
© 2026 nimisham.in

ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుత నటనా కౌశలం, డాన్సులతో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ఆర్థిక ప్రస్థానం అత్యంత స్పూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న వేళ.. సీని, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వివిధ నివేదికలు, జాతీయ మీడియా అంచనాల ప్రకారం, చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ. 1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా ప్రారంభమై, భారత్‌లోనే అత్యధిక పారితోషికం పొందే స్థాయికి చేరుకున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ప్రకటనలు, వివిధ వ్యాపార భాగస్వామ్యాలు ఆయన సంపదను నిలకడగా పెంచాయి. మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్!అత్యాధునిక నివాసాలు - రియల్ ఎస్టేట్ఆయన ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. గత నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు బెంగళూరు సహా పలు నగరాలలో ఉన్న విలువైన స్థిరాస్తులు ఆయన ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహానికి నిదర్శనం.మెగాస్టార్ సినిమాలకు స్టార్లు కట్టిన ఏపీ మంత్రి.. రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండిరాయల్ గ్యారేజ్ - లైఫ్‌స్టైల్ఆయన లగ్జరీ కార్ల సేకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ప్రయాణం టాలీవుడ్‌లో ఒక సరికొత్త చరిత్ర.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








