
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Doctors Use Torches To Operate | ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట వరకు అక్కడ అంధకారం అలముకున్నది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో ఇద్దరు గర్భిణీలకు డాక్టర్లు ఆపరేషన్ కొనసాగించారు.

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి దర్శక-నటుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ టీజర్ సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కొత్త పోస్టర్‌తో ఈ అప్డేట్ ఇచ్చింది. వెంకటేష్ చిట్టిబాబుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 2, 2026న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు విజయవాడ కోర్టు లో చుక్కెదురైంది. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు జంగం నాని, బాబూరావుతో పాటుగా సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.మరోవైపు సాయికృష్ణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం నాగరాజు, ముగ్గురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. లాకప్ డెత్ లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో.. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించిన కోర్టు.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు

మొన్న సాదిక్‌ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్‌పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ
ఒత్తిడి వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఒత్తిడి తీవ్రం అవ్వడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో చర్మంలోని గ్రంథులు ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి. దీంతో యాక్నే వస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా మొటిమలు, యాక్నే వస్తాయి. పీరియడ్స్, యంగ్ ఏజ్‌లో అండ్రోజన్ హార్మోన్లు పెరగడం వల్ల సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మొటిమలు వస్తాయి. మొటిమలు, యాక్నే రావడానికి జీన్స్ కూడా ఒక కారణం. మీ తల్లిదండ్రుల్లో మొటిమలు, యాక్నే సమస్య ఉంటే మీకు కూడా మొటిమలు వస్తాయి. చర్మ రంధ్రాల్లో జిడ్డు పేరుకుపోవడం వల్ల చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది చర్మ రంధ్రాలను మూసి వేస్తుంది. దీంతో మొటిమలు వస్తాయి. గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో జిడ్డు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. వైట్ బ్రెడ్, స్వీట్స్ తింటే మొటిమలు వస్తాయి. నిద్రలేమి పలు సమస్యలకు కారణం అవుతుంది. నిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్లు స్థిరంగా ఉండవు. దీంతో మొటిమలు, యాక్నే వస్తాయి. తగినంత నీరు తాగకపోవడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. నీరు తక్కువగా తాగడం వల్ల చర్మ పొడిగా మారుతుంది. ఈ పరిస్థితిని సరి చేసేందుకు నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మొటిమలు వస్తాయి. సిగరెట్ తాగడం వల్ల చర్మంలోకి టాక్సిన్లు ఎక్కువగా చేరుతాయి. నికోటిన్ వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. మొటిమలు, యాక్నే, బ్లాక్‌హెడ్స్ వస్తాయి. చర్మానికి సరిపడని మేకప్ ఉత్పత్తులు ఉపయోగించడం, రాత్రి పూట మేకప్‌ను తొలగించకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తాయి

థియేటర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాకేజ్డ్ మూవీ 'పంజా' జోరు కొనసాగుతూ ఉంది.ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి. నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడం, అవి కూడా ఫుల్ కావడం కూడా ఒక రికార్డు. డిజాస్టర్ మూవీకి ఈ స్థాయి క్రేజా అని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో 150కి పైగా షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం పవన్ మేనియాకు అద్దం పడుతోంది. నైజాం ఏరియాలో రీ రిలీజ్ మొదటి రోజే 1.2 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను సైతం షాక్‌కి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 220కి పైగా స్క్రీన్లలో రిలీజవ్వగా ప్రతి థియేటర్ వద్ద 100% ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ రీ-రిలీజ్ హంగామా కేవలం థియేటర్ల లోపలే కాదు, బైట కూడా జాతరను తలపిస్తోంది. అభిమానులు బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు మరియు బాణసంచా కాల్పులతో థియేటర్ కాంప్లెక్స్‌లను పండగ వాతావరణంగా మార్చేశారు. ‘పాప రాయుడు’ పవర్ ఫుల్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ అండ్ మేజర్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ చేస్తున్న విజిల్స్, కేకలతో హాల్స్ దద్దరిల్లుతున్నాయి. కాలం మారినా, ఏళ్లు గడిచినా 'జై' రోల్ లో పవన్ ప్రదర్శించిన రోల్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుందని చెప్పడానికి రీ రిలీజ్ ఒక ఉదాహరణ. 2011 డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదలైన ‘పంజా’, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ. 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించలేకపోయింది. అయితే, కాలక్రమేణా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టైలిష్ విజువల్స్, యువన్ శంకర్ రాజా అందించిన ఐకానిక్

ఆగస్టు 26న నేపాల్‌లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి. అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్‌ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు
Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్‌లను పూర్తిగా నిషేధించారు. విండ్‌షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లకు స్పష్టం చేసింది. ఇవి అన్ని వేళల పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సు కిటికీ అద్దాలకు కర్టెన్స్ వేయవద్దని పేర్కొంది. అనధికారికంగా కిటికీ అద్దాలకు ఫిల్మ్ అతికించవద్దని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని బస్సు ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి చేరుకునే వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. మహిళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ తదితర సిబ్బందిని నియమించే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించింది. అలాగే బస్సుల్లో పానిక్ బటన్లు, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా పని చేస్తూ ఉండాలంది. ఇవి అన్ని వేళలా పని చేస్తుండాలని తెలిపింది. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా ప్రతి బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వినియోగించే పరికరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలంది. అదే విధంగా రాత్రి లేదా రద్దీ లేని సమయాల్లో బస్సులను సురక్షితమైన, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిలిపి ఉంచేలా చూడాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. బస్సులో సిబ్బంది ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సీపీఆర్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులను కోరింది. ఈ నిబంధనలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని బస్సు
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో అన్ని రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రొమ్ము క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్‌లో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. నారింజ, నిమ్మ, గ్రేప్‌ఫ్రూట్‌లో విటమిన్ సి, ఫోలేట్‌తో పాటుగా, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. ఫ్యాటీ చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తింటే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. బీన్స్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే క్యాన్సర్ కణాలు తగ్గుతాయి. టోపు, ఎడమామే, సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. సోయా ఫుడ్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగన్, కాజోల్ నివసించే ముంబై జుహూలోని లగ్జరీ బంగ్లా ‘శివశక్తి’ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ రాజప్రసాదం ఆధునిక శైలికి, సాంప్రదాయ డిజైన్లకు ప్రతీకగా నిలుస్తుంది. నటి కాజోల్ తన ఇంట్లోని మెట్లమార్గం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ ఇంట్లోని ఇంటీరియర్ ప్రత్యేకతలపై మీడియాలో మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈ బంగ్లాలో ప్రధాన ఆకర్షణ చెక్కతో రూపొందించిన విశాలమైన మెట్లమార్గం. దీనికి అనుబంధంగా పైకప్పు నుంచి నీటి బిందువుల తరహాలో వేలాడే వెలుగుల శ్రేణి ఫోటోషూట్లకు సరైన బ్యాక్‌డ్రాప్‌గా మారింది. మొదటి అంతస్తులోని లాబీ మెరిసే తెల్లటి మార్బుల్ ఫ్లోరింగ్‌తో నిర్మించారు. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు ఉన్న పెద్ద గ్లాస్ విండోస్ సహజమైన వెలుతురును ఇంటికి అందిస్తాయి. లివింగ్ రూమ్‌లో ఐవరీ సోఫాలు, ఆరు సీట్ల డైనింగ్ టేబుల్ లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. మినిమలిస్టిక్ థీమ్‌కు భిన్నంగా రెడ్ లెదర్ సోఫాలతో కూడిన లాంజ్ ఏరియా కుటుంబ సభ్యుల కలయికలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆధ్యాత్మికతకు, వ్యక్తిగత అభిరుచులకు అద్దం పట్టేలా నిర్మించిన ఈ నివాసం సెలబ్రిటీ హోమ్‌ల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పర్యటనలో ఒక రైతు కుటుంబానికి అనూహ్య రీతిలో ఆశ్చర్యాన్ని కలిగించారు. మంగళవారం సేలం జిల్లాలో పర్యటించిన ఆయన, ఒక గ్రామంలో ఆకస్మికంగా ఆగి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలు చూపిన ఆత్మీయతకు ముగ్ధుడైన ఆయన, తాను ధరించిన కళ్లజోడును ఆమెకు బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సేలం జిల్లాలోని మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి, సాగునీటిని విడుదల చేసే క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగించుకుని చెన్నైకి తిరుగుప్రయాణమైన ఆయన, మార్గమధ్యలోని చిన్నకావూరు గ్రామం వద్ద తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. నేరుగా రామస్వామి అనే రైతు నివాసానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పలకరించారు.ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు ముఖ్యమంత్రిని చూడగానే అమితానందానికి లోనయ్యారు. ఆత్మీయంగా ఆయన్ను ఆలింగనం చేసుకుని, చేతిని గట్టిగా పట్టుకుని తన అనురాగాన్ని చాటుకున్నారు. అనంతరం తన పెరట్లోని తోటను ఆయనకు చూపించారు. ఆమె అభిమానానికి చలించిన విజయ్, తక్షణమే తాను ధరించిన కళ్లజోడును తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, విజయ్ ఆ బామ్మకు బహూకరించిన సన్ గ్లాసులు వరల్డ్ క్లాస్ సంస్థ 'క్రిస్టియన్ డయోర్' తయారు చేసినవి. వీటి ధర రూ.50 వేలకు పైనే
ఆకుకూరల సలాడ్ మీద నువ్వులను చల్లుకోండి. వేయించిన నువ్వులు చల్లడం వల్ల సలాడ్ టేస్టీగా మారుతుంది. సలాడ్ తినడం కూడా ఈజీ అవుతుంది. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో తయారు చేసే స్మూతీల్లో కూడా నువ్వులను యాడ్ చేయవచ్చు. నువ్వులు పొడి యాడ్ చేసిన స్మూతీలు టేస్టీగా ఉంటాయి. పప్పు, సూప్‌లు, కూరల్లో నువ్వుల పొడిని యాడ్ చేయవచ్చు. నువ్వుల పొడి కలిపిన కూరలు టేస్టీగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసే రోటీల్లో కూడా నువ్వులను యాడ్ చేయవచ్చు. నువ్వులను యాడ్ చేయడం వల్ల రోటీల రుచి పెరుగుతుంది. తెల్ల నువ్వుల పొడిని పెరుగులో కలిపి తినొచ్చు. పెరుగులో నువ్వులు పొడి, తేనె యాడ్ చేసి తింటే టేస్ట్ సూపర్. నువ్వులు, బెల్లం, నెయ్యి ఉపయోగించి నువ్వుల లడ్డూ తయారు చేయవచ్చు. నువ్వుల లడ్డూ టేస్టీగా ఉంటుంది. నట్స్, విత్తనాలతో తయారు చేసే ట్రైల్ మిక్స్‌లో కూడా నువ్వులను యాడ్ చేయవచ్చు. నువ్వులు యాడ్ చేసిన ట్రైల్ మిక్స్ టేస్టీగా ఉంటుంది. వేయించిన నువ్వులు, పచ్చిమిర్చి ఉపయోగించి చట్నీ తయారు చేసుకోవచ్చు. దోసెలు, ఇడ్లీలు తినేందుకు నువ్వుల చట్నీ బాగుంటుంది. రోజువారీ కూరలు, వివిధ వంటలు చేసేందుకు నువ్వుల నూనె ఉపయోగించవచ్చు. సలాడ్స్ మీద కూడా నువ్వుల నూనె చల్లుకోవచ్చు
అకస్మాత్తుగా శరీరంపై వచ్చే ఎర్రటి దద్దుర్లు, పొట్టు రాలడం, తీవ్రమైన దురద అనేవి అర్టికేరియా (Urticaria) యొక్క లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు కొన్నిసార్లు వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు, మందుల ప్రతిచర్యలు లేదా దుమ్ము అలెర్జీల కారణంగా అకస్మాత్తుగా కనిపించవచ్చు. సాధారణంగా హైవ్స్ (Hives) లేదా దద్దుర్లు అని పిలిచే అర్టికేరియా చర్మంపై ఎర్రగా, ఉబ్బినట్లుగా వచ్చి తీవ్రమైన దురదను కలిగిస్తుంది. అర్టికేరియాకి ప్రధాన కారణాలు, నివారణ మార్గాలు, ఎప్పుడు వైద్యుణ్ని సంప్రదించాలి ఇలా పూర్తి సమాచారాన్ని డాక్టర్ షిరీన్ ఫుర్టాడో (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ & కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ CMI హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అర్టికేరియా ప్రధాన కారణాలు కొన్ని రకాల ఆహారాలు, మందులు, ఇన్ఫెక్షన్లు, అధిక వేడి, మానసిక ఒత్తిడి, కీటకాలు కుట్టడం లేదా చర్మంపై ఎక్కువ ఒత్తిడి పడటం వంటివి దీనికి కారణం కావచ్చు. ఈ సమస్య సాధారణంగా తీవ్రమైన దురదతో మొదలవుతుంది. దీని తరువాత చర్మం ఎర్రబడటం, పొక్కులు వస్తాయి. చాలా మందికి చర్మంపై వాపు కూడా రావచ్చు. ఈ దద్దుర్లు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖం, మెడ, చేతులు, కాళ్లు, వీపు లేదా శరీరం మొత్తం మీద కూడా రావచ్చు.పాటించాల్సిన చిట్కాలు చర్మంపై చల్లని క్లాత్‌తో అద్దడం (Cool Compress), వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. ఘాటైన వాసన, కెమికల్స్ ఉండే సబ్బులు, పర్ఫ్యూమ్లకు దూరంగా ఉండండి. కలబంద (Aloe Vera) జెల్ లేదా క్యాలమైన్ లోషన్ రాస్తే చర్మం చల్లబడి దురద తగ్గుతుంది. ఏ ఆహారం తిన్న తర్వాత దద్దుర్లు వస్తున్నాయో ఒక నోట్‌బుక్‌లో రాసిపెట్టుకుంటే ట్రిగ్గర్లను గుర్తించడం సులువుగా ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటకు పోతాయి. ఇందుకోసం ఒక స్పూన్ అల్లం రసంలో

