
YS Jagan | మరో పాదయాత్రకు సిద్ధమైన వైఎస్ జగన్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లోప్రారంభం..!
YS Jagan | మరో పాదయాత్రకు సిద్ధమైన వైఎస్ జగన్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం..!
© 2026 nimisham.in

YS Jagan | మరో పాదయాత్రకు సిద్ధమైన వైఎస్ జగన్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం..!

YS Jagan Padayatra: జగన్ పాదయాత్రకు ముహుర్తం ఫిక్స్..! స్వయంగా ప్రకటన..!

YS Jagan: ఆ నెల నుంచే పాదయాత్ర 2.O స్టార్ట్.. వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన!

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Mohan Reddy: 'పురుషోత్తపట్నం నుంచి ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి.. పోలవరం ఎడమ కాలువలో వదిలి దాన్ని చూపించి పోలవరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చేశాం అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటి?' అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రాకున్నా ప్రచారం మాత్రం వేరే లెవల్ అని తెలిపారు. నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించినది అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్? అని నిలదీశారు. 'సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ, ఇవాళ పోలవరం ఎడమ కాలువ. మీరు మొదలుపెట్టని.. మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే' అని చంద్రబాబు పబ్లిసిటీపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయితే.. ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి అంతా నేనే చేశా అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది' అని వైఎస్ జగన్ విమర్శించారు. 'పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014-19 మధ్య

అనకాపల్లికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చామన్నారు. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తామన్నారు. శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి...బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర చరిత్రలో అపురూప ఘట్టం.. పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ!నాటి గొడ్డలి పార్టీ చీకలి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకాలు, కబ్జాలు, భయానక వాతావరణం ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ పార్టీ... ఆ నాయకుడి నివాసానికి, విలాసాల కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆ రూ.500 కోట్లతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. విపక్షంలోనూ గొడ్డలిపార్టీ విషం చిమ్ముతోందన్నారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటియం బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుందిని, అలాగే 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని తెలిపారు. 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఎప్పుడు విడుదల

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధిని పుష్పగుచ్ఛాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేతను స్మరించుకుంటూ వారు అంజలి ఘటించారు.2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2009 సెప్టెంబర్ 2న 'రచ్చబండ' కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 17 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఆయన్ను నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు

ఏపీలో అరకు వైఎస్సార్సీపీ ఎంపీ గుమ్మ తనూజరాణి (Gumma Thanuja Rani) ఇవాళ తమిళనాడు వెళ్లి సీఎం విజయ్ (CM Vijay)తో భేటీ అయ్యారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకుని అక్కడికి వెళ్లారు. దీంతో విజయ్ కూడా వీరికి స్వాగతం పలికారు. ఆత్మీయంగా కలిసి మాట్లాడారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు. ఏపీ రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ కూడా చేశారు.ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!పార్లమెంటరీ పట్టణ, అభివృద్ధి అధ్యయన పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను తమిళనాడు సచివాలయంలో కలిసినట్లు తనూజరాణి తెలిపారు. విజయ్ తో తనూజరాణి, ఆమె భర్త, వైసీపీ నేత చెట్టి వినయ్ కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అరకు ఎంపీ దంపతులకు సీఎం విజయ్.. ఆత్మీయంగా ఓ జ్ఞాపిక కూడా అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెట్ట వికాస్ కూడా పాల్గొన్నారని ఎంపీ తనూజ తెలిపారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!గతంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను సీఎం కాకముందే విజయ్ చెన్నైలో జరిగిన ఓ వ్యక్తిగత కార్యక్రమంలో కలిశారు. అప్పట్లో జగన్ సోదరుడి పెళ్లి సందర్భంగా విజయ్ అక్కడికి రావడంతో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ తర్వాత మాత్రం వైసీపీ నేతలు ఎక్కడా విజయ్ తో కనిపించలేదు. కానీ ఇప్పుడు అరకు ఎంపీ తనూజరాణి ఏకంగా కుటుంబంతో కలిసి వెళ్లి విజయ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ పార్లమెంటరీ పట్టణాభివృద్ధి అధ్యయన పర్యటన కోసం అక్కడికి వెళ్లినట్లు ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ చేయడంతో ఊహాగానాలకు కూడా తావులేకుండా పోయింది

పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (Poola Subbaiah Veligonda Project) తొలి దశ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాజెక్టును ప్రారంభించి తన ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను వివరించగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) మాత్రం తమ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (Y. S. Rajasekhara Reddy) పాత్రను ప్రస్తావిస్తూ స్పందించారు. సాధారణంగా రాజకీయంగా భిన్న దారుల్లో ఉన్న జగన్, షర్మిల ఇద్దరూ ఒకే అంశంపై దాదాపు ఒకే కోణంలో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. మార్కాపురం (Markapuram) ప్రాంత ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడంతో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయనే ఆశలు పెరిగాయి. ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల క్రితం తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ప్రారంభించే అవకాశం కూడా తనకే దక్కిందని చెప్పారు. వివిధ ప్రభుత్వాల సమయంలో ప్రాజెక్టుకు జరిగిన వ్యయం, పనుల పురోగతిని ప్రస్తావిస్తూ తన ప్రభుత్వం గణనీయమైన నిధులు కేటాయించిందని వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై జగన్ తీవ్రంగా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు ఆలోచనకు, దాని నిర్మాణానికి వైఎస్సార్ చేసిన కృషిని విస్మరించి చంద్రబాబు మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రాజెక్టులో కీలకమైన జంట సొరంగాల నిర్మాణమే కృష్ణా జలాలను తరలించేందుకు ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సొరంగాల పనులను ముందుకు తీసుకెళ్లామని, కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, అనుసంధాన పనులపైనా దృష్టి పెట్టామని జగన్ తెలిపారు. ప్రాజెక్టు చరిత్రను మార్చే ప్రయత్నాలు చేసినా వాస్తవాలు మారవని ఆయన అన్నారు. ఇదే సమయంలో షర్మిల కూడా వెలిగొండ ప్రారంభాన్ని స్వాగతిస్తూనే వైఎస్సార్ పాత్రను గుర్తు

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. కృష్ణా జిల్లా, ఆగస్టు 22: మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. గుడివాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని.. దీంతో నిజం తేలిపోయిందని చెప్పారు. ‘ఓపెన్ డిబేట్‌కు రా.. లేదా అసెంబ్లీకి రా.. నీ అనుమానాలు క్లియర్ చేస్తా అని లోకేశ్ సవాల్ విసిరినా జగన్ నుంచి సమాధానం లేదు’ అంటూ విమర్శించారు. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులు మీడియా ముందు స్పష్టంగా చెబుతున్నా.. అధికారుల దగ్గరకు వెళ్లి ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బిజీ అయితే తమ ప్రతినిధులను పంపి అనుమానాలు తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వాళ్ల పని అంటూ మండిపడ్డారు. సమాధానం చెప్పకుండా తాడు బొంగరం లేని బందర్ పిచ్చోడిని పంపిస్తున్నారని.. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకంలా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని.. నేరస్థులంటే ఆయనకు చాలా ఇష్టమని, పలకరించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని రామయ్య విమర్శించారు. కౌరవుల మాదిరి జగన్ ఎప్పుడూ నేరస్థులు, దొంగలు, విధ్వంసకారుల పక్షమే అని.. అందుకే తల్లి, చెల్లి కూడా తోడు లేరన్నారు. జెన్-జీ అంటూ జగన్ పెట్టే మీటింగ్‌లో గంజాయి బ్యాచ్ ఉంటుంటే... రాష్ట్రంలో నిజమైన జెన్-జీలు లోకేశ్‌కు మద్దతు

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అమరావతి, ఆగస్టు 22: 2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. హత్యలు, దాడులనే నమ్ముకుని పాలిటిక్స్ చేస్తోందని వినిపిస్తోంది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చిక్కుల్లో పడ్డ నెతన్యాహు: రెడ్ నోటీస్స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై

ఏపీలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)ఇవాళ పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. సర్‌లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలుకు నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని కోరారు.ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!అదే సమయంలో నాలుగైదు నెలలుగా బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించినట్లు సజ్జల తెలిపారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. Amaravati: చంద్రబాబు, నారాయణపై వైసీపీ కేసును తేల్చేసిన సుప్రీంకోర్టు..!డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల సూచించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారన్నారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Shavukaru Janaki RIP: తెలుగు సినీ పరిశ్రమతోపాటు దక్షిణాది సినీ ప్రేక్షులను ఏడు దశాబ్దాల పాటు అలరించిన అందాల నటి.. నట దిగ్గజం షావుకారు జానకి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో మృతిచెందారు. ఆమె మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె మృతికి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు సంతాప ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు' అని కొనియాడారు. 'షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిది' అని తెలిపారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం సంతాప ప్రకటన షావుకారు జానకి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రార్థించారు. షావుకారు జానకి మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీఈప అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు

రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం సాధారణమే. అయితే ప్రజా సమస్యలపై నిజంగా పోరాడాలంటే ఆ విమర్శలను సంబంధిత వేదికలపై కూడా వినిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విషయంలో ఇదే అంశం చర్చకు వస్తోంది. బయట ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆయన శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండటంపై అధికార కూటమి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతోందని చెబుతోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ స్వయంగా సభకు హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ వాదనకు మరింత బలం వస్తుందని అధికార పక్షం అంటోంది. సభలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండటంతో పాటు, ప్రతిపక్షానికి కూడా ప్రజల తరఫున నిలదీసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ అంశంపై జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీకి రావడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికార పక్షాన్ని సభలోనే తీవ్రంగా ప్రశ్నించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం జగన్‌కు కూడా అదే అవకాశముందని, సభా వేదికను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా జగన్ సభకు వస్తే ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే మరోసారి ఉపాధ్యాయ నియామక ప్రకటన ద్వారా వేలాది ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం

సాక్షి, తాడేపల్లి: ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్బంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. "నా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు.సర్వమంగళకారిణి లక్ష్మీదేవి అనుగ్రహంతో, ప్రతి ఇల్లు సిరిసంపదలతో సుఖశాంతులతో ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) మీరు అసలు మనుషులా రాక్షసులా.? పసి బిడ్డను చంపేస్తారా.? టీచర్ పై పేరెంట్స్ రియాక్షన్ YSRCP అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్ DSC కుంభకోణంలో సంచలన నిజాలు బయట పెట్టిన అభ్యర్థి రోడ్డు పక్కన కారు.. డిక్కీలో యువతి డెడ్ బాడీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరీక్షలు నిర్వహించకుండానే పాఠాలు చెప్పే వారికి ఉద్యోగాలు ఇస్తారా అని ఆయన నిలదీశారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ల మైండ్ లో చిప్ ఉందా లేదా అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచీ వైఎస్సార్సీపీ దీనిపై నిరసనలు తెలుపుతోంది. గతంలో తమ పాలనలో జరిగిన గ్రూప్-1 పరీక్షలపై ప్రభుత్వం కావాలనే అసత్య ప్రచారాలు చేస్తోందని జగన్ మండిపడ్డారు. ప్రశ్నపత్రం తయారీ మరియు పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం ఎక్కడా లేదని విమర్శించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సభలో సరైన సమాధానాలు చెప్పలేక ప్రతిపక్ష హోదాను నిరాకరిస్తోందని ఆరోపించారు. దీంతో మెగా డీఎస్సీ పై అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు తగిన సమయం ఇవ్వడం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, క్వశ్చన్ పేపర్ రూపకల్పన బాధ్యతలను ఒకే అధికారికి ఇవ్వడం వల్ల పారదర్శకత లోపించిందని ఆయన తెలిపారు. కనీస నియమావళి పాటించకుండా మెగా డీఎస్సీని నిర్వహించారని, అందుకే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా ఈ అక్రమాలన్నింటిపై నిష్పాక్షికమైన సీబీఐ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగంపై కూడా ఆయన తీవ్ర ఆధారాలను బయటపెట్టారు. ఏకంగా 372 మందికి ఎలాంటి డీఎస్సీ పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రత్యేక జీవోలు ఇచ్చి, నియామకాలు పూర్తయ్యాక వాటిని ఉపసంహరించుకున్నారని మండిపడ్డారు. ముందుముందు ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. క్రీడల్లో ఎలాంటి అంతర్జాతీయ పతకాలు సాధించని వారికి కూడా స్పోర్ట్స్ కోటా కింద పోస్టింగులు

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) 'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు) మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు) బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ ఇదే నా సవాల్... బల్ల గుద్ది ఛాలెంజ్ విసిరిన జగన్ అవినీతి, అక్రమాల కోసమే డీఎస్సీలో శాప్ జోక్యం చేసుకుంది ఇంట్లో దొంగతనం చేసి అక్కడే హాయిగా నిద్రపోయిన దొంగ! ప్రియాంకని ఎందుకు చంపారు..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చింది. మండలిలోనూ చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో జగన్ హయాంలో గ్రూపు-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. వీటి పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. గ్రూపు -1 అక్రమాల పై సీబీఐ విచారణకు తాను సిద్దమని.. డీఎస్సీ పైనా సీబీఐ విచారణ చేయించటానికి చంద్రబాబు సిద్దమా అంటూ జగన్ సవాల్ చేసారు.డీఎస్సీ లో అక్రమాల పైన మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు తాము చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన వివరణలో అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో జగన్ హయాంలో అక్రమాలు జరిగాయని తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీని పైన స్పందించిన జగన్ తమ హయాలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే అంశం.. చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ చెప్పుకొచ్చారు. అయినా, దుష్ప్రచారం ఆపటం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1 చంద్రబాబు హయాంలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పారు. ఎన్నికల ముందు హడావుడిగా ఆయన విడుదల చేసారని.. తాము అధికారం చేపట్టకముందే ప్రిలిమ్స్ పూర్తయ్యాయని చెప్పారు. అందు లో పాస్ అయిన వారికి మెయిన్, ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!ప్రధానికి జగన్ లేఖగ్రూపు-1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ పేర్కొన్నారు. వాల్యుయేషన్ లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్పినట్లు వివరించారు. అయినా, తప్పుడు ప్రచారాలు చేసారన్నారు. గ్రూపు- పరీక్ష నిర్వహణ పైన సీబీఐ విచారణకు తాను రెడీ అని జగన్ ప్రకటించారు. 2025 డీఎస్సీ పై విచారణకు చంద్రబాబు సిద్దమా అని

డిఎస్సీ లీకేజీపై సీబీఐ డిమాండ్ ఒకే అధికారి బాధ్యతలపై ఆరోపణలు మంత్రి నారా లోకేష్ రాజీనామా YS Jagan: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు, ప్రశ్నపత్రం లీకేజీ జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ వ్యవహారంలో తాము లేవనెత్తిన అంశాలు వాస్తవమేనని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. TTD Board: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు.. టీటీడీ కీలక సూచనలు ఒకే అధికారికి బాధ్యతలే అక్రమాలకు మూలం: డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం వల్లే చెక్స్ అండ్ బ్యాలెన్స్ తప్పి స్కామ్‌కు దారితీసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ రావడం, ఆపై సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాకుతో అతడి పేరును రెండో మెరిట్ లిస్ట్ నుండి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించడం ప్రభుత్వ అక్రమాలకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. శాసనమండలి చర్చ నుంచి ప్రభుత్వం పలాయనం: శాసనసభలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం, శాసనమండలిలో మాత్రం డీఎస్సీ అక్రమాలపై చర్చించేందుకు భయపడుతోందని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తమను గుర్తించడం లేదని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రమే సొంతంగా ప్రచారాలు చేసుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక

స్థానిక ఎన్నికలకు పార్టీ సన్నద్ధం కూటమి పాలనపై జగన్ విమర్శలు ఏడాదిలో జగన్ పాదయాత్ర ప్రారంభం YS Jagan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యాధికారులతో జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన జగన్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించాలని స్పష్టం చేశారు. Konda Sushmitha: పరకాల బరిలో దిగేది నేనే.. కళ్ళు నెత్తికెక్కినయా.. సీఎం రేవంత్ కి కొండా సుస్మిత మాస్ కౌంటర్? కూటమి పాలనపై విమర్శలు, లా అండ్ ఆర్డర్ వైఫల్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని నిలబెట్టుకోలేకపోయిందని, రెండేళ్ల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు విజృంభిస్తున్నాయని దుయ్యబట్టారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక దారుణ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, కేసును తొక్కిపెట్టేందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ప్రభుత్వ విఫల విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైఎస్సార్సీపీ నేతలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలు, పాదయాత్రపై జగన్ ధీమా: గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి రౌడీయిజానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రజలు పోల్చి చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. నిత్యం జనంలో ఉంటూ ప్రజ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు

తాడేపల్లి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీ తరుఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు తుమాటి మాధవరావు. రేపు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం రేపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సంస్థాగత అంశాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన కేసీ కెనాల్ రైతులు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీ కెనాల్ రైతులు.. వైఎస్ జగన్‌ను కలిశారు. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై వైఎస్ జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయరులో 878 అడుగుల నీరు ఉన్నా సాగునీరు విడుదల చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు. మీ హయాంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నా నీటిని విడుదల చేశారంటూ వైఎస్ జగన్‌కు గుర్తు చేశారు రైతులు. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Assembly Session Today Agenda: ఆంధ్ర ప్రదేశ్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ సమావేశం కానుంది. ఈ భేటిలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది. అనంతరం వాటిని సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు శాసన సభ..ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానుంది. వడ్డీ లేని రుణ పరిమితి పెంపుతో పాటు స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు.. కొబ్బరి తోటల పరిస్థితి.. ఉన్నతి పథకం .. కాఫీ రైతులకు పరిహారం.. రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు ... విశాఖలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు.. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై సభ్యుల ప్రశ్నలుండన్నాయి. ఇక వెనకబడిన వర్గాలు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. అటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామిని కూడా క్యాబినేట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 24.15 శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి. వాటిని మరో 9.75 శాతం పెంపు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు.. అటు మున్సిపల్ కార్పోరేషన్లకు సంబంధించిన మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే బిల్లుకు క్యాబినేట్ ఆమోదం తెలిపి ఉభయ

"గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి సవాల్ విసురుతున్నా. డీఎస్సీ-2025పై చర్చకు నేను సిద్ధం. సభ లోపలైనా, బయటైనా సరే.. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి" అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో సుదీర్ఘ ప్రకటన చేసిన ఆయన, ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను బెయిల్‌పై లేనని, తనపై సీబీఐ, ఈడీ కేసులు లేవని, విదేశాలకు వెళ్లేందుకు తనకేమీ కోర్టు అనుమతులు అవసరంలేదని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుతాయని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని లోకేశ్ గుర్తుచేశారు. ఈ నియామక ప్రక్రియను కేవలం 148 రోజుల్లో పూర్తి చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, టీసీఎస్ అయాన్ వంటి సురక్షిత ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఈ డీఎస్సీని అడ్డుకోవడానికే వైసీపీ నాయకులు 141 కేసులు వేశారని, సీఎం తొలి సంతకం అమలు కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నారని ఆరోపించారు.ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రిమెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నపత్రం లీక్ అయిందన్నది అవాస్తవమని, 42 వేల ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్‌గా ప్రశ్నలు వస్తాయని, లీకేజీకి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రశ్నపత్రం

సాక్షి,తాడేపల్లి: పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పాలన ఏ స్థాయిలో కుప్పకూలిందో ఈ ఘటనే నిదర్శనం అంటూ ఫైరయ్యారు. చంద్రబాబూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించిన జగన్.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి?. ఎవరికి ఫిర్యాదు చేయాలి?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం (ఆగస్టు 17) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హే రామ్…! గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? చంద్రబాబు.. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది. ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని హితవు పలికారు.. సభలో ఎల్‌నినో అంశంపై చర్చించాలని సూచించారు. రఘువీరారెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని.. వారు సభకు దూరంగా ఉండటం సరికాదన్నారు.ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎష్ జగన్ అసెంబ్లీకి వెళ్లి ఎల్‌నినోపై సలహాలు ఇవ్వొచ్చన్నారు రఘువీరారెడ్డి. రాష్ట్రంలో రైతులు ఎల్‌నినో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చించి కేంద్రం సహకారంతో రైతుల్ని ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నినో దెబ్బకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని..వర్షాలు లేక రైతులు వేసిన పంటలు కనీసం మొలకెత్తలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్‌నినో గండం నుంచి రైతులను ఆదుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు రఘువీరారెడ్డి.తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపేయాలని రఘువీరారెడ్డి కోరారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాల వినియోగంపై చర్చిస్తే జలవివాదాలకు అవకాశం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ తుంగభద్రలో నీటి వాటాను అడగకపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యా వ్యవస్థలో సమస్యలపై విద్యార్థి గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తు్న్నామని.. యువత భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ మేధో నక్సల్స్ అన్న మాటను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు మాజీ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Monsoon Assembly Session: ఆంధ్ర ప్రదేశ్ వర్షకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. గతంలో మాదిరే వైసీపీ అసెంబ్లీకి రాకూడదనే నిర్ణయం తీసుకుంది. శాసనసభలో తగినంత బలం లేనందున తమ వాదనలు వినిపించుకోరనే ఉద్దేశ్యంతో అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు ఏపీ శాసన మండలిలో తగిన బలం ఉన్నందున అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందకు వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపణ నేపథ్యంలో ఈ సారి సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ , శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను దిశా నిర్ధేశం చేశారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో డిజిటల్ పాసులు.. కాగా ఈ సారి అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులకు డిజిటల్ పాస్‌లు జారీ చేశారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ప్రవేశం, నిష్క్రమణల వద్ద పాసుల స్కానింగ్ చేసిన తర్వాతే లోపలకి అనుమతిస్తారు. అంతేకాదు వెళ్లిటపుడు కూడా స్కానింగ్ చేయడం ద్వారా ఎవరు అసెంబ్లీ, మండలిలో ఎంత సేపు గడిపారనే విషయాన్ని నిర్ధారించుకోనున్నారు. ఎవరు వచ్చారు. ఎవరు వెళ్లారనే దానిపై క్లారిటీ కోసమే వీటిని జారీ చేయనున్నారు. అంతేకాదు మరోవైపు ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే అవకాశం కనిపిస్తున్న ఈ సభా సమరంలో సర్కార్‌ను కార్నర్ చేసేందుకు ప్రతిపక్షం, వైసీపీ దాడిని తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహప్రతివ్యూహాలు సిద్ధమయ్యాయి. మొదటిరోజే సభలో అసలైన రాజకీయం నడవనుంది. నిరుద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న మెగా డీఎస్సీ-2025పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలిరోజే సభలో సంచలన ప్రకటన చేయనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు ఎల్-నినో ప్రభావంపై లఘు చర్చతో సభను మొదటిరోజే రసవత్తరంగా మార్చేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది.గైర్హాజరైతే జీతాలు కట్.. స్పీకర్ సంచలన అస్త్రం!సభకు రాకుండా జారుకునే ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపై సభలో దొంగ హాజరులకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ-కెమెరాలు ఆటోమేటిక్‌గా ఆన్ అయి హాజరును రికార్డు చేసేలా డిజిటల్ కెమెరా టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇంతటితో ఆగకుండా, ప్రజాధనాన్ని వృథా చేస్తూ సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్ పరిధిలోనే కఠిన చట్టం తేవాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజలు గెలిపించింది సభలో కూర్చుని మాట్లాడటానికేనని, జగన్ బాధ్యతాయుతంగా అసెంబ్లీకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు.జగన్ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్! అసెంబ్లీకి రాకపోతే జీతం కట్గత అక్రమాలపై అటాక్.. నాలుగు రోజుల పొలిటికల్ డ్రామా!నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం పాత సర్కార్ పాపాలను ఎండగట్టేందుకు పక్కా అజెండాతో వస్తోంది. ఆగస్టు 18న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చ జరగనుండగా.. మూడో రోజు వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల స్కామ్‌ను బయటపెట్టేందుకు వ్యూహం రచించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, నాలుగో రోజు పెట్టుబడులతో పాటు సూపర్-6 హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించనుంది. మొత్తం 6 కీలక

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపర్చనున్నారు. అయితే, వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.మరోవైపు, ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికారపక్షం తన వాదనను వినిపించనుంది.స్పీకర్ ఆహ్వానం.. వైసీపీ తిరస్కరణసమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే, సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ నియోజకవర్గాల వాణిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యత అని, జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో, అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించి, తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించడం గమనార్హం.మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ శాసనసభ్యులతో ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Monsoon Assembly Session: ఈనెల 17 నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సారి సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి ఈ సారి కూడా హాజరుకాకూడదని ప్రతిపక్ష YSRCP నిర్ణయించింది. కేవలం మండలి సమావేశాలకు మాత్రమే హాజరవుతామంటోంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను ఆదేశించారు. కాగా ఈ సారి అసెంబ్లీ ఆవరణలో డిజిటల్ పాస్‌లు జారీ చేయనున్నారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద పాసుల స్కానింగ్ అనంతరమే ఎవరినైనా అనుమతిస్తారు. మరి ఈ సారి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఎల్లుండి జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సారి కొన్ని కీలకమైన బిల్లును పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సభలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయా బిల్లులు పాసయ్యే అవకాశాలున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు. దేశ నిర్మాణానికి మూలస్తంభాలైన ప్రజాస్వామ్య సూత్రాలకు మనమందరం పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు."ఈ 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ, మన గొప్ప దేశాన్ని నిర్మిస్తున్న ప్రజాస్వామ్య విలువలకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని, ఉజ్వలమైన, సమ్మిళితమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం మనమందరం కృషి చేయాలి" అని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. 'జై హింద్' అంటూ తన సందేశాన్ని ముగించారు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనలు చేపట్టిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.జగన్ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ, వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా భారీ ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఈ నిబంధనల అతిక్రమణపై స్పందించిన పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే, పర్యటనలో భాగంగా దిష్టిబొమ్మను దహనం చేసిన వైసీపీ నేత సుభాష్ చంద్రబోస్ సహా ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది.వీటితో పాటు, "గంగమ్మ జాతర" ప్లకార్డులను ప్రదర్శించిన కొందరు కార్యకర్తలను కూడా ఈ కేసుల్లో చేర్చారు. పర్యటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన మరికొంత మందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి

ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, కనీసం డీఎస్సీ నోటిఫికేషన్ వేయని వైసీపీ నేతలు ఇప్పుడు డీఎస్సీ అక్రమాల పేరుతో నిత్యం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు ప్రజా సమస్యలపై నిజంగా గౌరవం, ధైర్యం ఉంటే సభకు దూరంగా ఉండటం మాని వెంటనే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విషం చిమ్ముతోందని యరపతినేని మండిపడ్డారు. ఎంపికైన డీఎస్సీ విజేతలు స్వయంగా వచ్చి నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా జరిగిందని చెబుతున్నా ప్రతి విషయాన్ని చెడుగా చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నాయకత్వంలో ఇంకా మార్పు రాకపోవడం విచారకరమన్నారు. నిత్యం శవ రాజకీయాలు చేస్తూ పరామర్శల పేరుతో వ్యవస్థలను, పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ హయాంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన వైసీపీ నేతలు, కూటమి ప్రభుత్వంపై అలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దళిత వర్గానికి చెందిన మహిళా హోం మంత్రిని అవమానించడం రాజకీయ సంస్కారానికే మచ్చ అని అన్నారు. నంద్యాలలో నాడు చంద్రబాబును కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిన చరిత్ర ఉన్న జగన్, ఇప్పుడు తమ పార్టీ నేత విరూపాక్షికి నోటీసులు ఇవ్వాలని చెప్పడం ఆయన ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి పోకడలు పోతున్న వైసీపీ త్వరలోనే రాజకీయాల నుంచి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని యరపతినేని వ్యాఖ్యానించారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఐదేళ్లు డీఎస్సీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈరోజు(శుక్రవారం) గుంటూరు జిల్లా వేదికగా యరపతినేని మీడియాతో మాట్లాడారు. మంచిని చెడుగా చూపడం వైసీపీ నైజంగా కనిపిస్తోందని యరపతినేని విమర్శించారు. డీఎస్సీ విజేతలు స్వయంగా వచ్చి అంతా సజావుగా జరిగిందని చెప్పారని ప్రస్తావించారు. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధిపై వైసీపీ విషం చిమ్ముతోందని ఆగ్రహించారు. వైసీపీ వంటి రాజకీయ పార్టీ ఉండటం ఏపీకి దురదృష్టమని చెప్పారు. వై నాట్ 175 నుంచి 11 సీట్లు వచ్చినా వారిలో ఆలోచన రావటం లేదని విమర్శించారు. వైసీపీ నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రోజూ ఎక్కడ శవం దొరుకుతుందా అని వారు ఎదురు చూస్తున్నారని యరపతినేని సెటైర్లు గుప్పించారు. పరామర్శ పేరుతో వ్యవస్థలు ధ్వంసం చేసి, ప్రజలను పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా అని నరికి 11కు వచ్చారని.. ఇంకా ఏం నరుకుతారని యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిన్న(గురువారం) కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి (Venu Gopal Reddy) స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫొటోను తీసుకొని ములాఖత్‌కు అనుమతించామని స్పష్టం చేశారు. ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం హోదాకు భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. ఆయన ఫొటో కూడా అలాగే తీసుకున్నామని వెల్లడించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములను కలుస్తానని జగన్ కోరారని తెలిపారు. ఈ- ప్రిజన్స్ సాఫ్ట్వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలుస్తానంటే అన్నిసార్లు ఫొటో తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే మాజీ సీఎం జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. ఏ అధికారి, సిబ్బంది జగన్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్

ఏపీలో కూటమి సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)ను కట్టడి చేసేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్.. జిల్లా జైల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ లో కలిశారు. అయితే ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో జగన్ కూడా దీనిపై షాకయ్యారు. అనంతరం జైలు బయటికి వచ్చిన జగన్.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైసీపీపై దాడికి టీడీపీకి చంద్రబాబు కొత్త అస్త్రం..! మంత్రులకు క్లియర్..!జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్ .. తాను ఓ మాజీ ముఖ్యమంత్రిని అని, తనను అవమానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో లోపలికి వెళ్లేందుకు లోపలికి వెళ్లేందుకు కెమెరాతో ఫొటో తీసుకుంటారని, అలాగే తనను కూడా తీసుకుంటారని భావించినట్లు తెలిపారు. ఎవరినైనా లోపలికి అనుమతించేందుకు లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫొటో తీసుకుంటారని, కానీ తనను గ్రిల్ బయట నిలబెట్టి ఫొటో తీసుకుని పంపారన్నారు. చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వం అలా ఉందన్నారు. తాను జైలు అధికారుల్ని అందరినీ ఇలాగే ఫొటో తీస్తారా అని అడిగానని, కానీ వారు మాత్రం పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తనకు చెప్పారన్నారు. ఏపీలో డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్- ఇక 10 మంది అక్కర్లేదు..!తమ ప్రభుత్వ హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని జగన్ గుర్తుచేసారు. ఎవరైనా స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని కూర్చోబెట్టి చిరునవ్వుతో ఫిర్యాదు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. కానీ ఇక్కడ మాత్రం అవమానించేలా చేశారన్నారు. జైలు అధికారులని తాను అడిగితే.. తనను నిలబెట్టి ఫొటో తీయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారని జగన్ తెలిపారు. రేపు పొద్దున్న ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని, ఏదయితే విత్తుతున్నారో అవే పండ్లు అవుతాయన్నారు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, పాపాలు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నివేదిక ద్వారా బట్టబయలయ్యాయని, వీటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. గురువారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిట్ నివేదికలో వెలుగు చూసిన వాస్తవాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు.సిట్ నివేదిక ప్రకారం, వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొన్న 158 మంది వాల్యుయేటర్లలో కేవలం 72 మందికి మాత్రమే అర్హత ఉందని, మిగిలిన వారంతా అనర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. అధికారిక వ్యవస్థను కాదని, ప్రైవేట్ జీమెయిల్ ఖాతాలు, వ్యక్తిగత ఐడీలు, డ్రైవ్‌ల ద్వారా వాల్యుయేషన్ నిర్వహించడం దారుణమని అన్నారు. అంతేకాకుండా, అభ్యర్థుల ఆన్సర్ షీట్లను ఓ ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించి, సీసీ కెమెరాలు గానీ, యూనివర్సిటీ నిపుణుల పర్యవేక్షణ గానీ లేకుండా 86 రోజుల పాటు అక్కడే ఉంచి మూల్యాంకనం జరిపారని ఆరోపించారు.ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 160 మంది (96.97 శాతం) ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు జరిగాయని, మొత్తం 736 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తే 97.55 శాతం షీట్లలో దిద్దుబాట్లు కనిపించాయని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో వైట్నర్ వాడకం, సంతకాలు సరిపోకపోవడం, ఒకే పేపర్లో రెండు రకాల ఇంక్ వాడటం, చీఫ్ ఎగ్జామినర్ సంతకాలలో తేడాలు వంటి అనేక అక్రమాలు తేలాయని వివరించారు. ఇవి

సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్‌బుక్ అరాచకానికి తెరలేపింది. మాజీ సీఎం జగన్‌ను అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు. ..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్‌పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్.. రచించిన కుట్ర రాజకీయాలు బాబు పై జగన్ ఫైర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే? LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET

కర్నూలు జిల్లా కేంద్ర జైలు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) జైలు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా ఆంక్షలు విధించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జగన్‌ను చూసేందుకు మరియు ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకుని వెనక్కి పంపేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఈ తీరుపై వైప్యాసార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా కారణాలను అడ్డుపెట్టుకుని కర్నూలు జైలు పరిసరాల్లో పోలీసులు అసాధారణ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేస్తూ నో-ఎంట్రీ జోన్‌గా ప్రకటించారు. అంతేకాకుండా, జైలుకు వెళ్లే రహదారుల వెంబడి ముళ్లకంచెలు (Barricades) ఏర్పాటు చేసి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముందస్తు అనుమతి ఉన్న కొద్దిమంది నేతలను తప్ప సామాన్య కార్యకర్తలను, అభిమానులను జైలు దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జైలు వద్ద విధుల్లో ఉన్న సీఐ తేజోమూర్తి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనల పేరుతో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను సైతం ఆయన అడ్డుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి సతీమణికి చెందిన వాహనాన్ని జైలు పరిసరాల్లోకి అనుమతించకుండా సీఐ తేజోమూర్తి వెనక్కి పంపించివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పట్ల కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి మరియు భయానక వాతావరణాన్ని సృష్టించడానికే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి

శాసనసభలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని, అందువల్ల సభలో చేయగలిగింది ఏమీ లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) వ్యాఖ్యానించారు. శాసనసభలో తాను చెప్పదలచుకున్న వాటిపై ప్రెస్మీట్లలో మాట్లాడతానన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాల నేపథ్యంలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీల (MLCs)తో సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, పీపీపీ, ఫీజు రీయింబర్స్మెంట్, దిశ, వైసీపీ నేతల అరెస్టులు, విజన్-2047, శ్వేతపత్రాలు తదితర అంశాలపై మండలిలో మాట్లాడాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. డీఎస్సీ-2025నే ప్రధాన ఎజెండా అని, దీనిపై శాసనమండలిలో గట్టిగా మాట్లాడాలని జగన్ వెల్లడించారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రాజీనామా చేయాల్సిందే. సీబీఐ దర్యాప్తు జరగాలి. ఈ అంశాలపై గట్టిగా నిలదీయండి అని ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. డీఎస్సీ (DSC) పై శాంతియుతంగా ర్యాలీలు చేసినవారిపై కేసులు పెట్టారని ఆరోపించారు. దీనిపై కోర్టులను ఆశ్రయిస్తామన్నారు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముందుగా మున్సిపల్ తరువాత జిల్లా పరిషత్ ఎన్నికలకు వీలుగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ల సంఖ్య పెంపు దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్తగా 15 జెడ్పీలు ఏర్పడనున్నాయి. దీంతో.. ఈ నిర్ణయం రాజకీయంగా పార్టీల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో స్థానిక ఎన్నికల దిశగా వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కేడర్ కు ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేస్తున్నాయి. ముందుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల కు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం ఖరారు తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అక్టోబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో 15 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాకో జడ్పీ ఏర్పాటుకు ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్‌ల పునర్విభజన చేపట్టనున్నారు. దీంతో.. మొత్తం 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబరు 24వ తేదీతో అన్ని జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు, జడ్పీటీసీల పదవీకాలం, అంతకుముందు రోజే ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగియనుండటంతో.. ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!తాజా కసరత్తు.. కీలక నిర్ణయాలుకాగా.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే లోగా జిల్లా పరిషత్‌ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత కసరత్తులో భాగంగా పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటిని ప్రభుత్వానికి పంపి క్యాబినెట్ ఆమోదం తీసుకోవల సి

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో చర్చించిన కీలక అంశాలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. డీఎస్సీ నియామకాల స్పోర్ట్స్ కోటాలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆధారాలున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బొత్స ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, ఈ అంశంపై శాసనమండలిలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా సీఎం చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు, ప్రజా సమస్యలన్నింటినీ అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతామన్నారు. 40 శాతం ఓటు షేర్ సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు. చట్టసభల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. YS Jagan AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమావేశాల వ్యూహం, పార్టీ ఎమ్మెల్యేల హాజరు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నియామకంపై జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా చర్చించి స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు - జగన్ వ్యూహం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల తమ గొంతు నొక్కుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు హాజరుకావచ్చని ఆయన సూచించారు. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే క్రమంలో.. శాసనమండలిలో డీఎస్పీ (DSC) నియామకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law & Order) తీరుపై తీవ్రంగా చర్చించాలని ఎమ్మెల్సీలను జగన్ ఆదేశించారు. అయితే సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వేటు వేస్తుందనే ప్రచారంపై స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జకియా ఖానం పదవీకాలం ముగియడంతో, ఆ స్థానానికి కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న వైఎస్ జగన్.. ఈ పదవికి తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనప్రాయం కానుంది. మండలిలో పార్టీ
.webp)
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..! ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వహణ వేళ రాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ శాసనసభాపక్ష (వైసీపీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. చట్టసభల్లో ప్రతిపక్షంగా తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితోనే శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ, శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) సమావేశాలకు మాత్రం విధిగా హాజరుకావాలని వైఎస్సార్సీపీ తీర్మానించింది. మండలి వేదికగానే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ప్రజా సమస్యలపై నిలదీయాలని నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అదేవిధంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా వైఎస్సార్సీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ కీలక వర్గాలు స్పష్టం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి నడుమ తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. చట్టప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైఎస్సార్సీపీ నాయకులు మొదటి నుంచీ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, శాసనసభలో సంఖ్యాబలం ప్రకారం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని అధికార పక్షం తేల్చిచెబుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీని బహిష్కరించి, తమకు మెజారిటీ ప్రాతినిధ్యం ఉన్న శాసనమండలి వేదికగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. వైఎస్సార్సీపీ వైఖరిపై అధికార కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా సభను బహిష్కరించడం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. ఆగస్ట్ 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుజరగనున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, అజెండా ఏమిటనే దానిపై.. ఆగస్ట్ 17వ తేదీ నిర్వహించే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చట్టసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ నేతలకు సూచించారు.అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ.. ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. అయితే శాసన మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును వైసీపీ ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం వివరాలను వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశాల్లో వెల్లడించారు. డీఎస్సీ అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందన్న బొత్స సత్యనారాయణ.. చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలన్న బొత్స.. 40 శాతం ఓట్లు సాధించిన వైసీపీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించడం లేదని.. వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని విమర్శించారు. మరోవైపు ఈసారి సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జిల్లాల అభివృద్ధి, అమరావతి, మెగా డీఎస్సీ, పరిశ్రమలు- పెట్టుబడులు, భోగాపురం విమానాశ్రయం వంటి అంశాలపై