
Yash : మనసు మార్చుకున్న యష్.. మరోసారి ఆ చిత్రంపైనే ఆశలు?
టాక్సిక్ (Yash) సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయిన యష్ ఇప్పుడు తన కెరీర్లో మరోసారి KGF మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
© 2026 nimisham.in

టాక్సిక్ (Yash) సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయిన యష్ ఇప్పుడు తన కెరీర్లో మరోసారి KGF మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Yash Thakur: హర్షిత్ రాణా స్థానంలో యశ్ థాకూర్.. ఆఫ్ఘన్‌తో సిరీస్‌కు బుమ్రా ఫిట్

Hero Yash: టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్.. అది వాళ్ల ఇష్టం అంటూ

Yash | ‘టాక్సిక్’ ఫలితంపై యశ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ‘ప్రేక్షకులకే వదిలేయండి’ అంటూ కీలక వ్యాఖ్యలు!
Yash: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌పై హీరో యశ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
Yash: నిర్మాత అత్యాశతో రూ.120 కోట్లు నష్టం... దారుణంగా పడిపోయిన ‘టాక్సిక్’ ఓటీటీ డీల్?

సీరియల్ నటి కావ్యశ్రీ తాజాగా ఓ షో కోసం ఇలా అందంగా ముస్తాబయి మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యశ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’. కన్నడ సినిమా పరిశ్రమను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) కెరీర్లో ఇప్పుడు ఒక కీలక మలుపు వచ్చింది. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’ (Toxic). మొదట్లో ఈ సినిమాపై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాన్స్‌ల కారణంగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. కో ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా కూడా యశ్ ఈ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే, థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి, ఐదు వందల కోట్ల థియేట్రికల్ రైట్స్ వ్యాపారం జరిగింది. వరల్డ్ వైడ్‌గా మూడు వందల ఐదు కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, పెట్టిన పెట్టుబడి దృష్ట్యా ఈ చిత్రం సేఫ్ జోన్‌కి చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా సినిమాలో మోతాదు మించిన యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేశాయి. దీనివల్ల సోషల్ మీడియాలో ఈ చిత్రంపై కొంత ట్రోలింగ్ కూడా నడిచింది. రీసెంట్గా జీ5 సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకోగా, ఇప్పుడు అందరి దృష్టి యశ్ నటిస్తున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana) వైపు మళ్ళింది. ప్రస్తుతం యశ్ కెరీర్‌ను పూర్తిగా మలచగల సత్తా ఉన్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్లో దాదాపు నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో యశ్ అత్యంత శక్తివంతమైన పాత్ర అయిన రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్‌మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ
సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సినిమా కంటే ముందు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఎవరికీ తెలియదంటూ ఆయన చేసిన కామెంట్స్ కన్నడ అభిమానులతో పాటు టాలీవుడ్‌లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ సంచలన వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎంట్రీ ఇచ్చి అల్లు అరవింద్‌కు గట్టి మద్దతు తెలిపారు. అరవింద్ అన్న మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆర్జీవీ విశ్లేషించారు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన కథలు నటీనటులను రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్లుగా నిలబెడతాయని ఆయన పేర్కొన్నారు. అరవింద్ చెప్పిన విశ్లేషణను సాధారణ కోణంలో చూడాలని, అందులో ఎలాంటి వివాదం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ కొన్ని ఆసక్తికర ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. ‘బాహుబలి’ లాంటి వండర్ రాకముందు బాలీవుడ్ లేదా ఉత్తరాది ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా తెలియదని, అలాగే ‘కాంతార’ సినిమా సంచలనం సృష్టించే వరకు రిషబ్ శెట్టి ఇమేజ్ పరిమితంగానే ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. అదే క్రమంలో ‘కేజీఎఫ్’ విజయంతోనే యశ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరిందనే ఉద్దేశంతోనే అరవింద్ ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. హాలీవుడ్ స్థాయి విశ్లేషణను జోడిస్తూ, మార్లన్ బ్రాండో నటించిన ‘గాడ్‌ఫాదర్’ లేదా క్రిస్టోఫర్ నోలన్ తీసే సినిమాల్లో నటుల ఇమేజ్ కంటే కథా బలమే ప్రధాన పాత్ర పోషిస్తుందని వర్మ అన్నారు. ఒక మంచి అభిప్రాయాన్ని సున్నితంగా చెప్పినప్పుడు దానిని అర్థం చేసుకోకుండా అహంకారంతో ఆలోచించే వారే వ్యక్తిగతంగా తీసుకుని వివాదాలు సృష్టిస్తారని ఘాటుగా విమర్శించారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కన్నడ వర్సెస్ టాలీవుడ్ తరహాలో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న వేళ ఆర్జీవీ ఇచ్చిన ఈ వివరణ కొత్త చర్చకు తెరలేపింది. ఇండస్ట్రీలో ఒక నిజమైన

Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యశ్‌కు బలమైన మార్కెట్ ఉన్న సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సొంత రాష్ట్రంలో మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. హీరోకు ఉన్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా తొలి వారంలోనే భారీ వసూళ్లు నమోదవుతుంటాయి. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ సినిమా కనీసం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యశ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్క్‌ను ‘టాక్సిక్’ సులభంగా అందుకుంటుందని చాలామంది అంచనా వేశారు. కానీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచే గణనీయమైన డ్రాప్‌ను చూసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం సినిమా థియేట్రికల్ రన్‌పై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కర్ణాటకలో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌ను అందుకోవాలనే టార్గెట్‌ను ‘టాక్సిక్’ చేరుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి హిందీ మార్కెట్లో మాత్రం సినిమాకు కొంత ఊరట లభించినట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందీ బెల్ట్‌లో ‘టాక్సిక్’కు మెరుగైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అక్కడి నుంచి వస్తున్న వసూళ్లు సినిమాకు కొంత బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు. ఇక తెలుగులోనూ ‘టాక్సిక్’కు తొలి రోజు సాలిడ్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షోలు క్యాన్సిల్ అయ్యే
Yash Baxi World Record 2026 : ఏ చిన్న లెక్క చేయాలన్నా ఇప్పడందరూ ఫోన్లోనే కాలుక్యులేటర్ ఓపెన్ చేసి లెక్కించేస్తారు. లేదంటే ఏఐ, గూగుల్ సాయంతో తమకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు. కానీ మనసులోనే 120 దేశాల్లో ఎక్కడెంత టైమ్ అవుతుందని కేవలం 5 నిమిషాల్లోనే చెప్పి ప్రపంచ రికార్డు సాధించాడు అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువకుడు. 21 ఏళ్ల వయసు కల్గిన యశ్ హేమాంగ్ బక్షి ఈ రికార్డును సాధించగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి డివైజ్‌లు, చార్టులు, కనీసం కాగితం సహాయం లేకుండా కేవలం తన మెదడు శక్తితోనే 120 దేశాల స్థానిక సమయాన్ని 5.14 నిమిషాల వ్యవధిలోనే లెక్కించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. ప్రపంచంలోని వివిధ కాలమానాలు, అర్ధగంట, 45 నిమిషాల తేడాల వ్యత్యాసాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో గణించి అందరినీ ముగ్ధులను చేశాడు.పాత రికార్డును తిరగరాసిన యష్ బక్షి..!గతంలో భారత ప్రమాణ సమయం ఆధారంగా 101 దేశాల స్థానిక సమయాన్ని 14 నిమిషాల 42 సెకన్లలో లెక్కించి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లలో యశ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈసారి తన స్వంత రికార్డునే తిరగరాస్తూ.. ఏకంగా 120 దేశాల సమయాన్ని కేవలం 5.14 నిమిషాల్లోనే చెప్పి సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు. 'వరల్డ్ రికార్డ్ యూనియన్' ప్రతినిధి షరీఫా హనీఫా ఈ ఘనతను స్వయంగా పరిశీలించి అధికారికంగా ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. అబ్బురపరుస్తోన్న హైదరాబాదీ ఫ్యామిలీయశ్ సాధించిన ఈ అరుదైన మైలురాయి వెనుక ఆయన గురువు కమలేష్ సుర్తి ఎంతో శ్రమించారు. గత కొన్నేళ్లుగా యశ్‌కు శిక్షణ ఇస్తున్న కమలేష్ సుర్తి.. బట్టీ పట్టే విధానం కాకుండా విద్యార్థులలోని సహజ ప్రతిభను గుర్తించి దానికి తగిన శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధులు. "యశ్

కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన సినిమా 'టాక్సిక్'. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్లు, బోల్డ్ సన్నివేశాలు తప్పితే ఆకట్టుకునే కంటెంట్ లేదని రివ్యూయర్లు తేల్చేశారు. దీంతో మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించిన టాక్సిక్ మూవీ రెండో రోజు నుంచి ఎదురీదడం ప్రారంభించింది. ఈ సంగతి పక్కన పెడితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని టాక్సిక్ సినిమాకు రేటింగ్ ఇచ్చాడన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లెటర్ బాక్స్ డీ అనే ఖాతాలో పలు సినిమాలకు రేటింగ్ ఇచ్చాడు గౌతమ్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషా సినిమాలకు కూడా గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. అందులో తన తండ్రి మహేష్ బాబు నటించిన సినిమాలు కూడా ఉండడం గమనార్హం. మహేష్ బాబు నటించిన 'పోకిరి', '1: నేనొక్కడినే' సినిమాలకు గౌతమ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో 'నిజం', 'వంశీ' చిత్రాలకు 2 స్టార్ రేటింగ్ ఇవ్వగా.. 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాడు. అలాగే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రవితేజ ఇరుముడి సినిమాకు 3 రేటింగ్ ఇచ్చాడీ స్టార్ కిడ్. ఇదే క్రమంలో యశ్ నటించిన టాక్సిక్ మూవీకి ఏకంగా 0.5 రేటింగ్ ఇచ్చాడు గౌతమ్. ఇప్పుడిదే విషయం టాలీవుడ్, శాండల్ వుడ్ లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ లెటర్ బాక్స్ డీ ప్రొఫైల్‌లో దాదాపు 400కు పైగా సినిమాలకు రేటింగ్స్ ఇచ్చాడు గౌతమ్. హాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్స్ 'ది ఒడిస్సీ', 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రదర్శించబడుతోంది. అయితే, యశ్ నటనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నప్పటికీ... మేకింగ్, స్క్రీన్‌ప్లేపై మిశ్రమ స్పందన, విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీశ్ సోషల్ మీడియా వేదికగా యశ్‌కు మద్దతు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. "యశ్, నువ్వు ఏ విషయానికీ భయపడకుండా ధైర్యంగా నీ సొంత బాటలో ఇక్కడి దాకా వచ్చావు. ఈ సినిమాలో నీ నటన నిజంగా అద్భుతం. నీ కెరీర్లో ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. 'టాక్సిక్' బహుశా ఇప్పుడు రావాల్సిన చిత్రం కాదేమో, కాలంకంటే ముందే వచ్చిన సినిమా కావచ్చు. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, లేదా ఈ చిత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారే నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. విజయం ఎప్పుడూ పక్కవారికి అసూయను కలిగిస్తుంది. ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోకు, భవిష్యత్తులో 'కేజీఎఫ్' కంటే పెద్ద హిట్ సాధించి మళ్లీ ఘనవిజయం సాధిస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని రాసుకొచ్చారు. మరోవైపు కాంతార ఫేమ్, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కూడా యశ్‌కు అండగా నిలిచారు. 'టాక్సిక్' సినిమా ఒక సాహసోపేతమైన ప్రయోగమని... కన్నడ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలనే యశ్ తపనను తాము ఎంతగానో గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు యశ్ ప్రయత్నాన్ని సమర్థిస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు

ఒకప్పుడు ఒక్క చాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు... వెళ్లిన ప్రతి ఆడిషన్‌లోనూ ‘రిజెక్ట్’ అనే మాట విని విసిగిపోయిన క్షణాలు... కానీ ఇవాళ అదే నటి, ఒకే ఒక్క పాత్రతో సినిమా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఆ నటి మరెవరో కాదు, కియారా అద్వానీ. 'టాక్సిక్' సినిమాలో ఆమె పోషించిన 'నాడియా' పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 'టాక్సిక్' సినిమాలో కియారా అద్వానీ చేసిన నాడియా పాత్ర మామూలు పాత్ర కాదు. సినిమా మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఒకరకమైన క్యూరియాసిటీని పెంచే ఈ క్యారెక్టర్, కథ ముందుకు సాగేకొద్దీ మరింత బలంగా మారుతుంది. నాడియా పాత్రకు కియారా ప్రాణం పోసిందని చెప్పొచ్చు. సర్కస్ ఆర్టిస్ట్‌గా, ప్రేయసిగా, స్నేహితురాలిగా, తల్లిగా... చివరికి ప్రేమలో విఫలమైన మహిళగా నాడియా ఎన్నో భావోద్వేగాలను పండిస్తుంది. ఈ షేడ్స్ అన్నింటినీ కియారా అద్వానీ చాలా సున్నితంగా, అద్భుతంగా పండించారు. కియారా నటనలో ఉన్న అసలు బలం డైలాగులు కాదు, ఆమె కళ్లే అని చెప్పొచ్చు. సంతోషం, బాధ, భయం, నిస్సహాయత, ప్రేమ... ఇలా ప్రతి ఎమోషన్‌ను కళ్ల ద్వారానే ప్రేక్షకులకు చేరవేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కొడుకు ముందు నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకునే సీన్ అయితే కియారా నటనకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ ఒక్క సీన్లోనే నాడియా పాత్ర పడుతున్న బాధ, నిస్సహాయత, అంతర్మథనం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. 'టాక్సిక్'లో నాడియా పాత్ర స్క్రీన్ టైమ్ ఎంత ఉన్నా, ఆ క్యారెక్టర్ ప్రభావం మాత్రం సినిమా చివరి వరకు ఉండేలా కియారా చేసింది. కథలోంచి ఒక దశలో ఆ పాత్ర నిష్క్రమించినా, 'నాడియా' అనే పేరును ప్రేక్షకులు మర్చిపోకుండా చేయడంలో ఆమె నటన కీలక పాత్ర పోషించింది. రాయన్ లాంటి క్రూరమైన వ్యక్తితో ప్రేమలో పడటం, అతని బిడ్డకు తల్లి కావడం, చివరికి తను లేకపోయినా రాయన్ మనసులో ఒక భ్రమగా, జ్ఞాపకంగా మిగిలిపోవడం

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఈక్వెషన్ యష్ విషయంలో శృతి తప్పింది. యష్ హోమ్ స్టేట్ కర్ణాటకలో టాక్సిక్ కి తగిలిన షాక్ ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. షాక్ కి గురి చేయడమే కాదు ఎందుకు ఇలా అనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. యష్ కి ఉన్న క్రేజ్, మాస్ ఇమేజ్‌ని బట్టి కర్ణాటకలో టాక్సిక్ చాలా తేలికగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరుతుందని అందరూ ఆశించారు. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా వచ్చిన . 140 కోట్ల గ్రాస్ లో కర్ణాటకలోనే దాదాపు 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డుల బోణీ కొట్టింది. కానీ, రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కర్ణాటకలో ఎలాంటి సినిమా లేకపోయినా కూడా ప్రేక్షకులు టాక్సిక్ థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కర్ణాటక థియేట్రికల్ రన్లో కనీసం 100 కోట్ల గ్రాస్ మార్జిన్ అందుకోలేక చేతులెత్తేసింది. అయితే ఉత్తరాది హిందీ బెల్ట్‌లో మాత్రం ‘టాక్సిక్’ అద్భుతమైన ప్రదర్శనతో ఊరటనిస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే బాలీవుడ్ మార్కెట్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కుతుండటం విశేషం. హిందీ బెల్ట్‌లో తొలి రోజే ఏకంగా 55 కోట్ల మేర సాలిడ్ కలెక్షన్లు సాధించి, సౌత్ ఇండియా సినిమాల్లోనే హిందీ వెర్షన్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా కంటెంట్‌కి, యశ్ స్క్రీన్ ప్రజెన్స్‌కి బ్రహ్మరథం పడుతుండటంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ పరిస్థితిని పరిశీలిస్తే మరో రకమైన షాకింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగులో మొదటి రోజు 20.1 కోట్ల గ్రాస్ సాధించి సాలిడ్ ఓపెనింగ్ తెచ్చుకున్నప్పటికీ, రెండో రోజు నుంచే థియేటర్లలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆడియన్స్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో పలు థియేటర్లలో షోలు రద్దయ్యే పరిస్థితులు కూడా చూసింది

ఇంటర్నెట్ డెస్క్: ‘టాక్సిక్’ భారీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. యశ్ నటనను ప్రశంసిస్తున్నప్పటికీ.. సినిమా మేకింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత ఈ సినిమాపై స్పందించారు. తాను టాక్సిక్ (Toxic) చూశానని.. యశ్‌కు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘యశ్.. నువ్వు ఏ విషయానికీ భయపడకుండా ధైర్యంగా ఇక్కడి దాకా వచ్చావు. ఈ సినిమాలో నీ నటన అద్భుతం. నీ కెరీర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. నువ్వు ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తివి. వివేకంతో ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా అలానే ఆలోచించు. దీనిపై వచ్చే విమర్శలను పట్టించుకోకు. బహుశా ‘టాక్సిక్’ ఇప్పుడు రావాల్సిన చిత్రం కాదేమో.. భవిష్యత్తులో విడుదలవ్వాల్సిందేమో. నీ (Yash) ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, ఈ చిత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు దీన్ని ట్రోల్ చేస్తున్నారు. మన విజయం పక్కవారికి అసూయగా ఉంటుందని గమనించు. భవిష్యత్‌లో ‘కేజీఎఫ్’ను మించిన హిట్ అందుకుంటావని ఆశిస్తున్నా’’ అని తన పోస్ట్‌లో సుమలత (Sumalatha) రాసుకొచ్చారు. ఇటీవల రిషబ్ శెట్టి (Rishab Shetty) కూడా యశ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ‘టాక్సిక్’ ఒక సాహసోపేతమైన ప్రయోగమని అన్నారు. యశ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ‘కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న నీ తపనను మేం ప్రేమిస్తున్నాం’ అని యశ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. విజయవంతమైన ‘కల్కి 2898ఏడీ’కి కొనసాగింపుగా

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్‌కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్‌లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో

భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా.. లెనిన్ విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే. విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం.. ఫిల్మ్ ఫెడరేషన్, రఘు వర్గానికి సుమలత వార్నింగ్.! సందీప్ సరోజ్, సాత్విక జంటగా ప్రారంభమైన ‘వేట’.!

యష్ హీరోగా రూపొందిన “టాక్సిక్’ (Toxic) సినిమా భారీ ఫ్లాప్ గా మిగిలిపోనుంది. మొదటి వీకెండ్ రెండు వందల కోట్ల వసూళ్లు కనిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా అమ్మిన రేట్స్, పెట్టిన బడ్జెట్ ని చూస్తే నిర్మాతకు కోలుకోలేనంత నష్టాన్ని మిగల్చడం గ్యారెంటీ. ఇప్పటికే తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో దీని ఫలితం ఏంటో అందరికీ అర్థమైంది. హిందీలో, కన్నడలో కాస్త ఫర్వాలేదు అన్నట్లుగా ఉంది. అదీ కూడా మొదటి వీకెండ్ వరకే. ఆ తర్వాత ఎక్కడా ఏమి ఉండదు, అన్ని చోట్లా భారీ ఫ్లాప్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. మొదటి వీకెండ్ తర్వాత ఎంత నష్టం అనేది తేలుతుంది. ఐతే, కన్నడ హీరోలు మాత్రం యష్ ఫ్లాప్ ని సెలెబ్రేట్ చేసుకోవడం లేదు. అతనికి మద్దతు తెలుపుతున్నారు. తమ సినిమా రంగం మార్కెట్ విస్తృతి పెంచేందుకు యష్ ప్రయత్నించినట్లుగానే వారు పరిగణిస్తున్నారు. ఆ ప్రయత్నంలో విఫలం అయ్యాడు అనే సానుభూతి చూపుతున్నట్లు కనిపిస్తోంది. యష్ కి మద్దతు తెలిపిన హీరోల్లో రిషబ్ శెట్టి, సుదీప్ ఉన్నారు. ఇద్దరూ యష్ ని పొగిడారు. ఇలాంటి సినిమా తీయాలనుకోవడం, చేయాలనుకోవడం చాలా డేరింగ్ స్టెప్ అని అన్నారు. యష్ ప్రయత్నంలో తప్పు లేదన్నారు. ఫలితం పక్కన పెడితే అతని కష్టం, అతని విజన్ ని అభినందించాలి అని అన్నారు. మరో అగ్ర హీరో శివరాజ్ కుమార్ ఇంకా ఏమి మాట్లాడలేదు. కానీ విడుదలకు ముందే ఈ సినిమాకి సపోర్ట్ ఇచ్చారు

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారాడు సాయి అభ్యంకర్. డైరీలో మైల్డ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆల్బమ్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఈ యంగ్ బాయ్. ఇండిపెండెంట్స్ సాంగ్స్ కోసం రైజింగ్ అండ్ యూత్‌లో అటెన్షన్ పే చేస్తున్న బ్యూటీల్నే గ్రాబ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తమిళంలో క్లికైన భామలే అతడి టార్గెట్. ఆసా కూడాలో ప్రీతి ముకుందన్తో స్టెప్పులేయించిన సాయి.. ఆ తర్వాత సితిరి పుత్తిరిలో మీనాక్షి చౌదరిని పట్టుకొచ్చాడు. వీజీ వీకూరలో శాన్వీ మేఘనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది పావళ మల్లి సాంగ్ కోసం టాలీవుడ్ అండ్ కోలీవుడ్ యూత్ క్రష్ కయాద్ లోహార్తో కలిసి మాస్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు సాయి అభ్యంకర్. తాజాగా మరో ఇండి ఆల్బమ్ రిలీజ్ చేశాడు నూనుగు మీసాల కుర్రాడు. ఈ సారి భాగ్యశ్రీ బోర్సేతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రాధిమా బ్రేకప్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ ఆల్బమ్‌కు తన మాజీ ప్రేయసి పేరైన “రాధిమా” అని పేరు పెట్టాడట 21 ఏళ్ల యంగ్ బాయ్. పేరుకు బ్రేకప్ సాంగ్ కానీ చూసేందుకు రొమాంటిక్ సాంగ్‌ను తలపిస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. డ్యూడ్, కరుప్పు చిత్రాలతోతో ఫ్రూవ్ చేసుకున్న 21 ఇయర్స్ యంగ్ కంపోజర్ సాయి ఖాతాలో దాదాపు పది సినిమాలున్నాయి. అందులో మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిల్మ్ ‘రాకా’ కూడా ఒకటి. ఫస్ట్ కమిటైన ఫిల్మ్ బెంచ్ ఇంకా రిలీజ్ కాకుండా బోలెడు ఆఫర్స్‌తో స్టార్ కంపోజర్స్‌కు స్ట్రాంగ్ కాంపిటీటర్ అవుతున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైవ్ కాన్సర్ట్స్ అని, మ్యూజిక్ ఈవెంట్స్ అంటూ ఫోకస్ పెడితే ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఫేమ్ తెచ్చుకుంటున్నారు స్టార్ కిడ్. తన ఇండివిడ్యువల్స్ సాంగ్స్‌తో క్రేజీ హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని హీరో కావాలన్న కోరికను ఫిల్ చేసుకుంటున్నాడు హరిణీ అండ్ టిప్పుల ముద్దుల కిడ్

కేజీఎఫ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తదుపరి చిత్రం ప్రకటించడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుని భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. మొదటి నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 254 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తన స్టామినాను నిరూపించుకుంది. అయితే ‘టాక్సిక్’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు యశ్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. యష్ లైనప్‌లో ప్రస్తుతం బాలీవుడ్ మల్టీస్టారర్ ‘రామాయణ్’ చిత్రం ఉంది. ఇందులో ఆయన రావణుడి పాత్రలో కనిపిస్తుండటంతో, అభిమానులు ‘టాక్సిక్’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, యష్ తదుపరి సోలో ప్రాజెక్ట్ కోసం ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ ఎం రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాకు హేమంత్‌తో పాటు యశ్ కూడా సహ రచయితగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ ‘టాక్సిక్’ ఫలితం తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో వేచి చూడాలి. దీనితో పాటు ‘కేజీఎఫ్ 3’ అధికారికంగా ప్రకటించినప్పటికీ అది త్వరలో ఉండే అవకాశం తక్కువ. అలాగే ‘సర్దార్’ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ మరియు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా యశ్ ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి

Kothapeta: తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ 6వ వార్షికోత్సవం కొత్తపేట: బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 6వ వార్షికోత్సవాలకు కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ.. తన తండ్రి వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తనకు కార్మికుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులే కాకుండా.. ఎక్కడ పని చేసే కార్మికులకైనా కనీస వేతనాలు అమలు కావాలన్నది తమ ప్రభుత్వ అభిమతమన్నారు. కార్మిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని చేసి రక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. మధుయాష్కి గారు మాట్లాడుతూ... కార్మికుల పక్షపాతిగా మంత్రి వివేక్ గారు పనిచేస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు . రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. అమెరికాలోని భారత కాన్సులేట్ లో తాను పని చేస్తున్నప్పటి నుంచి వెంకటస్వామి గారితోపాటు వారి కుటుంబ సభ్యులతో తనకు అనుబంధం ఉందన్నారు. వెంకటస్వామి గారిని నాన్న అని పిలిచేవాడినని గుర్తు చేసుకున్నారు. మంత్రి వివేక్ గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని.. మంచి ఇండస్ట్రియలిస్ట్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా తమ కంపెనీ ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చేలా జీవో విడుదల చేసి అమలు చేయడం మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి పేద వర్గాల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం అన్నారు. ఈ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చిరంజీవి సినిమాలే కనిపిస్తుంటాయి. మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ముందు వరుసలో ఉంటుంది. ఈసినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్.. మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని "నంబర్ వన్" సింహాసనంపై కూర్చోబెట్టింది. దర్శకుడు విజయ బాపినీడు సృజనాత్మకత, పరుచూరి సోదరుల మాస్ డైలాగ్స్, బప్పీలహరి సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్, మురళీ మోహన్, నిర్మలమ్మ లాంటి స్టార్ తారాగణం నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడానికి గల కారణాలేంటో చూద్దాం. రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) ముగ్గురు అన్నదమ్ములు. రఘుపతి బాధ్యతాయుతమైన అన్నగా కుటుంబాన్ని పోషిస్తుంటే, రాఘవ ఐఏఎస్ (IAS) కు సిద్ధమవుతుంటాడు. రాజారామ్ బాధ్యతారాహిత్యంగా నలుగురు స్నేహితుల గ్యాంగ్‌తో జాలీగా తిరుగుతుంటాడు. తమ్ముడి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం డబ్బు కావాల్సి వస్తే, రాజారామ్ జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడడు. అయితే, నగరంలో అరాచకాలు సాగించే ఏకాంబరం (రావు గోపాల్ రావు), కనకాంబరం (ఆనందరాజ్) చేతిలో రఘుపతి దారుణంగా హత్యకు గురవుతాడు. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న అన్న మరణం వెనుక ఉన్న కుట్రను రాజారామ్ ఎలా బయటపెట్టాడు? తన కుటుంబానికి దూరమైన పరిస్థితి నుండి, తన గ్యాంగ్, ప్రియురాలు కన్యాకుమారి (విజయశాంతి) సహాయంతో విలన్ల అంతం ఎలా చూశాడు? తమతోనే ఎంతో సరదాగా ఉంటూ.. హీరోకి లైన్ వేసే కన్యాకుమారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న విషాదం ఏంటి? అది ఎప్పుడు రివీల్ అవుతుంది? అనేదే మిగతా కథ. రాజారామ్ పాత్రలో చిరంజీవి నటన, ఆటిట్యూడ్, డ్యాన్సులు, ఫైట్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా

భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు మహిళను స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి, ఆగస్టు 22: మానవత్వాన్ని మంటగలుపుతూ కన్నవారే కసాయివారిలా మారారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులే అడవిలో వదిలేశారు. ఈ అమానుష ఘటన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు సమీప అడవిలో వదిలేశారు. ఒంటరిగా ఉన్న లలితను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. ఆ వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

'KGF 2' లాంటి భారీ విజయం సాధించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత, రాకింగ్ స్టార్ యశ్ తిరిగి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. అతను నటించిన 'టాక్సిక్' సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో యశ్ తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్ లో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా శుక్రవారం (ఆగస్టు 21) నుంచి ఇండియాలోనూ టాక్సిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం, బుక్‌మైషో యాప్‌లో ప్రతి గంటకు 21.71 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఢిల్లీ, ముంబై వంటి నార్త్ సిటీల్లోనూ టాక్సిక్ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో యశ్ సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో సాధారణ టికెట్ ధర రూ. 400 నుంచి ప్రారంభమయ్యింది. అలాగే ఎగ్జిక్యూటివ్, ప్రీమియం టికెట్స్ ధర రూ.450లుగా ఉంది. ఇక ప్రీమియం టికెట్ ధరలు రూ.500 పలుకు తుండగా, కొన్ని నగరాల్లో రీక్లైనర్ సీట్స్ రేటు రూ. 1000కు పైగానే ఉంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. టాక్సిక్ టికెట్ ధరల పెంపుపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు
కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన రాకింగ్ స్టార్ యష్.. ఇప్పుడు తన తదుపరి పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. బిగ్ స్క్రీన్‌పై యష్‌ను సరికొత్త డార్క్ అవతార్‌లో చూడటానికి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, డార్క్ థీమ్‌ను పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. విశేషమేమిటంటే, సినిమాలో ఎలాంటి ప్రధాన సన్నివేశాలపై కట్స్ విధించకుండా బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కేవలం ఒకటి రెండు సంభాషణల్లోని పదాలను మ్యూట్ చేయడం, చట్టబద్ధమైన హెచ్చరికలను స్పష్టంగా ప్రదర్శించడం వంటి చిన్నచిన్న మార్పులను మాత్రమే సూచించారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాలుగా లాక్ అయినట్లు అధికారిక సమాచారం. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కథనంలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ హింసాత్మక సన్నివేశాలున్న చిత్రాలకు సెన్సార్ బోర్డ్ తీవ్రమైన కోతలు విధించిన సందర్భాలున్నాయి. అయితే 'టాక్సిక్' చిత్రంలో ఉన్న రా వయొలెన్స్‌కు ఒక్క కట్ కూడా పడకపోవడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో విపరీతంగా చర్చనీయాంశమైంది. స్వయంగా యష్ కూడా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కేవలం పెద్దల కోసమే రూపొందించబడిన కథ అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి ప్రసిద్ధ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాకు మరింత గ్లామర్, క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. పవర్ ఫుల్ కాస్టింగ్ తో

యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. అమెరికాలో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే సుమారు రూ.1.06కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకు 204 ప్రాంతాల్లో 589 షోలకు కలిపి 5,500 టికెట్లు అమ్ముడయ్యాయట. విడుదలకు ముందు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. బుక్‌మైషోలోనూ మార్క్ ఇక బుక్‌మైషోలో ‘టాక్సిక్’కు ఇప్పటికే 10లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన 13వ భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ నిలిచింది. యశ్ కెరీర్లో కేజీఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన రెండవ చిత్రమిది కావడం విశేషం. నేడు భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్? ఇప్పటివరకు అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. భారత్‌లో బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యశ్ క్రేజ్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇదే జోరులో కొనసాగితే తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్ ధరలు భారీగా ఉండే ఛాన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు రూ.500–600 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ షోల టికెట్ ధరలు కూడా సాధారణ ధరల కంటే రూ.50–100 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియం షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండొచ్చని సమాచారం. ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన కనిపిస్తోంది. ఆగస్టు 21న బుకింగ్స్ ప్రారంభం కాగా, బుక్ మై షోలో గంటకు 21.71 వేల టికెట్లు అమ్ముడుపోతున్నట్లు పలు వర్గాలు నివేదించాయి. ఆగస్టు 26న విడుదల కానున్న టాక్సిక్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఈ ప్రారంభ స్పందన సూచనగా నిలుస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామంతో యశ్ టాక్సిక్ ద్వారా తెరపైకి వస్తున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కీయారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. వెంకట కె. నారాయణతో కలిసి యశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతం పరిమిత మార్కెట్లలోనే అందుబాటులో ఉన్నప్పటికీ అమ్మకాలు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది ప్రాంతాల్లో ఇప్పటికే లక్షల్లో టికెట్లు అమ్ముడైనట్లు బాక్సాఫీస్ ట్రాకింగ్ ఖాతాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు ₹4.91 కోట్ల గ్రాస్ నమోదైనట్లు ఆయా వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, బుక్ మై షోలో టాక్సిక్‌పై ఆసక్తి చూపిన వారి సంఖ్య 10 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బుకింగ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకముందే అమెరికాలో ప్రీమియర్ అమ్మకాలకు మంచి స్పందన కనిపించినట్లు సమాచారం. వెంకీ బాక్స్ ఆఫీస్ గణాంకాల ప్రకారం అక్కడ ముందస్తు అమ్మకాలు 1.2 లక్షల డాలర్లను దాటాయి. వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవగా, టెక్సాస్ వంటి

Bhupalpally: బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే! Bhupalpally: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అల్లపు రమేష్‌కు అనారోగ్య చికిత్స కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.2.50 లక్షల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆరోగ్యశ్రీలో కవర్ కాని వ్యాధుల చికిత్సకు ప్రభుత్వం ఎల్.ఓ.సి ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, గణపురం పీఏసీఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Toxic Movie Censor Review: 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యశ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఒకే రోజున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా అత్యంత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక 'టాక్సిక్' చిత్రానికి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు. ఇక 'టాక్సిక్' మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో మొదట 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మరింత గ్రిప్పింగ్ గా ఉంచేందుకు దానిని 2 గంటల

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌లతో చేయాల్సిన ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో.. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెల్లడించారు. ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘హీరో’, ‘సర్దార్’, ‘సర్దార్ 2’ వంటి వైవిధ్యమైన థ్రిల్లర్ చిత్రాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ (PS Mithran). తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash)లతో చేయాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ హీరోలతో తాను చేయాల్సిన భారీ చిత్రాలు ఎందుకు కార్యరూపం దాల్చలేదో వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా ‘కెజియఫ్’ ఫేమ్ యశ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను యశ్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాను, కథ విన్న తర్వాత ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ప్లానింగ్ ప్రకారం యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా పూర్తయిన వెంటనే మా ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇద్దరి డేట్స్, టైమ్‌లైన్ మ్యాచ్ కాకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కలేకపోయింది’’ అని మిత్రన్ తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో చర్చల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసే పూర్తి వైవిధ్యమైన కథను సిద్ధం చేసి వినిపించాను. కథ విన్న మెగాస్టార్ కూడా కథపై ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘విశ్వంభర’ సినిమా తర్వాత ఆయనతో ఈ ప్రాజెక్ట్ చేయాలని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ డేట్స్, షెడ్యూల్స్ టైమ్‌లైన్ కొలాప్స్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వెంటనే ముందుకు తీసుకెళ్లలేకపోయాం. అయితే ఆ కథలు ఇంకా నా

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్‌గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

సినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలా..? కథ బాగుంటే మూడు కాదు మూడున్నర గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్ ఫార్ములాగా మార్చేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో మూడు గంటలకు పైగా బొమ్మ చూపించబోతున్నారు. పెరిగిన ఈ లెంత్పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. మామూలుగా అయితే సినిమాలకి రెండున్నర గంటలు ఐడియల్ రన్ టైమ్ అంటారు. కానీ దాన్నిప్పుడు మార్చేస్తున్నారు మేకర్స్. 2.30 కాదు 3.30 గంటలు తీస్తామంటున్నారు. ఆ మధ్య పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ 3.44 హవర్స్ వచ్చింది.. దానికి ముందు డైరెక్ట్ రిలీజ్లోనూ 3.24 గంటలతో వచ్చారు సుకుమార్. యానిమల్ సైతం 3.21 గంటల నిడివితో వచ్చింది. మామూలుగా మూడు గంటల సినిమా అంటేనే మన దగ్గర బాగా అరుదు. అంత పెద్ద సినిమా చూడాలంటే అందులో విషయం చాలా ఉండాలి.. యాదృశ్చికమో ఏమో కానీ 3 గంటల నిడివి దాటిన సినిమాలు ఈ మధ్య కాసుల వర్షం కురిపించాయి. అది పుష్ప 2, యానిమల్ మాత్రమే కాదు.. ట్రిపుల్ ఆర్, కుబేరా కూడా. వీటి రన్ టైమ్ 3 గంటలకు పైగానే. గతేడాది లెంత్ మీద అన్ని అనుమానాలను పూర్తిగా తుడిచేసిన సినిమా రణ్వీర్ సింగ్ ధురంధర్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఏకంగా 3.32 గంటల నిడివితో వచ్చి 1400 కోట్లు వసూలు చేసింది.. సెకండ్ పార్ట్ 3.49 గంటలతో వచ్చి ఏకంగా 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల విజయాలు చూసాక.. సినిమాకు లెంతీ రన్ టైమ్ అనేది అస్సలు మ్యాటరే కాదని ఫిక్సైపోయారు మేకర్స్. తాజాగా టాక్సిక్ రన్ టైమ్‌పై చర్చ మొదలైంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 3.14 గంటలకుపై నిడివితో రాబోతుంది. పైగా A సర్టిఫికెట్ చిత్రమిది

వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ రెండు సినిమాలతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ రాకింగ్ స్టార్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో యశ్ కు 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యశ్ మాత్రం కేవలం ఒకే ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం టాక్సిక్ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నాడు యశ్. నేషనల్ మీడియా ఛానెల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి హీరో యశ్ ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?' అని రాకింగ్ స్టార్ ను అడిగింది. దీనికి యశ్ నవ్వుతూ 'ఆమె నా భార్య”అని ఎంతో ప్రేమగా ఆన్సర్ ఇచ్చాడు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. 'ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు (నవ్వుతూ)

ఇంటర్నెట్ డెస్క్: కన్నడ స్టార్ యశ్ (Yash)హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’(Toxic Movie). ఆగస్టు 26న భారీ స్థాయిలో 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది (Toxic English Trailer ). ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో యాక్షన్‌తో అదరగొట్టారు. ఈ చిత్రంలో యశ్‌తో పాటు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు

యష్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రధాన తారాగణం లుక్స్‌తో కూడిన పూర్తి పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, ఈ సినిమాలో నటీనటులు పోషిస్తున్న పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రంలో యష్ ‘రాయా’ మరియు అతని కుమారుడు ‘రూమి అలియాస్ టికెట్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ ‘నాడియా’ (రూమి తల్లి)గా, నయనతార రాయా సోదరి ‘గంగ’ పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో హుమా ఖురేషి ‘ఎలిజబెత్’గా, తారా సుతారియా ‘రెబెక్కా’గా, రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’గా కనిపించనున్నారు. అలాగే అక్షయ్ ఒబెరాయ్ (టోనీ), డారెల్ డిసిల్వా (సాల్వడార్), సుదేవ్ నాయర్ (కర్మాడి), బాలాజీ మనోహర్ (భీర) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఇంగ్లీష్ ట్రైలర్‌ను ఈరోజు రాత్రి 8:30 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 26న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవల్లో మళ్లీ సాలిడ్ సౌండ్ చేస్తున్న స్టార్ యశ్. ‘KGF 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ‘టాక్సిక్’తో వస్తున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 26న సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ప్రజెంట్ యశ్‌పై ఉన్నంత ఫోకస్ మిగతా కన్నడ స్టార్స్‌పై కనిపించడం లేదు. Siva Rajkumar : కన్నడలో సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ వయసు, ఆరోగ్య పరిస్థితుల సవాళ్లు ఉన్నా సినిమాల విషయంలో మాత్రం ఆయన స్పీడ్ తగ్గలేదు. ‘పెద్ది’లో కీలక పాత్రతో తెలుగులోనూ కనిపించాడు. తమిళంలోకి కూడా అడుగుపెడుతూ, కన్నడతో పాటు ఇతర భాషల్లో తన మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. “666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్” ‘జైలర్ 2’, ‘బెయిల్’, ‘ఉత్తరకాండ’ లాంటి ప్రాజెక్టులతో కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. Darshan : కన్నడలో మాస్ ఫాలోయింగ్ విషయంలో దర్శన్‌ది సపరేట్ రేంజ్. కానీ ప్రస్తుతం దర్శన్ జైల్లో ఉన్నాడు. ఆయన చివరి చిత్రం ‘ది డెవిల్’ 2025 డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. దర్శన్ ప్రాజెక్ట్స్ ‘రాజావీర మదకరి నాయక’, సింధూర లక్ష్మణ ఎప్పుడొస్తాయన్న క్లారిటీ లేదు. KICHAA : స్టార్ కిచ్చా సుదీప్ ‘మార్క్’ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా ఏకంగా నాలుగు స్క్రిప్ట్స్ లాక్ చేసినట్లు ప్రకటించాడు. అందులో కీలకమైనది అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బిల్లా రంగ బాషా – ది ఫస్ట్ బ్లడ్’. దాంతో పాటు దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఉన్నాడు. Upendra : ఇక తనదైన డిఫరెంట్ కథలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర కూడా సైలెంట్‌గా లేడు. రజనీకాంత్ ‘కూలీ’లో కలీషాగా కనిపించిన ఉపేంద్ర ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘45’తోనూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘భార్గవ’ షూటింగ్ ముగింపు

Yashasvi Jaiswal Test Career: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ నుంచి టీమిండియా ఆశించిన ఇన్నింగ్స్ రాలేదు. రెండు ఇన్నింగ్స్‌లను కలిపి అతడు 32 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన యశస్వి, రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బౌలర్‌తో ఢీకొన్న సందర్భంలో రనౌట్‌గా పెవిలియన్ చేరడం అతడి ఇన్నింగ్స్‌ను ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సాధారణ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. కీలక టెస్టు సిరీస్‌లో ఓపెనర్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించిన వేళ ఈ ప్రదర్శన టీమ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. గాల్ టెస్టుకు ముందు కూడా యశస్వి ఫామ్‌పై ప్రశ్నలు ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌తో ముల్లాంపూర్‌లో జరిగిన టెస్టులో అతడు 24 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 83 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ సిరీస్‌లో ఒక అర్ధశతకం మాత్రం అతడి ఖాతాలో ఉంది. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఇలా గత మ్యాచ్‌లతో కలిపి ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం మాత్రమే రావడం యశస్వి టెస్టు స్థానంపై చర్చకు కారణమవుతోంది. టెస్టు క్రికెట్లో భారత జట్టు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి సారించినట్లు మూల సమాచారం పేర్కొంటోంది. భారత్, శ్రీలంక రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది. అక్కడ యశస్వి బ్యాట్‌తో ప్రభావం చూపకపోతే అతడి టెస్టు భవిష్యత్‌పై టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..! యశస్వి జైస్వాల్‌కు కోలంబో టెస్టు ఎంతో కీలకంగా

నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ‘టాక్సిక్’ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ లాబీలతో పాటు పలు నగరాల్లోని మెట్రో రైళ్లపై సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు

రాక్ స్టార్ యష్.. టాక్సిక్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. `కేజీఎఫ్ 2` తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌తో థియేటర్లోకి వస్తున్నారు యష్. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. యుద్ధ ప్రభావంతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ట్రైలర్ ప్రారంభంలో బోల్డ్ గా ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అది తలా తోక లేనట్టుగా ఉంది. కథ ఏంటో క్లారిటీ లేదు. యాక్షన్ పార్ట్ ని, రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. అదే సమయంలో సినిమాలోని మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యష్. అందులో భాగంగా ఆయన రష్మిక మందన్నా కామెంట్లకి, అదే సమయంలో అల్లు అరవింద్ కామెంట్లకి స్పందించారు. గతంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఇచ్చి పడేయడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఒకప్పుడు `కేజీఎఫ్`కి ముందు యష్ ఎవరికీ తెలియదన్నారు. ఈ సినిమా తర్వాతనే అందరికి తెలుసు అని మాట్లాడారు. దీనికి యష్ రియాక్ట్ అవుతూ, `కేజీఎఫ్` తన లైఫ్‌ని మార్చిందనేది నిజమే అని, సినిమా సక్సెస్ కేవలం నిర్మాతది మాత్రమే కాదని, దాని వెనుక సమష్టి కృషి ఉంటుందన్నారు. హీరో సరిగ్గా నటించకపోతే సినిమా హిట్ కాలేదని, ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో ఆడియెన్స్ కి తెలుసు అని అదిరిపోయే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగానే రష్మిక మందన్నా 2017లో

కన్నడ స్టార్ హీరో యశ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై స్పందించారు. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) రాజకీయాల్లోకి వస్తారనే చర్చ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని యశ్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని చెప్పారు. భవిష్యత్తులో అవసరం ఉందని అనిపిస్తే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చని తన మనసులో మాట బయటపెట్టారు. రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన యశ్.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే రాజకీయాల అసలు ఉద్దేశంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని యశ్ తెలిపారు. తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన ఈ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారొచ్చని.. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే రాజకీయాల్లోకి రావచ్చేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యశ్.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం టాక్సిక్ ఈ నెలాకరున థియేటర్లలోకి రానుంది. సినీ కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలో ఆయన రాజకీయాలపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యశ్ నిజంగానే భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనేది చూడాలి

Cheteshwar Pujara Test Batters: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెస్టు క్రికెట్ సీజన్ ఉత్సాహంగా సాగుతోంది. ఒకపక్క శ్రీలంక పర్యటనలో భారత జట్టు తమ సత్తా చాటుతుండగా.. మరో ఎండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు నడుస్తోంది. త్వరలో ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ తమ సిరీస్‌ను ప్రారంభించనుంది. సరిగ్గా ఇలాంటి బిజీ షెడ్యూల్ సమయంలో ప్రముఖ క్రీడా వెబ్సైట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో క్రికెట్ పండితుడిగా మారిన ఛెతేశ్వర్ పుజారా పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న టాప్-6 టెస్టు బ్యాటర్లకు బ్లైండ్ ర్యాంకింగ్ పద్ధతిలో ర్యాంకులు ఇవ్వాలని పుజారాను కోరారు. టీమిండియా తరపున వందకుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారాకు టెస్టు క్రికెట్ పట్ల ఉన్న అవగాహన అపారం. బ్లైండ్ ర్యాంకింగ్ విధానంలో ముందుగా ఆటగాళ్ల పేర్లు పూర్తిగా చెప్పరు. ఒక పేరు వచ్చినప్పుడు ఆరు స్థానాల్లో ఏదో ఒక ర్యాంక్ కేటాయించాలి. అలా తన వద్దకు వచ్చిన ఆరుగురు బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ దేశాల నుంచి ఒక్కో ఆటగాడిని ఎంచుకున్నాడు. సొంత దేశం నుంచి కేవలం ఇద్దరికే తన జాబితాలో అవకాశం కల్పించాడు. స్టార్ ఆటగాళ్లకు షాక్.. రాహుల్, స్మిత్ ఔట్ పుజారా ముందుకు వచ్చిన ఆరుగురు ఆటగాళ్ల పేర్లు చూస్తే ఎవరికైనా కాస్త ఆశ్చర్యం కలగక మానదు. విదేశీ పిచ్‌లపై సైతం ఎంతో టెక్నికల్‌గా ఆడుతూ శతకాలు సాధించిన భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు ఈ జాబితాలో స్థానం లభించలేదు. సుదీర్ఘ ఫార్మాట్లో 4153 పరుగులు సాధించిన రాహుల్ పేరును పుజారా పరిగణనలోకి తీసుకోకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. అదే విధంగా ఆధునిక క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌కు కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. యాక్టివ్ క్రికెటర్లలో జో రూట్ తర్వాత అత్యధిక పరుగుల (10878 పరుగులు) రికార్డు స్మిత్ పేరిటే ఉన్నప్పటికీ అతనికి జాబితాలో చోటు
పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న సౌత్ హీరోలలో యష్ ఒకరు. ‘KGF’ ఫ్రాంచైజీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కన్నడ హీరో. తన క్రేజ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి ఆచితూచి అడుగులు వేస్తున్న యష్.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆయన, తాజాగా ఓ హిందీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గతంలో తనను ఉద్దేశించి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌పై స్పందించారుKGF సినిమాకి ముందు యష్ ఎవరు? అని మూడేళ్ల క్రితం ఓ సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో యష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు దీనిపై యష్ రియాక్ట్ అయ్యారు. కేజీఎఫ్ తన కెరీర్‌ను మార్చేసిందనేది కాదనలేని వాస్తవమని అన్నారు. అయితే ఒక సినిమా విజయం కేవలం నిర్మాతకు మాత్రమే సొంతం అనేది తాను నమ్మనని, దాని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుందని పేర్కొన్నారు. ఆడియన్స్ ప్రతి ఒక్కరి శ్రమను గుర్తిస్తారని, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరు దానికి అర్హులో వాళ్లకి బాగా తెలుసన్నారు.ఒక సినిమా వల్ల నిర్మాత కంటే హీరోకే ఎక్కువ పేరు వస్తుందనే అంశంపై యష్ మాట్లాడుతూ.. ''KGF వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఒక సినిమా సక్సెస్ కేవలం ప్రొడ్యూసర్ కి మాత్రమే సొంతం అని నేను నమ్మను. ఆ విజయం వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నుంచి రైటర్ల వరకు అందరూ కష్టపడి పనిచేస్తేనే మంచి అవుట్‌పుట్ వస్తుంది. యాక్టర్స్ సరిగ్గా నటించకపోతే.. ఆ సినిమా కచ్చితంగా హిట్ అవ్వదు. ఆడియన్స్ నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. వారు ప్రతి

‘పాన్ ఇండియా స్టార్’ అనేది మనం చేసే పనిని బట్టి ప్రేక్షకులు ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమేనని, సినీ పరిశ్రమలో ఏ స్టార్ ట్యాగ్ కూడా శాశ్వతంగా ఉండదని కన్నడ స్టార్ యశ్ అభిప్రాయపడ్డారు ‘పాన్ ఇండియా స్టార్’ అనేది మనం చేసే పనిని బట్టి ప్రేక్షకులు ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమేనని, సినీ పరిశ్రమలో ఏ స్టార్ ట్యాగ్ కూడా శాశ్వతంగా ఉండదని కన్నడ స్టార్ యశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ‘టాక్సిక్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా యశ్ ఓ హిందీ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో స్టార్ హీరోల ఇమేజ్, పాన్ ఇండియా స్టార్‌డమ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. ఈ షోలో యశ్‌ను యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్, మహేశ్ బాబు వంటి దక్షిణాది అగ్ర హీరోలు మీ మాదిరిగా తక్కువ సమయంలో పాన్ ఇండియా స్థాయిలో స్టార్లుగా ఎదగలేకపోయారు? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి యశ్ చాకచక్యంగా, వివాదాలకు తావు లేకుండా సమాధానమిచ్చారు. ‘ఎవరికీ స్టార్డమ్ శాశ్వతం కాదు. దక్షిణాది అగ్ర హీరోలంతా తమదైన శైలి చిత్రాలతో గొప్ప విజయాలు సాధిస్తూ రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు, తలరాత మారిపోవడానికి ఎవరికైనా ఒక్క శుక్రవారం చాలు. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఇచ్చే తీర్పే హీరో స్టార్‌డమ్‌ను నిర్ణయిస్తుంది. వరుస విజయాలతో ఇమేజ్ పెరగవచ్చు.. అలాగే ఒక్క పరాజయం ఆ ఇమేజ్ను డ్యామేజ్ చేయవచ్చు. అందుకే ‘పాన్ ఇండియా స్ట్టార్’ అనే ట్యాగ్ కంటే మంచి సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే యశ్ ఇచ్చిన సమాధానంతో అభిమానులు, నెటిజన్లు హర్షిస్తున్నారు. తోటి హీరోలను పోల్చకుండా, వారిని గౌరవిస్తూ యశ్ సమాధానం
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హిందీ టాక్ షో ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్.. హీరోల స్టార్డమ్, పాన్ ఇండియా ఇమేజ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.* రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల**టాక్ షోలో భాగంగా సదరు యాంకర్ యశ్‌ను ప్రశ్నిస్తూ.. "సౌత్ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, దళపతి విజయ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలు మీలాగా త్వరితగతిన పూర్తిస్థాయి పాన్ ఇండియా సూపర్ స్టార్లుగా ఎందుకు ఎదగలేకపోయారు?" అని అడిగారు. దక్షిణాది స్టార్లను తక్కువ చేసి మాట్లాడినట్లున్న ఈ ప్రశ్నకు యశ్ ఏమాత్రం తడబడకుండా ఎంతో పరిణతితో, హుందాగా బదులిచ్చారు. స్టార్ ఇమేజ్ అనేది శాశ్వతం కాదని స్పష్టం చేస్తూ యశ్ తనదైన శైలిలో విశ్లేషించారు. సౌత్ స్టార్ హీరోలంతా సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని ప్రశంసించారు. 'పాన్ ఇండియా స్టార్' అనే పదం మనం చేసే పనిని బట్టి వచ్చే ఒక టెర్మినాలజీ మాత్రమేనని, చిత్ర పరిశ్రమలో ఏ ట్యాగ్ కూడా శాశ్వతంగా ఉండదని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క శుక్రవారం బాక్సాఫీస్ ఫలితం ఎవరి భవితవ్యాన్నైనా మార్చేయగలదని చెప్పారు. శుక్రవారం థియేటర్లలో వచ్చే తీర్పును బట్టి స్టార్లు, వారి పాన్ ఇండియా హోదాలు మారిపోతుంటాయని, కాలంతో పాటు విజయాలు రావడం, పోవడం సహజమని వివరించారు.* చివరి 40 నిమిషాలు సీట్లో కూర్చోలేరు.. ‘ఇరుముడి’పై అంచనాలు పెంచేసిన శివ నిర్వాణటాలీవుడ్ అభిమానుల అసంతృప్తియశ్ ఇచ్చిన సమాధానం చాలా హుందాగా, పరిణతితో కూడుకున్నదంటూ సినీ

ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్‌లో ఒక భారీ సంచలనం నమోదు కాబోతోంది. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్‌ను వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జైస్వాల్‌ను వేరే టీమ్‌కు ట్రేడ్ చేయడానికి లేదా పూర్తిగా రిలీజ్ చేయడానికి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు రిపోర్టులు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో జైస్వాల్‌ను ఎక్స్ఛేంజ్ చేసే దిశగా పెద్ద చర్చలు జరుగుతుండటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. యశస్వి జైస్వాల్ ప్రవర్తన, ఆటిట్యూడ్ పట్ల రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అస్సలు సంతృప్తిగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మైదానంలో అతని ప్రదర్శన మాత్రమే కాకుండా, జట్టులోని అంతర్గత పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సంజూ శాంసన్ సీఎస్కేకు ట్రేడ్ అయ్యాక, జైస్వాల్‌కు కప్టెన్సీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఫ్రాంచైజీ రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జైస్వాల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, మే 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ అందుబాటులో లేకపోవడంతో జైస్వాల్ జట్టును నడిపించాడు. అయితే మేనేజ్మెంట్తో ఏర్పడిన విభేదాలు అతని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌తో దూసుకుపోవడం కూడా జైస్వాల్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచుల్లో 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 రన్స్ సాధించాడు. ఆరెంజ్ క్యాప్, సూపర్ సిక్సెస్, సూపర్ స్ట్రైకర్ అవార్డులను కైవసం చేసుకుని రాజస్థాన్ రాయల్స్ పోస్టర్ బాయ్‌గా మారాడు. టాప్ ఆర్డర్లో నమ్మకమైన భారత ఓపెనర్‌గా వైభవ్ నిలదొక్కుకోవడంతో, జైస్వాల్‌ను పక్కన పెట్టడం రాజస్థాన్‌కు పెద్ద కష్టమేమీ కాదని ఫ్రాంచైజీ భావిస్తోంది. అదే సమయంలో జైస్వాల్ 2026 సీజన్ 16 మ్యాచుల్లో 30.50 సగటుతో 427

‘టాక్సిక్’ (Toxic) చిత్రంలో తాను నటించిన హాట్ హాట్ సన్నివేశాలపై తన భార్య, నటి రాధికా పండిట్ (Radhika Pandit) ఎలా స్పందిస్తారో తనకు బాగా తెలుసని యష్ (Yash) అన్నారు. ఆ సన్నివేశాలను (Intimate Scenes) చూసినప్పుడు ఆమె సంతోషంగా ఉండకపోవచ్చని ఆయన అంగీకరించారు. అయితే, ఆమె బాధపడుతారని భావించాల్సిన అవసరం లేదని అన్నారు. టాక్సిక్ లో ఆ సీన్లు కేవలం బోల్డ్ గా చెయ్యాలనే ఉద్దేశంతో తీసినవి కావని యష్ స్పష్టం చేశారు.. కథకు అవి అవసరమైన భాగమని, అందుకే తాను తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాటిలో నటించానని తెలిపారు. “నేను కూడా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాను. ఇలాంటి సన్నివేశాలు చేయడం నాకు అంత సులభం కాదు. కానీ కథకు అవి అవసరం. అంతేకాదు కథలో కీలకమైన భాగం. సహజంగానే, దీని గురించి నా భార్య సంతోషంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె నన్ను నమ్ముతుంది,” అని యష్ అన్నారు. రాధికా పండిట్ కూడా నటి కావడం వల్ల నటన, వ్యక్తిగత జీవితం మధ్య ఉన్న తేడాను ఆమె అర్థం చేసుకుంటారని యష్ తెలిపారు. “ఆమె కూడా ఒక నటి. ఇది ఒక వృత్తి అని ఆమెకు తెలుసు. నేను నటిస్తున్నప్పుడు, అది తన పాత్రను పోషిస్తున్న ఒక నటుడి పని మాత్రమేనని ఆమె అర్థం చేసుకుంటుంది. అక్కడ నటిస్తున్నది తన భర్త కాదు,” అని యష్ పేర్కొన్నారు