
© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Vishwambhara Release Line Clear: యూవీ క్రియేషన్స్ తెలుగులో తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఈ ఇయర్ ఈ బ్యానర్ నుంచి విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్, శర్వానంద్‌లు హీరోగా నటించిన ‘బైకర్’ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాతో 6 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్‌కు సోలోగా హిట్ దక్కింది. ఈ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మించింది. గతంలో అనుష్క ‘ఘాటి’ సినిమా కూడా వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కడం విశేషం.
మధ్యలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, మట్కా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్‌గా నిలిచాయి. తాజాగా గత శుక్రవారం విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ సినిమా మూడు రోజుల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 6 రోజుల్లో 16 కోట్ల షేర్ (రూ.30 కోట్ల గ్రాస్)ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది. మొత్తంగా రూ. 2.5 కోట్ల లాభాలను థియేట్రికల్‌గా అందుకుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్‌గానే ఓటీటీ, శాటిలైట్ అన్ని కలిపి రూ. 40 కోట్లు యూవీ క్రియేషన్స్‌కు సేఫ్ జోన్లోకి వచ్చసింది.
మొత్తంగా ‘కొరియన్ కనకరాజు’ హిట్‌తో వీళ్ల బ్యానర్లో రాబోయే ‘విశ్వంభర’ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తైయిన ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ పేలవంగా ఉండటం మూలన ఈ సినిమాకు రిపేర్ల మీద రిపేర్లు చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత చిరంజీవిని నుంచి వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంటుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








