
YS Jagan Mohan Reddy : పాదయాత్రపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకప్రకటన
YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు.
© 2026 nimisham.in

YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు.

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Mohan Reddy: 'పురుషోత్తపట్నం నుంచి ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి.. పోలవరం ఎడమ కాలువలో వదిలి దాన్ని చూపించి పోలవరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చేశాం అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటి?' అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రాకున్నా ప్రచారం మాత్రం వేరే లెవల్ అని తెలిపారు. నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించినది అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్? అని నిలదీశారు. 'సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ, ఇవాళ పోలవరం ఎడమ కాలువ. మీరు మొదలుపెట్టని.. మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే' అని చంద్రబాబు పబ్లిసిటీపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయితే.. ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి అంతా నేనే చేశా అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది' అని వైఎస్ జగన్ విమర్శించారు. 'పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014-19 మధ్య

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఎప్పుడు విడుదల

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధిని పుష్పగుచ్ఛాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేతను స్మరించుకుంటూ వారు అంజలి ఘటించారు.2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2009 సెప్టెంబర్ 2న 'రచ్చబండ' కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 17 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఆయన్ను నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు

పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్‌లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. 2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. కృష్ణా జిల్లా, ఆగస్టు 22: మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. గుడివాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని.. దీంతో నిజం తేలిపోయిందని చెప్పారు. ‘ఓపెన్ డిబేట్‌కు రా.. లేదా అసెంబ్లీకి రా.. నీ అనుమానాలు క్లియర్ చేస్తా అని లోకేశ్ సవాల్ విసిరినా జగన్ నుంచి సమాధానం లేదు’ అంటూ విమర్శించారు. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులు మీడియా ముందు స్పష్టంగా చెబుతున్నా.. అధికారుల దగ్గరకు వెళ్లి ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బిజీ అయితే తమ ప్రతినిధులను పంపి అనుమానాలు తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వాళ్ల పని అంటూ మండిపడ్డారు. సమాధానం చెప్పకుండా తాడు బొంగరం లేని బందర్ పిచ్చోడిని పంపిస్తున్నారని.. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకంలా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని.. నేరస్థులంటే ఆయనకు చాలా ఇష్టమని, పలకరించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని రామయ్య విమర్శించారు. కౌరవుల మాదిరి జగన్ ఎప్పుడూ నేరస్థులు, దొంగలు, విధ్వంసకారుల పక్షమే అని.. అందుకే తల్లి, చెల్లి కూడా తోడు లేరన్నారు. జెన్-జీ అంటూ జగన్ పెట్టే మీటింగ్‌లో గంజాయి బ్యాచ్ ఉంటుంటే... రాష్ట్రంలో నిజమైన జెన్-జీలు లోకేశ్‌కు మద్దతు

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అమరావతి, ఆగస్టు 22: 2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. హత్యలు, దాడులనే నమ్ముకుని పాలిటిక్స్ చేస్తోందని వినిపిస్తోంది

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Shavukaru Janaki RIP: తెలుగు సినీ పరిశ్రమతోపాటు దక్షిణాది సినీ ప్రేక్షులను ఏడు దశాబ్దాల పాటు అలరించిన అందాల నటి.. నట దిగ్గజం షావుకారు జానకి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో మృతిచెందారు. ఆమె మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె మృతికి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు సంతాప ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు' అని కొనియాడారు. 'షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిది' అని తెలిపారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం సంతాప ప్రకటన షావుకారు జానకి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రార్థించారు. షావుకారు జానకి మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీఈప అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు

సాక్షి, తాడేపల్లి: ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్బంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. "నా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు.సర్వమంగళకారిణి లక్ష్మీదేవి అనుగ్రహంతో, ప్రతి ఇల్లు సిరిసంపదలతో సుఖశాంతులతో ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) మీరు అసలు మనుషులా రాక్షసులా.? పసి బిడ్డను చంపేస్తారా.? టీచర్ పై పేరెంట్స్ రియాక్షన్ YSRCP అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్ DSC కుంభకోణంలో సంచలన నిజాలు బయట పెట్టిన అభ్యర్థి రోడ్డు పక్కన కారు.. డిక్కీలో యువతి డెడ్ బాడీ..!

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) 'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు) మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు) బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ ఇదే నా సవాల్... బల్ల గుద్ది ఛాలెంజ్ విసిరిన జగన్ అవినీతి, అక్రమాల కోసమే డీఎస్సీలో శాప్ జోక్యం చేసుకుంది ఇంట్లో దొంగతనం చేసి అక్కడే హాయిగా నిద్రపోయిన దొంగ! ప్రియాంకని ఎందుకు చంపారు..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక

రాష్ట్రంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇదొక చారిత్రాత్మక అడుగు అని కొనియాడారు. ఈ గొప్ప చొరవ తీసుకున్నందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయంపై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు 2019 డిసెంబర్లో ఓ జీవోను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ, నాటి అధికార పార్టీయే కోర్టుకు వెళ్లి నాటకాలడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇదంతా బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించిన యనమల రామకృష్ణుడు... గత ఐదేళ్ల పాలనలో బీసీ సంక్షేమాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినందుకుగాను జగన్ వెంటనే బీసీ వర్గాలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు (బుధవారం) అమరావతి వేదికగా యనమల మీడియాతో మాట్లాడారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్ల నిర్ణయంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ప్రజలను మభ్యపెట్టేందుకే 2019 డిసెంబర్లో ఓ జీవో (GO) జారీ చేశారని యనమల రామకృష్ణుడు ప్రస్తావించారు. రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఉందని తెలిసినప్పటికీ, అప్పుడు అధికారంలో ఉన్న అదే పార్టీ కోర్టుకెళ్లడమనేది హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అలాంటి తీర్పు వచ్చిన తర్వాత కోర్టులో రివిజన్ లేదా రివ్యూ పిటిషన్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు దాఖలు చేయలేదు? అని యనమల ప్రశ్నించారు. జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అని నిలదీశారు. ఇది ఉద్దేశపూర్వకంగా బీసీలను మోసం చేయడమేనని విమర్శించారు. ముందుగా, బీసీల సంక్షేమంపై, తాను నిర్లక్ష్యం చేసినందుకు వారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

తాడేపల్లి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీ తరుఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు తుమాటి మాధవరావు. రేపు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం రేపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సంస్థాగత అంశాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన కేసీ కెనాల్ రైతులు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీ కెనాల్ రైతులు.. వైఎస్ జగన్‌ను కలిశారు. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై వైఎస్ జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయరులో 878 అడుగుల నీరు ఉన్నా సాగునీరు విడుదల చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు. మీ హయాంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నా నీటిని విడుదల చేశారంటూ వైఎస్ జగన్‌కు గుర్తు చేశారు రైతులు. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్

డీఎస్సీ (DSC) అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)తో ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మరోసారి స్పష్టం చేశారు. జగన్ తన సవాల్‌ను స్వీకరించే వరకు తాను ఎదురుచూస్తున్నాననే భావనతో ఆయన ‘ఎక్స్’ (X) వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం ఉదయం లోకేశ్ చేసిన ఈ పోస్టులో ఓ ఫన్నీ మీమ్‌ను కూడా జత చేశారు. డీఎస్సీపై జగన్‌తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూ వరుసగా రెండో రోజు సవాల్ విసరడం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే నెటిజన్ల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. పలువురు రీపోస్టులు చేయగా, వేలాది మంది లైకులు కొట్టారు. మరికొందరు కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. డీఎస్సీ నియామకాలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై వైసీపీ అధినేత చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లోకేశ్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన జగన్‌కు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. గతంలో కూడా పలుమార్లు ఇదే విధంగా ఆహ్వానించినప్పటికీ జగన్ స్పందించలేదని మంత్రి ఆరోపించారు. అసెంబ్లీ లోపలైనా, బయటైనా చర్చకు సిద్ధమని లోకేశ్ చెబుతుండటంతో ఈ వ్యవహారం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను లోకేశ్ సమర్థిస్తుండగా, మరోవైపు డీఎస్సీపై వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు నేరుగా సమాధానం చెప్పేందుకు ఆయన సిద్ధపడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లోకేశ్ వరుస సవాళ్లపై జగన్ నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష స్పందన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు స్పందించారు. తమ పార్టీ అధినేత

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Assembly Session Today Agenda: ఆంధ్ర ప్రదేశ్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ సమావేశం కానుంది. ఈ భేటిలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది. అనంతరం వాటిని సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు శాసన సభ..ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానుంది. వడ్డీ లేని రుణ పరిమితి పెంపుతో పాటు స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు.. కొబ్బరి తోటల పరిస్థితి.. ఉన్నతి పథకం .. కాఫీ రైతులకు పరిహారం.. రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు ... విశాఖలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు.. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై సభ్యుల ప్రశ్నలుండన్నాయి. ఇక వెనకబడిన వర్గాలు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. అటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామిని కూడా క్యాబినేట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 24.15 శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి. వాటిని మరో 9.75 శాతం పెంపు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు.. అటు మున్సిపల్ కార్పోరేషన్లకు సంబంధించిన మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే బిల్లుకు క్యాబినేట్ ఆమోదం తెలిపి ఉభయ

"గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి సవాల్ విసురుతున్నా. డీఎస్సీ-2025పై చర్చకు నేను సిద్ధం. సభ లోపలైనా, బయటైనా సరే.. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి" అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో సుదీర్ఘ ప్రకటన చేసిన ఆయన, ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను బెయిల్‌పై లేనని, తనపై సీబీఐ, ఈడీ కేసులు లేవని, విదేశాలకు వెళ్లేందుకు తనకేమీ కోర్టు అనుమతులు అవసరంలేదని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుతాయని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని లోకేశ్ గుర్తుచేశారు. ఈ నియామక ప్రక్రియను కేవలం 148 రోజుల్లో పూర్తి చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, టీసీఎస్ అయాన్ వంటి సురక్షిత ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఈ డీఎస్సీని అడ్డుకోవడానికే వైసీపీ నాయకులు 141 కేసులు వేశారని, సీఎం తొలి సంతకం అమలు కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నారని ఆరోపించారు.ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రిమెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నపత్రం లీక్ అయిందన్నది అవాస్తవమని, 42 వేల ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్‌గా ప్రశ్నలు వస్తాయని, లీకేజీకి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రశ్నపత్రం

సాక్షి,తాడేపల్లి: పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పాలన ఏ స్థాయిలో కుప్పకూలిందో ఈ ఘటనే నిదర్శనం అంటూ ఫైరయ్యారు. చంద్రబాబూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించిన జగన్.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి?. ఎవరికి ఫిర్యాదు చేయాలి?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం (ఆగస్టు 17) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హే రామ్…! గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? చంద్రబాబు.. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది. ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Monsoon Assembly Session: ఆంధ్ర ప్రదేశ్ వర్షకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. గతంలో మాదిరే వైసీపీ అసెంబ్లీకి రాకూడదనే నిర్ణయం తీసుకుంది. శాసనసభలో తగినంత బలం లేనందున తమ వాదనలు వినిపించుకోరనే ఉద్దేశ్యంతో అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు ఏపీ శాసన మండలిలో తగిన బలం ఉన్నందున అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందకు వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపణ నేపథ్యంలో ఈ సారి సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ , శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను దిశా నిర్ధేశం చేశారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో డిజిటల్ పాసులు.. కాగా ఈ సారి అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులకు డిజిటల్ పాస్‌లు జారీ చేశారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ప్రవేశం, నిష్క్రమణల వద్ద పాసుల స్కానింగ్ చేసిన తర్వాతే లోపలకి అనుమతిస్తారు. అంతేకాదు వెళ్లిటపుడు కూడా స్కానింగ్ చేయడం ద్వారా ఎవరు అసెంబ్లీ, మండలిలో ఎంత సేపు గడిపారనే విషయాన్ని నిర్ధారించుకోనున్నారు. ఎవరు వచ్చారు. ఎవరు వెళ్లారనే దానిపై క్లారిటీ కోసమే వీటిని జారీ చేయనున్నారు. అంతేకాదు మరోవైపు ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపర్చనున్నారు. అయితే, వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.మరోవైపు, ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికారపక్షం తన వాదనను వినిపించనుంది.స్పీకర్ ఆహ్వానం.. వైసీపీ తిరస్కరణసమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే, సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ నియోజకవర్గాల వాణిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యత అని, జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో, అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించి, తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించడం గమనార్హం.మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ శాసనసభ్యులతో ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత పాలనా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ‘మనవాడా.. కాదా’ అని చూసి సంక్షేమ పథకాలను అందించే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులపై కేసులు పెడుతున్న తీరు మళ్లీ బ్రిటీష్ పాలనను తలపిస్తోందని, మన పూర్వికులు ప్రాణాలర్పించి తెచ్చిన స్వాతంత్ర్య స్ఫూర్తి ఇదేనా అని నిలదీశారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ఓటు వేసినా, వేయకపోయినా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నిజమైన పరిపాలన అని బొత్స స్పష్టం చేశారు. జగన్ హయాంలో విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేదరికం లేని సమాజ స్థాపన కోసం పాలన సాగిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే అని భావిస్తోందని... పేదలకు విద్య, వైద్యం అందించడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Monsoon Assembly Session: ఈనెల 17 నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సారి సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి ఈ సారి కూడా హాజరుకాకూడదని ప్రతిపక్ష YSRCP నిర్ణయించింది. కేవలం మండలి సమావేశాలకు మాత్రమే హాజరవుతామంటోంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను ఆదేశించారు. కాగా ఈ సారి అసెంబ్లీ ఆవరణలో డిజిటల్ పాస్‌లు జారీ చేయనున్నారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద పాసుల స్కానింగ్ అనంతరమే ఎవరినైనా అనుమతిస్తారు. మరి ఈ సారి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఎల్లుండి జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సారి కొన్ని కీలకమైన బిల్లును పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సభలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయా బిల్లులు పాసయ్యే అవకాశాలున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు. దేశ నిర్మాణానికి మూలస్తంభాలైన ప్రజాస్వామ్య సూత్రాలకు మనమందరం పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు."ఈ 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ, మన గొప్ప దేశాన్ని నిర్మిస్తున్న ప్రజాస్వామ్య విలువలకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని, ఉజ్వలమైన, సమ్మిళితమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం మనమందరం కృషి చేయాలి" అని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. 'జై హింద్' అంటూ తన సందేశాన్ని ముగించారు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనలు చేపట్టిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.జగన్ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ, వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా భారీ ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఈ నిబంధనల అతిక్రమణపై స్పందించిన పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే, పర్యటనలో భాగంగా దిష్టిబొమ్మను దహనం చేసిన వైసీపీ నేత సుభాష్ చంద్రబోస్ సహా ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది.వీటితో పాటు, "గంగమ్మ జాతర" ప్లకార్డులను ప్రదర్శించిన కొందరు కార్యకర్తలను కూడా ఈ కేసుల్లో చేర్చారు. పర్యటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన మరికొంత మందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి

ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, కనీసం డీఎస్సీ నోటిఫికేషన్ వేయని వైసీపీ నేతలు ఇప్పుడు డీఎస్సీ అక్రమాల పేరుతో నిత్యం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు ప్రజా సమస్యలపై నిజంగా గౌరవం, ధైర్యం ఉంటే సభకు దూరంగా ఉండటం మాని వెంటనే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విషం చిమ్ముతోందని యరపతినేని మండిపడ్డారు. ఎంపికైన డీఎస్సీ విజేతలు స్వయంగా వచ్చి నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా జరిగిందని చెబుతున్నా ప్రతి విషయాన్ని చెడుగా చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నాయకత్వంలో ఇంకా మార్పు రాకపోవడం విచారకరమన్నారు. నిత్యం శవ రాజకీయాలు చేస్తూ పరామర్శల పేరుతో వ్యవస్థలను, పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ హయాంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన వైసీపీ నేతలు, కూటమి ప్రభుత్వంపై అలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దళిత వర్గానికి చెందిన మహిళా హోం మంత్రిని అవమానించడం రాజకీయ సంస్కారానికే మచ్చ అని అన్నారు. నంద్యాలలో నాడు చంద్రబాబును కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిన చరిత్ర ఉన్న జగన్, ఇప్పుడు తమ పార్టీ నేత విరూపాక్షికి నోటీసులు ఇవ్వాలని చెప్పడం ఆయన ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి పోకడలు పోతున్న వైసీపీ త్వరలోనే రాజకీయాల నుంచి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని యరపతినేని వ్యాఖ్యానించారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఐదేళ్లు డీఎస్సీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈరోజు(శుక్రవారం) గుంటూరు జిల్లా వేదికగా యరపతినేని మీడియాతో మాట్లాడారు. మంచిని చెడుగా చూపడం వైసీపీ నైజంగా కనిపిస్తోందని యరపతినేని విమర్శించారు. డీఎస్సీ విజేతలు స్వయంగా వచ్చి అంతా సజావుగా జరిగిందని చెప్పారని ప్రస్తావించారు. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధిపై వైసీపీ విషం చిమ్ముతోందని ఆగ్రహించారు. వైసీపీ వంటి రాజకీయ పార్టీ ఉండటం ఏపీకి దురదృష్టమని చెప్పారు. వై నాట్ 175 నుంచి 11 సీట్లు వచ్చినా వారిలో ఆలోచన రావటం లేదని విమర్శించారు. వైసీపీ నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రోజూ ఎక్కడ శవం దొరుకుతుందా అని వారు ఎదురు చూస్తున్నారని యరపతినేని సెటైర్లు గుప్పించారు. పరామర్శ పేరుతో వ్యవస్థలు ధ్వంసం చేసి, ప్రజలను పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా అని నరికి 11కు వచ్చారని.. ఇంకా ఏం నరుకుతారని యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, పాపాలు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నివేదిక ద్వారా బట్టబయలయ్యాయని, వీటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. గురువారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిట్ నివేదికలో వెలుగు చూసిన వాస్తవాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు.సిట్ నివేదిక ప్రకారం, వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొన్న 158 మంది వాల్యుయేటర్లలో కేవలం 72 మందికి మాత్రమే అర్హత ఉందని, మిగిలిన వారంతా అనర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. అధికారిక వ్యవస్థను కాదని, ప్రైవేట్ జీమెయిల్ ఖాతాలు, వ్యక్తిగత ఐడీలు, డ్రైవ్‌ల ద్వారా వాల్యుయేషన్ నిర్వహించడం దారుణమని అన్నారు. అంతేకాకుండా, అభ్యర్థుల ఆన్సర్ షీట్లను ఓ ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించి, సీసీ కెమెరాలు గానీ, యూనివర్సిటీ నిపుణుల పర్యవేక్షణ గానీ లేకుండా 86 రోజుల పాటు అక్కడే ఉంచి మూల్యాంకనం జరిపారని ఆరోపించారు.ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 160 మంది (96.97 శాతం) ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు జరిగాయని, మొత్తం 736 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తే 97.55 శాతం షీట్లలో దిద్దుబాట్లు కనిపించాయని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో వైట్నర్ వాడకం, సంతకాలు సరిపోకపోవడం, ఒకే పేపర్లో రెండు రకాల ఇంక్ వాడటం, చీఫ్ ఎగ్జామినర్ సంతకాలలో తేడాలు వంటి అనేక అక్రమాలు తేలాయని వివరించారు. ఇవి

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో చర్చించిన కీలక అంశాలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. డీఎస్సీ నియామకాల స్పోర్ట్స్ కోటాలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆధారాలున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బొత్స ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, ఈ అంశంపై శాసనమండలిలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా సీఎం చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు, ప్రజా సమస్యలన్నింటినీ అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతామన్నారు. 40 శాతం ఓటు షేర్ సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు. చట్టసభల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు
.webp)
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..! ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వహణ వేళ రాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ శాసనసభాపక్ష (వైసీపీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. చట్టసభల్లో ప్రతిపక్షంగా తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితోనే శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ, శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) సమావేశాలకు మాత్రం విధిగా హాజరుకావాలని వైఎస్సార్సీపీ తీర్మానించింది. మండలి వేదికగానే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ప్రజా సమస్యలపై నిలదీయాలని నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అదేవిధంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా వైఎస్సార్సీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ కీలక వర్గాలు స్పష్టం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి నడుమ తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. చట్టప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైఎస్సార్సీపీ నాయకులు మొదటి నుంచీ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, శాసనసభలో సంఖ్యాబలం ప్రకారం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని అధికార పక్షం తేల్చిచెబుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీని బహిష్కరించి, తమకు మెజారిటీ ప్రాతినిధ్యం ఉన్న శాసనమండలి వేదికగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. వైఎస్సార్సీపీ వైఖరిపై అధికార కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా సభను బహిష్కరించడం

సాక్షి, అమరావతి: రేపు ( బుధవారం) వైఎస్సార్సీపీ శాసన సభ పక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ఆడపిల్లలు సవాల్ చేస్తుంటే ముడుచుకున్నావ్ లోకేష్ పరువు తీసేసిన RK రోజా ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు.. కూటమి నేతలకు బొత్స వార్నింగ్ నిన్ను సొంత అన్న అనుకున్న.. మా చావుకు కారణం నువ్వే చింతమనేనిపై రెచ్చిపోయిన బాధితులు

రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు వెంటిలేటర్‌పై పడేసిన వాళ్లకు, తాడేపల్లి ప్యాలెస్ దాటని మాజీ సీఎం జగన్‌కు ఆక్వా రైతుల కష్టాల గురించి మాట్లాడే హక్కే లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీతో ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తుకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి ఊపిరి పోస్తూ రూ.1,150 కోట్ల విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన జీవోను మంత్రి విడుదల చేశారు. పాలకొల్లులో ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజులతో కలిసి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆక్వారంగం అనేది సీఎం చంద్రబాబు నాయుడి మానసపుత్రిక అని అభివర్ణించిన ఆయన, ఐదు కోట్ల ఆంధ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్లనే చంద్రబాబు వంటి దార్శనిక నేత దక్కారని కొనియాడారు. 2019లో ప్రజలు ఆవేశపడి దోపిడీదారులకు అధికారం కట్టబెట్టడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఐదేళ్లపాటు తీవ్ర ఐసీయూ స్థితిలోకి వెళ్లిందని, నాటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు జగన్ ప్రతి చిన్న విషయాన్నీ సమస్యగా చిత్రీకరించే చవకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతటి నిధుల కొరత ఉన్నప్పటికీ ఆక్వా రైతులను ఆదుకోవాలనే ఏకైక సంకల్పంతో ఈ భారీ విద్యుత్ సబ్సిడీని సకాలంలో విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీతో పాటు, చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను సైతం ఈ 26 నెలల స్వల్ప వ్యవధిలోనే నెరవేర్చామని గర్వంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాయంతో ఏపీ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని, రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మారుస్తూ ‘బ్లూ ఎకానమీ’ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నామని చెప్పారు

రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు రాయలసీమను గాలికొదిలేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనల పేరుతో తీర్థయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "వంద పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి చెందుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, వారి మాయమాటలను సీమ ప్రజలు ఇక నమ్మరని హెచ్చరించారు.ప్రాజెక్టులు కొట్టుకుపోతే ఏమయ్యారు?వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయి వందలాది కుటుంబాలు వీధిన పడినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు యాత్ర చేయలేదని భూమిరెడ్డి ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అప్పుడే తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. గోరకల్లు, అలగనూరు రిజర్వాయర్ల కట్టలు కుంగిపోయినా కనీసం మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని, వీటిపై వైసీపీ నేతలు ఎందుకు పాదయాత్రలు చేయలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ రైతుల కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తుంటే, వైసీపీ నాయకులు నానాయాగీ చేస్తున్నారని విమర్శించారు.ఒక్క కలం పోటుతో 102 ప్రాజెక్టులకు అడ్డుకట్టరాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం గత టీడీపీ

ఎస్ఐ ప్రవళ్లిక కేసులో ఒకరిని తొలగిస్తూ కోర్టుకు మెమో సమర్పించిన పోలీసులు ఆయన పంజాబ్ యూనివర్సిటీలో కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలతో నిర్ధారణ టీడీపీ నేతల మాటల విని తప్పుడు కేసులు, సెక్షన్లు పెట్టి అబాసుపాలైన పోలీసులు శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే. ప్రజల్లో అబాసుపాలు.. టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్‌కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్‌కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్లో లొంగిపోతున్నట్లు సమాచారం. మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు.. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు. మచిలీపట్నం, ఆగస్టు 11: బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు. రౌడీలు, గంజాయి బ్యాచ్‌తో ఈ ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. వైసీపీ నిర్వహించిన దీక్షలు, బైక్ ర్యాలీలలో ఎక్కడా కూడా రైతులు, విద్యార్థులు పాల్గొన లేదన్నారు. యువతను నిర్వీర్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించడం సిగ్గు చేటు అని వైసీపీ నేతల తీరుపై పేర్కొన్నారు. ఐదేళ్ల అధికారంలో ఒక్క మెగా డీఎస్సీ అయినా నిర్వహించారా..? అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. వైసీపీ పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాలకు ప్రజలు ఎవ్వరూ రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామని చెప్పారు. నెల నెల పెన్షన్లు ఇస్తున్నాం.. తల్లికి వందనం ఇచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం.. గామన్ బ్రిడ్జ్ వద్ద కలకలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, స్వయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఆయన 'భారత్ జన వికాస్' పేరుతో నూతన వేదికను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఆగస్టు 15న శ్రావణ మాసం వేళ ఈ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ఆయన ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటారని విస్తృత ప్రచారం జరిగింది. వ్యవసాయం చేసుకుంటానని ఆ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, అనూహ్యంగా తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన సంకేతాలు పంపారు. దీంతో ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారని లేదా బీజేపీలో చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా ఆయన సొంత కుంపటి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా, ఆయనకు బీజేపీ అగ్రనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీతో ఆయన ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తన పార్టీని సమర్థవంతంగా నడపడానికి ఆయన కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ పార్టీ ప్రధానంగా యువత, మహిళలు, రైతులు మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని సమాచారం. ప్రస్తుత అధికార కూటమికి మరియు ప్రతిపక్ష వైసీపీకి ఈ వర్గాలు ఓటు బ్యాంకు పరంగా చాలా కీలకం. ఫలితంగా, విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఈ రెండు ప్రధాన పార్టీల ఓట్లను ఎంతవరకు చీల్చగలదనే అంశంపై ఆసక్తి నెలకొంది. పార్టీ ప్రకటన తర్వాత ఆయన ప్రాంతీయ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాబోయే వారంలో ఆయన పార్టీ విధివిధానాలు, జెండా, మరియు అజెండాపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. రాజకీయ వ్యూహకర్తగా పేరున్న విజయసాయి రెడ్డి, ఈ కొత్త