
Tennis Competitions | గోదావరిఖనిలో సింగరేణి ఆధ్వర్యంలో లాన్ టెన్నిస్ పోటీలుప్రారంభం
Tennis Competitions | గోదావరిఖనిలో సింగరేణి ఆధ్వర్యంలో లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
© 2026 nimisham.in

Tennis Competitions | గోదావరిఖనిలో సింగరేణి ఆధ్వర్యంలో లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం

Yoga Competitions | గోదావరిఖనిలో అట్టహాసంగా జిల్లా స్థాయి యోగా పోటీలు

జపాన్‌లోని ఐచి-నగోయాలో వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026) ప్రారంభం కానున్నాయి

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్‌స్టేషన్‌కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్‌లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
13 Year Old AI App Developer Zhu Shuhan : సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే విపరీతమైన కోడింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదని, మంచి ఆలోచన ఉంటే కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని. చైనాకు చెందిన ఝూ షుహాన్ అనే 13 ఏళ్ల చిన్నారి ఒక్క లైన్ కోడింగ్ కూడా రాయకుండానే ఒక వినూత్నమైన ఏఐ స్టడీ అసిస్టెంట్ యాప్‌ను తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన ఆలోచనతో తయారుచేసిన ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 18,000 యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2.5 లక్షలకు పైగా) అర్జించి సంచలనం సృష్టించింది.'వర్చువల్ పేరెంట్' యాప్ వెనుక అసలు కథ ఇదే..!ఝూ షుహాన్ రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్‌కు 'జై చాంగ్' అని నామకరణం చేసింది. ఇంగ్లీష్‌లోకి దాన్ని అనువదిస్తే 'ఆన్ సైట్' అంటే అందుబాటులో ఉండటం అని అర్థం వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే సమయంలో వారిపై నిఘా ఉంచడాన్ని, పర్యవేక్షించడాన్ని సులభతరం చేసేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. పిల్లలు తమ ఫోటోను అప్లోడ్ చేసిన వెంటనే.. ఈ యాప్ ఒక 'వర్చువల్ పేరెంట్' లేదా 'డిజిటల్ పేరెంట్ క్లోన్' రూపంలో మారి బాధ్యతలు స్వీకరిస్తుంది.విద్యార్థి తన చదువును పక్కన పెట్టి మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటున్నా లేదా తను కేటాయించిన స్థానాన్ని వదిలి పక్కకు వెళ్లినా.. కెమెరా సాంకేతికత ద్వారా పసిగట్టి తక్షణమే తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశాలను పంపుతుంది. "నా తల్లిదండ్రులు నిరంతరం ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల నేను చదువుకునే సమయంలో నా పక్కన ఉండేందుకు సమయం దొరికేది కాదు. దాంతో హోమ్‌వర్క్ చేసే సమయంలో దారితప్పి రహస్యంగా ఫోన్ వాడేదాన్ని. నా తోటి విద్యార్థుల్లో చాలామంది స్వయం క్రమశిక్షణ లేక ఇదే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే

భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. పలు రంగాల్లో చైనా భారత్‌కు ప్రధాన పోటీగా మారుతోందని అన్నారు. తాను రచించిన నూతన పుస్తకం ‘ది క్యూరియస్ అంది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ విడుదల సందర్భంగా జనరల్ నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019-22 మద్య నరవణే భారత ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పాక్, చైనాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవని జనరల్ నవరణే అన్నారు. ‘రెండు దేశాలతోనూ మనం యుద్ధాలు చేశాము. వాళ్లతో ఎప్పటికీ ముప్పు ఉంటూనే ఉంటుంది. పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఉగ్రవాదం ఎగదోస్తున్న పాక్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. కానీ నా అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంలో చైనాతోనే భారత్‌కు ప్రధాన పోటీ ఉంటుంది. నేను చైనాను శత్రువుగా కాకుండా పోటీదారుగా పేర్కొనడానికి కారణం కూడా ఉంది. కేవలం యుద్ధరంగంలోనే కాకుండా రాజకీయాలు, ఆర్థికరంగం, వాణిజ్య రంగాల్లో కూడా చైనాతో పోటీ ఉంటోంది’ ‘పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణ ఉంటూనే ఉంటుంది. అయితే, ఈ పొరపొచ్చాలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. మరో మార్గం లేనప్పుడే బలప్రయోగానికి దిగాలి. ఒక్కోసారి ఈ పరిస్థితి ఎదురు కావొచ్చు. అలాంటి సమయాల్లో ప్రత్యర్థి ఒకింత వెనకడుగు వేసేలా మిలిటరీ సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలి. భౌగోళిక రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా మన ఇరుగుపొరుగుగా ఎవరు ఉంటారనేది చెప్పలేము. కాబట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’ అని జనరల్ నరవణే అన్నారు. దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు మహారాష్ట్ర

మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది... హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మార్గదర్శిపై నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును 19 డిసెంబరు 2025న ఉండవల్లి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఉండవల్లి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మార్గదర్శి ఫైనాన్సియర్ ్స ఎలాంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి రూ.2,500 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు ఆర్బీఐ వాదనలను విస్మరించిందని, కేవలం సాంకేతిక కారణాలను చూపుతూనే కేసును కొట్టివేసిందని తెలిపారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎ్‌ఫ అనేది ‘అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్’ కిందకు వస్తుందని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవని ఆర్బీఐ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా రూ.5.23 కోట్లకు పైగా చెల్లింపులు మిగిలి ఉన్నాయని, కొందరు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడం వల్లే ఇది పెండింగ్‌లో పడిందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర వాదనలు వినిపిస్తూ.. ఇప్పటి వరకు డిపాజిటర్లకు సంబంధించి రూ.2,500 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు వివరించారు. ఎవరూ క్లెయిమ్ చేయని మిగిలిన రూ.5.23 కోట్లను నిబంధనల ప్రకారం ఎస్ర్కో ఖాతాలో జమ చేశామనిచెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని, పబ్లిక్ నోటీసు జారీ చేసి, తదుపరి ప్రక్రియ అంతటినీ పారదర్శకంగా నిర్వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి

హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు. ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్ మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను పరిశీలించాలంటూ సీబీఐకి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు (Rahul Gandhi assets case). రాహుల్ గాంధీ ఆదాయ వనరులకు మించి ఆస్తులు కలిగి ఉన్నార బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తనిఖీ ప్రగతిపై తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈడీ కూడా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. జులై 20న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Rahul Gandhi Supreme Court). రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు (Rahul Gandhi petition). ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఉన్న ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా ఆయన కోరారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఈ పిటిషన్లను ఆగస్టు 17న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించనుంది. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంపొందించేలా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకునిబుర్రా వెంకటేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులతో మాట్లాడిన ఆయన.. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కావడంతో ప్రతి నిర్ణయాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియామక ప్రక్రియలో చిన్నపాటి పొరపాటు జరిగినా దాని ప్రభావం వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.పరీక్షల నిర్వహణలో ఉద్యోగులందరూ ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఛైర్మన్ సూచించారు. ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన వరకు అన్ని దశల్లో ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని అన్నారు. ముఖ్యంగా నియామక ప్రక్రియలో సాంకేతికత వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విధానాలు, డేటా ఆధారిత పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా పొరపాట్లకు తావులేని వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఇటీవల మరో 10 వేల

తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, జాబ్ నోటిఫికేషన్లను ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నామమాత్రంగా చేస్తుందని తెలంగాణాలోని నిరుద్యోగ వర్గాలలో ఒకింత అసహనం ఉంది, దీనిని ప్రతిపక్షాలు వాడుకుంటూ నిరుద్యోగుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈక్రమంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు.ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలుసంగారెడ్డిలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఉద్దేశించి ముఖ్యమైన హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆందోళన వద్దని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడకూడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ప్రస్తుతం పది వేల పోస్టులకు నోటిఫికేషన్లుగత రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం మరో పది వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ఇంకా వయోపరిమితిని రెండేళ్లు సడలించినట్లు చెప్పారు. యువత పరీక్షలకు సిద్ధం కావాలని, హక్కులు కోల్పోకుండా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.నిరుద్యోగ యువత డిమాండ్స్ ఇవే తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగునా అండగా ఉండే యువతను నిర్లక్ష్యం చేయబోమన్నారు.యువత ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దన్నారు. అయితే నిరుద్యోగ యువత మాత్రం అనేక సందర్భాలలో ఆందోళన బాట పడుతున్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్/ఎస్ఐ పోస్టులు 5,000 నుంచి 19,000-20,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్ మెట్రోపై కీలక అప్డేట్.. సీఎం రేవంత్ సూచించిన ఫ్యూచర్ ప్లాన్ ఇదే!వరుస నోటిఫికేషన్ లకు రెడీ అవుతున్న

ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగ పరీక్ష నియామకాలు.. పేపర్ లీక్ లు, విద్యా వ్యవస్థ.. తదితర అంశాలపై యోగ గురు రామ్ దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా యువత ఆందోళనలకు కారణం విద్యావ్యవస్థలో, ప్రభుత్వ పోటీ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలు మాత్రమే కారణం అని అన్నారు. ఇవి విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయని అన్నారు. ఇంటర్వ్యూల సమయంలోనే 90 శాతానికి పైగా అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. కులం, మతం, భావజాలం వంటి వాటి ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించేవారు కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. దాంతో అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ మేరకు పతంజలి యోగపీఠంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారు. విద్యార్థులు, యువత చేపట్టే ఆందోళనలు శృతి మించరాదని స్పష్టం చేశారు.హరిద్వార్ లోని పతంజలి యోగిపీఠంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం యోగ గురు రామ్ దేవ్ బాబా.. జార్ఖండ్ లో జరుగుతున్న జెన్ జీ విద్యార్థుల పోరాటంపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అనేక పాఠశాలలు, కాలేజీల్లో కనీస మౌలిక వసతులు లేవు. టీచర్లు, బుక్స్, ఎలక్ట్రిసిటీ, మంచినీరు లేదా టాయిలెట్స్ అందుబాటులో లేవు అని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. ఒకవేళ ఈ కనీస వసతులు ఉన్నా పరీక్షల్లో అవకతవకలు.. చీటింగ్, పేపర్ లీక్ కారణంగా పరీక్ష వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.. అని రామ్ దేవ్ బాబా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో 90 నుంచి 99 శాతం ఇంటర్వ్యూల వద్దే అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.ఓ వైపు మనం సత్యమేవజయతే అని నినాదాలు చేస్తుంటాం.. మరోవైపు ఉద్యోగాలు డబ్బులకు అమ్మకాలు జరుగుతున్నాయని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా విస్మరించలేమని పేర్కొన్నారు. అలాగే నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను తాను సమర్థించనని

ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు AI స్కిల్స్‌లో శిక్షణ అందించేలా దేశవ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ శిక్షణ ద్వారా యువతకు కొత్త టెక్నాలజీపై అవగాహన పెరగడంతో పాటు భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ప్రధాని కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్థోమత లేని విద్యార్థులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంటి నుంచే శిక్షణ పొందేందుకు ఈ విధానం దోహదపడవచ్చు. దేశంలో క్రీడా ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి అవసరమైన అవకాశాలు కల్పిస్తే భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయవచ్చనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. టెక్నాలజీ రంగంలో భారత్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సెమీకండక్టర్ తయారీపై కూడా ప్రధాని దృష్టి సారించారు. వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 కొత్త సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఆటోమొబైల్, టెలికాం వంటి అనేక

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా రాజమంత్రి ప్రత్యేక కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ పిటిషన్ లో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షా కాల సమావేశాలలో ప్రజా సమస్యలపై గళం వినిపించడానికి తనకు బెయిలు మంజూరు చేయాలని కోరడం ఇప్పుడు రాజకీయవర్గాలలోనే కాకుండా జన బాహుల్యంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రజా సమస్యలపై మాట్లాడటానికి, తన నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పడానికి తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తన బెయిల్ పిటిషన్ లో అభ్యర్థించారు, డిసెంబర్ 2021 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనంత బాబు.. గతంలో సభలో ప్రజా సమస్యలపై ఎంతవరకు గళమెత్తారనే విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన వినిపిస్తున్న వాదన విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే బెయిల్ కావాలని ఆయన అడుగుతుంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నవైసీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది. కేవలం జైలు నుంచి బయటకు రావడం కోసమే ప్రజా సమస్యల నెపంతో బెయిల్ డ్రామాలు ఆడుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అనంతబాబు మండలిలో గళమెత్తిన సందర్భాలు దాదాపు మృగ్యమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి సభలో ప్రజా సమస్యలపై ఏం మాట్లాడుతారని నిలదీస్తున్నారు. మొత్తం మీద అనంతబాబు బెయిలు పిటిషన్ ఇప్పుడు పొలిటికల్

బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన గుర్తింపును ఉపయోగిస్తూ సృష్టించిన అశ్లీల కంటెంట్, ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు, వీడియోలు, నకిలీ ఖాతాలు, ఇంకా అనుమతి లేని ఇతర వినియోగాలపై నిషేధం విధించాలని ఆమె తన పిటిషన్లో పేర్కన్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జాన్వీ కపూర్ కోరిన ఈ ఆంక్షలపై, ముఖ్యంగా ఫ్యాన్ పేజీలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో జస్టిస్ అనూప్ జైరామ్ భంబానీ (Justice Anup Jairam Bhambhani) స్పందిస్తూ... “మీకు అభిమానులు వద్దు అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఇక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఫ్యాన్ పేజీలను కేవలం అక్రమమైనవిగా లేదా చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అభిమానులు నటీనటుల పనిని అభినందించడానికి, వారి చిత్రాలను పంచుకోవడానికి, చివరికి వారిని విమర్శించడానికి కూడా ఫ్యాన్ పేజీలను నిర్వహిస్తుంటారని పేర్కొంది. అయితే, జాన్వీ కపూర్ ఇమేజ్ను దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన అశ్లీల కంటెంట్‌పై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది. జాన్వీ కపూర్ వేసిన ఈ పిటిషన్లో దాదాపు 5,000 కంటే ఎక్కువ వెబ్ పేజీలు, సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. వీటిలో ఏఐ-జెనరేటెడ్ అశ్లీల కంటెంట్, నకిలీ ప్రొఫైళ్లు ప్రధానంగా ఉన్నాయి. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ పేరుతో సాధారణ ఫ్యాన్ యాక్టివిటీని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించలేమని ఈ విచారణ ద్వారా కోర్టు స్పష్టమైన సందేశాన్ని

వయసుకొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదని, వారు తమ జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్రులని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు వెళ్లిన కుమార్తెను తమకు అప్పగించాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మేజర్ అయిన యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కోర్టు సమర్థించింది.నాగ్‌పుర్‌కు చెందిన ఓ యువతి 17 ఏళ్ల వయసులో ట్యూషన్‌కు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి, ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను గుర్తించి తల్లికి అప్పగించారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తన కుమార్తెను ఆ యువకుడు అక్రమంగా నిర్బంధించాడంటూ తల్లి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.విచారణ సందర్భంగా కోర్టు నేరుగా ఆ యువతితో మాట్లాడింది. తాను తన ఇష్టప్రకారమే ఆ యువకుడితో కలిసి ఉంటున్నానని, అతనితోనే జీవించాలనుకుంటున్నానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె మేజర్ అని నిర్ధారించుకున్న న్యాయస్థానం, ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని తెలిపింది. అక్రమ నిర్బంధం రుజువు కాని పక్షంలో హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని స్పష్టం చేస్తూ తల్లి పిటిషన్‌ను నాగ్‌పూర్ ధర్మాసనం కొట్టివేసింది

హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ లీడ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ జెయింట్స్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ వాల్టర్ (28 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 128 పరుగుల టార్గెట్‌ను మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సూపర్‌జెయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించగా, రికెల్టన్ (17) పర్వాలేదనిపించాడు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో గస్ అకిన్సన్ మూడు వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు బాదిన టిమ్ సీఫర్ట్ బ్రైడన్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అతడు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతులను సీఫర్ట్ వరుసగా సిక్సర్లు సంధించాడు. ఇప్పటికే ట్రెంట్ రాకెట్స్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఎలిమినేటర్ పోరు కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూపర్‌జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరులో ముందు వరుసలో ఉంది. ఆగస్టు 15న ఎలిమినేటర్ పోరు, ఆగస్టు 16న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. Read: స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్‌కు షాక్! ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు) ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి విజయ్ సంచలన నిర్ణయం
Allahabad High Court Religion Verdict : వయోజనులైన పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే పరిపూర్ణ హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారనే నెపంతో మేజర్లు అయిన ఇద్దరు కుమార్తెలను ఇంట్లోనే అక్రమంగా బంధించిన ఒక తండ్రి చర్యను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ప్రవర్తించిన సదరు తండ్రితో పాటు బాధితుల హక్కులను కాపాడటంలో విఫలమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు భారీ జరిమానా విధించింది. బాధితులైన ఇద్దరు యువతులకు కలిపి రూ. 25 లక్షల భారీ పరిహారాన్ని తండ్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చెల్లించాలని ఆదేశిస్తూ జస్టిస్ సందీప్ జైన్ సంచలన తీర్పు వెలువరించారు.అసలేం జరిగిందంటే..?తన కుమార్తెలైన దియా భాటియా అలియాస్ జోయా దియా భాటియా (20), అన్షు భాటియా అలియాస్ అమీనా అన్షు భాటియా (35)లను ప్రలోభాలకు గురిచేసి.. బెదిరించి మతం మార్చారంటూ వారి తండ్రి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నెపంతోనే ఆయన వారిని ఇంట్లోనే నిర్బంధించారు. అయితే తమను అక్రమ నిర్బంధం నుంచి విడిపించాలని కోరుతూ బాధిత యువతులు ఇద్దరూ అలహాబాద్ హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సందీప్ జైన్ నేరుగా బాధిత యువతులతో మాట్లాడారు. వారు ఎవరి ఒత్తిడికీ లొంగలేదని, స్వచ్ఛందంగానే మతం మారాలని నిర్ణయించుకున్నారని నిర్ధారించుకున్నారు. దీంతో తండ్రి చేసిన బెదిరింపులు, ప్రలోభాల ఆరోపణలను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది.ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల వాదనను పట్టించుకోకుండా కేవలం తండ్రి చేసిన ఆరోపణలనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆక్షేపించింది. చట్టబద్ధంగా మేజర్లు అయిన యువతులను అక్రమ నిర్బంధం నుంచి విడిపించడంలోనూ.. వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటంలోనూ ప్రభుత్వం పూర్తిగా

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో లయన్స్ క్లబ్ వ్యాసరచన పోటీలు! కర్నూలు: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో “క్రిటికల్ థింకింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనా సామర్థ్యాన్ని, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను ప్రదర్శించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయిక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్ గవర్నర్ రాయపాటి శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్, లయన్స్ క్లబ్ సభ్యులు మురారి శంకర్ అప్ప తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, సోమేశ్, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శ్రీధర్ మూర్తి, బాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం: దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. తాను శాసన మండలి సభ్యుడినని, సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉందని పిటిషన్లో అనంతబాబు పేర్కొన్నారు. మండలి సమావేశాల నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అనంతబాబు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై బుధవారం నాడు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అనంతరం పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నెల 13న ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. వీధి సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. శాసన మండలి సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు జాతీయ విపత్తు నివారణ నిధిపై పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