
నల్ల మిరియాలు, క్లోవ్స్ మరియు దాల్చిన చెక్కకు FSSAI సిఫార్సు చేసిన పరీక్షలు
నల్ల మిరియాలు, క్లోవ్స్ మరియు దాల్చిన చెక్కకు FSSAI సిఫార్సు చేసిన పరీక్షలు
© 2026 nimisham.in

నల్ల మిరియాలు, క్లోవ్స్ మరియు దాల్చిన చెక్కకు FSSAI సిఫార్సు చేసిన పరీక్షలు

ఫుడ్ ఫర్మ్స్పై FSSAI కొరడా.. 2 ఫుడ్ ఫర్మ్స్ లైసెన్స్ సస్పెండ్!

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన

దేశంలో మద్యం ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఓల్డ్ మాంక్ (Old Monk). దశాబ్దాలుగా లిక్కర్ మార్కెట్ లో తన మార్కును చాటుకుంటున్న ఈ బ్రాండ్ లేబుల్‌పై త్వరలోనే ఓ పెద్ద మార్పు రాబోతోంది. బాటిల్‌పై దర్జాగా కనిపించే 7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్ అనే ట్యాగ్‌లైన్‌ను తీసివేయడానికి దీని తయారీ సంస్థ మోహన్ మీకిన్ అంగీకరించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఈ ప్రకటన ఉందంటూ బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ దిగొచ్చింది.ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ - FSSAI లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బాటిల్లో ఉన్న మద్యంలో అసలైన రమ్ స్పిరిట్ కేవలం 2 నుంచి 5 శాతం మాత్రమే ఉంచి, మిగిలినదంతా సాధారణ స్పిరిట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు 7 ఏళ్ల నిల్వ అని ఎలా రాస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 7 ఏళ్లు అంటే ఏడేళ్లే ఉండాలి.. అంతేకానీ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలోనే ఫస్ట్ టైమ్.. లిక్కర్ రేట్లు తగ్గింపుబూతద్దం పెట్టి చూసినా కనపడని అక్షరాలు!కేవలం వయసు అని రాసిన ముద్రణ మాత్రమే కాకుండా.. రుచి, సువాసన కోసం కలిపే ఫ్లేవర్ల వివరాలను బాటిల్‌పై చాలా చిన్న అక్షరాలతో ముద్రించడంపై కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. నేను బూతద్దం పెట్టి మరీ బాటిల్ మూలమూలలా వెతికినా ఆ ఫ్లేవర్ల వివరాలు నాకు కనిపించలేదు అని పేర్కొన్నారు. దీంతో నాణ్యత, ముద్రణ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం- కొత్తగా 121 ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు ఎంట్రీ, ధరలు..!!మహారాష్ట్రలో అమ్మకాలపై నిషేధం!ఈ వివాదం కారణంగా మహారాష్ట్రలో ఓల్డ్ మాంక్ బ్రాండ్ పరిధిలోని కొన్ని వేరియంట్ల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. దీనిపై ఊరట నివ్వాలని కంపెనీ కోరగా, బాంబే హైకోర్టు నిరాకరించింది. ఇరువైపులా ఉన్న
భారతదేశంలో పండ్లు, కూరగాయలలో పురుగుమందుల అవశేషాలపై నిర్వహించిన జాతీయస్థాయి పరిశోధనల్లో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. ఎక్కువ పురుగుమందు అవశేషాలు ఉన్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2023 నుంచి 2026 మధ్యకాలంలో సేకరించిన నమూనాలను పరిశీలించగా.. అనుమతించిన గరిష్ఠ పరిమితి కంటే ఎక్కువగా పురుగుమందుల అవశేషాలునమోదైన కేసుల్లో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించిన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన 8,198 నమూనాల్లో 486 నమూనాల్లో అంటే సుమారు 5.9 శాతం రసాయనాలు నిర్దేశిత పరిమితులను మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవెల్ (MPRNL) ప్రాజెక్టు కింద ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పరీక్షించిన 70,652 నమూనాల్లో 3.1 శాతం మాత్రమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిమితిని మించగా.. తెలంగాణ సగటు ఏకంగా 5.9 శాతంగా నమోదు కావడం ఆహార భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ జాబితాలో కర్ణాటక 3.6 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో మోతాదు మించిన అవశేషాలు ఏవీ నమోదు కాకపోవడం గమనార్హం.తెలంగాణలో వ్యవసాయంలో క్రిమిసంహారకాల వినియోగం విపరీతంగా ఉండటమే ఈ తీవ్రమైన పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఐసీఏఆర్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో హెక్టారుకు సగటున 0.530 కిలోల టెక్నికల్ గ్రేడ్ పురుగుమందులు వాడుతున్నారు. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. క్లోర్‌పైరిఫాస్, డైమెథోయేట్, కార్బోఫ్యూరాన్ మరియు 2,4-D వంటి ప్రమాదకర రసాయనాలను నిబంధనలకు విరుద్ధంగా పంటలపై ఎక్కువగా పిచికారీ చేస్తున్నారు.ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్య రంగానికి చెందిన నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాధాల వెల్లడించిన వివరాల ప్రకారం.. వీటి బారిన పడటం వల్ల నాడీ సంబంధిత సమస్యలు

ఆహార పదార్థాల ఉత్పత్తి కంపెనీల కోసం ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆ పదార్థాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రజలకు రికమెండ్ ... ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ కఠిన మార్గదర్శకాలు తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆహార పదార్థాల ఉత్పత్తి కంపెనీల కోసం ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆ పదార్థాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రజలకు రికమెండ్ చేయాలని భారత ఆహార భద్రత, ప్రమానాల నిర్ణాయక సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆదేశాలు జారీచేసింది. ఒక ఆహార పదార్థం గురించి వాణిజ్యపరంగా ప్రచారం చేసేముందు దాని తయారీకి ఉపయోగించిన పదార్థాలు, వాటి మోతాదులు, దానిని తింటే కలిగే ప్రయోజనాలు, నష్టాలు తదితర సకల వివరాలను ప్రచారకులు కచ్చితంగా తెలుసుకొని ఉండాలని స్పష్టంచేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గురువారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కంపెనీలు తమ ఉత్పత్తుల గురించి చెప్తున్న వివరాలన్నీ నిజమేనా.. కాదా? అన్నది ముందుగానే నిర్ధారించుకోవాలని సూచించింది. ఆహార పదార్థాల గురించి ఏమీ తెలియకుండానే ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక చిహ్నాలు అవసరంలేదు తినటానికి సిద్ధంగా ఉండే ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక చిహ్నాలు ముద్రించటానికి ఆహార పరిశ్రమ వర్గాలు సిద్ధంగా లేవని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ తెలిపింది. అందుకు బదులుగా ఒక మనిషికి రోజుకు ఎంతమేర పౌష్టికాహారం అవసరమనే వివరాలతో ఒక పట్టిక ఇస్తే సరిపోతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఆ పట్టికలో ఒక మనిషికి రోజుకు ఎంత పంచదార, ఉప్పు, కొవ్వుల వంటివి అవసరమనే వివరాలు ఉంటాయని తెలిపింది. ఈ అఫిడవిట్‌ను ‘న్యూట్రిషన్ అడ్వొకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్’ (నాపి) తీవ్రంగా వ్యతిరేకించింది. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు.. అనుమతి లేకుండా ర్యాలీ

అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్లపై లేబుల్స్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక చేసింది. ఇంటర్నెట్ డెస్క్: అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్లపై లేబుల్స్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక చేసింది. 'మీరు చేయలేకపోతే మేమే చేస్తాం' అంటూ కేంద్రానికి తేల్చి చెప్పింది. ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో కార్పొరేట్ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టం చేసింది (Supreme Court Food Labelling). జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల గురించి అవగాహన కలిగించేందుకు ప్యాకెట్ల ముందు భాగంలో స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయంలో ఆహార పరిశ్రమ అభ్యంతరాలను మాత్రమే ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిగణనలోకి తీసుకుందన్నారు (Salt Sugar Warning Labels). ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక గుర్తులకు బదులుగా అదనపు చక్కెర, సంతృప్త కొవ్వులు, ఉప్పు మొదలైన వాటిని రోజుకు ఎంతో తీసుకోవచ్చో పట్టిక రూపంలో చూపించే విధానాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. అయితే ఈ విధానం వినియోగదారులకు అవసరమైనంత అవగాహన అందించదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని, ఇప్పటివరకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది (Packaged Food India). హెచ్చరిక లేబుల్స్ వల్ల ఉత్పత్తుల విక్రయాలపై ప్రభావం పడుతుందని తయారీదారులు అభ్యంతరం వ్యక్తం

కర్ణాటకలోని బెంగళూరులోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆహార భద్రతా అధికారులు వరుస దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆహార భద్రతా అమలు డ్రైవ్‌లో భాగంగా, కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ వరుసగా రెండో రోజూ (ఆగస్టు 12) బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట రోడ్డులోని సకలవరలో ఉన్న జొమాటో గిడ్డంగిలో ప్రత్యేక తనిఖీ నిర్వహించింది. అక్కడి గిడ్డింగిని సీజ్ చేసి నోటీసులు జారీ చేసింది. అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనల కారణంగా బెంగళూరులోని జెప్టో (Zepto) వేర్హౌస్ను సీల్ చేసిన మరుసటి రోజే, అధికారులు బెంగళూరు బ్యానర్‌ఘట్ట రోడ్డులో ఉన్న జొమాటోకు చెందిన 'హైపర్‌ప్యూర్' (Hyperpure) వేర్‌హౌస్‌లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం జెప్టో వేర్హౌస్ను తనిఖీ చేసిన సమయంలో అక్కడ చెత్తాచెదారం, తీవ్రమైన అపరిశుభ్రత, లేబులింగ్‌లో లోపాలతోపాటు FSSAI నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. దీంతో ఆ వేర్హౌస్ను సీల్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. FSSAI లైసెన్స్ నంబర్ లేకుండా సుమారు 146 కిలోల చికెన్‌ను గుర్తించారు. అలాగే, చెల్లుబాటులో లేని FSSAI లైసెన్స్ ఉన్న ఒక తయారీదారుకు చెందిన 40 కిలోల వెల్లుల్లిని కూడా అధికారులు గుర్తించారు. ఇంకా ఈ తనిఖీలో 300 కిలోల ప్యాక్ చేసిన బియ్యం, 20 కిలోల డ్రై ఫ్రూట్స్ , 15 కిలోల మసాలాపై తప్పుడు లేబులింగ్ ఉన్నట్లు కూడా కనుగొనబడింది. ఉత్పత్తి లేబులింగ్ నిబంధనల ప్రకారం అవసరమైన విధంగా రిఫ్రిజిరేషన్‌లో నిల్వ ఉంచకుండా ఉన్న 10 కిలోల దిగుమతి చేసుకున్న ముల్లంగి ఊరగాయను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఆహార భద్రతా అధికారులు తనిఖీ సందర్భంగా తదుపరి పరిశీలన కోసం ఐదు చట్టబద్ధమైన నమూనాలు, 35 సర్వే నమూనాలతో సహా 40 నమూనాలను సేకరించారు. ఇదీ చదవండి: జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...! జెప్టో స్పందన నిబంధనల ఉల్లంఘనలపై స్పందించిన జెప్టో ప్రతినిధి

పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వినియోగంపై భారత ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్ మసాలాను ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్లతో ప్యాక్ చేయకూడదు. ఈ మేరకు చేసిన సవరణలను ప్రభుత్వం ఇటీవలే గెజిట్‌లో ప్రచురించింది.కొత్త నిబంధనల ప్రకారం పేపర్, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్ లేదా సహజంగా లభించే ఇతర పదార్థాలతో పాన్ మసాలాను ప్యాక్ చేయొచ్చు. అయితే వాటిలో ఎలాంటి ప్లాస్టిక్ ఉండకూడదు. పాలిథిలీన్, పాలీప్రొపైలీన్, పాలిస్టర్, పీవీసీతో పాటు ఇతర సింథటిక్ పాలిమర్లు, కోపాలిమర్లు, లామినేట్లను కూడా ఉపయోగించరాదు.పేపర్ ప్యాకేజింగ్‌లో లోపల ప్లాస్టిక్ లేదా మెటలైజ్డ్ పొర ఉన్నా కొత్త నిబంధనలకు అనుగుణంగా పరిగణించరు. పాన్ మసాలా ప్యాకేజింగ్‌కు టిన్, గాజు కంటైనర్లను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతించింది.ఈ నిబంధనలు గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కేవలం దాని ప్యాకేజింగ్‌కు ఉపయోగించే పదార్థాలపై ఆంక్షలు విధించింది.ఏప్రిల్ 28న ఎఫ్ఎస్ఎస్ఏఐ ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. 60 రోజుల పాటు అభిప్రాయాలను స్వీకరించింది. వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనలను ప్రకటించింది

దేశీయ మద్యం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తూ ప్రముఖ లిక్కర్ తయారీ సంస్థ ‘డయాజియో ఇండియా’ (యూనైటెడ్ స్పిరిట్స్)తో పాటు పలు ప్రముఖ కంపెనీలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, పక్కదోవ పట్టించే లేబులింగ్, నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ ఫ్లేవర్లు ఉపయోగిస్తున్నారనే ఆధారాలతో కఠిన చర్యలు చేపట్టింది. డయాజియోకు చెందిన అత్యధిక విక్రయాలు కలిగిన రాయల్ ఛాలెంజ్ విస్కీని ‘అమెరికన్ ఓక్ కాస్క్’లలో మెచ్యూరేషన్ చేసినట్లు కంపెనీ లేబుల్‌పై ప్రచారం చేసుకుంటోంది. అయితే, అందులో సింహభాగం నాన్-మెచ్యూర్డ్ గ్రెయిన్ న్యూట్రల్ స్పిరిట్, నీరు మాత్రమే ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ విచారణలో వెల్లడైంది. ఇది వినియోగదారులను పక్కదోవ పట్టించడమేనని రెగ్యులేటర్ తేల్చిచెప్పింది. బ్లెండెడ్ ఆల్కహాల్‌పై ఏజింగ్ (తయారైన తేదీ-వయసు) పేర్కొనేటప్పుడు మిశ్రమంలోని అత్యల్ప వయసుగల స్పిరిట్‌నే ప్రామాణికంగా తీసుకోవాలనే నిబంధనను కూడా కంపెనీ పాటించలేదని స్పష్టం చేసింది. సహజసిద్ధమైన మాల్ట్ లేదా మోలాసెస్ ప్రక్రియ ద్వారా కాకుండా.. విస్కీలో విస్కీ ఫ్లేవర్, రమ్‌లో రమ్ ఫ్లేవర్ వంటి కృత్రిమ (ఆర్టిఫిషియల్) సువాసనలను నేరుగా కలపడం నియమావళికి విరుద్ధమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. దీంతో రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, బాగ్‌పైపర్, ఓల్డ్ మాంక్ వంటి బ్రాండ్ల నిర్దిష్ట బ్యాచ్‌ల విక్రయాలపై ఆంక్షలు విధించింది. మరోవైపు సురక్షిత గుర్తింపులు లేని రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించినట్లు గుర్తించి సుమారు 18,000 బాక్సుల పరిమాణంలో ఉన్న సీసాలను బెంగళూరు కేంద్రంలో అధికారులు క్వారంటైన్/సీజ్ చేశారు. 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) నీకు దమ్ముంటే నీ కొడుకుని రాజీనామా చేయమని చెప్పు మా జగనన్న సీఎం అయ్యాక.. ఫస్ట్ ఓపెన్ చేసేది DSCఫైలే.. పేర్ని కిట్టు వార్నింగ్

భారతదేశంలో దశాబ్దాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన డార్క్ రమ్ బ్రాండ్ 'ఓల్డ్ మాంక్' తీవ్ర వివాదంలో చిక్కుకుంది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, లేబుళ్లపై తప్పుదారి పట్టించే సమాచారం వంటి కారణాలతో ఈ బ్రాండ్‌కు చెందిన కొన్ని వేరియంట్ల అమ్మకాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిషేధించింది. ఈ వార్త ఓల్డ్ మంక్ అభిమానులకు, మద్యం రంగ నిపుణులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.మహారాష్ట్రలోని ఒక డిస్టిలరీలో తయారైన ఓల్డ్ మాంక్ మూడు వేరియంట్లలో అనుమతి లేని కృత్రిమ ఫ్లేవర్లను గుర్తించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తన నివేదికలో పేర్కొంది. సహజసిద్ధమైన రుచి, వాసనను అనుకరించేలా వీటిని వాడటం వినియోగదారులను మోసం చేయడమేనని స్పష్టం చేసింది. ఓల్డ్ మంక్తో పాటు మెక్‌డొవెల్స్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ విస్కీలకు చెందిన కొన్ని బ్యాచ్‌లపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకుంది.దీంతో పాటు, ఓల్డ్ మాంక్ బాటిళ్లపై ఉన్న "7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్" అనే వాదన కూడా తప్పుదారి పట్టించేలా ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. 2018 ఆహార భద్రత, ప్రమాణాల (ఆల్కహాలిక్ బెవరేజెస్) నిబంధనల ప్రకారం, ఏదైనా మద్యం మిశ్రమంలో అతి తక్కువ వయసు ఉన్న స్పిరిట్ వయసునే లేబుల్‌పై ప్రకటించాలి. అయితే, ఓల్డ్ మాంక్ రమ్‌లో ఎక్కువ భాగం వయసు నిర్ధారణ లేని సాధారణ స్పిరిట్‌తో తయారుచేసి, కేవలం 5 శాతం కన్నా తక్కువ మాత్రమే ఏళ్ల తరబడి నిల్వ ఉంచిన రమ్‌ను కలుపుతున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆక్షేపించింది.ఓల్డ్ మాంక్.. కేవలం బ్రాండ్ కాదు, ఒక జ్ఞాపకంఓల్డ్ మాంక్