
Supreme Court | మేం చర్యలు వద్దని చెప్పాక కూడా మీరు నోటీసులిస్తారా.. మెజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court | మేం చర్యలు వద్దని చెప్పాక కూడా మీరు నోటీసులిస్తారా.. మెజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
© 2026 nimisham.in

Supreme Court | మేం చర్యలు వద్దని చెప్పాక కూడా మీరు నోటీసులిస్తారా.. మెజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: విద్యార్థికి నోటీసులు ఇస్తారా? మెజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court | వైద్యులపై దాడి చేస్తే వెంటనే అరెస్టు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

సినిమా రంగంలో గ్లామర్, పేరుప్రఖ్యాతలు ఉంటాయి. కెమెరా ముందుకొచ్చి చప్పట్లు కొట్టించుకున్న వాళ్లు ఆ ప్రపంచాన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు ఉన్నా, లేకపోయినా వదల్లేరు. అలాంటి పరిస్థితి వస్తే అది ఎంతో స్ట్రగుల్‌తో కూడుకొన్నదే అవుతుంది. కానీ, తెలుగు అందం రేష్మా రాథోర్ మాత్రం 'గ్లామర్ అనేది క్షణికం, న్యాయం కోసం పోరాడటమే అసలైన జీవితం' అని నిరూపిస్తున్నారు రేష్మ. ఆమె యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. బాలనటిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో చదువుతుండగా దర్శకుడు మారుతి కంటపడ్డారు. ఆయన తీసిన యూత్‌ఫుల్ హిట్ 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మా హీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది. ‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దు విద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్ కొబ్బరికాయ కొట్టేస్తా

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు నిర్వహించనున్న మార్చ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి దేశ రాజధానిలో ఏదైనా అనర్థం జరుగుతుందని భావించేందుకు ఎలాంటి తగిన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా అందరూ శాంతియుతంగా ప్రవర్తిస్తారని ఊహిస్తున్నామని వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం, శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు పోలీసులదేనని తేల్చిచెప్పింది. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన విద్యార్థి పోరాటం మరియు నెరవేరని హామీల నేపథ్యం దాగి ఉంది. మొదట సాటిరికల్ ఆన్లైన్ ప్లాట్‌ఫాంగా ప్రారంభమైన సిజెపి, నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ వివాదాలు మరియు విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత తీవ్రమైన ఉద్యమ రూపం దాల్చింది. జంతర్ మంతర్‌లో సుదీర్ఘంగా 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన అనంతరం, జూలై 25న కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చినట్లు సిజెపి ప్రతినిధులు వెల్లడించారు. దింతో ఒక నెల గడిచినా ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకుండా సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటోందని సిజెపి ఆగస్టు 24న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ, లుటియన్స్ ఢిల్లీలోని ఇండియా గేట్, సెంట్రల్ విస్తా వంటి సున్నిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేని నిరసనలను నిషేధించాలని పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఊరేగింపులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటివరకు సిజెపి నుంచి అనుమతి

సుదీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న బాధితులకు ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సంచలన ఫలితాలను ఇస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సమాధాన్ సమారోహ్ 2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ తొలి రోజే మైలురాయిని అధిగమించింది. నేడు ఒక్క రోజే ఏకంగా 400 కంటే ఎక్కువ వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కారమై రికార్డు సృష్టించాయి.ఈ ప్రత్యేక లోక్ అదాలత్ కోసం సుప్రీంకోర్టు సముదాయంలో ఏకంగా 16 ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశారు. ప్రతీ బెంచ్‌లో ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులతో పాటు సీనియర్ అడ్వకేట్లు, అడ్వకేట్-ఆన్-రికార్డ్ ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరించారు. ఈ ధర్మాసనాల ముందుకు తొలిరోజు విచారణ కోసం 600కు పైగా వివిధ రకాల కేసులు రాగా, కక్షిదారుల మధ్య పరస్పర సంభాషణను ప్రోత్సహిస్తూ 400కు పైగా కేసుల్లో ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కీలక పాత్ర పోషించారు. 22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..కుటుంబ వివాదాల నుంచి పన్నుల కేసుల వరకు!ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పలు రకాల సున్నితమైన కేసులను విచారణకు స్వీకరించారు. భార్యాభర్తల మధ్య వైవాహిక వివాదాలు, ఆస్తి తగవులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహారం పిటిషన్లు, భూసేకరణ-పరిహారం వివాదాలతో పాటు పన్నులకు సంబంధించిన కేసులు, సర్వీస్, లేబర్ వివాదాలను ఇందులో పరిష్కరించారు. ఏప్రిల్ 21న సమాధాన్ సమారోహ్ ప్రారంభమైనప్పటి నుంచి కక్షిదారులు, వారి తరఫు న్యాయవాదులతో ముందుగానే చర్చలు జరిపి ఒప్పంద అవకాశాలను అంచనా వేయడం వల్లే ఈ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయని కోర్టు తెలిపింది.Warning: చెత్త వేస్తున్నారా? కరెంట్, నీళ్లు కట్.. సుప్రీం సీరియస్ వార్నింగ్!కోర్టుల భారం తగ్గడమే లక్ష్యంఏళ్ల తరబడి సాగే న్యాయపోరాటాలు కక్షిదారులపై మోపే ఆర్థిక, మానసిక భారాలను తగ్గించడమే ఈ లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఇంటర్నెట్ డెస్క్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని వచ్చిన ఆరోపణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. రూ.5 కోట్ల జరిమానా విధించింది (Supreme Court Art of Living). ఎన్జీటీ విధించిన జరిమానాను రవిశంకర్ నేతృత్వంలోని ఫౌండేషన్ చెల్లించింది (Art of Living Rs 5 crore refund). అలాగే అదే సమయంలో న్యాయపోరాటం కూడా ప్రారంభించింది. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు ఊరట లభించింది. ఫౌండేషన్ చెల్లించిన రూ.5 కోట్లను తిరిగి ఇవ్వాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు
SC Judicial Experience Relief : న్యాయశాస్త్ర పట్టభద్రులకు సుప్రీ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులుగా ఎంపిక అయ్యేందుకు వీలుగా నిర్వహించే ప్రాథమిక స్థాయి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించి కీలక సడలింపులు ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జడ్జి పోస్టులకు పోటీ పడటానికి న్యాయవాదిగా కనీసం మూడేళ్ల వృత్తి అనుభవం తప్పనిసరిగా ఉండాలంటూ గతంలో విధించిన కఠిన నిబంధనను న్యాయస్థానం సడలించింది. ఏడాది అనుభం ఉంటే చాలని తేల్చి చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.మూడేళ్ల నిబంధన సడలింపు..!సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎ.జి.మాసిహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీ ప్రాతిపదికన ఈ తీర్పును వెలువరించింది. కొత్త ఆదేశాల ప్రకారం.. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి ఒక ఏడాది పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంటే చాలు. గతంలో అనగా 2025 మే నెలలో నాటి సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పరీక్ష రాయాలంటే మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలని చెప్పింది. కానీ ఈ నిబంధనను సవరించాలని కోరుతూ ఇటీవలే కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. విచారించిన ధర్మాసనం ఈ కీలక సవరణలు చేసింది.2025 తీర్పు వెలువడి ఇప్పటికే ఒక సంవత్సరం కాలం పూర్తయినందున.. అప్పటి తాజా లా గ్రాడ్యుయేట్లు అందరూ ఇప్పటికే ఏడాది పాటు వృత్తి అనుభవం గడించినట్లుగానే భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దీనికోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ఎలాంటి అనుభవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వీరంతా పరీక్ష రాసేందుకు అర్హత ఉన్నవాళ్లేనని అన్నారు. అయితే ఈ పరీక్ష ద్వారా జడ్జీలుగా ఎంపికైన అభ్యర్థులు నేరుగా విధులు నిర్వహించడానికి వీలుండదు. వారు విధుల్లో చేరే ముందు రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇందులో భాగంగానే.. మొదటి ఏడాది జ్యుడీషియల్ అకాడమీలో

ఈనాడు, దిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయమని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘రామోజీరావు హిమాలయమంత ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిందారోపణలను ఎదుర్కొని సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. అంతిమంగా ధర్మమే గెలిచింది. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయం’’ అని ఆయన శుక్రవారం ఎక్స్‌లో వెల్లడించారు. మార్గదర్శి మేనేజరుకు చిట్ వాయిదా చెక్కును అందజేస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నిఖిలనాయుడు శ్రీకాకుళం పాతబస్టాండ్, న్యూస్‌టుడే: ఖాతాదారుల మనోభావాలను ప్రతిబింబించేలా మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మార్గదర్శి కార్యాలయానికి శుక్రవారం కుటుంబసమేతంగా వచ్చిన ఆయన కేకు కోసి సిబ్బందికి స్వీట్లు పంచారు. మార్గదర్శి సంస్థలో పొదుపు చేసిన తన తొలి ఆదాయంతోనే వివాహానంతరం సొంతింటి కలను నెరవేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ ఆర్థిక ఎదుగుదలలో మార్గదర్శి సోపానంగా నిలిచిందని పేర్కొన్నారు. ధర్మం, నిబద్ధత, నిజాయతీలే కొలమానంగా రామోజీ గ్రూపు సంస్థలు ఉన్నత విలువలతో నడుస్తాయనేది జగమెరిగిన సత్యమన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న తమ కుమార్తె నిఖిలనాయుడు రూ.25 లక్షల చిట్ గ్రూపులో చేరి బంధాన్ని మరింతగా బలపర్చిందన్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య ఈనాడు, అమరావతి: మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య స్వాగతించారు. ‘ఈ తీర్పుతో ధీశాలి ఆత్మ స్వర్గాన సంతోషించి ఉంటుంది. 18 ఏళ్లుగా ఈకేసును అటూ ఇటూ తిప్పారు. పూటకో అబద్ధం వండి వార్చారు. కానీ చివరకు నమ్మకం, నిజాయతీ గెలిచాయి. అబద్ధం ఓడింది’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈనాడు, అమరావతి: లక్షల మంది డిపాజిటర్ల నమ్మకం పొందిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను భ్రష్టుపట్టించాలని కొందరు చేసిన కుట్రలు రెండు దశాబ్దాల న్యాయపోరాటంతో పటాపంచలయ్యాయని

విజయనగరం ఎంపీ, టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు మార్గదర్శి సంస్థపై తనకున్న అచంచల విశ్వాసాన్ని, మద్దతును చాటుకున్నారు. శుక్రవారం ఆయన మార్గదర్శి కార్యాలయాన్ని సందర్శించి, తన కుమార్తె నిఖిల తొలి నెల వేతనంతో ఆమె పేరిట రూ. 25 లక్షల విలువైన చిట్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.ఇటీవల మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ, "సత్యం నిప్పు లాంటిది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత, విశ్వసనీయత వంటి విలువల కారణంగానే ప్రజలు మార్గదర్శిపై అపారమైన నమ్మకం ఉంచుతున్నారని ఆయన కొనియాడారు.తాను సుమారు 20 ఏళ్ల క్రితమే మార్గదర్శి సంస్థకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమంగా న్యాయమే గెలిచిందని, ఈ పరిణామంతో మార్గదర్శిపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు

హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇంటర్నెట్ డెస్క్: హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని మల్ద జిల్లాకు చెందిన రసిక్ చంద్ర మొండల్ 1920లో జన్మించారు. 1988లో మర్డర్ కేసులో ఆయన జైలు పాలయ్యారు. 1994లో కోర్టు అతడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. తనకు పడ్డ శిక్షను సవాల్ చేస్తూ మొండల్ 2018లో కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. తర్వాత అపెక్స్ కోర్టుకు వెళ్లగా.. అక్కడ కూడా మొండల్‌కు నిరాశే ఎదురైంది. దీంతో మొండల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వయసును దృష్టిలో ఉంచుకుని శిక్షా కాలం ముగియటానికంటే ముందే తనను రిలీజ్ చేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2024 నవంబర్ 29వ తేదీన మొండల్‌కు మధ్యంతర బెయిల్ మంజూర్ చేసింది. శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టులో మొండల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. పిటిషనర్ వయసును దృష్టిలో ఉంచుకుని కేసును ముగిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. మిగిలిన శిక్షాకాలాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పుతో 105 ఏళ్ల వయసులో రసిక్ చంద్ర మొండల్ జీవిత ఖైదు నుంచి విముక్తి పొందారు. కపుల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ టిప్స్‌తో గొడవలకు చెక్ పెట్టండి! సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం

జ్యుడీషియల్ సర్వీస్‌లోకి ప్రవేశించడానికి ఉండాల్సిన న్యాయవాద వృత్తి అనుభవంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మూడేళ్ల ప్రాక్టీస్‌ను ఏడాదికి కుదిస్తూ సుప్రీంకోర్టు సవరణ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: జ్యుడీషియల్ సర్వీసుల్లోకి నేరుగా ప్రవేశించాలనుకునే న్యాయ విద్యార్థులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మూడేళ్ల న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ నిబంధనను ఒక సంవత్సరానికి తగ్గించింది. మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధనను తొలగించాలన్న అభ్యర్థనను పూర్తిగా తోసిపుచ్చనప్పటికీ, యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఆగస్ట్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై జస్టిస్ వినోద్ చంద్రన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు కనీస అనుభవం ఉండాలన్న ప్రాథమిక ఉద్దేశాన్ని సమర్థిస్తూనే, నిబంధనలు కఠినంగా ఉండి యువ లా గ్రాడ్యుయేట్లకు ఇబ్బంది కలగకూడదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2025 మే 20 నుంచి 2027 మార్చి 31 మధ్య వెలువడే సివిల్ జడ్జి పరీక్షల నోటిఫికేషన్లకు హాజరయ్యే లా గ్రాడ్యుయేట్లకు ఎటువంటి ప్రాక్టీస్ అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకునేందుకు సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ కాలంలో ఎంపికైన అభ్యర్థులు నేరుగా ట్రెయినీ జ్యుడీషియల్ ఆఫీసర్లుగా నియమితులవుతారు. అలానే వీరు స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందాలి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు స్ట్రక్చర్డ్ లా క్లర్క్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి ఆరు నెలలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి లేదా హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ సభ్యుల పర్యవేక్షణలో, తర్వాతి ఆరు నెలలు హైకోర్టు సిట్టింగ్ జడ్జిల పర్యవేక్షణలో క్లర్క్‌షిప్ పూర్తి చేయాలి. శిక్షణ కాలంలో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ స్థూల వేతనంలో సగానికి సమానమైన

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పీటీఐ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇమ్రాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దాదాపు మూడేళ్లుగా జైల్లో ఉంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అనంతరం మళ్లీ రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించింది. ఆరోగ్యం చక్కబడే వరకూ ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు త్వరలో తన ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే అవకాశం కూడా రావొచ్చని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి ఇమ్రాన్ రీఎంట్రీకి ఇది తొలి అడుగు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇమ్రాన్ విడుదల వెనుక ఏదో డీల్ జరిగే ఉంటుందని కొందరు అన్నారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుకెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. గురువారం అర్ధరాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రత్యేక ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.73 ఏళ్ల ఇమ్రాన్‌కు ఆరుగురు నిపుణులైన వైద్యులతో కూడిన బృందం పరీక్షలు చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె దడ, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను పరిశీలించారు. కుడి కంటికి గతంలో తలెత్తిన సమస్యపై కూడా పరీక్షలు నిర్వహించారు.పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. జైలులోనే ఉండటం సురక్షితమని వైద్య బృందం సూచించింది.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇమ్రాన్ రాకపోకల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయనను తిరిగి అడియాలా జైలుకు తరలించారు.ఆగస్టు 2023లో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, నిర్బంధం పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వేకువ జామున ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చేర్చారు. 73 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడానికి ఓ స్వతంత్ర వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.2023 ఆగస్ట్ నుంచి ఆయన రావల్పిండి లోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా వెలుగులోకి రాలేదు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే.. ఇమ్రాన్ ఖాన్ ను తాజా ఆసుపత్రికి తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను తరలించే సమయంలో కూడా ఫొటోలు, వీడియోలు రాకుండా భద్రత సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.2022 ఏప్రిల్ వరకు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. అనంతరం తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు పాలు కావాల్సొచ్చింది. ఆ తర్వాత ఆయన సతీమణి బుష్రా బీబీపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు, కేసులన్నీ కూడా పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ వాదిస్తోంది. బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు.పాకిస్తాన్ కు చుక్కలే: కేంద్రం డేగకన్ను: ఏకంగా రూ. 1,943 కోట్లతో మెరుపు తీగెలు లీజ్శిక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. అడియాలా జైలు గోడల మధ్య దాదాపు 1,111 రోజుల పాటు అంటే మూడేళ్లకు పైగా సుదీర్ఘ ఖైదు అనుభవిస్తూ వస్తోన్నారాయన. ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా బయటికొచ్చారు. హైబీపీ

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో... సుప్రీంకోర్టు నిర్ణయం.. తదుపరి విచారణ 24కు వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేను పొడిగించింది. కేబీఆర్ పార్కు ఈఎ్‌సజడ్‌లో చెట్ల నరికివేతపై స్టే విధించాలని కోరుతూ కాజల్ మహేశ్వరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా చూడడానికి తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా.. ఈఎ్‌సజడ్‌లో ఏయే పనులకు అనుమతి ఉంది? వేటిని నియంత్రించాలి? లేదా నిషేధించాలి? అనే అంశాలపై పరిశోధన చేసి, వివరాలు సమర్పించాలని పిటిషనర్లనే ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాజల్ మహేశ్వరి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను నరకరాదంటూ మే 18న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు, వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున, కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది... హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మార్గదర్శిపై నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును 19 డిసెంబరు 2025న ఉండవల్లి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఉండవల్లి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మార్గదర్శి ఫైనాన్సియర్ ్స ఎలాంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి రూ.2,500 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు ఆర్బీఐ వాదనలను విస్మరించిందని, కేవలం సాంకేతిక కారణాలను చూపుతూనే కేసును కొట్టివేసిందని తెలిపారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎ్‌ఫ అనేది ‘అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్’ కిందకు వస్తుందని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవని ఆర్బీఐ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా రూ.5.23 కోట్లకు పైగా చెల్లింపులు మిగిలి ఉన్నాయని, కొందరు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడం వల్లే ఇది పెండింగ్‌లో పడిందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర వాదనలు వినిపిస్తూ.. ఇప్పటి వరకు డిపాజిటర్లకు సంబంధించి రూ.2,500 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు వివరించారు. ఎవరూ క్లెయిమ్ చేయని మిగిలిన రూ.5.23 కోట్లను నిబంధనల ప్రకారం ఎస్ర్కో ఖాతాలో జమ చేశామనిచెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని, పబ్లిక్ నోటీసు జారీ చేసి, తదుపరి ప్రక్రియ అంతటినీ పారదర్శకంగా నిర్వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి

పారిశ్రామిక వివాదాల చట్టం పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటవుతుందని మెజార్టీ తీర్పు న్యూఢిల్లీ: ‘పరిశ్రమ’అన్న పదానికి 1978 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని 2020 నాటి పారిశ్రామిక సంబంధాల కోడ్‌ను అర్థం చేసుకునేందుకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు తొమ్మిది సభ్యుల విస్తృత ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్సహా ఆరుగురు న్యాయ మూర్తులు ఈ తీర్పు ఇవ్వగా ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. ఈ తీర్పు 6:3 మోజార్టీతో వెలువడినట్లు అయ్యింది. 1978లో ఏడుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పునఃపరిశీలించాలని చేసిన రిఫరెన్స్ చెల్లుబాటైనట్టు తాజా తీర్పులో స్పష్టం చేశారు. 1978 ఫిబ్రవరి 21న బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు సంబంధించిన కేసులో ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ‘పరిశ్రమ’అన్న పదం నిర్వచనాన్ని విస్తరించింది. ఈ తీర్పును రాసిన జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఏది పరిశ్రమ అన్నది తేల్చేందుకు ట్రిపుల్ టెస్ట్ ఒకటి రూపొందించారు. దాని ప్రకారం పరిశ్రమ అంటే... 1. వస్తువులు లేదా సేవల ఉత్పత్తి, పంపిణీ జరగాలి. 2. ఇందుకోసం యజమాని – ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలి. 3. కార్యకలాపాలన్నీ వ్యవస్థీకృతమై ఉండాలి. ఈ తీర్పుతో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, క్లబ్‌లు, ప్రభుత్వ సంక్షేమ శాఖల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు 1947 పారిశ్రామిక వివాదాల (ఐడీ) చట్టం పరిధిలోకి వచ్చారు. అయితే తాజాగా తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన మెజార్టీ తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని చెబుతూనే దానికి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇప్పటికే రద్దయిన 1947 నాటి ఐడీ చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్‌ను వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా... ట్రిపుల్ టెస్ట్ మౌలికంగా చెల్లుబాటు అయ్యేదనని, కాకపోతే పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2(జే) వంటి కొన్ని విషయాల్లో స్పష్టత అవసరమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తాజా

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్‌కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలో విద్యార్థుల నిరసనల సమయంలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులపై వారు దాష్టీకం చేశారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. పంజాబ్- హరియాణా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. విద్యార్థి ఉద్యమకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు, మహిళలపై హింస, బాధితులకు వైద్య సహాయం, నష్టపరిహారం అందించడం వంటివి ఈ కమిటీ పరిశీలించనుంది. పోలీసు సిబ్బందిపై హింస, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అధికారులు లేవనెత్తిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. ‘‘బాధ్యులెవరినీ వదిలిపెట్టం. విషయాన్ని తీవ్రంగా పరిగణించి కొలిక్కి తీసుకొస్తాం. అందుకే ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తున్నాం. జులై 20న చలో పార్లమెంటు సమయంలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల రికార్డులను కమిటీకి అప్పగించాలని ఆదేశిస్తాం’’ అని ఇటీవల సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది

దిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి ఎస్ఎల్పీ వేశారు. దీనిపై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం ఎదుట తుది విచారణ జరిగింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, నాగముత్తు వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు మార్గదర్శి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. క్లెయిమ్ చేయని రూ.5.23 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఎస్క్రో అకౌంట్లో జమ చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు.. తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందన్నారు. సుప్రీం ఆదేశం మేరకు పబ్లిక్ నోటీసు ఇచ్చి తదుపరి ప్రక్రియ నిర్వహించారని తెలిపారు. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి వ్యవహారంపై పిటిషన్ వేయడానికి, పోరాటం చేయడానికి మీరెవరని ఉండవల్లిని ప్రశ్నించింది. ఈ కేసు వివరాలన్నీ పరిశీలిస్తే... ఇది మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోంది తప్ప ఎలాంటి అంశాలు కనిపించడం లేదని జస్టిస్ ఎంఎం సుందరేశ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. ఇరువైపుల వాదనల అనంతరం.. ఉండవల్లి పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురు బాబా రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తన 'జనరేషన్ గటర్' వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ చేసిన విమర్శలకు కంగనా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా బదులిచ్చారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌దేవ్ మాట్లాడుతూ.. యువతను 'గటర్' అని పిలవడం వక్రబుద్ధికి నిదర్శనమని అన్నారు. కంగన చిన్నతనం, యవ్వనం, ఆమె గతం ఎలాంటివో తనకు తెలుసంటూ ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందిస్తూ "బాబాజీ, నా యవ్వనం లేదా నా బెడ్రూమ్ గురించి పగటి కలలు కనొద్దు. పుకార్ల ఆధారంగా మాట్లాడటం కాదు. కనీసం మోసపూరిత ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మీపై చీవాట్లు పెట్టినట్టు నాపై ఎప్పుడూ పెట్టలేదు. మీ కంటే నా క్యారెక్టర్ ఎంతో ఉత్తమమైనది. ఇక్కడ ఎలాంటి మోసం లేదు. కాబట్టి నాకు క్యారెక్టర్ పాఠాలు చెప్పొద్దు" అని తీవ్రంగా స్పందించారు. పతంజలి తప్పుడు ప్రకటనల కేసులో 2024లో సుప్రీంకోర్టు రామ్‌దేవ్‌ను మందలించిన విషయాన్ని ఆమె పరోక్షంగా గుర్తు చేశారు.గత నెలలో కొందరు నిరసనకారులను ఉద్దేశించి కంగనా 'జనరేషన్ గటర్' అని వ్యాఖ్యానించడం ఈ వివాదానికి దారితీసింది. అయితే, తన వ్యాఖ్యలు మొత్తం యువతకు కాదని, కేవలం కొందరి ప్రవర్తనను మాత్రమే విమర్శించానని ఆ తర్వాత ఆమె స్పష్టతనిచ్చారు

రూ.20 లంచం కేసు కొట్టివేత 30 ఏళ్లకు ఉద్యోగుల విముక్తి సుప్రీంకోర్టు సంచలన తుది తీర్పు Supreme Court: కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణపై ముప్పై ఏళ్లుగా సాగిన సుదీర్ఘ న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు(Supreme Court) ఎట్టకేలకు ముగింపు పలికింది. గుజరాత్ ప్రభుత్వంలోని ఒక గుమాస్తా, చప్రాసీపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. లంచం డిమాండ్ చేసినట్లు సరైన ఆధారాలు లేకుండా కేవలం డబ్బులు చేతులు మారినంత మాత్రాన నేరం నిరూపితం కాదని జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ల బెంచ్ స్పష్టం చేసింది. 1996లో ప్రారంభమైన ఈ కేసులో కింది కోర్టుల తీర్పులను పక్కనపెడుతూ కోర్టు తీర్పునిచ్చింది. Gudur-Gummidipoondi Railway: ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. రూ. 2,229 కోట్ల వ్యయం.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం విచారణలో బయటపడిన తీవ్ర వైరుధ్యాలు: ఆనంద్ జిల్లాలోని బెచరి గ్రామ పంచాయతీలో ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన ఒక విద్యార్థి నుంచి గుమాస్తా రూ.100, చప్రాసీ రూ.20 లంచం కోరారని ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే దాడుల్లో చప్రాసీ వద్ద రూ.20 దొరకగా, గుమాస్తా వద్ద ఎలాంటి సొమ్ము లభించలేదు. దీనికి తోడు విచారణ సమయంలో బాధితుడి వాంగ్మూలాల్లో తీవ్ర వైరుధ్యాలు కనిపించాయి. పండుగ సందర్భంగా చప్రాసీకి ఇచ్చే చిన్నపాటి కానుకగా ఆ మొత్తాన్ని భావించవచ్చని, అతడు నేరుగా లంచం కోరలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో స్వయంగా ఫిర్యాదుదారే అంగీకరించడంతో అభియోగాల ప్రామాణికత దెబ్బతింది. ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం: 1999లో ట్రయల్ కోర్టు విధిలించిన శిక్షను 2015లో గుజరాత్ హైకోర్టు సమర్థించినప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం ఆ తీర్పులను కొట్టివేసింది. గుమాస్తాపై విచారణకు అనుమతి ఇచ్చిన అధికారి అర్హత కూడా చట్టబద్ధంగా లేదని కోర్టు గమనించింది. సందేహాలకు తావులేకుండా నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వ్యాఖ్యానిస్తూ, 30 ఏళ్ల

కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై ఉన్న నేరారోపణలను కొట్టివేస్తూ.. వారిని పూర్తి నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేనప్పుడు కేవలం రికవరీని ప్రాతిపదికగా తీసుకుని శిక్ష విధించడం చట్టరీత్యా చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్.. 1996 నాటి ఘటనఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 1996లో గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఓ విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్కమ్ సర్టిఫికేట్) కోసం వెళ్లాడు. సర్టిఫికేట్ ఇచ్చేందుకు క్లర్క్ రూ.120 లంచం డిమాండ్ చేశాడని(అందులో క్లర్క్‌కు రూ.100, అటెండర్‌కు రూ.20) ఆరోపిస్తూ సదరు విద్యార్థి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. అధికారులు రంగంలోకి దిగి గుర్తులు ఉన్న రూ.120 నోట్లను ఇచ్చి ఏసీబీ ట్రాఫ్ నిర్వహించారు.విచారణలో తేలిన విషయాలు ఏసీబీ సోదాల సమయంలో విద్యార్థి వద్ద ఉన్న రూ.20 నోటును అటెండర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్క్ వద్ద నుంచి ఎలాంటి సొమ్ము లభించలేదు. విచారణ క్రమంలో సదరు విద్యార్థి ఇచ్చిన వాంగ్మూలంలో తీవ్ర వైరుధ్యాలు వెలుగు చూశాయి. క్లర్క్ పక్కనే ఉన్నప్పటికీ మొత్తం రూ.120 ఇవ్వకుండా కేవలం రూ.20 మాత్రమే ఎందుకు ఇచ్చాడనే దానికి స్పష్టత లేదు. అంతేకాకుండా అటెండర్ తనను నేరుగా ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదని విద్యార్థి క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీకరించాడు. మరుసటి రోజు ఈద్ పండుగ ఉన్నందున విద్యార్థి సంతోషంతో ఇచ్చి ఉండవచ్చన్న అటెండర్ వివరణను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.కుప్పకూలిన హెలికాప్టర్: ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం! దిగువ కోర్టుల తీర్పులు రద్దు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 20 ప్రకారం

రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో ప్రారంభమైన కేసు దాదాపు 30 ఏళ్ల పాటు న్యాయస్థానాల్లో కొనసాగింది. చివరకు ఈ కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో ప్రారంభమైన కేసు దాదాపు 30 ఏళ్ల పాటు న్యాయస్థానాల్లో కొనసాగింది. చివరకు ఈ కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లంచం కేసులో కేవలం నగదు స్వాధీనం కావడం మాత్రమే నేరాన్ని నిరూపించడానికి సరిపోదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది (Rs 20 bribe case). గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బేచరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 1996లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. విద్యా రాయితీ పొందేందుకు అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన ఓ విద్యార్థి నుంచి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. మొత్తం రూ.120 లంచం అడిగారని, అందులో రూ.100ను క్లర్క్‌కు, రూ.20ను ప్యూన్‌కు ఇవ్వాలని చెప్పినట్లు కోర్టులో ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని పట్టుకున్నారు (Supreme Court bribe case). విద్యార్థి చివరకు ప్యూన్‌కు రూ.20 మాత్రమే ఇచ్చాడు. క్లర్క్‌కు రూ.100 ఇవ్వలేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తుది ముగింపు పలికింది. దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులను పక్కనపెట్టి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది. ఫిర్యాదుదారు ఇచ్చిన వాంగ్మూలాల్లో లంచం మొత్తానికి సంబంధించి భిన్నమైన వివరాలు ఉండటాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది (Supreme Court acquittal). లంచం కేసులో నిందితుడి వద్ద నుంచి డబ్బు స్వాధీనం కావడం ముఖ్యమైన సాక్ష్యం కావొచ్చని, కానీ లంచం డిమాండ్ చేసినట్లు విశ్వసనీయమైన ఆధారం లేకుండా కేవలం నగదు స్వాధీనం ఆధారంగా శిక్ష విధించలేమని స్పష్టం చేసింది ( 30 year legal battle). ప్యూన్ తనంతట తాను లంచం డిమాండ్ చేయలేదని

Supreme Court: దేశంలో చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు రహదారులపై తిరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సరైన నష్టపరిహారం అందకపోవడానికి ఇన్సూరెన్స్ లేకపోవడమే ప్రధాన కారణమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి బీమా లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధన విక్రయాలను నిరాకరించేలా ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ అంశంపై విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నిబంధన అమలులో కొన్ని ఆచరణాత్మక సవాళ్లు, ఆందోళనలు ఉన్నాయని తెలుపగా, సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. “మీరు ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా అమలు చేయాల్సిందే” అని స్పష్టం చేస్తూ, దీనిని ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించవచ్చని సూచించింది. చమురు సంస్థలు, పెట్రోల్ డీలర్లతో చర్చించి అమలు దిశగా అడుగులు వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు సంబంధించి పక్కా ప్రణాళికను, నిర్దిష్ట టైమ్‌లైన్‌ను తదుపరి విచారణ నాటికి కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. నిబంధనలు పాటించని వాహనదారులకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం ఎంతో కీలకమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సంచలన కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జీవితంలోని వివాదాస్పద ఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారంలో ఉన్న 'కాలా హిరన్' చిత్ర వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సినిమా టీజర్‌తో పాటు అన్ని ప్రచార సామగ్రిని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ చిత్ర నిర్మాత అమిత్ జానీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.1998 నాటి కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని, ఇది తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని సల్మాన్ ఖాన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా టీజర్‌లోని ఒక పాత్ర, తాను ధరించే నీలిరంగు బ్రాస్లెట్ను పోలిన ఆభరణాన్ని ధరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, 'కాలా హిరన్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ' చిత్ర టీజర్, ప్రచార విజువల్స్, సంబంధిత ఇంటర్వ్యూ లింకులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ తీర్పు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉందని పేర్కొంటూ నిర్మాత అమిత్ జానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సినిమా నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన తన పిటిషన్లో ఆరోపించారు

నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది (NEET Paper Leak). ఎన్టీఏలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల పారదర్శకత, సైబర్ భద్రత తదితర అంశాలపై పూర్తి వివరాలను అఫిడవిట్లో పొందుపరచాలని సుప్రీంకోర్టు కోరింది. కేవలం తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారిస్తోంది. ఎన్టీఏలో సంస్కరణలను తాము పర్యవేక్షిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత మార్పులు అవసరమని పేర్కొంది (Supreme Court NEET Hearing). ఎన్టీఏను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, నీట్ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది (NTA Reforms). విద్యార్థుల భవిష్యత్తు, విశ్వసనీయత కోసంఎన్టీఏలో నిర్మాణాత్మక మార్పులు చేయాలని సూచించింది. నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాల్సి రావడం, విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందుల తర్వాత ఎన్టీఏ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీఏలో శాశ్వత సంస్కరణలు అమలు చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. కేరళ మహిళతో స్కాట్లాండ్ రాజకీయ నేత పెళ్లి

ఇంటర్నెట్ డెస్క్: నీట్ (NEET) పరీక్షల నిర్వహణ కోసం సరికొత్తగా తీసుకువచ్చిన భద్రతా నిబంధనలు అత్యంత పకడ్బందీగా ఉన్నాయని కేంద్రం సుప్రీం కోర్టు (Supreme Court)కు వెల్లడించింది. దానిని ఛేదించడం కష్టమని పేర్కొంది. ‘పలువురు నిపుణులు కలిసి క్వశ్చన్ బ్యాంకును తయారు చేస్తారు. అందులో నుంచి పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయనే విషయం వారికి కూడా తెలియదు. నీట్ ప్రశ్నపత్రాల (Question Papers)ను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలు అమర్చాం. ఇవి వాహనంలోని చిన్న కదలికలను కూడా రికార్డ్ చేస్తాయి. దీనివల్ల రవాణా సమయంలో అధికారులు పర్యవేక్షించగలుగుతారు’ అని కేంద్రం వెల్లడించింది. పేపర్ లీక్‌లు అనేవి వ్యవస్థాగత సమస్య అని.. వాటిని నివారించడానికి సంస్థాగత మార్పులు అవసరమని రాధాకృష్ణన్ కమిటీ చెప్పిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారు చెప్పింది అక్షరసత్యమని పేర్కొంది. నీట్ పరీక్ష సంస్కరణలపై రాధాకృష్ణన్ ప్యానెల్, నందన్ నీలేకని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని జాతీయ పరీక్షల సంస్థ (NTA)ను ప్రశ్నించింది. వాటిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలో పరీక్షల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా నిపుణులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్ (ఇంటర్నెట్తో సంబంధం లేని వ్యవస్థలు), పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి

రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29.. చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు పెండింగ్ సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సారియా నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై తీవ్ర ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్, సువేందు అధికారి కూడా ఉన్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. 29 కేసులతో సువేందు రెండో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు, డీకేలపై చెరో 19 కేసులు, కేరళ సీఎం వీడీ సతీశన్‌పై 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదిక సమర్పించారు. బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు హన్సారియా సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తన అఫిడివిట్లో తెలిపారు. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయడానికి తక్షణమే ప్రత్యేక కోర్టులు నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ట్రయల్స్‌ను క్రియాశీలంగా పర్యవేక్షించాలని సంబంధిత హైకోర్టులను కూడా ఆదేశించాలని కోరారు. ‘543 మంది ఎంపీల లోక్‌సభలో 251 మంది, వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. 700 కేసుల్లో పోలీసులు అసలు దర్యాప్తే ప్రారంభించలేదు. చార్జిషీటు కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళకు చెందిన 95ు మంది ఎంపీలు తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 82ు మంది ఎంపీలపై.. ఒడిసాలో 76ు మంది పార్లమెంటు సభ్యులపై కేసులు

Death Penalty| ఇంటర్నెట్‌డెస్క్: మరణశిక్ష అమలులో ఉరితీయడానికి బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ వాడాలని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) తోసిపుచ్చింది. మరణశిక్షను అమలు చేసే పద్ధతిగా ప్రస్తుతానికి ఉరితీయడమే కొనసాగుతుందని తాజాగా స్పష్టం చేసింది. దోషికి తక్కువ నొప్పి కలిగించే, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిని తాజాగా ధర్మాసనం కొట్టివేసింది. అలాగే ఇదే అంశంపై గతంలో ఇచ్చిన తీర్పులను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో వేశారు. ప్రాణాంతక ఇంజెక్షన్, షూటింగ్, ఎలక్ట్రిక్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి పద్ధతుల్లో దోషి కొన్ని నిమిషాల్లో చనిపోతాడని పేర్కొన్నారు. ఉరితీయడం అత్యంత బాధాకరమైన ప్రక్రియ అని, క్రూరమైదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన మరణం పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోరారు. ఉరి తీసిన తర్వాత ఆ వ్యక్తి మరణించాడని ప్రకటించడానికి 40 నిమిషాలు పడుతుందని, అదే ఇంజెక్షన్ (Lethal injection) ద్వారా అయితే ఆ సమయం ఐదు నిమిషాల్లో పూర్తవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ బాధ కలిగే రీతిలో మరణశిక్షను అమలు చేయాలని ఐరాస తీర్మానం చెబుతోందని గుర్తుచేశారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు (Supreme Court).. తమ తీర్పే అంతిమమైంది కాదని తెలిపింది. మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై మెరుగైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లయితే.. భవిష్యత్‌లో ఈ అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి కేంద్రం ఉరిశిక్షను కొనసాగించడానికే సుముఖత వ్యక్తం చేసింది. ఉరిశిక్ష లేక ఇంజెక్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని దోషికి ఇవ్వాలని కోర్టు సూచించగా.. అలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని గత విచారణల్లో కేంద్రం వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు

నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెలరోజుల పాటు నిరసనలు (CJP Protests) చేపట్టింది. ఆ తర్వాత గత నెల 20న పార్లమెంట్ మార్చ్ కు కూడా పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు వచ్చి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు వీరిని అడ్డుకునేందుకు బలప్రయోగం కూడా చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇవాళ బిగ్ ట్విస్ట్ ఎదురైంది. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!జంతర్ మంతర్ సహా ఢిల్లీలో జరిగిన నిరసనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలు, పోలీసుల బల ప్రయోగంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఈ మేరకు తుది అంచనాకు రావడానికి సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ న్యాయమూర్తితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లూ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్దులపై కేసులు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ప్రమాదంలో పడింది. ఉరికి బదులు ఇంజెక్షన్ తో మరణశిక్ష- తేల్చేసిన సుప్రీంకోర్టు..!జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసనల వల్ల తలెత్తిన సమస్యలు, ఆరోపణలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనే దానిపై సంబంధిత వర్గాలు, పిటిషనర్ల సూచనలను చేర్చిన తర్వాత రేపు తుది ఉత్తర్వులను విడుదల చేస్తామని పేర్కొంది. తమవైపు నుంచి సీబీఐ మాజీ డైరెక్టర్ ఒకరిని, అలాగే మాజీ న్యాయమూర్తి ఒకరిని ఈ కమిటీలో చేర్చింది. విద్యార్ధుల నిరసన ప్రదర్శన, పోలీసుల చర్యలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఈ

అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు.. లఖ్‌నవూ: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు.. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంపత్ రాయ్‌కు విరాళాల చోరీ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సిట్ తన తొలి నివేదికలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిట్ తన నివేదికను రాష్ట్ర హోంశాఖకు ఇవ్వగా.. ఈ నివేదిక పరిశీలన అనంతరం తదుపరి చర్యల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో చంపత్ రాయ్‌తో పాటు మాజీ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా పేర్లు కూడా లేవని సమాచారం. అయితే, విరాళాల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరూ జూన్ 27న ట్రస్ట్‌లోని తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో జూన్ 13న తొలి సిట్‌ను ఏర్పాటు చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ నిర్వహిస్తోంది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సిట్‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి

ఇంటర్నెట్‌డెస్క్: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ ఉద్రిక్తంగా మారడంతో భద్రతా బలగాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఆ రోజు జరిగిన మార్చ్ ఫుటేజీని కమిటీ పరిశీలిస్తుందని చెప్పింది. ఆ నిరసనల్లో భాగంగా మహిళా ఆందోళనకారుల్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. వాటిపైనా దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది. ఈ ప్యానెల్లో మాజీ న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మాజీ డీజీపీ సభ్యులుగా ఉంటారని చెప్పింది. నిరసనకారులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా విచారణలో ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, పోలీసు చర్య ఆరోపణలపై దిల్లీ, బిహార్ పోలీసులు అఫిడవిట్లు దాఖలు చేశారు. ‘‘ఆ రోజు 30 వేల మంది నిరసనకారులు మూడు కిలోమీటర్ల వరకు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేలా 5 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆందోళనకారులు బారికేడ్లను దాటేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో 240 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 200 మంది ఆందోళనకారులు వైద్య చికిత్స చేయించుకున్నారు. వాస్తవానికి ఆ మార్చ్‌కు ఎలాంటి అధికారిక అనుమతి లేదు. అయినా సరే నిరసనకారులు పార్లమెంట్ వైపుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం చట్టవిరుద్ధం. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఆ గుంపులో కలిసిపోయారు’’ అని దిల్లీ పోలీసులు (Delhi Police) ఆరోపించారు. బిహార్‌లోని సివాన్‌లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనల్లో ఓ కానిస్టేబుల్ ఏకే 47 తుపాకీని ఎక్కుపెట్టిన వీడియో బయటకు రావటం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే (cop fired AK-47). ఈక్రమంలో బిహార్ పోలీసులు సుప్రీంలో

దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులపై కేసులు ఏ స్థాయిలో పేరుకుపోయాయో తెలిపే ఒక సంచలన నివేదిక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరపూరిత కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ గత దశాబ్దకాలంగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా.. సీనియర్ న్యాయవాది, అమిస్క్యూరీ విజయ్ హన్సారియా ఆందోళనకరమైన గణాంకాలను న్యాయస్థానానికి సమర్పించారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారనే నిజం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏకంగా 89 కేసులతో జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.రాష్ట్రాల్లో పాలకుల కేసుల చిట్టా!ఈ నివేదిక ప్రకారం టాప్ ప్లేస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చెరో 19 కేసులు నమోదు కాగా, కేరళకు చెందిన వీడీ సతీశన్‌పై 18 కేసులు ఉన్నాయి. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరిలతో పాటు సిక్కిం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా కేసుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీ ప్రజాప్రతినిధుల పరంగా చూస్తే బెంగాల్లో అత్యధికంగా 58 శాతం మంది సభ్యులపై తీవ్రమైన కేసులు ఉండగా.. కేరళలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం మంది శాసనసభ్యులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. 22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..పార్లమెంట్‌లోనూ అదే తీరు!కేవలం శాసనసభలకే పరిమితం కాకుండా పార్లమెంట్ సభ్యులపై కూడా భారీ స్థాయిలో కేసులు పెండింగ్‌లో

మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరిశిక్ష వేసే పద్ధతిని రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా తక్కువ బాధ కలిగించే పద్ధతులను (విషపు ఇంజెక్షన్, కాల్చిచంపడం వంటివి) అమలు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్‌ను అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 354(5) CrPC / BNSS 393(5) ప్రకారం ఉరి తీయడం ద్వారా మరణశిక్ష విధించే పద్ధతి చెల్లుబాటు అవుతుందని, గతంలో 3-జడ్జిల బెంచ్ (దీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు) ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించడానికి పెద్ద బెంచ్‌కు పంపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పు అంతిమం కాదని, భవిష్యత్తులో శాస్త్రీయ లేదా వైద్యపరమైన ఆధారాలు వచ్చి ప్రత్యామ్నాయ పద్ధతులు మెరుగైనవి అని రుజువైతే ఈ అంశాన్ని మళ్లీ రాజ్యాంగబద్ధంగా సమీక్షించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఉరిశిక్ష కంటే తక్కువ వేదన కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది

భారత చట్టసభల్లో నేరచరితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోందని మరోసారి స్పష్టమైంది. దేశంలోని 543 మంది లోక్‌సభ సభ్యుల్లో 251 మంది, 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని సుప్రీంకోర్టులో దాఖలైన ఓ అఫిడవిట్ వెల్లడించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా ఈ వివరాలను కోర్టు ముందుంచారు.అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) డేటాను ఉటంకిస్తూ హన్సారియా ఈ నివేదికను సమర్పించారు. దీని ప్రకారం.. లోక్‌సభలోని 251 మంది ఎంపీలలో 170 మందిపై ఐదేళ్లకు పైగా శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అలాగే, రాజ్యసభలో కేసులు ఎదుర్కొంటున్న 75 మందిలో 40 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు పర్యవేక్షిస్తున్నప్పటికీ, ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ్యులపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29, కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌పై 19 కేసులు ఉన్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే.. కేరళలోని 20 మంది ఎంపీల్లో 19 మంది (95 శాతం) క్రిమినల్ కేసులు

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో సాగుతున్న ఆస్తుల కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఆగస్టు 17న ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ఈ బెంచ్ ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విచారణ కొనసాగడం సరికాదని స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విగ్నేష్ శిశిర్ రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టులో అక్రమాస్తుల కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమని, పిటిషనర్‌కు ఈ కేసులో ఎలాంటి ప్రాథమిక హక్కులు (లోకస్ స్టాండీ) లేవని రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ కేసులో ప్రతివాదికి సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. దీంతో అలహాబాద్ హైకోర్టులో జరుగుతున్న విచారణా ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ అత్యున్నత న్యాయస్థానం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ లేదా ఈడీ సంస్థలు అలహాబాద్ హైకోర్టుకు ఎలాంటి నివేదికలు సమర్పించవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే, దర్యాప్తు సంస్థల వద్ద స్వతంత్ర ఆధారాలు లభిస్తే, కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా సొంతంగా చర్యలు తీసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడమే ముఖ్యమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీపై ఆస్తుల కేసు విషయంలో హైకోర్టు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఫలితంగా, ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని దాఖలైన ఈ పిటిషన్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాజకీయ

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ), కేంద్ర ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశిస్తూ లక్నో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు స్పందిస్తూ... ఈ కేసులోని ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కిందకు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... "ఆరోపణలు అంత తీవ్రమైనవే అయితే మీ దర్యాప్తు సంస్థలు ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నాయి? దర్యాప్తు లేదా విచారణ ప్రారంభించడానికి కోర్టుల నుంచి ఒత్తిడి లేదా ఆదేశాలు వచ్చే వరకు ఎందుకు వేచి చూశాయి? చట్టప్రకారం మీకున్న స్వయంప్రతిపత్తి అధికారాలతో సొంతంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు?" అని ప్రశ్నించింది

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 5 నుంచి10 ఏళ్ల మధ్య 754 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల సత్వర విచారణపై అమికస్ క్యూరీ తాజాగా సుప్రీంకోర్టుకు 22వ నివేదికను సమర్పించారు. అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలోని వివరాల మేరకు.. సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు పెండింగ్‌లో ఉండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు.. మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 700 కేసుల దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తులో ఉన్నాయి. ఇక, లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. లోక్‌సభలోని 170 మంది సభ్యులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను పరిశీలించాలంటూ సీబీఐకి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు (Rahul Gandhi assets case). రాహుల్ గాంధీ ఆదాయ వనరులకు మించి ఆస్తులు కలిగి ఉన్నార బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తనిఖీ ప్రగతిపై తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈడీ కూడా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. జులై 20న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Rahul Gandhi Supreme Court). రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు (Rahul Gandhi petition). ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఉన్న ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా ఆయన కోరారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఈ పిటిషన్లను ఆగస్టు 17న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించనుంది. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

ఇంటర్నెట్‌డెస్క్: విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న నిరసనలు, గందరగోళం విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయన్నారు. శనివారం పతంజలి యోగపీఠంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రామ్‌దేవ్ మాట్లాడారు. ‘‘పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారు. పేపర్ లీక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటర్వ్యూ సమయంలో 90 శాతం అవినీతి జరుగుతోంది. కులం, మతం, భావజాలం.. వంటి ఆధారంగా కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ప్రజాగ్రహం మరిన్ని నిరసనలకు దారితీయక ముందే.. వ్యవస్థలను సరిదిద్దుకోవాలి. అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా విస్మరించలేం. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను సమర్థించను’’ అని రామ్‌దేవ్ (Ramdev Baba) పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరొకటి శత్రువులుగా భావించుకోకూడదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షంతోపాటు భారత్‌లోని కులాలు వర్గాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో (NEET Row) దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు ఝార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్‌దేవ్ బాబా స్పందన వచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు

రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని.. ఏ రైతూ కోర్టుకు ఎందుకు రాలేదు?.. పరిహారం కోసం వారు పిటిషన్ వేశారా? ఓ పార్టీ వ్యక్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.. సమీకరణ అంటే సివిల్ కేసు కదా క్రిమినల్ కుట్రగా మార్చడం రాజ్యాంగ విరుద్ధం.. దురుద్దేశంతోనే ‘అమరావతి’పై కేసు నిజమైన బాధితులు వస్తే న్యాయం చేస్తాం.. అమరావతి భూసమీకరణ కేసు కొట్టివేత చంద్రబాబు, నారాయణలకు ఊరట.. హైకోర్టు తీర్పును సమర్థించిన సీజేఐ బెంచ్ ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుకోవద్దు. నిజమైన బాధితులు (రైతులు) కోర్టుకు వస్తే చట్టం ప్రకారం న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయ నేతలు ప్రజా ప్రయోజనం పేరుతో తమ రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడం తప్పు.’’ ‘‘ఒక్క రైతు అయినా నేరుగా ముందుకు వచ్చి నష్టపరిహారం కావాలని కోర్టులో పిటిషన్ వేశారా? ఫిర్యాదు చేశారా? ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే ఎస్సీ/ఎస్టీ రైతుల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు తప్ప, ఒక్క రైతుగానీ, సామాజిక వర్గం వ్యక్తిగానీ నేరుగా ముందుకు రాలేదు.’’ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటాలకు న్యాయస్థానాలను వాడుకోవడం సరికాదని హితబోధ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ‘‘అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ప్రధాన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట ల్యాండ్ పూలింగ్ కేసు రద్దు రాజకీయ వ్యాజ్యాలపై సీజేఐ ఆగ్రహం Land Pooling Case: అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి పి. నారాయణలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో సీఐడీ నమోదు చేసిన క్రిమినల్ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. Dwcra Loans: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే వార్త.. స్త్రీనిధిలో రూ.3 లక్షల ఆర్థిక సహాయం.. సర్కార్ కీలక నిర్ణయం విధానపరమైన నిర్ణయాలపై ఎఫ్ఐఆర్ చెల్లదన్న కోర్టు: 2021లో సీఐడీ నమోదు చేసిన ఈ కేసును(Land Pooling Case) పరిశీలించిన ఏపీ హైకోర్టు, కేవలం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా జీవోలు జారీ చేయడాన్ని క్రిమినల్ కుట్రగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ జూలై 15న కేసును కొట్టివేసింది. దీనిపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల్లో తప్పులు ఏమీ లేవని పేర్కొంది. అంతేకాకుండా ఈ తీర్పు కేవలం ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికే పరిమితమని, ఇతర సంబంధిత కేసులకు ఇది వర్తించదని, వాటిని సొంత మెరిట్స్ ఆధారంగానే విచారించాలని అత్యున్నత ధర్మాసనం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రాజకీయ వేదికలుగా కోర్టులను మార్చవద్దని హితవు: విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ రాజకీయ నేతల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల హక్కులు, వారి ప్రయోజనాల పరిరక్షణ విషయంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే, రాజకీయ నాయకులు తమ అంతర్గత, పార్టీల మధ్య ఉండే రాజకీయ పోరాటాలను కోర్టుల వేదికగా తీసుకురావడం సరికాదని హితవు పలికారు. రాజకీయ విభేదాలను న్యాయపరమైన వివాదాలుగా

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరూర్ లో టీవీకే అధినేత విజయ్ (Vijay) నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 41 మంది చనిపోయారు. వీరి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన మద్రాస్ హైకోర్టు (Madras High Court).. ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో విజయ్ సర్కార్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!గతేడాది సెప్టెంబర్ లో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాటలో మరణించిన 41 మంది మృతుల కుటుంబాల్లో ఒకరి చొప్పున విజయ్ సర్కార్ కారుణ్య నియామకాలు చేపట్టింది. దీన్ని తప్పుబట్టిన మద్రాస్ హైకోర్టు.. ఆ ఉద్యోగాలను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్ జె.బి.పార్దివాలా , జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ స్టే ఇచ్చింది. అలాగే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. బాధితుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేయడంపై పిల్ వేసిన పిటిషనర్ కు ప్రశ్నలు వేసింది. ఒక విషాద సంఘటన బాధితులకు రాష్ట్రం ఉపాధి కల్పించడంలో సమస్య ఏమిటని ప్రశ్నించింది. అక్కడ తొక్కిసలాట జరిగింది, ప్రజలు మరణించారని పేర్కొంది. బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం , ఆర్థిక పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, ఉపాధి కల్పించే నిర్ణయాన్ని కూడా ప్రశ్నించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది

హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని బీసీఐని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీజేఐ జోక్యంతో పాటు ఇతర వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు ప్రచారం చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీఐ, విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రచారానికి ఎవరు సూత్రధారులో తేల్చేందుకు నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌ను కోరింది.బీసీఐ చర్యపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఇది నాకు, విద్యార్థులకు మధ్య జరగాల్సిన సంభాషణ. ఇందులో జోక్యం చేసుకోవడానికి వాళ్లెవరు?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు బీసీఐని ఆదేశించింది. నల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.అంతకుముందు బీసీఐ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొంటూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక న్యాయ కళాశాల అయిన హైదరాబాద్ నాల్సార్ (NALSAR) విశ్వవిద్యాలయం చుట్టూ తిరుగుతున్న రాజకీయ, న్యాయపోరాటం అనూహ్య మలుపులు తిరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా పిలవడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యవహారంలో అత్యంత ఘాటుగా స్పందించిన భారత బార్ కౌన్సిల్ (BCI), నాల్సార్ 2026 బ్యాచ్‌కి చెందిన లా విద్యార్థులెవ్వరినీ అడ్వకేట్లుగా నమోదు చేయకూడదని రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయంపై నలుమూలల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవ్వడం, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో బీసీఐ కొద్ది గంటల్లోనే తన ఆదేశాలను సవరించుకుని నిషేధాన్ని ఉపసంహరించుకుంది.విద్యార్థులపై కక్షసాధింపు తగదు: బీసీఐ కీలక నిర్ణయందేశవ్యాప్తంగా లాయర్లు, ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన నిరసనల అనంతరం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. నాల్సార్ 2026 బ్యాచ్‌లోని అర్హులైన విద్యార్థులందరూ ఎప్పటిలాగే తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్లుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి తప్పు లేకుండా శిక్షను అనుభవించకూడదనే ఉద్దేశంతోనే మునుపటి ఆదేశాలను సవరించాం. అయితే, ఈ వివాదంపై అసలు నిజాలను తేల్చేందుకు విచారణ కొనసాగుతుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి అని ఆయన వెల్లడించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించని వారు భవిష్యత్తులో మంచి న్యాయవాదులుగా లేదా న్యాయమూర్తులుగా రాణించలేరని, ఇది వృత్తిపరమైన క్రమశిక్షణకు విరుద్ధమని బీసీఐ అభిప్రాయపడింది.అసలు వివాదం ఎక్కడ మొదలైంది?జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో సంసద్ నిరసనల సందర్భంగా పోలీసుల లాఠీచార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగంపై వివాదం చెలరేగింది. నీట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుకు నిరసనగా జరిగిన ఈ ప్రదర్శనపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ జులై 22న సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోరారు. ఆ

సాక్షి, ఢిల్లీ: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతామని మాయమాటలు చెప్పి.. వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు వారి కష్టాలను గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ పరీక్ష భారం నుంచి బయటపడేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో టీచర్ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిశారు. టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోందని మండిపడ్డారు. కేంద్రంలో తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకునే వెన్నుపోటు పార్టీ నేతలు, టీచర్లను ఆదుకునేందుకు 'విద్యా హక్కు చట్టాన్ని' ఎందుకు సవరించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు వయసు దాటిన టీచర్లను ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్లైన్లో అన్ని సబ్జెక్టులూ పరీక్ష రాయమనడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి టీచర్ల ఆవేదనను వివరించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే, ఉపాధ్యాయ లోకం తరపున చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు?: గొల్ల బాబూరావు కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని, తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే కూటమి నేతలు.. మరి ఉపాధ్యాయులను ఈ 'టెట్' భారం నుంచి ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో సుమారు