
Brs Leaders Arrest | నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Brs Leaders Arrest | నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
© 2026 nimisham.in

Brs Leaders Arrest | నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

బీఆర్ఎస్ నేత, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే... నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిన్న ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో సాధారణ ప్రజలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం వీరు అనుమతి లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ పాత్లావత్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేటలో ఉద్రిక్తత సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అప్రకటిత ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వార్తకు సంబంధించిన

Palakurthi: పాలకుర్తిలో ఘనంగా బోనాల పండుగ బోనమెత్తిన ఎర్రబెల్లి ఈ వార్తకు సంబంధించిన

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువైన జోగినపల్లి శ్రీనివాస్ రావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీనివాస్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఎర్రబెల్లి దయాకర్ రావు హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ శ్రీనివాస్ రావు పార్థివదేహానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. అనంతరం తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. శ్రీనివాస్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ లోటును తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు