
Aug 13 2026 5:23 PM | Updated on Aug 13 2026 5:46 PM
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్‌బుక్ అరాచకానికి తెరలేపింది. మాజీ సీఎం జగన్‌ను అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు.
..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్‌పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)
'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు)
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్..
రచించిన కుట్ర రాజకీయాలు బాబు పై జగన్ ఫైర్
ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే?
LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET





