
Deepika Padukone | దీపిక మెటర్నిటీ ఫొటోలు.. చిన్నారి దువా ఎంతక్యూట్గా ఉందో..!
Deepika Padukone | దీపిక మెటర్నిటీ ఫొటోలు.. చిన్నారి దువా ఎంత క్యూట్‌గా ఉందో..!
© 2026 nimisham.in

Deepika Padukone | దీపిక మెటర్నిటీ ఫొటోలు.. చిన్నారి దువా ఎంత క్యూట్‌గా ఉందో..!
Deepika Padukone: బేబీ బంప్‌తో దీపికా పదుకొణె.. కూతురు దువా బర్త్‌డే సందర్భంగా క్యూట్ ఫొటోలు షేర్ చేసిన రణవీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇందులో రణవీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకోన్ బేబీ బంప్ తో ఉంది. త్వరలో ఆమె తల్లి కాబోతుంది. ఈ ఫొటోలో రణవీర్ - దీపికాల కూతురు దువా కూడా ఉంది.

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ వివాదం మరోసారి చర్చకు దారితీసింది. చిత్రం నుంచి తప్పుకున్న దీపికా పదుకొణెపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవల పలు ఆరోపణలు చేశారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వని దీపికా, పాత్రికేయురాలు జాన్వి మంచందా పెట్టిన సామాజిక మాధ్యమ పోస్టును లైక్ చేశారు. మహిళా నటుల డిమాండ్లపై పరిశ్రమలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో దీపికా లైక్‌ను వంగా బ్రదర్స్ ఆరోపణలకు పరోక్ష కౌంటర్‌గా పలువురు భావిస్తున్నారు. అయితే దీనిని ఆమె అధికారిక స్పందనగా పరిగణించలేమన్న విషయం కూడా గమనించాలి. 2025లో దీపికా పదుకొణె స్పిరిట్ నుంచి తప్పుకోవడంతో పని గంటలు, పారితోషికంపై భిన్నమైన కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త తల్లిగా రోజుకు 8 గంటల పని షెడ్యూల్ కావాలని ఆమె కోరినట్లు అప్పట్లో నివేదికలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనంతరం పేరును ప్రస్తావించకుండా అసభ్య ప్రచార ఎత్తుగడలు, చెప్పని గోప్యతా ఒప్పందం అంటూ స్పందించారు. ఆ వ్యాఖ్యలు దీపికాను ఉద్దేశించినవేనని సినీ వర్గాల్లో విస్తృతంగా భావించారు. తరువాత ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంపిక చేయడంతో స్పిరిట్ వివాదం కొంతకాలం సద్దుమణిగింది. తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో పాత అంశాలు మరోసారి ముందుకొచ్చాయి. ప్రణయ్ రెడ్డి వంగా కథనం ప్రకారం పారితోషికం, చిత్రీకరణ సమయాలతోపాటు మరికొన్ని అంశాల్లో ఒప్పందం కుదరలేదు. ముఖ్యంగా సినిమా నికర లాభాల్లో దీపికా 10 శాతం వాటా కోరినట్లు ఆయన వెల్లడించారు. ఆమె ఏదైనా అడగవచ్చని, కానీ చిత్ర ఆర్థిక లెక్కలకు సరిపడితేనే ఇవ్వగలమని వివరించారు. దీంతో ఆ ప్రతిపాదన అనుకూలంగా లేదని భావించి ఇతర అవకాశాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, సినిమా కథతోపాటు పాత్రకు సంబంధించిన అంతర్గత సమాచారం బయటకు వెళ్లిందని కూడా ఆరోపించారు. దీపికాతో ముందుకు వెళ్లకూడదనే నిర్ణయం దర్శకుడు సందీప్ రెడ్డి

