
Avengers Endgame Encore : మార్వెల్ఫ్యాన్స్కు శుభవార్త.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ – ఎన్కోర్ బుకింగ్స్ ఓపెన్
'అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ మూవీ (Avengers Endgame Encore) సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
© 2026 nimisham.in

'అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ మూవీ (Avengers Endgame Encore) సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని(AP Excise Policy) ఖరారు చేస్తూ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఖైరతాబాద్ మహాగణపతి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Alert) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Chennai Super Kings | షేర్లపై ధోనీకి ఆసక్తి లేదు.. వాటా అంశంపై అతడు మాతో మాట్లాడలె..!

Banking Services: దేశవ్యాప్తంగా నిలిచిన బ్యాంకింగ్ సేవలు.. పెండింగ్‌లో 4 లక్షల కోట్ల విలువైన చెక్కులు

IRCTC Ticket Booking: పండుగ ప్రయాణానికి రెడీ అవుతున్నారా? IRCTCలో టికెట్ బుక్ చేసే ముందు ఇవి గుర్తుంచుకోండి!

ICC T20I Rankings: ఒక్క సెంచరీతో లెక్కలు మార్చేశాడు.. వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!

Instagram 80s Photo Trend : ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s ఏఐ ఫొటో ట్రెండ్ చాట్ జీపీటీతో చాలా ఈజీగా మార్చేయొచ్చు. మీ ఫొటోను రెట్రో బాలీవుడ్, వింటేజ్ ఫ్యామిలీ ఆల్బమ్ లేదా 80s ఫ్యాషన్ లుక్‌లోకి ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం..

ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..

KTR and Harish Rao Arrested : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావులను హకీంపేట వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

KTR Reacts To Tata Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు.

King | షారుఖ్ ఖాన్ ‘కింగ్’లో మరో క్రేజీ కాంబో.. రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ జోడీపై ఆసక్తికర టాక్!

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలు గలగలా పారాయి. పాయకరావుపేట మండలం వద్ద పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆయన గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. అనంతరం కాలువ గట్టుపై సాష్టాంగ నమస్కారం చేసి తన మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. "అదే సంతోషం.. అదే భావోద్వేగం! నిన్న మార్కాపురంలో బిరబిరా కృష్ణమ్మ.. నేడు అనకాపల్లిలో గలగలా గోదారమ్మ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవనదుల పరవళ్లు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి ప్రణమిల్లాను. రాష్ట్రాన్ని చల్లగా చూడమని ప్రార్థించాను. కృష్ణా, గోదావరి సహా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తాను. అందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని గంగమ్మ తల్లిని కోరుకున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. రూ. 4,192 కోట్లతో నిర్మించిన 213 కిలోమీటర్ల ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రలోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో ఈ నీటితో అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపనున్నారు. దీన్ని విస్తరించి ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా నీరు అందించనున్నారు

ICC Ratings: ప్రతి వారం ఐసీసీ విడుదల చేసే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఆటగాళ్ల స్థానాలు తలకిందులవ్వడం చూస్తూనే ఉంటాం. తాజాగా బుమ్రా మూడో స్థానానికి పడిపోగా ఒలీ రాబిన్సన్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. అసలు ఈ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ఎలా లెక్కిస్తుందో, దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతివారం మహిళలు, పురుషుల క్రికెట్ విభాగాల్లో టీమ్‌లతో పాటు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తూనే ఉంటుంది. సాధారణంగా మహిళల ర్యాంకింగ్స్ మంగళవారం, పురుషుల జాబితా బుధవారం విడుదలవుతాయి. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయిస్తారు. జీవితకాల రికార్డుల కంటే కూడా ఆటగాళ్లు ఇటీవల కాలంలో కనబరిచిన ఫామ్‌కే ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు నిర్ణీత సమయంలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలి. టెస్టులకు 12 నుంచి 15 నెలలు, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 9 నుంచి 12 నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ ఆటగాడు గాయం వల్ల లేదా జట్టులో చోటు దక్కక సుదీర్ఘకాలం మ్యాచ్‌లు ఆడకపోతే అతడి పేరును ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. ఉదాహరణకు 2008లో పార్థివ్ పటేల్ జట్టుకు దూరమైనప్పుడు 2009లో అతడి పేరును తొలగించారు. తిరిగి 2016లో పునరాగమనం చేసినప్పుడు పాత రేటింగ్‌తో మళ్లీ జాబితాలోకి చేర్చారు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లను ఆయా ఫార్మాట్ల నుంచి మినహాయిస్తారు. రేటింగ్ పాయింట్లు ఇచ్చే ప్రత్యేక ఆల్గారిథమ్ ర్యాంకింగ్స్ నిర్ణయించడానికి ఐసీసీ ఒక సంక్లిష్టమైన ఆల్గారిథమ్ను ఉపయోగిస్తుంది. 0 నుంచి 1000 పాయింట్ల స్కేలుపై ఆటగాళ్లకు రేటింగ్ ఇస్తారు. ఏ ఆటగాడైనా 900 పాయింట్లు దాటితే దాన్ని అత్యంత అరుదైన ఘనతగా భావిస్తారు. సాధారణంగా 750 పాయింట్లు సాధించిన వారు టాప్-10లో చోటు దక్కించుకుంటారు. 500 పాయింట్లకు పైన ఉంటే మంచి ప్రదర్శనగా

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) తన కుటుంబంతో కలిసి కొన్నాళ్లుగా లండన్‌లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా మ్యాచ్‌లు ఉన్నప్పుడు, ఐపీఎల్ సీజన్ సమయంలో మాత్రమే అతడు భారత్‌కు వస్తున్నాడు. దీంతో కోహ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే, విరాట్ భారత్‌ను వీడి విరాట్ లండన్‌లో నివసించడానికి గల కారణాన్ని బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డా.శ్రీరామ్ నేనే తాజాగా బయటపెట్టారు. లండన్‌కు వెళ్లడానికి ముందు అనుష్క శర్మతో జరిపిన ఆసక్తికర సంభాషణను డా.శ్రీరామ్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తమకున్న స్టార్డమ్ కారణంగా భారత్‌లో కోహ్లీ-అనుష్క సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని, అందుకే లండన్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని తెలిపారు. పబ్లిక్ అటెన్షన్‌కు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోహ్లీ దంపతులు తమ పిల్లలు వామికా, అకాయ్‌లను మీడియా దృష్టికి దూరంగా ఉంచి సాధారణంగా పెంచాలనుకుంటున్నారని తెలిపారు. మరోవైపు, టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ.. వన్డే మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో భారత్‌కు వస్తున్నాడు. ఇక, 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత అనుష్క శర్మ నటనకు దాదాపు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటించారు. ఇందులో అనుష్క మాజీ భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రను పోషించారు. అయితే, ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆమె 2022లో తన నిర్మాణ సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ బాధ్యతల నుంచి వైదొలిగి కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

వేడి నీళ్లు, డిష్ వాష్ సోప్ లిక్విడ్ తో మొండి మరకలను ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం, పాన్ కొద్దిగా చల్లారిన తర్వాత, చెక్క గరిటెతో పైన ఉన్న మాడిన ఆహారాన్ని తీసేయండి. ఆ తర్వాత మాడిన భాగానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ వేసి స్టవ్ మీద 10-15 నిమిషాలు మరిగించండి. వేడి నీరు, సబ్బు కలిసి మాడిన పొరను మెత్తగా చేస్తాయి. స్టవ్ ఆపి చల్లారాక మెత్తటి స్పాంజితో తుడిస్తే మరకలు సులభంగా ఊడిపోతాయి. మొండిగా మారిన నల్లటి పొరను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయం చేస్తుంది. దీని కోసం, మాడిన ప్రాంతంలో బేకింగ్ సోడాను ఎక్కువగా చల్లి, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. దీనిని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా పాత్రకు గీతలు పడకుండానే మాడిన పదార్థాన్ని వదిలిస్తుంది. ఆ తర్వాత నైలాన్ బ్రష్ లేదా స్పాంజితో రుద్దితే సరిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలపై ఉన్న మొండి మాడు మరకలకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాన్ నిండేలా సగం నీరు, సగం వైట్ వెనిగర్ పోసి స్టవ్‌పై మరిగించి దించేయండి. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, పాన్‌లో బేకింగ్ సోడా చల్లండి. వెనిగర్, బేకింగ్ సోడా కలిస్తే నురుగు వస్తుంది. దీంతో.. తర్వాత ఈజీగా ఆ మొండి మరకలు వదులుతాయి. గిన్నె మాడిన వెంటనే శుభ్రం చేయడానికి సమయం లేకపోతే. మీరు రాత్రంతా నానపెట్టి.. మరుసటి రోజు శుభ్రం చేయచ్చు.. దీనికోసం, మాడిన పాత్రలో వేడి నీళ్లు, కొద్దగా డిష్ సోప్ వేసి.. రాత్రంతా నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే శుభ్రం చేస్తే.. సులభంగా మాడు పోతుంది. మీ పాత్రలు మళ్లీ కొత్త వాటిలా కనిపిస్తాయి. నాన్-స్టిక్ లేదా కోటింగ్ ఉన్న పాత్రలు మాడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని శుభ్రం చేయడానికి స్టీల్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్‌మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాలు దిగజారడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అనూహ్యంగా టాప్-5లోకి దూసుకొచ్చాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో వారం కూడా ఒక స్థానాన్ని కోల్పోయాడు. గత మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ.. బుమ్రాను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. మైదానంలోకి దిగకపోవడం వల్ల పాయింట్లు కోల్పోయి బుమ్రా ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 74 పరుగులు మాత్రమే సాధించడంతో గిల్ రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ప్రస్తుతం టెస్టు బ్యాటింగ్ విభాగంలో ఏడో స్థానంలో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రమే భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ ఆలీ రాబిన్సన్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సుదీర్ఘ దూకుడు ప్రదర్శిస్తూ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నేరుగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌పై టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక ఆటగాడు సోనాల్ దినుషా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. భారత్‌పై 140 సగటుతో 420 పరుగులు చేసి అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున

భారతీయులు రెగ్యులర్ గా ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో దోశ ఒకటి. దోశలు ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సులువు. కానీ, హోటల్ లో తిన్న ఫీలింగ్ ఇంట్లో తింటే రాదు. హోటల్ మాదిరిగా మంచి షేప్, రంగు, రుచి ఇంట్లో చేసినప్పుడు రావు. అంతేకాదు, ఎప్పుడు దోశ వేద్దామని చూసినా.. పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే.. పెనానికి అతుక్కోకుండా.. దోశ హోటల్ స్టైల్ లో మంచిగా రావాలి అంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. దోశ పెనానికి అతుక్కోకుండా మంచిగా రావాలంటే.. పిండిలో స్పెషల్ గా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. చిన్న ఉల్లిపాయతో మీరు మ్యాజిక్ చేసేయచ్చు. మీ ఇంట్లో ఉన్న ఐరన్ పెనాన్ని.. ఈ ఉల్లిపాయతో నాన్ స్టిక్ పెన్ లా మార్చేయచ్చు. అసలు దోశలు వేయడం రానివారు కూడా చాలా ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. అయితే, అలా ఉల్లిపాయను ఎలా వాడాలో చూద్దాం... ఉల్లిపాయను ముందుగా సగానికి కోయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయకు ఫోర్క్ గుచ్చి, దానికి 2 నుంచి 3 చుక్కల నూనె రాయాలి. తర్వాత.. ఐరన్ పెనాన్ని వేడి చేయాలి. పెనం బాగా వేడిగా మారిన తర్వాత నూనె రాసిన ఉల్లిపాయను పెనం మొత్తం సర్కిల్ షేప్ లో రుద్దాలి. ఉల్లిపాయలోని సహజ రసాలు, నూనె కలిసి ఇనుప నేలపై ఒక కోటింగ్ లా ఏర్పడతాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రమైన గుడ్డతో తుడిచి పిండి వేయండి. దోశ రవ్వల్లా పరుచుకుని, అస్సలు అంటుకోకుండా లేచి వస్తుంది. ఒకవేళ ఉల్లిపాయ అందుబాటులో లేకపోతే, గ్లాసు నీళ్లలో అరస్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని పెనంపై చల్లి తుడిచినా దోశలు అంటుకోవు. పిండి పెనంపై రుద్దేటప్పుడు మంట ఎప్పుడూ సిమ్‌లో ఉండాలి. రుద్దడం పూర్తయ్యాక మంటను మీడియం-హైకి పెంచితేనే దోశ కరకరలాడుతుంది. ఐరన్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల పరిమితిని తగ్గించింది. ఇదే కాకుండా సేవింగ్స్ అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ లేకుండా విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఈ కొత్త ఛార్జీలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. ఖాతాదారులు దీనిని గమనించాలని, ఇందుకనుగుణంగా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో కెనరా బ్యాంక్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెనరా బ్యాంక్ ఏటీఎంలో ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి ఆరుగా ఉండేది. ఇప్పుడు దానిని 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు కేవలం ఐదు లావాదేవీలు మాత్రం ఏటీఎంలలో ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైబడి చేస్తే ఛార్జీలు కట్ అవుతాయి. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటిని కూడా ఉచిత పరిమితిలో చేర్చారు. ఉచిత లావాదేవీల తర్వాత అకౌంట్లో డబ్బులు లేకపోయినా విత్ డ్రాకు ప్రయత్నిస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది ఏటీఎంలో ఉచిత లావాదేవీల తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఇప్పటివరకు ఇది రూ.20గా ఉండగా.. ఇప్పుడు మరో రూ.3 పెంచారు. అయితే సీనియర్ సిటిజన్లు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటాక వారికి ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది. సీనియర్ సిటిజన్ల లావాదేవీల పరిమితి ఎప్పటిలాగే ఉంచింది. ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్

ICC Rankings 2026: ప్రపంచ క్రికెట్లో భారత జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, మరో విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ జట్టు విషయానికొస్తే వన్డేల్లో మాత్రమే ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో చోటు దక్కించుకుంది. టెస్టుల్లో ఎనిమిదో స్థానానికి పడిపోగా, టీ20ల్లో ఆరో స్థానానికి పరిమితమైంది. వ్యక్తిగత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వన్డేల్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మొదటి స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యువ కిరటం ఇషాన్ కిషన్ అగ్రపీఠాన్ని కైవసం చేసుకోగా, అభిషేక్ శర్మ మూడో స్థానంలో, తిలక్ వర్మ ఆరో స్థానంలో నిలిచారు. టెస్టుల్లో రిషభ్ పంత్ ఏడో స్థానంలో, శుభ్ మన్ గిల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ నుంచి కేవలం బాబర్ ఆజమ్ మాత్రమే టెస్టుల్లో 10వ ర్యాంక్, వన్డేల్లో 6వ ర్యాంక్‌లో స్థానం సంపాదించుకున్నాడు. బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మనోళ్ల హవా బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లోనూ భారత్ అత్యంత బలంగా కనిపిస్తోంది. టెస్టు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతుండగా, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో, వాషింగ్టన్ సుందర్ ఆరో స్థానంలో నిలిచి సత్తా చాటారు. టీ20 ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో నోమాన్ అలీ టెస్టుల్లో 8వ ర్యాంక్, అబ్రార్ అహ్మద్ వన్డే, టీ20ల్లో రెండో స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. జట్టు

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన

లగ్జరీ ఎస్యూవీ విభాగంలో సంచలనం సృష్టించేలా ల్యాండ్ రోవర్ కంపెనీ రేంజ్ రోవర్ సిరీస్ లో తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. భారత్‌లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ధరను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. స్టాండర్డ్ వీల్‌బేస్‌లో ఆటోబయోగ్రఫీ, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లతో పాటు లాంగ్ వీల్‌బేస్‌లో ఎస్వీ, ఎస్వీ అల్ట్రా, ఎస్వీ బ్లాక్ వేరియంట్లను భారత్‌లో అందించనున్నారు.బ్యాటరీ, పవర్..రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్‌లో 118.5 kWh ఉపయోగించగల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులో 344 ప్రిస్మాటిక్ సెల్స్ ఉన్నాయి. 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. రెండు పర్మనెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి 542 hp పవర్, 850 Nm టార్క్ ఇస్తాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్టీపీ లెక్కల ప్రకారం 600 కి.మీ వరకు ప్రయాణించవచ్చని ల్యాండ్ రోవర్ చెబుతోంది.22 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 350kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అనుకూలమైన ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి సుమారు 22 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. గరిష్ఠ ఛార్జింగ్ రేట్‌తో కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 125 మైళ్ల వరకు డ్రైవింగ్ రేంజ్ లభిస్తుందని పేర్కొంది.ఆఫ్రోడింగ్లోనూ తగ్గేదేలేఎలక్ట్రిక్ మోడల్లో కొత్త ట్రాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది కేవలం 50 మిల్లీసెకన్లలో స్పందించగలదని కంపెనీ చెబుతోంది. వివిధ రకాల రోడ్లపై గ్రిప్‌ను మెరుగుపరచడంతో పాటు ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని కొనసాగించేలా దీన్ని

సంగీత దర్శకుడిగా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం ఇమ్మోర్టల్. కయాడు లోహర్ కథానాయికగా నటించిన ఈ వ్యాంపైర్ ఫాంటసీ హారర్ రొమాన్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. పక్కింటి అమ్మాయితో సాధారణంగా మొదలైన ఒక ప్రేమకథ చివరకు ఎలా మారింది అనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాత్రిపూట గది తాళం రంధ్రం నుంచి ఒక భయంకరమైన బ్యాట్ ముఖం ఉన్న జంతువు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ కథ ఒక తీవ్రమైన సర్వైవల్ నైట్‌మేర్‌గా మారుతుంది. ఈ సినిమాకు మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ప్రతిష్టాత్మకంగా సంగీతాన్ని అందించారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అలాగే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికేట్‌ను విజయవంతంగా పొందింది. ఈ హారర్ రొమాన్స్ డ్రామాను కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ఫలితంగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. సినిమా థ్రిల్లింగ్ అంశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్నమైన వ్యాంపైర్ ఫాంటసీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాల్సి ఉంది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు టికెట్లు అందుబాటులోకి వచ్చినందున బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఈ విభిన్నమైన హారర్ థ్రిల్లర్

Panja Re Release: కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, కాలం గడిచేకొద్దీ వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో ‘పంజా’ కూడా ఒకటి. 2011లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత అదే సినిమా మరోసారి థియేటర్లలోకి రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పంజా’ మూవీని 4Kలో రీమాస్టర్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ మంగళవారం రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు నిర్వహించడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్‌ను జై పాత్రలో మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే ‘పంజా’ రీ రిలీజ్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని ప్రాంతాలను కలిపి రూ.3 కోట్లకు పైగా ప్రీ సేల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ సినిమాలకు ఈ రెస్పాన్స్ రావడం అరుదుని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించే సినిమాగా ‘పంజా’ నిలిచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేకత పవన్ కళ్యాణ్ అభిమానుల సెలబ్రేషన్స్. ఆయన బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఆదోని నేరవార్తలు: ఆస్పరి మండలంలో బుధవారం ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. మండల పరిధిలోని ఆస్పరి చిరుమాందొడ్డి హాలిగేరా శంకరబండ గ్రామాల్లో వీరంగం సృష్టించి గ్రామస్థులపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో దాదాపు 20 మందికి పైగా గ్రామస్థులకు గాయాలయ్యాయి. వారంతా చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కాగా ఆ పిచ్చికుక్కను గ్రామస్థులు చంపినట్లు తెలుస్తోంది. ఆదోని నేరవార్తలు: ఆదోని మండలం బల్లెకల్ గ్రామానికి చెందిన కోసిగి నరసింహులు (66) అనే వృద్ధుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన నర్సింహలుకు భార్య బసమ్మ, ఒక కుమార్తె సంతానం. పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా నరసింహులు భార్య బసమ్మ భర్తతో గొడవపడి బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంటికి రమ్మన్నా భార్య రాకపోవడంతో మనస్థాపానికి గురైన నరసింహులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద తుంబలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్ 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు. ‘సీఎస్కే జట్టుకు హెడ్ కోచ్ ఉంటాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి హెడ్ కోచ్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తొందరేం లేదు’ అని రుతురాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 2008లో సీఎస్కే ప్లేయర్‌గా జట్టులో చేరాడు. ఆ తర్వాతి ఏడాదే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్‌లో జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. ధోని నుంచి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రుతురాజ్.. గతేడాది తన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ‘ఎంఎస్ ధోని నుంచి కెప్టెన్సీ తీసుకోవడం చాలా పెద్ద బాధ్యత. అతడు సాధించిన విజయాలు ఎంతో గొప్పవి. సహజంగానే అభిమానులు మరిన్ని విజయాలు, టైటిళ్లను ఆశిస్తారు. అయితే ఈ అదనపు బాధ్యతను నేను ఆస్వాదిస్తున్నా. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం కెప్టెన్‌గా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నా. 2008 నుంచి సీఎస్కే అద్భుతమైన ప్రయాణం సాగించింది. దాదాపు ప్రతి సైకిల్లోనూ ఐపీఎల్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. AP Rural Drinking Water Citizen Charter 2026:గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాగునీటి సరఫరాలో సమస్యలు, పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ల రిపేర్లు వంటి సమస్యలకు ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు “రూరల్ డ్రింకింగ్ వాటర్ సిటిజన్ ఛార్టర్ 2026 (G.O. 829)”ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రజలు తమ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే దానికి కంప్యూటర్ రసీదు లేదా కంప్లైంట్ నంబర్ ఇవ్వాలి. దీంతో తమ ఫిర్యాదు నమోదు అయిందా లేదా అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉంటుంది. అలాగే సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిన్నపాటి నీటి సరఫరా సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించాలి. గ్రామాల్లో నీటి సరఫరాకు ఉపయోగించే మోటార్లలో సమస్య వస్తే దాన్ని 48 గంటల్లోపు రిపేర్ చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో మోటార్ సమస్యల కారణంగా ఎక్కువ రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. పైప్‌లైన్ లీకేజీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించింది. చిన్న లీకేజీలను 24 గంటల్లో, పెద్ద లీకేజీలను 72 గంటల్లోపు సరిచేయాలి. దీనివల్ల నీటి వృథాను తగ్గించడంతో పాటు ప్రజలకు నీటి సరఫరా త్వరగా పునరుద్ధరించే అవకాశం
Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్‌లను పూర్తిగా నిషేధించారు. విండ్‌షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు
పడుకునే ముందే తర్వాతి రోజు కోసం ప్లాన్ రెడీ చేసుకోండి. ఉదయాన్నే ఏ టిఫిన్ వండాలి, ఏ పని చేయాలో నిర్ణయించుకోండి. దీంతో సమయం ఆదా అవుతుంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇంటి పనులు, ఆఫీస్ పనులను ముందుగానే విభజించుకోండి. ప్రతి పనికి ఒక నిర్ధిష్ట సమయం కేటాయించుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం పని చేయండి. మీరు చేయలేని పనులను మీకు అప్పగిస్తే నో చెప్పండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేయాల్సిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇంటి పనుల చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి. అన్ని పనులు నేనే చేయాలని అనుకోవద్దు. ఇతరుల సాయం తీసుకుంటే సమయం కలిసి వస్తుంది. ఆఫీస్‌లో లేదా ఇంట్లో చేయాల్సిన పనుల్లో ఒకే రకంగా ఉన్న పనులను ఒక సమూహంగా మార్చండి. వాటిని ఒకసారి పూర్తి చేయండి. దీంతో టైం కలిసి వస్తుంది. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమయం వృథా అవుతుంది. పనులు చేసేటప్పుడు ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పడితే ఆ పనిని వెంటనే పూర్తి చేయండి. ఆ పనిని వాయిదా వేయవద్దు. ఆఫీస్ పని, ఇంటి పని కోసం మాత్రమే కాకుండా మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. దీని వల్ల మీలో ఒత్తిడి తగ్గుతుంది. అన్ని పనులు పర్ఫెక్ట్గా పూర్తి కావాలని అనుకోవద్దు. ఇలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తే సమయానికి పనులు పూర్తి కావు. పర్ఫెక్షన్కు బదులుగా పురోగతిపై దృష్టి పెట్టండి

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లకు స్పష్టం చేసింది. ఇవి అన్ని వేళల పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సు కిటికీ అద్దాలకు కర్టెన్స్ వేయవద్దని పేర్కొంది. అనధికారికంగా కిటికీ అద్దాలకు ఫిల్మ్ అతికించవద్దని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని బస్సు ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి చేరుకునే వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. మహిళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ తదితర సిబ్బందిని నియమించే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించింది. అలాగే బస్సుల్లో పానిక్ బటన్లు, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా పని చేస్తూ ఉండాలంది. ఇవి అన్ని వేళలా పని చేస్తుండాలని తెలిపింది. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా ప్రతి బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వినియోగించే పరికరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలంది. అదే విధంగా రాత్రి లేదా రద్దీ లేని సమయాల్లో బస్సులను సురక్షితమైన, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిలిపి ఉంచేలా చూడాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. బస్సులో సిబ్బంది ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సీపీఆర్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులను కోరింది. ఈ నిబంధనలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని బస్సు

తిరుమల: ఇస్రో(ISRO) చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లిన నారాయణన్.. జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్- 05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇస్రో చేపడుతున్న జీఎస్ఎల్వీ-ఎఫ్17 సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వెళ్లనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్‌పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీఇరాన్లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్క్యూ-4

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెందిన కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు

కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాగ్ మరోసారి ఒక స్పెషల్ రోల్ లో మెరవనున్నాడానే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలకు నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. కానీ, నాగ్ కి మాత్రం ఈ సినిమాలు కలిసి రాలేదు. ముఖ్యంగా కూలీలో విలన్ గా ఆయన నటన బాగున్నా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో నాగ్.. స్పెషల్ రోల్స్ కి దూరంగా ఉండడమే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్పెషల్ రోల్ చేసి దెబ్బ తిన్నా కూడా నాగ్.. మరోసారి అదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆ పాత్రకు నాగ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి వినోత్.. కథ కూడా చెప్పాడట. తన పాత్రలోని ప్రాధాన్యత నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక నాగార్జున ఎంట్రీతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగార్జున, ఇప్పుడు సూర్య నటించబోయే రాబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సూర్య, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, మాస్

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు సమర్పకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన సమర్పిస్తున్న తాజా చిత్రం 'రోమాంచకం'. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ సినీ ప్రియుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు.సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని పలు ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఈ స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్, ఆర్ట్ సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్, పీవీఆర్ ఐనాక్స్ (ఫోరమ్, ఇనార్బిట్ మాల్స్), బ్రహ్మరాంబ, అల్లు సినిమాస్ వంటి థియేటర్లలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రలలో నటించారు. 'కమ్ ఇన్ యాజ్ ఏ గ్యాంగ్.. ఎగ్జిట్ విత్ ఏ బ్యాంగ్' అంటూ ప్రచార చిత్రాలలో ఇచ్చిన నినాదం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సందీప్ వంగా లాంటి స్టార్ డైరెక్టర్ ఒక చిత్రాన్ని సమర్పిస్తుండటంతో 'రోమాంచకం' కంటెంట్ ఎలా ఉండబోతోందనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది

సమ్మెకు యూనియన్ల పిలుపు.. కీలక తేదీలు ఇవే సెప్టెంబర్‌లో వరుసగా 5 రోజులు సేవలకు బ్రేక్ 5 రోజుల బ్యాంకింగ్ కోసం ఉద్యోగుల సమ్మెబాట Bank Unions Strike : సెప్టెంబర్‌లో బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్‌లో రెండు విడతల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాల నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. మొదటి విడతగా సెప్టెంబర్ 11, 2026న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల సమ్మె కొనసాగనుంది. అప్పటికీ డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టే అవకాశం ఉందని యూఎఫ్‌బీయూ తెలిపింది. Read Also : Xiaomi 17 Ultra Price : వారెవ్వా.. అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ షావోమీ అల్ట్రా ఫోన్‌పై రూ. 10వేలు డిస్కౌంట్..! 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్ : బ్యాంకు ఉద్యోగులు 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థ అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మార్చి 8, 2024న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్ నోట్లో దీనికి అంగీకారం జరిగినప్పటికీ, రెండేళ్లకు పైగా నిర్ణయం పెండింగ్‌లో ఉందని యూనియన్లు చెబుతున్నాయి. శనివారం సెలవుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పని సమయాన్ని సుమారు 40 నిమిషాలు పెంచే ప్రతిపాదన ఉంది. పీఎల్ఐపై అభ్యంతరం : ప్రభుత్వం సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) విధానాన్ని ఉపసంహరించాలని కూడా యూనియన్ డిమాండ్ చేస్తోంది. సీనియర్ అధికారులకు, ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహకాలలో వ్యత్యాసం ఉందని, తగినంత సంప్రదింపులు లేకుండానే విధానాన్ని

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man dangerous stunts with venomous snakes video: పాములను చూసి ప్రాణాల మీద తీపి ఉన్న వారు భయంతో పారిపోతారు. కానీ మరికొంత మంది మాత్రం వాటితో స్టంట్ లు చేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో పాముల వీడియోలు కుప్పలుతెప్పలుగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. కోబ్రాలు కాటు వేస్తే కొంత మంది సైకొలుగా ప్రవర్తిస్తున్నారు. వాటిని పట్టుకుని కొరకడం లేదా దాడి చేయడం చేస్తున్నారు. అంతే కాకుండా వాటిని మెడలో వేసుకొవడం, డబ్బాలో పట్టుకుని నేరుగా డాక్టర్ల వద్దకు తీసుకొనివెళ్లడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం మనం వార్తలలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాము వీడియో నెట్టింట బాగా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో మూడు పాములు ఉన్నాయి. వాటిని ఒక స్నేక్ క్యాచర్ చేతికి గ్లౌజ్ లు వేసుకుని మరీ పదేపదే వాటితో రీల్ లు చేస్తున్నాడు. అవి కోపంతో అతనిపైకి దాడి చేస్తున్నాయి. అతను మాత్రం భయపడకుండావాటిని భయపెట్టడం చేస్తున్నాడు. పాములు కోపంతో బుసలు కొడుతూ తమనే తాకుతావా..అంటూ ఫైర్ అవుతున్నాయి. చేతికి వేసుకున్న గ్లౌజ్ ల మీద కాటు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ అతను చాకచక్యంగా పాముల కాటునుంచి బైటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. Read more: Snakes mating Video: చీర మీద ఒకదానితో మరోకటి జతకడుతున్న రెండు పాములు.. అరుదైన వీడియో.. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నారు

ఇంటర్నెట్ డెస్క్: గాల్లో ఉన్న సమయంలో ఇండిగో విమానం (IndiGo) ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 220 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 9:16 గంటలకు ఇండిగో విమానం గోవా నుంచి దిల్లీ (Goa-Delhi) బయల్దేరింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ఇంజిన్‌లో సమస్య (Engine Failure) తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం ఇచ్చారు. దీంతో గోవా ఎయిర్‌పోర్టులో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్లు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) ఓ రైతు ఇంటికి వెళ్లి సందడి చేశారు. తమిళనాడులోని కొడైకెనాల్లో సోమవారం రాత్రి ‘గోల్డెన్ మూన్’ (Golden Moon) దర్శనమిచ్చాడు

‘ఇరుముడి’ సినిమా సంచలనాలకు మాటలు సరిపోవడం లేదు. బాక్సాఫీస్ దగ్గర కనివినీ ఎరుగని రికార్డులకు ఈ చిత్రం తెరతీస్తుంది. ముఖ్యంగా రెండో ఆదివారం కూడా ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు. నాన్ ‘ట్రిపుల్ ఆర్’ రికార్డును ఈ చిత్రం సాధించింది. ఫుల్ రన్లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం పక్కా అని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. మహేష్ సన్ గౌతమ్ ఘట్టమనేని బర్త్ డే నేడు. దీంతో మహేష్ తన కొడుకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. తన కొడుకు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తనతో దిగిన ఓ క్యూట్ ఫోటోను కూడా షేర్ చేశారు మహేష్. హ్యాపీ 20 గౌతమ్.. నీ జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నీ కలలను ఎప్పుడూ ధైర్యంగా సాకారం చేసుకోవాలి. నేను ప్రతిరోజూ నిన్ను చూసి గర్వపడుతున్నా’’ అంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్ లోను ఉంటే ఎవరు కట్టాలి? H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్…ఫ్లూ వ్యాక్సిన్‌కు భారీగా పెరిగిన డిమాండ్ Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!

ప్రతీఒక్కరూ బ్యాంక్‌కు ఒక్కసారి అయినా వెళ్లి ఉంటారు. బ్యాంకులో డిపాజిట్ లేదా విత్ డ్రా ఫామ్ నింపి లావాదేవీలు నిర్వహించి ఉంటారు. ఈ ఫామ్స్ నింపేటప్పుడు అమౌంట్‌ను సంఖ్య రూపంలో రాయడమే కాకుండా పదాల రూపంలో కూడా వివరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.10 వేలు డిపాజిట్ చేస్తున్నా లేదా విత్ డ్రా చేస్తుంటే.. టెన్ తౌజెండ్ రూపీస్ ఓన్లీ అని రాస్తూ ఉంటాం. చివరిలో ఓన్లీ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి కానీ చివరిలో 'Only' అనేది రాయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.“Ten Thousand” అని రాసిన తర్వాత ఖాళీగా వదిలేస్తే వేరే పదాలు రాయడానికి అవకాశం ఉంటుంది. అదే చివరిలో ఓన్లీ అనేది రాయడం వల్ల అక్కడితో వాక్యం పూర్తయిందని ఎవరికైనా అర్థమవుతుంది. దీని వల్ల వేరే పదం చేర్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు. దీని వల్ల ఎలాంటి మోసాలు జరగవు. అయితే ఓన్లీ అనేది చివరిలో రాయకపోతే మీ చెక్కు లేదా డిపాజిట్, విత్ డ్రా ఫామ్ చెల్లదని కాదు. మీరు రాయకపోయినా అది చెల్లుతుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రత్యేక నిబంధన విధించలేదు. కేవలం భద్రతాపరమైన కారణాల వల్ల చివరిలో ఓన్లీ అనేది రాయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఖాళీ స్థలం వదలకపోవడం అనేది భద్రత కోసమేనని చెప్పవచ్చు. బ్యాంక్ సిబ్బంది కూడా చివరిలో ఓన్లీ అనేది చేర్చాలని సూచిస్తూ ఉంటారు. కేవలం సాధారణంగానే దీనిని సూచిస్తూ ఉంటారు. ఇక బ్యాంక్ సిబ్బంది స్వీకరించిన తర్వాత అమౌంట్, పదాల్లో ఒకేలా ఉందా.. లేదా అనేది పరిశీలిస్తారు. అంకెల్లో అమౌంట్ ఒకలా.. పదాల్లో ఒకలా ఉంటే సులువుగా గుర్తు పడతారు. చెక్ ప్రాసెసింగ్ సమయంలో దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చెక్కు జమ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు దీనిని పరిశీలించుకోవాలి. రెండు చోట్ల ఒకేలా ఉందా..లేదా అనేది చూసుకోవాలి. రెండు చోట్ల

టీమిండియాలోకి తిరిగి రావడంపై భారత బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు సాధిస్తూ తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపాడు.టీమిండియాలోకి పునరాగమనంపై మంగళవారం కోయంబత్తూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రుతురాజ్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ.. ‘‘చాలా నమ్మకంగా ఉన్నా. మళ్లీ వెళ్లి పరుగులు చేయడంపైనే దృష్టి. ఇన్నాళ్లూ పరుగులు సాధిస్తూనే ఉన్నా. ఇక నిలకడగా రాణిస్తూ అవకాశం కోసం ఎదురుచూడాలి’’ అని చెప్పాడు.ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోసం దేశవాళీ క్రికెట్లో రుతురాజ్ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన బ్యాటింగ్‌పై నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. దేశవాళీ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో రాబోయే టోర్నీలపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు.ఇదిలా ఉంటే.. ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనున్న నేపథ్యంలో రషీద్ ఖాన్, యువ భారత బ్యాటర్ సూర్యవంశీ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందా? అని రుతురాజ్‌ను అడిగారు. అయితే ఈ పోరుపై తాను పెద్దగా ఆలోచించలేదని చెప్పాడు. ‘‘మీరు మీ దేశానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు.. నేనూ అంతే, నా దేశానికి మద్దతివ్వాలని కోరుకుంటాను" అని అన్నాడు.జట్టులో లేనప్పుడు తాను మ్యాచ్‌లను ఎక్కువగా చూడనని తెలిపాడు. ప్రస్తుతం తన సాధనపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు రుతురాజ్ తెలిపాడు. ప్రాక్టీస్‌తో పాటు దేశవాళీ టోర్నీలు కూడా ఉండటంతో టీమిండియా మ్యాచ్‌లను రోజూ చూడటం సాధ్యం కావడం లేదన్నాడు.దులీప్ ట్రోఫీ తర్వాత ఇరానీ

MS Dhoni: ఐపీఎల్ 2027 సీజన్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ సీజన్లో ధోనీ ఆటగాడిగా మైదానంలోకి అడుగుపెడతాడా అనేది అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ భవిష్యత్తుపై తలుపులు తెరిచే ఉంచినప్పటికీ ఆయన ప్లేయర్‌గా కనిపించడం కష్టమేనని సమాచారం. పెరుగుతున్న వయసుతో పాటు మోకాలి సమస్యలు ధోనీ ఫిట్‌నెస్‌కు పెద్ద సవాలుగా మారాయి. గడిచిన 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా, డగౌట్ నుంచి తన జట్టు ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు. రోజూవారీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా ఒక కారణం. ఈ క్రమంలో సీఎస్కే ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి మెంటార్ హోదా ఇచ్చే ఆలోచనలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జూలై 2026లోనే జట్టు నుంచి తప్పుకున్నారు. 2009 నుంచి సుదీర్ఘకాలం పనిచేసిన ఫ్లెమింగ్ ఇప్పుడు ఇంగ్లండ్ రెడ్ బాల్ టీమ్ కోచ్‌గా వెళ్లిపోవడంతో సీఎస్కే కొత్త హెడ్ కోచ్ కోసం వెతుకుతోంది. భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. స్థానిక తమిళనాడు క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కోచింగ్ అనుభవం ఉండటంతో ఆయన వైపు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ధోనీ మెంటార్‌గా మారినా కొత్త హెడ్ కోచ్ నియామకం తప్పనిసరి కానుంది. గత కొన్ని రోజులుగా ధోనీ సీఎస్కే ఫ్రాంచైజీలో వాటా కోరారంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మొదట 25 శాతం, ఆపై 18 శాతానికి అంగీకరించారని వార్తలు హల్చల్ చేశాయి. ఈ పుకార్లపై సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించారు. ధోనీ వాటా కోరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అధార రహితమైనవని స్పష్టం చేశారు. ధోనీ నిర్ణయానికే సీఎస్కే యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు

పత్తికొండ గ్రామీణం: ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ-ఆదోని మార్గంలోని అటికల గుండు సమీపంలో చోటుచేసుకుంది. మంగళవారం ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అటికల గుండు సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా టైర్ పేలడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించారు. పెద్ద శబ్దంతో టైరు పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులు బస్సు దిగి ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

జీవీ ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. తాజాగా డిఎన్‌సి థియేటర్స్ సర్క్యూట్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక బుకింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన సినీ ప్రియులు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో జీవీ ప్రకాష్, కయాదు లోహర్‌ల వర్షంలో సాగే రొమాంటిక్ దృశ్యాన్ని పోస్టర్ ద్వారా ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రకటించిన ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని ప్రముఖ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని థియేటర్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కథలో కథానాయకుడు తానుష్టపడిన యువతి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందో చూపిస్తారు. దీంతో సాధారణంగా ప్రారంభమయ్యే రొమాంటిక్ ప్రయాణం ఒక రాత్రిలోనే భయానక భ్రమగా మారుతుంది. ఇదిలా ఉండగా 4,000 సంవత్సరాల పూర్వంనాటి వింత కథతో పాటు గబ్బిలం రూపంలో ఉండే భయానక జీవి ఈ కథలో కీలకంగా మారనుంది. ఇటీవలే ధనుష్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫలితంగా సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాషలో విడుదలైన టీజర్ కూడా విశేషమైన స్పందనను దక్కించుకుంది. ఈ చిత్రానికి మరియప్పన్ చిన్న దర్శకత్వం వహించగా, సామ్ సిఎస్ సంగీతం అందించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషలలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ప్రస్తుతం ప్రేక్షకులు సెప్టెంబర్ 4వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఏ విధమైన ఘనవిజయాన్ని సాధిస్తుందో

BIG Debate: సామాన్యుడికి కఠిన నిబంధనలు.. బడాబాబులకు మాత్రం భారీ సెటిల్మెంట్లు! BIG Debate: దేశీయ బ్యాంకింగ్ రంగంలో అమలవుతున్న ద్వంద్వ ప్రమాణాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సామాన్యులు చిన్నపాటి రుణాలు చెల్లించడంలో కొద్దిరోజులు ఆలస్యమైతే బ్యాంకులు, రికవరీ ఏజెన్సీలు తీవ్ర వేధింపులకు గురిచేస్తుండగా.. వేల కోట్లు ఎగ్గొట్టే బడా కార్పొరేట్లు మరియు పారిశ్రామికవేత్తలకు మాత్రం చట్టపరమైన లొసుగుల ద్వారా నామమాత్రపు సెటిల్మెంట్లు లభిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. hmtv నిర్వహించిన ప్రత్యేక డిబేట్లో వక్తలు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు, విద్య మరియు వ్యక్తిగత రుణాల కోసం కష్టపడే సామాన్యులు ఒకట్రెండు ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు సిబిల్ స్కోర్ దెబ్బతీయడంతో పాటు, రికవరీ పేరిట తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కేవలం కొన్ని పైసల బకాయిలను కూడా వడ్డీలతో కలిపి వేల రూపాయలుగా మార్చి వసూలు చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

వంట చేసేటప్పుడు కాస్త అటూ ఇటూ దృష్టి మారినా లేదా మంట ఎక్కువగా ఉన్నా అన్నం, పప్పు లేదా గ్రేవీ కూరలు అడుగున మాడిపోవడం సహజం. అలాంటప్పుడు ఆ మాడిన వాసన వంటకం మొత్తానికి పట్టుకుని, దాని రుచిని పూర్తిగా పాడుచేస్తుంది. అయితే, మాడిపోయిన ఆహారాన్ని పారేయాల్సిన అవసరం లేకుండా, ఆ వాసనను పూర్తిగా మాయం చేసే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం.. అన్నం లేదా పప్పు మాడిపోయిందని గ్రహించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. పాత్ర అడుగున ఉన్న మాడిన భాగాన్ని అస్సలు కలపకుండా లేదా గీకకుండా, పైన ఉన్న మంచి ఆహారాన్ని మాత్రమే వేరొక శుభ్రమైన పాత్రలోకి మార్చుకోండి.ఆ వేడి వంటకం పైన 1-2 వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ ముక్కలను పరిచినట్లు ఉంచి, పాత్రపై మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇది ఎలా పనిచేస్తుంది?: బ్రెడ్‌లో స్పాంజ్ వంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వేడి ఆహారం నుండి వెలువడే ఆవిరిలో ఉండే మాడిన పొగ కణాలను బ్రెడ్ పూర్తిగా పీల్చేసుకుంటుంది. 10 నిమిషాల తర్వాత బ్రెడ్ ముక్కను తీసి పారేస్తే, మాడిన వాసన మాయమవుతుంది. మాడిపోయిన పప్పు లేదా అన్నాన్ని వేరే పాత్రలోకి మార్చిన తర్వాత, ఒక పెద్ద ఉల్లిపాయను రెండు సగాలుగా కోసి, ఆ ముక్కలను వేడి ఆహారంలో మునిగేలా ఉంచండి. మూతపెట్టి 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలను తీసేయండి. ఇది ఎలా పనిచేస్తుంది?: ఉల్లిపాయలో ఉండే సహజమైన సల్ఫర్ సమ్మేళనాలు, తీవ్రమైన సువాసన ఆహారంలోకి ఇంకిన మాడిన వాసనను తగ్గించేస్తుంది. ఒక చిన్న బొగ్గు ముక్కను స్టవ్‌పై ఎర్రగా కాలే వరకు కాల్చండి. వేరే పాత్రలోకి మార్చిన పప్పు లేదా కూర మధ్యలో ఒక చిన్న స్టీల్ గిన్నె ఉంచి, దానిలో ఈ కాలిన బొగ్గును పెట్టండి. బొగ్గుపై అర స్పూన్ నెయ్యి లేదా

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన పర్సనల్ ఇన్సాల్వెన్సీ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఒక సంచలన రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఆయనపై నమోదైన రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణదాతలైన బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని, ఇది ఎంతమాత్రం సరికాదని అంటున్నాయి. మరోవైపు, మీడియాలో ప్రచారమవుతున్న 99.97 శాతం రుణ మాఫీ వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు తనపై ఉన్న క్లెయిమ్ సైజ్ ఇంత పెద్దది కాదని సుభాష్ చంద్ర స్వయంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ వివాదంపై ఢిల్లీలోని NCLT బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఇద్దరు సభ్యుల బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ఈ కేసును మూడో జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) సెక్షన్ 114 కింద ఈ ప్లాన్‌ను క్లియర్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం, సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పూచీకత్తు హోదాలో రూ. 6.25 కోట్లు చెల్లిస్తారు. దీనితో పాటు, రుణం తీసుకున్న ప్రధాన సంస్థలు విడిగా సుమారు రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 80.8 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్‌కు సపోర్టు ఇచ్చారు. అయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు మాత్రం ఈ రీపేమెంట్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. రీజల్యూషన్ ప్రొఫెషనల్ అంచనా ప్రకారం.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ రీపేమెంట్