
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
PM Kisan Fund: రాఖీ పండగ సందర్భంగా పీఎం కిసాన్ నిధుల విడుదలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ పిఐబి స్పష్టతనిచ్చింది. రాఖీ పండగ రోజుల రైతుల అకౌంట్లో 4000వేల రూపాయలను జమ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ తో వస్తున్న ఆ వీడియోలను పూర్తిగా ఫేక్ అని.. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోకూడదని హెచ్చరించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నట్లు ఓ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో రైతుల అకౌంట్లో ఏకంగా 4000 రూపాయలు జమ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాఖీ పౌర్ణమి పండగ కానుకగా ఎలాంటి ప్రత్యేక నిధులు లేదా అదనపు మొత్తాలు విడుదల చేస్తున్నట్లు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఒక నిర్దిష్ట విడతల విధానాన్ని అనుసరిస్తుంది. ఈ విధానం కింద, కేంద్ర ప్రభుత్వం జూన్ 20న పీఎం కిసాన్ నిధి 23వ విడతను విజయవంతంగా విడుదల చేసింది. ఈ నిధులు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అప్పటి నుండి, తదుపరి 24వ విడత నిధుల విడుదల తేదీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక షెడ్యూల్ లేదా ప్రకటన వెలువడలేదు.
ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహా ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వీడియోలు, వదంతులను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా లేదా చెల్లింపుల స్థితి వంటి వివరాలతో సహా అన్ని తాజా సమాచారం కోసం, వారు ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inను సంప్రదించాలని స్పష్టం చేసింది. అసంపూర్తిగా ఉన్న eKYC ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా అర్హులైన రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తదుపరి విడత నిధులను పొందవచ్చని అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





