
Social Media: సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్ జాగ్రత్త..!
Social Media: సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్ జాగ్రత్త..!
© 2026 nimisham.in

Social Media: సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్ జాగ్రత్త..!

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tiger suddenly attacks on zookeeper video: సాధారణంగా జూలల్లో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని శాఖాహర జంతువులు, మరికొన్ని మాంసాహర జంతువులు ఉంటాయి. అయితే.. జూ సిబ్బంది వాటికి చక్కగా ట్రైన్ చేస్తారు. క్రూర జంతువులను సైతం తమ దారిలో తెచ్చుకుంటాయి. ఆ తర్వాత అవి జూ సిబ్బంది చెప్పినట్లు వింటాయి. కానీ కొన్నిసార్లు జూలోని జంతువులు సిబ్బందిపై ఎదురు తిరిగి దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో జూ సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోతారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక జూ ఎన్ క్లోజర్ లో పెద్దపులి జూ సిబ్బందిపై క్రూరంగా దాడి చేసింది.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో.. ఎన్ క్లోజర్ లో కొన్ని పెద్దపులులు ఉన్నాయి. ఇంతలో వాటిని ఆహరం వేద్దామని నెమ్మదిగా జూ సిబ్బంది దానిలోకి ప్రవేశించాడు. మరీ దానికి ఏమనిపించిందో ఏంటో కానీ ఒక్కసారిగా పెద్దపులి జూ కీపర్ పై దాడి చేసింది. ఈ ఘటనతో అతను షాక్ కు గురయ్యాడు. పులి అతని మెడను గట్టిగా పట్టుకుని పలు మార్లు తన పంజాతో దాడి చేసింది. ఇంతలో అక్కడున్న జూ కీపర్ పెంపుడు శునకం పెద్దపులిపై దాడికి దిగింది. దీంతో పులి కాస్త జూ కీపర్ ను వదిలేసింది. ఆ పెనుగులాటలో మరో జూ కీపర్ చాకచక్యంగా ప్రవర్తించి, గాయపడ్డ సిబ్బందిని బైటకు లాక్కున్నాడు. కుక్క మాత్రం పులితో పొరాటంకు దిగింది. Read more: Snake

Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను, గర్వాన్ని చిరంజీవి చాటుకున్నారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని కొనియాడారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. భారతీయులు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియోలో కొందరు భారత పర్యాటకులు రైలు మధ్యలో నిల్చుని బిగ్గరగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉన్నారు. మరికొందరు వారికి వంతపాడుతూ చేతులు ఊపుతూ, ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చోగా, కొందరు మాత్రం అసంతృప్తిగా అలా చూస్తుండిపోయారు. ఈ వీడియోను Amit24TD అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో భారతీయ పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కొందరు వ్యాఖ్యానించారు. రద్దీగా ఉన్న ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదని మరికొందరు సూచించారు. వ్యక్తిగత వేడుకలు, సరదాలను బహిరంగ ప్రదేశాల్లో ఇతర ప్రయాణికులపై రుద్దకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రైల్వే సిబ్బంది, అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదని మరికొందరు ప్రశ్నించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్‌లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు దాదాపు మిలియన్‌కు చేరువలో వ్యూస్ రావడం విశేషం. కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. ‘నా పక్కనే ఎవరున్నారో తెలుసా. క్రికెట్లో మెస్సి, రొనాల్డో అయిన విరాట్ కోహ్లీ. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్లేయర్లలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు సోషల్ మీడియాలో 273 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్నెస్, లైఫ్‌స్టైల్ ఐకాన్లుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌లో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదు. భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లకు మద్దతుగా క్రికెట్లోని అతిపెద్ద ఐకాన్లలో ఒకరు రావడం అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆమె తన అనుభూతిని పంచుకుంది. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ. పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు. కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్! ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PM Kisan Fund: రాఖీ పండగ సందర్భంగా పీఎం కిసాన్ నిధుల విడుదలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ పిఐబి స్పష్టతనిచ్చింది. రాఖీ పండగ రోజుల రైతుల అకౌంట్లో 4000వేల రూపాయలను జమ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ తో వస్తున్న ఆ వీడియోలను పూర్తిగా ఫేక్ అని.. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోకూడదని హెచ్చరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నట్లు ఓ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో రైతుల అకౌంట్లో ఏకంగా 4000 రూపాయలు జమ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాఖీ పౌర్ణమి పండగ కానుకగా ఎలాంటి ప్రత్యేక నిధులు లేదా అదనపు మొత్తాలు విడుదల చేస్తున్నట్లు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఒక నిర్దిష్ట విడతల విధానాన్ని అనుసరిస్తుంది. ఈ విధానం కింద, కేంద్ర ప్రభుత్వం జూన్ 20న పీఎం కిసాన్ నిధి 23వ విడతను విజయవంతంగా విడుదల చేసింది. ఈ నిధులు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అప్పటి నుండి, తదుపరి 24వ

మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్‌లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులు కునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి జీవన విధానం ఎన్నో కొత్త అనుభవాలను పరిచయం చేస్తుంది. జింబాబ్వేకు చెందిన కలుంబా మ్వాలేకు కూడా భారత్‌కు వచ్చిన తర్వాత ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఇక్కడికి రాకముందు సాధారణంగా భావించిన కొన్ని విషయాలు.. భారత్‌లో అడుగుపెట్టాక తనకు పూర్తిగా భిన్నంగా అనిపించాయని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల సంఖ్య తనను బాగా ఆశ్చర్యపరిచిందని మ్వాలే చెప్పారు. జింబాబ్వేలో యూనివర్సిటీలో సీటు దక్కించుకోవడం చాలా పోటీతో కూడుకున్న వ్యవహారమని, కానీ భారత్‌లో వందలాది విద్యాసంస్థలు, వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే తన యూనివర్సిటీలో ఎన్నో దేశాలకు చెందిన విద్యార్థులను కలిసే అవకాశం దక్కిందని తెలిపారు. జింబాబ్వేలో ఇంత వైవిధ్యమైన అంతర్జాతీయ విద్యార్థుల సమూహాన్ని తాను చూడలేదని చెప్పారు. భారతీయ ఆహారం కూడా తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని మ్వాలే తెలిపారు. జింబాబ్వేలో సద్జా, అన్నం, స్ట్యూ వంటి ఆహారం ఎక్కువగా ఉంటే.. భారత్‌లో ప్రాంతానికో రకమైన వంటకం, రుచులు కనిపించాయని చెప్పారు. ముఖ్యంగా ‘స్పైస్’ అంటే కేవలం కారం అనుకున్న తనకు.. భారతీయ వంటల్లో అది ఎన్నో రుచులు, సుగంధ ద్రవ్యాల కలయిక అని అర్థమైందన్నారు. వైద్యం విషయంలోనూ తన అభిప్రాయం మారిందని, విదేశాల నుంచి చికిత్స కోసం భారత్‌కు వచ్చే వారిని చూసిన తర్వాత భారత వైద్య రంగంపై కొత్త అవగాహన వచ్చిందని తెలిపారు. ఇక విదేశాల్లో అవకాశాలంటే బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలే గుర్తొచ్చేవని మ్వాలే చెప్పారు. అయితే

స్వీడన్లో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ అక్కడి పన్నుల విధానంపై చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. పౌరులు చెల్లించే పన్నులకు ప్రతిగా ప్రభుత్వాల నుంచి అందుతున్న సేవలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.గోపీ కపాడియా అనే భారతీయ మహిళ ప్రస్తుతం స్వీడన్లో నివసిస్తున్నారు. ఆమె ఇటీవల ఫేస్బుక్ వేదికగా చేసిన ఒక పోస్టులో, తాను గతంలో భారత్‌లో సుమారు 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించేదాన్నని, ఇప్పుడు స్వీడన్‌లోనూ దాదాపు అంతే పన్ను చెల్లిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, స్వీడన్లో పన్నులు చెల్లించడం వల్ల స్వచ్ఛమైన గాలి, శుద్ధి చేసిన నీరు, మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన వైద్యం, పిల్లలకు ఉచిత విద్య, సామాజిక భద్రత వంటి విశేష ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు.ఈ నేపథ్యంలో, "భారత్‌లో 30 శాతం పన్ను చెల్లిస్తున్న మనం దానికి ప్రతిగా ఏం పొందుతున్నాం?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్ట్ స్వల్ప కాలంలోనే వైరల్ కాగా, అనేక మంది నెటిజన్లు ఆమె వాదనతో ఏకీభవించారు. భారత్‌లో ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల నాణ్యతపై వారు విమర్శలు గుప్పించారు. "కారు ఇంజిన్లను పాడుచేసే ఇథనాల్ కలిపిన ఇంధనం తప్ప మనకు దక్కేదేముంది?" అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా, మరికొందరు నెటిజన్లు ఈ పోలిక ఏమాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. స్వీడన్లో జనాభా చాలా తక్కువని, అందుకే అక్కడ పరిపాలన సులభంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. భారీ జనాభా కలిగిన భారత్‌తో

అమెరికాలోని 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో చారిత్రాత్మక దావా వేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు పిల్లలు మరియు యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నాయనే తీవ్రమైన ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ సుదీర్ఘ విచారణలో మెటా సంస్థకు సుమారు 200 బిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹19 లక్షల కోట్ల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు ప్రధానంగా నాయకత్వం వహిస్తున్న ఈ కేసులో మెటాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్లు ఎక్కువ సమయం గడిపేలా ఎండ్లెస్ స్క్రోల్, ఆటోప్లే, నోటిఫికేషన్లు మరియు ప్రత్యేక అల్గారిథమ్‌లను మెటా కావాలనే డిజైన్ చేసిందని వాదిస్తున్నారు. దీనితో పాటు తల్లిదండ్రుల ముందస్తు అనుమతి లేకుండానే పిల్లల డేటాను సేకరించి సీఓపీపీఏ చట్ట నిబంధనలను సైతం ఈ సంస్థ తీవ్రంగా ఉల్లంఘించిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫీచర్ల కారణంగానే టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్ మరియు ఆత్మహత్య ధోరణులు విపరీతంగా పెరుగుతున్నాయని రాష్ట్రాల లాయర్లు కోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాలిఫోర్నియా డిప్యూటీ అటార్నీ జనరల్ మేగన్ ఓ’నీల్ స్పందిస్తూ యూజర్లను హుక్ చేయడం, డేటా సేకరించడం మరియు నిజాలను దాచడమే మెటా వ్యాపార నమూనా అని తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌ను నేరుగా ఒక ప్రమాదకరమైన మాదకద్రవ్యంతో పోల్చిన కంపెనీ అంతర్గత చాట్లను కూడా ఈ కేసులో ప్రధాన సాక్ష్యంగా సమర్పించారు. అయితే మెటా యాజమాన్యం తమపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలను చాలా గట్టిగా ఖండించింది. ఫలితంగా సోషల్ మీడియా బానిసత్వం అనేది శాస్త్రీయంగా స్థాపితమైన మానసిక రుగ్మత కాదని, తమ ప్లాట్‌ఫామ్‌లు యువతకు ఎంతో సానుకూల అనుభవాలను కూడా ఇస్తున్నాయని మెటా తరఫు న్యాయవాది పాల్ ష్మిత్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీరు మారలేదు. తెలుగు సినిమాపై మరోసారి తన అక్కసును సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తెలుగు సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేస్తుంటే... ఉత్తరాది దర్శకులకు కంటగింపుగా ఉంది. ఏదోరకంగా తెలుగు సినిమాలను చిన్న చూపు చూసే భావన ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. 'బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్.' వంటి సినిమాలు జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించడం వారికి నచ్చడం లేదు. దాంతో ఏదో ఒంకను తెలుగు సినిమాను చులకన చేయడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య రణబీర్ కపూర్ 'యానిమల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగినప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, పొలిటీషియన్ మల్లారెడ్డి తెలుగు సినిమా ఖ్యాతిని గురించి చెబుతూ, భవిష్యత్తులో రణబీర్ కపూర్ సైతం హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలను మరీ ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తోంది. సమయంకోసం వేచిచూసి, ఏదో రకంగా తెలుగు సినిమాను తగ్గించే పనికి వారు పూనుకుంటున్నారు. తాజాగా గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోందని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, 'మరి దేవర, ఓజీ, రాజా సాబ్ చిత్రాల పరిస్థితి ఏమిటీ?' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ 'ఊఫ్స్' అంటూ రియాక్షన్ ఇచ్చారు. అంటే పరోక్షంగా అయ్యో అంటూ తన సానుభూతిని ఈ చిత్రాలకు ఆయన తెలియచేశాడని భావించాలి. దీనిని తెలుగు సినిమా రంగంలోని వారు కాస్తంత సీరియస్ గా తీసుకుంటున్నారు. పేరున్న బాలీవుడ్ దర్శకుడు ఇలా బాధ్యతను మార్చి స్పందించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. ఇలా తెలుగు సినిమా మీద వ్యతిరేక భావన పెంచుకుంటూ పోతే నష్టపోయేది ఉత్తరాది వారే అని అంటున్నారు. గతంలో దక్షిణాది ఫిల్మ్

ముంబైలో జరిగిన జెన్ జీ ఆందోళనల్లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మోడల్ రియా అహిర్, ఇప్పుడు పోలీసులను ఒక విజ్ఞప్తి చేసి వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులు, నీచమైన కామెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులను కోరింది. జూలై 22న దాదర్‌లోని శివాజీ పార్క్‌లో వర్షంలో జరిగిన నిరసన మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో అరెస్ట్ చేసిన నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ ముందుకు వచ్చి, గ్రే కలర్ హూడీతో గట్టిగా నిలబడిన రియా అహిర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ఒక్కసారిగా ఈ జెన్ జీ ప్రొటెస్ట్‌కు ముఖచిత్రంగా మారింది. ఈ వివాదంపై ముంబై యూత్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మనోజ్ శర్మను కలిసి మాట్లాడింది. రియా అహిర్‌పై వేసిన ఎఫ్ఐఆర్, ఆమె ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతినిధి బృందంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హర్గున్ సింగ్, ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ శబ్రీన్ ఉన్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారని, మరి ఈ ఎఫ్ఐఆర్ల ఉపసంహరణలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని హర్గున్ సింగ్ ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, రియాపై ఉన్న ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని జాయింట్ సీపీ మనోజ్ శర్మ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రియాకు సోషల్ మీడియా లో బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్న అకౌంట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. జాయింట్ సీపీతో సమావేశం తర్వాత రియా అహిర్ మాట్లాడుతూ.. తన నిరసన వీడియో వైరల్ అయినప్పటి నుండి ఆన్లైన్ వేధింపులు

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా ఫెడరల్ కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇన్స్టాగ్రామ్ కార్యకలాపాల్లో పిల్లల భద్రతను పూర్తిగా విస్మరించి, కేవలం యూజర్ల సంఖ్య (గ్రోత్), వారి ఎంగేజ్మెంట్కే పెద్దపీట వేశారని కంపెనీ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ అర్తురో బెజర్ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ మెటాపై పలు అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులో ఆయన సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది.మెటాలో ఉద్యోగుల పనితీరు, వారికి ఇచ్చే జీతభత్యాలు వంటివి పూర్తిగా ప్లాట్‌ఫామ్‌పై యూజర్లు ఎంత సమయం గడుపుతున్నారు, వారి సంఖ్య ఎంత పెరుగుతోంది అనే కొలమానాలపైనే ఆధారపడి ఉండేవని బెజర్ కోర్టుకు వివరించారు. "ఈ నేపథ్యంలో భద్రత అనేది చివరి ప్రాధాన్యతగా మిగిలిపోయింది" అని ఆయన స్పష్టం చేశారు. 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఇన్స్టాగ్రామ్ "డోంట్ ఆస్క్, డోంట్ టెల్" (అడగవద్దు, చెప్పవద్దు) అనే విధానాన్ని అనుసరించిందని, వారి ఉనికిని తెలిసి కూడా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.ఇన్‌స్టాగ్రామ్‌ను 13 ఏళ్ల లోపు వయసున్న పదివేల మంది పిల్లలు వాడుతున్నారన్న విషయం కంపెనీలో చాలా మందికి తెలిసిన సాధారణ విషయమని బెజర్ పేర్కొన్నారు. నకిలీ ఖాతాలను గుర్తించడానికి మెటా వద్ద అధునాతన వ్యవస్థలు ఉన్నప్పటికీ, 13 ఏళ్ల లోపు పిల్లల వయసును గుర్తించి, వారిని నియంత్రించేందుకు ఉద్యోగులకు ఎలాంటి లక్ష్యాలు గానీ, కొలమానాలు గానీ లేవని ఆయన తెలిపారు. ఇది కంపెనీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు.2023లో కాలిఫోర్నియా, కొలరాడో సహా మొత్తం

ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్‌మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్‌ను రోబో అధిగమించినట్లయింది. ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్‌మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం. నిలబడే రెండు మీటర్లు జంప్! పరుగులోనే కాదు.. జంప్‌లోనూ ‘సూపర్‌మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ

టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకు (Pooja hegde) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరిగిన ఓ ప్రత్యేక గాలా కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. దీనికి ఉప్పొంగిపోయిన పూజా హెగ్డే.. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'న్యూయార్క్‌లో జరిగే గాలా కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పూజా హెగ్డే పోస్ట్ చేశారు. తనను గౌరవించిన న్యూయార్క్ నగర పబ్లిక్ అడ్వకేట్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సత్కారం తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు. “నన్ను సత్కరించిన న్యూయార్క్ నగర పబ్లిక్ అడ్వకేట్‌కు ధన్యవాదాలు. ఈ గౌరవం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నిర్వాహకులకు కృతజ్ఞతగా ఉంటాను. ఇంతటి ప్రేమను అందుకున్న తర్వాత మళ్లీ వర్క్ మోడ్‌లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను.ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు చాలా ఉంది' అని పేర్కొన్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజ ఇప్పుడు అవకాశాలు అందుకోవడంలో కాస్త వెనకపడ్డారు. ఇటీవల ' జన నాయకుడు' సినిమాలో కథానాయికగా మెరిశారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'కాంచన 4', 'శ్రీ శ్రీ' చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన ఒక సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయ్ షేర్ చేసిన ఒక అందమైన ఫ్యామిలీ ఫోటోకు రష్మిక చేసిన ఫన్నీ కామెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే, వర్షాల కారణంగా షూటింగ్ రద్దు కావడంతో విజయ్ దేవరకొండ తన నివాసంలో తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండల మధ్య పడుకుని సేదతీరుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "వర్షాల వల్ల షూటింగ్ రద్దయ్యింది. చిన్నప్పటి నా ఫేవరెట్ స్పాట్లో మధ్యాహ్నం నిద్ర దొరికింది" అని ఈ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఈ ఫోటో తీసింది తన భార్య రష్మిక మందన్నేనని పేర్కొంటూ ఆమెకు ఫోటో క్రెడిట్స్ ఇచ్చాడు.ఈ పోస్టుపై రష్మిక వెంటనే స్పందిస్తూ తన భర్తను సరదాగా ఆటపట్టించింది. "నేను ఇంటికి వచ్చాక నా పప్పీ ఐస్ (అమాయకపు చూపులు) చూడలేకే నాకు క్రెడిట్ ఇచ్చావా?" అంటూ ఫన్నీగా ప్రశ్నించింది. అంతేకాకుండా, ఇన్నేళ్లుగా తాను తీసిన మిగతా ఫోటోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని, తన ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన విజయ్, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం 'రణబలి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక ఇటీవలే 'కాక్టెయిల్ 2'లో కనిపించగా

సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక ఫోక్ సాంగ్ తెగ వైరల్ అవుతూంటుంది. రీసెంట్ డేస్‌లో జానపద గీతాలు సినిమా పాటలను మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వారానికి ఒకటి రెండు సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఎంఈ సాంగ్స్ మిలియన్ కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో కూడా వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఎక్కడ చూసిన ఇవే సాంగ్స్ మారుమ్రోగుతున్నాయి. వినే కొద్దీ వినాలనిపించేలా సాంగ్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరూ ఈ సాంగ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. డాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో ఈ పాటలు తెగ సందడి చేస్తున్నాయి. చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్దెత్తున చర్చ జరుగుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ గురించి రీల్స్, పోస్ట్ లు అంతలా ఈ సాంగ్ ఎందుకు వైరల్ అవుతుంది. అసలు ఈ సాంగ్ లో ఏముందో ఒక్కసారి చూద్దాం. యూట్యూబ్ లో చాలా ఫోక్ సాంగ్ అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని సాంగ్స్ మాత్రమే ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్.. అది మరేదో కాదురాతిరి రాతిరి సాంగ్. ఈ సాంగ్ ను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆకట్టుకునే లవ్ కాన్సెప్ట్ తో ఈ సాంగ్ ను

పాఠశాల విద్యార్థుల్లో పెరుగుతున్న నేర ప్రవత్తి.. రాష్ట్రంలో పెరుగుతున్న నేరారోపిత బాలల సంఖ్య తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం.. డ్రగ్స్, మద్యం, సోషల్ మీడియాతో ప్రభావం దేశంలో 9వ స్థానంలో తెలంగాణ.. పిల్లలను గమనించాలి.. సమస్యలు తెలుసుకోవాలి: నిపుణులు హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా పొడిచి చంపేశారు.. కూకట్‌పల్లిలో కొందరు విద్యార్థులు తమ తోటి విద్యార్థిని పాఠశాలలోనే కొట్టి చంపారు.. నిజామాబాద్‌లో హైస్కూల్ విద్యార్థులు తమ సహచర విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా బయటికి వచ్చింది... ఇలా చెప్పుకొంటూ వెళితే ఎన్నో. పాఠశాల అంటే పుస్తకాలు, పాఠాలు, ఆటలు, స్నేహాలు, భవిష్యత్తు కలలతో నిండిన ప్రదేశం. కానీ కొంతకాలం నుంచి బడి ఈడు పిల్లల చేతులు రక్తంతో తడుస్తున్నాయి. దారుణమైన నేరాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌమార దశలోని విద్యార్థుల్లో క్రూరమైన నేర ప్రవృత్తిపై చర్చ జరుగుతోంది. డ్రగ్స్, మద్యం... ఫోన్లో కళ్లముందు హింస.. విద్యార్థుల్లో మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు వినియోగం పెరగడం వారిలో నేరప్రవృత్తిని నాటుతున్నాయని.. అవి పిల్లల నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో, ఓటీటీల్లో హింసాత్మక వీడియోలు, గ్యాంగ్ కల్చర్, సైబర్ బుల్లీయింగ్ వంటివి నేరప్రవృత్తి పెరిగేందుకు దారితీస్తున్నాయి. హింసను వినోదంగా చూపించే కంటెంట్, దూకుడు ప్రవర్తనను హీరోయిజంగా చూపించే సంస్కృతి, అశ్లీల వీడియోలు పిల్లల్లో ఆ తరహా మనస్తత్వాన్ని పెంచుతున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎక్కువే! ఇటీవల రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. ‘‘మీరు ఏం చేస్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు?’ అని దాదాపు 5వేల మంది విద్యార్థులను ప్రశ్నించగా.. 96శాతం విద్యార్థులు చెప్పిన సమాధానం ఒక్కటే. మంచి మార్కులొస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారని.. మార్కులు తప్ప మరే

సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, అదే సమయంలో ఎలాంటి ప్రెజర్ ను తీసుకొస్తుందో హీరో అఖిల్ అక్కినేని(akhil Akkineni) తన ఎక్స్పీరియెన్స్లతో వివరించాడు. తాను, తన అన్న నాగచైతన్య(naga Chaitanya) తరచూ నెపోటిజం డిస్కషన్స్ లో భాగమవుతుంటామని, ఈ విషయాన్ని తాము అంగీకరించామని చెప్పాడు. అయితే స్టార్ కిడ్‌గా ఉండటం పూర్తిగా అనుకూలమైన అంశం కాదని, అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తన లాంచ్ టైమ్ లో వచ్చిన హైప్ ఒక యంగ్ యాక్టర్ కు అంచనా వేయలేనంతగా ఉందని గుర్తుచేసుకున్నాడు. సౌత్ లో స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వస్తున్నారంటే ఆడియన్స్‌లో సహజంగానే భారీ ఆసక్తి ఏర్పడుతుందని అఖిల్ పేర్కొన్నాడు. అంతటి అంచనాలను కెరీర్ ప్రారంభంలోనే ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్పాడు. అయితే మరోవైపు ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఒక ఫెయిల్యూర్ తర్వాత తిరిగి నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటం తనకు కనిపించే ప్రధాన ప్రయోజనమని వివరించాడు. ఒక సినిమా రిజల్ట్ ఆశించిన విధంగా లేకపోయినా మరో ప్రయత్నం చేసే ఫ్రీడమ్ స్టార్ కిడ్స్‌కు ఉంటుందని అన్నాడు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్‌ను కూడా సినీ లైఫ్ లో భాగంగానే చూడాలని అఖిల్ భావిస్తున్నాడు. అయితే ఎదురయ్యే ప్రతి విమర్శకు స్పందించకుండా, నిజంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే తాను మాట్లాడతానని తెలిపాడు. కానీ విమర్శలు హద్దులు దాటిన సందర్భాల్లో తన ఫ్యామిలీ మొత్తం ఒకటిగా నిలబడిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించాడు. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సిస్టమ్‌ను అర్థం చేసుకుని, ప్రశంసలతో పాటు విమర్శలను కూడా స్వీకరించడం నేర్చుకోవాల్సిందేనని అఖిల్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి

రీల్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాళ్లు విసురుతున్నట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైళ్లపై రాళ్లు విసురుతున్నట్లు, ప్రయాణికులకు అసభ్య సంజ్ఞలు చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిఘాకు చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. సంపాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు అతడిని గుర్తించి రైల్వే చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో యువకుడు.. క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. తాను రైలుపై నిజంగా రాయి విసరలేదని,.. కేవలం రీల్ కోసం అలా నటించానని చెప్పాడు. ‘నేను నిజంగా ఆ రాయిని రైలుపైకి విసరలేదు.. పక్కకు విసిరేశాను. రైలుపైకి విసురుతున్నట్లు కేవలం నటించాను’ అంటూ చేతులు జోడించి క్షమాపణలు కోరాడు. ఇకపై ఇలాంటి తప్పు చేయబోనని తెలిపాడు. వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో నిజంగా ఏదైనా రైలు లేదా ప్రయాణికుడిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం, రైల్వే ట్రాక్‌ల సమీపంలో వీడియోలు చిత్రీకరించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా వైరల్ కోసం చేసే ఇలాంటి చర్యలు ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు చట్టపరమైన సమస్యలకు కూడా దారితీస్తాయని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

పాము పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. అలాంటిది ఓ చిన్నారి కింగ్ కోబ్రాను కవ్విస్తూ.. దాని ముందే డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యమా..!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎవరైనా సరే పాము పేరు వింటేనే భయంతో వణికిపోతారు. అందులోనూ కింగ్ కోబ్రా అంటే ఆ భయం మరింత పెరిగిపోతుంది. అలాంటిది భారీ విషసర్పం ఎదురుగా ఉన్నా.. ఓ చిన్నారి ఏ మాత్రం భయపడలేదు. పైగా దాని ముందు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లిన చిన్నారి.. దానిని కవ్విస్తూ.. దాని ముందే డ్యాన్స్ చేస్తూ కనిపించింది. బాలిక తనను తట్టి లేపడంతో పాము ఒక్కసారిగా పడగ విప్పి దాడికి ప్రయత్నించింది. అయితే చిన్నారి వెంటనే వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ డాన్స్ చేయడం మొదలెట్టింది. ఇంతటితో ఆగని ఆ బాలిక.. పాము తోక పట్టుకుని పైకి ఎత్తేందుకు కూడా ప్రయత్నించింది. సాధారణంగా మనుషుల కదలికలకే దూకుడుగా స్పందించే కింగ్ కోబ్రా.. చిన్నారి ఇంతగా కవ్వించినప్పటికీ దాడి చేయకుండా ఉండటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ చిన్నారి డ్యాన్స్ కింగ్ కోబ్రాకు నచ్చినట్టుంది’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే విషపూరిత పాములతో ఇలాంటి సాహసాలు అత్యంత ప్రమాదకరమని, ఎవరూ ఇలా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man dog costume in Khandwa collectorate Madhya Pradesh: సాధారణంగా చాలా మంది ప్రభుత్వాలు సరిగ్గా ప్రజలకు కావాల్సిన సదుపాయలు, ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే నిరసనలు చేస్తారు. కొంత మంది ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు వినూత్నంగా నిరసనలు చేస్తారు. దీనితో ఓవర్ నైట్ లో ఫెమస్ అయి ఉన్నతాధికారుల వరకు వీరి బాధలు చేరుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వాలో ఒక వ్యక్తి తమ గ్రామంలో కొన్ని రోజులుగా ఉన్న కుక్కల బెడదను లేకుండా చేయాలని అధికారుల చుట్టు తిరిగాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో వెరైటీ నిరసలు చేయాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా ఖాండ్వాలోని కలెక్టర్ ఆఫీసు లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు దీపక్ రాథోర్ వెరైటీగా కుక్క మాదిరిగా కాస్ట్యూమ్ ను వేసుకున్నాడు. నేరుగా కలెక్టర్ కు శునకంలా వేషం వేసుకుని మరీ వెళ్లి గత నాలుగేళ్లలో కుక్కల సంతాన నిరోధక కార్యక్రమాలపై రూ. 40 లక్షలు ఖర్చు చేయగా, 13, 225 కుక్కకాటు కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమం యొక్క ఖర్చు, అమలుపై విచారణ జరపాలని ఆయన కలెక్టరేట్ ఆఫీస్ లో తమ గొడును చెప్పుకున్నారు. నగరంలో ఇంత ఖర్చుచేసిన కూడా వీధి శునకాల కాటులతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఇటీవల కుక్క కాటు ఘటనలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. Read more: Snake Video: ఏంటాలెంట్ భయ్యా.!. పాము బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..?.. వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన చేసిన సంచలన ఆరోపణలు తన పైన గృహహింస జరిగిందని, హత్యాయత్నం చేశారని పెట్టిన కేసు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జోగి రమేష్ కుటుంబ వివాదం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తుంది.ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్: మాజీమంత్రి సంచలనం!జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీకుటుంబ పంచాయతీ సమయంలో రికార్డైన వీడియోలు, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తన భార్యతో మాట్లాడిన ఆడియోలు వైరల్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి వీరి ఫ్యామిలీ పంచాయితీ పైనే ఉంది. జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్‌కు తెలంగాణ సూర్యాపేటకు చెందిన మేఘనతో 2025 మేలో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజుల్లోనే వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆరోపించారు.రాజీవ్ సెక్సువల్ గా అన్ ఫిట్ అంటూ మేఘన సంచలన ఆరోపణలుఅంతేకాదు తన భర్త రాజీవ్ సెక్సువల్ గా అన్ ఫిట్, తను నన్ను ఫిజికల్ గా సాటిస్ ఫై చేయలేడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అదనపు వరకట్నం రూ.5 కోట్లు తేవాలని డిమాండ్ చేశారని, గృహహింస, హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ సహా 11మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేశారు.ఇరువైపుల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో రాజీవ్ తన తండ్రిపై తీవ్రంగా మండిపడ్డారు.నౌకాదళంలోకి మచిలీపట్నం! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..ఆమె ఫోటో చూసినప్పుడే పెళ్లి వద్దన్నాను .. జోగి రమేష్ పై కొడుకు సీరియస్ఆమె ఫొటో చూసినప్పుడే పెళ్లి వద్దని చెప్పాను. ఆమెను చూస్తే తనకు ఏ ఫీలింగ్ లేదని చెప్పినా, నువ్వే బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశావు అని ఆయన అన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు జోగి రాజీవ్ స్వయంగా ఆమెను నేను సాటిస్ ఫై చెయ్యలేను అని వ్యాఖ్యలు

బెంగళూరు: ఉదయం 10.15 గంటలు.. సాధారణంగా ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసిపోయే సమయం. కానీ ఓ ఆఫీసులో మాత్రం చాలా డెస్క్‌లు ఖాళీగా కనిపించాయి. ఉద్యోగులు పని చేయడానికి ఇష్టపడటం వల్ల కాదు.. ఆఫీసుకు చేరుకునేలోపే వారి శక్తి మొత్తం ట్రాఫిక్‌లో ఆవిరైపోతోందట! బెంగళూరు ట్రాఫిక్ ఉద్యోగుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఓ స్టార్టప్ ఫౌండర్ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. Applied AI Studio వ్యవస్థాపకుడు బాల పన్నీర్‌సెల్వం తన ఆఫీసులో ఖాళీగా ఉన్న డెస్క్‌ల ఫొటోను లింక్డ్ఇన్లో షేర్ చేశారు. “సమస్య మనుషుల్లో లేదు.. ఆఫీసుకు చేరుకోవడానికి పడుతున్న శ్రమలో ఉంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ఉద్యోగుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. 4 కిలోమీటర్లకు అరగంట.. బెంగళూరులో చిన్న దూరం ప్రయాణం కూడా పెద్ద సవాలుగా మారిందని బాల చెప్పారు. హెచ్ఎస్ఆర్ ప్రాంతంలో కేవలం 4 కిలోమీటర్లు వెళ్లేందుకు స్కూటర్‌పై సుమారు 20 నిమిషాలు, కారులో అయితే 30 నిమిషాల వరకు పడుతోందన్నారు. పీక్ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌లో వాహనాల మధ్య దారి వెతుక్కుంటూ.. సిగ్నల్స్ పట్టించుకోకుండా దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలను తప్పించుకుంటూ ప్రయాణించే సరికి ఆఫీసుకు చేరుకునే సమయానికే ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారని చెప్పారు. 17 కిలోమీటర్లు.. 2 గంటలు! తనకెదురైన అనుభవాన్ని కూడా బాల పంచుకున్నారు. వర్షం లేకుండా, ఎలాంటి స్పష్టమైన అంతరాయం లేని రోజున సాయంత్రం 4 గంటలకు వైట్‌ఫీల్డ్ నుంచి హెచ్ఎస్ఆర్ వరకు 17 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా రెండు గంటలు పట్టిందని తెలిపారు. ఇక సాయంత్రం 6 తర్వాత ఆఫీసు నుంచి బయలుదేరితే ఇంటికి చేరుకునేందుకు మరింత సమయం పడుతోందన్నారు. 5 గంటలకే బయలుదేరిన ఉద్యోగులు కూడా ఇంటికి చేరేసరికి వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదించేంత శక్తి లేకుండా పోతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్.. ప్రొడక్టివిటీకి విలన్? “ఇంత గందరగోళం మధ్య

