
క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు.
హైదరాబాద్ సిటీ: క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లకోసం హౌసింగ్ బోర్డుకు 60,720 దరఖాస్తులందాయి. వాటిలో సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. అర్హుల జాబితా వెబ్సైట్ క్యూర్ స్టేట్సలో అప్లికేషన్ /ఫోన్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
అభ్యంతరాలుంటే ఆగస్టు 23 ఆదివారం సాయంత్రం లోగా వెబ్సైట్లో రిపోర్డు చేయవచ్చన్నారు. లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించి, ఆగస్టు 27 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లు కేటాయించనున్నారు.
మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News



