
Congress Party | 'ఓరి రేవంత్'.. అంటూ బాకీ కార్డులు చదివినవ్యక్తి.. వీడియో..!
Congress Party | 'ఓరి రేవంత్'.. అంటూ బాకీ కార్డులు చదివిన వ్యక్తి.. వీడియో..!
© 2026 nimisham.in

Congress Party | 'ఓరి రేవంత్'.. అంటూ బాకీ కార్డులు చదివిన వ్యక్తి.. వీడియో..!

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

BRS Party | స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02 : అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీది అభ్యాసం కాదు అది భస్మాసుర హస్తమని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారి బస్టాండ్ వద్ద మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ రణభేరి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డెకరేషన్లతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేయి అడుగుల లోతులో తొక్కిపెట్టాలని రాజయ్య మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా వారి మాటలు వింటే ప్రజల రక్తం మరుగుతోందని, హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ పున: నిర్మాణం కోసం పార్టీ శ్రేణులు యాగంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని రాజయ్య అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతూ అన్ని వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా మరే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Jagga reddy Strong counter on brs ktr: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు పదునైన విమర్శనాస్త్రాల్ని సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పాలనపై బీఆర్ఎస్ చార్జీషీట్ విడుదల చేసింది. దీనిలో కేటీఆర్ కాంగ్రెస్ పాలనను ఉతికి ఆరేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కిండ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అని కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన లో ఉద్యోగాలు భర్తీ జరగలేదన్నారు. 70 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అదించిందని చెప్పారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన లో పోలీసుల నిర్బంధాలు లేవన్నారు. పద్దతి లేని కుటుంబం పద్దతిగల కుటుంబం పై మాట్లాడుతుందని కేటీఆర్ పై సెటైర్ లు వేశారు. అసలు.. రాహుల్ పై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్ అంటూ ఏకీపారేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

BRS party | తొగుట : ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తొగుటలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వెయ్యి రోజులు దాటుతున్నా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలును ప్రశ్నిస్తూ జాబ్ కార్డులను ప్రదర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం జరుగుతున్న అమలుకు పొంతన లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలకు పూర్తి సమాధానం చెప్పే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు ఆటోలో వెళ్తున్న మహిళ బీఆర్ఎస్ ఆందోళన చూసి ఆటో దిగి వొచ్చి రేవంత్ మోసాలపై తూర్పార పట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, సుతారి రమేష్, బోధనం కనకయ్య, మంగ నర్సింలు, నంట పరమేశ్వర్ రెడ్డి, బండారు స్వామి గౌడ్, కుర్మ యాదగిరి, అరుణ్ కుమార్, ఎల్లం, వెంకట్ రెడ్డి, అశోక్, బోయిని శ్రీనివాస్, బిక్షపతి, నరేందర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయ ఘర్షణలతో యాదాద్రి భువనగిరి జిల్లా అట్టుడికింది. భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యే ఫ్లెక్సీపై నల్లరంగు చల్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపైనా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా ఖండించారు. “కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది దాడులు చేయడానికా?” అంటూ ప్రశ్నించారు. 60 ఏళ్ల మహిళపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భువనగిరి ఘటనకు నిరసనగా చౌటుప్పల్‌లో బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ సీనియర్ నేత మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు చండూరులో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్యే బీజేవైఎం కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒకే జిల్లాలో వరుసగా దాడులు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇదీ చదవండి: ‘ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’ అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం

హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1 : తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని వేయి రోజులు గడిచాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, హామీలో నెరవేరిచే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు. ఈనెల 2 నుంచి 8 వరకు ప్రతి రోజు ఒక నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 2న 420 హామీలు బ్యానర్లపై హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, 3న రైతుల హామీలపై కాజీపేట జంక్షన్ లో ధర్నా, 4న హనుమకొండ చౌరస్తాలో వంటా వార్పు, 5న ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ, ధర్నా, 6న ఇంజన్ సెంటర్లో ఆటోలో డ్రైవర్లతో నిరసన, 7న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజావాణిలో వినతులు సమర్పణ, 8న కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేయడం పై నిరసన చేయనున్నట్లు తెలిపారు. షాదీ ఖానా స్థలాన్ని మైనార్టీలు సాధించుకున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మిషన్ హాస్పిటల్ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. అబద్దాలు ఆడితే అతికినట్లు ఉండాలి. రీల్స్ చూసి కాదు రియల్ లైఫ్ లా పోరాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనలేదన్నారు. ప్రతిపక్షంపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. నంది పంది, అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్, కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళమెత్తుతున్న రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలను నిలదీసే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని ఎఫ్ఐఆర్ను రద్దు చేయకపోతే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ అధ్యక్షుడు కిశోర్ నాయక్, మున్సిపాలిటీ చైర్పర్సన్ కోకపర్తి అనిత, వైస్ చైర్మన్ నవీన్, వివిధ విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సడన్‌గా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సాయంత్రం లేదా రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సమావేశం కానున్నారు. రాబోయే సెప్టెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి తీవ్ర రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గాంధీభవన్ వర్గాల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మరియు క్రమశిక్షణ నివేదిక అంశాలపైనే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పులు మరియు చేర్పుల వ్యవహారం తీవ్రంగా వేడెక్కింది. దీనికితోడు మంత్రి కొండా సురేఖపై పీసీసీ డిసిప్లినరీ కమిటీ తయారు చేసిన నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మరియు దానిపై సురేఖ స్పందించిన తీరు పార్టీలో వివాదాస్పదమైంది. ఈ ఘటనల ఆధారంగా ఆమెను మంత్రివర్గం నుండి తొలగించడంతో పాటు పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని స్థానిక రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కీలక భేటీ కోసం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ಮುగించుకుని తిరిగి రాగానే ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై మెట్రో రైల్, విమానాశ్రయం మరియు ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ మార్పులలో కొండా సురేఖ స్థానంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్పీకర్

బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ ఫ్లెక్సీలు చించివేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడి దానిని నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అడ్డుకోబోయిన వర్షిత్‌రెడ్డి తల్లిని తోసివేసిన కార్యకర్తలు బీజేపీ ఆఫీసుపై కూడా దాడికి కాంగ్రెస్ నేతల యత్నం అడ్డుకున్న పోలీసులు..కానిస్టేబుల్‌కు గాయాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ /హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్‌లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టి»ొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. గాం«దీభవన్ ముట్టడికి యత్నం.. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్‌పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అట్టుడికిన నల్లగొండ బీజేపీ, కాంగ్రెస్ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అమరావతి, ఆగస్టు 22: 2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా నాలుగు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. హత్యలు, దాడులనే నమ్ముకుని పాలిటిక్స్ చేస్తోందని వినిపిస్తోంది

తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ వివాదంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆమె తేల్చిచెప్పారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్‌పై తనకు గౌరవం ఉందన్నారు. అయితే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తన విమర్శలను సమర్థించుకున్నారు. ఆ ఆరోపణలు ఇప్పటివరకు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిత్వం చుట్టూ మొదలైన వివాదమే తాజా రాజకీయ ఉద్రిక్తతకు ప్రధాన కారణంగా మారింది. పరకాలకు వచ్చిన రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటాన్ని సుస్మిత ప్రశ్నించారు. ఆగస్టు 19న గీసుకొండలో కొండా సురేఖ పుట్టినరోజు కార్యక్రమంలోనే ఆమె బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరకాల నుంచి తానే పోటీ చేస్తానని, టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమని ప్రకటించారు. అభ్యర్థిని ముందుగానే ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని కూడా ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన ప్రాంతానికి వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతు ప్రకటించడంపైనే ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సుస్మిత తెలిపారు. దీంతో తన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసినవి కావని, ముఖ్యమంత్రిని మాత్రమే ఉద్దేశించినవని వివరించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి మరో పార్టీ తరహాలో మార్చుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసలు కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉందని, బీసీ నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం సోదరుడికి సంబంధించిన రూ.200 కోట్ల భూమి లావాదేవీపై కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు స్వతంత్ర నిర్ధారణ లేదనే విషయం కీలకం. సుస్మిత వ్యాఖ్యలు బయటకు రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ వేడి మరింత పెరిగింది. ఫలితంగా టీపీసీసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ శైలిని వేగంగా మార్చుకుంటున్నారు. సాంప్రదాయ భారీ బహిరంగ సభలు, సుదీర్ఘ ప్రసంగాలకు స్వస్తి పలికి యువతతో నేరుగా ముఖాముఖి సంభాషణలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా Gen-Z, యువతుల సమస్యలనే తమ ముఖ్యమైన రాజకీయ అంశాలుగా మలచుకోవాలని నిర్ణయించారు. ఈ వ్యూహంలో భాగంగా ‘ఛాత్రోంకీ గూంజ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా నిర్వహిస్తోంది. విద్యార్థుల మానసిక ఒత్తిడి, ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న జాప్యాలపై నేరుగా చర్చలు జరుపుతున్నారు. కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్‌లలో ప్రారంభమైన ఈ ప్రత్యేక సదస్సులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు విస్తరించాయి. మరోవైపు పుణె వంటి నగరాల్లో జరిగిన భేటీలలో యువతుల ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కెరీర్ అడ్డంకులు, వ్యక్తిగత భద్రత, ఉద్యోగ ప్రదేశాల్లో వేధింపులు, సమాజ పరిమితులు, నైతిక పోలీసింగ్ వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మహిళా సహచరుల వ్యక్తిగత అనుభవాలను జోడిస్తూ చర్చను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో ఈ కార్యక్రమాలకు యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం ప్రసంగాలు ఇవ్వడం కాకుండా రెండు వైపులా సాగే సంభాషణ వైపు ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. యువత అసలు ఏ విధంగా ఆలోచిస్తోంది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటోందనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఈ అంశాలను జాతీయ రాజకీయ చర్చలోకి తీసుకురావాలన్నది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహం యువ ఓటర్లపై ఏ రకమైన పెను ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ఈ నయా ట్రెండ్ ఓటింగ్ శైలిని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. యువత సమస్యలను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సరికొత్త పునాదిని నిర్మించుకుంటోంది. ఈ వ్యూహాత్మక అడుగులు రాబోయే రాజకీయాల్లో పెద్ద మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి

Kagaznagar: ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! Kagaznagar: కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. అధిత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలునిర్వహించారుఈసందర్భంగాపట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి బి. అధిత పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అక్కడ శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా బి.అధిత మాట్లాడుతూ యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన S.I.R. ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అర్హులైన యువతకు ఫారం–6 దరఖాస్తులను అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఫారం–6 దరఖాస్తు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు

సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చాం.. 22-ఏపై బీఆర్ఎస్ది అనవసర రాద్ధాంతం: మహేశ్ గౌడ్ నిజామాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వాఖ్యలు బాధాకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం అలా మాట్లాడి ఉండకూడదని.. ఎలాంటి పరిస్థితిలో అలా మాట్లాడారో వివరణ కోరామన్నారు. అభ్యర్థులం తామేనని ఎవరు ప్రకటించుకున్నా చెల్లదని, అభ్యర్థుల ఎంపికకు పార్టీలో ఓ విధానం ఉంటుందని.. ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. 22-ఏ విషయంలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు

LB Nagar: ఎల్బీనగర్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! LB Nagar: నవ భారత నిర్మాత, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఎల్బీనగర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి గారు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, ఆధునికీకరణ, యువత భవిష్యత్తు కోసం దూరదృష్టితో పనిచేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. భారతదేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించేందుకు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు దేశ ప్రగతికి బలమైన పునాది వేశాయని అన్నారు. రాజీవ్ గాంధీ గారి సమర్థవంతమైన నాయకత్వం ఆధునిక భారత నిర్మాణానికి దిశానిర్దేశం చేసిందని తెలిపారు. ముఖ్యంగా కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్స్, సాంకేతిక రంగాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిందన్నారు. భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి దేశంలో సాంకేతికతను విస్తరించేందుకు కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలోనూ రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు ఎంతో కీలకమైనవని మల్రెడ్డి రాంరెడ్డి గారు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు కల్పించడం ద్వారా గ్రామీణాభివృద్ధికి ఆయన బలమైన పునాది వేశారని తెలిపారు. ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ద్వారా యువతకు తమకు నచ్చిన రాజకీయ నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా యువత రాజకీయాల్లో రాణించేలా, 25 ఏళ్ల వయస్సు కాకుండా 21 ఏళ్లకే చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నారు. 1980వ దశకంలోనే ప్రపంచంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పులను గుర్తించి, భారతదేశం కూడా సాంకేతికంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని రాజీవ్ గాంధీ

Dubbaka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి శ్రీనివాస్ రెడ్డి Dubbaka: దివంగత మాజీ భారత ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ 82 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణాల పరిధిలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్, లు వైస్ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండలల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రేకులకుంట మల్లికార్జున స్వామి డైరెక్టర్లు, ఎస్సీ సెల్, బీసీ సెల్,గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, దుబ్బాక మున్సిపల్ వార్డుల ఇంచార్జిలు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని, రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము అని తెలిపారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Police rude behaviour with Polytechnic students in mahabubabad: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్కిల్ వర్సిటిలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంకు సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ , జీవో 97 తీసుకొచ్చారు.దీనిపై పెద్ద దుమారం రాజుకుంది. తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఎక్కడి కక్కడ రోడ్లను బ్లాక్ చేశారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, జీవో ను ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసనలు కాస్త పీక్స్ కు చేరాయి. ఈ క్రమంలో మహాబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయం పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థుల్ని చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల పీకను పట్టుకుని దూరంగా తోసేయడం రచ్చగా మారింది. దీంతో అక్కడున్న స్టూడెంట్స్ మరింత రెచ్చిపోయారు. విద్యార్థుల పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్న స్థానికులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read more: Konda Susmita Patel: సీఎం అవ్వగానే కళ్లు నెత్తికెక్కాయా..?.. రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సెన్సెషనల్ కామెంట్స్.. అసలు.. మీరు పోలీసులా? లేక గూండాలా?.. అంటూ ఫైర్ అయ్యారు.ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గామారింది. దీనిపై నెటిజన్లు.. విద్యార్థుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?.. అంటూ సదరు సీఐ తీరుపై

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక

అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ చేశారు. బయట కూర్చుని వైసీపీ సభ్యులు ఎంత మాట్లాడినా విలువ ఉండదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని సీఎం ఉద్ఘాటించారు. అలాంటి వేదికను ఓ పార్టీ మొత్తం బహిష్కరించటం తన రాయజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని తెలిపారు 1978లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలు ఇద్దరే అసెంబ్లీని అల్లాడించారని ప్రస్తావించారు.1989 నుంచి1994 సమయంలో ఎన్టీఆర్ మధ్యలో అసెంబ్లీకి రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున పోరాడామని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసి బయటకొచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకూ పోరాటం వదల్లేదని అన్నారు. గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా?.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ వాళ్లు చేసిన పోరాటమే అందరినీ ఆలోచింప చేసిందని సీఎం చెప్పారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది అసెంబ్లీలో వారి సమస్యలపై పోరాడతారనే నమ్మకంతోనే అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చోని డీఎస్సీపై వైసీపీ సభ్యులు బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ కోతపెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం

సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో, రాజకీయం మరో టర్న్ తీసుకుంది. కాగా, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో.. సుస్మిత తాజా పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అధికార కాంగ్రెస్‌లోనే రేవూరి, కొండా కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందన్న చర్చ మొదలైంది. పరకాలపై కొండా ఫ్యామిలీ కన్ను? కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. ఒకవైపు రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు, మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ ఆసక్తి.. ఈ రెండు పరిణామాలతో పరకాల కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం ఇది పార్టీ అంతర్గత రాజకీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. జాతీయ గేయం 'వందేమాతరం' పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతల వైఖరిని పాకిస్థాన్ ప్రజలతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.మంగళవారం ముంబైలో ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం కంగన మీడియాతో మాట్లాడుతూ, "వందేమాతరం భారతదేశ చైతన్యాన్ని సూచిస్తుంది. దానిపై ఇంతటి ద్వేషం చూపడం, ఆలపిస్తుంటే అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌లోని ప్రజలు కూడా బహుశా ఇలా స్పందించరేమో" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీ వ్యతిరేకిగానే కాకుండా, దేశ వ్యతిరేకిగా మారుతోందని ఆమె ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే మాట్లాడుతూ, "కంగనాను బీజేపీనే పెద్దగా పట్టించుకోదు. ఆమెకు మంచి వైద్యుడిని చూపించాలని నేను బీజేపీకి సలహా ఇస్తున్నాను. రోజురోజుకు ఆమె మానసిక స్థితి క్షీణిస్తోంది" అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కూడా కంగనపై విమర్శలు గుప్పించారు. "2014లోనే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందని గతంలో వ్యాఖ్యానించిన వ్యక్తి ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడటమా?" అని ఆయన ప్రశ్నించారు. జాతీయ జెండా, రాజ్యాంగం విషయంలో ఆర్ఎస్ఎస్ చరిత్రను గుర్తుచేస్తూ, కనీసం స్వాతంత్య్ర పోరాట చరిత్ర పుస్తకాలనైనా ఆమె చదవాలని హితవు పలికారు.స్వాతంత్య్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 'వందేమాతరం' గేయాలాపన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ ప్రవర్తనకు సంబంధించిన పరిణామాలతో ఈ వివాదం మొదలైంది

‘వందేమాతరం’ పూర్తి గేయం ఆలాపనపై నెలకొన్న వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ అంశంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని.. దేశానికి కూడా వ్యతిరేకంగా మారుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.ఆగస్టు 15న ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వందేమాతరం ఆలాపన ప్రారంభమైంది. అయితే పార్టీ నిర్ణయం ప్రకారం తొలి రెండు చరణాలకే పరిమితం కావాల్సిన గీతాన్ని గాయకులు పూర్తిగా ఆలపించినట్లు సమాచారం.పూర్తి గేయం ఆలాపనను సోనియా గాంధీ గమనించినట్లు సమాచారం. ఆమె ఖర్గే వైపు సైగ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం గాయకులను ఆపాలని సూచించినట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన కంగనా.. వందేమాతరం భారతదేశ చైతన్యానికి ప్రతీక అని అన్నారు. కళాకారిణిగా కళ, కవిత్వం ప్రజలపై చూపే ప్రభావం తనకు తెలుసని చెప్పారు. అలాంటి గేయాన్ని ఆలపించకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ వైఖరిపై కంగనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించడం దాటి దేశానికి వ్యతిరేకంగా మారుతోందని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బీజేపీ తన బృందాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. యువతపై సోషల్ మీడియా, రీల్స్ ప్రభావం పెరిగిందని.. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. 2047 నాటికి
వనపర్తి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తున్నారని.. అయినా సరే, అన్ని భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా పార్టీలో తప్పులు జరుగుతున్నాయని.. తప్పు చేస్తున్నవారని పంపిస్తామే కానీ తాము పార్టీని వదిలిపెట్టేది లేదన్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. తాను పార్టీలో జరుగుతున్నవన్నీ చూస్తూ భరిస్తున్నాను కాబట్టి ఇంకా కొనసాగుతున్నానని.. లేకపోతే మరో జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యేవాడినేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.48 ఏళ్లుగా నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీని స్వార్థంతో కూలగొట్టి కలలను చెదరగొట్టారని.. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు చిన్నారెడ్డి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని సోనియాగాంధీ చెప్పినా.. కొంతమంది డబ్బులకు ఆశపడి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వనపర్తి అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేశానని.. తాను ఎక్కడా, ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదన్నారు. పదేళ్ల పాటూ బీఎఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చానన్నారు. గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నేతల్ని ఆహ్వానించినా రాకపోవడం బాధగా ఉందన్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం పనిచేయాలని, ఎలాంటి పనులు కావాలన్నా చేయడానికి కేబినెట్ స్థాయిలో తానున్నానని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.సొంత పార్టీలో నాయకులు నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. తాను అభివృద్ధి పనులు చేపడితే కాంట్రాక్టుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ టవర్ నిర్మాణం, పీజ సెంటర్లో హాస్టల్స్ నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఆ పనులు జరగడం లేదని ఆరోపించారు. ఈ పనుల గురించి మంత్రి, అధికారుల దగ్గరకు వెళ్లి అడిగానన్నారు. సొంత పార్టీలో వాళ్లే ఈ పనులు అడ్డుకున్నారని తనకు తెలిసిందన్నారు. గోపాల్పేట మండలంలో వ్యవసాయ మార్కెట్‌ను తీసుకెళ్లి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.వై. గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. తన నియోజకవర్గమైన మోళకల్మూరుకు ప్రభుత్వాలు వరుసగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఈ ప్రాంతాన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కలిపేయడం లేదా చల్లకెరె తాలూకాలో విలీనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మోళకల్మూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గోపాలకృష్ణ..‘మోళకల్మూరు ఎవరికీ కనిపించడం లేదు. ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం లభిస్తున్నా ఈ పట్టణం ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా తిరిగి ఎన్నిక కావడం లేదు. ఈ పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా లేదా చల్లకెరె తాలూకాలో చేర్చినా బాగుంటుంది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది’ అంటూ ఆవేదనతో కామెంట్స్ చేశారు. కాగా, మోళకల్మూరు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఖండించిన ఎమ్మెల్యే.. అయితే తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన కొద్ది గంటల్లోనే గోపాలకృష్ణ వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. మోళకల్మూరు తాలూకాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని, ముఖ్యంగా సాగునీటి సౌకర్యాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే తాను కోరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని తాను డిమాండ్ చేసినట్లు వచ్చిన ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని స్పష్టం చేశారు. పదవి దక్కకపోవడంపై అసంతృప్తి గోపాలకృష్ణ తాజా వ్యాఖ్యలకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంపై ఆయన ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ, సీనియర్ నేతలను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము తీవ్రంగా బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 1997 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోపాలకృష్ణ, 2018 నుంచి 2023 వరకు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Warangal Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా భేదాభిప్రాయాలు తారస్థాయిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే కాదు అత్యున్నత పదవుల్లో ఉన్న వారి మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో లుకలుకలు ఉన్నాయి. పరకాల బహిరంగ సభతో అవి మరింత ముదిరాయని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హాజరైన సభకు కీలక శాఖకు మంత్రి అయిన కొండా సురేఖ డుమ్మా కొట్టారు. రేవంత్ రెడ్డిపై కొండా దంపతులు ఇంకా అసంతృప్తి.. ఆగ్రహంతో ఉన్నారని మరోసారి రుజువైంది. ములుగురు జిల్లాలో రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి పర్యటన చేశారు. మేడారం సమ్మక్క, సారక్క ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక అనంతరం పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇది కొండా సురేఖ నియోజకవర్గం పక్కన ఉన్నదే. కానీ ఏ కార్యక్రమంలోనూ కొండా సురేఖ పాల్గొనలేదు. రేవంత్ రెడ్డి కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ శాఖకు చెందిన కార్యక్రమంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ హాజరుకాలేదు. మేడారం జాతర పనుల పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధిత శాఖ మంత్రిగా కొండా సురేఖ డుమ్మా కొట్టడంతో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరతోపాటు మరికొన్ని అంశాలపై రేవంత్ రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కొండా సురేఖకు విబేధాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి, పొంగులేటిపై కొండా సురేఖ కుమార్తె గతంలో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక జిల్లాలో ఉన్న మరో మంత్రి సీతక్కతో కూడా

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Congress Party: 'దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేడని.. ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే' మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వైస్రాయ్ హోటల్లో సొంత మామ ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదే అని గుర్తుచేశారు. 'స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని, ఆఖరికి అన్నం పెట్టకుండా పంపించాడు. మహిళలను చంద్రబాబు అవమానించారు, వారికి క్షమాపణ చెప్పాలి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు. 'చంద్రబాబుకు రెండెకరాల ఉంటే తమ్ముడికి ఒకేకరా పోతే ఇక ఒక ఎకరా ఉండేది. ఇప్పుడు రూ.లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చింది?' అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని చెప్పారు. 'నగరిలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను. ఇసుక, మట్టి తమిళనాడు, కర్ణాటకకు తరలించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు. 'మద్యం దుకాణాల పేరుతో బెల్టు పెట్టీ యువతను మత్తుకు బానిస చేస్తున్నారు. ఆ మత్తులో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని.. హోం మంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల చేతిలో చావు దెబ్బ తింటారని హెచ్చరించారు. కారు గ్యారేజీలో ఉండాలి.. ఆడది వంటగదిలో ఉండాలి అన్న కోడెల ఏమయ్యాయో చూశామని మాజీ మంత్రి

న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలను పెంచుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందించేందుకు తమ పార్టీ ప్రేమ దుకాణం తెరిచిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఖర్గే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మారుస్తూ వాటిని ప్రధాని మోదీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే, మున్ముందు మోదీ మన జాతీయ జెండాను సైతం ఎగురవేయబోరంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రపంచాన్ని తానే సృష్టించానంటూ మోదీ చెప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సలహా ఇచ్చి ఈ ప్రపంచాన్ని తానే రక్షించానంటూ చెప్పుకునే ఉండేవారన్నారు. అది మోదీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణల అంశాన్ని ఖర్గే ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద ప్రజలు భక్తితో ఇచ్చిన రూ. 50 విరాళానికి కూడా భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విరాళాల దొంగతనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘తన ఘనతగా చెప్పుకునేందుకే ప్రధాని మోదీ రామాలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, అందులోకి సొంతవాళ్లను నియమించుకున్నారు. సాధుసంతులతో పనిలేకుండా ఒంటరిగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నిజంగాదేశభక్తుడే అయితే ఆధ్యాతి్మకవేత్తలను, రామభక్తులను కలుపుకుని ఈ కార్యక్రమం పూర్తి చేసేవారు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి ధోరణి వల్ల, భవిష్యత్తులో మోదీ జాతీయ జెండాను కూడా కిందకు దింపేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది’అని

న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్‌గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్‌ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్

కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అని అభివర్ణించారు. గత రెండున్నరేళ్లలో మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అడగలేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారని, అందులో తప్పేమీ లేదన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆయన బాధ్యతగా భావిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని అంతర్గతంగా సరిచేసుకుంటే కాంగ్రెస్ పార్టీకే మంచిదని అనిరుధ్ రెడ్డి అన్నారు. పార్టీకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూడకుండా, ప్రజా సమస్యలపై చర్చగా తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మవారి సన్నిధిలో మైనర్ బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన..!

Huzurabad: జమ్మికుంటలో ప్రణవ్ బాబు ముందస్తు జన్మదిన వేడుకలు హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ముందస్తు జన్మదిన వేడుకలు సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ దేశిని కోటి ఆధ్వర్యంలో జన్మదిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ కాంగ్రెస్ పార్టీ 4వ వార్డ్ అధ్యక్షులు టెంకురాల కిషోర్ బూత్ అధ్యక్షులు మడిపోజు రాజేష్ తాజా మాజీ కౌన్సిలర్లు దేవస్థానం ఛైర్మెన్లు మార్కెట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
.webp)
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 352తో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్) నిరోధక చట్టంలోని 3(1)(r), 3(1)(s) సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 1071/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్సూరాబాద్‌లోని మధురానగర్ కాలనీకి చెందిన బుద్ధ సత్యనారా యణ (52) గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలి పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసిన తాను ప్రస్తుతం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో తనకు సన్నిహిత రాజకీయ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయ కార్య కలాపాల్లో భాగంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్య క్షుడు జక్కిడి శివాచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్‌రెడ్డితో కలిసి పని చేసినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే అనంతరం రాజకీయ విభేదాలు ఏర్పడటంతో ప్రభాకర్‌రెడ్డి తనపై కక్ష పెంచుకున్నారని ఆరో పించారు. తాను ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ఎస్టీ వ్యక్తిననే విషయం తెలిసినప్పటికీ, తనను కులం పేరుతో దూషించి అవమానించారని సత్య నారాయణ ఫిర్యాదులో ఆరోపించారు. ఫోన్లోనూ, ప్రత్యక్షంగానూ తనను, తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. కొన్ని వ్యాఖ్యలను సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసినట్లు ఆరోపించారు. తన కులం, కుటుంబ నేపథ్యం, వృత్తి, సామాజిక స్థితిగతులను ప్రస్తావిస్తూ అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని పేర్కొన్నారు. కులం పేరుతో తనను సామాజికంగా, రాజకీయంగా కించపరచడంతో పాటు ప్రజా, రాజకీయ జీవితంలో తన ఎదుగుదలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నానని ఫిర్యా దులో తెలిపారు. ఈ వ్యవహారం కారణంగా తాను, తన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ

Former Minister RK Roja Protest In Nagari: డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని.. దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. నగరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందితే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని రోజా ప్రశ్నించారు

కామారెడ్డి : ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపిస్తూనే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదరవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కామారెడ్డి బీర్కూర్ మండలం మంజీరా నది చెక్ డ్యాం వద్ద తన అనుచరులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కార్యకర్తలకు వివరించారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం. ‘మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువా కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువా కప్పుకున్నా. 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పినా మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు. నేను అమ్ముడు పోలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కండువా కప్పుకున్నాను. పాత కాంగ్రెస్ నాయకులు నేను రావడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 90 శాతం మంది నాతో వచ్చారు. ఇదంతా నియోజకవర్గం అభివృద్ధి కోసమే. కేసీఆర్‌ను మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోను. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నిధులు అడుగుతుంటే ఎవరూ స్పందించడం లేదు’ అని పేర్కొన్నారు. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?

MLA Pocharam | కామారెడ్డి, ఆగస్టు 11 : అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే తాను పార్టీలో చేరానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 మాసాలలో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నానన్నారు. ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదని..సీఎం స్వయంగా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పినా మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలు వినడం లేదని పోచారం వాపోయారు. వేం నరేందర్ రెడ్డికి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదు. వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చిందన్నారు పోచారం. Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా High Alert | ఢిల్లీలో ఉగ్రదాడులు జరుగవచ్చన్న ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!

కోల్ బ్లాక్ కేటాయింపుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దశాబ్ద కాలంగా ఆయనపై సాగిన ఆరోపణలు అవాస్తవమని తేలడంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ఒక నిజాయితీ గల ప్రధానిని దోషిగా చిత్రీకరించే ప్రయత్నాలకు ఈ తీర్పుతో తెరపడిందని ఆమె పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ నిర్దోషిత్వాన్ని దేశం ముందు ఉంచిన ఈ తీర్పు చారిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. గతంలో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు, కొన్ని వ్యవస్థలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఆయనకు క్లీన్ చిట్ లభించడంతో ఆ వివాదానికి ముగింపు పడింది. మన్మోహన్ సింగ్ అత్యంత ప్రభావవంతమైన, మృదుభాషి అయిన ప్రధానిగా చరిత్రలో నిలుస్తారని సోనియా గాంధీ గుర్తు చేశారు. దీంతో మన్మోహన్‌ను వేధించేందుకు కూటమిగా ఏర్పడిన శక్తుల బండారం బయటపడిందని సోనియా తీవ్రంగా విమర్శించారు. ఇందులో అధికార యంత్రాంగం, కొన్ని న్యాయస్థానాలు, పౌర సమాజం, ఆరెస్సెస్, బీజేపీ కీలక పాత్ర పోషించాయని ఆమె ఆరోపించారు. మన్మోహన్ సింగ్‌పై మోపిన ఆరోపణలన్నీ బోగస్ అని, ఆయన నిప్పులాంటి నిజాయితీపరుడని ఆమె స్పష్టం చేశారు. ఆయనపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు పార్లమెంటరీ చరిత్రలోనే అత్యంత అవమానకరమైనవిగా మిగిలిపోతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ప్రతిపక్షాలను భయపెట్టేందుకు, లొంగదీసుకునేందుకు ఈ వ్యవస్థలను అస్త్రాలుగా మారుస్తున్నారని ఆమె విమర్శించారు. కొందరిని బెదిరించి పార్టీలోకి చేర్చుకోవడం, మరికొందరికి మంత్రి పదవులు ఆశ చూపడం బీజేపీ నైజమని ఆమె దుయ్యబట్టారు. ఫలితంగా, దేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు

బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఆమె రాసిన ప్రత్యేక వ్యాసంలో... సుప్రీంకోర్టు తీర్పుతో మన్మోహన్ సింగ్‌పై ఇన్నాళ్లూ జరిగిన రాజకీయ కక్షసాధింపులకు, దుష్ప్రచారాలకు తెరపడిందని స్పష్టం చేశారు. "నాడు (2014 జనవరిలో) మన్మోహన్ సింగ్ చెప్పినట్లుగానే చరిత్ర ఆయన పట్ల చాలా దయతో, గౌరవంగా ప్రవర్తిస్తుంది" అని ఆమె గుర్తుచేశారు. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను ఆమోదిస్తూ, విచారణ పరిధి దాటి వ్యాఖ్యలు చేసిన విచారణ కోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టడాన్ని సోనియా గాంధీ స్వాగతించారు. మన్మోహన్ సింగ్ సమగ్రతను, మచ్చలేని రాజకీయాన్ని దెబ్బతీసేందుకు అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులు, కొందరు అధికారులు మరియు మీడియా ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ... సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. యూపీఏ హయాంలో సాధించిన ఆర్థిక పురోగతి, ఉపాధి హామీ, విద్యా హక్కు, ఆహార భద్రత చట్టాల ప్రాధాన్యతను వివరిస్తూ.. మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా ఉన్నప్పటికీ దేశానికి అత్యంత కీలకమైన సేవలు అందించిన ప్రధానిగా నిలిచిపోతారని కొనియాడారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Kuppam High Tension: డీఎస్సీలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్టవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా వైఎస్సార్సీపీ ర్యాలీ తీసేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించడంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్సీపీ ఆందోళన సందర్భంగా కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద వైసీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైఎస్సార్సీసీ నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడక్కడ అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో భరత్ ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అవకతవకలకు కారణమైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో రాష్ట్రమంతా నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన ర్యాలీకి వారం కిందట పోలీసుల అనుమతి కోరినా అనుమతి మంజూరు చేయలేదని చెప్పారు. మరి టీడీపీ చేపట్టిన విజయోత్సవ ర్యాలీకి పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవరించడం ఏమిటని నిలదీశారు. ఎన్ని ఆంక్షలు విధించినా తాము వెనుకాడమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ర్యాలీకి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీ శ్రేణుల

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Medico Priyanka Death: రాజమండ్రిలో సినిమా థియేటర్ వద్ద మద్యం మత్తులో దుండగులు కారుతో తొక్కించగా మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందడాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదని.. తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ప్రియాంక మృతి తనను కలచివేసిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 'తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పదిమందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండాపోవడం అత్యంత విచారకరం' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారి మీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం' అని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన

క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. హైదరాబాద్, ఆగస్టు 09: క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆగస్టు 8వ తేదీన మహత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో యావత్ భారతదేశం కదం తొక్కిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతోపాటు సుభాష్ చంద్రబోస్.. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. బ్రిటిష్ వాళ్లు భారత్ విడిచి వెళ్ళిపోవడానికి ఈ ఉద్యమమే ప్రధాన కారణమని వివరించారు. కేంద్రం మొండి వైఖరికి వ్యతిరేకంగా జెన్ జీ ఉద్యమం చేపట్టిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలని జెన్ జీ ఉద్యమ వీరులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వేలాది మంది సర్వం కోల్పోయి ప్రాణత్యాగాలు చేస్తేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని నెహ్రూను మరిపించే ప్రయత్నం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్‌ను బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి క్విట్ చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావటానికి గల కారణాలను యువత అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు. దేశం ఆశ్చర్యం పోయేలా తెలంగాణలో అభివృది, సంక్షేమం జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉందని