
© 2026 nimisham.in


Asian Games 2026 : జపాన్‌లోని ఐచి-నగోయాలో వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ 2026 ప్రారంభం కానున్నాయి. తాజాగా క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాయి.
తొలుత మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తరువాత పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నప్పటికి కూడా మహిళల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 22 వరకు జరగనున్నాయి. రూల్స్ ప్రకారం భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 18న ఈ మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్స్ సెప్టెంబర్ 20న, పతకాల కోసం జరిగే మ్యాచ్‌లు సెప్టెంబర్ 22న జరగనున్నాయి.
Hardik Pandya : ఆఫ్‌లైన్‌లో ఉన్నాగానీ.. గర్ల్‌ఫ్రెండ్, కొడుకు, స్నేహితులతో హార్దిక్ పాండ్యా.. ఫోటోలు..
ఇక పురుషుల క్రికెట్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. రూల్స్ ప్రకారం టీమ్ఇండియా సెప్టెంబర్ 28న నేరుగా క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీఫైనల్, ఇక పతకాల కోసం జరిగే మ్యాచ్‌లు అక్టోబర్ 3న జరుగుతాయి.
𝐀𝐢𝐜𝐡𝐢-𝐍𝐚𝐠𝐨𝐲𝐚 𝐢𝐬 𝐫𝐞𝐚𝐝𝐲 𝐟𝐨𝐫 𝐬𝐨𝐦𝐞 𝐨𝐟 𝐀𝐬𝐢𝐚’𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐬𝐭𝐚𝐫𝐬
![]()
The 20th Asian Games will see the women’s tournament get underway on September 17 ~ followed by the men’s competition from September 24!
#AsianGames2026 #ACC pic.twitter.com/bOamnB5sya
— AsianCricketCouncil (@ACCMedia1) September 7, 2026
టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. భారత పురుషుల క్రికెట్ జట్టుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.







