
Brs Leaders Arrest | నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Brs Leaders Arrest | నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
© 2026 nimisham.in

Brs Leaders Arrest | నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

BRS Protest | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన

Kavitha : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత..బీఆర్ఎస్కు దూరం అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన టార్గెట్‌ను మారుస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్లో తనకు అన్యాయం జరిగిందన్న మాటనే బలంగా వినిపిస్తున్న కవిత..పార్టీ తనను దూరం పెట్టడానికి..తన తండ్రి కేసీఆర్‌కు తనకు గ్యాప్ పెంచడానికి కారణం..వాళ్లే అంటూ పలువురు లీడర్లపై బాణాలు ఎక్కుపెడుతు వస్తున్నారు. మొన్నటి వరకు జోగినపల్లి సంతోష్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత గుంటనక్క అంటూ హరీశ్‌పై అటాక్ చేశారు. అటు కేటీఆర్‌ను అప్పుడప్పుగు గట్టిగానే విమర్శిస్తున్నారు. లేటెస్ట్గా ఇందూరు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డే తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు కవిత. దీంతో ఆమె టార్గెట్ మారినట్లే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక ఆమె లక్ష్యమేంటన్న చర్చ మొదలైంది. కేసీఆర్‌తో తనకు దూరం పెరగడానికి ప్రశాంత్‌రెడ్డే కారణమన్నది కవిత ఆరోపణ. తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని విమర్శిస్తూ..మహాభారతంలోని శకునితో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే..కవిత రాజకీయ కథనంలో ప్రశాంత్‌రెడ్డిని ఒక కీలక పాత్రగా చూపించే ప్రయత్నం జరుగుతోందా.? ఇంతకాలం హరీశ్‌రావు చుట్టూ తిరిగిన వివాదం..ప్రశాంత్‌రెడ్డి వైపు తిరగడానికి కారణమేంటన్నది డిస్కషన్‌కు దారితీస్తోంది. ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కవిత ఇందూరునే వేదికగా చేసుకున్నారు. అక్కడే సభలు పెడుతూ..రాజకీయ భవిష్యత్‌పై సంకేతాలు ఇస్తూ వస్తున్న కవిత.. అదే నిజామాబాద్ కేంద్రంగా ప్రశాంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో అన్యాయం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కవిత కన్నీళ్లపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఇది ఆమె వ్యక్తిగత ఆవేదనా.? లేక ప్రజల్లో సానుభూతిని పెంచుకునే రాజకీయ వ్యూహమా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పాలిటిక్స్‌లో సెంటిమెంట్ కూడా ఒక బలమైన ఆయుధమే. ఒక నాయకుడికి అన్యాయం జరిగిందన్న భావనను ప్రజల్లో బలంగా నాటగలిగితే..అది రాజకీయంగా సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది. కవిత కూడా సానుభూతి కార్డుతోనే బీఆర్ఎస్ను బ్లేమ్ చేసే ప్లాన్‌లో ఉన్నారా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు నిర్బంధ వాతావరణంలో గడిపారని జగ్గారెడ్డి విమర్శించారు. స్వేచ్ఛ కావాలనే ఆకాంక్షతోనే ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో పోలీసుల నిర్బంధాలు లేవని, మీడియాపై ఆంక్షలు విధించలేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సచివాలయానికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అన్ని రంగాల్లో నియంతృత్వ ధోరణికి ముగింపు పలికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకొచ్చామని జగ్గారెడ్డి తెలిపారు. ‘త్యాగాలు విద్యార్థులవి.. పేరు మీకా?’ : జగ్గారెడ్డి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రేషన్ కార్డులు పంపిణీ చేసి, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని తామే సాధించామని చెప్పుకునే కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన ఒక్కరినైనా చూపించాలని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా నష్టమేం లేదు: జగ్గారెడ్డి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నిస్తే కేటీఆర్ చెప్పే సమాధానం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ రాజీనామా చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు

BRS Party | స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02 : అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీది అభ్యాసం కాదు అది భస్మాసుర హస్తమని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారి బస్టాండ్ వద్ద మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ రణభేరి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డెకరేషన్లతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేయి అడుగుల లోతులో తొక్కిపెట్టాలని రాజయ్య మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా వారి మాటలు వింటే ప్రజల రక్తం మరుగుతోందని, హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ పున: నిర్మాణం కోసం పార్టీ శ్రేణులు యాగంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని రాజయ్య అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతూ అన్ని వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా మరే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Jagga reddy Strong counter on brs ktr: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు పదునైన విమర్శనాస్త్రాల్ని సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పాలనపై బీఆర్ఎస్ చార్జీషీట్ విడుదల చేసింది. దీనిలో కేటీఆర్ కాంగ్రెస్ పాలనను ఉతికి ఆరేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కిండ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అని కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన లో ఉద్యోగాలు భర్తీ జరగలేదన్నారు. 70 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అదించిందని చెప్పారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన లో పోలీసుల నిర్బంధాలు లేవన్నారు. పద్దతి లేని కుటుంబం పద్దతిగల కుటుంబం పై మాట్లాడుతుందని కేటీఆర్ పై సెటైర్ లు వేశారు. అసలు.. రాహుల్ పై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్ అంటూ ఏకీపారేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

BRS party | తొగుట : ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తొగుటలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వెయ్యి రోజులు దాటుతున్నా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలును ప్రశ్నిస్తూ జాబ్ కార్డులను ప్రదర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం జరుగుతున్న అమలుకు పొంతన లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలకు పూర్తి సమాధానం చెప్పే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు ఆటోలో వెళ్తున్న మహిళ బీఆర్ఎస్ ఆందోళన చూసి ఆటో దిగి వొచ్చి రేవంత్ మోసాలపై తూర్పార పట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, సుతారి రమేష్, బోధనం కనకయ్య, మంగ నర్సింలు, నంట పరమేశ్వర్ రెడ్డి, బండారు స్వామి గౌడ్, కుర్మ యాదగిరి, అరుణ్ కుమార్, ఎల్లం, వెంకట్ రెడ్డి, అశోక్, బోయిని శ్రీనివాస్, బిక్షపతి, నరేందర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు. హరీష్‌రావుకు పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడం లేదని ఆయన మీడియా ముందు తీవ్రంగా ఆరోపించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఒక్క కొత్త సాగునీటి డ్యామ్ లేదా బ్యారేజ్ కూడా ఈ ప్రభుత్వం నిర్మించలేదని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే నిరుపయోగంగా మారిన చెక్ డ్యామ్‌లను పేల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల కడుపు కొడుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సాగునీటి అవసరాల కోసం అత్యంత ప్రధాన ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మించడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన నిర్మాణ సమస్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా విస్మరించి పక్కన పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సంస్థల నివేదికలు మరియు ఎన్డీఎస్ఏ అఫిడవిట్లు ఉన్నప్పటికీ కన్నెపల్లి వంటి కీలక పంప్‌హౌస్‌లను పూర్తి స్థాయిలో నడపడం లేదని ఆయన తెలిపారు. పంపింగ్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టమైనప్పటికీ కావాలనే నీటిని ఎత్తిపోయకుండా రైతన్నలకు ప్రస్తుత పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిన్న కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని లిఫ్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నీటి సమస్యలపై లేఖలు రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను బెదిరించడం అలాగే తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. దీంతో పెద్దవాగు ప్రాజెక్టు దెబ్బతినడం, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం వంటి ఘటనలతో రాష్ట్రంలోని రైతులకు భారీ స్థాయిలో నష్టం జరుగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా మృతదేహాలు వెలికితీయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు

కోరుట్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ బుధవారం కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్లో రహదారిపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ముద్రించిన 160 మీటర్ల ప్లెక్సీని ప్రదర్శించారు. ధర్మపురం: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ మాజీ మంతి కోప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ డివిజన్లోని మార్కెట్ రోడ్డులో 100 మీటర్ల ఫ్లెక్సీతో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిరసన చేసిన మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేతలు మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే… — Telugu Scribe (@TeluguScribe) September 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం, వికృతం కనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇది వెయ్యి రోజుల పాలన కాదని.. ‘పీడన’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు పెద్దగా చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ.20 వేల కోట్లు మాత్రమే చేశారని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టారని గుర్తుచేశారు. మాఫీ పూర్తిగా చేయకుండా 70 శాతం మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నాశనం చేసిందని విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి మూటలు మోయడం, పదవుల కోసం కొట్లాడుకోవడం తప్ప మరేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేసి రాహుల్ బంధుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీ కార్యక్రమాలకు భారీగా నిధులు

మాగనూరు, సెప్టెంబర్ 2: మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. మూడేళ్లుగా మంత్రిగా కొనసాగుతున్నా ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాగనూరు మండలం నేరడగం గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మతో పాటు కాంగ్రెస్‌కు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు 50 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలు చేశారు. “నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?” నేరడగం, బూత్పూర్ గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవో తీసుకొచ్చానని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ‘‘నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?’’ అంటూ మంత్రిని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. [caption id="attachment_2500433" align="aligncenter" width="1280"] Chittem Rammohan Reddy1[/caption] మంత్రి సొంత నియోజకవర్గంలో నేరడగం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మ, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన, వార్డు నెంబర్లు, ఉట్కూరు అశోక్,కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం రాజకీయంగా

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల కేటీఆర్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు రైతులు, నిరుద్యోగుల మోసంపై ఫైర్ BRS Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక చార్జ్‌షీట్(BRS Charge Sheet)ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజుల పీడనగా మారిందని, ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు.. 15 ఏళ్ల తర్వాత రైడ్.. కీలక పత్రాలు స్వాధీనం అభివృద్ధి శూన్యం.. అప్పుల మయం: కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ సెటైర్లు వేస్తూ "అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్" తరహాలో ఉందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా రూ. 4.50 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతున్నారని, తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతాంగానికి కుచ్చుటోపీ.. రుణమాఫీ, రైతుబంధుపై విమర్శలు: రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టువేసి, కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే చేసి 70 శాతం మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టారని

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు మహాధర్నాకు సిద్ధమయ్యారు. అయితే మాజీ మంత్రి మహాధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. నల్లగొండ, సెప్టెంబర్ 2: జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు(గురువారం) మహాధర్నాకు సిద్ధమయ్యారు. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ప్రధాన ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే రేపు మిర్యాలగూడలో మాజీ మంత్రి ధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలు..1000 రోజుల్లో కాంగ్రెస్ వికాసం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించగా.. గత పదేళ్ల వైఫల్యాలపై ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పదేళ్ల పాలనలో నల్గొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పిస్తూ పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లకార్డులతో కాంగ్రెస్ శ్రేణులు రేపు నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. కేటీఆర్ పర్యటన వేళ ఫ్లెక్సీల ఏర్పాటుతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్
‘కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించు’.. కవితపై ప్రశాంత్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానం, బీఆర్ఎస్తో ఉన్న అనుబంధం, కేసీఆర్ కుటుంబంతో తన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత వల్ల ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఒక్కసారైనా ఆలోచించుకోవాలని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య విభేదాలను పరిష్కరించేందుకు తాను ప్రయత్నించానని గుర్తు చేసుకున్నారు. వారిని విడదీయడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తాను ఏం చేశానో కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటిన తర్వాతే.. కవితపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా కవిత నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్వలాభం కోసం ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. తనపై చేసిన ఆరోపణలకు కవిత ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. ఈ వార్తకు సంబంధించిన
బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానం, బీఆర్ఎస్తో ఉన్న అనుబంధం, కేసీఆర్ కుటుంబంతో తన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత వల్ల ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఒక్కసారైనా ఆలోచించుకోవాలని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య విభేదాలను పరిష్కరించేందుకు తాను ప్రయత్నించానని గుర్తు చేసుకున్నారు. వారిని విడదీయడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తాను ఏం చేశానో కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటిన తర్వాతే.. కవితపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా కవిత నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్వలాభం కోసం ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. తనపై చేసిన ఆరోపణలకు కవిత ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.బీఆర్ఎస్తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన ప్రశాంత్ రెడ్డి.. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి, తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ఆవిర్భావానికి ముందే ఉద్యమ రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. పార్టీ ప్రారంభ దశ నుంచి తమ కుటుంబం బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ప్రశాంత్ రెడ్డి.. ప్రశాంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. కవిత మధ్యలోనే పార్టీలోకి వచ్చారని.. ఇప్పుడు మధ్యలోనే వెళ్లిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం, పార్టీ నిర్మాణంలో తమ కుటుంబం పోషించిన పాత్రను గుర్తు చేశారు.ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసీఆర్‌కు అండగా ఎవరు నిలుస్తున్నారో కవిత తెలుసుకోవాలని ప్రశాంత్

కష్టకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కవిత చర్యల వల్ల తండ్రి కేసీఆర్ ఎంతటి మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఆలోచించుకోవాలని... తాను ఎప్పుడూ కేసీఆర్-కవితలను కలపడానికే ప్రయత్నించాను తప్ప విడగొట్టడానికి కాదని స్పష్టం చేశారు. తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్ వెంటే ఉన్నామని, తాము టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యులమని గుర్తుచేశారు. "బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్" అని పేర్కొన్న ఆయన... కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ లైన్ దాటినందుకే ఆమెపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ లోపలా బయటా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో ఎలాంటి మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా చెప్పగలనని... మరి కాంగ్రెస్‌తో కవిత రహస్య మంతనాలు జరపలేదని ఆమె చెప్పగలరా? అని నిలదీశారు. కేసీఆర్‌కు అత్యంత ఆప్తులుగా, బలంగా ఉన్న నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ... పార్టీని బలహీనపరిచి పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కేవలం రాజకీయం కోసం, సానుభూతిని పొందేందుకేనని విమర్శించారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీని చేయడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసని, నిన్నటి వరకు ఆమెపై ఉన్న గౌరవాన్ని తన వ్యాఖ్యలతో కవిత స్వయంగా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చెయ్యాలని, నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యల కోసం పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో ఏం చేశారు? సీఎం రేవంత్ విమర్శలు తాజాగా అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జరిగిన ప్రజా సభలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఒక ఉద్యోగి ఏడాది పని చేయకపోతే తొలగిస్తారు. కానీ కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో జీతం, భద్రత, వాహనాల కోసం ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నారు.మూడేళ్ళలో కేసీఆర్ తీసుకున్న జీతం, భద్రతకు అయిన ఖర్చుల లెక్క చెప్పిన సీఎం ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక కోటి 84 లక్షల, 40 వేలు జీతంగా తీసుకున్నారని, వాహనాలు భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా ఒక్క రోజు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం బయటకు రాలేదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. వెంటనే రాజీనామా చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి కేసీ ఆర్ ను టార్గెట్ చేశారు.కేసీఆర్ రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ తో ర్యాలీలు కేసీఆర్ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 7 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పక రావాలని, పదేళ్ల పాలన

తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులను, వారి భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, విద్యార్థులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తలసానిని కలసి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకూడదనే సదుద్దేశంతో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారని... ఆ తర్వాత కేసీఆర్ హయాంలో కూడా సకాలంలో నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ. 11,000 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కోర్సులు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ అండగా ఉంటుందని తలసాని హామీ ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై ‘జెన్ జీ’ యువత జరిపిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దిగొచ్చిందో, అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విద్యార్థులు గట్టి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు

Sircilla: సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు బక్కి వెంకటయ్య! Sircilla: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భూ వివాదాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, సివిల్ రైట్స్ డే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ వివాదాల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు బాగుందని బక్కి వెంకటయ్య పోలీస్ శాఖను అభినందించారు. ఇక నేరెళ్ల బాధితులు ఇచ్చిన దరఖాస్తుపై స్పందించిన కమిషన్ చైర్మన్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే రాష్ట్ర హైపర్ కమిటీ సమావేశంలో నేరెళ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య వెల్లడించారు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం ఏ. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్-అంబర్‌పేట వంతెన ప్రారంభోత్సవ ప్రజా సమావేశంలో మాట్లాడిన ఆయన, అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించకుండా ఫార్మ్‌హౌస్‌కే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీ జీతం మరియు ఇతర భద్రతా సౌకర్యాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గత 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరుకావడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కేవలం ఫార్మ్‌హౌస్‌కే పరిమితమై 1000 రోజులు గడిపేశారని ఆరోపించారు. దేశంలో ఏ ప్రతిపక్ష నేత కూడా ప్రజలకు దూరంగా ఇన్ని రోజులు ఉండలేదని, ప్రజాప్రతినిధిగా ఇది ఏమాత్రం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ 1000 రోజుల కాలంలో కేసీఆర్ జీతం రూపంలో రూ.1.24 కోట్లు తీసుకోగా, ఆయన భద్రత మరియు బుల్లెట్ ప్రూఫ్ ల కోసం ప్రభుత్వం మరో రూ.21 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి లెక్కలు బయటపెట్టారు. దీంతో మొత్తం రూ.22.24 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే ఉద్యోగం ఊడుతుందని, మరి అసెంబ్లీకి రాని కేసీఆర్ విషయంలో ఏం చేయాలని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కేసీఆర్ వచ్చి 1000 రోజుల కాంగ్రెస్ పాలనతో పాటు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రత్యక్ష చర్చకు రావాలని సీఎం సవాలు విసిరారు. ఫలితంగా సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు, బైక్ ర్యాలీలు

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి కారణంగానే ఆ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ప్రసంగించారు.బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని కవిత విమర్శించారు. ఆ పార్టీ హయాంలో నాలుగు ఇళ్లు మాత్రమే బంగారమయ్యాయని ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించలేకపోయారని దుయ్యబట్టారు.ఈ సందర్భంగా వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్‌రెడ్డి తనను తండ్రి నుంచి దూరం చేశారని, ఆయనకు తన ఉసురు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌రావును క్షమించినా ప్రశాంత్ రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించనని స్పష్టం చేశారు. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే పుట్టింటి వాళ్లే కుట్ర చేసి తరిమేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.తాను ఏ తప్పూ చేయకపోయినా నాలుగేళ్లుగా ఈడీ, సీబీఐలతో వేధించి తీహార్ జైలులో పెట్టారని కవిత అన్నారు. తాను నిర్దోషినని సుప్రీంకోర్టే చెప్పిందని, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక సీబీఐ అధికారిపైనే విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే పంతం పట్టి పార్టీ పెట్టానని, పదవుల కోసం కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ప్రతిపక్షంగా

బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జూపెల్లి దుర్గాప్రసాద్ రుద్రంపూర్, ఆగస్టు 22 : పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జూపెల్లి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జీవో 97కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను శక్తి విభాగం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. దీంతో రాష్ట్రంలోని సుమారు 75 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలోకి తీసుకెళ్లడం, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే డిప్లొమా విద్యార్థులకు ఉన్న ECET ద్వారా బీటెక్‌లో లాటరల్ ఎంట్రీ అవకాశాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక డిప్లొమా విద్యా ప్రమాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీవో 97ను వెంటనే నిలిపివేయకపోతే విద్యార్థుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడెల్లి ముఖేష్, వాసు, మల్ల గౌతమ్, రవితేజ, నజీర్, సన్నీ పాల్గొన్నారు. [caption id="attachment_2491216" align="alignnone" width="1200"] 'జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి.. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం'[/caption]

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్. అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్‌గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా

తెలంగాణలో విద్యార్థులపై పోలీసుల చర్యల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసిన రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో జరుగుతున్న దాడులపై స్పందించకపోవడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వారు ఆరోపించారు.శుక్రవారం కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ తీరును తప్పుబట్టారు. "దేశంలో రెండు రకాల భారతాలు ఉన్నాయి. ఒకచోట విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగితే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తారు, ధర్నాలు చేస్తారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణలో విద్యార్థులను ఈడ్చుకెళ్తూ, గొంతు పట్టుకొని హింసిస్తున్నా పట్టించుకోరు. ఢిల్లీ తరహాలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేస్తారా? లేక తెలంగాణ విద్యార్థులంటే మీకు లెక్కలేదా?" అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 19న మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతును ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకున్న వీడియోను ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. "ఢిల్లీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్ కోసం వెళ్లిన రాహుల్, తెలంగాణ ఘటనలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇక్కడి విద్యార్థులను నేరస్థుల్లా చూస్తున్నారు. ఢిల్లీకి మీ ఆవేశం, తెలంగాణకు మీ మౌనం.. విద్యార్థులు మీ నుంచి ఇంతకంటే మెరుగైన తీరును ఆశిస్తున్నారు" అని కవిత అన్నారు

జూలూరుపాడు, ఆగస్టు 21 : రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నెం. 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్లొమా విద్యార్థుల విద్యా ప్రమాణాలను తగ్గించి, వారి బీటెక్ ఉన్నత విద్యావకాశాలను కాలరాసే కుట్రను సహించేది లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని గిరిబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ మెడలు వంచైనా న్యాయం సాధిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో సాంకేతిక విద్యకు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశామని ఆయన గుర్తుచేశారు. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చి, వేలాది మంది యువతకు ఉపాధి లభించిందని తెలిపారు. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆగస్టు 15 నాటికి రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ హామీని గాలికి వదిలేసి విద్యార్థులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, జీవో నెం. 97ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల ఆగ్రహజ్వాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భస్మం కాక తప్పదని గిరిబాబు తీవ్రంగా హెచ్చరించారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Shavukaru Janaki RIP: తెలుగు సినీ పరిశ్రమతోపాటు దక్షిణాది సినీ ప్రేక్షులను ఏడు దశాబ్దాల పాటు అలరించిన అందాల నటి.. నట దిగ్గజం షావుకారు జానకి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో మృతిచెందారు. ఆమె మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె మృతికి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు సంతాప ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు' అని కొనియాడారు. 'షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిది' అని తెలిపారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం సంతాప ప్రకటన షావుకారు జానకి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రార్థించారు. షావుకారు జానకి మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీఈప అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. konda sushmita fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సుష్మిత వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభకు వచ్చినప్పుడు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరీ ప్రకాశ్ రెడ్డి బరిలో ఉంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కొండా సుష్మిత రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు వచ్చే రెండెళ్లు కాదు.. ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పరకాల గడ్డ కొండా సుష్మిత అడ్డా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ బాగోతాలు, ఆయన సోదరుల బాగోతాలు బైటపెడ్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. మంత్రి కొండా సురేఖకు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. దీనికి కొండా సురేఖ తన కూతురు వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నేతలు.. కొండా సుష్మిత వ్యాఖ్యలపై కౌంటర్ లు ఇచ్చారు. ఈ వివాదం నడుస్తున్న వేళ.. మరోసారి కొండా సుష్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుష్మిత పటేల్ మాట్లాడుతూ.. అసలు రేవంత్ ఎవడు?.. అధిష్టానం మాటే ఫైనల్ అని మాట్లాడారు. ఇలాగే చేస్తే రేపు సీల్డ్ కవర్లో ఇంకో సీఎం పేరు వస్తుందని ఏకీపారేశారు. అసలు నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు. రాహుల్, సోనియా గాంధీలపై గౌరవం ఉందన్నారు. రేవంత్

బీఆర్ఎస్ నేత, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే... నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిన్న ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో సాధారణ ప్రజలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం వీరు అనుమతి లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ పాత్లావత్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలిఅవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదాబీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చాం.. 22-ఏపై బీఆర్ఎస్ది అనవసర రాద్ధాంతం: మహేశ్ గౌడ్ నిజామాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వాఖ్యలు బాధాకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం అలా మాట్లాడి ఉండకూడదని.. ఎలాంటి పరిస్థితిలో అలా మాట్లాడారో వివరణ కోరామన్నారు. అభ్యర్థులం తామేనని ఎవరు ప్రకటించుకున్నా చెల్లదని, అభ్యర్థుల ఎంపికకు పార్టీలో ఓ విధానం ఉంటుందని.. ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. 22-ఏ విషయంలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు
ఎర్రబెల్లి దయాకర్ రావుకు గాయాలు.. పాదయాత్రలో పోలీసుల తోపులాట జనగామ జిల్లాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవరుప్పుల, కొడకండ్ల మండల రైతులకు ఎస్సార్ఎస్పీ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రబెల్లి ఈ పాదయాత్ర చేపట్టారు. సింగరాజుపల్లి గ్రామం వద్ద ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో ఆయన నుదుటిపై గాయాలయ్యాయి. స్థానిక వైద్యుల చేత ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం పోలీసులు ఆయనను దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వార్తకు సంబంధించిన

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని.. ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలను 22A లో పెట్టారని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి.. రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. ఈ

Nacharam: గౌడెల్లి రామకృష్ణ అంత్యక్రియలు.. హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నాచారం: స్థానిక నాయకుడు గౌడెల్లి రామకృష్ణ మృతి పట్ల బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన రామకృష్ణ అంత్యక్రియల్లో ఆయన పాల్గొని, పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామకృష్ణతో తనకు ఉన్న పరిచయం, ఆయన స్థానికంగా చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన మృతి స్థానికంగా తీరని లోటని పేర్కొన్నారు. అంత్యక్రియలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై రామకృష్ణకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కేశవ్, ఎరుపుల నాగరాజు, యేముల హరిబాబు, శ్రీనివాస్‌రెడ్డి, నూతలకంటి రాజు తదితరులు పాల్గొన్నారు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఒక ప్రైవేటు భూమిలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ గద్దెను నిర్మించారు బిఆర్ఎస్ శ్రేణులు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అనుమతి తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఆ గద్దెను కూల్చివేశారు.నర్సంపేటలో పొలిటికల్ హీట్ఆ తర్వాత మళ్లీ బిఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, మున్సిపల్ అధికారులు మళ్ళీ విగ్రహాన్ని తొలగించారు. దీంతో నర్సంపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత, బీఆర్ఎస్ రాస్తారోకో, నర్సంపేటలో ఉద్రిక్తత!నేడు నర్సంపేట బంద్మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడంతో బిఆర్ఎస్ నేడు నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుండి నర్సంపేటలోపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించడంతో నర్సంపేటలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తుఅవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. నర్సంపేట కు తరలి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేటలో ఉద్రిక్తత సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అప్రకటిత ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వార్తకు సంబంధించిన

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఈ పర్యటన పిలుపు నేపథ్యంతో తెల్లవారుజాము నుంచే కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్ రావు ఇల్లు విడిచి బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. ఈ ఆకస్మిక పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా... హరీశ్ రావు హౌస్ అరెస్ట్ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Narsampet: నర్సంపేట డివిజన్ బంద్ ప్రశాంతంగా ప్రైవేట్ స్కూళ్లు షాపులు బంద్ Narsampet: నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల పిలుపు మేరకు నర్సంపేట డివిజన్ బంద్‌కు వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. దీంతో నర్సంపేటలో పలు దుకాణాలు, వ్యాపార, ప్రైవేటు స్కూలు,కాలేజీలు సంస్థలు మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు

హైదరాబాద్: మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన హరీశ్‌రావును అనుమతి లేదంటూ బుధవారం ఉదయం కోకాపేటలో గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కోకాపేటలోని ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. సనత్‌నగర్ టిమ్స్‌కు వెళ్లకుండా.. మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్బంధాలు, హౌస్ అరెస్ట్‌లను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Sathupalli: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, సత్తుపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించాయి. సత్తుపల్లిలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, “కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో పేద కుటుంబాల కష్టాలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తొలుత రూ.50 వేలతో ప్రారంభించిన ఈ పథకం ఆర్థిక సహాయాన్ని అనంతరం రూ.1,00,116కు పెంచి, వేలాది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారని సండ్ర వెంకట వీరయ్య గారు ఆవేదన వ్యక్తం చేశారు. పథకానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సకాలంలో స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని సండ్ర గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఆ హామీపై ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన, ఇరు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వేడికి అద్దం పట్టింది.ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ, నియోజకవర్గంలో రూ. 2.50 కోట్లతో సమేల రోడ్డు, రూ. 1.50 కోట్లతో పాతగూడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, పనులు ఎందుకు ప్రారంభం కాలేదని మంత్రిని ప్రశ్నించారు. స్వయంగా మంత్రి ప్రారంభించిన పనులకే ఈ పరిస్థితి ఎదురైతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆమె నిలదీశారు.దీనిపై మంత్రి జూపల్లి స్పందిస్తూ, 2018 నుంచి 2023 మధ్య కాలంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని ఎమ్మెల్యేను ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశామని, మంత్రి వ్యాఖ్యలు సరికాదని కోవ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు.అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.25 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం అద్భుతం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అమరవీరుల స్తూపానికి ఉన్న ప్రాధాన్యతే పాపన్న విగ్రహానికి ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, ఆగస్టు18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం అద్భుతం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అమరవీరుల స్తూపానికి ఉన్న ప్రాధాన్యతే పాపన్న విగ్రహానికి ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రను చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2029లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ జరిగితే 117 సీట్లతో అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం అయితే.. ఆయన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారని గుర్తు చేశారు. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయితే.. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యారని.. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్క, వాకిటి శ్రీహరి మంత్రులయ్యారని సోదాహరణంగా వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యమకారులకు కీలక పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలికి పదవులిచ్చామని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఎర్రబెల్లి, వినోద్‌రావుకు పదవులిచ్చారని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ సీఎం అయితే.. వారి కుటుంబ సభ్యులకు ఫామ్‌హౌజ్‌లు వచ్చాయని ఎద్దేవా చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని వివరించారు. దిశ బాగుంటుందని కేసీఆర్ కొత్త సచివాలయం కట్టుకున్నారని తెలిపారు. కానీ
వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని తొలగించడంతో పాటు గద్దెను కూడా నేలమట్టం చేశారు.విగ్రహం తొలగింపు నేపథ్యంలో నర్సంపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సుమారు 1500 మంది పోలీసులు నర్సంపేట పట్టణంలో బందోబస్తు నిర్వహించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విగ్రహం తొలగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. అక్కడికి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారని.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదురుగా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అనుమతులు లేకుండా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారుల నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.విగ్రహం తొలగింపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో నేతలు నర్సంపేటకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ మధుసూదనాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.నర్సంపేటలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి

వర్ధన్నపేట : కేసీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేకుందుకు కుట్రపన్నుతున్నదని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నాడు కేసీఆర్ ముందు చూపుతో పేదింటి ఆడబిడ్డల కన్నీళ్లను తుడిచేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు పలు సంక్షేమ ఫలితాల నిలిపివేతపై వర్ధన్నపేట తహసీల్దార్‌కు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విగ్రహాల రగడ తీవ్ర దుమారం రేపుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో రాత్రి వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొలగించారు. ఈ క్రమంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏకంగా 1,500 మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల పరిసరాలు, పాకాల రోడ్డు వైపు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. విగ్రహ తొలగింపు ప్రక్రియను అత్యంత గోప్యంగా నిర్వహించారు. విగ్రహంతో పాటు దాన్ని ప్రతిష్ఠించిన సిమెంటు గద్దెను కూడా కూల్చివేసి, ఆ వ్యర్థాలను అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఈ ఆపరేషన్ ఎంత సీక్రెట్‌గా జరిగిందంటే.. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని సైతం సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని ఉన్నతాధికారులు కఠిన ఆంక్షలు విధించారని సమాచారం. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను దారిలోనే అడ్డుకున్నారు. విగ్రహ తొలగింపు వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సంపేటకు తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో కీలక బీఆర్ఎస్ నేతలను ఇళ్లలోనే అదుపులోకి తీసుకున్నారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం వద్ద సుమారు 400 మంది పోలీసులతో పహారా కాశారు. కాగా, నల్లబెల్లిలోని స్వగృహంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ముందు ఆయన సతీమణి పెద్ది స్వప్న భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. జులై 31న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఆయన దశ దిన కర్మ సందర్భంగా నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట

Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లి లోని స్వ గృహం లో ఉన్న సుదర్శన్ రెడ్డి విగ్రహం ముందు సతీమణి పెద్ది స్వప్న బావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఏడుస్తూ నువ్వు లేని రోజు చూడు ఎంత అరాచకామో అంటూ విలపించాంరు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

తమిళనాడు, కర్ణాటకలోని దేవాలయాలను సందర్శించిన తనపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, దేవుడి దర్శనానికి వెళ్లడం తప్పా అని రేవంత్‌ను సూటిగా ప్రశ్నించారు. ఈ ఆరోపణలు తన వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలో భాగమని హరీశ్ రావు ఆరోపించారు. ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని, లేనిపక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన రేవంత్‌కు సవాల్ విసిరారు. గత ఆగస్టు 15 సమయంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలనుద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు వెళ్లి క్షుద్రపూజలు చేయిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ టెంపుల్ విజిట్స్ వివరాలు ఎందుకు దాచారని ప్రశ్నించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రేవంత్ తన పేరు చెప్పకుండా విమర్శలు చేస్తున్నారని, పేరు చెబితే లీగల్ నోటీసులు పంపుతానని హరీశ్ రావు హెచ్చరించారు. దీంతో దేవాలయాల పర్యటనపై హరీశ్ రావు పూర్తి స్పష్టత ఇచ్చారు. తాను కేవలం ఆధ్యాత్మిక చింతనతోనే తిరుచ్చి శ్రీ రంగనాథస్వామి, కొల్లూరు మూకాంబికా ఆలయాలను సందర్శించానని హరీశ్ రావు వివరించారు. దేవుడి పేరుతో రాజకీయం చేయడం రేవంత్‌కే చెల్లిందని, ఉద్యమ చరిత్ర లేని ఆయనకు తనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, తనను అగ్గిపెట్టెతో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 22ఏ భూముల సెక్షన్ అంశాన్ని హరీశ్ రావు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. చివరికి సీఎం ఇల్లు, ఎయిర్పోర్ట్ భూములు కూడా ఆ జాబితాలో ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకోవడమే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ల పేరుతో

రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలులో గత ప్రభుత్వం విఫలం: తుమ్మల హైదరాబాద్: రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ అమలు తీరు దారుణంగా సాగిందని, ఆ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు విస్మరించినా.. రైతులు మాత్రం గుర్తుపెట్టుకున్నారని ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉందని, అయినప్పటికీ రూ. లక్ష వరకు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకుండా.. వాయిదాల్లో నాలుగు సంవత్సరాల పాటు చెల్లించడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల వడ్డీ భారం పడిందని అన్నారు. 2018లోనూ రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని నమ్మించి, చివరకు సగం మందికే అమలు చేసి.. రూ. 8,379 కోట్లు పూర్తిగా ఎగవేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు రైతులను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు వారిపై కపటప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే ఒకేసారి రూ. 20,617కోట్లు మాఫీ చేసి.. 25,35,964 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిందని తుమ్మల స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతో రూ. 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటిని మాఫీ చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నామని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతులకు ఉన్న పంట రుణ బాకీలు అత్యల్పమని పార్లమెంట్లో కేంద్ర నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే