
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Little Boy Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలకు, అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. రోజు ఎన్నో రకాల విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనల్ని నవ్వు పుట్టించేలా చేస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా కొన్ని చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలైతే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు సంబంధించిన టాలెంటెడ్ బాలుడు వీడియో అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భారీ ట్రాక్టర్‌తో బుడతడు.. సాధారణంగా చాలామంది పిల్లలు చిన్న వయసులో ట్రాక్టర్ బొమ్మలతో పాటు కార్ల బొమ్మలు, ప్లాస్టిక్ సైకిళ్లతో ఆడుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది ప్లాస్టిక్ రిమోట్ కంట్రోల్ కార్లలో ఎక్కి.. నడిపినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్న బాలుడు మాత్రం వయస్సుకు ఏ మాత్రం వంతన లేని విధంగా ఓ పని చేసేసాడు... నేరుగా ఆ యువకుడు భారీ డాక్టర్‌ను ఎక్కి.. నడపడమే కాకుండా.. తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్ బయటపెట్టి ప్రొఫెషన్ డ్రైవర్ల అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు.. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా.. ఆ బాలుడు తన స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఏమాత్రం భయం లేకుండా అద్భుతంగా ట్రాక్టర్ ని కంట్రోల్ చేయడం ఈ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు..
ఆ బాలుడికి కాళ్లు కనీసం.. క్లచ్, బ్రేకులకు కూడా సరిగ్గా అందలేక పోయినప్పటికీ.. తనలో ఉన్న స్కిల్ ను బయటపెట్టి.. సీటు అంచున కూర్చొని మరి.. ట్రాక్టర్‌ను అద్భుతంగా నడపడం మీరు ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు.. అతను ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో.. ఆ పిల్లాడి ముఖంలో ఎలాంటి భయం లేకపోవడం కూడా అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఇతర సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది. వేళల్లో లక్షల్లో వ్యూస్ రావడమే కాకుండా.. చాలామంది ఈ వీడియోకు కామెంట్లు కూడా పెడుతూ వస్తున్నారు..
ఇలా కామెంట్స్ చేస్తున్నారు.. ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు చూసి ఆశ్చర్యపోతూ వస్తున్నారు. చాలామంది ఈ వీడియో పై కామెంట్లు కూడా పెడుతున్నారు.. అరే వీడు సాధారణమైన కుర్రాడు కాదు.. పుట్టినప్పుడే డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకున్నట్లు ఉన్నాడు.. అంటూ ఒక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ చేస్తే.. మరి కొంతమంది.. ఈ వయసులోనే ఇంత టాలెంటెడ్ దాగుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ బాలుడికి ఉన్న ఆత్మవిశ్వాసం అద్భుతమని కొంతమంది కొనియాడుతున్నారు.. ఏది ఏమైనా ఈ బాలుడికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాను హల్చల్ చేస్తుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



