
Suriya 47 | సూర్యస్టైలిష్ ఎంట్రీ అదిరింది.. స్టన్నింగ్‌గా ‘సీన్’ టైటిల్ టీజర్
Suriya 47 | సూర్య స్టైలిష్ ఎంట్రీ అదిరింది.. స్టన్నింగ్‌గా ‘సీన్’ టైటిల్ టీజర్
© 2026 nimisham.in

Suriya 47 | సూర్య స్టైలిష్ ఎంట్రీ అదిరింది.. స్టన్నింగ్‌గా ‘సీన్’ టైటిల్ టీజర్

Suriya 47 | సూర్య కొత్త చిత్రానికి 'సీన్' టైటిల్ పరిశీలన!

కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాగ్ మరోసారి ఒక స్పెషల్ రోల్ లో మెరవనున్నాడానే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలకు నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. కానీ, నాగ్ కి మాత్రం ఈ సినిమాలు కలిసి రాలేదు. ముఖ్యంగా కూలీలో విలన్ గా ఆయన నటన బాగున్నా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో నాగ్.. స్పెషల్ రోల్స్ కి దూరంగా ఉండడమే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్పెషల్ రోల్ చేసి దెబ్బ తిన్నా కూడా నాగ్.. మరోసారి అదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆ పాత్రకు నాగ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి వినోత్.. కథ కూడా చెప్పాడట. తన పాత్రలోని ప్రాధాన్యత నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక నాగార్జున ఎంట్రీతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగార్జున, ఇప్పుడు సూర్య నటించబోయే రాబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సూర్య, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, మాస్

మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది. జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని

ఆగస్ట్ (August 2026) మొదటివారంలో కొరియన్ కనకరాజు, డీసీ, జీడీ నాయుడు, కేజేక్యూ, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “కొరియన్ కనకరాజు” క్లీన్ హిట్ అనిపించుకుంది. పరిమిత బడ్జెట్ లో తీయడం, మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వరుణ్ తేజ్ ఈ మూవీతో గట్టెక్కాడు. మిగతా సినిమాల్లో “డీసీ”కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తక్కువ రేటుకు అమ్మకాలు సాగడంతో బయ్యర్లకు బాగానే డబ్బులొచ్చాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రెండో వారంలో “విశ్వనాధ్ అండ్ సన్స్,” పళ్ల బురుసు, పాంచాలి పంచ భర్తృక, అగథ, మకుటం, హుషార్ పిట్టలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “విశ్వనాధ్ అండ్ సన్స్” సినిమా సూపర్ హిట్టయింది. తమిళ్ లో కంటే తెలుగులో మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పళ్ల బురుసుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎమ్మెస్ రాజు తీసిన అగధ చిత్రం కూడా ఆడకపోగా.. విశాల్ చేసిన మకుటం కూడా ఫ్లాప్ అయింది. సురేశ్ బాబు రిలీజ్ చేసిన హుషార్ పిట్టలు సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడో వారంలో ఇరుముడి, ఖలీఫా, సర్దార్ సర్వాయి పాపన్న, అమీర్ లోగ్, రెడ్ బ్యాగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. రవితేజ నటించిన “ఇరుముడి” బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలో టాక్సిక్, కికు చిరంజీవి, హాయ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. యశ్ నటించిన “టాక్సిక్” సినిమా డిజాస్టర్ అయింది. మొదటి వారం 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ, సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఆగస్ట్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, 2 సినిమాలు హిట్

‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది. ‘ఇరుముడి’ తొలి రోజే సుమారు రూ.23–25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్ తో వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, పాజిటివ్ రెస్పాన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ దూకుడు ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘విశ్వనాథ్ & సన్స్’కు (Vishwanath and sons) కొంత పోటీగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ బిజినెస్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాభాల జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వీకెండ్లోకి అడుగుపెడుతున్న సమయంలో ‘ఇరుముడి’ రావడం సూర్య సినిమాకు సవాల్‌గా మారింది. ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకర్షిస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ‘విశ్వనాథ్ & సన్స్’కు కొన్ని కేంద్రాల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పలేం. ఇప్పటికే సినిమాకు వచ్చిన టాక్, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు దానికి బలంగా మారాయి. సినిమా లాభాల దిశగా

సూర్య లేటెస్ట్ గా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీతో విజయాన్ని అందుకున్నారు. గత వారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో వారు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ 8 రోజులు పూర్తి చేసుకుంది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చాయి. అయినా ఈ మూవీ కలెక్షన్లు తగ్గలేదు సరికదా, శుక్రవారం పెరగడం విశేషం. `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీకి ఎనిమిదో రోజు రూ.4.50కోట్లు వచ్చాయి. గురువారం రూ.4.20కోట్లు రాగా, ముప్పై లక్షలు పెరగడం విశేషం. వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటుందనేదానికిది నిదర్శనం. ఇక 8 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.149.77కోట్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 150కోట్ల క్లబ్లో చేరింది. ఇండియాలో దీనికి రూ.99.52కోట్ల గ్రాస్ రాగా, రూ.86.10కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఎనిమిదో రోజు ఓవర్సీస్లో కోటిన్నర రాబట్టింది. మొత్తంగా అక్కడ రూ.50.26కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకి తమిళంలో కంటే తెలుగులోనే కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. 8వ రోజు కూడా తమిళంలో రూ.1.85కోట్లు వస్తే, తెలుగులో రూ.2.40కోట్లు రావడం విశేషం. ఓవరాల్ కలెక్షన్లలో కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి రూ.130కోట్ల బడ్జెట్ అయ్యింది. సుమారు రూ.90కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందట. ఈ లెక్కన సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పటికే రూ.150కోట్లు దాటింది. ఈ వచ్చే వారంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, వైవా హర్ష

తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే..? తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తరువాత సూర్య సినిమా ఓ రికార్డ్ సాధించింది. అదే సమయంలో మరో సినిమా ఫ్యాన్స్ నీరుకారి పోయేలా చేసింది. ఎందుకో చూద్దాం? మొన్నటి దాకా విజయ్ సినిమా ఎలా ఉన్నా ఇట్టే రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేది. అలాంటిది విజయ్ (Vijay) తాజా చిత్రం జననాయగన్ (Jana Nayagan) ఆ ఫీట్ సాధించలేక పోయింది. అందునా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత వచ్చిన 'జననాయగన్' బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో 'జననాయగన్' కంటే ముందు విడుదలైన సూర్య (Suriya) కరుప్పు (Karuppu) విజయ్ సినిమా కంటే ఎక్కువ వసూలు చేయడం విశేషంగా మారింది. సూర్య 'కరుప్పు' సినిమా మే 15వ తేదీన విడుదలయింది. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తరువాత జూలై 23న 'జననాయగన్' జనం ముందు నిలచింది. తమిళనాడులో 'కరుప్పు' ఫినిషింగ్ బాక్సాఫీస్ నంబర్ 170 కోట్లు దాటింది. 'జననాయగన్' నెలలోపే ఇక ముందుకు సాగే పరిస్థితి లేదని తేలింది. ఈ సినిమా చివరకు తమిళనాట 160 కోట్ల వద్ద ఆగిపోయింది. చిత్రమేంటంటే ఈ మధ్యే విడుదలైన సూర్య సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్స (Vishwanath & Sons) మాత్రం తమిళనాడులో ముందు సినిమా 'కరుప్పు'లా హల్ చల్ చేయలేకపోతోంది. ఈ మూవీ ఆరు రోజులకు 38 కోట్లు మాత్రమే పోగేసింది. అంటే తమిళనాడులో 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు ఎదురుగాలి వీస్తోందన్న మాట. అదే ఇప్పుడు సూర్య అభిమానులకు ఆవేదన కలిగిస్తోన్న అంశం. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం తెలుగునాట విశేషాదరణ చూరగొంది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూలు

సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో రూ. 45 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో సక్సెస్ రన్ కొనసాగిస్తూ. ఇప్పుడు రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రెడీ అయ్యింది. ఒకప్పుడు థియేటర్లలో సినిమాను నిలబెట్టాలంటే బిగ్ స్టార్, భారీ బడ్జెట్, భారీ హైప్ తప్పనిసరి అన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ లెక్క కాస్త మారుతున్నట్టే కనిపిస్తోంది. ‘మా ఇంటి బంగారం’ రూ. 100 కోట్ల మార్క్ దాటగా అదే సమయంలో కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘డీసీ’ 14 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. అంటే స్టార్ పవర్ కంటే కంటెంట్, మౌత్ టాక్, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సంకేతం ఇది. మిడ్-బడ్జెట్ సినిమాలకు మళ్లీ థియేట్రికల్ మార్కెట్ పెరుగుతోందని ఈ సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి. కొరియన్ కనకరాజు’, చెన్నై లవ స్టోరీ ఎబోవ్ యావరేజ్ టాక్‌తో బాగానే రాబట్టింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు ఓటీటీకి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. వాళ్లకు నచ్చే సినిమా కనిపిస్తే ఇప్పటికీ టికెట్ కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి థియేట్రికల్ మార్కెట్లో మిడ్-బడ్జెట్ సినిమాలకు కూడా స్పేస్ ఉందనే నమ్మకం మేకర్స్‌లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్రెండ్‌ను చూసి “టాలీవుడ్లో ఇక ప్రతి సినిమా థియేటర్లలో ఆడుతుంది” అని చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమాల విజయానికి కంటెంట్‌తో పాటు మౌత్ టాక్, రిలీజ్ టైమింగ్, ప్రమోషన్, టికెట్ ప్రైసింగ్ కూడా కీలకం. బ్లాక్‌బస్టర్, డిజాస్టర్ అనే రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ‘డీసెంట్ సినిమా’ కూడా థియేటర్లో నిలబడగల మార్కెట్ మళ్లీ ఏర్పడుతోందా అంటే

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో గిల్ రెండుసార్లు ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో బంతి లైన్‌ను పూర్తిగా కవర్ చేయడంలో గిల్ ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ను లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఏకంగా 11 సార్లు ఔట్ చేశారు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్‌లో గిల్ ప్రత్యేకంగా లెఫ్టార్మ్ స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక బౌలర్ల బంతులను కూడా చాలాసేపు ఆడాడు. గిల్ సాధనపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే స్పందిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునేందుకు గిల్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ‘అతని ఆటలో సహజంగానే పరుగుల ప్రవాహం ఉంటుంది. పిచ్ పరిస్థితులు, బంతి వేగం, ఎలాంటి షాట్లు ఆడాలి, ఎలా డిఫెన్స్ చేయాలనే విషయాలను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ తన సహజ ఆటతీరునే

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్టైన్మెంట్స్తో తనకున్న ప్రత్యేక అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య కథానాయకుడిగా నాగవంశీ నిర్మించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సితార సంస్థతో తనకున్న సంబంధం డబ్బులు, అగ్రిమెంట్లకు అతీతమైనదని ఆయన స్పష్టం చేశారు. తన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితమే సిద్ధమైన కథఈ సినిమా వెనుక ఉన్న నిర్మాణ ప్రయాణాన్ని వెంకీ అట్లూరి వివరంగా పంచుకున్నారు. ఈ కథను 2022 లోనే రాసుకున్నానని, సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని తెలిపారు. సూర్య కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ కథ వినగానే ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. అనవసరమైన కామెడీ లేకుండా కథను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాలని సూర్య సూచించడంతో దానికి అనుగుణంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాత్రల ఎంపిక మరియు వసూళ్ల తీరుకథాంశం మరియు నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'ప్రేమలు' సినిమా చూసిన తర్వాత మమితా బైజును ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశామని, తమిళంపై ఆమెకున్న పట్టు సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. దీంతో తమిళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలో రూపొందించినట్లు చెప్పారు. అక్కడ థియేటర్లు, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ వసూళ్లు తక్కువగా కనిపిస్తాయి, అయితే లాంగ్ రన్ బలమైన ప్రభావం చూపిస్తుందని ఆయన విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయంసినిమా వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ₹155 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో నికరంగా ₹81.63 కోట్లు వసూలు

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని

సూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్లో డౌన్ అవుతుంది. వీకెండ్స్ తో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ వీక్ డేస్‌లోనూ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. స్ట్రాంగ్‌గానే ఉండటం విశేషం. చాలా వరకు సినిమాలు వీక్ డేస్‌లో భారీగా పడిపోతాయి. ఈ చిత్రం మాత్రం డీసెంట్ గా వసూళ్లని రాబట్టడం విశేషం. ఇది సినిమా విజయానికి కారణమవుతుందని చెప్పొచ్చు. సూర్య, మమితా బైజు జంటగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` కలెక్షన్లు చూస్తే, ఐదో రోజు ఇండియాలో రూ.7.33కోట్లు రాబట్టింది(సాక్నిల్క్ లెక్కల ప్రకారం). ఓవర్సీస్లో మరో రెండు కోట్లు వచ్చాయి. సోమవారంతో పోల్చితే కోటి వరకు తగ్గాయి. కానీ అది పెద్ద మార్పుగా చెప్పలేం. సాధారణంగా బుధ, గురువారం వరకు కలెక్షన్లు తక్కువగానే ఉంటాయి. మళ్లీ శుక్రవారం నుంచి పుంజుకుంటాయి. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.128.60కోట్లు రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.83.60కోట్ల గ్రాస్, రూ.72.30కోట్ల నెట్ వచ్చింది. ఓవర్సీస్లో సుమారు రూ.45కోట్లు రావడం విశేషం. ఇది ఓవర్సీస్లో దుమ్ములేపుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతుంది. తెలుగులో ఐదో రోజు రూ.3.50కోట్లు రాగా, తమిళంలో రూ.2.35కోట్లు మాత్రమే రావడం గమనార్హం. `విశ్వనాథ్ అండ్ సన్స్` సినిమాకి అయిన థియేట్రికల్ బిజినెస్ రూ.90కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.22కోట్లుగా నిర్ణయించారు. ఇక్కడ ఈ వీక్‌తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఓటీటీ రూపంలో రూ.85కోట్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రూపంలో మరో రూ.28కోట్లు వచ్చాయి. ఆడియో రూపంలో రూ.12కోట్లు వచ్చాయి. మొత్తంగా బిజినెస్ రూ.215కోట్లు అని సమాచారం. సినిమాకి అయిన బడ్జెట్ రూ.130కోట్లు. దీంతో మేకర్స్ ఇప్పటికే రూ.85కోట్ల లాభాల్లో ఉన్నారు. థియేట్రికల్ గా సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్

100 Cr Movies : సంక్రాంతి తర్వాత కాస్త డల్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కి దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి బూస్టప్ అందించింది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత ఆడియెన్స్ ముందుకొచ్చిన మరిన్ని సినిమాలు కూడా ఇదే బాటలో సక్సెస్‌ని కంటిన్యూ చేశాయి. ఈ లిస్ట్‌లో చిన్న సినిమాలు హిట్ అవ్వడమే కాక కలెక్షన్స్ కూడా రాబట్టాయి. కొన్ని సినిమాలు అయితే వంద కోట్ల జాబితాలో చేరాయి. గత శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కేవలం రెండ్రోజుల్లోనే 100కోట్ల మార్క్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓవర్సీస్లో 1.6 మిలియన్ డాలర్స్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. పాజిటివ్ వైబ్స్‌తో విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా 3 మిలియన్‌కి పైగా బుకింగ్స్‌తో అదరగొడుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో పాటు శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కంబైన్డ్‌గా ప్రొడ్యూస్ చేసిన మరో సినిమా లెనిన్ కూడా ఈ ఇయర్ వందకోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్ హైలైట్‌గా వచ్చిన లెనిన్ సినిమా మౌత్‌టాక్‌తో లాంగ్ రన్లో వందకోట్లు కొల్లగొట్టి అఖిల్‌కి మెమరబుల్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించింది లెనిన్ సినిమా. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన అఖిల్ కి ఆ లోటు తీర్చేసింది. భారీ సెట్టింగులు, వందల కోట్ల VFX లేకపోయినా కంటెంట్‌లో విషయం ఉంటే కలెక్షన్లు ఆటోమేటిక్టగా వస్తాయని లెనిన్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇక లెనిన్ సినిమా కంటే ముందుగా ఈ వంద కోట్ల ఫీట్ సాధించింది సమంత. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ వుమెన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా స్ట్రాంగ్ మౌత్

Suriya : కొత్త కొత్త స్టోరీస్, ప్రయోగాలకు కేరాఫ్ హీరో సూర్య. ఎవరూ ట్రై చేయని కథలను తీసుకొని వాటితో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోవడం ఆయన స్టైల్. ఈ ఏడాది కరుప్పు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. సూర్య విశ్వనాధ్ & సన్స్ సినిమా తర్వాత జీతూ మాధవన్, టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు ప్రకటించాడు. ఆ రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు, తమిళ్ కే పరిమితమైన సూర్య పాన్ ఇండియా రేసులోకి రాబోతున్నాడు అని సమాచారం. అట్లీ డైరెక్షన్లో సూర్య సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తేరి, మెర్సల్, జవాన్.. ఇలా వరుసగా కమర్షియల్ హిట్స్ సాధించిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో రాకా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ రాకా సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సూర్యను సంప్రదించినట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారట. సూర్య, అట్లీ కాంబినేషన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేలా కథను సిద్ధం చేస్తున్నారట. సూర్య కెరీర్లోనే మరో భారీ చిత్రంగా నిలిచేలా బడ్జెట్, స్కేల్ విషయంలో ఎక్కడా రాజీపడకూడదని అట్లీ భావిస్తున్నట్టు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి సూర్య, అట్లీ కాంబో నిజంగానే సెట్స్‌పైకి వస్తుందా..? ఇది జస్ట్ రూమరేనా అనేది మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అట్లీ ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో రాకా సినిమా బిజీలో ఉన్నాడు. Also See : Ayesha Khan : నిశ్చితార్థం చేసుకున్న బోల్డ్ భామ అయేషా ఖాన్..? ఫోటోలు

IND vs SL: శ్రీలంక యువ ఆఫ్ స్పిన్నర్ కేశర నువాంతకు తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. భారత బ్యాటర్ల వీరబాదుడును తట్టుకోలేక ఈ యంగ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు బౌలింగ్ చేసిన నువాంత ఏకంగా 175 పరుగులు సమర్పించుకున్నాడు. టెస్ట్ డెబ్యూలో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా అతడు నిలిచాడు. లంక వైపు నుంచి అరంగేట్రంలోనే అత్యంత భారీగా పరుగులు ఇచ్చిన అవాంఛనీయ రికార్డు సూరజ్ రణదీవ్ పేరిట ఉంది. అతడు 2010లో భారత్‌పైనే 222 రన్స్ ఇచ్చాడు. అయితే నువాంత భారీగా పరుగులు ఇచ్చినా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలాంటి ముగ్గురు దిగ్గజ బ్యాటర్ల వికెట్లు పడగొట్టడం కాస్త ఊరటనిచ్చే అంశం. భారత ఇన్నింగ్స్‌లో యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. లంక బౌలర్లను నలువైపులా బాదుతూ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు సాధించాడు. వికెట్ కోల్పోయిన ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి మరో 71 పరుగులు జోడించి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. పడిక్కల్ ఆడిన ఈ క్లాసిక్ ఇన్నింగ్స్ జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. ఇది కూడా చదవండి: Devdutt Padikkal Girlfriend: దేవదత్ పడిక్కల్ మనసు దోచిన ఈ భామ ఎవరు?.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ హాఫ్ సెంచరీతో రాణించిన రాహుల్, ధ్రువ్ జురెల్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి 175 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసాడు. యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన ఫార్మ్‌ను కొనసాగిస్తూ 68 బంతుల్లోనే 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ డీసెంట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఎప్పటిలాగే సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక మమితా బైజు తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ ఒకటి. సినిమాలో ఈ పిల్లాడు తన క్యూట్ నెస్, న్యాచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అభయ్ అసలు పేరు చార్విక్. చాలా మంది ఈ అబ్బాయిని సెలబ్రిటీల పిల్లాడని అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఈ బాబు కామన్ మ్యాన్ వాళ్ల అబ్బాయి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చార్విక్ ను తీసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందని వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం 6 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీంతో చార్విక్ ను ఆడిషన్ కు తీసుకెళ్లాం. అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తుండగా చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. దీంతో అతని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి మేకర్స్ వెంటనే సెలెక్ట్ చేశారు

ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ డిస్కర్షన్ లో ఒకటిగా కూడా మారిందంటే విశ్వనాధ్ అండ్ సన్స్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్ర కథని దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ధనుష్, దుల్కర్ సల్మాన్ కి వినిపించాడు. ఆ తర్వాత టీం సలహాతో సూర్యకి వినిపించడం జరిగింది. ఆ విధంగా సూర్య వద్దకి చేరి ఇప్పుడు అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు స్టార్ తెలుగు హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్. దుల్కర్, ధనుష్ మాత్రం నిజం. ఇక బాక్సాఫీస్ వద్ద విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో జోరు చూపిస్తూ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. లాంగ్ రన్ లో పలు చిత్రాల రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం. దిల్ రాజు రియల్ లైఫ్ సీన్: 'విశ్వనాథ్ & సన్స్'కి ఇన్స్పిరేషన్ ఏంటో చెప్పిన వెంకీ అట్లూరి.! లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే?

