. ఇటీవలే "కొరియన్ కనకరాజు" చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని పూర్తి జోరు మీదున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాల బాటలో వెళ్లకుండా, కథాంశంలో వైవిధ్యం ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి ఓ విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన మూస ధోరణిలో, రెగ్యులర్ ఎమోషన్స్‌తో సాగుతుంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం దానికి నూటికి నూరు శాతం భిన్నంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రస్తుత వయస్సుకు, మెచ్యూరిటీకి సరిగ్గా సరిపోయే ఒక పరిణతి చెందిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుందని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. ఇది రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, ప్రేక్షకులు అస్సలు ఊహించని కొత్త కోణంలో సాగుతుందని, కథనంలో ఉండే వినూత్న ట్విస్టులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్తీక్

కొరియన్ కనకరాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇటీవల కొరియన్ కనకరాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej ) తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ముందు నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)తో కలిసి ఓ రొమాంటిక్ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా తన వయసుకు తగ్గ ప్రేమకథగా ఉంటుందని వరుణ్ తేజ్ వెల్లడించారు. అయితే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ (Love Story) లా ఉండదని, తన వయసుకు సరిపోయే ప్రేమకథను కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించనున్నారని పేర్కొన్నారు. ఈ కథ చాలా భిన్నంగా ఉండబోతుందని తెలిపారు. ఇదిలాఉంటే.. కార్తీక్ సుబ్బరాజ్ మొదటి నుంచి కొత్త తరహా కథనం, టేకింగ్‌తో అగ్ర దర్శకులు రాజమౌళి, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, వెట్రి మారన్ వంటి దిగ్గజ దర్శకుల జాబితాలో పేరు గడించాడు. తన సినిమాల్లో విభిన్నమైన కథనం, ప్రత్యేకమైన పాత్రలను చూపించడంలో పేరుగాంచిన అలాంటి దర్శకుడితో వరుణ్ తేజ్ లవ్ స్టోరీ చేయనుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. చాలామంది షాక్ కూడా అవుతున్నారు. కాగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, హీరోయిన్, ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ తదితర విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ గతంలోనూ జానర్ పరంగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేయబోయే ఈ డిఫరెంట్ లవ్ స్టోరీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది

తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మెగా జంట వరుణ్ తేజ్(VarunTej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంట బుధవారం హైదరాబాద్‌లోని తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని (Shree Tadbund Veeranjaneya Swami Temple) సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ నరేందర్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలను సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ దంపతులు మాట్లాడుతూ.. ఎంతో మహిమగల వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని చూసేందుకు ఆలయం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరోహీరోయిన్లతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడంతో అక్కడ సందడి నెలకొంది

ఇంటర్నెట్ డెస్క్: ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju)తో హిట్ అందుకున్నారు టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సినిమాల ఎంపిక, రాబోయే ప్రాజెక్ట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అన్న రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనుందని వెల్లడించారు. ‘‘ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ తర్వాత ప్రశాంతంగా ఉన్నాను. గత 5 ఏళ్లుగా సరైన విజయం దక్కలేదు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం సంతోషంగా ఉంది. మొదటి నుంచి నేను ఒకే జానర్ సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నా. ఒక నటుడు ఏ క్యారెక్టర్లోనైనా, ఏ జానర్లోనైనా ఇమడగలగాలి. కోవిడ్‌లో ఓటీటీ కంటెంట్ చాలా చూశాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాలు చేయాలని అప్పుడే అర్థమైంది. వాళ్లు థియేటర్లో సినిమా చూసి, నవ్వుతూ.. ఒత్తిడి, టెన్షన్లు మర్చిపోవాలి. అదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు. ‘గని’ ఫెయిల్ అయ్యాక మళ్లీ స్పోర్ట్స్ డ్రామా ఎందుకు? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘గని’లో అన్నీ కలిపి గందరగోళం చేశాం. ఈసారి ‘బరి’ చాలా రూటెడ్‌గా, హైపర్-ఫోకస్డ్గా ఉంటుంది’ అని స్పష్టం చేశారు. నిహారిక గురించి మాట్లాడుతూ.. ‘మేం ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ‘బరి’ (Bari) ఐడియా తనే ఇచ్చింది. నచ్చడంతో ఓకే చెప్పా. యంగ్, ప్యాషనేట్ టీమ్‌తో వర్క్ చేయడం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ సినిమాకు కూడా ఓకే చెప్పా. ఇది నా వయసుకి సూట్ అయ్యే లవ్ స్టోరీ. ఇతర ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. ‘‘ చరణ్ అన్నయ్య పెద్ద స్టార్. ఆయన సినిమాలపై పెట్టే ఎఫర్ట్ చూసి నేను కూడా అలా అవ్వాలని అనుకుంటాను. ప్రతీ యాక్టర్‌కి పోలికలు ఉంటాయి. దాన్ని పాజిటీవ్‌గా తీసుకోవాలి. చరణ్ అన్నతో ఒక సినిమా చేయాలని ఉంది. నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. నేను ఇండస్ట్రీకి డైరెక్టర్ కావాలనే వచ్చాను

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఓటిటిలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్, సెప్టెంబర్ 10 లేదా 11 తేదీలలో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. దర్శకుడు మెర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం, వరుణ్ తేజ్ కెరీర్లో ఒక బలమైన హిట్‌గా నిలిచింది. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో వరుణ్ తేజ్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం ₹50 కోట్ల వసూళ్లను దాటేసి రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రానికి ఇది భారీ విజయం అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. దాదాపు ₹26 కోట్ల భారీ మొత్తానికి ఈ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. థియేటర్లలో భారీ సక్సెస్ సాధించడంతో, ఓటిటి విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా, సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటి వద్దే కూర్చుని కొరియన్ కనకరాజు కామెడీని ఆస్వాదించేందుకు నెటిజన్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా, కొరియన్ కనకరాజు తన అద్భుతమైన కథాంశంతో థియేటర్ల తర్వాత డిజిటల్ తెరపై కూడా సందడి చేయనుంది. కామెడీ మరియు హారర్ కలబోతగా

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పుడాయన నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ లవ్‌స్టోరీలు, యాక్షన్ థ్రిల్లర్లు, స్పేస్ అడ్వెంచర్, బాక్సింగ్ డ్రామా, పేట్రియాటిక్ సినిమాలు ఇలా జోనర్ ఏదైనా సరే తనదైన నటనతో వైవిధ్యం చాటుకుంటూ వస్తున్నారు. అయితే, వరుణ్ గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో వరుణ్‌కి ఎప్పుడెప్పుడు హిట్ వస్తుందా? అని అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా ఆయన నటించిన సరికొత్త ఇండో-కొరియన్ హారర్-కామెడీ డ్రామా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సంచలన విజయాన్ని నమోదు చేసి, థియేటర్ల వద్ద కలెకన్ల సునామీ సృష్టిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఆగస్ట్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 50.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీకెండ్స్‌లోనే కాకుండా వీక్డేస్లోనూ ఈ సినిమా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తూ.. వరుణ్ తేజ్ కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిందీ చిత్రం. ఇక ‘కొరియన్ కనకరాజు’ కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ గ్రామానికి చెందిన కనకరాజు అనే పల్లెటూరి కుర్రాడి శరీరంలోకి ఊహించని

ఒకప్పుడు మీనా .. రంభ .. నగ్మా వంటి బొద్దుగా ఉన్న బ్యూటీలు తెలుగు తెరను ఒక ఊపు ఊపేశారు. స్టార్ హీరోలతో కలిసి వరుస విజయాలను అందుకుంటూ, తమ కెరియర్ ను పరుగులు తీయించారు. అలా కాస్త బొద్దుగా కనిపిస్తూ .. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ మధ్య కాలంలో యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీగా రితికా నాయక్ కనిపిస్తుంది. 'మిరాయ్' సినిమాలో ఈ సుందరిని చూసిన కుర్రాళ్లు, థియేటర్స్ దగ్గరే మనసులు పోగొట్టుకున్నారు. ఈ ముద్దుగుమ్మ నెలకో సినిమా చేస్తే బాగుండునే అనుకున్నారు. కానీ 'మిరాయ్' మాదిరిగానే తనకి బాగా నచ్చే కంటెంట్ కోసం రితికా ఎదురుచూస్తూ వచ్చిందనే విషయం, 'కొరియన్ కనకరాజు' రిలీజ్ తరువాతనే అర్థమవుతోంది. రీసెంటుగా విడుదలైన ఈ సినిమా, అనూహ్యమైన రెస్పాన్స్ ను అందుకుంది. కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఫలితం ఊరటను ఇచ్చింది .. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాలోను నటన పరంగా .. గ్లామర్ పరంగా రితికా మంచి మార్కులు కొట్టేసింది. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుందని అనిపించింది. కొంత కాలంగా టాలీవుడ్ లో హీరోయిన్స్ వైపు నుంచి సందడి తగ్గిందనే చెప్పాలి. ఒకటి రెండు సినిమాలు చేసుకుపోతున్నారే తప్ప, నిలకడగా ఎవరూ సక్సెస్ లు సాధించలేకపోతున్నారు. టాప్ త్రీ .. టాప్ 5 అంటూ గతంలో మాదిరిగా ఒక జాబితా చూసుకుంటే, ఎవరూ కనిపించని ఒక గందరగోళం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరో భారీ హిట్

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. ఆయన మొదటి సారి హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో `కొరియన్ కనకరాజు` మూవీ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. దీనికి ముందు అటు వరుణ్ తేజ్, ఇటు మేర్లపాక గాంధీకి హిట్లు లేవు. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఈ మూవీని చేశారు. చాలా కసితో చేశారని చెప్పొచ్చు. ఆ కసి సినిమాలో కనిపిస్తుంది. ఆగస్ట్ 7న `కొరియన్ కనకరాజు` మూవీ విడుదలైంది. కామెడీ అంశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో సినిమా జనాలకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సినిమాకి నిజమైన హీరో అయనే అని చెప్పొచ్చు. అంతగా సినిమాని నడిపించాడు. వరుణ్ కి హిట్ రావడానికి కారకుడయ్యాడు. అలాగే మేర్లపాక గాంధీ టేకింగ్, రైటింగ్, మ్యూజిక్ వంటివన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. మొత్తంగా వరుణ్ తేజ్ హిట్ కొట్టారు. బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక ఈ మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎంత లాభాలు సాధించిందనేది చూస్తే. `కొరియన్ కనకరాజు` మూవీకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, థియేట్రికల్ బిజినెస్ రూ.12కోట్లు అని సమాచారం. నాన్ థియేట్రికల్‌గానే దీనికి రూ.26కోట్ల వరకు వచ్చిందట. దీంతో పన్నెండు కోట్లని థియేట్రికల్‌గా నిర్ణయించారు. ఈ లెక్కన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు లాభాల దిశగా వెళ్తోంది. ఈ సినిమాకి పదిరోజుల్లో రూ.31.15కోట్లు వచ్చాయి. అంటే రూ.16కోట్ల షేర్ వచ్చింది. నాలుగు కోట్లకుపైగానే లాభాలు పొందింది. ఈ

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకులకు వరుస విజయాలు సాధించడం చాలా అవసరం. సరైన విజయం లేకపోతే అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవలే అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో మంచి విజయం సాధించి తన కెరీర్‌ను మళ్లీ బలమైన బాటలో నిలబెట్టారు. ఇప్పుడు అదే రీతిలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కనక రాజు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. గత కొంతకాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ ఈ విజయంతో పెద్ద ఊరట చెందారు. వరుసగా వచ్చిన పరాజయాలు మెగా బ్రాండ్ ఇమేజ్‌పై కొంత ప్రభావం చూపినప్పటికీ ఆయన ధైర్యంగా ముందుకు సాగారు. కొరియన్ కథాంశం ప్రేరణతో తెరకెక్కిన కనక రాజు సినిమాతో ఇప్పుడు వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ప్రేక్షకులను మెప్పించడంలో ఈ చిత్రం విజయవంతమైంది. ప్రారంభ మూడు రోజుల్లోనే ఈ సినిమాకు అత్యంత భారీ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయని సమాచారం అందుతోంది. దీంతో ఈ హారర్ కామెడీ డ్రామా చిత్రం వేగంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం వరుణ్ తేజ్ కెరీర్‌కు ఎంతో ప్లస్ పాయింట్‌గా మారింది. ఫలితంగా అటు అఖిల్ ఇటు వరుణ్ తేజ్ ఇద్దరూ ఒకే సమయంలో విజయాలు సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఒక్క మంచి విజయం హీరోలకు మరో ఐదారు ఏళ్ల పాటు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నాని తన కెరీర్‌ను చిన్నగా ప్రారంభించి ప్యారడైజ్ చిత్రంతో 200 కోట్ల క్లబ్లో చేరిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మెగా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. వైజాగ్‌లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ గాంధీ, నేను ఈ సినిమాకు ఫ్రెండ్స్‌లా కలిసి పనిచేశాం. అదే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఒక కారణమని అనుకుంటున్నాను. మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది. మా నిర్మాతలు యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మా విజన్ ని సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. మా కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ అందరికీ పేరుపేరునా బిగ్ థ్యాంక్స్. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమాకు బిగ్ పిల్లర్. మురళీధర్ గౌడ్ గారు, సునీల్ అన్న, రేవంత్ ఇలా మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రితిక మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. సత్య ఈ సినిమాతో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా డెడికేషన్ ఉన్న యాక్టర్. చిరంజీవి గారు చెప్పినట్టు ఈ సినిమాకు తను బిగ్గెస్ట్ ఎసెట్. నన్ను నాకంటే ఎక్కువగా నమ్మిన నా భార్య లావణ్యకు చాలా థ్యాంక్స్. మా అమ్మ
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ.. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన వరుణ్.. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అయితే గత ఏడేళ్లుగా సినిమాలు ఆశించి స్థాయిలో ఆడకపోవడంతో బాధ పడ్డానని, తాను మళ్లీ హిట్ కొడతానని అనుకోలేదని వరుణ్ చెబుతున్నారు.శుక్రవారం సాయంత్రం వైజాగ్ లో 'కొరియన్ కనకరాజు' మెగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''కొరియన్ కనకరాజు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. నా యాక్టింగ్ శిక్షణ అంతా ఇక్కడ మా సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. మళ్ళీ ఇక్కడికి రావడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన మా టీంలోని ప్రతి ఒక్కరికి నేను థాంక్స్ చెప్తున్నా'' అని అన్నారు.''గాంధీ, నేనూ.. డైరెక్టర్ హీరోలా కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పని చేసాం. అదే ఈరోజు ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణమని అనుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా కలిసి సినిమా చేస్తాం. మా ప్రొడ్యూసర్స్ యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ థాంక్యూ సో మచ్. సినిమాకి పనిచేసిన వారందరికీ పేరు పేరునా పెద్ద థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'ఓజీ' నుంచి దుమ్ము లేపుతున్నాడు. నాకు OG లెవెల్ వద్దులే కానీ, ఎంతో కొంత ఇవ్వమని తమన్ ని అడిగాను. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి పిల్లర్ గా నిలిచాడు. రితికా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vishwambhara Release Line Clear: యూవీ క్రియేషన్స్ తెలుగులో తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఈ ఇయర్ ఈ బ్యానర్ నుంచి విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్, శర్వానంద్‌లు హీరోగా నటించిన ‘బైకర్’ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాతో 6 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్‌కు సోలోగా హిట్ దక్కింది. ఈ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మించింది. గతంలో అనుష్క ‘ఘాటి’ సినిమా కూడా వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కడం విశేషం. మధ్యలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, మట్కా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్‌గా నిలిచాయి. తాజాగా గత శుక్రవారం విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ సినిమా మూడు రోజుల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 6 రోజుల్లో 16 కోట్ల షేర్ (రూ.30 కోట్ల గ్రాస్)ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది. మొత్తంగా రూ. 2.5 కోట్ల లాభాలను థియేట్రికల్‌గా అందుకుంది. ఈ సినిమా

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన మూవీ `కొరియన్ కనకరాజు`. సత్య కామెడీ హైలైట్‌గా సాగిన ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. `కొరియన్ కనకరాజు` మూవీ ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఆరో రోజు దీనికి రూ.1.70కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఐదో రోజుతో పోల్చితే 17శాతం డ్రాప్ కనిపిస్తుంది. అయినా వసూళ్లు స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. వీక్ డేస్‌లో ఈ మూవీకి ఈ స్థాయిలో ఉండటం విశేషమనే చెప్పాలి. అయితే వరుణ్ తేజ్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మంచి రివ్యూస్ వచ్చాయి. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ మొదటి వారంలోనే ఇంతటి భారీగా డ్రాప్ కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా వంద కోట్ల దిశగా వెళ్తుందని భావించారు. కానీ చూడబోతుంటే, యాభై కోట్ల వద్దే ఆగిపోయేలా ఉంది. ఇక `కొరియన్ కనకరాజు`కి ఇప్పటి వరకు ఎంత వచ్చాయనేది చూస్తే, సాక్నిల్క్ లెక్కల ప్రకారం రూ.25.54కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో ఇండియాలో రూ.21కోట్ల గ్రాస్, రూ.18.22కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్లో రూ.4.60కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ ముప్పై కోట్లు కూడా దాటలేదు. ఇతర ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం మరో మూడు కోట్లు అదనంగా చూపిస్తున్నాయి. అంటే రూ.28కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, ఇప్పటి వరకు నాన్ థియేట్రికల్ గా రూ.26కోట్లు వచ్చాయి. దీంతో రూ.12కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీకి ఇప్పటికే సుమారు రూ.14కోట్ల షేర్ వచ్చింది

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి చిత్రబృందపై ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్' విజయంతో జోరు మీదున్న అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. డైరెక్టర్ పవన్ సాదినేని చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన రానుంది. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళబురుసు’ ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్య కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్ నటిస్తోన్న కామెడీ జానర్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ మూవీ గ్యాప్ లేకుండా నవ్విస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Dhanush Vs Vijay: ధనుష్‌పై.. విజయ్ సర్కారు నిఘా

చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత తన తమ్ముళ్లు వాళ్ల పిల్లలు, తన తనయుడితో పాటు కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో అతి పెద్ద సి నిమా కుటుంబంగా మెగా ప్యామిలీ టాలీవుడ్ లోపేరు తెచ్చుకుంది. అయితే వీళ్లంతా సినిమాల్లోకి రాకముందు చెన్నైలో ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ గ్రూప్ కు లీడర్ గా ఉండేవారు. పవన్ కూడా హీరో అవ్వకముందు చిరంజీవి ఇంట్లోనే ఉంటూ చదువుకునేవారు. అప్పుడు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, వీళ్లంతా చాలా చిన్న పిల్లలు కావడంతో పవన్ వారిని ఒక ఆట ఆడుకునేవారట బ్లాక్ మెయిల్ కూడా చేసేవారట. రీసెంట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఈవెంట్ ఒకటి జరిగింది. దానికి చిరంజీవి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈవెంట్ లో వరుణ్ చిన్ననాటి పోటో ఒకటి స్క్రీన్ పై చూపించారు. అందులో పవన్ కళ్యాన్ కాళ్లు పట్టుకుని వరుణ్ తేజ్ కనిపించారు. పవన్ అభయంఇస్తున్నట్టు కనిపించారు. ఈ ఫోటోగురించి మాట్లాడుతూ.. ''పవన్ బాబాయ్ ఏదో ఒక అవసరం కోసం ఇలా బ్లాక్ మెయిట్ చేసేవారు. డబ్బులు కావచ్చు.. ఏదైనా కావచ్చు..మేం కూడా ఏదో అవసరం కోసంమే అలా కాళ్లు పట్టేవాళ్లు.. అప్పుడు చాలా సరదాగా ఉండేది'' అని వరుణ్ తేజ్ అన్నారు. వరుణ్ ను మాత్రమే కాదు గతంలో రామ్ చరణ్ ను కూడా పవన్ కళ్యాణ్ ఇలానే బ్లాక్ మెయిల్ చేసేవారు. గతంలో ఈ విషయాన్ని ఇంటర్యూలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు. పవన్-చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హీరోలు కాకముందు బాబాయ్ అబ్బాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారట వీరు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకున్నాడు! ఇది నిజమే. కానీ ఈ సంఘటన చాలా రోజుల క్రింతం జరిగింది. అప్పటికి పవన్ సినిమాల్లోకి రాలేదు

కొరియన్ కనకరాజు సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలో వరుణ్ తేజ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని, చిరంజీవి బాటలోనే నడుస్తానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం ఇప్పటికే 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి దూసుకుపోతోంది. ఈ సక్సెస్ వేడుకలో పాల్గొన్న వరుణ్ తేజ్, తన కెరీర్ ఎదుగుదలలో చిరంజీవి పాత్రను గుర్తు చేసుకున్నారు. నటనలో తనకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని, చిరంజీవి సూచనలను మాత్రమే పాటిస్తానని ఆయన పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఆశయాలను నిజం చేయాలన్న తన తపనను వరుణ్ తేజ్ వేదికపై వెల్లడించారు. పెదనాన్న చిరంజీవి పరువు తీయకుండా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కళ్ళలో ఆనందం చూడటమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను వరుణ్ తేజ్ ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. ఆగస్టు 22 అంటే తన చిన్నప్పటి నుంచి నేషనల్ హాలిడే లాంటిదని, ఆ రోజు స్కూల్‌కు వెళ్లనని నాన్నతో మొండికేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు వెంటనే తనను పెదనాన్న చిరంజీవి ఇంటికి పంపించేవారని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈసారి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను, తన సినిమా సక్సెస్‌తో కలిపి ఘనంగా జరుపుకుంటామని వరుణ్ తేజ్ ప్రకటించారు. చిరంజీవి స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతున్నానని, ఆయన ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. వరుణ్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన

వరుణ్ తేజ్‌కి హిట్ లేక చాలా కాలం అవుతుంది. `తొలి ప్రేమ` తర్వాత ఒక్క సినిమా కూడా ఆడలేదు. వరుసగా పరాజయాలు చవి చూశారు. ఇన్నాళ్లపాటు ఆయన స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఇన్నాళ్ల కష్టం, స్ట్రగుల్స్ అన్నీ పోయాయి. `కొరియన్ కనకరాజు`తో ఆయన ఎట్టకేలకు హిట్ కొట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. రితిక నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. యూవీక్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైన విషయం తెలిసిందే. కామెడీ ప్రధానంగా సాగిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కొంత థ్రిల్లర్ ఎలిమెంట్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సత్య కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా వరుణ్ తేజ్‌కి హిట్‌ని అందించింది. ఈ మూవీ థియేటర్లో విజయవంతంగా రన్ అవుతుంది. అయితే తొలి వీకెండ్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. రూ.38కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి నాన్ థియేట్రికల్‌గా రూ.26కోట్లు వచ్చాయట. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మంచిగానే వచ్చాయి. ఇక థియేట్రికల్‌గా దీనికి రూ.12కోట్ల బిజినెస్ అయ్యింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దాటింది. ఇప్పుడు లాభాల్లో వెళ్తుంది. సినిమా విడుదలై ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు దీనికి నలభై కోట్లు దాటినట్టు చిత్ర బృందం చెప్పింది. కానీ సాక్నిల్క్ వంటి ట్రేడ్ సైట్ల ప్రకారం ఐదు రోజుల్లో దీనికి రూ.24కోట్లు వచ్చినట్టు సమాచారం. మంగళవారం దీనికి కోటిన్నర మాత్రమే వచ్చాయి. సోమవారంతో పోల్చితే సగమే వచ్చాయి. అంటే 50శాతం కలెక్షన్లు పడిపోయాయి. `కొరియన్ కనకరాజు` మూవీకి ఇండియాలో రూ.19.25కోట్ల గ్రాస్, రూ.16.74కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్లో నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇలా ఈ మూవీకి రూ.13కోట్ల వరకు షేర్

మంచి కంటెంట్ మరియు హెల్దీ ఎంటర్టైన్మెంట్ అందిస్తే ప్రేక్షకులు కుటుంబసమేతంగా థియేటర్లకు ఖచ్చితంగా వస్తారని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు ఇంజనీర్ అయితే హీరో వరుణ్ తేజ్ ఐరన్ పిల్లర్ లాంటివాడని చిరంజీవి కొనియాడారు. కమెడియన్ సత్య నటన కాంక్రీట్ లాంటి ఉనికి అని వ్యాఖ్యానించారు. సత్య నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, కేవలం అతని కోసమే ఈ సినిమాను మళ్లీ చూడాలనిపిస్తుందని తెలిపారు. కథానాయిక రితికా నాయక్ గ్లామర్ మరియు మురళీధర్ గౌడ్ సహజ నటన సినిమాకు అదనపు బలంగా నిలిచాయని పేర్కొన్నారు. చిన్న మరియు మధ్యతరహా సినిమాలు థియేటర్లలో ఆడటం లేదనే వాదనలను చిరంజీవి పూర్తిగా తోసిపుచ్చారు. ఇటీవల కాలంలో చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం, లేనిన్ మరియు కొరియన్ కనకరాజు సినిమాలు వరుసగా విజయాలు సాధించాయని గుర్తు చేశారు. కొత్తతనంతో కూడిన కథలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని ఈ విజయాలు నిరూపించాయని చెప్పారు. దీంతో చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా దర్శకులకు ఒక కీలకమైన సలహా ఇచ్చారు. నిర్మాతలు వెచ్చించే ప్రతి రూపాయికి విలువ ఇస్తూ పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీయాలని సూచించారు. కథ బలంగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని స్పష్టం చేశారు. ఫలితంగా సినిమా విజయం సాధించి అనేక మంది సినీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం అనంతపురం నేపథ్యంతో కొరియన్ మూలాలు కలిసిన హారర్ కామెడీగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ విభిన్నమైన

చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలంటే దర్శకులందరూ పరిమిత వ్యయంతో (బడ్జెట్లోనే) చిత్రాలను రూపొందించాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత వెచ్చించే ప్రతి రూపాయికి దర్శకుడు బాధ్యత వహించాలని, సినిమా నిర్మాణ వ్యయంపై నియంత్రణ ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.సినిమా ఫలితాన్ని బడ్జెట్ నిర్ణయించదని, కేవలం కథాబలమే (కంటెంట్) ప్రధానమని చిరంజీవి స్పష్టం చేశారు. "కథ బలంగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఒక సినిమా సాధించే విజయం ఎంతో మంది సినీ కార్మికుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది" అని ఆయన పేర్కొన్నారు.‘కొరియన్ కనకరాజు’ సాధించిన విజయంపై చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు మేర్లపాక గాంధీని ఆయన ప్రశంసించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటుడిగా ఎంతో వైవిధ్యం కనబరిచారని కొనియాడారు. ఈ వేడుకలో కథానాయకుడు వరుణ్ తేజ్, నిర్మాత నాగబాబు, దర్శకులు క్రిష్, మేర్లపాక గాంధీ తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు

వరుణ్‌తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ‘కొరియన్ కనకరాజు’ విజయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు ‘‘ఒక సినిమా విజయం ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్నిస్తుంది. ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సక్సెస్ ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సక్సెస్ క్రెడిట్ దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)కి దక్కుతుంది. వరుణ్‌తేజ్ (Varun Tej) ఈ సినిమా ద్వారా నటుడిగా గొప్ప వైవిధ్యం చూపించాడు. ఈ ద్వితీయార్థం ‘పెద్ది’ విజయంతో మొదలై.. ‘మా ఇంటి బంగారం’, ‘చెన్నై లవ్‌స్టోరీ’, ‘కొరియన్ కనకరాజు’తో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా పరిణామాన్ని నిర్దేశించేది బడ్జెట్ కాదు. కంటెంట్ మాత్రమే. కథ బలంగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఇండస్ట్రీ కళకళలాడాలంటే దర్శకులంతా పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీయాలి. అలాగే నిర్మాతలకు, వారు పెట్టే ప్రతీ పైసాకు డైరెక్టర్ విలువ ఇవ్వాలి’ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘మెగా ఫ్యాన్స్‌కు మంచి సినిమా ఇవ్వాలనే నా ఆలోచన ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉంది’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. ‘ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని నిర్మాత నాగబాబు తెలిపారు. ‘వరుణ్‌తేజ్, మేర్లపాక గాంధీ కష్టానికి దక్కిన గొప్ప ఫలితం ఈ విజయం’ అని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. ‘వరుణ్ తేజ్ ఈ సినిమాకు ప్రతీ విషయంలో బ్యాక్‌బోన్‌గా నిలిచారు. ఆయనతో మరోసారి పనిచేయాలని కోరుకుంటున్నాను’ అని మేర్లపాక గాంధీ చెప్పారు

వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) మంచి కలెక్షన్లు అందుకుంటున్న నేపథ్యంలో చిత్ర బృందం మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రేక్షకులే అసలైన కారణం: ఒక సినిమా విజయం సాధిస్తే నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా ఎంతోమందిలో ఆనందం నింపుతుందని చిరంజీవి అన్నారు. ‘కొరియన్ కనకరాజు’ను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు తలవంచి ధన్యవాదాలు చెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత. మేర్లపాక గాంధీకి ప్రత్యేక ప్రశంసలు: ఈ సినిమా విజయానికి దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రధాన కారణమని చిరంజీవి అన్నారు. సాధారణంగా హారర్ కామెడీ చిత్రాలు చాలా వచ్చినప్పటికీ, ఇందులో కొరియన్ ఫ్లేవర్, ఆ దేశ సంస్కృతిని కథలో భాగం చేయడం మంచి ఆలోచన. అదే మొదటి సక్సెస్. మా బుడ్డోడు సక్సెస్: వరుణ్ తేజ్ మొదటి నుంచీ విభిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటున్నాడు. ‘ముకుంద’, ‘కంచె’, ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో వైవిధ్యం చూపించాడని, నటుడిగా తనను తాను నిరూపించుకునే తపన అతనిలో ఉంది.‘ఇది వరుణ్ సక్సెస్ కాదు.. మా బుడ్డోడు వాయుతేజ్ సక్సెస్. ఈ విజయాన్ని వాయు ఖాతాలో వేయాలి. సత్యకు ప్రత్యేక అభినందనలు: సినిమాలో సత్య అద్భుతంగా నటించాడని చిరంజీవి ప్రశంసించారు. తన నటనతో సినిమా మరోసారి చూడాలనిపించేలా చేశాడని అన్నారు. నా అభిమాని ఈ రేంజ్ కి ఎదగడం నాకు గర్వంగా ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు: 2026 రెండో అర్ధభాగం ‘పెద్ది’ విజయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తన తదుపరి సినిమా టీజర్‌పై అప్డేట్: తమన్‌తో కలిసి తాను చేస్తున్న సినిమా టీజర్ తన పుట్టినరోజైన ఆగస్టు 22న విడుదల కానుందని చిరంజీవి తెలిపారు

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి `మెగా158` అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి కానుకగా దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో టీమ్ ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ మూవీ సంక్రాంతికి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లని సాధించింది. దీంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ కాంబినేషన్లో గతంలోనే `వాల్తేర్ వీరయ్య` సినిమా వచ్చింది. అది కూడా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. పెద్ద హిట్‌నిచ్చింది. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు చిరంజీవి. ఈ మూవీ టైటిల్ లీక్ చేశాడు. చిరు లీక్స్ లో భాగంగా ఆ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈసందర్భంగా సినిమా టైటిల్, టీజర్ రాబోతుందని తెలిపారు. థమన్ ప్రస్తుతం దానికి వర్క్ చేస్తున్నారట. `కొరియన్ కనకరాజు` మూవీ సక్సెస్ ఈవెంట్లో ఈ విషయాన్ని పంచుకున్నాడు చిరంజీవి. థమన్ తో మాట్లాడుతూ, ఈ నెల 22న టైటిల్ రివీల్ చేస్తున్నారుగా అన్నాడు చిరంజీవి, అవును సార్ అన్నాడు థమన్. టీజర్ లో వేస్తున్నారుగా అంటే అవును సార్, టీజర్ ఇస్తున్నారుగా అంటే అవును అన్నాడు. ఈ క్రమంలోనే టైటిల్ `కదిరి.. `లానే ఉంటుంది కదా అంటూ టైటిల్ లీక్ చేశారు చిరు. ఈ మూవీకి కదిరి అనే పేరుతో టైటిల్ పెట్టబోతున్నట్టు చిరు హింట్ ఇచ్చాడు. అయితే ఇది ఆయన నోరు జారడం కాదు, కావాలనే హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. `కదిరి` అని వదిలేశారు

Chiranjeevi : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, రావాలి అనుకున్నాను. వరుణ్ వచ్చి డాడీ మీరు రావాలి అనగానే తప్పకుండా వస్తాను అని చెప్పాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. వరుణ్ మొదట్నుంచి కూడా సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయినా వెరైటీగా, డిఫరెంట్ పాత్రలతో వస్తున్నాడు. వైవిద్యం చూపిస్తూ కొత్త గెటప్స్ తో వస్తున్నాడు. ఆర్టిస్ట్ గా నిలబడాలి అని చూస్తున్నాడు కానీ గబగబా సినిమాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి అని చూసుకోవట్లేదు. వరుణ్ ఆలోచన విధానం, అతను ఎంచుకున్న జోనర్స్ బాగున్నాయి. ఈ క్రమంలో అతను చేసిన అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు కానీ అతను నటనలో ఎపుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇదే ధైర్యంతో ఇలాగే కొత్త కథలతో ముందుకు వెళ్ళు. ఇది వరుణ్ సక్సెస్ అని చెప్పినా ఇది వరుణ్ తనయుడు వాయువ్ ఖాతాలో వెయ్యాలి. నీ లక్కీ చామ్ వాయువ్. ఈ సినిమా హిట్ అవ్వడానికి సత్య ముఖ్య కారణం. సత్య కోసం ఈ సినిమాను ఇంకోసారి చూసాను. సత్య కామెడీ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. నువ్వు నా అభిమాని అని చెప్పావు. నా అభిమాని ఇంత సక్సెస్ అయినందుకు గర్వపడుతున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత సినిమాలు హిట్ అవ్వలేదు. చాలా డ్రై గా ఉంది థియేటర్స్ అనుకున్నప్పుడు పెద్ది నుంచి మొదలయి మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్

Nagababu : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి నాగబాబు కూడా వచ్చారు. నాగబాబు ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. మేము ఎవరమైనా సరే ఇవాళ ఇక్కడ స్టేజిపై ఇలా ఉన్నామంటే కారణం అన్నయ్య. మా అందరికి ప్రాణవాయువు లాంటి వాడు అన్నయ్య. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ కానీ, చరణ్, వరుణ్, తేజ్, వైష్ణవ్.. ఇలా ఎంతమంది ఉన్నా మా అన్నయ్య లాంటి వ్యక్తి ఆశీర్వాదం, ఆయన బలం మా వెనక ఉన్నప్పుడు ఇది సాధ్యమైంది. ఆయనకు మేము ఏమి తిరిగి చేయలేము. ఆయనే మాకు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నాకంటే ఎక్కువగా వరుణ్ ని ఎత్తుకున్నది అన్నయ్యే. అన్నయ్య అప్పుడు చేసిన సినిమా ప్రివ్యూలకు వరుణ్ ని తీసుకెళ్లేవారు. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, వరుణ్ తక్కువ మాట్లాడినా వరుణ్ – అన్నయ్య చాలా మాట్లాడుకుంటారు. సినిమా మేకింగ్ గురించి మాట్లాడుకుంటారు. అన్నయ్య వరుణ్ ని బాగా చూసుకుంటాడు. అన్నయ్య అందర్నీ ఒకేలా చూస్తాడు. ఇవాళ్టికి కూడా మాకు ఒక సమస్య వస్తే మా కోసం నిలబడతాడు. లవ్ యు అన్నయ్య. మా అన్న ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ బలం మాకు ఉన్నంత కాలం ఇండస్ట్రీలో మేము సక్సెస్ సాధిస్తామని నమ్మకం ఉంది అని అన్నారు

Varun Tej : వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నాకు సినిమాకు తప్ప వేరే ఏం తెలియవు. నేను చిరంజీవి గారు చెప్పినవి ఫాలో అవుతాను. మా పెదనాన్న పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు అనుకుంటాను. మా అమ్మ, నాన్న గర్వంగా ఫీల్ అవ్వాలి. మా కళ్యాణ్ బాబాయ్, చరణ్ అన్న కళ్ళల్లో సంతోషం చూడాలి. చిన్నప్పట్నుంచి నాకు ఆగస్టు 22 అంటే నేషనల్ హాలిడే. చిన్నప్పుడు నాన్న దగ్గరకు వెళ్లి ఆ రోజు స్కూల్ కి వెళ్ళను అని చెప్పేవాడిని. వెంటనే పెదనాన్న ఇంటికి పంపించేసేవారు. ఈసారి పెదనాన్న పుట్టిన రోజు ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ తో ఉంటుంది అని అన్నారు
గతేడాది దసరా పండగ ముందు వరకూ మెగా హీరోల బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగాలేదనే చెప్పాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకూ.. అందరికీ వరుస ఫ్లాపులు పడ్డాయి. మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే విజయదశమి తర్వాత మెగా ఫ్యామిలీ దశ దిశ మారింది. అప్పటి నుంచి మెగా హీరోల నుంచి వస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నాయా లేదా అనేది పక్కన పెడితే.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా చేశాయి.పవన్ కళ్యాణ్ OG సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు అందుకున్నారు. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ప్రాంతీయ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ‘పెద్ది’ చిత్రంతో రామ్ చరణ్ కూడా భారీ వసూళ్లు సాధించారు. ఇప్పుడు లేటెస్టుగా వరుణ్ తేజ్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. చాలా ఏళ్లుగా హిట్టు కోసం కష్టపడుతున్న వరుణ్.. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ఎట్టకేలకు మంచి సక్సెస్ సాధించారు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టారు.ఇలా నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇక మిగిలింది ఇద్దరు మెగా మేనల్లుళ్లు మాత్రమే. సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'బ్రో' సినిమా నిరాశపరిచింది. ఆ మూవీ వచ్చి మూడేళ్లు అవుతోంది. తేజ్ ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. లాస్ట్ ఇయర్ దసరాకే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈసారి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వరుణ్ తేజ్ 6 ఏళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎట్టకేలకు కొరియన్ కనకరాజు చిత్రంతో వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చారు. కంబ్యాక్ కూడా మామూలుగా లేదు. కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తయింది. ఆరేళ్ళ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్లీన్ హిట్ అందుకున్నారు. కొరియన్ కనకరాజు మూవీ 4 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం. నాల్గవ రోజు మండే టెస్ట్ ని కొరియన్ కనకరాజు చిత్రం విజయవంతంగా పాస్ అయింది. కేవలం ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే నాలుగవరోజు సోమవారం 70 వేలుగా నమోదయ్యాయి. ఇది సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి. మూడు రోజుల్లో 35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం 4వ రోజు పూర్తయ్యే సరికి దాదాపు 40 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. కలెక్షన్ లో ఎక్కువ డ్రాప్ కనిపించలేదు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 13 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మూడు రోజుల్లోనే 12 కోట్లపైగా షేర్ సాధించి 90 శాతానికి పైగా రికవరీ సాధించింది. ఇక నాలుగోరోజు వరల్డ్ వైడ్ గా 2.28 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం దీనితో సక్సెస్ ఫుల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి వరుణ్ తేజ్ కి 6 ఏళ్ళ తర్వాత క్లీన్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్ళుగా సరైన బాక్సాఫీస్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు చిత్రం బిగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ కొరియన్ కనకరాజు ’ థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ మార్క్ ఎంటర్టైన్మెంటట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా అన్ని ప్రధాన థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర కొనసాగుతోంది.* బాక్సాఫీస్ వద్ద 'కొరియన్ కనకరాజు' రచ్చ.. మూడే మూడు రోజుల్లో బ్రేక్ఈవెన్రాయలసీమలోని అనంతపురం జిల్లా పెనుగొండ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. ఊరిలో చెక్కభజన గ్రూప్ నడిపే కనకరాజు (వరుణ్ తేజ్), తన బెస్ట్ ఫ్రెండ్ కిష్టప్ప (సత్య)తో కలసి సరదాగా కాలం గడిపేస్తుంటాడు. కియా కార్ల ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఎప్పటికైనా కొరియా వెళ్లాలని కలలు కనే చైత్ర ( రితికా నాయక్ )ను చూసి కనకరాజు తొలిచూపులోనే లవ్‌లో పడతాడు. అనూహ్యంగా కనకరాజు శరీరంలోకి ఒక కొరియన్ వ్యక్తికి సంబంధించిన ఆత్మ ఎంటర్ అవుతుంది. ఆ ఆత్మ ప్రవేశించిన తర్వాత కనకరాజు జీవితం ఎలా మారింది?.. ఆ కొరియన్ ఆత్మ బారి నుండి అతను ఎలా బయటపడ్డాడు? అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌ని ఫుల్ లెంగ్త్ హ్యూమర్‌తో స్క్రీన్ పైన ఆవిష్కరించారు.వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్ల రన్ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ప్రీమియర్స్ వసూళ్లతో కలుపుకుని ఫస్ట్ డే రూ. 10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన కనకరాజు, సెకండ్ డే శనివారం నాటికి రూ. 23.6 కోట్లకు చేరుకున్నాడు. ఆదివారం కలెక్షన్స్ మరింతగా పుంజుకోవడంతో ఫస్ట్ వీకెండ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించి, హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటుకుని లాభాల బాటలోకి అడుగుపెట్టింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) చాలా గ్యాప్ తర్వాత మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తున్నారు. ఆయన హీరోగా నటించి, హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటుకుని లాభాల బాటలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాపై మేకర్స్ మొదటి నుంచి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత దానిని కంటిన్యూ చేస్తూ మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకోవడంతో.. మేకర్స్ యమా హ్యాపీగా ఉన్నారు. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ సినిమాకు బిగ్ ప్రమోషన్‌గా మారడంతో.. రోజురోజుకూ ‘కొరియన్ కనకరాజు’కి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అలాగే, తొలి వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుపుతూ, మేకర్స్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సోమవారం తెలంగాణలో బోనాలు సెలవు కావడంతో సినిమాకు మరో అడ్వాంటేజ్ లభించినట్లైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉండటంతో, ఈ హాలిడే రోజు కూడా కనకరాజు కుమ్మేసే అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌లో ప్రధానంగా కామెడీకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలపై నడుస్తోన్న కాంట్రవర్సీ కూడా ఈ సినిమాను వార్తల్లో ఉంచేలా చేస్తోంది. వరుణ్, సత్యల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవడంతో

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ప్రకటించిన వసూళ్లకు, స్వతంత్ర బాక్సాఫీస్ ట్రాకర్ల అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. నిర్మాతలు శనివారం నాటికి రూ.37.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్ విడుదల చేయగా, ట్రేడ్ వర్గాలు మాత్రం భిన్నమైన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాను మెర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. రితికా నాయక్ కథానాయికగా నటించగా, నటుడు సత్య కీలక పాత్రలో కనిపించారు. థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. రాయలసీమ నేపథ్యానికి కొరియన్ ఆత్మ ప్రవేశించే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ హారర్ కామెడీ రూపుదిద్దుకుంది. వరుణ్ తేజ్ గత చిత్రాలు నిరాశపరిచినప్పటికీ, ఈ సినిమాకు తొలి రోజు నుంచే ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తోంది. కలెక్షన్ల విషయానికి వస్తే నిర్మాతలు మూడు రోజుల్లో రూ.37.4 కోట్ల గ్రాస్ సాధించామని, అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించామని తెలిపారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ట్రాకింగ్ సంస్థల డేటా వేరేలా ఉంది. సాక్నిల్క్ సమాచారం ప్రకారం భారతదేశంలో మూడు రోజుల నెట్ రూ.13.20 కోట్లు కాగా, గ్రాస్ రూ.15.18 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా విదేశీ మార్కెట్ నుంచి రూ.4 కోట్లు రావడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.19.18 కోట్లుగా లెక్క తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.8 కోట్ల వరకు షేర్ సాధించిందని ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లలో మెజారిటీ భాగం రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూ.36 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల ద్వారా రూ.24 కోట్ల

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఎట్టకేలకు హిట్ పడింది. ఆయన తాజాగా `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత శుక్రవారం(ఆగస్ట్ 7)న ఈ చిత్రం విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ని తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. వరుణ్ తేజ్‌కి హిట్ లేక చాలా రోజులవుతుంది. దీంతో ఆ లోటుని ఇప్పుడు `కొరియన్ కనకరాజు` తీర్చింది. ఎట్టకేలకు వరుణ్ తేజ్‌కి హిట్ పడింది. ఈ సినిమా మూడు రోజుల్లో మంచి వసూళ్లని రాబట్టింది. మొత్తంగా ఇది రూ.35కోట్లు రాబట్టినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల్లోనే దీనికి రూ.23.6కోట్లు రాగా, మూడో రోజు దాదాపు రూ.13కోట్లు వసూలు చేయడం విశేషం. గత రెండు రోజులతో పోల్చితే ఆదివారం దీనికి కలెక్షన్లు పెరిగాయి. సండే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్ ఆడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మూడు రోజుల్లో సుమారు ఇరవై కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ సైట్లు వెల్లడించడం గమనార్హం. ఇక `కొరియన్ కనకరాజు` చిత్రానికి సుమారు రూ.40కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇప్పటి వరకు రూ.35కోట్లు రావడంతో ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ అయినట్టు టీమ్ వెల్లడించింది. మొదటి వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ కావడం విశేషమనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇలా తొలి వారాంతంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్గానే ఉన్నట్టు టీమ్ చెప్పింది. ఇది సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా కొరియన్ కనకరాజు

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా కాంపౌండ్ విజయాల పరంపరతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా కాంపౌండ్ విజయాల పరంపరతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకోగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఆల్-టైమ్ రికార్డు వసూళ్లు సాధించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రంతో తన సత్తా చాటగా, ఇటీవల విడుదలైన కొరియన్ కనకరాజుతో వరుణ్ తేజ్ కూడా మంచి విజయాన్ని అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఎన్నో ఏళ్లుగా వరుణ్ .. ఒక మంచి విజయం కోసం ఎదురుచూశాడో.. ఆ విజయం కొరియన్ కనకరాజు సినిమాతో వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కనకరాజు కనకవర్షం కురిపిస్తున్నాడు. విడుదలైన రెండు రోజుల్లోనే భారీ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక దీంతో ఫ్యాన్స్ మెగా నామ సంవత్సరం అని చెప్పుకొస్తున్నారు. ఇక తండ్రీకొడుకులు హిట్ ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు మెగా మేనల్లుడు వంతు. మెగా హీరోలలో ఇప్పుడు అందరి చూపు సాయి దుర్గ తేజ్ పైనే నిలిచింది. విరూపాక్ష తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తేజ్.. ఆ తర్వాత వచ్చిన బ్రోతో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదం నుండి కోలుకోవడం, శారీరకంగా, మానసికంగా సిద్ధమవడానికి సమయం పట్టడంతో గత మూడేళ్లుగా ఆయనకు సరైన థియేట్రికల్ రిలీజ్ పడలేదు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటి గట్టు చిత్రంలో నటిస్తున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా

మెగా ఫ్యామిలీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. ఈ కుటుంబానికి చెందిన పలువురు హీరోలు వరుసగా భారీ విజయాలను అందుకోవడంతో అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వరుణ్ తేజ్ తమ తాజా చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ విజయాల పరంపరలో మిగిలిన మెగా హీరోగా సాయి దుర్గ తేజ్ నిలిచారు. ఆయన తదుపరి చిత్రం సంబరాల ఏటిగట్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త బెంచ్‌మార్క్‌ను నమోదు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్‌కు మరో ఘన విజయాన్ని అందించింది. దీంతో మెగా ఫ్యామిలీ విజయాల పరంపరకు ఓజీ బలమైన ఊపునిచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో మెగా ఫ్యామిలీ అభిమానుల సంబరాలు మరింత పెరిగాయి. మరోవైపు రామ్‌చరణ్ నటించిన పెద్ది కూడా భారీ విజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి రామ్‌చరణ్‌కు మరో ఘన విజయాన్ని అందించింది. ఇదే జోరులో వరుణ్ తేజ్ కూడా కొరియన్ కనకరాజుతో తిరిగి విజయపథంలోకి వచ్చారు. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్‌కు ఎంతో అవసరమైన విజయాన్ని అందించింది. విడుదలైన తొలి రోజుల్లోనే మంచి వసూళ్లను నమోదు చేసి బలమైన ఆరంభాన్ని అందుకుంది. దీంతో మెగా కుటుంబానికి చెందిన ప్రధాన హీరోలందరూ వరుసగా విజయాలను అందుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విజయాల జాబితాలో సాయి దుర్గ
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కారు. గత కొన్ని సినిమాల నుంచి వరుస పరాజయాలు అందుకుంటున్న ఈ మెగా హీరో.. ఎట్టకేలకు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో మళ్లీ హిట్టు రుచి చూశారు. తన కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ.. బాక్సాఫీస్ దగ్గర మంచి భారీ వసూళ్లు రాబడుతోంది. కనకరాజు మొదటి రోజు కంటే రోజు అధిక కలెక్షన్స్ కుమ్మేసాడు. రెండు రోజుల వసూళ్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.‘కొరియన్ కనకరాజు’ సినిమా శుక్రవారం (ఆగస్టు 7) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కేవలం 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 23.6 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు అనౌన్స్ చేశారు. అంటే రెండో రోజు దాదాపు రూ.13.4 కోట్లు వచ్చాయి. మూడో రోజు ఆదివారం డీసెంట్ నంబర్స్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.నార్త్ అమెరికాలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఇప్పటివరకూ 250K డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ ఆన్ లైన్ బుకింగ్ ఫ్లాట్ పామ్స్ లో 500K టికెట్లకు పైగా అమ్ముడయ్యాయని చిత్ర బృందం తెలిపింది. ''నాన్ స్టాప్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకుల ఫేవరేట్ ఫిలింగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుని థియేటర్లను ఏలుతోంది'' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రాబోయే రోజుల్లో కనకరాజు ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక ‘కొరియన్ కనకరాజు’ మూవీ టీంకు రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పారు. ''వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, రితిక, సత్య పట్ల చాలా సంతోషంగా ఉంది. 'కొరియన్ కనకరాజు' బ్లాక్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ మూవీ రాబట్టిన రెండు రోజుల కలెక్షన్ల వివరాలను మేకర్స్ తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), రితికా నాయక్ (Ritika Nayak) జంటగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. సినిమా విడుదలకు ముందు వేసిన ప్రీమియర్స్‌తోనే సినిమా హిట్ టాక్ని సొంతం చేసుకున్న విషయం తెలియంది కాదు. కామెడీతో పాటు సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఊహించని రేంజ్లో రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజలకు ఎంత రాబట్టిందో తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లో తెలిపారు. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇది సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ఆదివారం కూడా ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా లాభాల బాట పట్టే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైమింగ్, నటనతో పాటు కమెడియన్ సత్య కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థమన్ సంగీతం సినిమాకి అదనపు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా హారర్ కామిడీ మూవీ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అద్భుతమైన వసూళ్లతో ముందడుగు వేస్తోంది. విడుదలైన మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా, రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమా వసూళ్లలో పెరుగుదల నమోదైంది. సాధారణంగా టాక్ ఏమాత్రం తేడా కొట్టినా శని, ఆదివారాల్లో కూడా కలెక్షన్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, ‘కొరియన్ కనకరాజు’ విషయంలో అలా జరగకుండా రెండవ రోజు కలెక్షన్లు పుంజుకోవడం మూవీ టీమ్ కు రిలీఫ్ ను ఇచ్చింది. యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ సరైన సమ్మేళనంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమవుతోంది. భారతదేశంతో పాటు విదేశీ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సంఖ్య భారీ బ్లాక్‌బస్టర్ స్థాయి వసూళ్లు కాకపోయినప్పటికీ, వరుణ్ తేజ్ నటన, హారర్-కామిడీ జానర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణ్ తేజ్ ఇమేజ్, మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల వైపు నడిపిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అందుతున్న పాజిటివ్ "వర్డ్ ఆఫ్ మౌత్" సినిమాకు ప్రధాన బలంగా మారింది. బాక్సాఫీస్ పోటీని తట్టుకుని నిలబడటానికి ఈ వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడో రోజు, నాలుగో రోజుల్లో ఫుట్‌ఫాల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఈ చిత్రం వారాంతం ముగిసేసరికి మరిన్ని రికార్డు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు
మెగా ప్రిన్స్ వరుణ్తేజ్హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త హారర్కామెడీ చిత్రం ‘కొరియన్కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాయలసీమ సంస్కృతి మరియు కొరియన్ కల్చర్ మేళవింపుతో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 7 థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో రితికా నాయక్నాయికగా నటించగా, సత్య తనదైన కామెడీతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.* ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రమోషన్స్‌కి రాను.. యష్ వల్ల రూల్స్ బ్రేక్ చేశా - నయనతార వరుణ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్రాయలసీమలోని అనంతపురం జిల్లా పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో కనకరాజు (వరుణ్‌తేజ్) అనే పల్లెటూరి యువకుడిని ఒక కొరియన్ ఆత్మ ఆవహించడం, దాని చుట్టూ జరిగే పరిణామాలు ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాయి. వరుణ్ తేజ్ నటనలోని వైవిధ్యం, సత్య కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పూలు పూయిస్తున్నాయి. తొలిరోజే దాదాపు రూ.10.2 కోట్ల వసూళ్లను సాధించి వరుణ్ తేజ్ కెరీర్లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. శనివారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.ఐదేళ్ల పోరాటం.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్ఈ సినిమా సాధించిన ఘన విజయంపై వరుణ్ తేజ్ తండ్రి, నటుడు నాగబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా వీక్షించిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొడుకు కష్టాన్ని, ఓర్పును కొనియాడారు.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్"గడిచిన ఐదేళ్లుగా నేను మౌనంగా గమనిస్తూనే ఉన్నాను. నా కొడుకు ఎదుర్కొన్న నిరాశలు, అనుభవించిన బాధ నాకు తెలుసు. వరుస ఓటములు పలకరించినా, పరీక్షించే వైఫల్యాలు ఎదురైనా తన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. మనసులోని బాధను బయటకు చెప్పకపోయినా అది తానెంతగా గాయపరిచిందో తండ్రిగా నాకు బాగా తెలుసు. మాటలు లేకపోయినా

వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) నిన్న ప్రీమియర్ షోలతోనే హంగామా స్టార్ట్ చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం చాలా చోట్లా ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. దాంతో టీం ఆనందంగా సెలెబ్రేట్ చేసుకొంది. “నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది,” అని వరుణ్ తేజ్ అన్నారు. “సత్య కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో సినిమా ఇంకా గొప్ప ముందుకు వెళ్తుంది. శిరీష్ గారు ఎడిటింగ్ దశలోనే సినిమా చూసి, ‘మీరు మంచి సినిమాతో వస్తున్నారు’ అని మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకం ఈరోజు నిజమైంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది,” అని వరుణ్ తేజ్ ఆనందం వ్యక్తం చేశారు. “మొదటి నుంచి వరుణ్ తేజ్ ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలబడి ప్రతి విషయంలో అండగా ఉన్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ సినిమాతో చూడడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ గారి కటౌట్‌కు తగ్గ సినిమా ఇది,” అని దర్శకుడు అన్నారు. నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్టైనర్ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పింది బ్యూటీ హీరోయిన్ రితిక నాయక్

Korean Kanakaraju Day 1 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన ఓపెనింగ్ గణాంకాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రీమియర్స్‌తో పాటు డే 1 కలెక్షన్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.10.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లో ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచినట్లు చిత్రబృందం పేర్కొంది. విడుదలకు ముందు నుంచే ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్‌తో పాటు వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ చేసిన వరుస ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రూపంలో మంచి స్పందన దక్కింది. ఇక సినిమా కథ విషయానికొస్తే.. అనంతపురం జిల్లా పెనుగొండలో చెక్కభజన బృందాన్ని నడిపించే కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి సరదాగా జీవితాన్ని గడిపే కనకరాజు.. చైత్ర (రితిక నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడ స్థిరపడాలనేది చైత్ర కల. అయితే అనూహ్యంగా కనకరాజులోకి ఓ కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఆ ఆత్మ కారణంగా కనకరాజు కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఆ ఆత్మ అతడిని వదిలి వెళ్లిందా? అనే ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద తొలి రోజే మంచి