
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Nepal Floods: నేపాల్‌లో సృష్టించిన వరదల వల్ల ఆ దేశం చెప్పుకోలంతగా అల్లకల్లోలమైంది. నేపాల్‌లో సంభవించిన వరదలు ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేశాయి. వరదల ధాటికి ఊర్లకు ఊర్లకు కొట్టుకుపోయాయి. మరోవైపు పెద్ద పెద్ద భవనాలు సైతం పేక మేడల్లా కళ్ల ముందు కూలి పోయాయి. అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్న వారి జీవితాలు ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. ఇంట్లో చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టు తయారైంది పరిస్థితి. కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఎందుకు బతికున్నామా అంటూ రోదిస్తున్న సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజాగా నేపాల్ పోలీసులు వెల్లడంచిన సమాచారం ప్రకారం.. రసువాలో 45, నువాకోట్‌లో 155, ధాడింగ్‌లో 59, చిత్వాన్‌లో 348, గోర్ఖాలో 66, తనహున్లో 38, తూర్పు నవల్పరాసిలో 217 మరియు పశ్చిమ నవల్పరాసిలో 190 మృతదేహాలను వెలికితీశారు. ఆయా మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్ సేకరించి వాటి ఫోటోలను తీసి భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత కళ్లిన మృతదేహాలను దహనం కాకుండా సామూహికంగా ఖననం చేస్తున్నారు.
భారత్‌లో కూడా తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు నేపాల్ పోలీసులు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో కేవలం 95 మందిని మాత్రమే గుర్తించి, వారి ఫ్యామిలీస్‌కు అప్పగించడం జరిగింది. వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలను (గుర్తింపు లభించని వారితో సహా) చట్టపరంగా , శాస్త్రీయ పద్ధతుల ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అంతకుముందు తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
"గుర్తించడానికి వీలులేని స్థితిలో లభించిన మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహిస్తోంది.అదే సమయంలో వారి గుర్తింపునకు సహాయపడే DNA నమూనాలు, ఇతర ఆధారాలను జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న గాలింపులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్ముర గాలింపులతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఇప్పటికే అదనంగా 7912 మంది పోలీసులను రంగంలోకి దింపారు. వారి సాహాయంతో పునరావాస చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి 6,541 మందిని రక్షించినట్టు తెలిపారు. గల్లంతైనట్ల చెబుతున్న 4,858 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
కొట్టుకుపోయిన జలవిద్యుత్ కేంద్రాలు.. భోటే కోషి నది కారణంగా సంభవించిన భారీ ఆకస్మిక వరదల నేపథ్యంలో, కీలకమైన జలవిద్యుత్ కేంద్రాలు కొట్టుకుపోయాయి. అక్కడ టన్నెల్లో చిక్కుకున్న కొంత మందిని నేపాల్ భద్రతా దళాలు కాపాడాయి. మరోవైపు ఈ సహాయక చర్యల్లో నేపాల్ ఆర్మీతో భారత్, చైనాల నుండి ప్రత్యేక అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దించినట్లు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాఠ్మండులో అధికార ప్రజా దౌత్య విభాగం అధిపతి లోక్ బహదూర్ ఛెత్రి, భూగర్భంలోని టన్నెల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించే పనిలో ఉన్నట్టు తెలిపారు. అందరినీ కాపాడుతామని చెప్పారు.
"మేము ఇదివరకే చెప్పినట్లుగా, మా తక్షణ జాతీయ ప్రాధాన్యత స్పష్టంగా ఉంది. ప్రాణాలను కాపాడటం, తప్పిపోయిన వారిని గుర్తించడం, ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించడం, తక్షణ సహాయాన్ని అందించడంతోపాటు నేపాలీలు, విదేశీయులతో సహా బాధితులందరికీ తగిన సహాయం, మద్దతు అందేలా చూడటం మా కర్తవ్యం అంటూ చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





