
Aug 12 2026 2:50 PM | Updated on Aug 12 2026 2:55 PM
కర్ణాటకలోని బెంగళూరులోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆహార భద్రతా అధికారులు వరుస దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆహార భద్రతా అమలు డ్రైవ్‌లో భాగంగా, కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ వరుసగా రెండో రోజూ (ఆగస్టు 12) బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట రోడ్డులోని సకలవరలో ఉన్న జొమాటో గిడ్డంగిలో ప్రత్యేక తనిఖీ నిర్వహించింది. అక్కడి గిడ్డింగిని సీజ్ చేసి నోటీసులు జారీ చేసింది.
అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనల కారణంగా బెంగళూరులోని జెప్టో (Zepto) వేర్హౌస్ను సీల్ చేసిన మరుసటి రోజే, అధికారులు బెంగళూరు బ్యానర్‌ఘట్ట రోడ్డులో ఉన్న జొమాటోకు చెందిన 'హైపర్‌ప్యూర్' (Hyperpure) వేర్‌హౌస్‌లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం జెప్టో వేర్హౌస్ను తనిఖీ చేసిన సమయంలో అక్కడ చెత్తాచెదారం, తీవ్రమైన అపరిశుభ్రత, లేబులింగ్‌లో లోపాలతోపాటు FSSAI నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. దీంతో ఆ వేర్హౌస్ను సీల్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని సిఫార్సు చేశారు.
FSSAI లైసెన్స్ నంబర్ లేకుండా సుమారు 146 కిలోల చికెన్‌ను గుర్తించారు. అలాగే, చెల్లుబాటులో లేని FSSAI లైసెన్స్ ఉన్న ఒక తయారీదారుకు చెందిన 40 కిలోల వెల్లుల్లిని కూడా అధికారులు గుర్తించారు. ఇంకా ఈ తనిఖీలో 300 కిలోల ప్యాక్ చేసిన బియ్యం, 20 కిలోల డ్రై ఫ్రూట్స్ , 15 కిలోల మసాలాపై తప్పుడు లేబులింగ్ ఉన్నట్లు కూడా కనుగొనబడింది. ఉత్పత్తి లేబులింగ్ నిబంధనల ప్రకారం అవసరమైన విధంగా రిఫ్రిజిరేషన్‌లో నిల్వ ఉంచకుండా ఉన్న 10 కిలోల దిగుమతి చేసుకున్న ముల్లంగి ఊరగాయను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఆహార భద్రతా అధికారులు తనిఖీ సందర్భంగా తదుపరి పరిశీలన కోసం ఐదు చట్టబద్ధమైన నమూనాలు, 35 సర్వే నమూనాలతో సహా 40 నమూనాలను సేకరించారు.
ఇదీ చదవండి: జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...! జెప్టో స్పందన నిబంధనల ఉల్లంఘనలపై స్పందించిన జెప్టో ప్రతినిధి, తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని, గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా అపరిశుభ్ర వాతావరణం, నిబంధనల అమలులో లోపాల ఆరోపణలతో ఆగస్టు 11న బెంగళూరు రూరల్‌లోని హోస్కోట్లో ఉన్న జెప్టో గిడ్డంగిని ఈ శాఖ సీల్ చేసింది.ఈ వారంలో మహారాష్ట్ర FDA కూడా ముంబైలోని ఒక బ్లింకిట్ (Blinkit) కేంద్రం ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
ఇదీ చదవండి: భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి శవమై సూట్‌కేసులో
రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు)
ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు)
హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు)
ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
బోనాలు స్పెషల్.. ఫ్యామిలీతో 'బేబి' వైష్ణవి చైతన్య (ఫొటోలు)
కూన రవికుమార్, భరత్ బండారం బయటపెట్టిన వరుదు కళ్యాణి
సర్ఫరాజ్ సెలక్షన్ వెనుక అసలు కారణం ఇదే.. BCCI మాస్టర్ స్కెచ్
ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది? మృతి వార్తలతో కలకలం
తెలంగాణలో ఆచూకీ లేని 73 లక్షల ఓట్లు.. సీఎం రేవంత్ సోదరులను టార్గెట్ చేసిన కేటీఆర్