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో పెళ్లి చేసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఈసారి కూడా విదేశీ వరుడినే పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. గతంలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన సానియా 14 సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత అతడి నుంచి విడిపోయింది. 2024లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి దుబాయ్‌లో కొడుకు ఇజాన్‌తో కలిసి సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా తన కుమారుడికి ఒక తండ్రి అవసరమని భావించిన సానియా మీర్జా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరా వ్యక్తి? మరి 2024 నుంచి దుబాయ్‌కి మకాం మార్చిన సానియా మీర్జా తన స్నేహితుడైన ఒక విదేశీయుడితో రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు కూడా దుబాయ్‌లో ఉంటున్నాడని, అందుకే సానియా అక్కడే ఒక ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇక భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులకు తన రిలేషిన్షిప్ గురించి సానియా మీర్జా వెల్లడించిందని, కూతురు పెళ్లికి వాళ్లు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే సానియా కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ సానియా మీర్జా పెళ్లి చేసుకుంటే మాత్రం దుబాయ్‌లో సన్నిహితుల సమక్షంలోనే వివాహం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే సానియా మీర్జా స్పందించేవరకు ఆగాల్సిందే. టెర్రాకు బ్రాండ్ అంబాసిడర్‌గా.. మరోవైపు సానియా మీర్జా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెండ్లి చేసుకున్నాడు. ఇక సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న సానియా మీర్జా ఇటీవలే టెర్రా ఇన్వెస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సానియా మీర్జా డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంకు సాధించింది.డబుల్స్‌లో ఆరు మేజర్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కైవసం

ఏదైనా ఖాతాను బ్లాక్ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్ తీసుకువచ్చిన కొత్త... మెటా, ఎక్స్‌లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఏదైనా ఖాతాను బ్లాక్ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్ తీసుకువచ్చిన కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏ సోషల్ మీడియా సంస్థ అయినా సరే, భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడి చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. మరోవైపు, ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌నూ సహించేది లేదని మెటా సంస్థకు తేల్చి చెప్పింది. బాలల లైంగిక వేధింపుల మెటీరియల్(సీఎ్సఏఎం) వ్యాప్తికి కారణమయ్యే సోషల్ మీడియా వేదికలతో పాటు వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోల్పోతారని హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై అమెరికాలో సంచలన కేసు నమోదైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పిల్లలకు, టీనేజర్లకు హాని కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 133 లక్షల కోట్ల జరిమానా విధించే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో మంగళవారం ఈ కీలక విచారణ అధికారికంగా మొదలైంది. ఈ వివాదానికి బీజం 2023లో పడింది. అప్పట్లో దాదాపు 30 అమెరికన్ రాష్ట్రాలు మెటాపై ఉమ్మడిగా పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, మరియు న్యూజెర్సీ రాష్ట్రాలు ఈ కేసులో ప్రధాన వాదిగా నిలిచాయి. 13 ఏళ్ల లోపు పిల్లల సమాచారాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించడం ద్వారా 'కాపా' చట్టాన్ని ఉల్లంఘించారని రాష్ట్రాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫీచర్లపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ఫినిట్ స్క్రోల్, లైక్స్, నోటిఫికేషన్లు, మరియు రికమెండేషన్ సిస్టమ్స్ వంటి ఫీచర్లను మెటా లాభాపేక్షతో రూపొందించిందని పిటిషనర్ల వాదన. దీంతో యువత ఈ వేదికలకు బానిసలై, తీవ్రమైన ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా, మెటా ఈ ఆరోపణలను కొట్టివేస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ భారీ జరిమానా పట్ల మెటా యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం మెటా మార్కెట్ విలువకు సమానమని, వాస్తవాలకు దూరంగా ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ మార్క్ జకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసెరిలను కోర్టు విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ మెక్సికో కేసులో మెటాకు సుమారు రూ. 942 కోట్ల జరిమానా పడటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ మరింత వేడెక్కనుంది. టెక్ దిగ్గజాలు

దోశ.. దక్షిణాది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం. వేడి వేడి దోశను చేతితో ముక్కలు చేసి చట్నీ, సాంబార్‌తో తినడం చాలామందికి అలవాటు. కానీ 5 స్టార్ హోటల్లో దోశ తినాలంటే మాత్రం చేతులు ఉపయోగించకూడదా? స్పూన్, ఫోర్క్‌తోనే తినాలా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ ప్రశ్నలను లేవనెత్తింది.వైరల్ వీడియోలో ఓ ఎటికెట్ కోచ్ దోశను ఎలా తినాలో చూపించారు. ముందుగా దోశ రెండు చివర్లను మధ్యకు మడిచారు. ఆ తర్వాత స్పూన్‌తో దోశ నుంచి ఓ ముక్కను విడదీశారు. దాన్ని ఫోర్క్‌తో తీసుకుని తిన్నారు. 5 స్టార్ హోటల్లో దోశను ఇలా తినాలంటూ వీడియోలో చూపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోను ‘ఎక్స్’లో మనస్ ముదులి అనే యూజర్ షేర్ చేశారు. 5 స్టార్ హోటల్లో రూ.1,500 చెల్లించి దోశ తింటే చేతులతో తినడానికి అనుమతి ఉండదన్నట్టుగా ఆయన వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టారు. ఫోర్క్, స్పూన్ తప్పనిసరి అంటూ వీడియోను పంచుకున్నారు.వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. దోశను భారతీయ పద్ధతిలోనే తినాలని కొందరు సూచించారు. మరికొందరు ఈ విధానం చాలా విచిత్రంగా ఉందని కామెంట్ చేశారు. ఓ యూజర్ అయితే దోశ, ఇడ్లీ లాంటి వంటకాలకు ఫోర్క్, స్పూన్ పక్కన పెట్టి చేతులతో తినడమే సరైన పద్ధతి అని వ్యాఖ్యానించారు. మరోవైపు 5 స్టార్ హోటళ్లలో ఇలాంటి నిబంధన ఏదీ లేదని కొందరు స్పష్టం చేశారు

క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించడం.. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకోవడం.. ఆ తర్వాత డీల్ మాట్లాడుకుందామంటూ ఓ ప్రాంతానికి పిలిపించడం.. అక్కడికి వెళ్లాక బెదిరించి చేతిలో ఉన్న డబ్బు గుంజేయడం..! హైదరాబాద్‌లో ఓ ముఠా చేస్తున్న అరాచకాలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ముఠా సభ్యులను అరెస్టు చేశారు..రూ.7 లక్షలు వసూలు చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఫేస్బుక్లో పరిచయం.. క్రిప్టో పేరుతో వల! బేగంబజార్‌కు చెందిన జె.ఆర్. చౌదరిని నిందితులు సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, పెట్టుబడుల పేరుతో ఆయనకు నమ్మకం కలిగించారు. భారీ మొత్తంలో లాభాలు పొందవచ్చని చెప్పి క్రిప్టో డీల్ కోసం కలుద్దామని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 15న బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌నగర్‌కు చౌదరిని పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిందితులు బెదిరింపులకు పాల్పడి ఆయన వద్ద నుంచి రూ.7 లక్షల నగదు బలవంతంగా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదుతో బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఆగస్టు 17న చాంద్రాయణగుట్టలోని కింగ్స్ స్నూకర్ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి చేరుకుని నలుగురినీ అరెస్టు చేశారు. ఫిట్నెస్ ట్రైనర్ నుంచి విద్యార్థుల వరకు.. అరెస్టయిన వారిని కాంచన్‌బాగ్‌కు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ సబేర్ బిన్ అహ్మద్ హద్రానీ అలియాస్ సైఫ్ (A-1), కర్వాన్‌కు చెందిన విద్యార్థి మహమ్మద్ అబుల్ సలామ్ (A-2), రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థి మహమ్మద్ అనస్ (A-3), పహాడీషరీఫ్‌కు చెందిన డ్రైవర్ *మహమ్మద్ ఆసిఫ్ (A-4)*గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో A-5గా పేర్కొన్న మరో ఆసిఫ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) రీసెంట్ గా తన గత రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన ఆ రిలేషన్లో తాను ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే రిలేషన్ లో ఉన్న వ్యక్తి పేరును అనుపమ ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో ఆమెకు ధృవ్ విక్రమ్(Dhruv vikram)తో ఉన్న రిలేషన్షిప్ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు ఈ కామెంట్స్ ను అతడితో ముడిపెట్టారు. దీంతో ధృవ్ పర్సనల్ లైఫ్ ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. ఈ పరిణామాలపై ధృవ్ విక్రమ్ తాజాగా రియాక్ట్ అవుతూ, తన వ్యక్తిగత విషయాలపై ఇంతటి స్థాయిలో చర్చ జరగడం అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. తాను సాధారణంగా పర్సనల్ లైఫ్ ను బహిరంగంగా మాట్లాడే వ్యక్తిని కాదని, అయినప్పటికీ ప్రస్తుతం తనపై అనవసరమైన ఫోకస్ పెరిగిందనే భావనను వ్యక్తం చేశారు. ప్రతి డిస్కషన్ కు, ప్రతి ఊహాగానానికి రియాక్ట్ అవడం కంటే తన పని, కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. మరోవైపు, అనుపమ తన గత రిలేషన్ తనపై చూపిన ప్రభావాన్ని బహిరంగంగా వివరించినప్పటికీ, ఆమె కామెంట్స్‌లో ధృవ్ విక్రమ్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావనకు రాలేదు. అంతేకాకుండా ఆ సంబంధాన్ని పెళ్లి దిశగా తీసుకెళ్లకుండా తానే ఆపుకున్నానని ఆమె వెల్లడించారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో సోషల్ మీడియా ఊహాగానాలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది

అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనసూయ కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమెను హెచ్చరించారు. ఇటీవల ఓ సందర్భంలో కొందరు వ్యక్తులు ఇతరులపై దాడులకు పాల్పడుతూ జై శ్రీరామ్ నినాదాన్ని ఉపయోగిస్తున్నారంటూ అనసూయ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారితీయడంతో పాటు, కొంతమంది నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే తన మాటలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అనసూయ ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఏ మతాన్ని, వర్గాన్ని లేదా విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, ఒక నిర్దిష్ట వర్గంలోని వ్యక్తుల ప్రవర్తనను మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. అనసూయ గతంలోనూ సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పలు సందర్భాల్లో వివాదాలకు కేంద్రంగా నిలిచారు. తాజా కంప్లైంట్ తో మరోసారి ఆమె కామెంట్స్ రాజకీయ, మతపరమైన చర్చకు దారితీశాయి. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదును స్వీకరించి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ దశలో ఫిర్యాదు మినహా అనసూయపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదు. ఈ వ్యవహారంపై ఆమె నుంచి మరింత వివరణ రావాల్సి ఉంది

బీజేపీ తన సోషల్ మీడియా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ మస్కేను నియమించారు. దాదాపు దశాబ్ద కాలంగా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ గా కొనసాగిన అమిత్ మాలవ్యను ఈ బాధ్యతల నుంచి తప్పించడం గమనార్హం.దీపక్ మస్కేకు సహాయకులుగా నలుగురు సోషల్ మీడియా కో-కన్వీనర్లను పార్టీ నియమించింది. వీరిలో ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్ ఉన్నారు. అదేవిధంగా, మీడియా కోఆర్డినేటర్‌గా అనిల్ బలూనీకి బాధ్యతలు అప్పగించగా, ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారి, సిద్ధార్థ్ యాదవ్ జాయింట్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు.పార్టీలో చేపట్టిన విస్తృతస్థాయి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. పదేళ్లకు పైగా బీజేపీ జాతీయ ఐటీ సెల్‌కు నాయకత్వం వహించిన అమిత్ మాలవ్య, గతంలో పశ్చిమ బెంగాల్ కో-ఇన్చార్జ్గా కూడా పనిచేశారు. అయితే, తాజా జాబితాలో సోషల్ మీడియా లేదా ఐటీ సంబంధిత బాధ్యతల్లో ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ డిజిటల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకే ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది

టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. దాంతో వెంటనే వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించారు. సినిమా స్టార్స్ వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక్కోసారి ఊహించని విధంగా వివాదాలు వారిని చుట్టుముడుతుంటాయి. అలాంటిదే ఆగస్ట్ 15న తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ విషయంలో జరిగింది. అల్లు అర్జున్ ఆగస్ట్ 15, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నట్టుగా ఉంది. అయితే ఆ జెండాలో అశోక చక్రం మిస్ అయ్యింది. దాంతో కొందరు నెటిజన్స్ జాతీయ పతాకాన్ని అలా ఎలా తప్పుగా చూపిస్తారంటూ కామెంట్స్ పెట్టారు. ఆ వెంటనే, బన్నీ పీ.ఆర్. టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ పోస్టర్ ను తొలగించింది. అయితే అప్పటికే కొందరు దాని స్క్రీన్ షాట్ ను తీసుకుని, అల్లు అర్జున్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే... ఆగస్ట్ 15నే విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'రణబాలి'కి సంబంధించిన పోస్టర్ ను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఆ పోస్టర్ ద్వారా తెలిపింది. రక్తసిక్తమైన దేహంతో ఉన్న విజయ్ దేవరకొండ భారత జాతీయ పతాకాన్ని తన ఒంటికి కప్పుకున్నట్టుగా ఆ పోస్టర్ ను తయారు చేశారు. దాని మీద కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి. ఈ పోస్టర్ పై ఎలాంటి వివాదం తలెత్తకపోయినా... ముందు జాగ్రత్తగా కావచ్చు, వెంటనే దానిని సోషల్ మీడియా నుంచి తొలగించి జాతీయ జండా రెపరెపలాడుతున్న నేపథ్యంలో హీరో గుర్రంపై వస్తున్న పోస్టర్ ను తిరిగి పోస్ట్ చేశారు. ఆగస్ట్ 15న తెలుగు సినిమా రంగంలో చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలతో అగ్ర కథనాయకులకు చెందిన

గతంలో ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యల తర్వాత ఆన్ లైన్ లో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అంతే కాదు రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకుంది. దీన్ని ముందుగా లైట్ తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత దాని అకౌంట్లను బ్లాక్ చేయిస్తూ పోయింది. చివరికి జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా పెట్టి.. పార్లమెంట్ మార్చ్ కు పిలుపునిచ్చిన యువత.. నీట్ అక్రమాలకు బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించింది. ఇది చరిత్ర. తాజాగా ప్రధాని మోడీ చేసిన ఓ విమర్శ మరో పార్టీకి ప్రాణం పోసింది. అదే దిమాగీ నక్సల్ పార్టీ (dimagi naxal party).NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!ప్రధాని మోడీ ఈసారి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్ అనే పదం వాడారు. దీని అర్దం మేథావులైన నక్సల్స్. గతంలో దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇప్పుడు దిమాగీ నక్సల్స్ సమస్యగా మారిందంటూ ఈ మధ్య కాలంలో బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న మేథావుల్ని, విద్యార్దుల్ని, విపక్షాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సత్తా చాటుకున్న కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ కూడా ఇచ్చుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు..!ఈ నేపథ్యంలోనే గతంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో కొత్త కౌత్త అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఎక్స్, ఇన్ స్టాతో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇవి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కంటెంట్ తొలగింపు లేదా పరిమితులపై ప్రభుత్వాల నుంచి వచ్చే అభ్యర్థనలను యూజర్లకు మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తామని ప్రకటించారు. ఆన్లైన్లో ప్రభుత్వ జోక్యం, కంటెంట్ నియంత్రణ వంటి అంశాల్లో పారదర్శకతను పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.ఈ కొత్త మార్పుల గురించి ఎక్స్‌లో పోస్ట్ చేసిన మస్క్, "ప్రభుత్వాలు కోరిన ఏ సెన్సార్షిప్ అయినా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది" అని తెలిపారు. దీని ప్రకారం, ఏ ప్రభుత్వ ఏజెన్సీ పోస్టులను తొలగించాలని కోరింది, ఏ ఖాతాలపై పరిమితులు విధించాలని అడిగింది వంటి వివరాలను యూజర్లు నేరుగా చూడగలుగుతారు. వీలైతే, ఆ అభ్యర్థనల వెనుక ఉన్న చట్టపరమైన కారణాలు లేదా సమర్థనలను కూడా వెల్లడించనున్నట్లు ఎక్స్ తెలిపింది.ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆన్లైన్ కంటెంట్‌ను ఎలా నియంత్రిస్తున్నారు, ర్యాంక్ ఇస్తున్నారు అనే విషయాల్లో యూజర్లకు పూర్తి పారదర్శకత ఉండాలని మస్క్ బలంగా వాదిస్తున్నారు. ఈ తాజా నిర్ణయం కూడా ఆయన విస్తృత లక్ష్యాల్లో భాగమే.ఇదిలా ఉండగా, క్రిప్టో బ్రీఫింగ్ నివేదిక ప్రకారం, మస్క్ యాజమాన్యంలో ఎక్స్.. ప్రభుత్వాల నుంచి వచ్చిన టేక్‌డౌన్ అభ్యర్థనలను 83 శాతం నుంచి 98.8 శాతం వరకు అమలు చేసింది. ఇది పాత యాజమాన్యం కంటే అధికం కావడం గమనార్హం.కేవలం ప్రభుత్వ అభ్యర్థనలకే పరిమితం కాకుండా, తమ రికమండేషన్ అల్గారిథమ్‌లను కూడా ఎక్స్ పారదర్శకంగా ఉంచుతోంది. టెక్నాలజీలోని కొన్ని భాగాలను ఓపెన్-సోర్స్ చేయడం ద్వారా, ఏ పోస్టులను

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందని చెబుతూనే, ఆయన ప్రమాదకరమైన 'దీమాగీ నక్సల్స్' సిద్ధాంతంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే ఈ వర్గం యువతను తప్పుదారి పట్టిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. వీరిని గుర్తించి సమాజం నుంచి దూరం పెట్టాలని పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పెంచింది. గతంలో 'అర్బన్ నక్సల్స్' పదం ఏ విధంగా వివాదాస్పదమైందో, ఇప్పుడు 'దీమాగీ నక్సల్స్' అనే పదం అదే తరహాలో విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. 2014 నుంచి సాయుధ నక్సల్స్ భరతం పట్టామని, హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలికామని ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే, ఆలోచనా విధానంలో నక్సలిజం మిగిలి ఉందనే ఆయన వాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ లేబుల్ ద్వారా విమర్శించే వారిని, భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ప్రధాని వ్యాఖ్యలను తక్షణమే వ్యంగ్యాస్త్రాలుగా మార్చి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. 'దీమాగీ నక్సల్స్ జనతా పార్టీ' పేరుతో కొత్త హాష్‌ట్యాగ్‌లు సృష్టించి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నీట్ పరీక్షల వివాదంలో వెలుగులోకి వచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' తరహాలోనే ఈ తాజా నిరసన ట్రెండ్ కొనసాగుతోంది. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఇటువంటి పదాలతో పక్కదారి పట్టిస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో మద్దతు, విమర్శలతో కూడిన భిన్నమైన చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దీమాగీ నక్సల్స్ అనే పదం కేవలం రాజకీయ పదం మాత్రమేనా లేక నిజంగానే ఒక సైద్ధాంతిక ముప్పా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉద్యోగ నియామకాలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాల వల్ల ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం

‘పోస్ట్’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఉత్తరాలకు బదులు వాట్సాప్ మెసేజ్‌లతోనే ప్రపంచం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. ‘పోస్ట్’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఉత్తరాలకు బదులు వాట్సాప్ మెసేజ్‌లతోనే ప్రపంచం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. అయితే జెన్ జీ మాత్రం ‘పోస్ట్’ అనే మాటను సరికొత్తగా వినాలని కోరుకుంటోంది. వాట్సాప్, ఫేస్బుక్ కాకుండా ఉత్తరాల అనుభూతిని ఆస్వాదించాలని ఆరాటపడుతోంది. వారి అభిరుచికి తగ్గట్టుగా ‘స్నెయిల్ మెయిల్’ క్లబ్బులు పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో సభ్యత్వం తీసుకున్నవారికి పోస్ట్‌లో లేఖలు పంపించడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. అమెజాన్, స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్... వీటిల్లో ఏదైనా బుక్ చేస్తే... నిమిషాల్లో ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అందిస్తున్నాయి. వాట్సాప్, జీమెయిల్ వంటివి సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్నాయి. ఇన్‌స్టా, స్నాప్‌చాట్ వంటివి వీడియోలను అందిస్తున్నాయి. ఒకరకంగా ఈ ఇన్స్టంట్ సంస్కృతి జెన్ జీ తరానికి నచ్చడం లేదు. పోస్టులో వచ్చే ఉత్తరం కోసం వేచి చూసే అనుభూతిని వాళ్లు కోరుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘స్నెయిల్ మెయిల్’ క్లబ్‌లలో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏం చేస్తారంటే... ‘స్నెయిల్ మెయిల్’ క్లబ్లో సభ్యత్వం తీసుకుంటే ప్రతీ నెలా ఇంటికి అందంగా అలంకరించిన లెటర్లు పంపిస్తారు. వాటిలో చేతితో రాసిన ఉత్తరం, స్టిక్కర్లు ఉంటాయి. ఇన్‌స్టాలో ‘స్నెయిల్ మెయిల్’ అని వెతికితే రంగురంగుల కవర్లు, చేత్తో రాసిన ఉత్తరాలు, పాతకాలపు స్టాంపులు, పూలతో అలంకరించిన లేఖలు కనిపిస్తాయి. ఇలాంటి క్లబ్బులు పాశ్చాత్య దేశాల్లో చాలాకాలంగా ఉన్నాయి. మన దగ్గర ఈ మధ్యకాలంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త తరహా క్లబ్బుల్లో సభ్యత్వాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వీటి నిర్వాహకులు అంటున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ప్రతీ నెల ఒక థీమ్‌ను ఎంచుకుంటారు. కథలు, సందేశాలు, జోక్స్ లెటర్స్, చిన్నచిన్న కానుకలు.. ఇలా లేఖలు తమ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. లేఖలో ఏముంటుందో

ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్‌కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్‌గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్‌తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్‌ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డెలివరీ ఏజెంట్ల బంద్.. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్‌కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్

న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్‌గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్‌ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Faria Abdullah:ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె పండుగలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. అక్కడ తనకు లభించిన ప్రేమ, ఆదరణ చూసి ఫరియా భావోద్వేగానికి గురైంది. అయితే బోనాల వేడుకల్లో ఆమె పాల్గొనడాన్ని కొందరు తప్పుబట్టారు. ఫరియా ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా, హిందూ పండుగలో ఎందుకు పాల్గొన్నావంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆమెపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తూ హేట్ మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. తనను ‘ఇస్లాం ద్రోహి’ అంటూ కొందరు కామెంట్లు చేయడం ఫరియాను తీవ్రంగా బాధించింది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫరియా ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన కుటుంబ నేపథ్యం గురించి కూడా వివరించింది. ఫరియా చెప్పిన వివరాల ప్రకారం, ఆమె తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించి తర్వాత హిందూ మతాన్ని ఇష్టపడి స్వీకరించారు. ఆమె తండ్రి హిందూ కుటుంబంలో జన్మించి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తన తండ్రి ఇస్లాంలోని మంచి విషయాలను మాత్రమే తనకు నేర్పించారని ఫరియా తెలిపింది. తనకు ద్వేషించడం తెలియదని, ప్రేమించడం మాత్రమే తెలుసని ఫరియా చెప్పింది. తనపై విమర్శలు చేస్తున్న వారిని కూడా తాను ద్వేషించనని, వారు కూడా బాగుండాలని కోరుకుంటానని తెలిపింది. ప్రేమ, శాంతి, ఐక్యత కోసం తాను ఎప్పుడూ ప్రార్థిస్తానని ఫరియా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. YouTuber Akhil Wife: యూట్యూబర్ అఖిల్, ఆయన భార్య మేఘకు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేఘ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నో ఆశలతో అఖిల్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అయితే పెళ్లి తర్వాత అతడి ప్రవర్తన గురించి తనకు అనేక విషయాలు తెలిసాయని పేర్కొంది. తన భర్తకు ఇతర యువతులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ విషయంపై తాను అఖిల్‌ను ప్రశ్నించినప్పుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె చెప్పినట్లు సమాచారం. పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చినప్పటి నుంచి తనకు సంతోషం లేకుండా పోయిందని మేఘ పేర్కొంది. తనను సరిగ్గా చూసుకోకుండా తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించింది. ఈ పరిస్థితులతో తాను ఎంతో బాధపడ్డానని, చివరకు ఆ జీవితాన్ని వదిలి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో తాను ఓ కండక్టర్‌తో వెళ్లిపోయిన విషయంపై కూడా మేఘ స్పందించినట్లు తెలుస్తోంది. తనకు ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలని, అందుకే అఖిల్‌ను వదిలి వెళ్లినట్లు చెప్పింది. కండక్టర్ అయినా, క్లీనర్ అయినా అతడితోనే జీవిస్తానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. అయితే మేఘ చేసిన ఈ ఆరోపణలపై అఖిల్ వైపు నుంచి ఎలాంటి పూర్తి వివరణ బయటకు వచ్చిందనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను నిర్ధారించేందుకు అధికారిక సమాచారం కూడా అవసరం. మేఘ ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Little Boy Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలకు, అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. రోజు ఎన్నో రకాల విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనల్ని నవ్వు పుట్టించేలా చేస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా కొన్ని చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలైతే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు సంబంధించిన టాలెంటెడ్ బాలుడు వీడియో అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. భారీ ట్రాక్టర్‌తో బుడతడు.. సాధారణంగా చాలామంది పిల్లలు చిన్న వయసులో ట్రాక్టర్ బొమ్మలతో పాటు కార్ల బొమ్మలు, ప్లాస్టిక్ సైకిళ్లతో ఆడుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది ప్లాస్టిక్ రిమోట్ కంట్రోల్ కార్లలో ఎక్కి.. నడిపినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్న బాలుడు మాత్రం వయస్సుకు ఏ మాత్రం వంతన లేని విధంగా ఓ పని చేసేసాడు... నేరుగా ఆ యువకుడు భారీ డాక్టర్‌ను ఎక్కి.. నడపడమే కాకుండా.. తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్ బయటపెట్టి ప్రొఫెషన్ డ్రైవర్ల అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు.. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా.. ఆ బాలుడు తన స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఏమాత్రం భయం లేకుండా అద్భుతంగా ట్రాక్టర్ ని కంట్రోల్ చేయడం ఈ వీడియోలో మీరు క్లియర్‌గా

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలకు కూటమి.. వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. ఒంగోలు కేంద్రంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పార్టీ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేసారు. జనసైనికులను రెచ్చగొట్టే వ్యాఖ్యల వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారింది. కూటమి - వైసీపీ మధ్య హోరా హోరీగా సోషల్ మీడియా వేదికగా రాజకీయం కొనసాగుతోంది. ఒంగోలులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ కొన్ని ఆసక్తి కర పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో జనసైనికులు పరిధికి లోబడి వ్యవహరించాలని నిర్దేశించారు. సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాలు మాట్లాడేటప్పుడు, పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. వాడే భాష, భావ వ్యక్తీకరణలో పరిధి దాటొద్దని ఆదేశించారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారని ఆ పార్టీ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించారు.TTD: తిరుమలలో రియల్‌టైమ్ ఫిర్యాదుల పరిష్కారానికి నందకం’ యాప్..!!జనసైనికులకు మార్గ నిర్దేశంఅదే విధంగా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించాలి, ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు. అసభ్య పదజాలం వాడవద్దు. మహిళలను గౌరవించి మాట్లాడాలి. పార్టీ అంతర్గత అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించొద్దు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా, జనసైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రభావానికి లోనుకావొద్దు.

తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో "ఫోటో వార్" రూపం తీసుకుంది. ‘ఎక్స్’ వేదికగా ఇరు పార్టీల అధికారిక ఖాతాల నుంచే ఎడిట్ చేసిన ఫొటోలతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దాడి చేసుకుంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ ఫోటోల యుద్ధానికి తెలంగాణ బీజేపీ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ కారణమైంది. "వన్ టీమ్, వన్ మిషన్ - వికసిత్ తెలంగాణ" అనే క్యాప్షన్‌తో బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతల గ్రూప్ ఫోటోను బీజేపీ పోస్ట్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం.. ఆ ఫోటోలో సీఎం రేవంత్ రెడ్డిని చేర్చి "అసలు వ్యక్తిని మర్చిపోయారేంటి?" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. రేవంత్ రెడ్డి, బీజేపీ ఒక్కటేనని చెప్పే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పోస్ట్‌పై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అంతకుమించిన దూకుడుతో బదులిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేత బండి సంజయ్ కాళ్లపై పడినట్లుగా మార్ఫింగ్ చేసిన ఫోటోను తమ అధికారిక ఖాతాలలో పోస్ట్ చేసి ఎదురుదాడికి దిగింది. ఈ మార్ఫింగ్ ఫొటోల వివాదం ఇక్కడితో ఆగలేదు. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అంశాలపై కేటీఆర్, హరీశ్‌రావు వ్యంగ్య పోస్టులు పెడుతుండగా, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఫామ్‌హౌస్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను ఎత్తిచూపుతూ కౌంటర్లు ఇస్తోంది. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన ఆన్లైన్ పోల్‌ను బీఆర్ఎస్ నకిలీ

ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) స్పందించారు. ఈ వివాదంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు. కొందరు కావాలనే తన వ్యాఖ్యల నుంచి అసలు సందర్భాన్ని తొలగించి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించే హిందువునని, హనుమంతుడి భక్తురాలినని అనసూయ స్పష్టం చేశారు. తనపై ఆన్లైన్లో అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగుతున్న వారిని ఉద్దేశించే మాట్లాడాను తప్ప, ఏ మతాన్నో లేదా వర్గాన్నో కించపరచడం నా ఉద్దేశం కాదని అన్నారు. నిజం వైపు నిలబడటం, తప్పును ప్రశ్నించడం, ఎదుటివారిని గౌరవించడం నా ధర్మమే నాకు నేర్పిందని స్పష్టం చేశారు. హనుమంతుడి ధైర్యమే నాకు కొండంత బలమని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సగం చూసే కథనాలను నమ్మి తనపై దుష్ప్రచారం చేయవద్దని నెటిజన్లను కోరారు. పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని హితవు పలికారు. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అంటూ ఆమె పెట్టిన ఈ క్లారిఫికేషన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అనసూయ తన పోస్ట్ విషయానికి వస్తే.. ‘‘నా మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారు. అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను మాట్లాడింది నాపై అసభ్య కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే కొంతమంది వ్యక్తుల గురించి మాత్రమే. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ ఉద్దేశించి

గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్‌మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్‌గా, మోడరన్‌గా ఉంటూనే ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఈ కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్మార్క్లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్స్టాగ్రామ్ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు) ‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు) 'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) అమెరికాలో దారుణం.. తల్లి, తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్ సొల్లు కబుర్లు ఎందుకు...? దమ్ముంటే నిరూపించు మామయ్య..! బోండా ఉమాకు ఇచ్చిపడేసిన పేర్ని నాని నా ఆటకు అదే చివరి రోజు.. రిటైర్మెంట్ పై రోహిత్ భావోద్వేగం హడలెత్తిస్తున్న బంగారం.. తులం 2 లక్షలు? నిపుణుల షాకింగ్ సర్వే

ఆహార పదార్థాల ఉత్పత్తి కంపెనీల కోసం ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆ పదార్థాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రజలకు రికమెండ్ ... ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ కఠిన మార్గదర్శకాలు తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆహార పదార్థాల ఉత్పత్తి కంపెనీల కోసం ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆ పదార్థాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రజలకు రికమెండ్ చేయాలని భారత ఆహార భద్రత, ప్రమానాల నిర్ణాయక సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆదేశాలు జారీచేసింది. ఒక ఆహార పదార్థం గురించి వాణిజ్యపరంగా ప్రచారం చేసేముందు దాని తయారీకి ఉపయోగించిన పదార్థాలు, వాటి మోతాదులు, దానిని తింటే కలిగే ప్రయోజనాలు, నష్టాలు తదితర సకల వివరాలను ప్రచారకులు కచ్చితంగా తెలుసుకొని ఉండాలని స్పష్టంచేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గురువారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కంపెనీలు తమ ఉత్పత్తుల గురించి చెప్తున్న వివరాలన్నీ నిజమేనా.. కాదా? అన్నది ముందుగానే నిర్ధారించుకోవాలని సూచించింది. ఆహార పదార్థాల గురించి ఏమీ తెలియకుండానే ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక చిహ్నాలు అవసరంలేదు తినటానికి సిద్ధంగా ఉండే ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక చిహ్నాలు ముద్రించటానికి ఆహార పరిశ్రమ వర్గాలు సిద్ధంగా లేవని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ తెలిపింది. అందుకు బదులుగా ఒక మనిషికి రోజుకు ఎంతమేర పౌష్టికాహారం అవసరమనే వివరాలతో ఒక పట్టిక ఇస్తే సరిపోతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఆ పట్టికలో ఒక మనిషికి రోజుకు ఎంత పంచదార, ఉప్పు, కొవ్వుల వంటివి అవసరమనే వివరాలు ఉంటాయని తెలిపింది. ఈ అఫిడవిట్‌ను ‘న్యూట్రిషన్ అడ్వొకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్’ (నాపి) తీవ్రంగా వ్యతిరేకించింది. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు.. అనుమతి లేకుండా ర్యాలీ

Anchor Charmilla Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాలిటీ షో 'బిగ్ బాస్' మరో కొత్త సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం.. ఇప్పుడు మైలురాయిగా నిలిచే 'బిగ్ బాస్ సీజన్ 10' (దశావతారం) పేరుతో మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తుండటంతో షోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు వేగవంతం చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సీరియల్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్ల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, హీరో అబ్బాస్ వంటి పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో క్రేజీ బ్యూటీ పేరు వచ్చి చేరింది. ఇటీవల 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తన క్యూట్ యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఆర్జే చర్మిల పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ స్టేజ్‌పై ఆమె ప్రతిభను చూసి ముచ్చటపడ్డ అల్లు అరవింద్ స్వయంగా ఆమెకు సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ రెడ్ ఎఫ్ఎమ్ ఆర్జేగా కెరీర్ ప్రారంభించిన చర్మిల నల్లూరి.. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రముఖ యాంకర్‌గా దూసుకుపోతున్నారు. తనదైన శైలి మాటతీరు, అందంతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా ఈ సోషల్ మీడియా సెన్సేషన్ బిగ్ బాస్ సీజన్ 10లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ క్యూట్ యాంకరమ్మ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది