
Deepika Padukone | దీపిక మెటర్నిటీ ఫొటోలు.. చిన్నారి దువా ఎంతక్యూట్గా ఉందో..!
Deepika Padukone | దీపిక మెటర్నిటీ ఫొటోలు.. చిన్నారి దువా ఎంత క్యూట్‌గా ఉందో..!
© 2026 nimisham.in

Deepika Padukone | దీపిక మెటర్నిటీ ఫొటోలు.. చిన్నారి దువా ఎంత క్యూట్‌గా ఉందో..!
Deepika Padukone: బేబీ బంప్‌తో దీపికా పదుకొణె.. కూతురు దువా బర్త్‌డే సందర్భంగా క్యూట్ ఫొటోలు షేర్ చేసిన రణవీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇందులో రణవీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకోన్ బేబీ బంప్ తో ఉంది. త్వరలో ఆమె తల్లి కాబోతుంది. ఈ ఫొటోలో రణవీర్ - దీపికాల కూతురు దువా కూడా ఉంది.
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం.. టార్గెట్ రూ. 12500 కోట్లు.. 7.47 శాతం వడ్డీతో!

Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..

‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. Romanchakam Movie Review 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ తమ భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై అన్నయ్య ప్రణవ్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'రోమాంచకం' (Romanchakam). ఈ మూవీతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'మేమ్ ఫేమస్'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), '8 వసంతాలు' ఫేమ్ అనంతిక (Ananthika) ఇందులో జంటగా నటించారు. సినిమా ప్రకటన నుంచే మంచి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆపై విడుదలైన పాటలతో యూత్‌కు కూడా చేరువయింది. అలాంటి ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ బుధవారం రాత్రి వేయగా గురువారం థియేటర్లకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా అన్నది రివ్యూలో చూద్దాం కథ విషయానికొస్తే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ పూర్తి చేసి తన నలుగురి ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే ఎప్పటికైనా రోమాంచకం పేరుతో నేటి జెన్ జీ యూత్‌కు ఫ్లెక్సిబుల్‌గా ఉండే విధంగా డేటింగ్ యాప్ ని పెట్టాలని ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. అందు కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఓ డేటింగ్ యాప్‌లో చెన్నైకి చెందిన అమ్మాయి మైథిలి (అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఆపై క్లోజ్ అవుతాడు. మైథిలీ పుట్టినరోజున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెన్నై వెళ్లిన అన్వేష్‌కు ఊహించని షాక్ తగులుతుంది. మైథిలి అతడిని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ ఫోన్ చేసి హైదరాబాద్ వస్తానని చెబుతుంది. హైదరాబాద్ వచ్చిన మైథిలీని అన్వేష్ తన ఫ్రెండ్ ఫ్లాట్ తనది అని చెప్పి అందులో ఉంచి ఫ్రెండ్‌ను కలవడానికి వెళతాడు. అయితే.. కాసేపటి తర్వాత అన్వేష్ తిరిగి వచ్చేటప్పటికీ

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నరసరావుపేట సమీపంలోని కాకాని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండను సందర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాకానిలోని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున హాస్టల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.తన పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత వాయుసేన (ఐఏఎఫ్), పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఖగంతక్-243' అనే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు (ఎల్ఆర్‌జీబీ) డ్రాప్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో సుదూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు మరింత పెరిగింది.ఈ పరీక్ష నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అందుకుందని, 'ఆత్మనిర్భర్ భారత్', 'మేకిన్ ఇండియా' స్ఫూర్తితో రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించామని సెప్టెంబర్ 2న 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా ఐఏఎఫ్ ప్రకటించింది. ఇది భారత వాయుసేనతో పాటు దేశీయ రక్షణ పరిశ్రమకు కూడా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది.ఖగంతక్-243 ప్రత్యేకతలునాగ్పూర్కు చెందిన జేఎస్ఆర్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంయుక్తంగా ఈ బాంబును అభివృద్ధి చేశాయి. 300 కిలోల తరగతికి చెందిన ఈ బాంబులో 125 కిలోల శక్తివంతమైన వార్‌హెడ్ ఉంటుంది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి పొఖ్రాన్‌లో దీనిని పరీక్షించారు.ఈ గ్లైడ్ బాంబును సుమారు 12 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు, తనకున్న రెక్కల సహాయంతో గాలిలో తేలుతూ 180 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలదు. దీనివల్ల, శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పరిధిలోకి వెళ్లకుండానే మన ఫైటర్ జెట్లు లోతైన ప్రాంతాల్లోని రన్వేలు, కమాండ్ సెంటర్లు వంటి వ్యూహాత్మక టార్గెట్లపై దాడి చేయవచ్చు.భవిష్యత్తులో మిగ్-29కె, మిరాజ్-2000 వంటి ఇతర విమానాల్లోనూ దీనిని అనుసంధానించనున్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో వీటి ఉత్పత్తి కోసం బీఈఎల్‌కు

జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. హైదరాబాద్, సెప్టెంబర్02: ఇటీవలే తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నర్సు హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిందితుడి పూర్వ నేరచరిత్రపై ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది. ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు

ఉక్రెయిన్- రష్యా మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక దేశంపై మరో దేశం పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల్లో తెలంగాణ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దాంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో ఉన్నారు. ఇక ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఉక్రెయిన్ పై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు పలు ప్రాంతాలపై రష్యా బలగాలు మంగళవారం భీకర దాడులు నిర్వహించగా.. ఈ హింసాత్మక ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల్లో వావిలాల సుదర్శన్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.ఉక్రెయిన్ కు వెళ్లడానికి ముందు సుదర్శన్ తన స్వగ్రామమైన హస్నాబాద్ లోనే షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఉపాధి కోసం వెతుక్కుంటూ ఆయన నాలుగు నెలల క్రితమే ఉక్రెయిన్ కు పయనం అయ్యాడు. ఇక సెప్టెంబర్ 1, మంగళవారం రోజున రష్యా బలగాలు కీవ్ నగరంపై క్రూజ్ మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడిన సమయంలో సుదర్శన్ తాను ఉంటున్న గది నుంచి బయటకు వచ్చాడు.అదే సమయంలో జరిగిన పేలుళ్ల ధాటికి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

Visakhapatnam: మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలి ఎమ్మెల్సీ రవిబాబు విశాఖపట్నం: మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆదివాసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అయోమయంలోకి నెడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. మారికవలస గురుకుల పాఠశాల పునరుద్ధరణ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట చెబుతూ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. మారికవలస గురుకుల పాఠశాలను కాపాడేందుకు వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన మరియు పలు ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి స్పష్టత లేదు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులతో చర్చలు జరిపినప్పటికీ, అసలు సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు అన్నారు. జీవో నెం.69ను రద్దు చేస్తామనే హామీ ఎక్కడా రాలేదని, మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను శాశ్వతంగా యథావిధిగా కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదని ప్రశ్నించారు. “తల్లిదండ్రులు కోరితే వారి పిల్లలను ఇక్కడ చదివిస్తాం” అని అధికారులు చెప్పడం శాశ్వత పరిష్కారం కాదని అన్నారు. ఇప్పటికే తల్లిదండ్రుల సమావేశంలో వందలాది మంది తమ పిల్లలు మారికవలస గురుకులంలోనే చదవాలని స్పష్టంగా తీర్మానం చేసినప్పటికీ, మళ్లీ ఒక్కో తల్లిదండ్రి నుంచి వ్యక్తిగతంగా లిఖితపూర్వక లేఖలు కోరడం ఏమిటని ప్రశ్నించారు

ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇప్పుడు ఇండియా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కేవలం రూ.10 లక్షలలోపు ధరలో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయడానికి ఈ కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం… మారుతి తీసుకురాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల లాగా పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ కాకుండా నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 నుంచి 315 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ రేంజ్, టాటా మోటార్స్ వారి టియాగో ఈవీకి సమానం. ఇప్పటికే ఉన్న పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం కాకుండా పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పైనే డిజైన్ రెడీ అవుతోందట. దీనివల్ల బ్యాటరీని సరైన స్థలంలో అమర్చడానికి, క్యాబిన్లో ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి, ఎలక్ట్రిక్ భాగాలను పర్ఫెక్ట్ గా అమర్చడానికి వీలవుతుందని మారుతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా ఎక్కువ భాగాలను తయారు చేయడం, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం వల్ల కారు ధరను అదుపులో ఉంచవచ్చని మారుతి సుజుకి భావిస్తోంది. సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య కొత్త ఈవి ఎక్స్-షోరూమ్ ధరను నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే భారత్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ కారు కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వ్యాగనార్, స్విఫ్ట్ వంటి కార్లను కొనాలనుకునే కస్టమర్లను కూడా ఈ కొత్త ఈవీ ఆకర్షిస్తుందని అంచనా. మారుతి ప్రీమియం షోరూమ్ నెక్సా ద్వారా ఇ-విటారా అమ్ముడవుతోంది. కానీ ఈ కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అరీనా నెట్వర్క్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్‌ని చాలా ప్రత్యేకంగా మార్చబోతున్నారట. హౌజ్ నుంచి, కంటెస్టెంట్ల ఎంపిక, వచ్చే కంటెస్టెంట్లు, గేమ్స్, టాస్క్ లు ఇలా అన్ని కొత్తగా ఉండబోతున్నాయని, ఎంటర్టైన్మెంట్ 10 టైమ్స్ అనేలా ప్లాన్ చేస్తున్నట్టు నాగార్జున ప్రోమోల్లో చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షో పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సారి చాలా వరకు తెలిసిన కంటెస్టెంట్లని ఎంపిక చేశారట. సెలబ్రిటీ విభాగంలో చాలా వరకు తెలిసిన వాళ్లే వస్తున్నారని సమాచారం. గతంలో సగం తెలియని వారు ఉండేది. ఇన్ఫ్లూయెన్సర్లు, సినిమా, టీవీకి సంబంధం లేని వారు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు ఉండేవారు. కానీ ఈ సారి చాలా వరకు ఎంటర్టైన్మెంట్ రంగానికి పరిచయం ఉన్నవాళ్లే వస్తున్నారట. అందులో ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు ఆల్మోస్ట్ కన్ఫమ్ అంటున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి సెలబ్రిటీలు, కామనర్స్ కలిపి దాదాపు 16 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారట. వీరిలో పది మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ ఉంటారని సమాచారం. వీరిలో సెలబ్రిటీ విభాగంలో టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, అదిత్(త్రిగుణ్), యాంకర్ వర్షిణి సౌందరాజన్, ముఖేష్ గౌడ, కృష్ణుడు, నటి చైత్ర రాయ్, సుధీర్ రెడ్డి, దేబ్జానీ వంటి సెలబ్రిటీ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్‌కి ఎంపిక చేశారట. ప్రస్తుతం వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమే అయితే హౌజ్ ఈ సారి యమ రంజుగా ఉండబోతుందని చెప్పొచ్చు. గ్లామర్‌కి గ్లామర్, కామెడీకి కామెడీ, ఫైట్లకి ఫైట్లు గట్టిగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక కామనర్స్ విభాగంలో సింగర్ ఝాన్సీ, రోహిత్, షాలిని

ప్రపంచంలో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. 2016లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కొత్తగా 5, 10 పౌండ్ల పాలిమర్ నోట్లను విడుదల చేసింది. అయితే వాటి తయారీలో ఉపయోగించిన పదార్థాల్లో టాలో (Tallow)కు సంబంధించిన అంశాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. టాలో అంటే సాధారణంగా మాంసం, ముఖ్యంగా పశువుల కొవ్వు నుంచి లభించే కొవ్వు పదార్థం. ఈ విషయం బయటకు రావడంతో బ్రిటన్‌లోని కొన్ని శాఖాహార సంఘాలు, హిందూ, సిక్కు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై పెద్ద చర్చ జరిగింది. పాలిమర్ నోట్లను తొలిసారిగా పెద్ద స్థాయిలో ప్రవేశపెట్టిన దేశాల్లో ఆస్ట్రేలియా ముందుంది. 1988లో అక్కడ పాలిమర్ కరెన్సీ నోట్ల వినియోగం ప్రారంభమైంది. ప్రారంభ దశలో వాటి తయారీకి ఉపయోగించిన కొన్ని పదార్థాల్లో జంతువుల నుంచి లభించే కొవ్వు ఆధారిత సమ్మేళనాలు ఉన్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా పాలిమర్ కరెన్సీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో జంతువుల కొవ్వు ఆధారిత పదార్థాల ఉనికిపై చర్చ జరిగింది. అయితే నోట్లలో నేరుగా జంతువుల కొవ్వును కలుపుతారని అర్థం చేసుకోవడం సరికాదు. తయారీ ప్రక్రియలో ఉపయోగించే కొన్ని రసాయన పదార్థాల్లో జంతువుల కొవ్వు నుంచి వచ్చిన భాగాలు ఉండే అవకాశం ఉంటుంది. పాలిమర్ నోట్ల తయారీలో పలుచటి ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తారు. ఈ షీట్లకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండటంతో అవి ఒకదానికొకటి అతుక్కోవడం, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. వీటిని నియంత్రించేందుకు తయారీ ప్రక్రియలో కొన్ని రకాల స్లిప్ ఏజెంట్లు, యాంటీ స్టాటిక్ ఏజెంట్లు ఉపయోగిస్తారు. వీటిలో స్టియరిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉండొచ్చు. స్టియరిక్ యాసిడ్ వివిధ వనరుల నుంచి తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో దీనిని జంతువుల కొవ్వు నుంచి కూడా ఉత్పత్తి చేస్తారు. అందుకే కొన్ని పాలిమర్ కరెన్సీల ముడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అత్యంత ఉద్రిక్త రూపం దాల్చింది. రష్యాపై మునుపెన్నడూ లేని రీతిలో అతిపెద్ద డ్రోన్ దాడులు చేయడానికి సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఏ క్షణంలోనైనా ఈ దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రష్యా గగనతలం పౌర విమానయానానికి ఎంతమాత్రం సురక్షితం కాదని, మాస్కోలోని విమానాశ్రయాలు కూడా తమ లక్ష్యాలలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఈ బహిరంగ హెచ్చరిక జారీ చేశామని, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ఆ ప్రాంతంలో ప్రయాణాలను తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా స్వయంగా ప్రారంభించిన యుద్ధం వల్లే నేడు ఆ దేశానికి ఈ దుస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ చేసిన ఈ బహిరంగ హెచ్చరికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ వైఖరి ఉగ్రవాదుల తీరును తలపిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయంగా తమపై ఎంత ఒత్తిడి వచ్చినా, ఉగ్రవాద తరహా చర్యలకు పాల్పడుతున్నవారితో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తెగేసి చెప్పారు. ఈ పరిణామాల మధ్యనే మంగళవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన విధ్వంసకర దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు ఈ యుద్ధంలో మృతి చెందినట్లు వెలువడిన వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి

ప్రపంచదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలం దాదాపుగా మూతబడినట్టేనని చెప్పారు. ఆవైపు వెళ్లొద్దని హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేమేమీ పౌర విమానయాన సంస్థలను టార్గెట్ చేయడం లేదు. కానీ రష్యా గగనతలంలో భారీ స్థాయిలో డ్రోన్స్ ఉండటం వల్ల రిస్క్‌ను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. రష్యా ప్రారంభించిన యుద్ధం వల్ల ఆ దేశ గగనతలమే మూత పడే స్థితి వచ్చిందని చెప్పారు. సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో వంటి నగరాల గగనతలంలో విమానాలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అద్యక్షుడి వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అవి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. తామూ ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా పుతిన్ ఉక్రెయిన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు చర్చలకు సిద్ధమేనని అంటున్నారు. కానీ ఉగ్రవాదులతో ఎలాంటి చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పాశ్చాత్య దేశాల ఎయిర్‌లైన్స్ ఇప్పటికే రష్యాకు విమానాల రాకపోకలను నిలిపివేశాయి. చైనా ఎయిర్‌లైన్స్ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇక రష్యా గగనతలంలో పౌర ఎయిర్‌లైన్స్ సంస్థలకు రిస్క్ ఉందని పౌరవిమానయాన రంగ కన్సల్టెన్సీ సంస్థ ఆస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది. ప్రస్తుతం, రష్యా సరిహద్దుకు 300 కిలోమీటర్ల లోపల వరకూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్‌పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) విమానయాన సంస్థలు, ప్రయాణికులకు హెచ్చరికలు చేశారు. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడులు చేపట్టడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఏ క్షణమైనా డ్రోన్లు ప్రయోగించే అవకాశం ఉందని.. రష్యా గగనతలం (Russian Airspace) పౌర విమానయానానికి సురక్షితం కాదని పేర్కొన్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించొద్దని సూచించారు. మాస్కోలోని విమానాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదని.. అందుకే ఈ బహిరంగ ప్రకటన చేశామన్నారు. విదేశీ ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని జెలెన్స్కీ కోరారు. దాడుల నేపథ్యంలో రష్యా తమ గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందన్నారు. వారు ప్రారంభించిన యుద్ధం వల్లే ఆ దేశానికి ఈ పరిస్థితి ఎదురయ్యిందని పేర్కొన్నారు. జెలెన్స్కీ ప్రకటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) మండిపడ్డారు. వారు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు పునఃప్రారంభించాలని తమపై ఎంత ఒత్తిడి చేసినా.. ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాగా మంగళవారం రాత్రి కీవ్‌పై రష్యా చేసిన దాడుల్లో 12మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Car Sales: భారతీయ కార్ల మార్కెట్లో ఆగస్టు 2026 నెల సరికొత్త చరిత్రను తిరగరాసింది. పండుగల సీజన్ కంటే ముందే కస్టమర్లు కార్లను విపరీతంగా కొనుగోలు చేయడంతో మారుతి సుజుకి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలు ఊహించని రీతిలో భారీ వృద్ధిని నమోదు చేసి సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. దేశీయంగా అత్యధిక కార్లు విక్రయించే దిగ్గజం మారుతి సుజుకి ఆగస్టు నెలలో 2,19,220 వాహనాలను అమ్మి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశీయ మార్కెట్లో 1,80,078 ప్యాసింజర్ వాహనాలను విక్రయించడమే కాకుండా, విదేశాలకు 33,844 యూనిట్లను ఎగుమతి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లోనే ఏకంగా 10 లక్షల వాహనాల మార్కును దాటేసి తన బలాన్ని నిరూపించుకుంది. గతేడాది ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 1,76,971 కి చేరింది. మహీంద్రా ఎస్‌యూవీల దాటికి సరికొత్త రికార్డు మహీంద్రా కంపెనీ విక్రయాలు ఆగస్టు నెలలో ఏకంగా 42 శాతం వృద్ధి చెంది 1,07,648 వాహనాలకు చేరాయి. ఈ ఘనతలో కంపెనీ ఎస్‌యూవీల వాటా అత్యంత ముఖ్యం. గతేడాది ఆగస్టులో 39,399 ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడవగా, ఈసారి 50 శాతం వృద్ధితో 59,257 యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 61,167 యుటిలిటీ వాహనాలను అమ్మి మార్కెట్‌ను ఊపేసింది. టాటా మోటార్స్ ఆగస్టు నెలలో 67,753 ప్యాసింజర్ వాహనాలను అమ్మి గతేడాది కంటే 56 శాతం భారీ వృద్ధిని సొంతం చేసుకుంది. ఇందులోనూ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు అగ్రభాగాన నిలిచాయి. కంపెనీ ఒకే నెలలో 16,549 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ఏకంగా 94 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా పెట్రోల్, డిజైన్ తో పాటు ఈవీల వైపు ప్రజలు చూపిస్తున్న ఆసక్తికి టాటా మోటార్స్ గణాంకాలే ప్రధాన ఉదాహరణ. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆగస్టు

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్‌ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్‌కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్‌ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్లు, మిసైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టిందని అన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక ఆగస్టు 31 సోమవారం కూడా ఉక్రెయిన్ లోని ఒడెసా నగరంపై రష్యా దాడులు చేసింది. ఏరియల్ బాంబ్స్, డ్రోన్ లతో విరుచుకుపడింది. దాంతో నగరంలోని వేలాది కుటుంబాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే గడిపాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. ఇక తాజాగా జరిగిన దాడిలో 12 మంది మృతి చెందారని.. వారిలో ఒకరు భారతీయుడని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఒడేసా, ఖేర్సన్, డొనెట్స్క్, జపోరిజియా, ఖార్కివ్, చెర్నిహివ్, జైటోమిర్, సుమీ అలాగే డినిప్రోలపై రష్యా చేపట్టిన దాడుల్లో డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడినట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కీవ్ నగరంలోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే ఈ దాడులకు బోరీస్పిల్ ప్రాంతంలోని ఐదంతుస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. ఇక 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అని అధికారులు తెలిపారు. కీవ్ నగరంలో 350 మందితో కూడిన రెస్క్యూ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని అన్నారు

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్‌కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్‌ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌ల ధరలను సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర కేవలం రూ.10గా నిర్ణయించారు. కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి పలు రకాల ఫార్మాట్లలో ఐస్‌క్రీమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రీమియం నాణ్యతతో పాటు తక్కువ ధరలో ఉత్పత్తులను అందించాలనే రిలయన్స్ వ్యూహంలో భాగంగానే ఈ బ్రాండ్‌ను రూపొందించారు. బాంబే క్రీమరీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నిజమైన డెయిరీ క్రీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు RCPL తెలిపింది. ఐస్‌క్రీమ్ తయారీలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అసలైన పాల పదార్థాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. RCPL డైరెక్టర్ టీ. కృష్ణకుమార్ మాట్లాడుతూ.. డెయిరీ ఉత్పత్తుల్లో షార్ట్‌కట్స్ ఉండకూడదనే ఆలోచనతో ఈ బ్రాండ్‌ను రూపొందించామని చెప్పారు. ప్రతి భారతీయ కుటుంబం కొనుగోలు చేయగల ధరలో అసలైన ఐస్‌క్రీమ్ రుచిని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. బాంబే క్రీమరీ ఉత్పత్తులను తొలుత పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలని RCPL ప్రణాళికలు సిద్ధం చేసింది. రిలయన్స్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, భారీ రిటైల్ వ్యవస్థ ఉంది. దీంతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను వేగంగా వినియోగదారులకు చేరవేయడం కంపెనీకి సులభం కానుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పటికే ఆహారం, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, గృహ వినియోగ ఉత్పత్తుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కాంపా ద్వారా డ్రింక్స్ మార్కెట్లో రిలయన్స్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఇండిపెండెన్స్ బ్రాండ్ ద్వారా వంట నూనెలు, పిండి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే పప్పులు, బియ్యం, నూడుల్స్, సాస్‌లు, బిస్కెట్లు, సబ్బులు, హెయిర్ కేర్, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తులు వంటి అనేక విభాగాల్లో కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇప్పుడు ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడం ద్వారా FMCG రంగంలో రిలయన్స్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది. భారత

అన్నదాతలకు గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో ఖాతాల్లోకి రూ.6వేలు పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్ పీఎం కిసాన్ రూ.2వేలు, అన్నదాత సుఖీభవ రూ.4వేలు PM Kisan 24th Installment: రైతులకు నిజంగా పండగలాంటి వార్త.. పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవకు సంబంధించి కీలక్ అప్డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 24వ విడత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అక్టోబర్ తొలి వారంలోనే ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.. అక్టోబర్‌లో PM Kisan 24వ విడత? దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా, ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇదివరకే 23వ విడత నిధులు రైతులకు అందాయి. ఇప్పుడు 24వ విడత కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ విడతను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ డేటా ప్రకారం.. అక్టోబర్ తొలి వారంలో పీఎం కిసాన్ 24వ విడత విడుదలకు కేంద్రం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రైతులకు డబుల్ బెనిఫిట్.. ఒకేసారి రూ.6వేలు? : ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం ఈసారి అదనపు బెనిఫిట్ లభించే ఛాన్స్ ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్రం అందించే రూ.6వేలు వార్షిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.14వేలు కలిపి మొత్తం రూ.20వేలు వార్షిక పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఆ నిధుల విడుదలపై కసరత్తు జరుగుతోంది

తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. లోతుకుంట భూవివాదం, కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన కఠిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సంచలన స్టే విధించింది. సెప్టెంబర్ 1న వెలువడిన ఈ ఉత్తర్వులతో రంగనాథ్ ప్రస్తుతానికి తన పదవిలో కొనసాగే అవకాశం స్పష్టంగా ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు సింగిల్ బెంచ్ ఆదేశాలను అమలు చేయకపోగా, ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేతో ఆయన స్థానం మరింత పటిష్టంగా మారింది. ఈ వివాదం మెదక్-మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలోని 40 ఎకరాల భూమి చుట్టూ ప్రారంభమైంది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ క్లెయిమ్ చేస్తున్న ఈ స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లి తాత్కాలిక నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కంపెనీ, కోర్టు ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను అధికారులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంటెంప్ట్ పిటిషన్లు దాఖలు చేసింది. గతంలో వివాదాస్పద స్థలానికి రక్షణగా సైన్యాన్ని కూడా కాపలాగా ఉంచే స్థాయికి ఈ గొడవ చేరింది. దీంతో జూలై 27న విచారణ చేపట్టిన జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి సింగిల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్‌పై ఏడాదిన్నర వ్యవధిలో 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన సమర్పించిన క్షమాపణ అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ, సీఎస్ వెంటనే రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి వేరొకరిని నియమించాలని సంచలన ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాము పిటిషనర్ భూమిలోకి వెళ్లలేదని, ప్రభుత్వ స్థలాన్నే రక్షిస్తున్నామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఫలితంగా ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పూర్తి స్థాయిలో బహిరంగ మద్దతుగా నిలిచారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా చట్టబద్ధంగానే పనిచేస్తోందని, కోర్టులను గౌరవిస్తూనే కబ్జాదారులపై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టిటిడి (TTD) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టిటిడి (TTD) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి (Anand Sai) కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు ఆనంద్ సాయి, ప్రముఖ నటి వాసుకి (Vasuki) దంపతుల కుమారుడే ఈ సందీప్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని మొదట ఒక ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. ఆ గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు జైద్‌షా కద్రీ అనే విద్యార్థి సహాయం చేస్తుండగా, సందీప్ నడుపుతున్న మహీంద్రా కారు అత్యంత వేగంగా వచ్చి వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందులాల్ అక్కడికక్కడే మృతి చెందగా, విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా సందీప్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టి, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును సీజ్ చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి

అన్నదాతలకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఒకవైపు వర్షాలు, ఎల్ నినో కష్టాలు, మరోవైపు పండుగల సీజన్ స్టార్ట్ కావడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులతో పాటు ఏపీ ప్రభుత్వం అందించే 'అన్నదాత సుఖీభవ' సొమ్మును ఒకేసారి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తారు. గతేడాది జూన్ నెలలో 23వ విడత నిధులు అందాయి. అయితే 24వ విడత నిధులను మొదట వినాయక చవితి పండుగ కానుకగా ఈ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ఇది రెట్టింపు సంతోషాన్నిచ్చే వార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రూ.6,000 కి అదనంగా ఏపీ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా మరో రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 వార్షిక సాయంగా అందిస్తోంది. కేంద్రం 24వ విడత కింద రూ.2,000 విడుదల చేసే సమయంలోనే, ఏపీ ప్రభుత్వం కూడా తన వంతు వాటాను కలిపి రూ.6,000 ఒకే విడతగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనివల్ల పండుగల వేళ ఏపీ రైతులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలగనుంది. పథకంలో పేరు నమోదైనంత మాత్రాన డబ్బులు పడతాయని అనుకుంటే పొరపాటే. నిధులు అకౌంట్లో జమకావాలంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. • e-KYC పూర్తవ్వాలి: మీ ఆధార్ సీడింగ్, ఇ-కేవైసీ కంప్లీట్ కాకపోతే తదుపరి విడత డబ్బులు నిలిచిపోతాయి

టీడీపీ ఎంపీ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లు (Government Schools), హాస్టల్స్ (Hostels) కు అండగా నిలిచారు. నెల్లూరు జిల్లా ( Nellore District)లోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ వసతుల కల్పనకు సాయం ప్రకటించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ప్రారంభించిన విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షుశుక్లా (Himanshu Shukla)ను ఎంపీ వేమిరెడ్డి కలిసి రూ.కోటి విరాళం ఇస్తానని తెలియజేయగా, కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.5 కోట్ల విరాళాలు అందాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

Navapanchama Rajayoga: గ్రహ మండలంలో దేవు గురువు బృహస్పతి రాక్షస గురువు అయిన శుక్రులు తమ కదలికతో నవ పంచమ రాజ యోగం ఏర్పడింది. దీంతో ఈ 5 రాశుల దశ, దిశ విధి రాత మారబోతుంది. అంతేకాదు ఆకస్మిక సంపదతో పాటు లాభాలను తీసుకురాబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గోచారం ఘోషిస్తుంది. Navapanchama Rajayoga Effect 2026: అసుర గురువు శుక్రుడు ఫిబ్రవరి 6న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారము తరువాత, శుక్రుడు బృహస్పతితో కలిసి నవపంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ యోగం వల్ల ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.. రాక్షస గురువు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు... మిథునరాశిలో ఉన్న దేవ గురువు బృహస్పతితో కలిసి నవపంచమ రాజ యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ రెండు గ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఐదవ ఇల్లు జ్ఞానం, ప్రేమ, అనురాగం, భావోద్వేగాలకు ప్రతీక. తొమ్మిదవ ఇల్లు అదృష్టం, మతంతో పాటు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అందువల్ల, నవ పంచమ యోగం ఏర్పడటం కొన్ని రాశుల వారికి మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకోండి... సింహ రాశి: సింహ రాశి వారికి సమాజంలో గౌరవంతో పాటు వారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. శుక్రుడు, బృహస్పతి కలయికతో ఏర్పడిన నవ పంచమ కలయిక సమయంలో గత ప్రయత్నాలతో గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు కోరుకున్న ఒప్పందాలను చేసుకుంటారు. మిథున రాశి: మిథున రాశి వారి తెలివితేటలు, జ్ఞానంలో పెరుగుదలను అనుభవిస్తుంటారు. ఇది వారి విద్యలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన ఏదైనా డబ్బు తిరిగి పొందవచ్చు. అదృష్టం కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి: కుంభ రాశి వారికి శుక్రుడు, బృహస్పతి నవ పంచమ కలయిక వలన కుంభ రాశి వారికి

యువ కథానాయకుడు సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటించిన రోమాంచకం చిత్రం హైదరాబాద్ స్పెషల్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 2న ప్రదర్శితం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి ఒక్క రోజు ముందే ఈ ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ స్పెషల్ షోలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలయికతో వినోదాత్మకంగా ఉంటుంది. విదేశాల్లో యూఎస్, యూకేలలో కూడా సెప్టెంబర్ 2నే ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరారు. దీంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా థియేటర్ల దగ్గర ప్రీమియర్ షోలకు సంబంధించి బజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి వైవిధ్యమైన సంగీతాన్ని వాసుకి వైభవ్ సమకూర్చడం విశేషం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుండి యు సర్టిఫికేట్ పొందింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ కలిసి హాయిగా థియేటర్లలో చూడదగిన కుటుంబ వినోదాత్మక చిత్రంగా ఇది సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ చిత్రం పంపిణీ బాధ్యతలను తీసుకున్నారు. భారత్‌లో సాధారణ థియేట్రికల్ షోలు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ యంగ్ టీమ్ ప్రయోగాన్ని ఆదరిస్తారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. స్నేహితుల బృందంతో కలిసి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి రోమాంచకం సరైన చిత్రమని మేకర్స్ నొక్కి చెప్పారు. హైదరాబాద్ ప్రీమియర్స్ టికెట్ల విక్రయం వేగంగా సాగుతుండటంతో థియేటర్ల సంఖ్యను పెంచే దిశగా ఆలోచిస్తున్నారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ పైన బిగ్ అప్డేట్. 24వ విడత నిధుల జమ పైన కసరత్తు జరుగుతోంది. వరుస పండుగలు.. ఎల్ నినో కష్టాల వేళ రైతుల ఖాతాల్లో నిధుల జమ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మలి విడత నిధుల పైనా రైతులకు కీలక సమాచారం అందిస్తున్నారు.పీఎం కిసాన్ 24వ విడత నిధుల జమ పైన కేంద్రం సిద్దం అవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. చివరి విడత అయిన 23వ విడత జూన్‌లో విడుదలైంది. దీంతో.. 24వ విడత నిధుల జమ పైన చర్చ సాగుతోంది. ఈ నెలలోనే తొలుత విడదల చేయాలని భావించారు. వినాయక చవితి వేళ ఈ నిధులు జమ చేయాలని ఆలోచన చేసారు. అయితే, కేంద్రంలో ఈ మేరకు తాజాగా జరిగిన చర్చల్లో అక్టోబర్ తొలి వారంలో ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పథకంలో నిధులు పొందే రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు, కొత్త టైమింగ్స్..!!రైతులకు కీలక సూచనలురైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉందని చబుతున్నారు. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాలనుకుంటే రైతులుఆన్లైన్లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే విధంగా పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే ఏపీ ప్రభుత్వం

హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో జాప్యం వహించిన పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి, సెప్టెంబర్ 01: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్‌కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ పేరుతో మోసం.. బలవంతంగా పెళ్లి: కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

రూ.2వేల కోట్ల పెట్టుబడి, వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మాణం విశాఖపట్నం: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ(AIG) ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖ ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముందుగా ఎండాడ వద్ద వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రికి సంబంధించి రూపొందించిన ఏవీని వీక్షించారు. రూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశలవారీగా ఐదేళ్లలో 2వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. విశాఖలో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనుంది. ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్‌ను నెలకొల్పనుంది. మొదటి దశ నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నారు. రెండో దశ నిర్మాణాలను 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు, డైరెక్టర్

* విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన * సిరిపురం సర్కిల్ లో దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్ * ‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్ మన్షిప్’ గా రోశయ్య గారి విగ్రహం నిలవాలని మంత్రి లోకేష్ ఆకాంక్ష * ఆయన రాజకీయ విలువలు, పార్టీలకు అతీతంగా సమాజానికి ఆయన చేసిన సేవ భవిష్యత్ తరాలకు తెలపాలని పిలుపు * విశిష్ట అతిథులుగా హాజరైన రోశయ్య గారి కుటుంబసభ్యులతో మంత్రి లోకేష్ ప్రత్యేక భేటీ * కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఏపీ ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం.. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవతారమెత్తాడు. అంతేనా ఓ ప్రత్యేక జడ్జీని బెదిరించి ఘోర మోసానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ తీవ్ర నేరానికి గాను అతనికి ఎనిమిది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా సంచలన తీర్పును ఇచ్చారు. నిందితుడు చేసిన తప్పు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, విచారణ ప్రక్రియను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.పోలీస్ కస్టడీలోనే ప్లాన్.. కానిస్టేబుల్ ఫోన్‌తో డ్రామాఅవినీతి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28వ తేదీన.. కానిస్టేబుల్ మంజీత్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను దక్కించుకున్నాడు. దాని ద్వారా అప్పట్లో అవినీతి నిరోధక చట్టం కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జ్ పూనం చౌదరి ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్లకు ఫోన్ చేశాడు. మొదట సుప్రీంకోర్టు జడ్జి వద్ద పనిచేసే ప్రైవేట్ కార్యదర్శినని పరిచయం చేసుకుని, ఆ తర్వాత స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినేనని బురిడీ కొట్టించాడు. తన కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యోగ పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జీని బెదిరింపులకు గురిచేశాడు.ఇదీ చూడండి: జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన సీజేఐవిడివిడిగా శిక్షలు.. ఒకదాని తర్వాత ఒకటి అమలు!కానీ జడ్జీ మాత్రం ఈ పని చేసింది ఎవరో తెలుసుకున్నారు. ముఖ్యంగా అది కానిస్టేబుల్ నెంబర్ అని తెలుసుకుని.. నిందితుడిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆపై విచారణ జరిపి.. సుకేష్ చంద్రశేఖరే నిందితుడిని గుర్తించారు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన సుకేష్‌ను ఐపీసీ సెక్షన్లు

వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్లో 14 వేలకుపైగా పరుగులు చేశానని, అందుకు తన అనుభవమే నిదర్శనమని చెప్పాడు. ఇటీవల ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో రూట్ ఏకంగా ఎనిమిది సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనే మూడుసార్లు ఎల్బీడబ్ల్యూ అవ్వడం గమనార్హం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లోనూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ‘నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. ఇలాంటి సమస్యలను గతంలోనూ అధిగమించాను. దీనిని కూడా అలాగే పరిష్కరించుకుంటాను. నాకు 14 వేల పరుగులు ఊరికే రాలేదు. దీని వెనుక దాదాపు 15 ఏళ్లుకు పైగా కష్టం, శ్రమ ఉన్నాయి. అయితే ఈ వరుస వైఫల్యాలు నన్ను కూడా అసహనానికి గురి చేస్తున్నాయి. కానీ అందులో కొన్ని నిర్ణయాలు ‘అంపైర్స్ కాల్’ కారణంగా నాకు అనుకూలంగా రాలేదు. ఈ సమస్య నుంచి కూడా బయటపడతాను. దీనిపై నాకు పెద్దగా ఆందోళన లేదు’ అని రూట్ తెలిపాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్యాటర్ల తడబాటుకు కొత్త డ్యూక్స్ బంతి కూడా ఒక కారణమని రూట్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఉపయోగిస్తున్న బంతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పాడు. ‘ఈ ఏడాది బంతులు చాలా భిన్నంగా ఉన్నాయి. వాటికి వేరే రకమైన లాకర్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీనిపై నా దగ్గర ఆధారాలు లేవు. డ్యూక్స్నే అడగాలి. బంతి త్వరగా ఆకారం కోల్పోకుండా ఉండేందుకు సీమ్‌పై ప్రత్యేకమైన లాకర్ వేసి ఉండొచ్చు’ అని రూట్ పేర్కొన్నాడు

భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కీలక భేటీ నిర్వహించారు. ఇరు దేశాధినేతలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలు, సవాళ్లపై చర్చించారు. అలాగే ఉక్రెయిన్- రష్యా మధ్య నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధానికి ఇక ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం నశిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్ కేక్ లో నిర్వహించిన షాంగై కో ఆపరేషన్ సదస్సు(SCO) లో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. శాంతి స్థాపన కోసం భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ మేరకు తన సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. " ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం వెనక్కు వెళ్తుంది. శాంతి స్థాపన కోసం ముందుకు వేసే ఒక్కో అడుగు మానవత్వాన్ని పెంపొందిస్తుంది. కొత్త ఆశలను చిగురింపజేస్తుంది" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మనమంతా ముగింపు లేని యుద్ధం నుంచి ముగింపు పలికే యుద్ధం దిశగా చేరుకోవాలని అన్నారు. మానవత్వం సంరక్షణకు ఇదే ముందడుగు.. వీలైనంత త్వరలో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాంతి సందేశం విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ఇచ్చే సందేశం ఇదేనని ప్రధాని మోదీ.. పుతిన్ తో జరిగిన భేటీలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్ తో యుద్ధంపై చర్చలు నిర్వహించారు. గతంలోనూ పుతిన్ తో జరిగిన భేటీల్లో ఉక్రెయిన్ అంశాన్ని ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. " ఎక్సెలెన్సీ.. ఉక్రెయిన్ గురించి మేము

కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన దౌత్యపరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. "అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేయాలి" అని ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ సూచించారు.ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని యావత్ మానవాళి కోరుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతి శాంతియుత ప్రయత్నానికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ఏ సమస్యనైనా శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలన్నదే భారత్ నిశ్చితాభిప్రాయం. ఇది సకల మానవాళి శ్రేయస్సుకు అత్యవసరం. యుద్ధం కొనసాగే ప్రతి రోజూ మానవ ప్రగతిని వెనక్కి నెడుతుంది. కాబట్టి దీనికి తక్షణమే ముగింపు పలకాలి" అని మోదీ వివరించారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత గడ్డ ఎల్లప్పుడూ శాంతి మార్గాన్నే బోధిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.2022లో జరిగిన ఎస్సీఓ సదస్సులో "ఇది యుద్ధాల యుగం కాదు" అని పుతిన్‌తో మోదీ చేసిన చారిత్రాత్మక వ్యాఖ్యలకు కొనసాగింపుగానే తాజా సందేశం సాగింది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ జరిపిన ప్రతి సంభాషణలోనూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ నొక్కి చెబుతూ వస్తోంది

ఈ ఏడాది బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 - సీజన్ 2 పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఎఫ్డీసీ ఎండీ, జీ ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలకు చోటు కల్పించారు. ఈ పోటీలను యువ ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా మాట్లాడుతూ..'ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని' అని అన్నారు. ఈ పోటీలకు పంపే లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష ఉండనుంది. వీటితో పాటు మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.20 వేలతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేయనున్నారు. ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో విషాదాంతం చోటుచేసుకుంది. గోదావరి నదిలో గల్లంతైన ఆయన భార్య మీనా (55) మృతదేహం శనివారం లభ్యమైంది. ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలకు దీంతో ముగింపు పలికినట్లయింది.వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఏఈ నూకరాజు తన కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో మనవడు కార్తికేయ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. నదిలో గల్లంతైన మిగతా ముగ్గురి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఈ క్రమంలో ఈ నెల 17న నూకరాజు, 20న ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలను అధికారులు వెలికితీశారు. తాజాగా శనివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన, ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద మీనా మృతదేహాన్ని గాలింపు బృందాలు గుర్తించాయి. మీనా మృతదేహం కూడా లభ్యం కావడంతో నదిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా జలసమాధి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం

తమిళనాడు బంగారు ఉంగరాల పథకం టెండర్లో జాయలక్కాస్ జ్యువెల్లర్స్ చేసిన ₹0.01 కోట్ ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు 1 గ్రాము 22 క్యారెట్ బంగారు ఉంగరం అందించేందుకు ఈ పథకం రూపొందించారు. బంగారం ధర కాకుండా మేకింగ్, హాల్‌మార్కింగ్, బీమా, రవాణా ఖర్చులన్నింటికీ జాయలక్కాస్ కేవలం ఒక్క పైసా కోట్ చేసింది. దీంతో టెండర్లో అత్యల్ప ధరదారుగా నిలవగా, కల్యాణ్ జ్యువెల్లర్స్ కూడా అదే ధరకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. అయితే ఒక్క పైసాకే గ్రాము బంగారం ఇస్తున్నారనే అర్థం కాదు. అసలు బంగారం ధరను ప్రభుత్వమే మార్కెట్ రేటు ప్రకారం విడిగా చెల్లిస్తుంది. తమిళనాడు బంగారు ఉంగరాల పథకాన్ని ‘తాయ్‌మామన్ తంగ మోతిరం తిట్టం’ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చింది. తమిళ సంప్రదాయంలో మేనమామ శిశువుకు కానుక ఇచ్చే ఆచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ పథకాన్ని రూపొందించారు. తమిళనాడు శాశ్వత నివాసుల కుటుంబాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పుట్టిన శిశువులకు ఉంగరం అందిస్తారు. సీఎం సి. జోసెఫ్ విజయ్ పుట్టినరోజైన 2026 జూన్ 22 నుంచి జన్మించిన పిల్లలకు పథకం వర్తిస్తుంది. అధికారికంగా 2026 సెప్టెంబర్ 15న పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఉంగరం 1 గ్రాము బరువుతో 22 క్యారెట్, 916 బీఐఎస్ హాల్‌మార్క్ ప్రమాణాలతో ఉండనుంది. తమిళనాడు బంగారు ఉంగరాల పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు ₹755.83 కోట్లు కేటాయించింది. దాదాపు 4.41 లక్షల బంగారు ఉంగరాలను సరఫరా చేయాలనే లక్ష్యంతో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. మొత్తం 11 కంపెనీలు పోటీపడగా, అసలు బంగారం ధర ఈ పోటీలో భాగం కాదు. దీంతో మేకింగ్ ఛార్జీలు, హాల్‌మార్కింగ్, ప్యాకింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులపైనే కంపెనీలు ధరలు సమర్పించాయి. ఇదిలా ఉండగా, ఇతర సంస్థలు వందల నుంచి వేల రూపాయల వరకు కోట్ చేయగా

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ వివాదం మరోసారి చర్చకు దారితీసింది. చిత్రం నుంచి తప్పుకున్న దీపికా పదుకొణెపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవల పలు ఆరోపణలు చేశారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వని దీపికా, పాత్రికేయురాలు జాన్వి మంచందా పెట్టిన సామాజిక మాధ్యమ పోస్టును లైక్ చేశారు. మహిళా నటుల డిమాండ్లపై పరిశ్రమలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో దీపికా లైక్‌ను వంగా బ్రదర్స్ ఆరోపణలకు పరోక్ష కౌంటర్‌గా పలువురు భావిస్తున్నారు. అయితే దీనిని ఆమె అధికారిక స్పందనగా పరిగణించలేమన్న విషయం కూడా గమనించాలి. 2025లో దీపికా పదుకొణె స్పిరిట్ నుంచి తప్పుకోవడంతో పని గంటలు, పారితోషికంపై భిన్నమైన కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త తల్లిగా రోజుకు 8 గంటల పని షెడ్యూల్ కావాలని ఆమె కోరినట్లు అప్పట్లో నివేదికలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనంతరం పేరును ప్రస్తావించకుండా అసభ్య ప్రచార ఎత్తుగడలు, చెప్పని గోప్యతా ఒప్పందం అంటూ స్పందించారు. ఆ వ్యాఖ్యలు దీపికాను ఉద్దేశించినవేనని సినీ వర్గాల్లో విస్తృతంగా భావించారు. తరువాత ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంపిక చేయడంతో స్పిరిట్ వివాదం కొంతకాలం సద్దుమణిగింది. తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో పాత అంశాలు మరోసారి ముందుకొచ్చాయి. ప్రణయ్ రెడ్డి వంగా కథనం ప్రకారం పారితోషికం, చిత్రీకరణ సమయాలతోపాటు మరికొన్ని అంశాల్లో ఒప్పందం కుదరలేదు. ముఖ్యంగా సినిమా నికర లాభాల్లో దీపికా 10 శాతం వాటా కోరినట్లు ఆయన వెల్లడించారు. ఆమె ఏదైనా అడగవచ్చని, కానీ చిత్ర ఆర్థిక లెక్కలకు సరిపడితేనే ఇవ్వగలమని వివరించారు. దీంతో ఆ ప్రతిపాదన అనుకూలంగా లేదని భావించి ఇతర అవకాశాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, సినిమా కథతోపాటు పాత్రకు సంబంధించిన అంతర్గత సమాచారం బయటకు వెళ్లిందని కూడా ఆరోపించారు. దీపికాతో ముందుకు వెళ్లకూడదనే నిర్ణయం దర్శకుడు సందీప్ రెడ్డి

తణుకు(ప.గో. జిల్లా): ఏపీలో నియంత పాలన కొనసాగుతోందనడానికి తమ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని కూల్చేయడం మరొక ఉదాహరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. కక్షతోనే ఆమె ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 22వ తేదీ) తణుకు నియోజకవర్గం అయింతపూడిలో కూటమి నేతలు కూల్చేసిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని పరిశీలించడానికి వైఎస్సార్సీపీ నేతలు వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి తదితరులు వెళ్లారు. దీనిలో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు. ‘మాజీ సర్పంచ్ లావణ్యను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ టార్గెట్ చేశారు. కక్షతో ఆమె ఇంటిని కూల్చేశారు. తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉందో అర్థమవుతుంది. హిట్లర్, గడాఫీ కన్నా దారుణంగా టిడిపి నాయకుల పాలన ఉంది. టీడీపీ కండువా వేసుకోలేదని వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారని వీరిపై కక్ష గట్టారు. ఇది కూటమి ప్రభుత్వమా కూల్చివేతల ప్రభుత్వమా...?, మహిళ అని కూడా చూడకుండా లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని తెల్లవారుజామున వచ్చి కూల్చివేశారు..ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు బుల్డోజర్ సర్కార్. అసలు మనం ఏపీలో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా’ అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయితంపూడి మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మహిళపై ఎందుకింత కక్ష. ఇల్లు కూల్చడమే కాకుండా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడతారా....?, ఫ్లెక్సీల కోసం ఏకంగా సీసీ కెమెరాలు నిఘా పెట్టారు. తణుకులో వైఎస్సార్సీపీకి మద్దతు పెరుగుతుందని ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి ఇల్లు కూల్చేశారు. ఇళ్లలో ఎవరు ఉన్నారు.. ఏంటి అనేది ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదా?, వైఎస్సార్సీపీ వారి ఇళ్లను కూల్చి వేయించడం దారుణం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి’ అని హెచ్చరించారు. ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)

Tanuku: ఘనంగా మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం! తణుకు: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం తణుకు పట్టణంలో మానవతా శాంతి ర్యాలీ నిర్వహించారు. తోలుత ర్యాలీని ప్రిన్సిపాల్ K శ్రీనివాసరావు స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభించి అనంతరం నరేంద్ర కూడలి మీదుగా ఎన్టీఆర్ పార్క్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాల్లో విద్యార్థులకు బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ తణుకు శాఖ అధ్యక్షుడు వంగూరి హనుమంతరావు, బోయపాటి రామలక్ష్మి, యస్ వి సతీష్ బాబు,పాతూరి శివన్నారాయణ, ఆకుల శేషుబాబు,కడించర్ల రాజరాజేశ్వరరావు., పుప్పాల రామకృష్ణ , డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజు,పిఆర్ కె రాజు బోడపాటి ప్రసాద్ ఒబిలిశెట్టి హరనాథ్ అక్కా పంతుల బాలాజి, వి.శ్రీనివాస రావు, ఎస్బిఐఎం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలల విద్యార్థు పాల్గొన్నారు

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా వైశాఖ్ (vaisakh) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ (Khalifa 2) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాకు మార్కెట్లో తగినంత బజ్ రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మలయాళ వెర్షన్‌కు భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. అయితే ‘ఖలీఫా’ టీమ్ సడెన్‌గా ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా సక్సెస్ మీట్లోనే ‘ఖలీఫా 2’ను అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్‌ను కూడా వెల్లడించింది. ‘ఖలీఫా 2 – ది లెగసీ’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్లో మోహన్‌లాల్ కీలకమైన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన మంబరక్కల్ అహ్మద్ అలీ పాత్రను పోషించనుండగా.. మొదటి భాగంలో హీరోగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమిర్ అలీగా మరోసారి కనిపించనున్నారు. మొదటి భాగంలో కొనసాగిన కథనే సీక్వెల్లో ముందుకు తీసుకెళ్లనుండగా.. ఈసారి అహ్మద్ అలీ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం చూసిన వారికి మోహన్‌లాల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమిర్ అలీ తాతగా మోహన్‌లాల్ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు. టోవినో థామస్ కూడా సహాయక పాత్రలో నటించారు. జిను వి. అబ్రహామ్, సూరజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఉన్న పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. మొదటి భాగం విడుదలైన వెంటనే సీక్వెల్‌ను ప్రకటించడం, అందులో మోహన్‌లాల్‌ను కీలక పాత్రలోకి తీసుకురావడం ఇప్పుడు మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది