
PM Narendra Modi | ప్రధాని సభాప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీస్వాధీనం..!
PM Narendra Modi | ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీ స్వాధీనం..!
© 2026 nimisham.in

PM Narendra Modi | ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీ స్వాధీనం..!
దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నేతలు దిగిన గ్రూప్ ఫోటో పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం షేర్ చేసింది. అయితే, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేకుండా క్రాప్ చేసి.. షెహబాజ్ షరీఫ్ మాత్రమే మధ్యలో ఉన్నట్లుగా చూపించింది. పాకిస్థాన్ ప్రధాని షేర్ చేసిన ఆ ఫోటోలో కేవలం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్, కిర్గిజ్ కల్నల్ ఉలార్బెక్ జార్లికోవిచ్ షార్షీవ్ మాత్రమే కనిపించారు. వారి మధ్యలో తాను నిలబడి ఉన్నట్టు షెహబాజ్ బిల్డప్ ఇచ్చారు.ఎస్సిఓ సమ్మిట్ సెషన్‌కు ముందు సభ్యదేశాల నాయకులందరూ కలిసిన సమయంలో ఈ ఫోటో తీశారు. అంతటితో ఆగకుండా ఎస్సీఓ నేతలు రౌండ్‌టేబుల్ సమావేశమైన ఒక వీడియోలోనూ మోదీ ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి, తొలగించింది. ఆ వీడియోను షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు.అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఒరిజినల్ ఫోటోను షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి షెహబాజ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో నిలబడి ఉండగా.. మరో ఐదుగురు నేతలను ఆ ఫోటో నుంచి క్రాప్ చేశారని స్పష్టమైంది.దీంతో పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు, సహకారాన్ని పెంపొందించడానికి నిర్వహించిన ఈ 26వ ఎస్సీఓ లీడర్షిప్ సమ్మిట్‌లో 10 సభ్యదేశాలు, 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొన్నాయి.ఎస్సీఓ సమ్మిట్‌లో మోదీ ప్రసంగంకిర్గిజిస్థాన్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలను వివరించారు. ప్రపంచ ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన.. గతంలో చేసిన విజ్ఞప్తినే మరోసారి గుర్తుచేశారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనొద్దని మరోసారి కోరారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్‌స్టా వీడియో విడుదల చేశారు. ‘‘దేశ ప్రజలకు అభినందనలు. 7.8% వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ తన వీడియోలో పేర్కొన్నారు. ‘‘పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండండి. ‘భారత్‌లోనే వివాహం చేసుకోండి’ అనే మంత్రాన్నే మనం పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారాన్ని కొనడం మానుకోండి. స్థానికంగా తయారైన వస్తువులు, సేవలు ఎంత ఎక్కువగా ఎంచుకుంటే.. దేశం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం నాకు ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ప్రస్తుత వృద్ధి రేటు ఎక్కువ. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఇంధన సరఫరాకు అవరోధాలు వంటి పరిస్థితులను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం. ఈ వృద్ధిని దేశ

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ ప్రభుత్వంలోకి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ వివాదం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా ఆయన గతంలో విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదని, త్వరలోనే ఆయనకు కీలక పోర్ట్‌ఫోలియో అప్పగించేందుకు స్క్రిప్ట్ సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బీజేపీ సంస్థాగత స్థాయిలో అనేక మార్పులు చేసింది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ నేతృత్వంలో కొత్త బృందాన్ని ప్రకటించారు.కాశ్మీర్ పై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్.. పాకిస్తాన్ కు బిగ్ షాక్..!అయితే ఆగస్టు నెలాఖరు నాటికి మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విద్యాశాఖకు రాజీనామా చేసినప్పటికీ.. పార్లమెంట్ భవనంలో మంత్రుల విభాగం వద్దనే ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడం ధర్మేంద్ర ప్రధాన్ రీ-ఎంట్రీని బలపరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఆయనకున్న నమ్మకం కారణంగా ఆయనకు ప్రాధాన్యత కలిగిన శాఖ దక్కవచ్చని భావిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు మరికొందరు మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడం, కొత్త ముఖాలకు చోటు కల్పించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.కీలక మంత్రుల స్థానాలపై అంచనాలు పీయూష్ గోయల్ ప్రధాని మోదీ కేబినెట్లో వాణిజ్య శాఖ మంత్రిగా కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి. ఆయన పనితీరు పట్ల ప్రధాని మోదీ సంతృప్తిగా ఉన్నారు. అమెరికాతో చర్చలు నిరంతరం మారుతున్న తరుణంలో వాణిజ్య మంత్రిత్వ శాఖను మరెవరికీ అప్పగించి ప్రభుత్వం రిస్క్ తీసుకోదు. కేవలం రెండు రోజుల క్రితమే ఆయన పార్టీ కోశాధికారిగా కూడా నియమితులయ్యారు. అయితే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరీ విషయంలో పరిస్థితి అస్పష్టంగా ఉంది. పూరీ రాజ్యసభ పదవీకాలం నవంబర్ 25తో ముగుస్తుంది, ఆయన తిరిగి ఎన్నికయ్యే విషయంపై ఇంకా

Union Cabinet | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నాలుగు నూతన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కి.మీ మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ విస్తరించనున్నారు. 2030-31 నాటికి ఈ కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి.. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలందించడమే లక్ష్యమని రైల్వే శాఖ (Indian Railways) ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్, ఒడిశాలోని భద్రక్ (రానితాల్) మధ్య 173 కి.మీ మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, ఒడిశాలోని భద్రక్, హరిదాస్పూర్ మధ్య 75 కిలోమీటర్ల మేర నాలుగో లైన్; వీటితో పాటు ఏపీలోని గూడూరు - తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ; ఒడిశాలోని కటక్, పారాదీప్ మధ్య 72 కి.మీ మేర మూడు, నాలుగో రైల్వే లైన్లను నిర్మించనున్నారు. రైల్వే నెట్‌వర్క్‌ను మరో 410 కి.మీ మేర విస్తరించే ఈ నూతన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.9,450 కోట్లుగా నిర్ణయించారు. ఈ కొత్త రైల్వే లైన్లు ఎనిమిది జిల్లాల్లోని 6,448 గ్రామాలకు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు

గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న అశోక్ గజపతి రాజు, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో భాగంగా ఆయన ప్రధానిని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని ప్రత్యేకంగా కోరారు. ఆలయ ట్రస్ట్ బోర్డు తరఫున పంపిన ఆహ్వాన పత్రికను అందజేస్తూ, సింహాద్రి అప్పన్న ప్రత్యేక విగ్రహాన్ని ప్రధానికి బహుమతిగా సమర్పించారు. గత ఏడాది కాలంగా గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు విజయవంతంగా సేవలందిస్తున్నారు. తన పదవీకాలంలో సాధించిన పురోగతిని, బాధ్యతలను వివరిస్తూ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టు 17న జరిగిన ఈ సమావేశం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వీకరించి, సింహాచలం ఆలయాన్ని తప్పక సందర్శిస్తానని హామీ ఇచ్చారు. తన షెడ్యూల్‌ను బట్టి త్వరలోనే అప్పన్న స్వామిని దర్శించుకుంటానని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సింహాచలం క్షేత్రంలో ప్రధాని పర్యటనపై భక్తులలో, స్థానికులలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఆధ్యాత్మిక అంశాలతో పాటు గోవా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రధానితో ఆయన చర్చించారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఫలితంగా గోవాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందుతున్న నిధుల వినియోగంపై కూడా వారు సమీక్షించారు. గోవా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వస్తున్న సవాళ్లను గవర్నర్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం చూపిస్తున్న ప్రత్యేక చొరవపై అశోక్ గజపతి రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైతే, ఆయన పర్యటనలో సింహాచలం క్షేత్రం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అప్పన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Alluri Sitaramaraju International Airport: భోగాపురంలో ప్రారంభించిన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరు పెట్టారు. ఉత్తరాంధ్రకు గేట్ వేగా విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిలిచిందని ఆప్రాంత వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీఎంఆర్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించిన జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీ విమానం బయలు దేరింది. ఆ తర్వాత విశాఖలో వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి చిట్టచివరి సర్వీసుగా నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న వెయ్యి మంది సిబ్బంది సేవలను ఎక్కడ యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ఆదివారం అర్ధరాత్రి నుంచి భోగాపురం నుంచి స్కూట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడ నుంచి సింగపూర్‌కు పయనమైంది. దీంతో అధికారిక సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలకు రెగ్యులర్ సర్వీసులు.. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై,కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై,బెంగళూరు నగరాలకు రెగ్యులర్ సర్వీసులు ఉండనున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో లాంటి దేశీయ విమానాయన సర్వీసులతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్ లైన్స్ సింగపూర్‌కు, ఇండియా విమానాల నుంచి అబుదాబి, దుబాయ్‌లకు విమాన సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం
.webp)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు. తాజాగా ఆయన తన అధికారిక నివాసంలో ఉదయం వేళ మూగజీవులతో గడిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ ప్రాంగణంలో ప్రధాని మోదీ తన ఉదయపు నడక సందర్భంగా ప్రకృతి ఒడిలో సమయాన్ని గడిపారు. ఈ క్రమంలో అక్కడి పక్షులకు, పశువులకు స్వయంగా ఆహారాన్ని అందించే దృశ్యాలు నెటిజన్ల మనసులను గెలుచుకుంటున్నాయి. ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఎర్రకోటకు బయలుదేరేందుకు ప్రధాని సాధారణ సమయం కంటే కాస్త త్వరగా సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గ్రహించినట్లుగా ఆ జీవులు ముందుగానే వచ్చి ఆయనను కలిశాయని మోదీ వివరించారు. ఈ దృశ్యాలలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యత కలిగిన పుంగనూరు (చిత్తూరు) సూక్ష్మ జాతి ఆవులే కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిచిన్న పశువులలో ఒకటిగా పేరుగాంచిన ఈ అరుదైన నాటు జాతి పశువులను మోదీ ఎంతగానో ప్రేమిస్తారు. కేవలం 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉండే ఈ చిత్తూరు ఆవులు పిఎంఓ ప్రాంగణంలో సందడి చేస్తూ కనిపించాయి. వాటిని ప్రధాని ప్రేమగా నిమురుతూ, గింజలు మరియు దానా అందిస్తూ గడిపిన క్షణాలు అత్యంత సుందరంగా నిలిచాయి. ప్రకృతి సంరక్షణ, దేశీయ పశుసంపద కాపాడటంపై ఉన్న ఆసక్తిని ఈ దృశ్యాలు మరొకసారి స్పష్టం చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. అరుదైన దేశీయ పశు జాతులను ప్రోత్సహించడంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న ఈ తరహా చర్యలు అభినందనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. అలాగే ఉదయం పూట ఆ ప్రాంగణంలో స్వేచ్ఛగా విహరించే నెమళ్లతో కూడా ప్రధాని మోదీ సమయం గడిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైకులు, వీక్షణలతో ట్రెండింగ్‌గా మారింది. ఈ రకమైన సంఘటనలు రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా జీవరాశుల పట్ల మానవత్వాన్ని

మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడు అటల్జీ అని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్‌పేయికి అపారమైన దూరదృష్టి ఉందని ప్రశంసించారు. ఆయన మాటలు, కృషి తరతరాలకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నాయకత్వం దేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై అటల్జీ చూపిన దృష్టి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని ‘సదైవ అటల్’ సమాధి వద్దకు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు. మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం.. జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం దిశగా భారత్.. కీలక భేటీకి రంగం సిద్ధం

ఇంటర్నెట్‌డెస్క్: ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ (PM Modi) యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటి మంది యువతకు ఏఐ (AI) నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే.. ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న జనగణన గురించి ప్రస్తావించారు. దానిలో చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘నేను అందరినీ ఒక ఫేవర్ చేయాలని అడుగుతున్నాను. ఒక గంటా, రెండు గంటల సమయం కేటాయించండి. అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మాత్రం సమయం దేశాన్ని ఎలా బలోపేతం చేస్తుందా..? అని యువత ఆలోచిస్తూ ఉండొచ్చు. వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో జనాభా గణనకు ఒక అనుకూల వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. గణన అంటే లెక్కలన్నీ ఒక దగ్గర రాసుకోవడం కాదు. జనాభా లెక్కల సమయంలో ప్రజలు ఇచ్చే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, పథకాలు రూపుదిద్దుకుంటాయి. దేశ ప్రగతికి ఆ లెక్కలు సూచీగా ఉంటాయి. అందుకే కచ్చితమైన, స్పష్టమైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం’’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే ‘దిమాగీ నక్సల్స్’ గురించి మాట్లాడుతూ.. వారిని దేశానికి కొత్త శత్రువులుగా అభివర్ణించారు. ‘‘సంవత్సరాలుగా మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు దేశంలో బలంగా పాతుకుపోయారు. అడవుల్లోని సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. సాయుధ నక్సల్స్ కనుమరుగైనా.. ‘దిమాగీ నక్సల్స్’ మిగిలి ఉన్నారు. వారు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి వారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మనం వారిని గుర్తించి..ఒంటరివాళ్లని చేయాలి’’ అని సూచించారు. తయారీ, వ్యవసాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, ఇండియాస్ సాఫ్ట్ పవర్ కోసం ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను మోదీ ప్రకటించారు (Independence

దేశం శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయడం విశేషం. ఈ ఏడాది వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటలో జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గీతానికి నివాళిగా ఈ చారిత్రక అడుగు వేశారు. ఎన్సిసి క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు కలిసి వందేమాతరం పాడగా, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన వినిపించింది. ప్రధాని మోదీ ముందుగా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు చేరుకుని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అధికారుల స్వాగతం స్వీకరించారు. గౌరవవందనం తీసుకున్న తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వదేశీ 105 మి.మీ. ఫీల్డ్ గన్లతో 21 తుపాకుల గౌరవార్థన జరిగింది. వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, అధికారికంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ సందర్భాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. దీంతో దేశ ప్రజల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిస్తోందని చెప్పారు. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోట నుంచి వందేమాతరం మారుమ్రోగుతోందని పేర్కొన్నారు. 150 సంవత్సరాలు పూర్తయిన జాతీయ గీతానికి దీనికంటే అనుకూలమైన రోజు మరొకటి ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు, మహాత్మా గాంధీకి ఆయన నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా చిన్న కలలతో ఇకపై సరిపోదని, పెద్ద కలలు కనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫలితంగా

PM Modi | ఇంటర్నెట్ డెస్క్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ ‘‘బాంధనీ’’ (Bandhani) తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. ఈ తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమరంగు (Chocolate Brown) వెస్ట్‌కోట్ జాకెట్ ధరించారు. దేశభక్తిని చాటేలా జేబులో జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చతో కూడిన ‘‘పాకెట్ స్క్వేర్’’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. దిల్లీలోని ఎర్రకోటపై మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. రాజస్థాన్, గుజరాత్లో బాంధనీ వస్త్ర కళకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్న చిన్న వస్త్రాలను దారంతో కట్టి (టై-అండ్-డై) రంగులు అద్దే విధానంలో ఈ డిజైన్లు రూపొందుతాయి. ఆ దారాలు తొలగించిన తర్వాత వస్త్రంపై చుక్కలు, ఆకృతులు కనిపిస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ధరించే తలపాగాలు ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2025లో ఆయన కాషాయ తలపాగా, తెల్లటి కుర్తాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Independence Day| దిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోదీ జెండా ఎగురవేయడం ఇది 13వసారి కావడం విశేషం. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ రోజు మనమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రతి హృదయంలో 'వందేమాతరం' ధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోంది. గతంలో ఐదు బలహీన దేశాల జాబితాలో ఉన్న భారత్.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా మారింది’’ అని మోదీ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Parliament Foreign Contribution Regualtion ACT: విదేశీ సహకార నియంత్రణ బిల్లుపై చర్చ సమయంలో పార్లమెంటులో గందరగోల పరిస్థితి నెలకొంది. విదేశీ విరాళాల నిబంధనలను కఠినతరం చేసే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు రావాలనుకుంటే విపక్షాలు అడుగడుగునా అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విపక్ష నేతలు ఎండగట్టారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మైనారిటీలు, ఎన్జీవోలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. చట్టపరమైన కార్యాచరణ లేకుండా విదేశీ నిధులను దేశంలోకి అనుమతించలేమన్నారు. సభను విపక్షాలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం మంచిదికాదు - రిజిజు.. దేశీయంగా స్వచ్ఛంద సేవ ముసుగులో విదేశీ విరాళాలు దుర్వినియోగం గాకుండా… సమాజాభివృద్ధిలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నియంత్రణ చట్టం పనిచేస్తుందని కేంద్ర మంత్రి రిజిజు సభకు వివరించారు. కేంద్రప్రభుత్వం ఉన్నతాశయంతో తెచ్చే చట్టం మైనారిటీలను, ఎన్జీవోలను ఇబ్బందిపెట్టే అంశాలు లేవని స్పష్టంచేశారు. వాస్తవిక విషయాలను తెలుసుకోకుండా విపక్షాలు సభను తప్పుదోవ పట్టించడం తగదని కేంద్ర మంత్రి రిజిజు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది భారతదేశంలోని వ్యక్తులు, సంఘాలు , ఎన్జీవోలు విదేశీ విరాళాలను స్వీకరించడాన్ని నియంత్రించే ఒక చట్టం. దేశ

ఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు. ఇదీ నిధి తివారీ ప్రయాణం. శాస్త్రవేత్తగా మొదలైన ఆమె కెరీర్.. విదేశాంగం, భద్రతా వ్యవహారాల్లో పనిచేసే స్థాయికి ఎలా చేరిందో చూస్తే ఆసక్తికరమే.నిధి తివారీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవారు. అక్కడే పాఠశాల విద్య, డిగ్రీ పూర్తి చేశారు. బీఎస్సీ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు.బార్క్‌లో శాస్త్రవేత్తగా..చదువు పూర్తయ్యాక బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. అయితే సివిల్స్ సర్వీసులోకి వెళ్లాలన్న పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 2008లో బార్క్ నుంచి బయటకు వచ్చి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు.ఒక్కసారి కాదుసివిల్స్ ప్రయాణం ఆమెకు వెంటనే విజయాన్ని అందించలేదు. 2012లో జరిగిన పరీక్షలో ఆమె పేరు వెయిటింగ్ లిస్ట్‌లో వచ్చింది. అయినా ప్రయత్నం ఆపలేదు. 2013లో మళ్లీ పరీక్ష రాశారు. ఈసారి ఆల్ ఇండియా స్థాయిలో 96వ ర్యాంకు సాధించారు. దీంతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై 2014 బ్యాచ్‌లో చేరారు.విదేశాంగం నుంచి పీఎంవోకుఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేసే సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ భద్రతపై ఆమెకు వచ్చిన అనుభవం తర్వాత పీఎంవోలో కీలకంగా ఉపయోగపడింది.2022 నవంబర్‌లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. ఆ తర్వాత

Viral Video: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కూతురు రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య సరదా సంభాషణ కనిపిస్తుంది. ఈ ఇద్దరు నాయకుల మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉన్నారు.ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమాన మార్గం: మనకు ఇంత దగ్గర్లోనే!ఆ వీడియోలో ప్రధానమంత్రి మోదీ ప్రియాంక గాంధీని.. ప్రియాంక, ఎలా ఉన్నావు? అని అడగ్గా, ప్రియాంక గాంధీ, నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? అని బదులిస్తుంది. దీనికి ప్రధానమంత్రి మోదీ నవ్వుతూ, నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను అని అంటారు.మోదీకి ఖర్గేకు ఫన్నీ పంచ్! ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆ సంభాషణలో చేరారు. ఆయన ప్రధాని మోదీతో సరదాగా, అన్నా, మీరు కొంచెం మారారు. మీరు కొంచెం మారారు అని అన్నారు. ఖర్గే కామెంట్‌కు ప్రధాని మోదీ నవ్వి, ఓ, నిజమా? అని అడిగారు. పెళ్లి విందులో జరిగిన ఈ అనధికారిక, సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు నాయకుల మధ్య జరుగుతున్న ఈ సంభాషణను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.రీల్స్‌పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు! యూత్ కు సీరియస్ మెసేజ్జూన్ 20న జరిగిన సుప్రియా సూలే కుమార్తె వివాహంసుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)కి చెందిన ఓ ప్రముఖ నాయకురాలు, మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నారు. సుప్రియా సూలే కూతురు రేవతీ సూలే 2026 జూన్ 20న ముంబైలో పారిశ్రామికవేత్త సారంగ్ లఖానీని వివాహం చేసుకున్నారు. ఆగస్టు 10న ఢిల్లీలో ఘనంగా రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ప్రధాని మోదీకి సంబంధించిన

నేటి సమాజంలో క్షణంలో వైరల్ అయ్యే సోషల్ మీడియా రీల్స్ సంస్కృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. విజయం సాధించడానికి దొంగ దారులు, షార్ట్కట్లు వెతుక్కోవడం వల్ల జీవితాలు నాశనమవుతాయని, ప్రగతి సాధించాలంటే సుదీర్ఘమైన అనుభవం, పుస్తక పఠనం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, నేటి యువతరం రీల్స్ మాయలో పడకుండా ప్రముఖుల జీవిత చరిత్రలను, ఆత్మకథలను చదవాలని విజ్ఞప్తి చేశారు.షార్ట్‌కట్ ప్రాణాలకే ముప్పు!ఢిల్లీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నేటి తరం ఆలోచనా విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్స్ మోజులో పడి యువత కాలం వృథా చేసుకుంటోంది. రైల్వే స్టేషన్లలో తరచూ ఒక బోర్డు కనిపిస్తుంది.. షార్ట్కట్లు ప్రమాదకరం అని! జీవితానికి కూడా ఇది వందకు వంద శాతం వర్తిస్తుంది. షార్ట్‌కట్ దారుల్లో విజయం వెతుక్కోవడానికి బదులు, ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయుల ఆత్మకథలను చదవడం అలవాటు చేసుకోండి. అది మీకు సరైన బాటను చూపుతుంది అని ప్రధాని సలహా ఇచ్చారు.ఒకే వేదికపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. వీడియో వైరల్! సంస్కారానికి నిలువుటద్దం రామ్‌నాథ్ కోవింద్మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అణకువ, ఆయన పాటించిన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్రపతిగా అత్యున్నత హోదాలో ఉన్నప్పటికీ, ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ప్రధాని కారు దాకా వచ్చి సాగనంపే వారని, ఆ వినయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.అలాగే, రాష్ట్రపతి అయ్యాక తన సొంత ఊరు పరౌంఖ్ కు వెళ్లినప్పుడు, ప్రాథమిక పాఠశాల గురువుల పాదాలకు నమస్కరించిన దృశ్యం దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా మూలాలను మర్చిపోకపోవడమే అసలైన వ్యక్తిత్వమని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. FCRA Bill Introduced In Parliament: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు దేశ ప్రయోజనాలకు ముడిపడిన ఎఫ్సీఆర్ఏ బిల్లును ను ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించేందుకు నోట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు, మైనారిటీ సంస్థలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం FCRA బిల్లును జేపీసీకి పంపేందుకు మొగ్గు చూపింది. మరోవైపు ఇదే బిల్లును ప్రభుత్వం బేషరుతగా ఉపసంహరించుకోవాలని ఉభయ సభల్లో కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ FCRA బిల్లును లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపితే.. బిల్లులోని ప్రతీ నిబంధనను, ముఖ్యంగా ఆస్తుల నిర్వహణ, జరిమానాలకు సంబంధించిన ప్రతి చాప్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, చట్టపరమైన నిపుణులు, ధార్మిక ట్రస్టులు, ప్రభుత్వ అధికారుల నుంచి లిఖితపూర్వక, ప్రత్యక్ష సాక్ష్యాలను జేపీసీ సేకరించనుంది. కమిటీ తన సిఫార్సులతో నివేదికను రూపొందించిన తర్వాత, తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో సవరించిన బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టేముందు జేపీసీ పరిశీలనకు.. గతంలో ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విధమైన పార్లమెంటరీ మార్గాన్ని ఎంచుకుంది. ఆ బిల్లును కూడా చట్టంగా రూపకల్పన చేయడానికి ముందు విస్తృతమైన చర్చలు, న్యాయ నిపుణుల అభిప్రాయ సేకరణ, క్షుణ్ణమైన పరిశీలన కోసం జేపీసీకి పంపించారు. అదే

దేశ రాజధాని ఢిల్లీలోని 6 జన్ పథ్ వేదికగా సోమవారం రాత్రి ఓ అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్లతో తీవ్ర ప్రత్యర్థులుగా ఉండే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకే ప్రాంగణంలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఎన్సీపీ నాయకురాలు, ఎంపీ సుప్రియా సూలే కూతురు రేవతీ సూలే రిసెప్షన్ కార్యక్రమంలోఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రేవతీ సూలే నాగ్‌పూర్ పారిశ్రామికవేత్త సారంగ్ లఖానీల పెళ్లి జూన్ నెలలో ముంబైలో జరగగా.. ప్రముఖుల కోసం ఢిల్లీలో ఈ గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహించారు.ప్రధాని మోదీ లేటెస్ట్ ఇన్ స్టా వీడియో: దేశ ప్రజలకు పిలుపుపార్లమెంట్లో వాదప్రతివాదనలతో వేడెక్కించే నాయకులు ఇక్కడ ఎంతో సరదాగా గడిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేదికపైకి వెళ్లి నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులు ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిన వెంటనే సుప్రియా సూలే స్వయంగా గాంధీ కుటుంబాన్ని(సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) వేదికపైకి ఆహ్వానించారు. నూతన దంపతుల పక్కన సోనియా గాంధీ నిలబడగా.. ఇరువైపుల రాహుల్, ప్రియాంక నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు.ఈ రిసెప్షన్ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ సీనియర్ నాయకుడు శరద్ పవార్, ఆయన సతీమణిని ఆప్యాయంగా పలకరించి అనంతరం వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయంగా సిద్ధాంతాలు వేరుగా ఉండే నాయకులు ఒకరినొకరు కలుసుకోవడంతో ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచింది. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కరచాలనం చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూర్చున్న టేబుల్ వద్దకు సోనియా గాంధీ వెళ్లి కుశలప్రశ్నలు వేశారు.యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్రాజకీయ ప్రత్యర్థి నాయకులందరూ

PM Narendra Modi, CWG 2026 Medallists: స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి కొన్ని క్రీడా విభాగాలను తొలగించినప్పటికీ, మన క్రీడాకారులు లభించిన అవకాశాలను రెండు చేతులా ఒసిసిపట్టుకున్నారు. భారత్ మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో గర్వకారణంగా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. తక్కువ క్రీడల్లో పాల్గొన్నప్పటికీ పతకాల సాధన రేటులో భారత్ అగ్రశ్రేణి ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని ఎగురవేసింది. బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట.. ఈ టోర్నీలో భారత్‌కు అత్యంత బలాన్ని ఇచ్చిన విభాగంగా బాక్సింగ్ నిలిచింది. రింగులోకి దిగిన భారత బాక్సర్లు ప్రత్యర్థులపై విరుచుకుపడి రికార్డు స్థాయిలో 10 పతకాలను కొల్లగొట్టారు. ముఖ్యంగా మహిళా బాక్సర్లు ప్రదర్శించిన ధీరత్వం నభూతో నభవిష్యత్ అనేలా సాగింది. ఏకంగా ఐదు స్వర్ణ పతకాలను మహిళా బాక్సర్లే సాధించడం విశేషం. మిరాబాయి చాను వరుసగా మూడోసారి పసిడి పతకం గెలుచుకుని వెయిట్‌లిఫ్టింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. జూడో, అథ్లెటిక్స్ విభాగాల్లోనూ మన క్రీడాకారులు అంచనాలను మించి రాణించారు. పారా-అథ్లెట్లు సైతం దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ పసిడి, రజత పతకాలతో మెరిశారు. "జో ఖేలేగా వో ఖిలేగా".. క్రీడాకారుల్లో నవ ఉత్తేజం.. విజేతలను తన నివాసానికి ఆహ్వానించిన ప్రధాని మోదీ వారితో ఎంతో ఆప్యాయంగా సమయం గడిపారు. క్రీడాకారుల అనుభవాలు తెలుసుకుంటూ వారి కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా పసిడి విజేత సాక్షి చౌదరి, ఇతర అథ్లెట్లతో కలిసి మోదీ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఆడేవాడు ఎల్లప్పుడూ వికసిస్తాడు" అనే తన సంకల్పాన్ని మోదీ పునరుద్ధరించారు. ప్రతి పౌరుడు భారత క్రీడాకారులకు నిరంతరం అండగా నిలవాలని, వారి విజయాన్ని వేడుకగా జరుపుకోవాలని కోరారు. ప్రధాని

ఇంటర్నెట్ డెస్క్: భారత బాక్సర్ లవ్లీనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఆదివారం ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే. వారితో సరదాగా మాట్లాడిన మోదీ అథ్లెట్లకు లడ్డూలు తినిపించారు. ఈ సందర్భంగా బాక్సర్ లవ్లీనా.. గ్లాస్గోలో చేసిన పనిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. అదేమీ చిన్న విషయం కాదని.. దేశమంతా సుదీర్ఘకాలం గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. ప్రధాని: అసలేం జరిగింది? మీరు ఆ రెస్టరెంట్తో ఎందుకు పోరాడారు? లవ్లీనా: కామన్వెల్త్ గేమ్స్‌లో మంచి ప్రదర్శన చేశాం. అది చివరి రోజు. చాలా సంతోషంగా గడపాల్సిన సందర్భం. అందుకోసం ఓ రెస్టరంట్‌కు వెళ్లాం. అయితే, మన మ్యాప్ సరిగా లేదని అనిపించింది. ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా. మార్పులు చేస్తామని చెప్పారు. ప్రధాని: సంబరాలు చేసుకుంటున్న సమయంలో మీరు మ్యాప్ ప్రాముఖ్యతను గుర్తించడం నిజంగా అభినందనీయం. ఆ వీడియో సాధారణమైంది కాదు. దేశ ప్రజలు సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటారు. గ్లాస్గోలోని ఓ రెస్టరెంట్‌కు లవ్లీనా (Lovlina Borgohain)తోపాటు కొందరు భారత అథ్లెట్లు డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ టవల్స్ (నాప్కిన్లు)పై భారత్ మ్యాప్ అసంపూర్తిగా ఉండటం లవ్లీనా గమనించింది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కశ్మీర్ పూర్తి భూభాగాలను ఆ చిత్రపటంలో చూపించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా లవ్లీనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెస్టరంట్ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను జారీ చేసింది. అయితే, ఇది కావాలనే చేసిందని.. పొరపాటు కాదని అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరో బాక్సర్ నరేంద్ర బేర్వాల్ గతంలో తనకు పాక్ బాక్సర్తో ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘పాకిస్థాన్ గురించి ఏ మాట్లాడినా నాకొక స్టోరీ గుర్తుకొస్తుంది సర్. అది 2015 మిలిటరీ గేమ్స్. నా ఫస్ట్ ఫైట్ పాకిస్థాన్ బాక్సర్‌తోనే. అప్పుడు ఉన్నతాధికారులు, సహచరులు ఒకటే చెప్పేవారు

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వారు చూపిన పట్టుదల, కృషిని కొనియాడారు. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అన్ని క్రీడల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని.. యువత మరింత మంది క్రీడల వైపు వచ్చేలా వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు. ‘జో ఖేలేగా వో ఖిలేగా. భారత్‌కు ఎప్పుడూ మద్దతుగా నిలవండి. భారత్ మాతా కీ జై!’ అంటూ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. యువత క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ గతంలోనూ ఆయన ‘జో ఖేలేగా వో ఖిలేగా’ నినాదాన్ని పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రధానితో సమావేశమైన బాక్సింగ్ స్వర్ణ పతక విజేత సాక్షి చౌదరి ఈ భేటీపై ఆనందం వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలందరినీ ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఆయనను కలవడం ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. ప్రధానమంత్రి చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయనతో మాట్లాడటం అద్భుతమైన అనుభవం’ అని సాక్షి తెలిపింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల వేటలో బాక్సింగ్ కీలక పాత్ర పోషించింది. భారత బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా.. అందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత బాక్సింగ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా భారత మహిళా బాక్సర్లు అదరగొట్టారు. ఏడు స్వర్ణాల్లో ఐదు మహిళల ఖాతాలోనే చేరాయి. శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వచ్చిన భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ఢిల్లీ నివాసంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ పతక విజేతలతో సుదీర్ఘంగా సంభాషించి.. వారి అనుభవాలను తెలుసుకున్నారు. వారి అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసిస్తూ, యావత్ దేశం తరపున అభినందనలు తెలిపారు. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పంచుకున్నారు, అది వేగంగా వైరల్ అవుతోంది.రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!ప్రధానమంత్రి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకోవడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్ అథ్లెట్లతో జరిగిన ఈ ప్రత్యేక సమావేశం గురించి తెలియజేశారు. ఆ వీడియోలో ఆయన స్వర్ణ పతక విజేత బాక్సర్ సాక్షి చౌదరి, పలువురు ఇతర ఛాంపియన్లతో సంభాషిస్తూ కనిపించారు. ఆ వీడియోలో సాక్షి చౌదరి ప్రధాని మోదీ నిరాడంబరతను ప్రశంసిస్తూ.. ప్రధానమంత్రిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా వినయశీలి అని అన్నారు. సంభాషణ సందర్భంగా ఆటగాళ్లు ప్రధానమంత్రిని ఏదైనా మాట్లాడమని కోరగా.. దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే తన ప్రసిద్ధ సందేశాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు, జో ఖేలేగా, వో ఖిలేగా! ఆల్వేస్ చీర్4భారత్. అంటూ చివరకు భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.1947లో భారత్‌లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్‌పోర్ట్‌తో అరబ్ ప్రజలు...39 పతకాలు గెలిచిన భారత్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించి, మొత్తం 39 పతకాలను గెలుచుకోవడం గమనార్హం. వీటిలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. ప్రధానమంత్రితో ఈ సమావేశం అథ్లెట్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది

JD Vance PM Modi Phone Call : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్ – అమెరికా సంమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ సంభాషణలో భాగంగా జేడీ వాన్స్ సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ ఇటీవల మగ బిడ్డకు జన్మించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. వాన్స్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు మోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. భారత్ - అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత లోతుగా తీసుకెళ్లే మార్గాలపై చర్చించామని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే ఈ ఫోన్ సంభాషణకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, తుర్కియో, పాకిస్థాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అంశం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. గతకొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి బలోపేతం చేసేందుకు రెండు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి

భారత ప్రధాన నరేంద్ర మోదీ శనివారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్లో మాట్లాడారు. తనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సంభాషణ సందర్భంగా భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు చేపట్టాల్సిన కీలక చర్యలపై వారు చర్చించారు. దీనితో పాటు జేడీ వాన్స్-సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో విదేశీ నిధుల చట్టం వివాదం నేపథ్యం భారత్‌లోని ఎన్జీఓలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలకు అందే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) ప్రతిపాదిత సవరణలపై ఆమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్ట సవరణలు మత సంస్థలపై ప్రభావం చూపిస్తాయని రిలే మూర్ కామెంట్ చేయగా.. చట్టసభల వ్యవహారాలు భారత అంతర్గత అంశాలని, అమెరికా సహా పలు దేశాల్లో విదేశీ నిధులను నియంత్రించే చట్టాలు అమల్లో ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్షణాన్ని ఆస్వాదించండి! యువతకు మోదీ బిగ్ మెసేజ్..గతంలో ఫోన్ సంభాషణను గుర్తుచేసుకున్న నేతలు మే 2025లో పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో జేడీ వాన్స్, ప్రధాని మోదీ మధ్య జరిగిన చివరి ఫోన్ సంభాషణను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత్‌పై పాకిస్తాన్ భారీ దాడికి ప్లాన్ చేస్తోందని జేడీ వాన్స్ హెచ్చరించగా.. మా స్పందన అంతకంటే మరింత బలంగా, తీవ్రంగా ఉంటుంది అని తానిచ్చిన సమాధానాన్ని ప్రధాని మోదీ గతంలో లోక్‌సభ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే