
Narsampet: నర్సంపేట డివిజన్ బంద్ ప్రశాంతంగా ప్రైవేట్ స్కూళ్లు షాపులు బంద్
Narsampet: నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల పిలుపు మేరకు నర్సంపేట డివిజన్ బంద్కు వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి.
దీంతో నర్సంపేటలో పలు దుకాణాలు, వ్యాపార, ప్రైవేటు స్కూలు,కాలేజీలు సంస్థలు మూసివేసి బంద్కు సంఘీభావం తెలిపారు.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media