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడం, వరస సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ అనుకున్నంత స్థాయిలో లేదు. భక్తులు సులువుగానే ఏడుకొండలవాడిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ నెలలో ప్రత్యేక పర్వదినాలు.. బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు మరింత గా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.తిరుమలకు వచ్చే భక్తుల వసతి కష్టాలకు టీటీడీ చెక్ పెడుతోంది. కొద్ది నెలల క్రితం తిరుమలలో అందుబాటులోకి వచ్చిన పీఏసీ- 5 ను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకుంటున్నారు. తిరుమలలో తిరుమలలో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు, 5 పీఏసీలు ఉన్నాయి. అయినా.. గదుల కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. తిరుపతిలో కొత్త వసతి సముదాయాలను సిద్దం చేసారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో భక్తుల కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు చివరి దశకు వచ్చాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా, లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తయ్యాయి. తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు, కొత్త టైమింగ్స్..!!బ్రహ్మోత్పవాల వేళ ప్రారంభం.. ఒకే సారి పది వేల మందికి ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మిస్తున్నారు. గదులు 532 చొప్పున 1,064 ఉన్నాయి. దాదాపుగా పదివేల మంది భక్తులకు వసతి కల్పించే వెసులుబాటు కలగనుంది. కాగా, రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు.. సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చెయ్యాలని, నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యల కోసం పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో ఏం చేశారు? సీఎం రేవంత్ విమర్శలు తాజాగా అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జరిగిన ప్రజా సభలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఒక ఉద్యోగి ఏడాది పని చేయకపోతే తొలగిస్తారు. కానీ కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో జీతం, భద్రత, వాహనాల కోసం ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నారు.మూడేళ్ళలో కేసీఆర్ తీసుకున్న జీతం, భద్రతకు అయిన ఖర్చుల లెక్క చెప్పిన సీఎం ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక కోటి 84 లక్షల, 40 వేలు జీతంగా తీసుకున్నారని, వాహనాలు భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా ఒక్క రోజు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం బయటకు రాలేదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. వెంటనే రాజీనామా చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి కేసీ ఆర్ ను టార్గెట్ చేశారు.కేసీఆర్ రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ తో ర్యాలీలు కేసీఆర్ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 7 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పక రావాలని, పదేళ్ల పాలన
మణుగూరు గ్యాంగ్‌వార్ హత్య కేసు ఛేదింపు.. 27 మంది నిందితులు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మణుగూరు నేతాజీ గ్రౌండ్లో ఈ నెల 27న జరిగిన శివ హత్య కేసులో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన శివను, ఎం.కే గ్యాంగ్ సభ్యులు మాట్లాడాలని చెప్పి నేతాజీ గ్రౌండ్‌కు పిలిచారు. అక్కడ ఇరువర్గాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. గ్రూప్‌లోని సభ్యులు విచక్షణారహితంగా దాడి చేయడంతో శివ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులంతా మణుగూరు స్థానికులేనని, కేవలం పార్టీల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే, నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తకు సంబంధించిన
తెల్ల జుట్టు రావడానికి జీన్స్ ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే మీకు కూడా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉందని హెల్త్‌లైన్ తెలిపింది. ఒత్తిడి అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి తీవ్రం అయినప్పుడు విడుదల అయ్యే హార్మోన్లు, రసాయనాల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. విటమిన్ బి12 లోపించడం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. కుదుళ్లు కూడా బలహీనంగా మారుతాయి. ఐరన్, జింక్, రాగి, విటమిన్ డి వంటివి జుట్టుకు రంగును అందిస్తాయి. వీటి లోపం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగడం వల్ల శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీంతో జుట్టు తెల్లగా మారుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వల్ల కూడా జుట్టు నెరిసిపోతుంది. ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. విటిలిగో, అలోపేసియా ఏరియాటా వంటి వ్యాధుల వల్ల తెల్ల జుట్టు వస్తుంది. కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది. కాబట్టి సహజ ఉత్పత్తులను మాత్రమే వాడండి. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం వల్ల అందం పాడువుతుంది. జుట్టు తెల్లగా మారుతుంది. యూవీ కిరణాల బారిన పడటం వల్ల కూడా జుట్టు అందం పాడవుతుంది

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్‌గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ భవనం తాలూకు వీడియో ఇటీవల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో ఈ భవనం ఉంది. చుట్టూ ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం నిలబడ్డ తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. వరద సమయంలో భవనంలోనే ఉన్న ఆయన ఆ భయానక అనుభవం గురించి పలు విషయాలు చెప్పారు. ‘వరద చుట్టుముట్టే సమయంలో భవనంలో నాతో నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ అందింది. వెంటనే నేను ఇంటికి వెళ్లాను. అందరం బయటకు వెళదామనుకున్నాము. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి పెరిగింది. దీంతో, మేము నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చేయడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా కుటుంబంపైనే ఉంది’ ‘ఆ సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకేమైనా అయితే వాడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోయింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన చెప్పారు. ‘అది దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. టికెట్ రహిత ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణా ఆర్టీసీ మెట్రో రైలు తరహాలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. రూట్‌వేవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హయత్‌నగర్-2 డిపోకు చెందిన పది ఎలక్ట్రిక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.డిజిటల్ స్క్రీన్స్ పై ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయానికి ప్లాన్ ఈ డిజిటల్ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్ స్టాప్ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలు తరహాలోనే ముందుగా స్టేజీల పేర్లు చూపించడం వల్ల నగరానికి కొత్తగా వచ్చినవారు, మార్గాలు తెలియని ప్రయాణికులు సులభంగా గమ్యస్థానం వద్ద దిగగలుగుతారు.ఒక ఆలోచనతో మూడు ప్రయోజనాలు అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు పైలట్ ప్రాజెక్టు కోసం హయత్‌నగర్-పటాన్చెరు రద్దీ మార్గాన్ని ఎంపిక చేశారు. పది బస్సుల్లో ఇప్పటికే స్క్రీన్లు అమర్చారు.హయత్ నగర్ పటాన్ చెరు రూట్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రయాణికుల స్పందన, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సాంకేతిక పనితీరును పరిశీలించిన తర్వాత నగరంలోని ఇతర డిపోల ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. గతంలో డిజిటల్ స్క్రీన్లు ప్రధానంగా వినోదం, ప్రకటనలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సదుపాయాలు జోడించి ప్రయాణికులకు ఉపయోగపడే సమాచార వేదికగా మారుస్తున్నారు.ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని

Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్‌తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్‌లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana bjp chief ramchander rao fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న జరిగిన దాడితో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు ప్రయత్నించారు. దీంతో పోలీసులు తార్నాకాకు భారీగా చేరుకున్నారు. బీజేపీ నేతలు సైతం అక్కడకు చేరుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ చీఫ్ రాంచందర్ రావును అడ్డుకుని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో అక్కడ బీజేపీ కార్యర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు రామ చందర్ రావు ముందుకు వెళ్లగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రామచందర్ రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపు పాలనసాగుతుందని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే దాడులు, అడ్డుకొవడాలు ఏంటని మండిపడ్డారు. 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హమీలు ఇచ్చి ప్రజలను తీవ్రంగా దగా చేసిందన్నారు. Read more: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇవే! మరోవైపు రానున్న రోజులలో కాంగ్రెస్ కు పతనం తప్పదన్నారు. ఈ ఘటనలో బీజేపీ నేత వర్షిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో తెలంగాణ

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు ( House Arrest) చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్లనున్నట్టు ప్రకటించడంతో ఆయన్ను గృహనిర్బంధం చేసినట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లాలో నిన్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. నల్గొండలో మంత్రి కోమటి రెడ్డి కార్యాలయం (Komatireddy office) పై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయగా, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి (Varshit Reddy) నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు
Pakistan Food Crisis 2026 : పాకిస్థాన్‌లో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దయనీయ ఆర్థిక పరిస్థితులు ఆ దేశ ప్రజల ఆహారంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. సామాన్య కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. దీంతో మనుగడ సాగించేందుకు పౌరులు తమ ఆహార అలవాట్లను బలవంతంగా మార్చుకుంటున్నారు. కనీసం పాలు, మాంసం, గోధమలు వంటివి కూడా కొనుక్కొని తినే పరిస్థితి లేకుండా పోయింది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) డేటాను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. గడిచిన ఆరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన ఆహార పదార్థాల వినియోగం దారుణంగా పడిపోయింది.పాలు, మాంసం కోత.. పెరిగిన ఆహార అభద్రతగ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పాలు, మాంసం, గోధుమలు, బియ్యం, టీ పొడి వంటి ప్రాథమిక ఆహార పదార్థాల కొనుగోలును ప్రజలు గణనీయంగా తగ్గించేశారు. 2018-19 కాలంలో దేశంలో 15.92 శాతంగా ఉన్న ఆహార అభద్రత.. 2024-25 నాటికి ఏకంగా 24.35 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య 2.37 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగి రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పౌష్టికాహారం అందించే పాలు, మాంసం వంటి ఖరీదైన పదార్థాలను కొనే శక్తి లేక ప్రజలు సతమతమవుతున్నారు.వనస్పతి గీ వినియోగం 81 శాతం పెరుగుదలఅన్ని రకాల ఆహార పదార్థాల వినియోగం తగ్గుతుంటే.. ఒక్క వనస్పతి గీ వినియోగం మాత్రం ఊహించని రీతిలో పెరగడం గమనార్హం. నెలకు సగటున 690 గ్రాములుగా ఉన్న వనస్పతి గీ వినియోగం ఏకంగా 81 శాతం పెరిగి 1.25 కిలోగ్రాములకు చేరింది. ఖరీదైన మాంసకృత్తులు, ఇతర పోషకాహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో ఎక్కువ క్యాలరీలు అందించే వనస్పతి గీని ప్రజలు తమ రోజువారీ వంటకాల్లో అధికంగా ఉపయోగిస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.పట్టణాల్లోనూ ఆకలి కేకలు

దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే లక్షలాది మంది చిన్న వ్యాపారులకు త్వరలోనే పెద్ద సమస్య వచ్చిపడేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రీ-కేవైసీ (Re-KYC) గడువు సెప్టెంబర్ 15తో ముగియనుండటమే దీనికి కారణం. నిర్ణీత సమయంలోగా కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే క్యూఆర్ కోడ్స్ , సౌండ్‌బాక్స్‌ల ద్వారా జరిగే పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందనే వార్తలు పేమెంట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పేమెంట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. వీధుల్లో, చిన్న చిన్న షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు వాడే ఆఫ్‌లైన్ చిన్న వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా, ఆన్లైన్లో చిన్న వ్యాపారాలు చేసుకునే మరో పది లక్షల మంది కూడా తమ అకౌంట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడంలో వెనుకబడి ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఆన్లైన్, ఆఫ్‌లైన్, విదేశీ పేమెంట్ సేవలు అందించే అన్ని కంపెనీలు సెప్టెంబర్ 15, 2026 నాటికి తమ వ్యాపారుల అందరి రీ-కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చిల్లర కొట్టు యజమానులకే అసలు కష్టం!ఈ కేవైసీ నిబంధనల వల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టు యజమానులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్బీఐ అడిగే డాక్యుమెంట్స్ వీరిలో చాలామంది దగ్గర లేకపోవడం, అలాగే ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సౌండ్‌బాక్స్ వాడుతున్న వారిలో 85-90 శాతం మంది కేవైసీ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం క్యూఆర్ కోడ్ బోర్డులు మాత్రమే వాడే చిన్న వ్యాపారులే దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేలా ఉన్నారు.RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అందించటం కోసం పీఎంఏవై అర్బన్, పీఎంఏవై రూరల్ క్రింద కేంద్రాన్ని సహకారం అందించాలని కోరింది కూటమి సర్కార్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది అని సంతోషపడిన వేళ ఏపీలో పట్టణ ప్రాంత ఇళ్ళు లేని నిరుపేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది.కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై అర్బన్-2.0 పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 17,912 గృహాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి రూ.447.80 కోట్లు విడుదల చేయడానికి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి.ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయంప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.50లక్షలు అందిస్తాయి. కేంద్రం రూ.1.50లక్షలు, రాష్ట్రం రూ.1 లక్ష వాటా వేస్తాయి. ఇందులో వీబీ జీరాంజీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అదనంగా లభిస్తాయి. మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఇకపై కేంద్రం మంజూరు చేసే ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు కేటాయించనుంది.17,912 గృహాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిగాయి. మొత్తం 17,912 గృహాల్లో 15,793 ఇళ్లు పట్టణ స్థానిక సంస్థల యూఎల్బీ పరిధిలోనూ, 2,119 ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల యూడీఏ పరిధిలోనూ ఉన్నాయి. అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 గృహాలు కేటాయించగా, పల్నాడు 1,229, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1,057, వైఎస్సార్ కడప 1,053 గృహాలు వచ్చాయి. ఏపీలో ఇల్లులేని పేదలకు కేంద్రం తీపికబురు.. కొత్తగా 4లక్షల ఇళ్ళు ఆర్థిక సాయం నేరుగా వారి

ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన విద్యా వ్యవస్థలు ఉన్నాయి... కానీ అన్ని దేశాల్లో ఒకే రకమైన స్కూల్ బస్సులు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రోడ్డుపై పసుపు రంగు బస్సు కనిపిస్తే చాలు... అది పక్కా స్కూల్ బస్సే. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బస్సులు ఇదే రంగులో ఉంటాయి. అయితే స్కూల్ బస్సులు పసుపు రంగు ఉండటం ఏదో ఫ్యాషన్ కోసం కాదు… ఇందుకు సైంటిపిక్ రీజన్స్ ఉన్నాయి. సైన్స్ ప్రకారం... ఇతర రంగుల కంటే పసుపు రంగు 1.24 రెట్లు వేగంగా మనిషి కంటికి కనిపిస్తుంది. దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విద్యార్థుల భద్రత దృష్ట్యా వారు ప్రయాణించే బస్సుకు పసుపు రంగు వేస్తారు. 2. పొగమంచు, వర్షంలోనూ కనిపించే రంగు పసుపు చలికాలంలో దట్టమైన పొగమంచు, వర్షాకాలంలో భారీ వానలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలోనే విద్యార్థులు ఉదయమే స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ పొగమంచు, వానల సమయంలోనూ పసుపు రంగులో ఉండే స్కూల్ బస్సులు ఇతర వాహనాల డ్రైవర్లకు దూరంనుండే స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదు. 3. చీకట్లోనూ స్పష్టంగా కనిపించే రంగు పసుపు పసుపు రంగుకు ఉన్న మరో ప్రత్యేకత చీకటిలోనూ కనిపిస్తుంది. స్పెషల్ క్లాసులు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో విద్యార్థులు రాత్రి వరకు స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో రాత్రుళ్లు విద్యార్థులు ప్రయాణించినా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండకుండా బస్సు రంగు ఉపయోగపడుతుంది. 4. పెరిఫెరల్ విజన్ (Peripheral Vision) : మనం నేరుగా చూస్తున్నప్పుడు కూడా మన కంటి అంచులతో చుట్టూ ఉన్నవాటిని గమనిస్తాం. దీన్నే పెరిఫెరల్ విజన్ అంటారు. ఇతర రంగులతో పోలిస్తే పసుపు రంగు ఈ పెరిఫెరల్ దృష్టిలో కూడా బాగా కనిపిస్తుందని ప్రయోగాలు నిరూపించాయి. దీంతో ఇతర డ్రైవర్లు స్కూల్ బస్సును దూరం నుంచే పసిగడతారు. 5

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

అర్జున్ రెడ్డి సినిమాతో గుర్తింపు పొందిన నటి షాలిని పాండే తన పేరుతో నెట్లో వస్తున్న ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఆగస్టు 31 సోమవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సదరు వీడియో పూర్తిగా కల్పితమని, అది ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ క్లిప్ అని ఆమె తెలిపారు. అందులో కనిపిస్తున్నది తాను కాదని, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాంకేతికతను దుర్వినియోగం చేయడంపై తీవ్రంగా కలత చెందినట్లు వెల్లడించారు. గత ఆగస్టు 27 మరియు 28 తేదీల్లో ఒక చిన్న వీడియో క్లిప్ అంతర్జాలంలో వేగంగా వ్యాపించింది. సదరు క్లిప్ షాలిని పాండేకు చెందినదేనంటూ కొందరు ప్రచారం చేయగా, అది ఏఐ డీప్‌ఫేక్ కావచ్చునని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఆమె ఇటలీ పర్యటన సమయంలో పోస్ట్ చేసిన స్టిల్ ఫోటోల ఆధారంగానే ఏఐ ద్వారా కదిలే వీడియోను సృష్టించి ఉంటారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో నటి నుంచి ఎలాంటి అధికారిక సమాధానం రాకపోవడంతో ప్రచారం తీవ్రమైంది. దీంతో ఈ అంశంపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు నటి స్వయంగా ముందుకు వచ్చారు. ఆ నకిలీ వీడియో కనిపించిన వెంటనే ఏ మాత్రం షేర్ చేయవద్దని, ఫార్వర్డ్ లేదా డౌన్లోడ్ చేయవద్దని అభిమానులను కోరారు. ఇదిలా ఉండగా ఇటువంటి కంటెంట్‌తో ఎంగేజ్ కాకుండా ప్లాట్‌ఫామ్‌లలో వెంటనే రిపోర్ట్ చేయాలని అభ్యర్థించారు. డిజిటల్ మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ఇటువంటి అవాంఛనీయ ప్రచారాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఫలితంగా సినీ రంగానికి చెందిన నటీమణులపై పెరిగిపోతున్న ఏఐ దుర్వినియోగం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ఇటువంటి డీప్‌ఫేక్ బారిన పడి స్పందించిన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 17,912 ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చింది.. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.447.80 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు కూడా జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు మంజూరు చేయనున్నాయి. ఈ రూ.2.50 లక్షల్లో.. కేంద్రం వాటా రూ.1.50 లక్షలు కాగా.. రాష్ట్రం వాటా కింద రూ.లక్ష ఇస్తారు. వీటితో పాటుగా వీబీ జీరామ్‌జీ (ఉపాధి హామీ పథకం) కింద రూ.27వేలు.. అలాగే స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు ఇస్తారు. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.89 లక్షలు అందుతాయి. కేంద్రం పీఎంఏవై-2.0 కింద పట్టణ పేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంది.. వీటిని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించనుంది.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఈ 17,912 ఇళ్లను జిల్లాల వారీగా కేటాయించింది. వీటిలో పట్టణ స్థానిక సంస్థ(యూఎల్బీ)ల పరిధిలో 15,793 ఇళ్లు ఉంటే.. పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల పరిధిలోకి మరో 2,119 ఇళ్లు వస్తాయి. ఈ 17,912 ఇళ్లలో అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 కేటాయించారు.. ఆ తర్వాత పల్నాడు జిల్లాకు (1,229), నెల్లూరు జిల్లాకు (1,057), కడప జిల్లాకు (1053) ఇళ్లు కేటాయించారు. రాష్ట్రంలో అత్యల్పంగా 212 ఇళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి జిల్లాల కలెక్టర్లు అనుమతులు ఇస్తారు.PMAY Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం 2.0) కింద పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి కార్పెట్ ఏరియా కనీసం 30 చ.మీ., గరిష్ఠంగా 45 చ.మీ. ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు నమూనా డిజైన్లను

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Karnataka MLA controversy:శ్రీరంగపట్నం సమీపంలోని అరేకెరె గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే తల్లి పుట్టినరోజు సందర్భంగా ఒక వినోద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాటకం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది కళాకారులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, కళాకారులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా కార్యక్రమానికి ముందు వారు అక్కడే మేకప్ వేసుకుని సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఒక మహిళా కళాకారిణి ఆసుపత్రి లోపల నుంచి రీల్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ కార్యక్రమానికి ఉపయోగించారనే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు వైద్యం అందించే ప్రదేశం. అలాంటి చోట ప్రైవేట్ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు ఆసుపత్రిలో కళాకారులు ఉండేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అధికారికంగా అనుమతి తీసుకున్నారా? అనే విషయాలపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగులకు లేదా వైద్య సేవలకు ఇబ్బంది కలిగిందా అనే అంశంపైనా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వానికి చెందిన వైద్య సదుపాయాలను వ్యక్తిగత కార్యక్రమాల కోసం ఉపయోగించడంపై విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు స్థానికులు అధికార దుర్వినియోగంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ
గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేయండి. ఈ నీటిని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. దీంతో చిగుళ్ల వాపు, చిగుళ్ల రక్తస్రావం తగ్గుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. చిగుళ్లు బలంగా మారుతాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను నీటిలో కలిపి పుక్కిలించండి. 30 సెకన్ల పాటు ఈ మిశ్రమాన్ని పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. కలబంద రసాన్ని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. స్వచ్ఛమైన కలబంద జెల్ వాడితే చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. పసుపును కొద్దిగా చిగుళ్లకు రాయండి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపును కంట్రోల్ అవుతుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌లాగా తయారు చేయండి. దీన్ని రాయడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరు పుష్కలంగా తాగడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. జామ ఆకుల రసాన్ని లేదా జామ ఆకులు మరిగించిన నీటిని మౌత్‌వాష్‌గా ఉపయోగించండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. చిగుళ్లను దృఢంగా ఉంచుతాయి. టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. టీ ట్రీ ఆయిల్‌ను పుక్కలించడం వల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం తగ్గుతుంది

ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుత నటనా కౌశలం, డాన్సులతో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఆర్థిక ప్రస్థానం అత్యంత స్పూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న వేళ.. సీని, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వివిధ నివేదికలు, జాతీయ మీడియా అంచనాల ప్రకారం, చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ. 1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా ప్రారంభమై, భారత్‌లోనే అత్యధిక పారితోషికం పొందే స్థాయికి చేరుకున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ప్రకటనలు, వివిధ వ్యాపార భాగస్వామ్యాలు ఆయన సంపదను నిలకడగా పెంచాయి. మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్!అత్యాధునిక నివాసాలు - రియల్ ఎస్టేట్ఆయన ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. గత నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు బెంగళూరు సహా పలు నగరాలలో ఉన్న విలువైన స్థిరాస్తులు ఆయన ఇన్వెస్ట్మెంట్ వ్యూహానికి నిదర్శనం.మెగాస్టార్ సినిమాలకు స్టార్లు కట్టిన ఏపీ మంత్రి.. రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండిరాయల్ గ్యారేజ్ - లైఫ్స్టైల్ఆయన లగ్జరీ కార్ల సేకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం
కాఫీ తాగితే కాలేయంలో అసాధారణ ఎంజైమ్‌లు తగ్గుతాయి. క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు తాగడం వల్ల కాలేయంపై మచ్చలు, ఫైబ్రోసిస్ తగ్గుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ వాపు, కొవ్వును తగ్గిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తింటే ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయం దగ్గర కొవ్వు ఏర్పడకుండా చూస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్మీల్ తింటే ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అవకాడో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అల్లిసిన్ కూడా లభిస్తుంది. వెల్లుల్లి తింటే కాలేయ కొవ్వు కరుగుతుంది. బ్లూ బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది

క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. హైదరాబాద్ సిటీ: క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లకోసం హౌసింగ్ బోర్డుకు 60,720 దరఖాస్తులందాయి. వాటిలో సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. అర్హుల జాబితా వెబ్సైట్ క్యూర్ స్టేట్సలో అప్లికేషన్ /ఫోన్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే ఆగస్టు 23 ఆదివారం సాయంత్రం లోగా వెబ్సైట్లో రిపోర్డు చేయవచ్చన్నారు. లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించి, ఆగస్టు 27 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లు కేటాయించనున్నారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గాజాకు మానవతా సహాయక సామాగ్రితో వెళ్తున్న నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోవడం దీనికి ప్రధాన కారణం. దీనిపై కొనసాగుతున్న విచారణలో భాగంగా టర్కీ ఈ నిర్ణయం తీసుకుంది. నెతన్యాహుతో పాటు పలువురు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీస్ జారీ చేయాలని కూడా కోరింది.ఈ వివరాలను టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ విధించిన నావికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన వివిధ దేశాలకు చెందిన నౌకలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు అడ్డుకోవడాన్ని టర్కీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్.. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని రంగంలోకి దించారు.దీని ఆధారంగానే ఇజ్రాయెల్ ప్రధానితో పాటు ఆ నౌకల దిగ్బంధనానికి ప్రత్యక్షంగా ఆదేశాలు ఇచ్చిన, క్షేత్రస్థాయిలో ఆపరేషన్‌లో పాల్గొన్న ఇతర ఉన్నత స్థాయి సైనిక అధికారులను నిందితులుగా ఈ అరెస్ట్ వారెంట్లల్లో చేర్చింది. ఇజ్రాయెల్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘన, చట్టవిరుద్ధ నిర్బంధాలకు పాల్పడిందని టర్కీ ప్రాసిక్యూటర్లు తమ చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?ఇజ్రాయెల్ ప్రభుత్వం సామూహిక మారణహోమ యత్నాలకు ప్రయత్నించిందని, అంతర్జాతీయ శాంతి కార్యకర్తలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, వారిని గాయపర్చడం వంటి హేయమైన చర్యలకు పాల్పడిందని టర్కీ కోర్టు పేర్కొంది. టర్కీతో పాటు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా కూడా తమ న్యాయపరిధుల్లో స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించాయి. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని టర్కీ చెబుతోంది.అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతులు ఇవ్వలేదు: తేల్చి చెప్పిన కేంద్రంటర్కీ ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఇంటర్‌పోల్ ద్వారా నెతన్యాహుపై రెడ్ నోటీస్ జారీ కావడం, దాని అమలు అనేది అంత తేలికైన విషయం కాదు. నిందితులను అరెస్ట్ చేసి అప్పగించడం అనేది ఆయా
విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభంకావడంతో ప్రయాణికులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భోగాపురానికి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.. వీరి కోసం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్ వే బస్సుల్ని నడుపుతోంది. విశాఖ నుంచి భోగాపురానికి ప్రతి అరగంటకు ఒక బస్సును నడిపేలా ప్లాన్ చేశారు.. అయితే విశాఖపట్నంలో ప్రయాణికుల కోసం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.విశాఖపట్నంలో ఎనిమిది ప్రాంతాల్లో బస్ బేలు నిర్మించబోతున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే బస్ బేలలో ఏసీ సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఉండేలా చూస్తామన్నారు. మంత్రి విశాఖపట్నం హుడా పార్క్ నుంచి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులో భోగాపురం విమానాశ్రయం వరకు ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రయాణం చేశారు. ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిర్ణీత సమయం ప్రకారం నడుస్తున్నాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.ఈ బస్సుల్లో ప్రస్తుతం ప్రయాణ సమయం 1.40 గంటలు పడుతోందని.. రాబోయే రోజుల్లో ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు మంత్రి. ఈ బస్సుల్లో ప్రస్తుతం 30శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని.. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతందన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు లగేజీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.విశాఖపట్నం నుంచి ఎలక్ట్రిక్ బస్సులో విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అక్కడ ఏర్పాటు చేసిన బస్‌స్టాండ్, చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి కల్పించిన ఆర్టీసీ రవాణా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి అరగంటకు ఒక ఎలక్ట్రిక్ బస్సును నడుపుతున్నట్లు

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ విషయంపై తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని ఆమె తెలిపారు.వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన విమర్శలపై పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై సురేఖ ఇప్పటికే కమిటీకి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటికి తనను బాధ్యురాలిని చేయవద్దని ఆమె ఆ లేఖలో కోరినట్లు సమాచారం.అయితే, ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వర్గాల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా, క్రమశిక్షణా చర్యలు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత సంచలన హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈరోజు ఉదయం నుంచి చేపట్టిన ఆకస్మిక సోదాలు ఎట్టకేలకు ముగిశాయి. కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల నివాసంలో ఈడీ అధికారులు గంటల తరబడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సోదాలు ముగిసిన అనంతరం అధికారులు అవినాష్ రెడ్డి(Avinash Reddy) నివాసం నుండి బయటకు వస్తూ రెండు పెద్ద బ్యాగులలో అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలు, మరియు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకుని తీసుకెళ్లినట్లు నమ్మదగిన సమాచారం. ఈ దాడులు కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి నివాసానికే పరిమితం కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలతో పాటు అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇళ్లల్లోనూ ఈడీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు ముగించాయి. నిందితుల కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులు, గత కొన్నేళ్లుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలపై అధికారులు క్షుణ్ణంగా ఆరా తీశారు. సోదాల నేపథ్యంలో నిందితుల ఇళ్ల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో సీబీఐ సేకరించిన చార్జ్‌షీట్ ఆధారాల ప్రకారం.. ఈ హత్యకు సుపారీగా చేతులు మారినట్లు చెబుతున్న రూ. 4 కోట్ల నగదు చుట్టూనే ఈడీ దర్యాప్తు ప్రధానంగా సాగుతోంది. ఈ కేసులో భారీ ఎత్తున మనీలాండరింగ్ (PMLA) మరియు హవాలా మార్గాల్లో నిధుల బదిలీ జరిగిందనే బలమైన కోణంలో ఈడీ జోనల్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. హత్య జరిగిన సమయానికి ముందే నిందితుల చేతికి అందిన కోట్ల రూపాయల నగదు అసలు ఎక్కడి నుండి వచ్చింది, దీని వెనుక ఉన్న ఆర్థిక సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని తేల్చడానికి అధికారులు రంగంలోకి

చాలామంది ఇంట్లో పని చేయటం శారీరక వ్యాయామం క్రింద పరిగణించరు. వ్యాయామం అంటే జిమ్ కు వెళ్లి చేసేది. లేక వాకింగ్ , ప్రతీరోజూ నిర్దిష్ట సమయంలో చేసే ఎక్స్సర్ సైజ్ లుగా భావిస్తారు. అయితే అది మాత్రమే కాదు తాజా ఒక అధ్యయనం ఫిజికల్ యాక్టివిటీ పైన ఆసక్తికర రిపోర్ట్ ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ అధ్యయనంలో ఇంటిపనులు కూడా మన శారీరక వ్యాయామామే అని తేల్చింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, వంట చేయడం వంటి రోజువారీ ఇంటి పనులు కూడా వ్యాయామంలా పనిచేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం వెల్లడించింది. ఇవి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం ద్వారా నిపుణులు చెబుతున్నారు. WHO ప్రమాణాల ప్రకారం ప్రతి వ్యక్తికి వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ అవసరం.ఇంటిపనులు వ్యాయామమేనడక, సైక్లింగ్, క్రీడలతో పాటు ఇంటి పనులు కూడా ఈ లెక్కలోకి వస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు పెద్దల్లో ఒకరు, కౌమారుల్లో 81 శాతం మంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవటం అనవసరపు రోగాలకు కారణం అవుతుంది. ఇక చేసే పనులలో కూడా సాంకేతికతపై ఆధారపడటం, కదలక మెదలక కూర్చుని పని చేయటం మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.శరీరానికి కావాల్సిన కదలికలతో ఆరోగ్యందీంతో ఇంట్లో చేసే పనులు కూడా వ్యాయామమే అని, అవి మన శరీరానికి కావాల్సిన కదలికలను ఇస్తాయని అధ్యయనం తెల్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇల్లు తుడవడం వల్ల పొత్తికడుపు, చేతులు, భుజాల కండరాలు బలపడతాయి. బట్టలు ఉతకడం చేతులు, కాళ్లకు శక్తినిస్తుంది. వంట చేస్తూ నిలబడటం, కూరగాయలు తరగడం చేతుల పటుత్వాన్ని పెంచుతుంది. తోటపని, మొక్కలకు నీరు పోయడం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.ఇంటి పనులు చేస్తే ఒత్తిడి మాయంఇంటి పనులు మనసును నిమగ్నం చేసి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి

మన దేశంలో 'పోస్టాఫీసు' అనగానే మైండ్ లోకి ఒక పాత భవనం, ఎర్రటి పోస్ట్‌బాక్స్, లేఖలను సార్ట్ చేసే ఉద్యోగులు గుర్తుకొస్తారు. కానీ, చుట్టూ నీళ్ళు, వెనక మంచు కొండల నడుమ హౌస్‌బోట్‌లో నీటిపై తేలియాడే పోస్టాఫీసును ఎప్పుడైనా చూశారా? ఇది ఏదో సినిమా దృశ్యం లేదా ఊహాజనిత కథ కాదు! జమ్మూకశ్మీర్‌లోని ప్రసిద్ధ శ్రీనగర్ డల్ లేక్‌పై నిజంగానే ఒక 'ఫ్లోటింగ్ పోస్టాఫీస్' (Floating Post Office) అందుబాటులో ఉంది. ఇప్పటికీ సజావుగా పనిచేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టాఫీసు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో చూద్దాం: శ్రీనగర్‌లోని ప్రసిద్ధ డల్ లేక్, నెహ్రూ పార్క్ సమీపంలో ఈ వినూత్న పోస్టాఫీస్ ఉంది. బయటి నుంచి చూస్తే ఇది కాశ్మీర్లో కనిపించే ఒక సాధారణ సంప్రదాయ హౌస్బోట్లాగే కనిపిస్తుంది. కానీ, కాస్త దగ్గరగా వెళితే మన 'ఇండియా పోస్ట్' (India Post) పేరు, లోగోలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కేవలం పర్యాటకులు వచ్చి ఫొటోలు దిగడానికి పెట్టిన షోపీస్ అనుకుంటే పొరపాటే. సాధారణ పోస్టాఫీసులాగే ఇక్కడ కూడా ఉత్తరాలు, పార్సిళ్లు, పోస్టుకార్డులు పంపవచ్చు. డల్ లేక్ చుట్టూ ఉండే బోట్ నిర్వాహకులు, వ్యాపారులు, స్థానికులు, పర్యాటకులు రోజూ ఈ సేవలను వాడుకుంటారు. ప్రత్యేక ముద్ర (Special Stamp): ఇక్కడి నుండి పంపే ప్రతీ పోస్టుకార్డుపై డల్ లేక్ ,షికారా పడవ చిత్రం ఉన్న ప్రత్యేకమైన పోస్టల్ క్యాన్సిలేషన్ స్టాంప్ వేస్తారు. అందుకే పర్యాటకులు కాశ్మీర్ జ్ఞాపకార్థం తమ ప్రియమైన వారికి ఇక్కడి నుంచే ఉత్తరాలు రాస్తుంటారు. ఈ పోస్టాఫీసు సిబ్బంది ప్రతిరోజూ సేకరణ చేసిన పోస్టులను సేకరించి శ్రీనగర్‌లోని ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. అక్కడ నుంచి అవి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అవసరమైతే ఇండియా పోస్ట్ సిబ్బంది స్వయంగా 'షికారా' పడవల్లో వెళ్ళి నీటిపై ఉండే హౌస్బోట్లలోని వారికి ఉత్తరాలను డెలివరీ చేస్తారు. చాలామంది ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ 2011లోనే

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీ కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ వర్షాకాలం మీకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. సాధారణ రోజుల్లో ఇల్లు చూడటానికి, వర్షాకాలంలో చూడటానికి చాలా తేడా ఉంటుంది. ఏడాది పొడవునా కనిపించని అనేక విషయాలు ఈ సీజన్లో బయటపడతాయి. ప్రాపర్టీ రియల్ క్వాలిటీ తెలుసుకోవడానికి వర్షం ఒక మంచి టెస్టింగ్ టైమ్. దీనికి తోడు ప్రస్తుతం బ్యాంకులు హోమ్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఇల్లు కొనడం ఎంతవరకు బెటర్ అనేది ఈ 4 పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ఇంటి లుక్ ఎంత బాగున్నా, దానికి క్వాలిటీ చాలా ముఖ్యం. వర్షాకాలంలో మాత్రమే బిల్డింగ్ అసలు క్వాలిటీ ఏంటో క్లియర్‌గా తెలుస్తుంది. గోడలు, పై భాగం నుండి నీరు కారడం లేదా తేమ ఉందా అనేది ఈజీగా చెక్ చేయవచ్చు. విండోస్, డోర్స్, బాత్రూమ్లలో తేమ రావడం లాంటి సమస్యలు ఉంటే ఆ ప్రాపర్టీని తీసుకోకపోవడమే మంచిది. అలాగే వర్షం పడినప్పుడు అక్కడ నీరు నిలిచిపోకుండా ప్రాపర్ డ్రైనేజీ సిస్టమ్ ఉందో లేదో సరిచూసుకోవచ్చు. ఇల్లు కొనేటప్పుడు కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో చాలా చోట్ల రోడ్లపై నీరు చేరి, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. బిల్డర్లు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ ఉందంటూ ఎన్నో ప్రామిస్‌లు చేస్తారు. కానీ వర్షం పడితే కానీ ఆ రోడ్ల అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. రహదారులు గుంతలమయంగా ఉన్నాయా, లేదా రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నాయా అనేది ఈ టైమ్‌లోనే సరిగ్గా అంచనా వేయవచ్చు. గతంలో ఆర్బీఐ (RBI) నాలుగు సార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత, చాలా బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. దీనివల్ల ఇల్లు కొనాలనుకునే వారికి ఆర్థికంగా

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెరగని గుర్తింపును అందించిన నటీమనుల్లో ఒకరు, ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత 'షావుకారు' జానకి (94) మరణించారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనంలోనే రేడియో నాటికల ద్వారా కళారంగంలో ప్రవేశించిన ఆమె.. తన టాలెంట్ తో మంచి గుర్తింపు సాధించింది. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన 'షావుకారు' చిత్రంతో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సరసన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో 'షావుకారు' అనేది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఒక్క సినిమాతోనే 'షావుకారు జానకి'గా సినీ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. సుదీర్ఘమైన సినిమా ప్రయాణం చేసిన అరుదైన హీరోయిన్లలో .. షావుకారు జానకి ఒకరు.దాదాపు 70 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేసన్, జెమిని గణేసన్, ఎంజీఆర్, రాజ్‌కుమార్ వంటి దిగ్గజ నటులందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. షావుకారు, కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, ఉయ్యాల జంపాల, అక్కచెల్లెళ్లు, దేవుడు చేసిన మనుషులు, తాయారమ్మ బంగారయ్య, బడిపంతులు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఆమె నటనా పటిమకు నిదర్శనాలు. పౌరాణిక, సాంఘిక, హాస్య, సెంటిమెంట్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా జీవించడం ఆమె నైజం. వయసు పెరిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, బామ్మ పాత్రల్లోనూ మెప్పించారు. 2020లో వచ్చిన 'బిస్కోత్' చిత్రంలో ఆమె

రాజకీయాల్లో అధికారం దక్కించుకోవడానికి నాయకులు ప్రజల వద్దకు పాదయాత్రలు చేయడం చూశాం. తమ ఆరాధ్య నాయకుడు గెలవాలని, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కార్యకర్తలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు, ఆలయాలకు మొక్కుబడులు చెల్లిస్తూ కాలినడకన వెళ్లడం సాధారణంగా కనిపించే దృశ్యమే. కానీ, తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని ఒక వినూత్న సంఘటన తాజాగా చోటుచేసుకుంది. తమ అభిమాన నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించాలని ఆకాంక్షిస్తూ ఇద్దరు ఆదివాసీ యువకులు ఏకంగా ఆయన ఫాంహౌస్‌కే పాదయాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన జాడే తిరుపతి, దుర్గం శంకర్ అనే ఇద్దరు ఆదివాసీలు ఈ వినూత్న దీక్షకు పూనుకున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఏకైక సంకల్పంతో వారు ఆసిఫాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి ఫాంహౌస్ వరకు కాలినడకన బయలుదేరారు. ఎండ, వాన, అలసటను లెక్కచేయకుండా సుమారు 11 రోజుల పాటు నిరంతరాయంగా ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకున్నారు. గురువారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారు ప్రత్యక్షంగా కలిశారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన జాడే తిరుపతి, దుర్గం శంకర్లను కేసీఆర్ ఎంతో ఆప్యాయంగా స్వాగతించి, వారి పట్టుదలను అభినందించారు. క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్న ఆయన, “మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ కలవాలి” అంటూ వారి భుజం తట్టి ఉత్సాహపరిచారు. ఈ ఘటన గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. ఉమ్మడి ఆదిలాబాద్ వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి గ్రామీణ ఆదివాసీ యువకులు అధికారంలో లేని ఒక నాయకుడి కోసం 11 రోజుల పాటు పాదయాత్ర చేశారంటే, క్షేత్రస్థాయిలో కేసీఆర్‌పై ఉన్న ఆదరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు గిరిజన, ఆదివాసీ వర్గాల్లో బలంగా నాటుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు కొలంబోలో ఘనమైన ఆతిథ్యం లభించింది. పర్యటనలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు ముందు, శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా ఇరు దేశాల జట్లకు విందు ఏర్పాటు చేశారు. కొలంబోలోని ఇండియా హౌస్‌లో నిన్న రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. రెండో టెస్టుకు సన్నద్ధమవుతున్న భారత, శ్రీలంక ఆటగాళ్లు ఈ విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గురించి బీసీసీఐ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. "కొలంబోలో ఇదొక చిరస్మరణీయ సాయంత్రం! రెండో టెస్టుకు ముందు శ్రీలంకలో భారత హైకమిషనర్ సంతోష్ ఝా, టీమిండియాకు ఇండియా హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు" అని పేర్కొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంది.భారత హైకమిషనర్ సంతోష్ ఝా కూడా ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. "టీమిండియాకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న టీమిండియా, శ్రీలంక జట్లకు ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇరు దేశాలను కలిపి ఉంచే క్రికెట్, భారత్-శ్రీలంక మధ్య ఉన్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది" అని ఆయన తన 'ఎక్స్' పోస్టులో తెలిపారు.సిరీస్‌లో భారత్ ఆధిక్యంప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 165 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టెస్టు

వంట పూర్తయ్యాక ఒక్కసారి రుచి చూస్తే ఉప్పు కాస్త ఎక్కువైందని తెలిసి గుండె ఆగినంత పనవుతుందా? రోజూ ఎంతో ఇష్టంగా వండే కూరలు లేదా ఫ్రైలలో పొరపాటున ఉప్పు ఎక్కువ కావడం సర్వసాధారణం. అయితే ఉప్పు ఎక్కువైందని ఆ కూరను పడేయాల్సిన పని లేదు. అమ్మమ్మల నాటి సింపుల్ చిట్కాలతో ఆ ఉప్పును బ్యాలెన్స్ చేయడమే కాకుండా… కూరను మరింత రుచిగా మార్చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. పచ్చి బంగాళాదుంప ముక్కలు (Raw Potato)… గ్రేవీలో లేదా కర్రీలో పచ్చి బంగాళాదుంపను పెద్ద ముక్కలుగా కోసి వేసి, 10-15 నిమిషాలు ఉడికించండి. బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ గ్రేవీలోని నీటితో పాటు ఉప్పును కూడా పీల్చుకుంటుంది. వడ్డించే ముందు ఈ ముక్కలను తీసివేస్తే సరిపోతుంది. 2. గోధుమ పిండి ఉండలు …మనం చపాతీకి కలుపుకునే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉడుకుతున్న గ్రేవీలో వేయండి. ఈ పిండి ఉండలు కూరలోని అదనపు ఉప్పును, నీటిని వేగంగా పీల్చుకుంటాయి. వంట పూర్తయ్యాక వీటిని బయటకు తీయవచ్చు. 3. నిమ్మరసం లేదా వెనిగర్.. పులుపు అనేది ఉప్పు తీవ్రతను తగ్గిస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ కలపండి. ఇది ఉప్పును పూర్తిగా తీసివేయకపోయినా, నాలికపై ఉప్పు ఘాటు తెలియకుండా రుచిని కవర్ చేస్తుంది. 4. పెరుగు లేదా మీగడ.. గ్రేవీ కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు చెంచాల చిలికిన పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ కలపడం అద్భుతమైన మార్గం. పెరుగులో ఉండే ఫ్యాట్స్, పులుపు ఉప్పు తీవ్రతను తగ్గించడమే కాకుండా, కూరకి మంచి టెక్స్చర్ , క్రీమీ రుచిని ఇస్తాయి. 5. తియ్యటి పదార్థాలు.. కారంగా లేదా మసాలా ఎక్కువ ఉన్న కూరల్లో ఉప్పు తగ్గించడానికి చిటికెడు పంచదార లేదా కొన్ని చుక్కల తేనె కలపవచ్చు. ఇది స్వీట్నెస్ను ఇవ్వడంతో పాటు ఉప్పు, కారాల సమతుల్యతను .. పెంచుతుంది