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల సినిమాలకు సంబంధించిన ఇండియా టాప్ 10 లిస్ట్ విడుదల చేస్తుంటుంది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, పాటలు, ఓటీటీలో ట్రెండ్ అయ్యే చిత్రాలుంటాయి. అందులో భాగంగా హీరోయిన్లకి సంబంధించిన జులై లిస్ట్ ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల ప్లేసులు తారుమారు అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దారుణంగా పడిపోయింది. శ్రీలీల అసలులిస్ట్ లోనే లేదు. కానీ నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి సమంత, కాజల్, సాయిపల్లవి, దీపికా, అలియా భట్ వంటి వారి స్థానాలు ఏంటనేది చూద్దాం. ఇండియా వైడ్‌గా టాప్ 10లో మొదటి స్థానంలో సమంత నిలిచారు. ఆమెకి మొదటి స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. హీరోల్లో ప్రభాస్ మాదిరిగానే సమంత స్థానంలో మార్పు ఉండటం లేదు. మధ్యలో ఒకటి రెండు నెలలు డౌన్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకొని తన ప్లేస్‌ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇటీవల సమంత `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. బేబీ బంప్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండో స్థానంలో అలియాభట్ ఉన్నారు. ఈమె స్థానంలో కూడా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఆ తర్వాత మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు. ఊహించని విధంగా నాల్గో స్థానంలోకి నయనతార రావడం విశేషం. గతంలో ఆమె టాప్ 5లో కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏకంగా టాప్ 4కి రావడం విశేషం. అయితే టాప్ 4లో ఉండాల్సిన రష్మిక మందన్నా మాత్రం డౌన్ అయ్యారు. ఆమె ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇది ఆమెకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలు లేకపోయినా.. నెట్టింట

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతీ చిన్న వార్త నెట్టింట సంచలనమే సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అసలు సందీప్, దీపికా మధ్య ఏం జరిగింది? ఆమెను ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సంచలన విషయాలు బయటపెట్టారు. 'స్పిరిట్' నుంచి దీపికా పదుకొనేను తీసేయడంపై ఇన్నాళ్లూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ ఏదైనా ఒక సినిమా అనుకున్నారంటే.. పాత్రల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిరిట్' కథ రాసుకుంటున్న సమయంలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆయన మొదట అనుకున్నది దీపికా పదుకొనేనే. సుమారు సంవత్సరంన్నర పాటు సందీప్, దీపికా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో ట్రావెల్ చేశారు. ఆమె టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే అంత సమయం కేటాయించారు. అయితే, ఆ సమయానికి దీపికా నటించిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లుగా నిలిచాయి. దాంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ హిట్ల తర్వాత దీపికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. కేవలం భారీ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా.. సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందట. దాంతో పాటు షూటింగ్ డేట్స్, రోజువారీ కాల్షీట్ టైమింగ్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానని కండీషన్స్ పెట్టింది. సరే, ఒక స్టార్ హీరోయిన్ అంత డిమాండ్ చేసినా బిజినెస్ పరంగా ఓకే అనుకోవచ్చు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ప్రభాస్ మూవీ నుంచి దీపిక తప్పుకుందనే వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పందించారు.‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకునే తప్పుకుందా? తప్పించారా? అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదే సమయంలో ‘రోజుకు 8 పని గంటలు’ అంశం తెర మీదకు వచ్చింది. ఈ నియమ నిబంధనల కారణంగానే దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అందరూ అనుకున్నారు. అప్పుడే దీపికాను ఉద్దేశించి సందీప్ వంగా పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేవలం పని గంటలు మాత్రమే కాదు, రెమ్యూనరేషన్ విషయంలోనూ దీపిక పెట్టిన కండిషన్ వల్లే ఆమెను తప్పించినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు.ప్రణయ్ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకునే తప్పుకోవడం గురించి మాట్లాడారు. “వెబ్ సైట్లలో ఏమి రాశారో అదే రీజన్. ఒకటి రెమ్యునరేషన్, రెండు టైమింగ్. అవి కాకుండా వేరే రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆమెను తీసేయాలనేది సందీప్ తీసుకున్న నిర్ణయమే. ఆమెతో సందీప్ ఒక ఏడాదిన్నరపాటు టచ్ లో ఉన్నాడు. ఆమె పర్ఫార్మెన్స్ నచ్చి, సినిమాలో ఉంటే బెటర్ గా ఉంటుందని ఆలోచించాము. ప్రాజెక్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆ ఏడాదిన్నరలో చాలా మారాయి. ఆమెవి ఓ రెండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది”“నెట్ ఇన్ కమ్ నుంచి 10 శాతం కావాలని డిమాండ్ చేసింది. అంటే లాభాల్లో పది శాతం అడిగింది. అన్నీ హద్దులు దాటిపోయాయి

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ త్వరలో రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీలో ఉన్న ఆమె శనివారం ముంబై విమానశ్రయంలో కనిపించారు. బెంగుళూరులోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పబ్లిక్కు దూరంగా ఉంటున్న దీపికా తాజాగా సాధారణ దుస్తుల్లో ఎయిర్‌పోర్టులో కనిపించారు. అయితే ఆమెతో పాటుగా రణ్వీర్ సింగ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. 2013లో రామ్‌లీలా సినిమా సమయంలో ప్రేమలో పడిన దీపిక, రణ్‌వీర్‌లు 2018లో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 2024లో వారికి కుమార్తె దువా జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్లు వీరిద్దరు ప్రకటించారు. కాగా దీపికా ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే దీపికా ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ అల్లు అర్జున్‌తో ‘రాకా’ సినిమాలలో నటిస్తోంది. భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు 100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు.. పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం రాకా పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మినహా పెద్దగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రాకా లో నటించే హీరోయిన్ల పాత్రలపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్టులో భాగమని అధికారికంగా వెల్లడించారు. ఆమె సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్లో దీపికా పాల్గొంటున్నారని, ఆమెకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా రాకా లో కీలక పాత్రలు పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్ ఓ గిరిజన యువతిగా కనిపించనున్నారని, ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. రష్మిక పాత్ర మాత్రం మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని, నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని ప్రచారం సాగుతోంది. మృణాల్ ఠాకూర్ కూడా కథలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పాత్రలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

బాలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణే వర్క్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా, ఏ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నా తన వంద శాతం శ్రమను అందించే దీపికా.. తాజాగా మరోసారి తన డెడికేషన్‌తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణే (Deepika Padukone) వర్క్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా, ఏ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నా తన వంద శాతం శ్రమను అందించే దీపికా.. తాజాగా మరోసారి తన డెడికేషన్‌తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఎనిమిది నెలల నిండు గర్భవతిగా ఉన్న ఆమె, త్వరలోనే అంటే సెప్టెంబర్‌లో తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెల్సిందే. అయితే ప్రసవ సమయం దగ్గరపడుతున్నా కూడా ఆమె విశ్రాంతి తీసుకోకుండా సెట్స్‌లోనే ఉండటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాకా కోసం ప్రెగ్నెన్సీలో కూడా రిస్క్ తీసుకొంటుందట దీపికా. ప్రస్తుతం దీపికా నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ రాకా. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రాకా షూటింగ్‌ను డెలివరీకి ముందే పూర్తి చేయాలనే పట్టుదలతో దీపికా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె సెట్స్‌లోనే సమయం గడుపుతూ, అవసరమైనప్పుడు అర్థరాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. ప్రసవానికి కొద్దిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, సినిమా షెడ్యూల్స్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆమె చూపుతున్న ఈ అంకితభావం చూసి చిత్ర యూనిట్, సాంకేతిక నిపుణులు అవాక్కవుతున్నారట. ఆమె ప్రొఫెషనలిజం, సినిమా పట్ల ఉన్న ప్రేమాభిమానాలను చూసి యూనిట్ సభ్యులంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారని సమాచారం. తన పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ నటిస్తున్న దీపికా పదుకొణేను చూసి అభిమానులు ది రియల్ క్వీన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ఈ