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ఔటైనట్లుగా భావించి మైదానం నుంచి వెళ్తున్న కేఎల్ రాహుల్‌కు దేవదత్ పడిక్కల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాతి పరిణామలతో పడిక్కల్‌ను రాహుల్ గట్టిగా హగ్ చేసుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. లంక బ్యాటర్ల తరహాలోనే టీమిండియా బ్యాటర్లు పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇవాళ ఆటలో భారత్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఊహించని లైఫ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన రాహుల్.. దేవదత్ పడిక్కల్ ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య వేసిన అద్భుతమైన బంతి రాహుల్ కాలికి తగిలింది. దీంతో లంక ప్లేయర్లు అప్పిల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రాహుల్‌ను ఔటైనట్లు ప్రకటించాడు. అయితే, నాన్ స్ట్రేకర్ ఎండ్ లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ వెంటనే జోక్యం చేసుకున్నాడు. డీఆర్ఎస్ (DRS) తీసుకోవాలని రాహుల్‌ను ఒప్పించాడు. దీంతో రాహుల్ అయిష్టంగానే రివ్యూ కోరాడు. రీప్లేలో బాల్ ట్రాకింగ్ పరిశీలించగా.. బంతి లెగ్ స్టంప్ పైనుంచి వెళ్తున్నట్లు తేలడంతో అంపైర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. లైఫ్ దక్కడంతో ఊపిరి పీల్చుకున్న రాహుల్, తనను కాపాడిన పడిక్కల్‌ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ దృశ్యం మ్యాచ్‌లోనే ప్రత్యేక క్షణంగా నిలిచింది. అయితే, ఈ జీవనదానంను రాహుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రివ్యూ తర్వాత కొద్దిసేపు దూకుడుగా ఆడిన రాహుల్ (47 బంతుల్లో 35 పరుగులు) మళ్లీ జయసూర్య బౌలింగ్‌లోనే మిడాఫ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించి మిల్టన్ రత్నాయకేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో

నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. వారి కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 'కరుప్పు' తర్వాత సూర్యకు ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.50 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.7.50 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్లో రూ.2 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.3.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళనాడులో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. అయితే, షోల పరంగా చూస్తే తెలుగులో 1924 షోలు, తమిళంలో 3038 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే విశేష ఆదరణ పొందుతోంది

సూర్య, కార్తి పెద్ద హీరోలని వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని, అదే సమయంలో మాలాంటి నటులను కూడా బతకనివ్వాలని ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో సూర్య (Suriya), కార్తి (Karthi) పెద్ద హీరోలని వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని, అదే సమయంలో మాలాంటి నటులను కూడా బతకనివ్వాలని ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) అన్నారు. వన్ స్టెప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మైదీన్ దర్శకత్వంలో మేఘన ఆర్ నిర్మించిన చిత్రం 'ఆల్పాన్'. ఉత్తర చెన్నై ప్రజల జీవనాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో 'నిరంగల్ మూండ్రు', 'తరుణం' వంటి పలు చిత్రాల్లో నటించిన దుష్యంత్ (Dushyant) హీరోగా, 'బిగ్ బాస్' ఫేం జనని (Janani) హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. జేమ్స్ వసంత్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు ఆర్బీ ఉదయకుమార్, విక్రమన్, ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్, నిర్మాత ధనుంజయన్‌తో సహా చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొని ఆడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, 'కరుప్పు' చిత్రం క్లైమాక్స్‌లో నేను డ్యాన్స్ చేశాను. కానీ, దాన్ని ఎడిటింగ్‌లో తీసేశారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ చేయలేదు. సూర్య, కార్తి పెద్ద నటులు. వారు చల్లగా ఉండాలి. అలాగే, మాలాంటి నటులు కూడా బ్రతకనివ్వాలి' అని కోరారు. చిత్ర దర్శకుడు మైదీన్ మాట్లాడుతూ, 'సినిమా రంగంలో సహాయ దర్శకులకు గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. వారికి అవకాశం వచ్చిన పుడు వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ, ఎంతోమంది ప్రతిభ కలిగిన సహాయ దర్శకులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. పారితోషికం గురించి మాట్లాడకుండా కేవలం స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పనిచేసేందుకు ముందుకు వచ్చిన జయప్రకాష్, సంగీత దర్శకుడు జేమ్స్

సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తొలి వీకెండ్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఆదివారం నాడు నైజాం వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్లలో ప్రేక్షకుల సందడి భారీగా కనిపించింది. ఆదివారం ఒక్క రోజే నైజాం ఏరియాలో ఈ చిత్రం ₹5.2 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో మొదటి మూడు రోజులకు కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు ₹14 కోట్ల మార్కును తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా (Best Performing Area) నిలిచింది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు దక్కే వీలుంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమా విజయానికి మంచి బలాన్ని చేకూర్చింది

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, తొలి వీకెండ్లో బలమైన పట్టు కనబరిచింది. ముఖ్యంగా ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’లో ఈ సినిమా భారీ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదు చేసింది. ఆదివారం ఒక్క రోజే (గడిచిన 24 గంటల్లో) ఏకంగా 3.11 లక్షలకు పైగా (311.33K) టికెట్లు బుక్ అయినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించడంతో ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో మంచి సంఖ్యలో హౌస్‌ఫుల్ షోలు కనిపించాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, తల్లీ కొడుకుల అనుబంధం చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి వీకెండ్లో అత్యుత్తమ వసూళ్లు నమోదు చేయడంతో, ఈ వారం వర్కింగ్ డేస్‌లో కూడా సినిమా నిలకడైన రన్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇదే రోజు విశాల్ నటించిన `మకుటం`(మగుడం) మూవీ కూడా విడుదలైంది. కానీ దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. సూర్య గత చిత్రాల్లోని యాక్షన్, మాస్ అంశాలకు భిన్నంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడేస్తుంది. మమితా బైజు నటన కూడా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీని ఫలితంగా, సినిమా విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు పోటీగా ఆగస్టు 14న విడుదలైన విశాల్ 'మకుటం' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'ఈట్టి', 'ఐంగరన్' చిత్రాల దర్శకుడు రవి అరసు మొదట ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేశారు. కథ, స్క్రీన్‌ప్లే పనుల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నటుడు విశాల్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విడుదలైనప్పటి నుంచి 'మకుటం' సినిమాకు ఎక్కువగా నెగటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నిల్క్ డేటా ప్రకారం, ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఒకవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రోజూ రూ.20 కోట్లకు పైగా వసూలు చేస్తూ రూ.110 కోట్ల

Rishabh Pant Most Test Sixes: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు పోరులో భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పెను సంచలనం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్ బాది దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్ ఆల్‌టైమ్ రికార్డును తిరగరాశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ వీరుల సరసన చేరి యావత్ క్రీడాలోకాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఆకాశమే హద్దుగా.. కల్లిస్ రికార్డ్ బ్రేక్..! టెస్ట్ క్రికెట్ అనగానే సాధారణంగా బ్యాటర్లు అత్యంత ఓపికగా ఆడుతూ పరుగుల కోసం సుదీర్ఘంగా శ్రమిస్తుంటారు. కానీ క్రీజులోకి డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వస్తే ఆ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోవాల్సిందే. ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. గాలే మైదానంలో తన పవర్ హిట్టింగ్ సత్తా ఏంటో మరోసారి క్రీడా ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పాడు. తొలిరోజు భారీ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారినా, రెండో రోజు ఆట మొదలైన వెంటనే పంత్ తన మార్క్ అటాకింగ్ షాట్లతో కదం తొక్కాడు. ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..! శ్రీలంక జట్టులో అత్యంత ప్రమాదకరమైన స్పిన్నర్‌గా పేరున్న ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌ను పంత్ లక్ష్యంగా ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 68వ ఓవర్లో బంతి గమనాన్ని పసిగట్టి వైడ్ లాంగ్ ఆన్ మీదుగా ఒక కళ్లుచెదిరే భారీ సిక్సర్‌ను ఏకంగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ అద్భుతమైన బౌండరీ ద్వారా టెస్టు ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన దిగ్గజ వీరుల జాబితాలో పంత్ సరికొత్త చరిత్ర లిఖించాడు. తన క్రికెట్ కెరీర్లో 98వ టెస్ట్ సిక్సర్‌ను నమోదు చేయడం ద్వారా.. ఏకంగా 97 సిక్సర్లతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్‌ను శాశ్వతంగా

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ హీరోయిన్ సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న విధంగా మారిపోయింది. ఆ హిట్ అవుతోన్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే ది మోస్ట్ లక్కీ ఛార్మ్ గా మారిపోయిందీ క్రేజీ హీరోయిన్. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే డిగ్రీ పూర్తి చేయకుండానే హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టింది. 2017 నుంచే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితమే తెలుగుతెరకు పరిచయమైంది. కేవలం డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోందీ అందాల తార. అలాగే తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన అల్లరితో ఆకట్టుకున్న మమితా బైజు. ప్రేమలు తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ తో రెబెల్ సినిమాలో చేసింది మమితా బైజు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మమితా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్, ధనుష్ తో కలిసి కర అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలన్నీ

Devdutt Padikkal Century: లంకతో గాలేలో తొలి టెస్ట్ ఆడుతోన్న భారత జట్టు బలమైన స్థితిలో నిలిచింది. ఇందుకు ముఖ్య కారణం దేవదత్ పడిక్కల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ఆడడంలో తేలిపోతున్నారనే ముద్ర ఉంది. కానీ, తాజాగా లంక జట్టును ఓ టీమిండియా కుర్రాడు మైదానంలో సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో కదంతొక్కాడు. లంక స్పిన్నర్లను చీల్చిచెండాడుతూ ఏకంగా 167 పరుగులతో భారత క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. స్పిన్ బూచీకి చెక్.. క్రీజులో అడుగుపెట్టగానే బౌండరీ.. గత కొంతకాలంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్నారు. ఈ బలహీనతను పారద్రోలుతూ వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే కళ్లుచెదిరే బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టాడు. ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..! తొలిరోజు ఆట ముగిసే సమయానికి 178 బంతుల్లో 12 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 131 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. లంక స్టార్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకు వచ్చి లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పడిక్కల్ ఆడుతున్న తీరు చూస్తుంటే రెండో రోజు అవలీలగా డబుల్ సెంచరీ సాధించేలా కనిపిస్తున్నాడు. బ్యాక్‌ఫుట్ పవర్‌తో గవాస్కర్ ప్రశంసల వర్షం.. స్లో టర్నింగ్ పిచ్‌లపై స్పిన్‌ను ఎదుర్కోవడానికి పడిక్కల్ ఎంచుకున్న వ్యూహం పట్ల భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అమితంగా ఆకట్టుకున్నాడు. ఫీల్డర్లు దూరంగా ఉన్నప్పుడు ఎంతో సునాయాసంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడని ప్రశంసించాడు. బ్యాక్‌ఫుట్ నుంచి షాట్లు ఆడటమే ఈ కుర్రాడి అసలైన బలమని విశ్లేషించాడు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది ‘కరుప్పు’తో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన తాజాగా ‘ విశ్వనాథ్ అండ్ సన్స్ ’తో మరో బిగ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి ఆట నుంచే యునానిమస్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని సరికొత్త సంచలనాన్ని నమోదు చేసింది.రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అధిగమించింది. మాస్ ఎలిమెంట్స్ లేకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఇంత తక్కువ టైమ్‌లోనే వంద కోట్ల క్లబ్లో చేరడం సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధి మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపింది.* మెగాస్టార్ vs సూపర్ స్టార్... బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రభంజనంక్లీన్ ఎంటర్టైన్మెంట్, హృదయాలను హత్తుకునే బలమైన ఫ్యామిలీ ఎమోషన్ష్తో తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ అంతటా దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంపిణీదారులు అనేక ప్రాంతాల్లో అదనపు స్క్రీన్లను, ప్రత్యేక షోలను కేటాయిస్తున్నారు. ఆదివారం కూడా ఇదే

తమిళ వర్సటైల్ నటుడు సూర్య వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇటీవల ‘వీరభద్రుడు’ (‘కరుప్పు’) చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. కరుప్పు ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ‘సింగమ్ 2’ బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం పట్టడం విశేషం. ‘కరుప్పు’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి అపూర్వ ఆదరణ పొందిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘కరుప్పు’ విజయం అందించిన జోష్‌లోనే తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కుటుంబ కథాంశంతో పాటు సూర్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఇలా కేవలం మూడు నెలల్లోనే రెండు భారీ హిట్లు కొట్టి తన పవర్ ఏంటో మరోసారి నిరూపించారు సూర్య. జస్ట్ రెండు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తుంది. తమిల్ కంటే కూడా తెలుగులో ఈ సినిమా అదరగోతుంది. శనివారం ఫస్ట్ షో, సెకండ్ షోస్ కు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఒకప్పడు వరుస ప్లాప్స్ చూసిన సూర్య ఇప్పుడు జస్ట్ 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసాడు
సౌతిండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ వర్సలైట్ యాక్టర్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. తెలుగులో వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టండన్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదం, సున్నితమైన కుటుంబ భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. చాలాకాలం తర్వాత సూర్య ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ డ్రామాలో కనిపించడం, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడంతో చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.* సంక్రాంతి బ్లాక్‌బస్టర్ లోడింగ్... లీవ్స్, హాలిడేస్ లేకుండా ర్యాంప్ ఆడేస్తున్న అనిల్ రావిపూడిబాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ. 74.47 కోట్ల గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో మొదటి రోజు రూ. 17.74 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు మరింత పుంజుకుని ఏకంగా రూ. 25 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మొత్తంగా ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 43.47 కోట్ల గ్రాస్ (సుమారు రూ. 37.60 కోట్ల నెట్) నమోదు చేసింది. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) రూ. 17 కోట్లు, తమిళనాడులో రూ. 18 కోట్లు, కర్ణాటకలో రూ. 5 కోట్లు, కేరళలో రూ. 3.50 కోట్లు సాధించి సాలిడ్ హోల్డ్ కనబరిచింది.* లక్షలాది మంది ఆకలి తీర్చిన ‘ఎన్టీఆర్ మీల్’ సర్వీస్ బంద్ఓవర్సీస్లో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.'విశ్వనాథ్ & సన్స్' కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 74.47 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు 'సాక్నిల్క్' వెల్లడించింది. విశేషమేమిటంటే.. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం స్వదేశంలోనే కాకుండా, ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అరుదైన మైలురాయిని చేరుకుంది.యూఎస్‌లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా 'విశ్వనాథ్ & సన్స్' సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే 5,05,710 టికెట్లు అమ్ముడవడం సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు ఒక్కరోజులో అమ్ముడవడం అసాధారణ స్పందనగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.ఈ చిత్రంలో సూర్య సరసన మామితా బైజు హీరోయిన్గా నటించగా, సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్

‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: కథానాయకుడు సూర్య తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి

తమిళ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే రెండు భారీ విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, ఆయన తాజా సినిమాలు మంచి ఊరటను ఇస్తున్నాయి. ప్రస్తుతం సూర్య కెరీర్ మళ్లీ ఊపందుకోవడంతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. 2013లో విడుదలైన సింగం 2 తర్వాత సూర్యకు బాక్సాఫీస్ వద్ద కలిసిరాలేదు. వరుస పరాజయాలతో ఆయన కెరీర్ కొంత మందగించింది. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఆయన తన పాత ఫామ్‌ను తిరిగి అందుకున్నారు. ఈ క్రమంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ గణాంకాలను తిరగరాయడం విశేషంగా మారింది. కరుప్పు (వీరభద్రుడు) సినిమాతో సూర్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త మైలురాయిగా నిలిచింది. దీంతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ విజయంతో సూర్య బాక్సాఫీస్ వద్ద తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఇదిలా ఉండగా, ఆయన నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా భారీ విజయం దిశగా సాగుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కావడంతో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కును దాటి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. శనివారం నాటి మొదటి మరియు రెండో షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం సూర్య కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూర్య జోరు చూస్తుంటే, ఆయన స్టార్డమ్ మళ్లీ శిఖరాగ్రానికి చేరుకుందని

కోలీవుడ్ వివాదాస్పద నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య మూవీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరుప్పు చిత్రంలో తాను ఎంతో కష్టపడి డ్యాన్స్ చేశానని తెలిపారు. అయితే ఎలాంటి కారణం చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు యూట్యూబ్‌లో వస్తాయని నిర్మాత చెప్పారని.. కానీ అది కూడా జరగలేదని అన్నారు. సూర్య, కార్తీ పెద్ద స్టార్స్ అని.. వాళ్లు జీవించాలని కోరుకుంటానని అన్నారు. అయితే తమ లాంటి చిన్ననటులను కూడా బతకనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను చాలా ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్నానని తనకు న్యాయం జరగాలని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఆల్ పాస్ మూవీ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పులో తన సన్నివేశాలు తొలగించడంపై మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డ్యాన్స్ సీన్ కోసం తాను ఎంతో శ్రమించానని.. కానీ అది మూవీలో లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. ఆ పాటకు నేను విలన్లతో కలిసి డ్యాన్స్ చేశానని.. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశానని వెల్లడించారు. ఈ సినిమాలో నా నటనను, కష్టాన్ని నా కొడుకులకు స్వయంగా చూపించా.. కానీ ఆ సన్నివేశాన్ని తొలగించారు. మీరు నటించిన సీన్ ఎందుకు తొలగించారని నా బిడ్డలు అడిగినప్పుడు నా చేతుల్లో ఏం లేదని చెప్పాను. కనీసం ఆ సన్నివేశం యూట్యూబ్‌లో కూడా లేకపోవడంతో మరింత బాధేసిందని అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన మూవీ కరుప్పు. ఈ చిత్రాన్ని వీరభద్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బిగ్ బాస్ ఫేమ్ జనని నాయకిగా నటించిన చిత్రం ఆల్ పాస్. నిరంగళ్ మూండ్రు, తరుణం చిత్రాల ఫేమ్

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

`కరుప్పు` విజయంతో మంచి జోరుమీదున్నారు సూర్య. ఆయన ఇప్పుడు `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో నటించారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నాగవంశీ నిర్మించారు. సాయి సౌజన్య మరో నిర్మాత. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, వైవా హర్ష, సునీల్ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి పాజిటివ్ టాక్ వస్తోంది. సూర్య ఖాతాలో మరో హిట్ పడింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్లని మేళవించి రూపొందించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తోంది. అయితే తమిళంతో పోటీగా తెలుగులోనూ ఆదరణ దక్కుతుంది. కలెక్షన్లు కూడా అలానే ఉన్నాయి. తమిళంలో చాలా వరకు నెగటివ్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ఆడియెన్స్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. రెండో రోజుల్లో రూ.74.47కోట్లు వసూలు చేసింది. 43.47కోట్ల ఇండియా గ్రాస్, సాధించగా, రూ.31కోట్లు ఓవర్సీస్లో రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.37.60కోట్ల నెట్ రాబట్టింది. మొదటి రోజు దీనికి ఇండియాలో రూ.17.74కోట్లు రాగా, రెండో రోజు రూ.25కోట్లు రాబట్టడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణలో రూ.17కోట్లు వచ్చాయి. తమిళనాడులో రూ.18కోట్లు వచ్చాయి. కర్నాటకలో ఐదు కోట్లు, కేరళాలో మూడున్నరకోట్లు వచ్చాయి. నార్త్ లో అరవై లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా తెలుగు వారికే ఎక్కువ కనెక్ట్ కావడం విశేషం. `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ సుమారు రూ.130కోట్లతో రూపొందింది. దీనికి థియేట్రికల్‌గా రూ.63కోట్ల బిజినెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.20కోట్లకు సేల్ చేశారు. అంటే ఇక్కడ నలభై కోట్ల గ్రాస్ రావాలి. తమిళనాడులో నలభై కోట్లకు అమ్మారు. అక్కడ రూ.80కోట్ల గ్రాస్ రావాలి. ఓవర్సీస్లో

ఒక సినిమా విజయాన్ని కేవలం మొదటి వారాంతపు వసూళ్లు, అమ్ముడైన టికెట్ల సంఖ్యతోనే అంచనా వేయడం సరికాదని ప్రముఖ నటుడు సూర్య అభిప్రాయపడ్డాడు. తన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన, సినిమా విజయానికి ఉండాల్సిన అసలైన నిర్వచనాన్ని వివరించాడు.ప్రస్తుత కాలంలో సినిమా విజయాన్ని కేవలం అంకెలతోనే కొలుస్తున్నారని, అయితే అది సంపూర్ణమైన కొలమానం కాదని సూర్య పేర్కొన్నాడు. "ఒక సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎంత లోతుగా నిలిచిపోయింది అనేదే ముఖ్యం. సినిమా వీక్షించిన తర్వాత ప్రేక్షకులు పొందే భావోద్వేగాలు, ఆ చిత్రంపై వారు జరిపే చర్చలే అసలైన విజయం" అని అన్నాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా తాలూకు ప్రభావం ప్రేక్షకుడితోనే కొనసాగాలని ఆయన ఆకాంక్షించాడు."ఒక సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత కూడా ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఆ కథకు, చిత్ర బృందం పడిన శ్రమకు దక్కిన నిజమైన గౌరవం అదే" అని సూర్య వివరించాడు.అదే సమయంలో, సినిమా వ్యాపార కోణాన్ని కూడా సూర్య ప్రస్తావించాడు. నిర్మాతలు, పంపిణీదారులు ఆర్థికంగా సురక్షితంగా ఉండాలంటే బాక్సాఫీస్ వసూళ్లు కూడా కీలకమేనని స్పష్టం చేశాడు. ప్రేక్షకుల ఆదరణ, వాణిజ్యపరమైన వసూళ్లు రెండూ సమపాళ్లలో లభించినప్పుడే ఏ సినిమా అయినా సంపూర్ణ విజయాన్ని అందుకున్నట్లు అవుతుందని పేర్కొన్నాడు

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయోత్సవ వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, హీరో సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ.. "కుటుంబ కథా చిత్రాల ప్రాముఖ్యతను ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ మరోసారి నిరూపించింది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్లు రెట్టింపు కావడం సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కథను, పాత్రలను రూపొందించిన దర్శకుడు వెంకీ అట్లూరికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొన్నాడుఅనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "భారతీయ చిత్ర పరిశ్రమలో వయసు తగ్గుతున్నట్లు కనిపించే అరుదైన కథానాయకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు సూర్య, మరొకరు మహేశ్ బాబు. సూర్యతో సినిమా చేయాలని నా భార్య ఎప్పటి నుంచో కోరుతోంది. త్వరలోనే ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను. సూర్య, కార్తీ ఇప్పుడు భాషా, ప్రాంతీయ భేదాలు దాటి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు" అని కొనియాడాడు.ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మామితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక బృందం నుంచి అద్భుతమైన సహకారం లభించిందని, సూర్య తన నటనా ప్రతిభతో సినిమాను మరో
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఫస్ట్ ఈ కథ విన్నప్పటి నుంచే ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి టైంలో కస్టపడి ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని సక్సెస్ ఫుల్ చేసినందుకు టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను. త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా భార్య సూర్యకి పెద్ద ఫ్యాన్. ఆమె సూర్యతో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా తను సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, కలిసి ఫోటో దిగారు. బేసిక్ గా ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య ఒకరు. నాకు తెలిసి ఇండియాలో ఇద్దరు హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకరు సూర్య, ఇంకొకరు మహేష్ బాబు'' అని నవ్వుతూ అన్నారు.''గజినీ'లో సూర్య పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు

భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్ వైరల్ అవుతోంది. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). తాజాగా ఆయన సూర్య (Suriya) హీరోగా నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వెంకీ తనకు చెప్పినప్పటి నుంచి ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంత చక్కగా సినిమా తీసి విజయం సాధించినందుకు చిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సూర్యతో కలిసి కచ్చితంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నానని, ఆయనకు నచ్చే కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. సూర్యతో సినిమా చేయాలని తన భార్య నుంచి ఒక డిమాండ్ ఉందని తెలిపారు. సాధారణంగా సితార బ్యానర్లో జరిగే షూటింగ్‌లకు రాని తన భార్య, సూర్యను కలవడానికి స్వయంగా సెట్‌కి వచ్చి ఫొటో తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరని, ఒకరు సూర్య అయితే మరొకరు మహేష్ బాబు అని కొనియాడారు. ‘గజిని’ చిత్రంలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పాత్ర అని, అలాంటి

ఇండియాలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత సూర్య (Suriya) మాత్రమే! దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పోలిక ఇది. భారతదేశంలోని అందరి హీరోల్లో ఒకే ఒక్క విషయంలో మహేష్ బాబు నంబర్ వన్ అయితే, ఆ తర్వాత స్థానం సూర్యదే అంటున్నారు త్రివిక్రమ్. అయితే అది సినిమాల్లో కాదు, గ్లామర్ విషయంలో. “ఇండియాలో ఏ హీరోకైనా వయసు ముందుకెళ్తుంది. కానీ దేశంలోని హీరోలందర్లో వయసు వెనక్కు వెళ్లే హీరో మహేష్ బాబు. ఆ తర్వాత స్థానం సూర్యదే. వీళ్లిద్దరికే వయసు వెనక్కు వెళ్తుంది. రోజులు గడిచేకొద్దీ వీళ్లు మరింత అందంగా తయారవుతుంటారు.” ఇలా సూర్యను పొగడ్తల్లో ముంచెత్తారు త్రివిక్రమ్. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన త్రివిక్రమ్, తన భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని బయటపెట్టారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కే సినిమాల షూటింగులకు ఆమె సాధారణంగా వెళ్లరంట. కేవలం సూర్య కోసం ఆమె ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా షూటింగ్ వెళ్లి, సూర్యతో ఫొటోదిగి వచ్చారంట. సితార బ్యానర్ కు త్రివిక్రమ్ భార్య సహ-నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టారు త్రివిక్రమ్. గతంలో సూర్యతో సినిమా చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని, ఈసారి కచ్చితంగా సూర్యతో సినిమా చేస్తానని ప్రకటించారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Devdutt Padikkal Century: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. తొలి రోజు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 288/2తో ఆటను ముగించింది. రీఎంట్రీతో పడిక్కల్ అద్భుతంగా ఆడి 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ భారీగా దంచికొట్టినా రిటైర్డ్ ఔటవగా.. కెప్టెన్ శుభమన్ గిల్ తక్కువ స్కోర్ ఔటయి నిరాశపర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రత్యర్థి గడ్డపై ఆడిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. 73 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. వర్షం అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు వర్షం అంతరాయంతో మ్యాచ్‌కు బ్రేక్ ఇచ్చి మళ్లీ కొనసాగించారు. టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తొలి రోజు ఆటను రెండు వికెట్లకు 288 పరుగులతో ముగించింది. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 134 బంతుల్లో అద్భుత సెంచరీతో తన మొదటి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 178 బంతులు ఆడిన దేవదత్ 131 పరుగులు చేయగా.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టాడు. సాయిసుదర్శన్ గాయం కారణంగా లంకతో సిరీస్‌కు పడిక్కల్‌కు జట్టులో స్థానం లభించింది. చాలాకాలం తర్వాత తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్ సద్వినియోగం చేసుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 32 పరుగులు చేయగా.. వాటిలో ఐదు ఫోర్లు ఉన్నాయి. స్టార్

సూర్య(Suriya) హీరోగా వెంకీ అట్లూరి(venky atluri) దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పట్టణ ప్రాంతాలు, మల్టీప్లెక్స్‌లు, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో విశేష స్పందన లభించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్లు తమిళ వెర్షన్ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ సినిమా కలెక్షన్లకు బలమైన ఊతంగా మారినట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన హాలీడే కారణంగా రెండో రోజు మార్నింగ్ నుంచే అనేక ఏరియాల్లో ఆక్యుపెన్సీ పెరిగినట్లు సమాచారం. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కేంద్రాల్లో ఎక్స్ట్రా షోలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విదేశీ మార్కెట్లోనూ తెలుగు వెర్షన్‌కు మంచి ఆదరణ లభిస్తుండగా, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కలగలిపిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సూర్యతో పాటు రాధిక(Radhika), మమిత బైజు(Mamitha Byju) యాక్టింగ్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మాణ విలువలు కూడా సినిమాకు మరింత బలం చేకూర్చాయని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇదే ఊపు కొనసాగితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు
3.5/5తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5 నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, నటీ నటులు : సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫి: నిమిష్ రవి, ఎడిటర్: నవీన్ నూలీ, ప్రొడక్షన్ డిజైన్: బంగ్లాన్, ఆర్ట్స్ డైరెక్టర్స్: శివ కామేశ్, జితూ సెబాస్టియన్, ఫైట్స్: వీ వెంకట్, కొరియోగ్రఫి: విజయ్ బిన్నీ, శేఖర్ మాస్టర్ నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం: వెంకీ అట్లూరి విడుదల తేది : 14.08.2026 నిడివి :2ఘంటల 41నిముషాలు హీరో సూర్య,(Surya) మమితా బైజు (Mamitha Baiju)జంటగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Viswanath & Sons). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా నిన్న (ఆగస్టు 14న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి విశేష స్పందన లబించింది. మరి రివ్యూ ఎలా వుందో చూద్దామా? కథ : సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒలంపిక్‌లో షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్, సంపన్న కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోతాడు. అయితే కుటుంబానికి వారసుడు లేడని తల్లి నిర్మలమ్మ(రాధిక శరత్ కుమార్) పెళ్లి చేసుకోమని బలంవంతం చేస్తూ ఉంటుంది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకొని సరొగసి ద్వారా కొడుకును కంటాడు. కానీ కొడుకు అభయ్‌కి బోన్ మ్యారో రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం కావడంతో సరోగసి తల్లి మ్యాడీ (మమితా

సూర్య హీరోగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న విడుదలైన తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి రైటింగ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, చమత్కారమైన సంభాషణలు మరియు సహజమైన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. వెంకీ అట్లూరి రాసిన స్క్రీన్‌ప్లే మరియు సంభాషణల శైలి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్కును గుర్తు చేస్తోందని సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుల్టే వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఆయనను న్యూ-ఏజ్ త్రివిక్రమ్‌గా అభివర్ణిస్తూ కథనాలు ప్రచురించాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించి 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో భారీ విజయాలు సాధించారు. లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఆయన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో ఒలింపిక్ పిస్టల్ షూటర్‌గా సూర్యను చూపించడంతో పాటు వయసు వ్యత్యాసం ఉన్న ప్రేమ కథను కుటుంబ బంధాలతో చాలా సున్నితంగా తెరకెక్కించారు. ఈ తమిళ-తెలుగు ప్రాజెక్ట్‌లో సూర్య, మమితా బైజుల మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు రాధికా శరత్‌కుమార్ నటన ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. దీంతో ఈ చిత్రంలో వెంకీ అట్లూరి ప్రదర్శించిన రైటింగ్ నైపుణ్యంపై చిత్ర పరిశ్రమలో విస్తృత చర్చ జరుగుతోంది. దర్శకుడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, త్రివిక్రమ్ శైలి నుండి తాను ప్రేరణ పొందినట్లు స్పష్టం చేశారు. ప్రీ-రిలీజ్ వేడుకలో సూర్య సైతం వెంకీ అట్లూరి మేకింగ్‌లో త్రివిక్రమ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ మరియు హ్యూమర్ కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ రకమైన సహజ సిద్ధమైన స్క్రీన్‌ప్లేతో బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి ఓపెనింగ్స్ సాధిస్తోంది. నటుడు కార్తి సైతం వెంకీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath and Sons). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా శుక్రవారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతోంది. మొదటి రోజు నుంచే ప్రేక్షకులలో అదిరిపోయే రెస్పాన్స్ ను సాధించడంతో .. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ కూడా ఈసినిమా సాధించింది. ఇండస్ట్రీ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) అందించిన లెక్కల ప్రకారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఇండియాలో మొదటి రోజు రూ. 17.51 కోట్ల గ్రాస్ కలెక్సన్స్ ను, 15. 15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ దాదాపు రూ. 27.51 కోట్లుగా నమోదు కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 5,034 షోలతో మొదలైన ఈసినిమా.. ఇండియా వ్యాప్తంగా దాదాపు 4,361 షోలలో ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకు తెలుగులో 46 శాతం, తమిళంలో 40 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. మొదటి రోజు వసూళ్లలో తమిళ వెర్షన్ అత్యధిక సహకారాన్ని అందించింది. తమిళంలో 2,679 షోల నుంచి 40 శాతం ఆక్యుపెన్సీతో దాదాపు రూ. 9.15 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది సినిమా. మరోవైపు, తెలుగు వెర్షన్ 1,682 షోల ద్వారా దాదాపు రూ. 6 కోట్ల నెట్ వసూలు చేసింది. విశేషమేమిటంటే, తెలుగు వెర్షన్ తమిళం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని (46 శాతం) నమోదు చేయడం గమనార్హం. తమిళ ప్రేక్షకులకంటే తెలుగువారే ఈసినిమాను ఎక్కువగా ఆధరిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపించారు. కుటుంబంలో తలెత్తిన ఒక సంక్షోభం తర్వాత అతని జీవితం ఎలా మారింది అనేది కథ. సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించగా.. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించే పండగ కావడంతో పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను సంక్రాంతికే తీసుకురావాలని తహతహలాడుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమాలు సైతం ముందే సంక్రాంతి స్లాట్‌పై కర్చీఫ్ వేసేస్తున్నాయి. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి జార్జ్ క్రిష్ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. మరోవైపు రవితేజ – శ్రీవిష్ణు కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించనున్న ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనప్పటికీ సంక్రాంతి రేసులోనే నిలపాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలు కూడా పండగ బరిలో గట్టిగానే పోటీపడుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతోంది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కూడా ఇదే బరిలో ఉంది. దీనికి తోడు కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ పోటీని మరింత హీటెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాతో పాటు, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. మొత్తానికి సినిమా షూటింగ్‌లు పూర్తి కాకుండానే విడుదల తేదీల ప్రకటనలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు అప్పుడే వేడెక్కింది

నటీనటులు : సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, సుధ, రఘుబాబు, నాజర్ తదితరులు. దర్శకత్వం : వెంకీ అట్లూరి సంగీతం : జి. వి. ప్రకాష్ కుమార్ నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి ఎడిటింగ్ : నవీన్ నూలి సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం. సంజయ్ విశ్వనాథ్ (సూర్య) బిజినెస్ మెన్. అండ్ పిస్టల్ షూటర్ కూడా. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. ఐతే, 40 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ సంజయ్ ఒంటరిగానే ఉంటాడు. అతని తల్లి (రాధిక) పెళ్లి చేసుకోమని బలంవంతం చేస్తూ ఉంటుంది. తల్లి కోసం సంజయ్ సరోగసి ద్వారా బాబుకి జన్మని ఇస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన కుమారుడి బాధ్యతలను ఎలా చూసుకున్నాడు. ఈ క్రమంలో కొడుకుకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావడంతో మమితా బైజు సంజయ్ జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది ?, అసలు ఆమె ఎవరు ?, 22 ఏళ్ల మ్యాడీ (మమితా బైజు) – 40 ఏళ్ల సంజయ్ తో ఎలా ప్రేమలో పడింది?, తన ప్రేమను మ్యాడీ సంజయ్‌కు చెప్పిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి?, అసలు సంజయ్, మ్యాడీ ప్రేమను ఒప్పుకున్నాడా? లేదా ? అనేది మిగిలిన కథ. ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో సూర్య చాలా సెటిల్డ్ గా కనిపించాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూర్య మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. సూర్య నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్

సినిమా పేరు & తారాగణం సినిమా పేరు: విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టండన్ తదితరులు దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కథ : సినిమా కథలోకి వెళితే, సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక అత్యంత ధనవంతుడైన ఇండస్ట్రియలిస్ట్. అంతేకాదు, గతంలో ఓ ఒలింపిక్స్ పోటీలో గన్ సరిగ్గా పని చేయక తన కెరీర్ మలుపు తిరిగిన నేపథ్యం ఉన్న మాజీ షార్ప్‌షూటర్. ఇప్పుడు అతను ఒక కార్పొరేట్ ప్రపంచంలో క్రైసిస్ హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. జీవితంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే తన తల్లి కోరిక మేరకు, ఒక బిడ్డకు తండ్రి కావాలని అతను సరోగసి మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రయాణంలో అనుకోకుండా అతని జీవితంలోకి మ్యాడీ (మమిత బైజు) ప్రవేశిస్తుంది. మొదట ఒక సాధారణ పరిచయంగా మొదలైన వీరిద్దరి బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. సంజయ్ తన తల్లి కోరికను ఎలా నెరవేర్చాడు? సరోగసి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? విదేశాల నుంచి వచ్చిన మ్యాడీని సంజయ్ తన జీవిత భాగస్వామిగా అంగీకరించాడా? ఈ ప్రయాణంలో కుటుంబం ఎదుర్కొన్న భావోద్వేగాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథాంశం. విశ్లేషణ: డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎప్పుడూ కూడా కాంటెంపరరీ అర్బన్ ఫ్యామిలీ డ్రామాలను చాలా స్టైలిష్‌గా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారు. ఈ చిత్రంలో కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకుని, ఒక సున్నితమైన పాయింట్‌ను ఎంచుకుని కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభంలోనే సంజయ్ విశ్వనాథ్ పాత్రను పరిచయం చేసే