
Aug 20 2026 2:57 PM | Updated on Aug 20 2026 3:11 PM
వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు.
ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు.
ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు.
ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు.
ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా రాణిస్తుండడంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక చివరగా స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌కు ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ అవకాశమిచ్చాడు.
ప్రపంచకప్ టోర్నీకి ఉతప్ప ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్
విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)
'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)
మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు)
బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్
ఫోటో మార్ఫింగ్ వివాదం..! కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గం కుట్ర
వెళ్తూ వెళ్తూ.. అబ్బా కొడుకులకు జగన్ ఓపెన్ ఛాలెంజ్
DSC స్కాం పై మరో సంచలనం ఆడియో వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
పోస్టుకు 14 లక్షలు తీసుకున్నారు. ధర్మేంధ్ర ప్రధాన్ కో రూల్ నీకో రూలా..?




