Priyanka Chopra: ‘సీతయ్య’ హరికృష్ణ వీడియోతోప్రియాంక చోప్రా ఇన్‌స్టాస్టోరీ.. ‘వారణాసి’ బ్యూటీ పోస్ట్ వైరల్
Priyanka Chopra: ‘సీతయ్య’ హరికృష్ణ వీడియోతో ప్రియాంక చోప్రా ఇన్‌స్టా స్టోరీ.. ‘వారణాసి’ బ్యూటీ పోస్ట్ వైరల్
© 2026 nimisham.in
Priyanka Chopra: ‘సీతయ్య’ హరికృష్ణ వీడియోతో ప్రియాంక చోప్రా ఇన్‌స్టా స్టోరీ.. ‘వారణాసి’ బ్యూటీ పోస్ట్ వైరల్

Priyanka Chopra: బిగ్‌బాస్ 20లో మేరీకోమ్ ఎంట్రీ.. కంటెస్టెంట్లకు ప్రియాంక చోప్రా సరదా వార్నింగ్!

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్ కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన మెరుపు ధర్నాపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ల దాడికి గురై తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌కు మద్దతుగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకస్మిక ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ధర్నాపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కేవలం తనకు అనుకూలమైన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి వైఖరి తీసుకుంటున్నారని, అక్కడ ఉన్న ఆధారాలు ఆయన మాటలకు సరిపోలుతున్నాయా అని ప్రశ్నించారు. ఝార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసిన ఆమె.. వ్యవస్థను మెరుగుపరచడానికి ఎటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా కేవలం నాటకీయ నిరసనలు తెలపడం రాహుల్ కు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం ఎల్లప్పుడూ నిశితంగా గమనిస్తూ పరిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. అర్జున అవార్డుల జాబితాలో అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్లేయర్ దివ్యా దేశ్‌ముఖ్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి గోపిచంద్ తదితరులు చోటు దక్కించుకున్నారు. అర్జున అవార్డు గ్రహీతలు వీరే.. అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి. బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ బాక్సింగ్: నరేందర్ బెర్వాల్ చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్ పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్ హాకీ: లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ కబడ్డీ: సుర్జీత్, పూజ పారా-షూటింగ్: రుద్రాంశ్ ఖండేల్వాల్ పారా-అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్ రోయింగ్: అరవింద్ సింగ్ షూటింగ్: అఖిల్ షియోరాన్ లైఫ్‌టైమ్ అర్జున అవార్డు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడైన మాజీ ఆటగాడు ఐ. అరుమైనాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) దక్కింది. ద్రోణాచార్య అవార్డులు ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ కేటగిరీలో పార్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా నంద్‌కుమార్ చవాన్ (షూటింగ్) ఎంపికయ్యారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహన్ పురస్కారాన్ని పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్‌కు ప్రకటించారు. ఆగస్టు 29 సంప్రదాయానికి బ్రేక్ సాధారణంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఆగస్టు 29న జరుగుతుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. అయితే కరోనా తర్వాత ఈ సంప్రదాయంలో మార్పులు వచ్చాయి. క్రీడా క్యాలెండర్‌కు అనుగుణంగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2025లోనూ పురస్కారాల

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు) చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు) ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు) దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్ సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మునీష్‌ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ దర్యాప్తులో ఏఎస్పీకి సౌత్ డీఎస్పీ శివప్రియ, ప్రకాశంనగర్ సీఐ బాజీలాల్ సహకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని అకాల మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రత్యేక అధికారిని నియమించింది.అసలేం జరిగిందంటే..!తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్‌పూర్‌కు చెందిన ప్రియాంక, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చదువుతున్నారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి, స్నేహితుడితో కలిసి స్కూటీపై తిరిగి వస్తున్నారు. మాల్ గేట్ వద్ద
రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మునీష్‌ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సౌత్ డీఎస్పీ శివప్రియ, ప్రకాశంనగర్ సీఐ బాజీలాల్ సహకారం అందించాలంటూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో ప్రియాంక పీజీ చేస్తున్నారు. ఆగస్టు మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసిన ప్రియాంక.. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి స్కూటీపై రిటర్న్ అయ్యారు. అయితే, ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగి ఉన్న సమయంలో నామవరానికి చెందిన దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ అద్ద ఇద్దరు యువకులు మద్యం మత్తులో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఒకటికి మూడుసార్లు ఢీకొట్టారు.READ ALSO AP స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. 2025 నాటి ఓటర్ల జాబితాతోనే ఎలక్షన్స్!కారుతో ఢీకొట్టిన తర్వాత ప్రియాంకపై కారు ఎక్కించడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పూర్ కావడంతో ఆగస్టు ఐదో తేదీన మెరుగైన చికిత్స కోం సికింద్రబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్యం విషమించి పదో తేదీన కన్నుమూశారు. ప్రియాంక మృతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని మరణం తనను ఆవేదనకు గురి చేసిందంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని

అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వక పోతే.. చిన్న పిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే కన్న తల్లి తన చాక్లెట్ లాక్కుందని ఓ చిన్న బాబు అలిగాడు. ఇంటర్నెట్ డెస్క్: అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వక పోతే.. చిన్న పిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే కన్న తల్లి తన చాక్లెట్ లాక్కుందని ఓ చిన్న బాబు అలిగాడు. ఆమెపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ అమాయక బాలుడి ముద్దు ముద్దు మాటలకు అక్కడి వారంతా నవ్వారు. ఈ ఘటన మధప్రదేశ్ బుర్హాన్‌పూర్‌లోని దేధ్తలై పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. చెప్పిన మాట వినడం లేదని.. ఆ బాలుడిని తల్లి మందలించింది. అతడి వద్ద ఉన్న చాక్లెట్ తీసుకుంది. దీంతో తల్లిపై కోపం తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని తండ్రి చెప్పి.. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపాడు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలంటూ తండ్రిని కోరాడు. దాంతో బాలుడిని ఆ తండ్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ ప్రియాంక నాయక్ ఏమైందని ఆ బాలుడిని ప్రశ్నించింది. జరిగిన విషయాన్ని ఆమెకు తన ముద్దు ముద్దు మాటలతో.. అమ్మ నా చాక్లెట్లు దొంగలిస్తుంది. నన్ను కొడుతుంది. ఆమెను జైలులో పెట్టండి అని ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తెల్ల కాగితంపై ఎస్ఐ ఫిర్యాదు రాసింది. ఆ కాగితం కింద సంతకం చేయాలని ఆ బాలుడిని ఎస్ ఐ కోరింది. అక్షరాలు కూడా రానీ ఆ బాలుడు ఓ చిన్న గీత గీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. లైకులు సైతం ఈ వీడియోకు భారీగా వస్తున్నాయి. అయితే ఈ వీడియో 2022 నాటిది. నేటికి వైరల్ అవుతుండడం విశేషం. మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో

Sridevi Biography: భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొదటి మహిళా సూపర్ స్టార్, దివంగత నటి శ్రీదేవి జయంతి (ఆగస్టు 13) సందర్భంగా ప్రముఖ రచయిత ధీరజ్ యు. కుమార్ రాసిన ‘ఎంప్రెస్ – ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ (Empress: The Definitive Biography of Sridevi) అనే జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన కీలక అప్డేట్ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ బుక్ కవర్ పేజీని సోషల్ మీడియాలో ఆమె పంచుకున్నారు. కేవలం 4 ఏళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించి, తెలుగు, హిందీ, తమిళం వంటి పలు భాషల్లో దాదాపు 300 చిత్రాలలో నటించి తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీదేవి జ్ఞాపకాలను ఈ పుస్తక ప్రకటనతో పాటు ఆమె రాబోయే బయోపిక్ గురించిన చర్చలు చిత్ర పరిశ్రమలో మళ్లీ గుర్తుచేశాయి. వెండితెరపై ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు ఈ దిగ్గజ నటి. ధీరజ్ కుమార్ రచించిన ఆమె జీవితచరిత్రను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్రచురిస్తోంది. బాలనటిగా మొదలైన శ్రీదేవి ప్రయాణం, భారతీయ సినిమా తొలి నిజమైన పాన్ ఇండియా మహిళా స్టార్‌గా ఎదిగిన కథను ఈ పుస్తకం విస్తృతంగా వివరిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆమె సినీ ప్రయాణం, 300కు పైగా చిత్రాల్లో చేసిన నటన ఈ పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించబడింది. హీరోల ఆధిపత్యం ఉన్న కాలంలో తన ప్రతిభతోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీదేవి ఎదుగుదలను ఈ పుస్తకం విశ్లేషించనుంది. ఆమె భారతీయ సినిమాపై చూపిన ప్రభావాన్ని మాత్రమే కాదు, ఇప్పటివరకు పెద్దగా వెలుగులోకి రాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఆమె కెరీర్ ఎలా కీలక మలుపులు తిరిగిందనే విషయాన్ని కూడా రచయిత వివరించినట్లు ప్రచురణకర్తలు

అతిలోక సుందరి శ్రీదేవి సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలతో ‘ఎంప్రెస్ - ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ పుస్తకం విడుదల కానుంది. అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) సినీ, వ్యక్తిగతజీవిత విశేషాలతో ‘ఎంప్రెస్ (Empress) - ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ అనే పుస్తకం విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ‘మీరు ఎంతగానో గుర్తుకొస్తున్నారు. స్వర్గంలో ఉన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీదేవి త్వరలో వస్తోంది’ అని ఆమె రాశారు. ఈ పోస్టును శ్రీదేవి భర్త బోనీకపూర్ (Boney Kapoor) కూడా పంచుకున్నారు. శ్రీదేవి జీవిత చరిత్రను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్రచురిస్తున్నట్టు 2023లో ప్రకటించింది. ధీరజ్ కుమార్ (Dheeraj Kumar) ఈ పుస్తకాన్ని రచించారు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో భాగమయ్యారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కలు తీర్చుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక ప్రియాంక నల్కారీ కూడా బోనమెత్తింది. అమ్మవారికి మొక్కులు సమర్పించ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రియాంక షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక నల్కారీ అని చెప్పవచ్చు. ఒకప్పుడు తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మెప్పించిందీ ఈ తెలుగమ్మాయి. అలాగే కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడంలేదు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటోంది ప్రియాంక. అక్కడ వరుస గా సీరియల్స్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది కాగా తెలుగులో కొన్ని సినిమాల్లోనూ నటించింది ప్రియాంక. 2010లో చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన 'అందరి బంధువయా' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిక్ 2, కాంచన 3, శివ మనసులో శృతి, హైపర్, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిందీ అందాల తార

దివంగత లెజెండరీ నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్రపై బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక అప్డేట్ ఇచ్చారు. 'ఎంప్రెస్ - ద డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి' పేరుతో రానున్న ఈ పుస్తక కవర్ పేజీని ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ప్రకటనతో శ్రీదేవి అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూశారు. 54 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆమె మరణించడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆమె మరణానంతరం శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీనికోసం వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సంస్థ 2023లోనే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత ధీరజ్ కుమార్ రాస్తున్నారు. శ్రీదేవికి అత్యంత సన్నిహితుడైన ధీరజ్ కుమార్, ఆమెను కుటుంబ సభ్యునిలా భావించేవారని భర్త బోనీ కపూర్ వెల్లడించారు. దీంతో ఈ పుస్తకంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, పుస్తక కవర్‌పై అమితాబ్ బచ్చన్ రాసిన అద్భుతమైన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీదేవిని 'అపారమైన ప్రతిభకు నిలువుటద్దం' అని అమితాబ్ బచ్చన్ కీర్తించారు. ఈ కోట్‌ను పుస్తక ముఖచిత్రంపై ప్రముఖంగా ముద్రించారు. ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ పోస్ట్‌ను భర్త బోనీ కపూర్ వెంటనే రీషేర్ చేశారు. ఫలితంగా ఈ వార్త సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే అందరికీ తెలిసింది. శ్రీదేవి కెరీర్‌లోని కీలక ఘట్టాలను ఈ పుస్తకం వెలుగులోకి తీసుకురానుంది. ప్రధానంగా 1980, 1990లలో వాణిజ్యపరమైన భారతీయ సినిమాల్లో ఆమె చూపిన ఆధిపత్యాన్ని ఇందులో వివరించనున్నారు. ఆమె వ్యక్తిగత ప్రయాణం, సినీ రంగంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను ధీరజ్ కుమార్ వివరించనున్నారు. మిస్టర్ ఇండియా, చాందిని, హిమ్మత్వాలా వంటి అద్భుతమైన సినిమాల వెనుక ఉన్న కృషిని పాఠకులు

Viral Video: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కూతురు రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య సరదా సంభాషణ కనిపిస్తుంది. ఈ ఇద్దరు నాయకుల మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉన్నారు.ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమాన మార్గం: మనకు ఇంత దగ్గర్లోనే!ఆ వీడియోలో ప్రధానమంత్రి మోదీ ప్రియాంక గాంధీని.. ప్రియాంక, ఎలా ఉన్నావు? అని అడగ్గా, ప్రియాంక గాంధీ, నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? అని బదులిస్తుంది. దీనికి ప్రధానమంత్రి మోదీ నవ్వుతూ, నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను అని అంటారు.మోదీకి ఖర్గేకు ఫన్నీ పంచ్! ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆ సంభాషణలో చేరారు. ఆయన ప్రధాని మోదీతో సరదాగా, అన్నా, మీరు కొంచెం మారారు. మీరు కొంచెం మారారు అని అన్నారు. ఖర్గే కామెంట్‌కు ప్రధాని మోదీ నవ్వి, ఓ, నిజమా? అని అడిగారు. పెళ్లి విందులో జరిగిన ఈ అనధికారిక, సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు నాయకుల మధ్య జరుగుతున్న ఈ సంభాషణను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.రీల్స్‌పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు! యూత్ కు సీరియస్ మెసేజ్జూన్ 20న జరిగిన సుప్రియా సూలే కుమార్తె వివాహంసుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)కి చెందిన ఓ ప్రముఖ నాయకురాలు, మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నారు. సుప్రియా సూలే కూతురు రేవతీ సూలే 2026 జూన్ 20న ముంబైలో పారిశ్రామికవేత్త సారంగ్ లఖానీని వివాహం చేసుకున్నారు. ఆగస్టు 10న ఢిల్లీలో ఘనంగా రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ప్రధాని మోదీకి సంబంధించిన
మెడికో ప్రియాంక కేసు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు నిందితులు ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రియాంక మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రియాంక మృతిపై స్పందించారు.మృత్యువుతో పోరాడుతూ ప్రియాంక మరణించడం అత్యంత విషాదకరమని షర్మిల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు."తాగుబోతు పైశాచికత్వానికి నిదర్శనం ఈ ఘటన. ఇది ప్రమాదం కాదు.. నిందితుడి అత్యంత క్రూరమైన చర్య. ఎంతో సుదీర్ఘమైన, అద్భుతమైన భవిష్యత్తు ఉన్న మెడికో ప్రియాంక జీవితం మానవమృగం రాక్షస చక్రాలకింద నలిగి ముగిసిపోవడం తీవ్రంగా కలిచివేసే విషయం. కళ్లముందే ఘోరం జరిగినా కూటమి ప్రభుత్వం మాకేం సంబంధం అన్నట్లు వ్యహరించడం సిగ్గుచేటు. హంతకుడిని కాపాడేలా ప్రభుత్వ తీరు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తాగుబోతు నిర్వాకానికి ఆడబిడ్డ బలైతే.. మూడు రోజుల పాటు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం ఎంతవరకు న్యాయం?" అని షర్మిల ప్రశ్నించారు.ప్రియాంక కేసును హత్య కేసుగా నమోదు చేయకుండా వారం రోజులు ఎదురు చూడటం ఎక్కడి ధర్మమని షర్మిల నిలదీశారు. కళ్లముందే సాక్ష్యాలు కనపడుతుంటే చిన్న కేసుగా చుట్టేయాలని చూడటమా మీరు చేసే న్యాయమంటూ ఏపీ ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. 20 లక్షలు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవాలని చూడటమా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా అంటూ విమర్శించారు. గడచిన కొన్ని నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణ స్థితికి చేరుకున్నాయన్న షర్మిల.. రాష్ట్ర నలుమూలల ఆడబిడ్డలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని.. ఫాస్ట్రాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని

Rajahmundry: ప్రియాంక కుటుంబానికి రూ.30 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు! Rajahmundry: వైద్య విద్యార్థిని ప్రియాంక అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎంతో కష్టపడి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తమ కుమార్తెను డాక్టర్‌గా చూడాలన్న తల్లిదండ్రుల కల ఇలా విషాదాంతం కావడం అత్యంత బాధాకరమన్నారు. ఎంతో కష్టపడి కూతురిని వైద్య విద్య చదివించిన ఆ బీసీ కుటుంబం ప్రస్తుతం అనుభవిస్తున్న ఆవేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. డాక్టర్‌గా తమ కుమార్తెను చూడాలన్న తల్లిదండ్రుల ఆశలు, ఎన్నో సంవత్సరాల కష్టం ఒక్కసారిగా ఆవేదనగా మారడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోందన్నారు. ఆదివారం హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రయాణంలో బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి, వారి పరిస్థితిని తెలుసుకున్నానని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి ఆవేదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు, కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కష్ట సమయంలో ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రియాంక మరణానికి సంబంధించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి, వాస్తవాలు వెలుగులోకి రావాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. దర్యాప్తు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒక బీసీ కుటుంబం తమ కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దేందుకు చేసిన త్యాగం, కష్టం వృథా కాకూడదని, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రియాంక కుటుంబం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గత వారం మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ మెడికో కె. ప్రియాంక (28) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇవాళ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, గాంధీ ఆసుపత్రికి వెళ్లి ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని ఆయన హామీ ఇచ్చారు.అసలేం జరిగింది?తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక, రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి, తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి స్కూటీపై మాల్ నుంచి బయటకు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న సురవరపు దశవంత్, ఆండ్రూ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు వ్యక్తులు మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారితో గొడవపడి, దాడి చేసి, అక్కడి నుంచి కారులో వేగంగా పారిపోయే ప్రయత్నంలో మాల్ గేటు వద్ద ఉన్న ప్రియాంక స్కూటీని మూడుసార్లు ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను మొదట స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించగా, నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియల నిమిత్తం

మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, ఆగస్టు 10: మెడికో విద్యార్థిని ప్రియాంక కేసుపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు(సోమవారం) గాంధీ ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే.. ప్రియాంక కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో అలసత్వానికి తావులేదని.. లోతైన విచారణ పూర్తి చేసినట్లు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరించామని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమ్మాయిని వ్యక్తిత్వ హననం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితవుపలికారు. సోషల్ మీడియాలో వస్తోన్న అపోహలు, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో.. ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. దీంతో గద్వాల్ జిల్లా అయిజా మండలం ఏక్లాస్‌పూర్‌కు ప్రియాంక డెడ్‌బాడీని కుటుంబసభ్యులు తరలించారు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గాంధీ ఆస్పత్రికి చేరుకుని.. ప్రియాంక తండ్రిని ఓదార్చారు. ప్రియాంక మృతదేహం వెంట ఏక్లాస్పూర్ గ్రామానికి రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి వెళ్లనున్నారు. అలాగే ఏపీ మంత్రి టీజీ భరత్.. ప్రియాంక స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల చెక్‌ను ప్రియాంక తండ్రికి మంత్రి అందజేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్

వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం బ్రెయిన్ డెడ్‌తో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థిని ప్రియాంక నిన్న (ఆదివారం) బ్రెయిన్ డెడ్‌తో (Medical Student Priyanka Death) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ ఆస్పత్రికి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. పోస్టుమార్టం జరుగుతున్న తీరు, ప్రియాంక కేసుకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రియాంక స్వగ్రామం గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మృతదేహాన్ని తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రియాంక తండ్రిని మంత్రి వాకటి శ్రీహరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఓదార్చారు. ప్రియాంక మృతదేహం వెంట ఎక్లాస్పూర్ గ్రామాని ఏపీ మంత్రి టీజీ భరత్, తెలుగుదేశం రాజమండ్రి అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల చెక్‌ను ప్రియాంక తండ్రికి మంత్రి టీజీ భరత్ అందజేయనున్నారు. తమ కలల సౌధం కూలిపోయిందని ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కాగా, రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో మద్యం మత్తులో ప్రియాంకను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ ప్రమాదానికి కారణమైన యువకులపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ,సెక్షన్లు మార్చి నిందితులపై రాజమహేంద్రవరం పోలీసులు హత్య నేరం మోపారు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ

రాజమహేంద్రవరంలో కారు ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (Priyanka) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆర్థిక సాయం ప్రకటించారు. యువ వైద్యురాలి అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇది అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ (Teleconference)లో మాట్లాడిన సీఎం, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తక్షణమే రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ దారుణ ఘటనకు కారణమైన వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ (Narasimha Kishore) సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, మద్యం మత్తులో మరియు అత్యంత నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా చూడాలని స్పష్టం చేశారు. దోషులకు కఠిన శిక్ష పడే విధంగా కేసులో బలమైన సెక్షన్లను నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో సగానికి పైగా కోర్టు కేసుల్లో చిక్కుకోవడంతో, ఈ అంశంపై ఆమె ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఈ వివాదాలకు సంబంధించిన పూర్తి వివరాలతో 2-3 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 21.74 లక్షల చదరపు గజాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇందులో దాదాపు 12 లక్షల చదరపు గజాల స్థలం వివిధ కోర్టు కేసుల్లో ఉంది. మొత్తం 238 కేసుల్లో ఈ భూములు చిక్కుకున్నాయి. అత్యధికంగా షేక్‌పేట్ మండలంలో 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల తాజా పరిస్థితి, రెవెన్యూ శాఖ తరఫున కౌంటర్లు సరిగా దాఖలు చేశారా? లేదా? అనే వివరాలను నివేదికలో పొందుపరచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన 22ఏ సెక్షన్ సామాన్యులకు గుదిబండగా మారింది. ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేటు పట్టా భూములను కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చడంతో, వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ ప్రియాంక, 22ఏ సెక్షన్ అమలులో జరుగుతున్న పొరపాట్లపై కూడా ఆరా తీస్తున్నారు. అన్ని హక్కులు ఉన్న ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలోకి ఎందుకు వెళ్లాయి, పొరపాటు ఎక్కడ జరిగిందనే అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం

రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక (Priyanka) మృతి చెందారు. వెంటలేటర్‌పై చికిత్స చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు హైదరాబాద్ కిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ప్రియాంక పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాజమహేంద్రవరం పోలీసులు, ప్రియాంక తండ్రి వెంకటేష్ వచ్చిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రియాంక స్వస్థలం తెలంగాణ (Telangana) రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్పూర్. ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ నెల మూడున రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలోగల ప్రసాద్ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై ఆమె వస్తున్నారు. మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన దుష్యంత్, మరో వ్యక్తి బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. పైనుంచి కారు వెళ్లడంతో కిందపడిపోయిన ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల ఐదున సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది

రాజధాని హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి మొత్తం ప్రభుత్వ స్థలాలు 21.74 లక్షల చదరపు గజాలు.. దాంట్లో సగానికిపైగా న్యాయపరమైన చిక్కుల్లోనే! వాటి సమీప ఇళ్ల యజమానులకు తిప్పలు నిషేధిత జాబితాలో పెట్టడంతో క్రయవిక్రయాలకు ఆటంకం 22ఏతో హడలిపోతున్న బాధితులు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి దృష్టి సారించిన కలెక్టర్.. వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో దాదాపు 12 లక్షల చదరపు గజాల ప్రభుత్వ స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ భూమి 21.74 లక్షల చదరపు గజాల స్థలాలుండగా.. అందులో సగానికిపైగా న్యాయపరమైన వివాదాల్లోనే చిక్కుకోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా దృష్టి సారించారు. ‘కోర్టు కేసుల్లో ఎన్ని సర్కారు స్థలాలు ఉన్నాయి? రెవెన్యూ తరఫున కౌంటర్లు సరిగా దాఖలు చేస్తున్నారా? లేదా? వాటి తాజా పరిస్థితి ఏమిటి?’ తదితర అంశాలపై సమగ్ర వివరాలను 2-3 రోజుల్లో తనకు సమర్పించాలని రెవెన్యూ పరిధిలోని వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ కోర్టుల్లో 238 కేసులు హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1139 ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు పార్సిళ్లు ఉన్నాయి (ఏదైనా ప్రాంతంలోని మొత్తం భూమిని ఒక పార్సిల్‌గా పరిగణిస్తారు). మొత్తం ప్రభుత్వ ల్యాండ్ పార్సిళ్లలో 21,74,479.68 చదరపు గజాల స్థలాలుండగా.. అందులో 169 ల్యాండ్ పార్సిళ్లలోని సుమారు 11,93,595.12 చదరపు గజాల ఖాళీ స్థలం కోర్టు కేసుల్లో ఉంది. ఇందులో షేక్‌పేట్ మండలంలో అత్యధికంగా 50 కేసులు ఉన్నాయి. ముషీరాబాద్‌లో 19, ఆసి్‌ఫనగర్‌లో 23, గోల్కొండలో 18, సైదాబాద్‌లో 16, మారెడ్‌పల్లిలో 16, ఖైరతాబాద్‌లో 16, నాంపల్లిలో 9, సికింద్రాబాద్‌లో 12, అమీర్‌పేట్‌లో 13, అంబర్‌పేట్‌లో 12, బహదూర్‌పురాలో 3, బండ్లగూడలో 9, చార్మినార్‌లో 3

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Medico Priyanka Death: రాజమండ్రిలో సినిమా థియేటర్ వద్ద మద్యం మత్తులో దుండగులు కారుతో తొక్కించగా మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందడాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదని.. తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ప్రియాంక మృతి తనను కలచివేసిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 'తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పదిమందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండాపోవడం అత్యంత విచారకరం' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారి మీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం' అని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థుల్లో విషాదం నెలకొంది. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యా మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దుష్యంత్, ఆండ్రూ అనే ఇద్దరు యువకులు కారుతో ప్రియాంకను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత స్థానికంగా చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ప్రియాంకకు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ప్రియాంక మృతితో ఘటనపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత, మాజీ ఎంపీ, రాజమండ్రి సిటీ ఇంచార్జి మార్గాని భరత్ కీలక నిర్ణయం ప్రకటించారు. రేపు రాజమండ్రి బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు కూడా బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరును భరత్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులపై కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆయన ఆరోపించారు. నిందితులను రక్షించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం, పోలీసులు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Medico Priyanka Dies: సినిమా థియేటర్ వద్ద చెలరేగిన చిన్న వివాదం ఓ మెడికో విద్యార్థి ప్రాణానికి తీసుకుంది. ఏపీలోని రాజమండ్రిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణం కోల్పోయారు. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ప్రసాదిత్యా మాల్ వద్ద ప్రియాంకపై కారు ఎక్కించి యువకులు దుష్యంత్, ఆండ్రూ దారుణానికి పాల్పడ్డారు. రాజమండ్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంకను చేర్పించారు. ప్రాణాలతో పోరాడి ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. కారు నడిపిన తాగుబోతుల దాష్టీకానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. కార్ టైర్ మెడపై నుంచి వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయ్యి ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. రాజమండ్రిలో ప్రమాదానికి గురయిన తర్వాత మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగానే ఉండడంతో రాజమండ్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అప్నియా టెస్ట్ కు ప్రియాంక శరీరం సహకరించపోవడంతో సోడియం లెవల్స్ 16 కన్నా తక్కువగా ఉండడంతో ఆమె మరణించారు. మృతురాలి తండ్రి కన్నీరు మున్నీరు యువకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ మీకు ఆడపిల్లలు లేరా! అని ప్రశ్నించారు. ప్రతి నెలా హైదరాబాద్ వస్తారు కదా... మా బిడ్డ పరిస్థితి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chandrababu Naidu: సినిమా థియేటర్‌కు వెళ్లి చిన్న వివాదంలో కారుతో ఢీకొట్టడంతో రాజమండ్రలిలో మెడికో ప్రియాంక బ్రెయిన్ డెడ్‌కు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర సంచలనం రేపుతోంది. బాధితురాలిని కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ముందుకురాకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందగా సీఎం చంద్రబాబు స్పందించారు. రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సంతాప ప్రకటన చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ప్రియాంక ఘటనపై ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని సీఎం చంద్రబాబుకు ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన

రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి... ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు.Medico Priyaka: మృత్యువుతో పోరాడి ఓడిపోయిన మెడికో ప్రియాంక..!ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా.... నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు వివరించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.అసలేం జరిగిందంటే?తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెకూ, మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆంఢ్రూ విలియం అనే ఇద్దరితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె స్నేహితుడు నడుపుతున్న బైక్ వెనుక కూర్చొన్న ప్రియాంకను.. వారు కారుతో గుద్దేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం మాల్ బయటకు వెళ్లగానే ఆమె బైక్‌ను వారు గుద్దేయడమే కాకుండా ఆమె తలపై నుంచి కారు పోనిచ్చారు. దీంతో

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి (Medical Student Priyanka Death) పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారును నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక మృతి తనను కలచివేసిందని తెలిపారు. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతోమందికి సేవలు అందించాల్సిన ఆమె ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం బాధాకరమని అన్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కలచివేస్తోంది: హోం మంత్రి అనిత వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి కలచివేస్తోందని అన్నారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి, జైలుకు పంపించామని వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుంది: మంత్రి నిమ్మల వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపట్ల ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి కలచివేస్తోందని తెలిపారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే

వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమరావతి: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు రూ.20లక్షల ఆర్థికసాయాన్ని బాధిత కుటుంబానికి ప్రకటించారు. ప్రియాంక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ప్రియాంకను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధిత యువతి.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె తుదిశ్వాస విడిచింది. విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ప్రియాంక కుటుంబానికి హామీ ఇస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఆ వెంటనే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తునకు సంబంధించిన కీలక విషయాలను సీఎంకు అధికారులు వివరించారు. విద్యార్థిని కేసు విషయమై ఇప్పటికే ఓసారి అధికారులతో సమీక్షించిన చంద్రబాబు.. విద్యార్థిని మృతితో మరోసారి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు. అలాగే ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠిన సెక్షన్ల కింద శిక్షలు పడేలా చూడాలని ఆజ్ఞాపించారు. మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21 వరకు రిమాండ్ వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్
రాజమహేంద్రవరం ఘటనలోగాయపడిన మెడికల్ స్టూడెంట్ ప్రియాంకకన్నుమూశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ప్రియాంక.. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేసేందుకు వైద్యులు ప్రయత్నించగా.. ఆమె శరీరం అందుకు సహకరించని సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారగా.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో కన్నుమూశారు.ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పూర్. ప్రియాంక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చేస్తున్నారు. ఆగస్ట్ మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో మూవీ చూసిన ప్రియాంక.. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి బైక్ మీద బయల్దేరారు. అయితే ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగి ఉన్న సమయంలో నామవరానికి చెందిన దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలయం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని మూడుసార్లు ఢీకొట్టారు.ఆ తర్వాత ఆమె పైనుంచి కారును పోనిచ్చారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆగస్ట్ ఐదో తేదీ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో ప్రియాంక కన్నుమూశారు. మరికొన్ని రోజులలో డాక్టర్‌గా సేవలు అందిస్తుందనుకున్న కుమార్తె.. కళ్ల ముందు ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి ప్రియాంక తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.మరోవైపు ఈ కేసులో దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.నిందితులు మద్యం తాగి కారు నడిపినట్లు ఆధారాలు సేకరించామన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్.. వారిపై హత్యాయత్నం కింద కేసు

రాజమండ్రిలో ఈనెల 3న ఆదిత్య మాల్ లో తన స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లి వస్తూ ఇద్దరు తాగుబోతులతో వాగ్వాదం నేపథ్యంలో కారు గుద్దేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్ధిని ప్రియాంక (Medico Priyanka) ఇవాళ చనిపోయింది.ఈ మేరకు ఇవాళ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రియాంకను బతికించేందుకు రెండు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. బ్రెయిన్ డెడ్ అయిన ఆమె.. ఇవాళ మధ్యాహ్నం 3.25కు కన్ను మూసినట్లు ప్రకటించారు.ఏపీ సర్కార్ పై ఉద్యోగుల జీతాల భారమెంత ? కాగ్ లెక్క ఇదే..!తెలంగాణలోని గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెకూ, మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆంఢ్రూ విలియం అనే ఇద్దరితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె స్నేహితుడు నడుపుతున్న బైక్ వెనుక కూర్చొన్న ప్రియాంకను.. వారు కారుతో గుద్దేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనంతరం మాల్ బయటకు వెళ్లగానే ఆమె బైక్ ను వారు గుద్దేయడమే కాకుండా ఆమె తలపై నుంచి కారు పోనిచ్చారు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. రాజమండ్రి మెడికో ప్రియాంక కేసులో మరో ట్విస్ట్..! తండ్రి కీలక నిర్ణయం..!ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే తొలుత ఈ కేసును నామమాత్రపు సెక్షన్లలో నమోదు చేసిన పోలీసులు..ఆ తర్వాత విమర్శలు రావడంతో సెక్షన్లు మార్చారు. తాజాగా ఆమె తండ్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర సెక్షన్లతో కేసు పెట్టారంటూ మరో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై స్పందించడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితమే బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంకను

రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సికింద్రాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక (Medical Student Priyanka Death) ఈరోజు (ఆదివారం) మృతిచెందారు. మద్యం మత్తులో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులుగా కిమ్స్‌లో ప్రియాంకకు వైద్యులు చికిత్స అందించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోనే ప్రియాంక మృతదేహాన్ని ఉంచారు. రాజమహేంద్రవరం పోలీసులు వచ్చిన తర్వాత ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆస్పత్రికి ప్రియాంక మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత పోస్టుమార్టానికి పోలీసులు తరలించనున్నారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల

Medico Priyanka : రాజమండ్రి మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు బ్రెయిన్ డెడ్ అయింది. ఇదే విషయాన్ని ఆస్పత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాజమండ్రిలో ఆగస్టు 3న రాత్రి ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పటినుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ముందుగా రాజమండ్రిలో చికిత్స అందించగా, పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వైద్యులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే.. అయితే, పరిస్థితి విషమంగా మారడంతో బ్రెయిన్ డెత్ నిర్ధారణ కోసం అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ఆమె శరీరం అందుకు సహకరించలేదు. సోడియం లెవల్స్ భారీగా తగ్గడంతో టెస్ట్ నిర్వహణ సాధ్యం కాలేదని వైద్యులు తెలిపారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ప్రియాంక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని కిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు

హైదరాబాద్: రాజమండ్రిలో ఇటీవల ఇద్దరు ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొన్ని గంటల క్రితం ప్రకటించిన వైద్యులు.. అంతలోనే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దారించారు. ప్రియాంక కేసు ఇదే.. ప్రియాంక కర్నూలుకు చెందిన యువతి. ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఇటీవల మాట్లాడుతూ... కొన్ని రోజుల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వైద్యురాలిగా సేవలు అందిస్తుందని అనుకున్నామని ఆవేదన చెందారు. తమ కుమార్తెకు ఈ గతి పట్టించిన వాళ్లను వదలిపెట్టకూడదని అన్నారు. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్ ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..? BB 10 లోకి శివ్

సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. హీరో నటిస్తున్న తాజా చిత్రాల నుంచి టీజర్లు, గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. హీరో నటిస్తున్న తాజా చిత్రాల నుంచి టీజర్లు, గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi) పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మహేష్ పుట్టినరోజున రాజమౌళి ఏదో ఒక సంచలన అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ గంపెడాశతో ఉన్నారు. కానీ, ఆ ఆశల మీద రాజమౌళి నీళ్ళు చల్లాడు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి టీమ్ వారణాసి నుంచి ఎటువంటి టీజర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయలేదు. కేవలం ఆఫ్రికా షెడ్యూల్లో చిత్రీకరించిన రెండు కొత్త స్టిల్స్‌ను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసి రుద్ర పాత్రను పరిచయం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోల్లో మహేష్ బాబు రగ్గడ్ లుక్‌లో, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ పరిణామంపై అభిమానులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదో అద్భుతమైన టీజర్ వస్తుందని ఆశించాం, కానీ కేవలం సెట్ ఫొటోలతో సరిపెట్టారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజమౌళి మార్క్ అంటేనే గోప్యత, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలంటే ఇలాంటి జాగ్రత్తలు అవసరమే అని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న

రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. గత ఐదు రోజులుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఓ వైద్యురాలిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియాంక అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళితే, ఆగస్టు 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో ప్రియాంక తన స్కూటర్‌పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు ఆమె స్కూటర్‌ను ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు.అక్కడ ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కాగా, తన కుమార్తె మృతికి కారణమైన వారిపై సాధారణ ప్రమాద కేసు కాకుండా, హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక తండ్రి డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి రెండు ప్రత్యేక స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌తో రుద్ర తన నేచురల్ లుక్‌లో ప్రపంచానికి తొలిసారిగా కనిపించాడు. మొదటి స్టిల్‌లో దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా రుద్ర కనిపిస్తున్నాడు. ఇక ఆ స్టిల్‌ను చూస్తే పాలసంద్రంలో ఆదిశేషుపై సేదతీరే శ్రీ మహా విష్ణువులా కనిపిస్తున్నారు. ఇంకో స్టిల్‌లో కెన్యాలోని మసాయి మారా విశాలమైన మైదానాలకు చెందింది. అక్కడ రుద్ర జిరాఫీలు, వైల్డ్‌బీస్ట్‌ల మధ్య నిలబడి, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఈ రెండు స్టిల్స్‌ను గమనిస్తే ‘వారణాసి’ సినిమాలోని సోల్, రుద్ర పాత్ర తీరు గురించి అందరికీ అర్థమయ్యేలా ఉంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుండి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ మేరకు పోస్ట్ వేస్తూ.. ‘రుద్ర తనకంటే ఎంతో గొప్పదైన, పెద్దదైన ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి జన్మించాడు. అతను కోరుకోని విధిని మోస్తున్నాడు. అతను చమత్కారి, సున్నితమైనవాడు, ఉగ్రరూపం దాల్చగలడు. మహేష్ అతనికి తీసుకువచ్చింది అదే. ఉగ్రంగా కనిపించే పాత్రను ఎవరైనా పోషించగలరు. కానీ ఒకేసారి ఉగ్రంగా, సున్నితంగా నటించగలవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ఫ్రేమ్‌లు మా ఆఫ్రికా షెడ్యూల్ నుండి తీసుకోబడ్డాయి. ఏ సెట్ ఇవ్వలేని అనుభూతిని ఆ నేల మాకు ఇచ్చింది. కిలిమంజారో చుట్టూ మసాయి మారాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను నివ్వెరపోయాను. కొన్ని ఉదయాన్నే, మా కళ్ల ముందు ఉన్నదాన్ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్ కూడా ఇమడ్చలేదని నాకు అనిపించింది’ అని అన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, ఎం.ఎం. కీరవాణి సంగీతంతో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్. కానీ ఆ సమయంలో భర్త అభిషేక్ బచ్చన్‌తో కూడా నటిస్తుండటం, షారుఖ్‌తో ఎక్కువ కెమిస్ట్రీ సీన్లు ఉండటంతో ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్నా. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేసి ఉంటే మంచి కంబ్యాక్ అయ్యేది. నటిగా ఆ అవకాశాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కానీ భార్యగా ఆ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐశ్వర్య చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలోనూ నటిస్తోంది. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్ ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..? BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..? నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?
మెడికో ప్రియాంక కేసుకు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మద్యం మత్తులో యువకులు ప్రియాంకను కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రియాంక కేసుకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదివారం రోజు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్ట్ మూడో తేదీ ప్రియాంక, తన ఫ్రెండ్ కలిసి థియేటర్లో సినిమా చూసి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలోనే మద్యం మత్తులో నిందితులు మాల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మద్యం తాగి ఉండటంతో మాల్‌లోకి ఎంట్రీకి అనుమతించలేదు.దీంతో నిందితులు మాల్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు యత్నించగా.. వేగంగా కారును నడిపి, స్కూటీపై వెళ్తున్న మెడికోలు ప్రియాంక, ఆమె స్నేహితుడిని కారుతో ఢికొట్టారు. నిందితులు మూడుసార్లు కారుతో ఢీకొట్టగా.. ఈ ఘటనలో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రమాద ఘటనపై స్వతంత్ర ఆస్పత్రి నుంచి ఆగస్ట్ మూడో తేదీ రాత్రి పది గంటలకు పోలీసులకు సమాచారం అందింది. ఆరోజు రాత్రే పోలీసులు ప్రియాంక స్నేహితుడు నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు మూడుసార్లు స్కూటీని ఢీకొట్టి, ప్రియాంకను గాయపరిచి పారిపోయినట్లు గుర్తించామని ఎస్పీ వివరించారు.మరోవైపు ఘటన క్రూరంగా ఉండటంతో సెక్షన్లలో మార్పులు చేసి కేసు తీవ్రతను పెంచినట్లు ఎస్పీ వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. నిందితులు మద్యం మత్తులో కారు నడిపినట్లు ఆధారాలు సేకరించామని.. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. నిందితులను కస్టడీకి అప్పగించాలని

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి‘. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్ చేసేస్తున్నాడు రాజమౌళి. కాగా నేడు సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేసారు రాజమౌళి. ఈ ఫోటోలు ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించినవి. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్ట్ చేసారు రాజమౌళి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ‘రుద్ర’గా రౌద్రం చూపించిన మహేశ్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ లుక్ ఉబర్ కూల్ గా దర్శమిస్తున్నాడు సూపర్ స్టార్. అయితే మహేశ్ బాబు ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నేడు పుట్టిన రోజు సందర్భాంగా శ్రీరాముడు లుక్ చేస్తారని ఆశించారు ఫ్యాన్స్. కానీ అవేమి లేకుండా సింపుల్ పోస్టర్స్ తో సరిపెట్టేసాడు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు

వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీతో ఆమె ఫోన్లో మాట్లాడి దర్యాప్తు పురోగతి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.అనంతరం మంత్రి అనిత.. బాధితురాలు ప్రియాంక తండ్రి వెంకటేశ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించారని, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని మంత్రి తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి, చట్టప్రకారం దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని హోంమంత్రి పునరుద్ఘాటించారు

రాజమండ్రిలో సంచలనం సృష్టించిన ప్రియాంక రోడ్డు ప్రమాదం కేసులో కీలక వివరాలను ఎస్పీ నరసింహ కిశోర్ మీడియా ముందు వెల్లడించారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, నిందితులు అత్యంత క్రూరంగా క్రిమినల్ చర్యకు పాల్పడ్డారని ఆయన స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతో కేసును బలంగా నిర్మించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతిని, ఘటన జరిగిన తీరును ఆయన సమగ్రంగా వివరించారు.అసలేం జరిగింది?ఎస్పీ నరసింహ కిశోర్ కథనం ప్రకారం, ఘటన జరిగిన రోజు రాత్రి ప్రియాంక, ఆమె స్నేహితుడు ఉమేష్ స్కూటీపై సినిమా ఫస్ట్ షో చూసి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో నిందితులు ఇద్దరు మరో సినిమా చూసేందుకు అదే మాల్‌కు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు, మాల్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా వారితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దదవడంతో, సెక్యూరిటీ సిబ్బంది తమను పట్టుకుంటారనే భయంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు వేగంగా సెల్లార్‌లోని తమ కారు వద్దకు చేరుకున్నారు.తప్పించుకునే హడావుడిలో కారును వేగంగా పోనిస్తూ, స్కూటీపై వెళుతున్న ప్రియాంక, ఉమేష్‌లను ఒకసారి ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా, కావాలనే మరో రెండుసార్లు వారిపై నుంచి కారును పోనిచ్చి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి పారిపోయారని ఎస్పీ తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయని, అవి చాలా భయంకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.పోలీసుల దర్యాప్తు ఇలా..ఘటన జరిగిన మూడో తేదీ రాత్రి ఆసుపత్రి నుంచి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు

రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. రాజమండ్రి, ఆగస్టు 09: నగరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నిందితులిద్దరూ ప్రసాద్ ఆదిత్య మాల్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయే క్రమంలో కారును నిర్లక్ష్యంగా నడిపారని పేర్కొన్నారు. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను వారు కారుతో బలంగా ఢీ కొట్టారని ఎస్పీ వివరించారు. వరుసగా మూడు సార్లు స్కూటీని ఢీ కొట్టడంతో.. ప్రియాంక తీవ్రంగా గాయపడిందని అన్నారు. అనంతరం నిందితులు దొరక్కుండా పారిపోయారని చెప్పారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి ఈ ప్రమాదంపై తమకు సమాచారం వచ్చిందని వివరించారు. ఆ రోజు రాత్రే ప్రియాంక స్నేహితుడు వెంకట దుర్గ సాయి స్టేట్మెంట్ తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు. నిందితులిద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వారు మద్యం సేవించి కారు డ్రైవ్ చేసినట్లు ఆధారాలు కూడా సేకరించామని చెప్పారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సోమవారం కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. ఈ కేసులో పోలీసులపై ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్ చెప్పారు. భాగ్యనగర మహిళలకు బోనాల

Medico Priyanka Case : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. హత్యాయత్నం అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని అన్నారు. ఆగస్టు 3న ప్రియాంక తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తుంది. ఆ సమయంలో మద్యం మత్తులో నిందితులు కారును వేగంగా పోనిచ్చి స్కూటీని ఢీకొట్టారు. అయితే, వారు అంతకుముందు మాల్లో సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు. వారిపై దాడిచేసి అక్కడి నుంచి పారియే క్రమంలో కారును వేగంగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టడం జరిగిందని, అయితే, నిందితులు కారుతో మూడుసార్లు స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఈనెల 3న రాత్రి 10గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి ప్రమాదంపై సమాచారం రావడంతో అదే రోజు రాత్రి వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని, నిందితులు మద్యం సేవించి డ్రైవ్ చేసినట్లు ఆధారాలు సేకరించామని, కల్పబుల్ మర్డర్ అటెంప్ట్ సెక్షన్ 110 కింద నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. అవసరమైతే పరిస్థితులను బట్టి మరింత కఠిన సెక్షన్లు జత చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కేసులో ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లు లేవన్న ఎస్పీ.. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని రేపు పటిషన్ వేస్తామని.. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తామని తెలిపారు. అయితే, నిందితులపై గతంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. మరోవైపు నిందితులకు కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు మార్చాలి.. తన

రాజమండ్రిలో ఈ నెల 3న ఆదిత్య మాల్ వద్ద ఫ్రెండ్ తో కలిసి సినిమాకు వెళ్తున్న వైద్య విద్యార్ధిని ప్రియాంక (Rajahmundry Medico Priyanka )ను కారుతో మూడుసార్లు ఢీకొట్టి, ఆమె తలపై నుంచి కారు పోనిచ్చిన ఘటనలో ఆమె సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రియాంకపై కారు నడిపి ఆమె బ్రెయిన్ డెడ్ కావడానికి కారణమైన నిందితుల్ని ఇప్పటివరకూ అరెస్టు చేయకపోవడం, వారిపై సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేయడంపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తండ్రి వెంకటేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.AP Govt: ఆయుష్ వైద్యానికి ఏపీ గుర్తింపు-7 కేటగిరీల్లో ఆస్పత్రులు-రూల్స్ ఇవే..!ఈ నెల 3న రాజమండ్రిలో ఈ ఘటన జరిగినా పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి, నిందితుల్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యంగా ఉండిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కారణం ప్రియాంకపై కారు నడిపిన ఇద్దరు నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఇద్దరూ స్థానికంగా పరపతి ఉన్న వారు కావడమే అనే ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. తొలుత వీరిపై సాధారణ సెక్షన్లు పెట్టిన పోలీసులు.. అనంతరం ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యాక వాటిని మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఆమె తండ్రి మరో కేసు నమోదు కోసం ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!నిందితులకు కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు మార్చాలని, తన కుమార్తెకు ఈ గతి పట్టించిన వారికి చట్టప్రకారం తగిన శిక్షలు పడాల్సిందేనని తండ్రి వెంకటేష్ కోరుతున్నారు. దీంతో ఆయనతో జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న ప్రియాంక ఆరోగ్య పరిస్ధితి ఏమాత్రం

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు. ఆయన కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేశ్ 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు.విడుదల చేసిన పోస్టర్లలో మహేశ్‌బాబు సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఒక పోస్టర్లో వెదురు తెప్పపై సేద తీరుతూ కనిపించగా, మరో పోస్టర్లో ఆఫ్రికా అడవుల్లోని ప్రకృతిని చూస్తూ నిలబడి ఉన్నాడు. "తీవ్రత మాత్రమే అతని నైజం కాదు... 'వారణాసి'లో రుద్ర" అంటూ మహేశ్‌బాబు ఈ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, మహేశ్ పాత్ర గురించి, నటన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. "రుద్ర ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పుట్టాడు. తను కోరుకోని విధిని మోస్తున్నాడు. అతడు చమత్కారి, సున్నితమైనవాడు, అదే సమయంలో తీవ్రమైన వాడు. మహేశ్ ఈ పాత్రకు ప్రాణం పోశాడు. తీవ్రత, సున్నితత్వం రెండింటినీ ఒకేసారి పండించగల నటులు చాలా తక్కువ మందే ఉంటారు" అని రాజమౌళి ప్రశంసించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయ్ మారా ప్రాంతాల్లో షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, అక్కడి లొకేషన్లు సెట్స్‌లో సృష్టించలేని అనుభూతిని ఇచ్చాయని తెలిపాడు.ఈ చిత్రంలో మహేశ్‌తో పాటు నటిస్తున్న ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'వారణాసి' సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ప్రధాన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని, మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారని

రాజమహేంద్రవరం: మద్యం మత్తులో యువకులు.. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలి తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఈనెల 3న రాత్రి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిందితులు మూడు సార్లు కారుతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. ప్రస్తుతం పోలీసులు పెట్టిన సెక్షన్లు తక్కువ తీవ్రతతో ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా సెక్షన్లు మార్చాలి’’ అని కోరారు. జిల్లా అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్.. ఫిర్యాదుదారుతో చర్చిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు