
© 2026 nimisham.in

Aug 12 2026 7:10 AM | Updated on Aug 12 2026 7:13 AM
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి సన్రైజర్స్ లీడ్స్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ జెయింట్స్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ వాల్టర్ (28 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు.
దీంతో 128 పరుగుల టార్గెట్ను మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సూపర్జెయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించగా, రికెల్టన్ (17) పర్వాలేదనిపించాడు.
సూపర్జెయింట్స్ బౌలర్లలో గస్ అకిన్సన్ మూడు వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు బాదిన టిమ్ సీఫర్ట్ బ్రైడన్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అతడు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతులను సీఫర్ట్ వరుసగా సిక్సర్లు సంధించాడు.
ఇప్పటికే ట్రెంట్ రాకెట్స్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఎలిమినేటర్ పోరు కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూపర్జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరులో ముందు వరుసలో ఉంది. ఆగస్టు 15న ఎలిమినేటర్ పోరు, ఆగస్టు 16న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.
Read: స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్కు షాక్!
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)
ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
విజయ్ సంచలన నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిష?
కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్?
కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్
ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..?
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.