
Viral Video: ఇంటర్నెట్ను ఊపేస్తున్న దేశీ టెస్లా.. డ్రైవర్ నిద్రపోయినా కారు ఆగేది లేదు..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Viral Video: ఇంటర్నెట్ను ఊపేస్తున్న దేశీ టెస్లా.. డ్రైవర్ నిద్రపోయినా కారు ఆగేది లేదు..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
© 2026 nimisham.in

Viral Video: ఇంటర్నెట్ను ఊపేస్తున్న దేశీ టెస్లా.. డ్రైవర్ నిద్రపోయినా కారు ఆగేది లేదు..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Viral Video: అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..! కట్‌చేస్తే..

Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

Viral video | బామ్మర్దికి అమృత్ టెండర్లు..! తమ్ముడికి రావిర్యాల భూములు శాసనమండలిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వీడియో వైరల్

Viral Video: ఆన్ లైన్ లో ఆండ్రాయిడ్ డివైజ్ ఆర్డర్ చేస్తే ఆవుపేడ వచ్చింది..!

Viral Video: ఒడిశా అడవుల్లో అరుదైన ఒరాంగుటాన్లు.. దేశంలో ఉనికేలేని ఈ జీవులు.. ఎలా వచ్చాయ్!

Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన పెంపుడు కుక్క.. సీసీటీవీలో షాకింగ్ ఫైట్!

Viral Video: పాపం ఆకలి తీరుద్దామని వెళ్లి.. మొసలికే ఆహారం అయ్యాడు.. ఇదిగో వీడియో!

Viral Video: కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..

Viral Video: రీల్స్ పిచ్చితో 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్ లోకి.. తర్వాత ఏం జరిగిందంటే..?

Viral Video: రాత్రి ఇంటికెళ్తుండగా ఎదురైన చిరుత పులి.. కార్మికులు తెలివిగా ఏం చేశారంటే?

సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే! సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే! ఇటీవలే విమాన ప్రయాణంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకున్నాక తనకూ ఓ విషయం గుర్తొచ్చిందని చెబుతోంది నటుడు షాహిద్ కపూర్ సతీమణి, వ్యాపారవేత్త మీరా కపూర్. అదేంటో కాదు.. గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ సూప్ అని చెబుతోన్న మీరా.. ఈ వంటకం తనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసిందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి ఆదరణ లభించడంతో ఏంటా సూప్ రెసిపీ అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారవేత్తగా, అమ్మగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది మీరా. ఈ క్రమంలోనే తాను పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలి, సౌందర్య చిట్కాలు, ప్రయాణ అనుభవాలు.. వంటివెన్నో పంచుకుంటుంటుంది. అలా తనకెదురైన మరో అనుభవం గురించి తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది మీరా. ఇటీవలే ఓ విమాన ప్రయాణంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకుందామె. ఈ క్రమంలోనే తామిద్దరం ఆయా విషయాల గురించి కాసేపు చర్చించుకున్నామని, ఈ సమయంలోనే గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ హెల్దీ రెసిపీ తనకు గుర్తొచ్చిందంటూ ఆ విశేషాల్ని వీడియో రూపంలో పోస్ట్ చేసిందీ మిసెస్ కపూర్. ‘నా జీవితంలో ఎక్కువ భాగం రక్తహీనతతో ఇబ్బంది పడ్డా. దీన్నుంచి బయటపడేందుకు ఏదైనా చిట్కా పాటించాలనుకున్నా. అప్పుడే ఓ సందర్భంలో స్మృతీ ఇరానీ పంచుకున్న ఓ సూప్ వీడియో నా కంట పడింది. కచ్చితంగా మూడు నెలల పాటు ఆ

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం సతీశన్‌ను కలిసి..ఫొటోలు దిగారు. స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో భారతలో పర్యటించింది. కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (V.D. Satheesan)తో భేటీ అయ్యారు. కోజికోడ్‌లో బాబీ చెమ్మనూర్ ఇంటర్నేషనల్ జ్యువెల్లర్స్ షోరూమ్ 'స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్' కార్యక్రమానికి హాజరైన ఆమె.. అనంతరం సీఎంని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ సీఎంతో దిగిన ఫొటోలను ఎల్మా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రొనాల్డోకు తాను పెద్ద అభిమానినని, కేరళంలో అతడికి భారీగా అభిమానులు ఉన్నారని ఎల్మాతో సతీశన్ తెలిపారు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఇంత ఆదరణ ఉందన్న విషయం తనకు తెలియదని, తన సోదరుడు రొనాల్డోకు ఫ్యాన్ బేస్ ఉండడం సంతోషంగా ఉందని ఎల్మా పేర్కొంది. ఈ విషయాన్ని రొనాల్డోతో పంచుకుంటానని ఎల్మా అవీరో చెప్పుకొచ్చింది. అనంతరం సతీషన్‌ను.. ‘సీఎం సార్.. ప్లీజ్ ఒక్క ఫొటో’ అని ఎల్మా అడిగింది. దీనికి అంగీకరించిన కేరళ సీఎం సతీశన్ ఆమెతో ఫొటోలు దిగారు. తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్ జోన్ విరాట్ కోహ్లీ సరసన చేరిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం

విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది. Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువురోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ నాకే ఎందుకీ శిక్ష దేవుడా అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయనున్నారనే వార్తలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మరియు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా టాటా గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టి సూచీలు నష్టాల బాట పట్టాయి

మహారాష్ట్రలోని ఓ కుటుంబానికి ఎట్టకేలకు రెండు శతాబ్దాల కల నెరవేరింది. నాలుగు తరాల తర్వాత పుట్టిన కూతురిని కుటుంబ సభ్యులు మహాలక్ష్మిగా భావించి, ఆసుపత్రి నుంచి రథంలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి, ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు.. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగు తరాల తర్వాత తమ కుటుంబంలోకి ఆడపిల్ల అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ సభ్యులు చిన్నారికి ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గార్గి అనే నవజాత శిశువును ఆమె తల్లితో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో ఇంటికి తీసుకువచ్చారు. డప్పులు, తాళాల మోత, పాటలు, నృత్యాలతో సాగిన ఈ రథయాత్ర స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆనందోత్సాహాలతో చిన్నారిని స్వాగతించారు. గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లోటు తీరిందని ఆమె తాత లింబాజీ దహిఫాలే భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లేని లోటు తీరింది. మా కుటుంబంలోకి కుమార్తె రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్నేళ్లుగా ఆడపిల్ల లేదనే బాధ ఉండేదని, ఇప్పుడు ఆ లోటు తీరింది. నా ఇద్దరు కోడళ్లను కూడా సొంత కూతుళ్లలా చూసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలిని సంగీతం, నృత్యాల మధ్య రథంలో ఇంటికి తీసుకురావడం జీవితంలో మరచిపోలేని రోజు’ అని అన్నారు. చిన్నారి గార్గి తండ్రి మాట్లాడుతూ.. ‘చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు. కూతురు పుట్టినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను. నా కూతురిని పువ్వులా.. అపురూపంగా పెంచుకుంటా’ అని అన్నారు. మరోవైపు ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని వేడుకగా నిర్వహించిన దహిఫాలే కుటుంబాన్ని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అభినందించారు. సమాజంలోని కొన్ని వర్గాల్లో ఇప్పటికీ ఆడపిల్లల జననంపై ప్రతికూల ఆలోచనలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nepal Floods: నేపాల్‌లో సృష్టించిన వరదల వల్ల ఆ దేశం చెప్పుకోలంతగా అల్లకల్లోలమైంది. నేపాల్‌లో సంభవించిన వరదలు ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేశాయి. వరదల ధాటికి ఊర్లకు ఊర్లకు కొట్టుకుపోయాయి. మరోవైపు పెద్ద పెద్ద భవనాలు సైతం పేక మేడల్లా కళ్ల ముందు కూలి పోయాయి. అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్న వారి జీవితాలు ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. ఇంట్లో చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టు తయారైంది పరిస్థితి. కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఎందుకు బతికున్నామా అంటూ రోదిస్తున్న సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా నేపాల్ పోలీసులు వెల్లడంచిన సమాచారం ప్రకారం.. రసువాలో 45, నువాకోట్‌లో 155, ధాడింగ్‌లో 59, చిత్వాన్‌లో 348, గోర్ఖాలో 66, తనహున్లో 38, తూర్పు నవల్పరాసిలో 217 మరియు పశ్చిమ నవల్పరాసిలో 190 మృతదేహాలను వెలికితీశారు. ఆయా మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్ సేకరించి వాటి ఫోటోలను తీసి భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత కళ్లిన మృతదేహాలను దహనం కాకుండా సామూహికంగా ఖననం చేస్తున్నారు. భారత్‌లో కూడా తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు నేపాల్ పోలీసులు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో కేవలం 95 మందిని మాత్రమే గుర్తించి, వారి ఫ్యామిలీస్‌కు అప్పగించడం జరిగింది. వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలను (గుర్తింపు లభించని వారితో సహా) చట్టపరంగా , శాస్త్రీయ పద్ధతుల ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అంతకుముందు తన సామాజిక మాధ్యమాల్లో
Viral Video: సబ్‌స్రైబ్ చేస్తే చేస్తే తిరుమల లడ్డూ ఫ్రీ! సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ఉచితమంటూ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎవరైనా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయిస్తే ఒక్కో లడ్డూ చొప్పున బహుమతిగా ఇస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు. ఇలా ఏకంగా 30 మందితో సబ్‌స్క్రైబ్ చేయించుకుని.. దానికి ప్రతిఫలంగా 30 లడ్డూలను పొందినట్లు.. ఆ వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ప్రపంచ ప్రఖ్యాత శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇలా సోషల్ మీడియా ప్రమోషన్లకు, సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి వాడుకోవడం పట్ల భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తకు సంబంధించిన

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని చంబా జిల్లాలో ఆకస్మిక వరదలు రావడంతో రోడ్లన్నీ నదుల్లా ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీకర వరదలు సంభవించాయి. అయితే ఈ వరదల్లో ఓ మానవీయ ఘటన జరిగింది. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ బైకర్ ప్రాణాలను ఓ నవ వధువు చాకచక్యంతో వ్యవహరించి కాపాడింది. నీటిలో కొట్టుకుపోతున్న ఆ బైకర్ కు తన చున్నీ ఇచ్చి అతడ్ని రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నవ వధువును ప్రశంసిస్తున్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి ఓ కుటుంబం చూపిన చొరవ.. ఆ నవవధువు ప్రదర్శించిన సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, భటియత్ జిల్లాల్లో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఉప్పొంగుతోంది. దాంతో అక్కడి రోడ్లు, ఇతర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కకియారా- తునుహట్టి రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇదే సమయంలో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న మామ్లా గ్రామానికి చెందిన ఓ బైకర్ వరదనీటిలో చిక్కుకుపోయాడు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తన ద్విచక్ర వాహనంతో పాటు కొద్ది దూరం కూడా కొట్టుకుపోయాడు. ఇక అక్కడే ఉన్న ఓ పెద్ద చెట్టును పట్టుకుని వరదనీటిలోనే నిలబడిపోయాడు.అదే సమయంలో ఓ కుటుంబం అప్పుడే పెళ్లి వేడుకలను ముగించుకుని అటుగా వెళ్తోంది. అయితే వరదలో చిక్కుకున్న ఆ బైకర్ ను చూసి ఆ కుటుంబం చలించింది. వెంటనే తమ కారును ఆపి అందులోని ఓ వ్యక్తి బైకర్ ను కాపాడేందుకు ముందుకు వెళ్లాడు. అయితే నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ముందుకు వెళ్లడం ఇబ్బందిగా మారింది.దాంతో కారులో ఉన్న నవ వధువు వెంటనే సమయస్ఫూర్తిని ప్రదర్శించింది.

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చిన ఓ ఫ్లాప్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీయడమేంటి? అది సూపర్ హిట్ అవడమేంటి? ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించడమేంటి? బాలీవుడ్లో ఇప్పుడు అలాంటి అద్భుతమే జరిగింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ‘ఆవారాపన్ 2’ (Awarapan 2). 2007లో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi), శ్రియా శరణ్ (Shriya Saran) జోడీగా నటించిన ‘ఆవారాపన్’ (Awarapan) విడుదలైంది. మోహిత్ సూరి (Mohit Suri) తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే వచ్చినా, బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. రూ.18 కోట్ల బడ్జెట్‌తో తీస్తే, రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. థియేటర్ల నుంచి ఈ సినిమా వెళ్లిపోయిన తరువాత టీవీల్లో చూసిన ప్రేక్షకులు దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఈ సినిమాకు కల్ట్ స్టేటస్ వచ్చింది. ఇన్నేళ్ల తరువాత ఈ ఏడాది ‘ఆవారాపన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జోడీగా నటించిన ఈ సినిమాను నితిన్ కక్కర్ తెరకెక్కించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వసూళ్ల వర్షం కురిసింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు సాధించడం విశేషం. అన్నదానాలతో ప్రచారం చేసి.. రూ.50 కోట్లు సాధించి..: ‘హనుమాన్ అంశ్’ విశేషాలివీ ఈ చిత్ర ఘనవిజయంపై ఇమ్రాన్ హష్మి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘రెండు దశాబ్దాల క్రితం విడుదలైన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. అయినప్పటికీ సీక్వెల్‌తో మళ్లీ వచ్చింది. ఈసారి చరిత్రను తిరగరాసింది. ఇది అపూర్వ విజయం. ఇదే నా బెస్ట్ ఫిలిం’’ అని ఆయన పోస్ట్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు

Actress Hema:తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అక్క, పిన్ని, వదిన వంటి ఎన్నో పాత్రల్లో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ పాత్రల్లో కూడా తనదైన శైలితో నవ్వించారు. సినిమాలతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన విషయాల్లో కూడా హేమ చురుగ్గా కనిపించారు. హేమ ఏ విషయం గురించి మాట్లాడినా తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో చర్చకు వస్తుంటాయి. తాజాగా ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.తనపై కేసు నడిచిన సమయంలో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని హేమ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తనలో చాలా కోపం, బాధ ఉండేవని తెలిపారు. ఆ భావోద్వేగాలను బయటకు చెప్పుకోలేకపోతే తాను తీవ్రంగా ఇబ్బంది పడతానని అనిపించిందని ఆమె వివరించారు. అలాంటి సమయంలో ఐస్ బాత్ థెరపీని ప్రయత్నించినట్లు హేమ తెలిపారు. పెద్ద మొత్తంలో మంచుతో నింపిన నీటిలో కూర్చుని తనలో ఉన్న కోపాన్ని, బాధను బయటకు వెళ్లగక్కినట్లు చెప్పారు. అలా చేయడం ద్వారా తన మనసులో ఉన్న భారాన్ని కొంత తగ్గించుకున్నానని వివరించారు. ఐస్ బాత్కు ముందు కౌన్సిలింగ్ వంటి సెషన్స్‌లో కూడా పాల్గొన్నానని హేమ చెప్పారు. తనలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన కూడా తనకు వచ్చిందని తెలిపారు. అదే సమయంలో మీడియా తన గురించి వార్తలు రాసిన తీరుపై కూడా హేమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల సమయంలో కొన్ని వార్తలు ఎక్కువగా ప్రచారం అయ్యాయని, తరువాత జరిగిన పరిణామాలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె అన్నారు. తనకు విష్ణు బాబు అండగా నిలిచారని హేమ పేర్కొన్నారు. ఆధారాలు చూపించిన తర్వాత తాను తిరిగి

ఎస్సీఓ వేదికపై ఫొటోగ్రాఫ్ అనంతరం వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పాక్ ప్రధాని పిలిచారు. అనంతరం ఆయనతో సంభాషించారు. ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు(మంగళవారం) సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫొటోగ్రాఫ్ తరవాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెనుక నుంచి తట్టారు. అనంతరం ఆయనతో సంభాషించారు. అయితే పాక్ ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఏం చెప్పి ఉంటారనే విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా ముగింపు చెప్పాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన తరువాతి రోజే ఈ ఘటన జరిగింది. బీష్కెక్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, తనకు జరిగిన భేటీలో మోదీ ఈ సూచనలు చేశారు. ‘యుద్ధానికి కేటాయించే ప్రతి దినమూ మానవత్వాన్ని అంతం చేస్తుంది. శాంతి కోసం కేటాయించే ప్రతి ఒక్కరోజూ మావవత్వాన్ని బతికించి, కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది’ అని ఆయన చెప్పారు. అందుకే యుద్ధాన్ని వీడాలని సూచించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్‌గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ భవనం తాలూకు వీడియో ఇటీవల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో ఈ భవనం ఉంది. చుట్టూ ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం నిలబడ్డ తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. వరద సమయంలో భవనంలోనే ఉన్న ఆయన ఆ భయానక అనుభవం గురించి పలు విషయాలు చెప్పారు. ‘వరద చుట్టుముట్టే సమయంలో భవనంలో నాతో నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ అందింది. వెంటనే నేను ఇంటికి వెళ్లాను. అందరం బయటకు వెళదామనుకున్నాము. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి పెరిగింది. దీంతో, మేము నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చేయడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా కుటుంబంపైనే ఉంది’ ‘ఆ సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకేమైనా అయితే వాడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోయింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన చెప్పారు. ‘అది దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. భారతీయులు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియోలో కొందరు భారత పర్యాటకులు రైలు మధ్యలో నిల్చుని బిగ్గరగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉన్నారు. మరికొందరు వారికి వంతపాడుతూ చేతులు ఊపుతూ, ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చోగా, కొందరు మాత్రం అసంతృప్తిగా అలా చూస్తుండిపోయారు. ఈ వీడియోను Amit24TD అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో భారతీయ పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కొందరు వ్యాఖ్యానించారు. రద్దీగా ఉన్న ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదని మరికొందరు సూచించారు. వ్యక్తిగత వేడుకలు, సరదాలను బహిరంగ ప్రదేశాల్లో ఇతర ప్రయాణికులపై రుద్దకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రైల్వే సిబ్బంది, అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదని మరికొందరు ప్రశ్నించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్‌లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు దాదాపు మిలియన్‌కు చేరువలో వ్యూస్ రావడం విశేషం. కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. ‘నా పక్కనే ఎవరున్నారో తెలుసా. క్రికెట్లో మెస్సి, రొనాల్డో అయిన విరాట్ కోహ్లీ. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్లేయర్లలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు సోషల్ మీడియాలో 273 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్నెస్, లైఫ్‌స్టైల్ ఐకాన్లుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌లో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదు. భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లకు మద్దతుగా క్రికెట్లోని అతిపెద్ద ఐకాన్లలో ఒకరు రావడం అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆమె తన అనుభూతిని పంచుకుంది. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి

కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరుగా నిలిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ ముగిసేసరికి స్కోరు 17/0. ఈ సమయంలో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. బౌండరీ లైన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, గాల్లోకి ఎగిరి కేవలం ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అది అంత సులభమైన క్యాచ్ కాదు. బౌండరీ లైన్‌ను తాకకుండా అద్భుతమైన టైమింగ్‌తో బంతిని ఒంటి చేత్తో అందుకున్న ఫిలిప్స్.. వెంటనే తన చేతిని, క్యాచ్‌ను చూసుకుని తానే నమ్మలేనట్లుగా స్పందించాడు. ఫిలిప్స్‌కు ఇలాంటి అద్భుత క్యాచ్‌లు కొత్తేమీ కాదు. ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ, గాల్లోకి ఎగిరి అసాధ్యంగా కనిపించే క్యాచ్‌లను కూడా అతడు సునాయాసంగా అందుకుంటుంటాడు. అందుకే అభిమానులు, కామెంటేటర్లు అతడిని ముద్దుగా ‘సూపర్‌మ్యాన్’ అని పిలుస్తుంటారు. CPLలో ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 112 క్యాచ్‌లు అందుకున్న ఫిలిప్స్.. రనౌట్లు

Glenn Phillips One Handed Catch Video: క్రికెట్లో క్యాచ్‌లు ఎంతో కీలకమైనవి. మ్యాచ్ లను మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటి క్యాచ్ లు పట్టేందుకు ఫీల్డర్లు తమ ప్రాణాలను కూడా పణ్ణంగా పెడుతుంటారు. ఈక్రమంలో కొన్ని క్యాచ్‌లు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. పట్టిన ఆటగాడే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ అలాంటి అద్భుతమే చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. క్యాచ్ పూర్తయిన తర్వాత ఫిలిప్స్ కూడా కొద్దిసేపు నమ్మలేకపోవడం గమనార్హం. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ వింత చోటు చేసుకుంది. గయానా తొలుత 186 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో ట్రిన్‌బాగో 17/0తో ఉన్న సమయంలో డ్వేన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్‌గా ఆడాడు. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! బంతి డీప్ మిడ్ వికెట్ వైపు వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్‌కు అది సిక్సర్‌గా వెళ్లేలా కనిపించింది. అయితే లాస్ట్ మినిట్ లో అతడు కుడివైపు కదులుతూ ఒక్కసారిగా తన కుడి చేతిని గాల్లోకి చాపాడు. అంతే.. గాల్లో దూసుకెళ్తున్న బంతి అతడి చేతిలో పడిపోయింది..! క్యాచ్ అందుకున్న వెంటనే ఫిలిప్స్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను పట్టిన క్యాచ్‌ను తానే నమ్మలేకపోయినట్లు అతడు కొద్దిసేపు ఆశ్చర్యంగా నిల్చుని చూస్తుండిపోయాడు. క్యాచ్ వీడియోను సీపీఎల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అభిమానులు ఈ ఫీట్‌ను చూసి ఫిలిప్స్‌ను మరోసారి ‘సూపర్‌మ్యాన్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా పేరు.. A

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ. పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు. కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్! ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్

ఏపీలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి 20 స్థానాల్లో జయభేరి మోగించనుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఏపీలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి 20 స్థానాల్లో జయభేరి మోగించనుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. అయితే కూటమి 20 సీట్లు గెలుచుకున్నప్పటికీ వీటిలో బీజేపీ 3నుంచి 1 స్థానానికి పడిపోనుందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన తమ సంఖ్యా బలాన్ని 18 నుంచి 19 సీట్లకు పెంచుకుంటాయని తెలిపింది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nepal Floods update: నేపాల్ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా....2,500 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. వారిలో దాదాపు 500 మంది విదేశీయులున్నారు. ఈ వరదల్లో కొన్ని గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అధికార లెక్కల్లోని దాదాపు 25 వేల నుంచి 30 మంది చనిపోయినట్టు అనధికార సమాచారం. ముఖ్యంగా హిమాలయాల్లోని హిమానీనదం శిథిలాలు, బండరాళ్లతో చైనా-నేపాల్ సరిహద్దులో ఏర్పడిన సరస్సు కారణంగా ఇంకా వరద ముప్పు పొంచే ఉంది. దాని వల్ల బోటెకోషి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఈ వరద ముప్పుపై చైనా ఇస్తోన్న సమాచారం ఆధారంగా దిగువ ప్రాంత ప్రజలను నేపాల్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వరద హెచ్చరికల మెసేజ్‌లతో దిగువ ప్రాంత ప్రజల ఫోన్లు దద్దరిల్లాయి. ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి, నిలువనీడలేకుండా మిగిలిన వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఈ అలర్ట్స్ మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు, త్రిశూలీ నదికి దాదాపు మూడు గంటల పాటు వరద పోటెత్తడంతో 130 మీటర్ల పొడవైన ఘ్యాల్చౌక్-చరౌడీ సస్పెన్షన్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. త్రిశూైలి -3ఏ జల విద్యుత్ ప్రాజెక్ట్‌లో చిక్కుకుపోయిన కార్మికులు,.. వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 537 మంది కార్మికులు

90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. 90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ (Rambha) ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమన్నారు. దాదాపు 17 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో జీవిస్తున్నారు. తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని, ఫుల్ ఎనర్జీతో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నారు.ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించి బుల్లితెరపై కూడా సందడి చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్‌పై కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో అందుకు నాంది అని

మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్‌లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులు కునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద

ఒక భవనం పైకప్పు మీద ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఒకరు టామ్ క్రూజ్. మరొకరు బ్రాడ్ పిట్. కెమెరా వాళ్ల చుట్టూ తిరుగుతోంది. ఇద్దరి కదలికలు సహజంగా ఉన్నాయి. ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఫైట్‌లో వచ్చే చిన్న చిన్న బాడీ మూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీరందరూ దాదాపు చూసింది. చూస్తే అది ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా నుంచి కట్ చేసిన సీన్‌లాగే అనిపిస్తుంది. కానీ… ఆ ఫైట్ అసలు జరగలేదని తెలుసు. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ కలిసి ఆ సీన్ చేయలేదు. ఏ సినిమా షూటింగ్‌లోనూ అది తీయలేదు. కేవలం ఒక AI టూల్ దాన్ని సృష్టించింది. ByteDanceకు చెందిన Seedance AI వీడియో మోడల్‌తో రూపొందిన ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, చాలామందికి అది కేవలం మరో AI వీడియోగానే కనిపించింది. అయితే హాలీవుడ్‌కు మాత్రం అందులో మరో విషయం కనిపించింది. సినిమా సృష్టించే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న గీత ఒక్కసారిగా చెరిగిపోతోందని. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి సీన్ కోసం నటులు కావాలి. కెమెరా కావాలి. లొకేషన్ కావాలి. స్టంట్ టీమ్ కావాలి. VFX నిపుణులు కావాలి. భారీ బడ్జెట్ కావాలి. ఇప్పుడు ఒక ప్రాంప్ట్‌తో ఇలాంటి విజువల్‌ను తయారు చేయగలిగితే… అసలు సినిమా పరిశ్రమలో ఎవరి హక్కులు ఎక్కడ మొదలవుతాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు Hollywoodను, AI కంపెనీలను ఒకే టేబుల్ దగ్గరకు తీసుకొచ్చింది. హాలీవుడ్ స్టూడియోలకు తమ సినిమాలు, పాత్రలు, ఫ్రాంచైజీలు కేవలం కథలు కాదు. అవే బిలియన్ డాలర్ల విలువైన intellectual property. AI వాటిని అనుమతి లేకుండా ఉపయోగించి కొత్త వీడియోలు తయారు చేస్తే, ఆ సృష్టికి హక్కు ఎవరిది? ఇది కేవలం ఒక లీగల్ ప్రశ్న కాదు. రేపటి సినిమా బిజినెస్ కు పెద్ద తలనొప్పిగా మారుతున్న సమస్య కూడా. Seedance తో
సినిమా తారలు వెండితెరపై ఎంతటి గ్లామరస్ పాత్రలు పోషించినా, నిజజీవితంలో వారు వ్యవహరించే తీరు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. రంగుల ప్రపంచానికి, ప్రచార ఆర్భాటాలకు దూరంగా సాధారణ ప్రజలతో మమేకమైనప్పుడు వారిలోని అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. కోలీవుడ్ హీరో విమల్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తాజాగా తన సొంతూరిలో ఆయన చేసిన ఓ చిన్న పని ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. ఓ సినీ హీరో ఏమాత్రం భేషజాలు లేకుండా స్థానిక సంతలో కూరగాయల వ్యాపారిగా మారిపోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.ఈ ఆసక్తికర సంఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పరై సమీపంలో ఉన్న తన స్వస్థలానికి విమల్ ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో పన్నన్కొంబు ప్రాంతంలో వారపు సంతను ఆయన సందర్శించారు. కేవలం అతిథిలా వచ్చి చూసి వెళ్లిపోకుండా, నేరుగా అక్కడి చిరువ్యాపారుల పక్కనే కూర్చుండిపోయారు. కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులను ఆప్యాయంగా పలకరిస్తూ, తానే స్వయంగా కూరగాయలు తూకం వేసి అమ్మడం ప్రారంభించారు. తమ అభిమాన నటుడు స్వయంగా మార్కెట్లో వ్యాపారం చేస్తుండటం చూసిన స్థానికులు, కొనుగోలుదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై ఆయన వద్దకు గుమిగూడారు.* రవితేజ ‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా?మార్కెట్లోని సాధారణ రైతులతో, వ్యాపారులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ... వారికి అమ్మకాల్లో విమల్ చేదోడువాదోడుగా నిలిచారు. అక్కడితో ఆగకుండా, కొంతసేపు వారి వద్ద గడిపిన అనంతరం చుట్టుపక్కల ఉన్న కొందరు చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఎంత ఎదిగినా తన మూలాలను, సొంత ఊరి ప్రజలను మర్చిపోకుండా ఆయన ప్రదర్శించిన నిరాడంబర వైఖరి అందరి హృదయాలను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆయన సింప్లిసిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్షఅయితే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Eshwar Sai Controversy:‘బాసింగ బలాలు’ ఫోక్ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు, నటుడు ఈశ్వర్ సాయి పేరు ప్రస్తుతం ఓ వివాదంలో వినిపిస్తోంది. వేములవాడలో మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో ఆయన ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తన భర్తతో మరో మహిళ సన్నిహితంగా ఉంటోందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన భర్తకు ఏడేళ్లుగా వివాహం జరిగిందని, ఆయన మంచివాడని ఆమె మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదంలోకి ఫోక్ యాక్ట్రెస్ వైష్ణవి సోనీ పేరును కూడా కొందరు తీసుకురావడంతో ఆమె స్పందించారు. తనకు ఈ వ్యక్తిగత వివాదంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగవద్దని కోరారు. వైష్ణవి సోనీ సోషల్ మీడియాలో ఒక స్టోరీ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశారు. పాట లేదా వీడియోను ఆధారంగా చేసుకుని తన గురించి కథనాలు తయారు చేయవద్దని ఆమె కోరారు. తన పని తాను చేసుకుంటున్నానని, ఇతరుల వ్యక్తిగత జీవితంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అలాగే తన క్యారెక్టర్‌పై ఎవరూ కామెంట్లు చేయవద్దని, తన ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు. తన పేరును ఈ వివాదంలోకి తీసుకురావడం వల్ల ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పకనే చెప్పారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Eshwar Sai Madhuri Rathod Controversy: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ల అక్రమ సంబంధం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్లకు చేరి, ఇరు వర్గాల మధ్య పరస్పర ఫిర్యాదులు, తీవ్ర ఆరోపణలతో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ వివాదం వేములవాడలోని రెడ్డి భవన్లో మొదలైంది. ఈశ్వర్ సాయి కోసం అతని భార్య శరణ్య, ఆమె సోదరి కలిసి అక్కడికి వెళ్లగా, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ ఒకే ఇంట్లో పట్టుబడ్డారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్నారి కూడా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలను శరణ్య సోదరి తన మొబైల్లో వీడియో రికార్డ్ చేసింది. ఇదే విషయమై తాము ప్రశ్నించినందుకు ఈశ్వర్ సాయి, అతని అసిస్టెంట్ తమపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మొబైల్ ఫోన్లు లాక్కున్నారని శరణ్య సోదరి ఆరోపించింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని రాయిదుర్గం పోలీస్ స్టేషన్లో శరణ్య సోదరి ఫిర్యాదు చేసింది. అయితే, ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరస్పర ఇష్టంతో ఉండే సంబంధాలు నేరం కిందకు రావని పోలీసులు స్పష్టం చేశారు. దాడులు లేదా ఫోన్ లాక్కున్న ఘటన వేములవాడలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేసుకోవాలని రాయిదుర్గం పోలీసులు వారికి

సినీ తారలు సాధారణంగా తెరపై తప్ప నిజ జీవితంలో సామాన్యుల మధ్యకు రావడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిది ఒక పాపులర్ హీరో రోడ్డు పై కూర్చుని కూరగాయలు అమ్మి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినీ తారలు సాధారణంగా తెరపై తప్ప నిజ జీవితంలో సామాన్యుల మధ్యకు రావడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిది ఒక పాపులర్ హీరో రోడ్డు పక్కన కూరగాయల దుకాణంలో కూర్చొని స్వయంగా కస్టమర్లకు కూరగాయలు తూకం వేసి అమ్ముతుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కోలీవుడ్ విలక్షణ నటుడు విమల్ (Hero Vimal) సరిగ్గా ఇలాంటి పనే చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తొలుత ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమవ్వగానే.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన ఫేక్ చిత్రాలని అంతా భావించారు. కానీ అసలు విషయం ఆరా తీయగా, ఆయన నిజంగానే తన సొంత గ్రామంలో కూరగాయలు విక్రయించారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణప్పారై సమీపంలో ఉన్న పన్నంకొంబు విమల్ సొంతూరు. మంగళవారం రాత్రి ఆయన తన స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, రోడ్డు పక్కన వారాంతపు సంత జరుగుతుండటం గమనించారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయో ఏమో కానీ, ఏమాత్రం సెలబ్రిటీ హోదాను మనసులోకి రానివ్వకుండా వెంటనే కారు దిగి నేరుగా సంతలోని ఓ కూరగాయల దుకాణానికి వెళ్లారు. అక్కడ కూరగాయల బుట్టల ముందు కూర్చొని సాధారణ వ్యాపారిలా కూరగాయలను చేతుల్లోకి తీసుకుని విక్రయించడం మొదలుపెట్టారు. తమ అభిమాన హీరో స్వయంగా కూరగాయలు అమ్ముతుండటం చూసిన స్థానిక ప్రజలు, సంతకు వచ్చిన కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో ఆయన దుకాణం వద్దకు తరలివచ్చారు. విమల్ సైతం ఎంతో ఆప్యాయంగా గ్రామస్తులతో మాట్లాడుతూ వారికి స్వయంగా కూరగాయలు తూచి ఇచ్చారు. కొందరు స్థానికులు ఈ అరుదైన దృశ్యాలను తమ స్మార్ట్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా క్షణాల్లో

లద్దాఖ్‌లోని మినామార్గ్ చెక్‌పోస్టు వద్ద ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ స్పందిస్తూ, సైనికులపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్‌లోని మినామార్గ్ చెక్‌పోస్టు వద్ద ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాహనాలను చాలాసేపు నిలిపివేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని ప్రశ్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. తాము జెన్ జీ తరానికి చెందినవారమని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితులను అంగీకరించబోమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి జనరల్ వీకే సింగ్ స్పందించారు. సాయుధ బలగాలు దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సైనికులపై విమర్శలు చేసే ముందు అక్కడి పరిస్థితులు, వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సైనికులపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ప్రజలు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. అసలు మినామార్గ్ చెక్‌పోస్టు వద్ద ఏం జరిగింది? లద్దాఖ్‌లోని మినామార్గ్ ప్రాంతంలో వాహనాలను గంటల పాటు నిలిపివేయడంతో పర్యాటకురాలు భద్రతా సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. కుటుంబాలతో, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న వాహనాలను ఎందుకు ఎక్కువసేపు ఆపారని ఆమె నిలదీసినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో భద్రతా కాన్వాయ్ అక్కడికి చేరుకోవడంతో రహదారి పక్కకు వెళ్లాలని సిబ్బంది ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రహదారిని కేవలం వీఐపీ కాన్వాయ్ కోసం మాత్రమే నిలిపివేశారని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక వివరణ ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది. లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం, రహదారి పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా వాహనాల రాకపోకలను

రీసెంట్ డేస్‌లో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్ ‘బాసింగా బలాలే’. ‘ఉత్తా చేతుల ఉంచను పిల్లా.. అటో డజను, ఇటో డజను గాజులు నీకేస్తా మల్లా..’ అంటూ ఈ హుషారైన సాంగ్‌తో మంచి ఫేస్ సంపాదించున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. మరో ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌తో ఓ ప్రైవేట్ రూమ్‌లో రాసలీలలు సాగిస్తూ.. తన భార్య శరణ్య చేతికి చిక్కాడు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈశ్వర్ సాయి.. మాధురి తో ఇప్పటికే పలు ఫోక్ సాంగ్స్‌లో నటించాడు. అలా వారి పరిచయం ఇలా ఇల్లీగల్ ఎఫైర్‌గా దారితీసినట్టు ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆరోపిస్తోంది.వీరిద్దరి వివాహేతర సంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నటి కూడా తనతో బాగా ఉండేదని, అయినా తన భర్తను ట్రాప్‌లోకి లాగి తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య వాపోయింది. ప్రస్తుతం ఈ ఇష్యు వేముల వాడ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దాంతో పాటే ఈ వీడియో కూడా అన్ని ప్లాట్ ఫామ్స్‌లో వైరల్ అవుతోంది. తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది! ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?

ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్‌మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్‌ను రోబో అధిగమించినట్లయింది. ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్‌మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం. నిలబడే రెండు మీటర్లు జంప్! పరుగులోనే కాదు.. జంప్‌లోనూ ‘సూపర్‌మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ

తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. జూడాలకు 5 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన చేసింది. పెంచిన ఈ శాతాన్ని 2026 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఇక నుంచి పీజీతో పాటు సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ప్రతి ఏటా స్టైఫండ్ 3 శాతం పెంచనున్నట్లు స్పష్టం చేసింది. జూనియర్ డాక్టర్లు తక్షణమే విధుల్లోకి చేరాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది

ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత్‌కు చెందిన వామికా అనే యువతి ఆస్ట్రేలియాలో చదువుకుంటోంది. వామికా ఎప్పటిలాగే వేడి నీటి స్నానం చేసింది. అయితే, స్నానం చేస్తున్నపుడు బాత్రూములోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆమె ఆఫ్ చేసింది. దీంతో వేడి నీటి కారణంగా ఏర్పడ్డ ఆవిరి బాత్రూము నుంచి బయటకు వెళ్లింది. బయట ఉన్న స్మోక్ డిటెక్టర్‌ను ఆవిరి కప్పేసింది. ఆవిరిని పొగగా భావించిన ఫైర్ అలారం ఒక్కసారిగా మోగటం మొదలెట్టింది. పోలీసులు ఫైర్ ఇంజిన్‌తో సహా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సూచనలు లేకపోవటంతో.. యువతిని ఎంక్వైరీ చేశారు. ‘నాకు ఏమీ తెలీదు. అలారం మోగుతుంటే ఫైర్ డ్రిల్ అనుకున్నాను’ అని యువతి అధికారులతో చెప్పింది. అయితే, ఫైర్ అలారం మోగటానికి కారణమైనందుకు గాను యువతికి అధికారులు 1800 డాలర్ల ఫైన్( ట్యాక్స్‌లు అదనం) వేశారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ మొత్తం 1.30 లక్షల రూపాయలు పైనే ఉంటుంది. తనకు ఎదురైన ఈ దారుణమైన అనుభవాన్ని యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. 1800 డాలర్ల ఫైన్ పడినందుకు కంటతడి పెట్టుకుంది. యువతి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది భారతీయులు విదేశాల్లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. తనకు కూడా ఫైర్ అలారం కారణంగా 1800 డాలర్ల ఫైన్ పడిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్.. అర్హులైన ఓటరు మిగలకూడదు

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల వీరాభిమాని శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితం కాగా.. హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల వీరాభిమాని శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితం కాగా.. హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె వైద్య నివేదికలను పరిశీలించి.. మందులు, ఇతర జీవన ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు

కార్గిల్‌లో భద్రతా సిబ్బందితో ఒక మహిళా పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. "మేం జెన్-జీ" అంటూ ఆ యువతి చేసిన వ్యాఖ్యను, గతంలో హోదాను ప్రదర్శించేందుకు వాడే "నా తండ్రి ఎవరో తెలుసా?" అనే అహంకారపూరిత మాటతో ఆయన పోల్చారు.బుధవారం 'ఎక్స్' వేదికగా ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, "నా తండ్రి ఎవరో తెలుసా' అనే మాట స్థానంలో ఇప్పుడు 'మేం జెన్-జీ' అనే కొత్త పదం వచ్చి చేరింది. చిన్న చిన్న విషయాలకే ఇలా 'జెన్-జీ' అంటూ బెదిరింపులకు దిగితే, ఆ తరం పట్ల సమాజంలో ఉన్న సద్భావనను వేగంగా దెబ్బతీయడమే అవుతుంది" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అసలేం జరిగింది?లద్దాఖ్‌లోని కార్గిల్‌లో ఉన్న మినీమార్గ్ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జులై 25న కార్గిల్ విజయ్ దివస్‌కు ఒక రోజు ముందు, వాతావరణం అనుకూలించకపోవడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. వారి కాన్వాయ్ సజావుగా సాగేందుకు జోజిలా-గుమ్రి మార్గంలో ట్రాఫిక్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ యువతి, భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. "మేం జెన్-జీ, ఇలాంటి అర్థం లేని పనులను సహించం. ఇప్పటివరకు కశ్మీరీలతోనే ఇలా ప్రవర్తించేవారు, ఇప్పుడు పర్యాటకులతో కూడా మొదలుపెట్టారా?" అని ఆమె ప్రశ్నించడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన జులై 25న జరగ్గా, ఆగస్టు 19న ఈ

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Emotional Family Video: కన్నవారి కలలను నెరవేర్చడంలో ఉండే ఆనందం అంతో, ఇంతో కాదు.. పేదరికంలో పుట్టినా.. పట్టుదలతో శ్రమించి పైకొచ్చి.. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూస్తే.. ఆ తృప్తి ముందు కోట్ల రూపాయలు కూడా పనికారవు.. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఒక యువకుడు తన తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించి.. వారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభూతిని బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో ఇప్పుడు లక్షలాది నెటిజన్ల హృదయాలను గెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఖేము సైనీ అనే యువకుడు ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఒకప్పుడు కుటుంబ తినడానికి చాలా కష్టం అయ్యేది.. నెలకు కేవలం 6 నుంచి 7 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ.. తీవ్రంగా కష్టపడేవాడు.. ఆ సమయంలో పూట గడవడమే ఎంతో కష్టంగా ఉండేది.. అలాంటి పరిస్థితుల్లో విమానం ఎక్కడం అనేది ఆ కుటుంబానికి కలలో కూడా ఊహించని విషయంగానే భావించవచ్చు.. కానీ.. ఖేము తన పేదరికాన్ని చూసి అస్సలు కుంగిపోలేదట.. తన కష్టాన్ని నమ్ముకుని పగలు రాత్రి చాలా వరకు కష్టపడ్డాడు.. ఎంతో శ్రమతో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత.. తన తల్లిదండ్రులకు, అక్కకు విమాన ప్రయాణం చేయించాలనే తన చిరకాల కోరికను నెరవేర్చాడు. ఖేము సైనీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా (@tijara_vines01) ద్వారా

రీల్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాళ్లు విసురుతున్నట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైళ్లపై రాళ్లు విసురుతున్నట్లు, ప్రయాణికులకు అసభ్య సంజ్ఞలు చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిఘాకు చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. సంపాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు అతడిని గుర్తించి రైల్వే చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో యువకుడు.. క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. తాను రైలుపై నిజంగా రాయి విసరలేదని,.. కేవలం రీల్ కోసం అలా నటించానని చెప్పాడు. ‘నేను నిజంగా ఆ రాయిని రైలుపైకి విసరలేదు.. పక్కకు విసిరేశాను. రైలుపైకి విసురుతున్నట్లు కేవలం నటించాను’ అంటూ చేతులు జోడించి క్షమాపణలు కోరాడు. ఇకపై ఇలాంటి తప్పు చేయబోనని తెలిపాడు. వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో నిజంగా ఏదైనా రైలు లేదా ప్రయాణికుడిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం, రైల్వే ట్రాక్‌ల సమీపంలో వీడియోలు చిత్రీకరించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా వైరల్ కోసం చేసే ఇలాంటి చర్యలు ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు చట్టపరమైన సమస్యలకు కూడా దారితీస్తాయని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు. ఇంటర్నెట్ డెస్క్: దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన రాష్ట్రం మణిపూర్. ఇక్కడి ప్రజలు బెయివోలి పండగను నెల రోజుల పాటు జరుపుకున్నారు. ఈ పండగ వేడుకలు ఇటీవల ముగిశాయి. దీంతో లియై గ్రామానికి చెందిన పలువురు యువకులు మురికి నీటితో ఉన్న చిన్న మడుగులోకి దిగారు. చొక్కాలు లేకుండా ఉన్న వారంతా తివాచీని ఆ నీటిలో ముంచి పైకి తీస్తూ పలుమార్లు ఉతికారు. అంతా ఒకే సారి వంగి పైకి లేస్తున్నారు. చుట్టూ కొండులను పచ్చదనం పరిచి ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియోను ట్విట్టర్లో నేహా గురుంగ్ పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోలోని దృశ్యాలు ఆ ప్రాంతానికి సంబంధించిన సామూహిక స్ఫూర్తికి, కఠోర శ్రమకు ప్రతిబింబమని వారు అభివర్ణించారు. మరొకరు అయితే ఆ ప్రాంత సంస్కృతి, కష్టపడి పని చేయడంతోపాటు నిజమైన ఐక్యతకు ప్రతిబంబమని తెలిపారు. సామూహికంగా కలిసి పని చేస్తే.. సామాజిక స్ఫూర్తిని నింపవచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొకరు అయితే ఈశాన్య భారతదేశ సంస్కృతి ప్రత్యేకంగా ప్రశంసనీయమైనదని గుర్తు చేశారు. ఈ వీడియో లియైలోని సామూహిక జీవన విధానాన్ని కూడా చూపించిందని చెప్పారు. నెల రోజుల పాటు సాగిన ఉత్సవాల తర్వాత.. తివాచీలు శుభ్రపరిచే పని సామూహిక బాధ్యతగా ఆ ప్రాంతంలో మారిందని నెటిజన్లు పేర్కొన్నారు