
CM Vijay | స్టాలిన్‌ను బాడీ షేమింగ్ చేయలె.. మాటల మధ్యలో అలా చేశానంతే..!
CM Vijay | స్టాలిన్‌ను బాడీ షేమింగ్ చేయలె.. మాటల మధ్యలో అలా చేశానంతే..!
© 2026 nimisham.in

CM Vijay | స్టాలిన్‌ను బాడీ షేమింగ్ చేయలె.. మాటల మధ్యలో అలా చేశానంతే..!

తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్, ప్రస్తుతం లండన్‌లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan), ప్రస్తుతం లండన్‌లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి కోలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. ఇదే త్రిష నటిస్తున్న చివరి సినిమా కానుందా? ఆమె త్వరలోనే సినిమాలకు పూర్తి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా? అనే చర్చలు నడుస్తున్నాయి. దళపతి విజయ్‌తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం,వారిద్దరి కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈమధ్య కాలంలో విజయ్- త్రిష కలిసి కనిపించడం తగ్గింది. విజయ్ రాజకీయాల్లో బిజీగా మారగా.. త్రిష వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఈమధ్యనే లండన్ లో ఫ్రెండ్స్ తో కనిపించిన త్రిష తాజాగా అక్కడే సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాకు శ్రీకారం చుట్టింది. బాలీవుడ్లో ఎయిర్‌లిఫ్ట్, చెఫ్, పిప్పా వంటి విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా న ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ బ్యానర్.. లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్ సంస్థలతో కలిసి కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ఈ ఈ సినిమాతో మొదటిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ బాలమురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు పవర్ఫుల్ నటీమణులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం, లండన్ నేపథ్యంలో సాగే

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్‌గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్‌గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!. ఆ సన్‌గ్లాస్ ప్రత్యేకత ఇది.. ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్‌కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్‌గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్‌కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్‌గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్‌ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె. (చదవండి: క్లౌడ్ కిచెన్‌తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ
వృద్ధురాలికి తమిళనాడు సీఎం విజయ్ గిఫ్ట్.. ఆమె ఫుల్ ఖుషీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. సాలేమ్ జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో పర్యటించారు. కావేరి డెల్టా సాగు నీటి కోసం మెట్టూరు జలశాయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం నిమిత్తం.. సీఎం విజయ్ సాలేమ్ వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం సాలేమ్ విమానాశ్రయానికి తిరుగు పయనమవుతున్న సమయంలో.. మార్గమధ్యలో ఒక పొలం వద్ద.. కాన్వాయ్‌ను ఆపాలని సెక్యూరిటీకి సూచించారు. అలా దగ్గర్లోని పొలంలో పని చేసుకుంటున్న కొందరు మహిళల వద్దకు స్వయంగా కారు దిగి సీఎం విజయ్ వెళ్లారు. ఆ ప్రాంతానికి చెందిన చెల్లమ్ అనే వృద్ధురాలు ఆశ్చర్యంతో ముందుకు వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. "భోజనం చేశావా?" అని సీఎం విజయ్ ఆమెను ఆప్యాయంగా పలకరించగా.. మిమ్మల్ని చూడాలని అలాగే ఎదురుచూస్తున్నాను.. అందుకే ఇంకా తినలేదు అని ఆమె బదులిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వైఎస్సార్సీపీ ఎంపీ కలిశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకుఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి, తన భర్త వినయ్‌తో కలిసి చెన్నైలోని సచివాలయంలో విజయ్‌తో సమావేశం అయ్యారు. పార్లమెంటరీ స్టడీ టూర్ కోసం ఎంపీ తనూజ రాణి చెన్నైకి వెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం విజయ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమిళనాడు సీఎంను కలవడం ఆనందంగా ఉందంటూ ఫోటో, వీడియోను పోస్ట్ చేశారు.ఎంపీలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ కోసం చెన్నై వెళ్లారు. CMDA (చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ), తమిళనాడు అర్బన్ హ్యాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు, CMRL (చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, కమిషనరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, CMWSSB (చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సంస్థల ఉన్నతాధికారులతో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పట్టణ ప్రణాళికను మరింత బలోపేతం చేయడం, ప్రజా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, గృహ నిర్మాణం, రవాణా సౌకర్యాలు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడం, స్థిరమైన అభివృద్ధిని సాధించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కమిటీలో మరికొందరు ఎంపీలు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిశారు.2024 ఎన్నికల్లో తనూజ రాణి అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. తనూజ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలు. పాల్గుణ 2019 ఎన్నికల్లో అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు 2024 ఎన్నికల్లో సీటు దక్కలేదు.. ఆయన స్థానంలో రేగ మత్స్యలింగంకు టికెట్ కేటాయించారు. అయితే పాల్గుణ కోడలు తనూజకు అరకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. తనూజ రాణి డాక్టర్ కాగా.. మాజీ ఎమ్మెల్యే పాల్గుణ

సాక్షి, చెన్నై: జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, తమిళనాడు సీఎం విజయ్‌కి అలాంటి ఆలోచన ఊహల్లో కూడా ఉండదని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఇకపై మంత్రులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ చూసుకోవాలని సూచించారు. సోమవారం తిరునెల్వేలిలో వైగో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో ఒక భారీ ప్రభుత్వ మార్పు వచ్చిందని, టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవి నీతి రహితంగా నడిపిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఏ ప్రభు త్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కమీషన్లు లేకుండా నేరుగా పాల న సాగుతోందన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి తాను 100కి 80 మార్కులు ఇస్తున్నానని, అవినీతిని పూర్తిగా నిర్మూలించడం హిమాలయాన్ని కదిలించినంత కష్టమైన పనిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చక్కగా పనిచేస్తున్నట్టు వైగో అభినందించారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం: ‘’రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించకపోతే రాజీనామా చేస్తాం’’ అని మంత్రి రాజేష్‌కుమార్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం విజయ్ ఊహల్లో కూడా అలాంటి ఆలోచన ఉండదన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాం«దీనే ప్రధాని అభ్యరి్థగా ఉంటారని, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ నిరోధించాలని సూచించారు. ఇక, కావేరీ నిర్వహణ బోర్డు తన బాధ్యతను విస్మరించిందని, కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూ తమిళనాడుకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని, ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైగో డిమాండ్ చేశారు. కాగా, సీఎం విజయ్ భావి ప్రదాని అంటూ మంత్రులు వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గుర్రు మంటున్న విషయం

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్. అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్‌గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాయిమామన్ తంగ మోతిరం పథకం టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ ఎంపిక అయ్యాయి. 755 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లు ఇవి. బంగారం ఉంగరాన్ని తయారు చేయడం, రవాణా, ఇతరత్రా ఖర్చులను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.ఈ పథకం కింద తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే సుమారు 4.42 లక్షల మంది నవజాతా శిశువులకు ఒక్కో గ్రాము చొప్పున బంగారు ఉంగరాలను బహూకరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బంగారపు వ్యయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు విజయ్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నారు.దీనికోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. అధికారిక టెండర్ల పోర్టల్ ద్వారా జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీస్, జీఆర్టీ జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్ వంటి మొత్తం 11 జ్యువెలరీ సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఆయా సంస్థల్లో అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేశాయి.. జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎందీంతో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జాయ్ ఆలుక్కాస్ అతి తక్కువ బిడ్డింగ్ నమోదు చేసింది. ఒకే ఒక్క పైసా సర్వీస్ ఛార్జీని మాత్రమే కోట్ చేస్తూ ఈ టెండర్‌ను దక్కించుకుంది. బంగారం ధర తప్ప.. ఉంగరం మేకింగ్ ఛార్జీలు, రవాణా, ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు.. అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పైసా కోట్ చేసి టెండర్ దక్కించుకుంది జాయ్ అలుక్కాస్.సీఎం విజయ్ బిగ్

దిగ్గజ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. షావుకారు జానకి పార్థివదేహాన్ని తమిళనాడు, తేనాంపేటలో ఉన్న ఆమె స్వగృహంలో శనివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం వుంచి, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చెరగని ముద్ర: సీఎం విజయ్ తనదైన ప్రత్యేక నటనతో తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి షావుకారు జానకి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురయ్యానని ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సినీ పరిశ్రమలో 70 యేళ్ళకుపైగా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక ప్రస్థానం కూడా ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి పద్మశ్రీ, కలైమామణి, నంది పురస్కారాలతోపాటు అనేకఅవార్డులు అందుకున్న షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. జానకి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిత్రపరిశ్రమకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు భగవంతుని పాదాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం విజయ్ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఒక శకం ముగిసింది: టీఎఫ్ఏపీఏ షావుకారు జానకి మృతిపట్ల తమిళ చిత్ర యాక్టివ్ నిర్మాతల సంఘం (టీఎఫ్ఏపీఏ) కార్యవర్గం, సభ్యులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలోని గొప్ప, అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపారమైన నటనతో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రపరిశ్రమలను సుసంపన్నం

వీటి ప్రగతి నీటిపైనే ఆధారపడింది: అమిత్‌షా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిందే అయితే కొన్ని రాష్ట్రాలు ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి నీరు సముద్రంలోకి పోతే ఎవరికి లాభం? జలవివాదాలను పరిష్కరించుకోండి దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి పిలుపు నీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి ‘కాళేశ్వరం, పాలమూరు’లకు సహకరించండి ఆ 19 గ్రామాలను తిరిగి తెలంగాణకివ్వండి నదుల దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూడండి: భట్టి, తుమ్మల చెన్నై, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత రాష్ట్రాలు జలవివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచించారు. దేశ ప్రగతికి ఈ రాష్ట్రాలే ప్రధాన స్తంభాలన్నారు. ఈ రాష్ట్రాల ప్రగతి నీటిపైనే ఆధారపడి ఉందని చెప్పారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో గురువారం జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఒకరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పు కాదు. అయితే రాష్ట్రాలు ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటుండగా.. ఆ నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే ఎవరికీ ప్రయోజనం చేకూరదు’ అని స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి, హోం శాఖలు, అంతర్రాష్ట్ర మండలి, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో జరిగే సంయుక్త సమావేశాల ద్వారా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యలను త్వరిగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ‘ఉత్తర భారతదేశంలో నదీ జలాల పంపిణీకి సంబంధించిన 8 సమస్యల్లో ఐదు బ్రిటిష్ పూర్వకాలం నుంచే కొనసాగుతున్నాయి. ఐదు నెలల క్రితం వీటిపై తుది ఒప్పందం కుదిరింది. బ్రహ్మపుత్ర నుంచి గోదావరి, కావేరి వరకు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా.. రాబోయే వందేళ్ల పాటు దేశం నీటి కొరతను ఎదుర్కొనకుండా చూడవచ్చు. ఈ చొరవ బహుళ జలమార్గాల ఏర్పాటుకు కూడా దోహదపడుతుంది. ఇంధనం ఆదా అవడమే కాకుండా పర్యావరణం మెరుగుపడుతుంది. అంతేగాక తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థ
ఒకే వేదికపై విజయ్, చంద్రబాబు.. 4 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై కీలక ప్రతిపాదనలు చేశారు. అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు కారిడార్, దక్షిణాది విద్యుత్ గ్రిడ్, గోదావరి-కావేరి నదుల అనుసంధానం, తిరుపతి నుంచి చార్ధామ్ వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. విభజన హామీలు, అమరావతి, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరారు. ఈ వార్తకు సంబంధించిన
తమిళనాడు సీఎం విజయ్‌తో చంద్రబాబు.. ఒకే వేదికపై ఇరువురు నేతలు.. Chandrababu Vijay one stage,Tamil nadu CM Vijay Chandrababu,31st Southern Zonal Council meeting,Mahabalipuram South Zonal meeting,Andhra Pradesh News,చంద్రబాబు,విజయ్,ఒకే వేదికపై చంద్రబాబు విజయ్,తమిళనాడులో చంద్రబాబు,31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఈ వార్తకు సంబంధించిన
MLA లవ్ ఫెయిల్ మాటలకి అవాక్కైన సీఎం విజయ్.. ఒక్కసారిగా..! తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో పెరియకుళం నియోజకవర్గ TVK ఎమ్మెల్యే శబరి అయ్యంగరన్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన, తన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాలేజీ రోజుల్లో ప్రేమలో విఫలమైన తనకు ఉద్యోగం, కారు లేవని.. కానీ సీఎం విజయ్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో పాటు కారు కూడా కేటాయించారని సరదాగా వ్యాఖ్యానించారు. ట్రైన్లో వచ్చి, ఆటోలో అసెంబ్లీకి వస్తున్నప్పుడు పోలీసులు ఎమ్మెల్యే అంటే నమ్మలేదని, ఇప్పుడు ఈ రెండు నిర్ణయాలతో ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన

విద్యార్థుల నిరసనలపై నిబంధనలు రద్దు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం ఉపసంహరణతో విద్యార్థులకు స్వేచ్ఛ Tamil Nadu Government: తమిళనాడులో విద్యార్థుల రాజకీయ భాగస్వామ్యం, నిరసన ప్రదర్శనలపై విధించిన సంచలనాత్మక ఆంక్షల విషయంలో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) కీలకమైన వెనకడుగు వేసింది. వామపక్ష రంగాలు, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిషేధిస్తూ గతంలో జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి వ్యక్క్తమైన నిరసనలకు తెరపడినట్లయింది. YS Jagan: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే.. కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు గత ఉత్తర్వుల్లో ఉన్న ప్రధాన మార్గదర్శకాలు: గతంలో కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ జారీ చేసిన కఠిన నిబంధనల ప్రకారం, వామపక్షాలు, సిజెపి నిర్వహించే ఏ విధమైన ధర్నాలు లేదా నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను నిరుత్సాహపరచాలని, వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వుల ఉపసంహరణతో మారిన పరిస్థితులు: అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఉపసంహరణ నిర్ణయంతో పాత ఉత్తర్వులు పూర్తిగా రద్దయ్యాయి. ఇకపై వివిధ శాఖలు, జిల్లా యంత్రాంగాలు విద్యార్థుల భాగస్వామ్యాన్ని నిరోధించడం లేదా వారిపై తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ తాజా చర్యతో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులకు, నిరసన తెలిపే స్వేచ్ఛకు ప్రభుత్వం మళ్లీ ప్రాధాన్యం ఇచ్చినట్లయింది

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. చెన్నై, ఆగస్టు 19: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. డీఎంకే నేతల అవినీతికి సంబంధించిన రెండు ఫైల్స్ తన టేబుల్‌పైనే ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు ఆ ఫైల్స్ తెరుస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి.. ఆ ఫైల్స్ ఇప్పుడే తెరిచేలా చేయొద్దని డీఎంకే నేతలకు వార్నింగ్ ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బుధవారం తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే పార్టీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఎప్పుడు.. ఏం చెప్పాలో నాకు తెలుసు. అందుకే ప్రజలు మాపై నమ్మకంతో ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఉప ఎన్నికల సమయంలో నేను మాట్లాడతాను. ప్రజలకు కొంత మంచి జరగనివ్వండి’ అని అన్నారు. ‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన డయాబెటిస్ ఉన్నవారు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమా?
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్‌లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత, తన కుమారుడితో కలిసి సత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రాధన్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మరీ కవితను కలవడంపై చర్చనీయాంశమైంది. కవిత ఆయన్ను పిలపించారా.. ఆయనే ఇక్కడికి వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. కవిత తన రాజకీయ భవిష్యత్ గురించి ఏదైనా ఆరా తీశారా అనే చర్చ మొదలైంది.చాలామంది రాజకీయ నేతలు పండితులు, జ్యోతిష్యుల్ని నమ్ముతుంటారు.. వారు నిర్ణయించిన ముహూర్తాల్లోనే పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం, రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయడం, ప్రత్యేక పూజలు చేయించడం వంటి వాటి కోసం జ్యోతిష్యుల్ని సంప్రదిస్తుంటారు. కవిత కూడా తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడ్ని సలహాల కోసం సంప్రదించారా అనే చర్చ జరుగుతోంది. రాధన్ తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ముందు నుంచి చెబుతున్నారు.. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. తమిళనాడు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సమయంలో దాదాపు అన్ని సర్వే సంస్థలు టీవీకే అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పగా.. తాము ఎగ్జిట్ పోల్స్ పట్టించుకోమని.. టీవీకే పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.అంతేకాదు గతంలో తమిళనాడుకు చెందిన నేతల జాతకాల గురించి రాధన్ చెప్పారు.. ఆయన చెప్పినట్లే జరిగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం గురించి రాధాన్ ముందే చెప్పారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలిచి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.. ఆ అంచనాలు కూడా నిజమయ్యాయి. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళనిస్వామి జాతకాలు గురించి చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత్రి కవిత కూడా రాధన్ పండిట్‌ను హైదరాబాద్ పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది.కవిత తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ విజయాన్ని

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Vijay govt good news to tamil nadu mlas: తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ దళపతి తనదైన మార్కుచూపిస్తున్నారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలు ఆరు నెలలు, ఎనిమిది నెలలు అంటూ విమర్శలు గుప్పిస్తున్న తనదైన స్టైల్ లో ప్రజలకు పాలన అందిస్తున్నారు. మరోవైపు కొంత మంది నేతలు రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విషయాల్ని మధ్యలోకి తీసుకొచ్చిన సీఎం విజయ్ వాటిని ఎదుర్కొంటు తనదైన స్టైల్ లో అపోసిషన్ పార్టీల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా ఊహించని వరాలు జల్లును కురిపించారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనంతో పాటు భారీగా అలవెన్సులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేలకు ఒక కారు, దీని నిర్వాహణకు భత్యంతో పాటు పీఏను కూడా నియమించుకునేందుకు గ్రాంట్‌ను అందిస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా తమ తమ నియోజక వర్గాల్లో ఎప్పటికప్పుడు సందర్శిస్తు ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని సీఎం విజయ్ దళపతి సూచించారు. ఎమ్మెల్యేలకు .. ప్రభుత్వ వాహనం కేటాయించడం ద్వారా పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించడానికి వీలవుతుందన్నారు. చాలా మంది అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వచ్చారని అన్నారు. వీరికి తమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు తమ ప్రభుత్వంఅన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ప్రతి ఎమ్మెల్యేకి కారు డ్రైవర్, ఇంధనం ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75,000 అలవెన్సు అందనుందని వెల్లడించారు. అదనంగా అధికారిక పనుల కోసం ఒక సెక్రటరీని నియమించుకునేందుకు నెలకు

తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలలో పాల్గొనకూడదంటూ విధించిన వివాదాస్పద ఆంక్షలను ఉపసంహరిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉండాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన విమర్శలు, ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమైనట్లు తెలుస్తోంది.విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి ఈ విషయాన్ని వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ తో పాటు లెఫ్ట్ పార్టీలు నిర్వహించే ఏ రాజకీయ నిరసనలలో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించాలంటూ గతంలో పంపిన విద్యాశాఖ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ సర్కులర్ ను అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపించినట్లు వివరించారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆందోళనలపై ఉన్న ఈ ఆజ్ఞలు రద్దయినట్లయింది.తమిళనాడులోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు అలాగే ఉన్నత విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం ఈ సర్కులర్ ను పంపింది. పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ఎలాంటి రాజకీయ ప్రదర్శనల్లో పాలుపంచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లు, రిజిస్ట్రార్లను ఆదేశించింది. విద్య, పోలీస్ శాఖతో పాటు జిల్లా యంత్రాంగం అంతా కలిసి దీనిపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలని సూచించింది.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎంప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వివాదాస్పద ఆంక్షలను విపక్ష కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై సౌరవ్ దాస్ ఘాటుగా స్పందించారు. ఈ నిబంధనలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నమని అభివర్ణించారు. ప్రజాస్వామ్య సమాజంలో శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అలాంటి హక్కులను కాలరాయడం సరికాదని పేర్కొన్నారు. దీంతో సర్కారుపై రాజకీయ ఒత్తిడి పెరిగింది.సీఎం విజయ్ వరాల మూట: ఒక్కటి కాదు..: ప్రతి ఎమ్మెల్యేకూ ప్రభుత్వ కారు, రూ. 25
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. గురువారం (ఆగస్టు 20) తమిళనాడులో నిర్వహిస్తున్న ' సదరన్ జోనల్ కౌన్సిల్ ' సమావేశం దీనికి వేదిక కానుంది. తొలిసారి ఏపీ, తమిళనాడు సీఎంలు ఒకే వేదికపై కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం చెన్నైలో నిర్వహిస్తుండటంతో తమిళనాడు సీఎం విజయ్ కచ్చితంగా హాజరవుతారని తెలుస్తోంది. ఆగస్టు 20న తమిళనాడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ , కర్ణాటక ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, అంతర్రాష్ట్ర మండలి సచివాలయ కార్యదర్శి, రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర వివాదాలు సహా పలు కీల అంశాలపై చర్చించనున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తమిళనాడు వెళతారు. సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు.. రాత్రికి చెన్నైలోని తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ రిసార్ట్‌లో బస చేస్తారు. గురువారం (ఆగస్టు 20) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు 31వ 'సదరన్ జోనల్ కౌన్సిల్' సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆగస్టు 20వ తేదీ సాయంత్రం చెన్నై నుంచి బయల్దేరి విజయవాడ ఎయర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి వెళతారు.30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తిరువనంతపురంలో జరిగింది.. అక్కడ మొత్తం 26 అంశాలపై చర్చించగా.. తొమ్మిది అంశాలకు పరిష్కారం లభించగా.. మరో 17 అంశాలను తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. ఈ 17 అంశాల్లో 9 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan). హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్‌గా నటించాడు. తమిళనాడు సీఎం, దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan). హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్‌గా నటించాడు. ఎన్నో వాయిదాలు, వివాదాల తరువాత జన నాయగన్ జులై 23 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంది. తెలుగులో బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఆధారంగా విజయ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. ఇక జన నాయగన్ ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆగస్టు 21వ తేదీ నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 అధికారికంగా ప్రోమోను విడుదల చేసింది. థియేటర్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకు ముందుకు వస్తుండటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కథ విషయానికొస్తే ఖైదీగా జైలు జీవితం ముగించుకుని బయటకు వచ్చిన వెట్రి కొండాన్ (విజయ్), ప్రమాదంలో చనిపోయిన జైలు అధికారి కుమార్తె విజ్జి (మమిత బైజు) ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. ఆఫ్రికా దేశాలను సైతం వణికించిన అంతర్జాతీయ క్రిమినల్ జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని అంతం చేయడానికి చూస్తూ

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కార్యాలయాన్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైకి మార్చాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం సిబ్బందికి సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించేందుకు ఈ మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా... కొత్త ఆఫీసు పనుల కోసం కేటాయించిన రూ. 5.5 కోట్ల టెండర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ బీజేపీ, డీఎంకేలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకుడు కేశవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్త ఆఫీస్ పనులు ఇప్పటికే ప్రారంభమైన నెల తర్వాత, ఎలాంటి ఆన్లైన్ విధానం అనుసరించకుండా రూ. 5.5 కోట్ల టెండర్‌ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి కేవలం 100 రోజులు కూడా కాకముందే పాలనలో పారదర్శకత లోపించిందని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు, డీఎంకే ఎమ్మెల్యే ఈవీ వేలు స్పందిస్తూ.. సీఎం తన కార్యాలయాన్ని మార్చుకోవడం ఆయన వ్యక్తిగత విషయమని, అయితే ప్రజాధనంతో ముడిపడి ఉన్న టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న వార్తలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే, ఈ అవినీతి ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి కేవలం 100 చదరపు అడుగుల స్థలం కూడా లేదని, వారికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకే ఈ తాత్కాలిక మార్పు చేపట్టామని వివరించారు. ఈ పనులకు సంబంధించి టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన తేల్చిచెప్పారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Annamalai reacts on trishan and udhayanidhi stalin row: తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం త్రిష చుట్టునే తిరుగుతున్నాయి. ఇటీవల ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కూడా త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అంతే కాకుండా సీఎం విజయ్ దళపతి తల్లిదండ్రుల పక్కనే కూర్చొవడం కూడా త్రిషకు వారి ఇంట్లో ఏస్థానం ఉందో అందరికి తెలిసినట్లైంది.ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హమీల్ని నెరవేరుస్తునే పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. తాజాగా.. బీజేపీ మాజీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అసలు రాజకీయాల్లో లేని వారిపై ఈ విమర్శలు ఏంటని మండిపడ్డారు. డీఎంకే నేత ఉదయ నిధి స్టాలీన్, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్.బీ. ఉదయకుమార్ ఇటీవల త్రిషపై చేసిన వ్యాఖ్యలపై సెటైరికల్ గా స్పందించారు. రాజకీయాల్లోకి మహిళలను లాగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ఇటీవల కొంత మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారు మహిళల్నిఅనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలు, మహిళల్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం చెన్నైలో నిర్వహించిన 'ఇండియా టుడే రౌండ్‌టేబుల్' సమావేశంలో అన్నామలై పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారాయన్న వాస్తవాన్ని కొంత మంది ఇప్పటికి గ్రహించలేకపోతున్నారన్నారు. Read more: Assam Govt: అస్సాం ప్రభుత్వం మరో సంచలనం.. రెండో పెళ్లి చేసుకుంటే

TVK Vijay Government Completes 100 Days in Tamil Nadu : తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయ్‌కు అధికారం చేపట్టేందుకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవటంతో కాంగ్రెస్‌సహా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. కాగా.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల పాలనలో విజయ్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఏ మేరకు హామీలను అమలు చేశారు.. 100రోజుల విజయ్ పాలన ఎలా ఉందనే విషయాలను పరిశీలిద్దాం.. విజయ్ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సినిమాలో 100వ రోజు విజయానికి సంకేతమైతే.. రాజకీయాల్లో మాత్రం అది పాలనకు తొలి పరీక్ష. అయితే, ఈ వంద రోజుల పాలనలో సీఎం విజయ్ అవినీతి నిర్మూలపై ప్రత్యేక దృష్టిసారించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను టీవీకే సర్కార్ చేపట్టింది. మంచి పాలన అంటే కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేయడం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, అధికార వ్యవస్థలో జవాబుదారీతనం, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందడం కూడా కీలకమే. ముఖ్యమంత్రి విజయ్ అవినీతిని అంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా కేవలం రూ. 1,000 లంచం డిమాండ్ చేసినా, ఆడియో లేదా వీడియో సాక్ష్యాలతో ఫిర్యాదు చేసే పౌరులకు రూ. 1,00,000 నగదు బహుమతి ప్రకటిస్తూ విజయ్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. అవినీతి ఫిర్యాదుల స్వీకరణ కోసం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ వేదికలను అందుబాటులోకి తెచ్చారు. అవినీతికి పాల్పడితే మంత్రులైనా, అధికారులైనా ఎలాంటి

సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వమే కారు, వ్యక్తిగత సహాయకుడిని కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం వెలువడింది. వివరాలు.. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీవీకేకు చెందిన 107 మంది అత్యధిక సభ్యులుగా ఉన్నారు.వీరిలో సీఎం విజయ్‌తో పాటూ 90 శాతం మంది తొలి సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కిన వారే. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ , ఎండీఎంకే ,డీఎండీకే తదితర పారీ్టలలో ఇద్దరు ముగ్గురు కొత్త వారు ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో మెజారిటీ శాతం కొత్త వారు, తొలి సారిగా అడుగు పెట్టినవారే ఉన్నారు. వీరికి అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వాల్సిన పరిస్థితిఏర్పడింది. టీవీకే నుంచి గెలిచిన వారిలో అత్యధిక శాతం అభిమానులే. వీరి ఆస్తి పస్తులు అంతంత మాత్రమే. అప్పోసొప్పో చేసి ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీసీకే చెందిన కాట్టుమన్నార్కోయిల్ ఎమ్మెల్యే జ్యోతిమణి మాట్లాడుతూ.. సభలో చెప్పులు కూడా వేసుకోలేని నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు.. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు సేవ చేయడానికి తమకు సొంత వాహనాలు లేవు అని, అద్దె వాహనాల్లో తిరగాల్సి వస్తున్నట్టు వివరించారు. అలాగే సహాయకుడిని పెట్టుకుని జీతం ఇచ్చే ఆర్థిక స్థోమత కూడా లేదన్నారు. అవినీతి లేని పాలన అందించాలంటే ఎమ్మెల్యేల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేల నుండి వచ్చిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి తీసుకెళ్తానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. సీఎం వద్దకు ప్రతిపాదన.. ఈ విషయంగా స్పీకర్ వినతిపత్రాన్ని సీఎం విజయ్‌కు పంపించారు. ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేలా చూడాలనే ఉద్దేశంతో

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ తో త్రిష పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై చాలా కథనాలు వైరల్ అవుతున్నాయి. కొందరు నేతలు, నటులు ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కావాలనే త్రిష పేరును వివాదాల్లోకి లాగుతున్నారు. కానీ ఈ వ్యాఖ్యలపై త్రిష స్పందించకుండా, తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్ర ప్రజలకు కీలక వరాలు ప్రకటించారు. ఈ ఉదయం చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ పై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా విజయ్ మొదటిసారిగా స్వాతంత్ర్య వేడుకలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ కానుకలను ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.దేశ సేవలో నిమగ్నమైన మాజీ సైనికులు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల సంక్షేమమే ధ్యేయంగా పలు విప్లవాత్మక నిర్ణయాలను విజయ్ వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతి రహిత, అత్యంత పారదర్శకమైన ప్రజాస్వామ్య పాలనను అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే అనే ఉన్నత భావనతో మహిళల రక్షణ, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన పాలనాపరమైన సహకారాన్ని కొనసాగిస్తూనే, స్థానికంగా ప్రజా సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం అంకితభావంతో పోరాడిన యోధులను గౌరవిస్తూ వారి పెన్షన్లను భారీగా పెంచుతున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల నెలవారీ పెన్షన్‌ను రూ. 23,000, వారి కుటుంబ సభ్యులకు అందించే ఫ్యామిలీ పెన్షన్‌ను రూ.12,500కు పెంచామని అన్నారు.వందేమాతరం గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారా?వీరపాండ్య కట్టబొమ్మన్, మరుదు బ్రదర్స్ వంటి చారిత్రాత్మక స్వాతంత్ర్య వీరుల వారసులకు అందించే నెలవారీ ప్రత్యేక పెన్షన్‌ను సైతం రూ.11,500కు పెంచుతూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. మాజీ సైనికుల కుమార్తెల వివాహ సమయాల్లో అందించే ఆర్థిక సహాయాన్ని రూ.25,000 నేరుగా రూ.50,000కు రెట్టింపు చేశారు. శారీరక వైకల్యంతో బాధపడుతున్న మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందించే నెలవారీ ప్రత్యేక సహాయాన్ని రూ.5,000 నుండి రూ.7,000కు పెంచుతున్నట్లు తెలిపారు.ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించినది అసలు మన దేశ జాతీయ పతాకమే కాదు- ఆ దేశానిదిరాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పోలీస్ స్టేషన్ సాధారణ ప్రజల

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్ సెల్యూట్ చేస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీఎం హోదాలో ఆయన పాల్గొన్న తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వేడుకలకు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. విజయ్ తండ్రి తెల్లటి దుస్తుల్లో కనిపించగా.. ఆయన తల్లి ఆకుపచ్చ చీరలో కనిపించారు. కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక నటి త్రిష కృష్ణన్ కూడా తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. చీరలో సంప్రదాయ లుక్‌లో కనిపించిన త్రిష ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవైపు విజయ్ సీఎం హోదాలో తొలి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం, మరోవైపు త్రిష కూడా అదే కార్యక్రమానికి హాజరు కావడంతో వీరిద్దరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వేడుకల అనంతరం విజయ్ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విజయ్, త్రిషకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి గిల్లి, తిరుపాచ్చి, ఆతి, కురువి, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్

తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో నటి త్రిష (Trisha) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె హాజరై వేడుకలను వీక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తల్లిదండ్రులతో కలిసి త్రిష ముందు వరుసలో కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రముఖులను త్రిష చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. వారిని అభివాదం చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని వీక్షించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో త్రిష పేరు కూడా తరచూ వార్తల్లో వినిపిస్తోంది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష హాజరు కావడం చర్చనీయాంశమైంది. తాజాగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ కొన్ని పోస్టర్లు తమిళనాడులో కనిపించాయి. దీనిపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మరోవైపు అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కూడా త్రిష రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి

Trisha : చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హీరోయిన్ త్రిష పాల్గొంది. ఆమె సీఎం విజయ్ తల్లి దండ్రులతో కలిసి మొదటి లైన్లో కూర్చుని వేడుకలను వీక్షించింది. అక్కడికి వచ్చిన అధికారులను నవ్వుతూ పలకరిస్తూ అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 🚨 BREAKING: Actress Trisha attended the 80th Independence Day celebrations at Fort St. George, Chennai, where she was seated in the front row ahead of Chief Minister C. Joseph Vijay's National Flag hoisting ceremony. — Actor Vijay Team (@ActorVijayTeam) August 15, 2026 Yashika Aannand : యషికా ఆనంద్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్.. పసుపు చీరలో త్రిష.. హీరోయిన్ త్రిష పసుపు రంగు చీర ధరించారు. జడలో గజ్రా పెట్టుకుని కనిపించారు. ఇక పరేడ్ సమయంలో సీఎం విజయ్‌కు త్రిష సెల్యూట్ చేశారు. ఈ దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. #Trisha joins the Independence Day celebrations in #Tamil Nadu, attending the grand parade alongside #CMVijays parents.#JustIn #TamilCinema #Wizkid — anisha.m 🦇 (@anisha13_m13) August 15, 2026 విజయ్, త్రిష రిలేషన్ షిప్‌పై గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వీటిపై వారిద్దరూ ఎక్కడ కూడా స్పందించలేదు. ఇటీవల విజయ్ విడాకుల వ్యవహారం అంశం తెరపైకి రావడం, వీరిద్దరూ మరోసారి కలిసి కనిపించడంతో మరోసారి వీరి రిలేషన్ షిప్‌పై చర్చ మొదలైంది. #WATCH | சுதந்திர விழா அணிவகுப்பின்போது சல்யூட் அடித்த முதலமைச்சர்
సినీ నటి త్రిష కృష్ణన్ పై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ఇటీవల నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను తమిళనాడులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టయిన రోజే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ.. ఎంతోమంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో సీనియర్ నటీనటుల గురించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం విజయ్‌కు విశాల్ ఓ విజ్ఞప్తి చేశారు.గత కొన్ని రోజులుగా ‘మకుటం’ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలు, రాజకీయ నాయకులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నటుడు సీమాన్ పాలిటిక్స్ లో నిజాయితీగా తనవంతు పాత్ర పోషిస్తున్నారని, ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను చేయాలనుకుంటున్న మంచి పనుల గురించి చెబుతూ ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ అది రిజల్ట్స్ లో కనిపించడం లేదన్నారు.ఉదయనిధి స్టాలిన్ గురించి విశాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఉదయ్ అంటే చాలా ఇష్టం. ఉదయ్, ఆయన భార్య కృతికతో మంచి సాన్నిహిత్యం ఉంది. అది ఎప్పటికీ మారదు. ఏం జరిగినా మా స్నేహం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చినా.. నాకు, ఉదయ్ మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు రావు. మేం ఒకరినొకరం తిట్టుకోము. నేను ఈరోజు పబ్లిక్ గా చెప్తున్నాను. గతంలో ఒక సినిమా విషయంలో నేను అనుభవించిన బాధ వల్ల, అతడి ప్రొడక్షన్ హౌస్ గురించి కోపంగా మాట్లాడాను. అంతే తప్ప ఉదయ్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అతను చాలా చాలా మంచి వ్యక్తి’’ అని అన్నారు.త్రిషపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్, ఆయన అరెస్ట్‌పై విశాల్ కూడా మాట్లాడారు. “నా స్నేహితుడు ఉదయ్ ఏదో అన్నాడు.. అరెస్ట్ అయి బెయిల్ మీద వచ్చాడు. అదే విధంగా

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన అనగా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 వద్దే శాశ్వతంగా నిలిపి ఉంచాలని ఈ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేశారు. రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపు నిష్పత్తిని ఎలాంటి పరిస్థితుల్లోనూ మార్చకూడదని స్పష్టం చేశారు. అలాగే 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను ఎలాంటి నియోజకవర్గాల పునర్విభజన షరతు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదిత తీర్మానం తమిళనాడు శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందింది. ఇదిలా ఉండగా ఎఐఏడీఎంకే, పీఎంకే, బీజేపీ వంటి కొన్ని ప్రతిపక్ష రాజకీయ పక్షాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచాయి. సీఎం విజయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో ప్రధానంగా నాలుగు రకాల కీలక అంశాలను పొందుపరిచారు. దేశంలోని లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్తంభింపజేయడంతో పాటు తమిళనాడుకు చెందే 39 లోక్‌సభ స్థానాల ప్రాతినిధ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. పార్లమెంటులోని లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న 2.2:1 నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని కోరారు. సభలో సీఎం విజయ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అనేది ఎవరికీ ఇచ్చే ఉపకారం కాదని, అది వారి ప్రజాస్వామ్య హక్కు మరియు సామాజిక న్యాయమని స్పష్టం చేశారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియ ఉండకూడదని తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతినిధ్యం ఆధారంగా సీట్లు తగ్గిస్తే దక్షిణాది తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో లోక్‌సభ సీట్ల పంపిణీ 1971 జనాభా లెక్కల ఆధారంగా గత 50 ఏళ్లకు

లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ నేడు తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ నేడు తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌కు తాము అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్న తమిళనాడుకు డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని అన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నష్టమని చెప్పారు. ఈ తీర్మానంలో సీఎం విజయ్ మొత్తం మూడు డిమాండ్స్‌ను కేంద్రం ముందుంచారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను ఎప్పటికీ 543 వద్ద స్తంభింపజేయాలని అన్నారు. రాష్ట్రాలకు ప్రస్తుతమున్న ఎంపీ సీట్ల సంఖ్యను శాశ్వతం చేయాలని అన్నారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకురావాలని అన్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో రాజకీయ సమీకరణాల మార్పులతో ఎన్డీయే బలం మరింత పెరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో, కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చేందుకు మరోసారి ప్రయత్నిస్తుందన్న కామెంట్స్ వచ్చాయి. అయితే, డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శిగా అర్చనావర్మ నియామకం జైలులో తనిఖీలు.. అడ్డంగా దొరికిన మాజీ ఎంపీ రేవణ్ణ.. ప్రభుత్వం సీరియస్

ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే నేత, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. త్రిష పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై టీవీకే నేతలు, సినీతారలు మండిపడ్డారు, సింగర్ చిన్మయి, సీనియర్ నటి ఖుష్బూ సైతం ఉదయనిధి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఉదయనిధిని అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదలయ్యారు. ఈ వివాదం జరిగి దాదాపు వారం రోజులు అవుతుంది. తాజాగా ఈ కాంట్రవర్సీపై హీరోయిన్ త్రిష తనదైన స్టైల్లో కౌంటర్స్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఉదయనిధి పేరును ప్రస్తావించకుండానే గట్టిగానే ఇచ్చిపడేసింది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో వరుస పోస్టులు చేసింది. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకల నుండి కొన్ని మధురమైన క్షణాలను పంచుకున్నారు త్రిష. అలాగే తనదైన శైలీలో కౌంటర్స్ కూడా పోస్ట్ చేసింది. ఒక పోస్టులో "ఈ వయసులో ఇలాంటి నాటకీయతలు సిగ్గుచేటు. వెళ్లి కొంత డబ్బు సంపాదించి, ప్రశాంతతను కనుక్కో" అనే కోట్ షేర్ చేస్తూ దానికి కనుబొమ్మ ఎత్తిన ఎమోజీని జతచేసింది. అలాగే మరో పోస్టులో "మీరు చేసే ప్రతీదీ మీకే తిరిగి వస్తుంది. మంచి చేయండి, మంచిగా ఉండండి," అని ఉండగా, మూడవ పోస్టులో "ఇది మీకు అన్నీ చివరకు కలిసివచ్చే అధ్యాయం," అనే కోట్ పంచుకుంది. ఇక తర్వాత "సాహసం చేసేవారే గెలుస్తారు" , "ఒకే సమయంలో అది మిమ్మల్ని భయపెడుతూ, ఉత్తేజపరుస్తుంటే, బహుశా అదే మీ తదుపరి ఎత్తుగడ కావచ్చు", "మీకు ఏ లోటూ లేదు. నేను మీకు ఇచ్చినదాన్నే ఉపయోగించుకోండి" అంటూ వరుస పోస్టులు షేర్ చేసింది త్రిష. "ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితం మనకు లభించడం ఎంతటి అదృష్టమో" అని రాసి ఉన్న మరో పోస్ట్‌ను కూడా

ఈమధ్య కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఏం చేసినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. ఆమె మాట్లాడినా సేన్సెషనే.. మాట్లాడకపోయినా సేన్సెషనే. మొన్నటి వరకు విజయ్ పార్టీలో ఆమెకు కూడా పదవి దక్కుతోందని అందరూ భావించారు. ఈమధ్య కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఏం చేసినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. ఆమె మాట్లాడినా సేన్సెషనే.. మాట్లాడకపోయినా సేన్సెషనే. మొన్నటి వరకు విజయ్ పార్టీలో ఆమెకు కూడా పదవి దక్కుతోందని అందరూ భావించారు. అంతేనా త్రిష - విజయ్ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విజయ్ కానీ, త్రిష కానీ నోరు మెదిపింది లేదు. దీంతో త్వరలోనే త్రిష పెళ్లి అయిపోతుంది అనుకున్నారు. కానీ, ఇంతలోనే పెద్ద ట్విస్ట్. విజయ్ తో విడాకులు వద్దంటూ సంగీత కేసును వెనక్కి తీసుకుంది. ఇక విజయ్ - సంగీత కలిసి ఉంటే త్రిష పరిస్థితి ఏంటి.. ప్రేస్తుతం కోలీవుడ్ ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ.. ఏదో ఒక పోస్ట్ పెట్టే త్రిష కూడా సడెన్ గా సైలెంట్ గా మారింది. తాజాగా త్రిష పెట్టిన క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రముఖ రచయిత డానియెల్ చిడియాక్ రాసిన కోట్‌ను పంచుకుంటూ, ఆలోచిస్తున్నట్లు ఉన్న ఎమోజీని జోడించింది. అందులో 'ఈ వయసులో డ్రామాలు చేయడం నిజంగా సిగ్గుచేటు... పోయి నాలుగు రాళ్ళు సంపాదించుకుని ప్రశాంతతను వెతుక్కోండి' అంటూ రాసి ఉంది. అయితే ఆమె ఈ కోట్ పెట్టడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియలేదు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, త్రిష ఎవరికి కౌంటర్ ఇచ్చారనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల తనపై గానీ, తన పర్సనల్ లేదా ప్రొఫెషనల్ లైఫ్‌పై గానీ పరోక్ష వ్యాఖ్యలు చేసిన ప్రముఖులకు ఇచ్చి

కోలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యారు హీరో విశాల్. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నా్రు. అలాగే ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ ను కలిసిన తన అనుభవం వెల్లడించారు. “నేను ఇటీవల విజయ్‌ని కలిసినప్పుడు కూడా అతను అలాగే ఉన్నాడు. నేను ఎలాంటి బోకే తీసుకెళ్లలేదు. ఎందుకంటే నేను సాధారణంగా బోకేస్ కొనను. అతను అలాగే ఉన్నాడు, కేవలం పోస్టింగ్ మాత్రమే మారింది” అంటూ చెప్పుకొచ్చారు విశాల్. చాలా మంది నటీనటులకు రాజకీయాల్లో లభించనప్పటికీ, తమిళనాడులో తలపతి విజయ్ రెండేళ్లలో విజయం సాధించగలరన్న అంచనాలున్న నేపథ్యంలో, నటులను తమిళ ప్రజలు పాలనలో ఎందుకు విశ్వసిస్తారనే ప్రశ్నకు విశాల్ సమాధానమిచ్చారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. నిజానికి, ఇది కేవలం నటుల పట్ల విశ్వాసం కాదని, అపారమైన ప్రజాదరణ కలిగిన నటుల పట్ల మాత్రమేనని విశాల్ స్పష్టం చేశారు. విజయ్ విషయంలో ప్రజలు తమ నమ్మకాన్ని ఉంచడానికి ఆయన కేవలం నటుడు కాబట్టి కాదు. ప్రజలు తీవ్రమైన మార్పును కోరుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రజలతో బలమైన అనుసంధానం (కనెక్టివిటీ) అనేది ఒక ముఖ్యమైన అంశమని వెల్లడించారు. ఈ కారణాల వల్ల, మొదటిసారి ఓటర్లు, ఇతర ప్రజలు మార్పు కోసం విజయ్ వైపు మొగ్గు చూపారని విశాల్ వివరించారు. ఇప్పుడు ఆయన ఎలా పని చేస్తారు అనేది చూడాలి, అదే అత్యంత ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు. ఇది కేవలం నటనకు మించి, ప్రజలతో నిజమైన అనుసంధానం, బాధ్యత గురించి అని అన్నారు. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న

నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా చిన్నపిల్లవాడిగానే మా అమ్మ చూస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, యంగ్ దర్శకుడు జాసన్ సంజయ్ అన్నారు. నేను పెరిగి పెద్దవాడైనప్పటికీ నన్ను ఇంకా చిన్నపిల్లవాడిగానే మా అమ్మ చూస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamil Nadu CM Vijay) కుమారుడు, యంగ్ దర్శకుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) అన్నారు. సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్ నిర్మించిన ‘సిగ్మా’ (Sigma) చిత్రంతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను జాసన్ సంజయ్ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో.. తన గురించి ఇంటిలోని వారు ఎలా ఆలోచిస్తున్నారో జాసన్ సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా జాసన్ సంజయ్ మాట్లాడుతూ.. నేను ఇంత పెద్దవాడిని అయ్యాను. కానీ, మా అమ్మ ఇంకా నన్ను చిన్నపిల్లవాడిగానే చూస్తోంది. నా పనుల్లో బిజీగా ఉండటంతో ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. కానీ, ఆమె మాత్రం పదేపదే ఫోన్ చేసి.. టైమ్‌కి తిన్నానా, లేదా? అని నా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా నేను పని ఒత్తిడితో నీరసించి పోతే ఆమె ఎంతగానో ప్రోత్సహిస్తారు. సినిమా విషయంలో ఆమె అభిప్రాయాలు, సలహాలను గౌరవిస్తాను. ‘సిగ్మా’ సినిమా చూసిన తర్వాత అమ్మ చేసే కామెంట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇక నాన్న విషయానికి వస్తే.. నా విషయంలో నాన్న పూర్తి స్వేచ్ఛనిచ్చారు. విదేశాలకు వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తానని చెప్పగా ఆయన సమ్మతించారు. అలాగే, సినిమాలోని అనేక శాఖలపై పట్టు సాధించేందుకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ‘సిగ్మా’ స్టోరీ లైన్ కూడా నాన్నకు తెలుసు. మొదటి నుంచి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటడమే కాకుండా, చాలా స్వేచ్ఛనిచ్చారు. ‘సిగ్మా’ సినిమా చూసిన తర్వాత నాన్న అభిప్రాయం కోసం కూడా వేచి చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో ఓ నూతన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో రూ. 10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ప్రముఖ దేవాలయాలకు వంశపారంపర్యేతర పాలక మండళ్లు, ధర్మకర్తలను ఎంపిక చేయడానికి ఉద్దేశించిన కమిటీ ఇది. ఆయా ఆలయాలన్నింటిల్లో ఇప్పుడున్న పాలకమండళ్ల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఈ కమిటీని తెరమీదికి తీసుకొచ్చింది.ఈ ఉన్నత స్థాయి కమిటీకి మైలం బొమ్మపురం మఠానికి చెందిన శివజ్ఞాన బాలాయ స్వామి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. రిటైర్డ్ సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ కెే రామనాథన్ వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సభ్యులుగా స్థానం లభించింది. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మత అర్చన కల్పాతి అఘోరం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఆర్ సంపత్, సుమతిశ్రీ, డాక్టర్ టీ వేల్ మురుగన్ ఉన్నారు.వీరితో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ ఈ కమిటీకి కార్యదర్శిగా, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు. ఆలయాల ధర్మకర్తల ఎంపిక ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, సజావుగా సాగడానికి ఈ కమిటీ తగిన సూచనలు, సలహాలు ఇస్తుందని, అర్హులైన నాన్ హెరిడేటరీ పాలక మండళ్లు, సభ్యుల నియమాకాలకు అవసరమైన పేర్లను సిఫారసు చేస్తుందని దేవాదాయ శాఖ వెల్లడించింది.టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పవర్ ఫుల్ టైటిల్: ఎప్పుడూ చేయని రోల్ లో యంగ్ హీరోఅలాగే దేవాదాయ చట్టం 1959 లోని సెక్షన్ 46 (3) నిబంధనల ప్రకారం అర్హులైన దరఖాస్తుదారులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండే దేవాలయాలకు మాత్రమే ఈ వంశపారంపర్యేతర ధర్మకర్తల నియమకం వర్తిస్తుంది. దేవాలయాల నిర్వహణలో స్థానిక భక్తులు, నిష్ణాతులకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఆలయాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు

ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు శాసనసభలో ఓ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలోనే విధిగా తమిళ్ తాయ్ వాళ్తు (తమిళ తల్లికి వందనం) గీతాన్ని ఆలపించడానికి ఉద్దేశించిన తీర్మానం ఇది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర గీతాలాపన ప్రొటోకాల్ చుట్టూ చోటు చేసుకుంటోన్న వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు విజయ్ స్వయంగా ఈ ప్రతిపాదనను సభ ముందుకు తెచ్చారు.టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోందనే విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. టీవీకే ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో వందేమాతరం గీతానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి దీనికి కారణమైంది. తమిళ తాయ్ వాళ్తును ఏకంగా మూడో స్థానానికి పరిమితం చేయడం.. దీనికి ఆజ్యం పోసింది. మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకల్లో కూడా ఇదే విధానం పునరావృతం కావడంతో ప్రతిపక్షాల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.ఇటీవల మనోన్మణీయం సుందరనార్ యూనివర్శిటీ ఉత్సవాల్లో కూడా రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ గీతాన్ని పక్కనబెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాము ఇలా చేయాల్సి వచ్చిందంటూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు అప్పట్లో. ఇది దుమారం రేపింది.100 రోజుల పాలన నాడు సీఎం విజయ్ బిగ్ ప్లాన్: ట్రెండ్ సెట్ ఈ నేపథ్యంలో.. విజయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. తమిళం అనేది ఓ భాష మాత్రమే కాదని, అది తమ రాష్ట్ర అస్తిత్వానికి, ఊపిరికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రాంతీయ భాష తమిళం అని, తమ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదని గుర్తు చేశారు. తమిళం అంటే ప్రేమ, తమిళం అంటే పవర్, తమిళం

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్, ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో వరుస ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay), ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ (Director Shankar) ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకేచోట ఈ ఇద్దరూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో, అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ గురించిన చర్చలు మొదలుపెట్టారు. వీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారనేది క్లారిటీ లేదు కానీ, వీరి మీట్లో శంకర్ ఎంతో ఆప్యాయంగా జాసన్ సంజయ్‌ను కౌగిలించుకుని, ఆయనను ఆత్మీయంగా పలకరించడం కనిపించింది. జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టుల గురించి, ఆయన ప్రతిభ గురించి శంకర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. జాసన్ విజన్, పనితీరును అభినందిస్తూ శంకర్ చెప్పిన మాటలకు జాసన్ కూడా ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇద్దరి మధ్య సాగిన సంభాషణ అక్కడ ఉన్న కెమెరాలు బంధించాయి. కాగా, జాసన్ సంజయ్ ఇప్పటికే విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేసి దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సిగ్మా’ (Sigma) అనే భారీ చిత్రంతో ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ స్వయంగా జాసన్‌ను కలుసుకొని ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ లేదా కొలాబరేషన్ ఉంటుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Mega158: ‘మెగా158’లో మురళీ శర్మ లుక్ చూశారా.. మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే ఫ్యాన్స్ ప్రెషర్ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే

Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సతీమణి సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త చర్చలు, ఊహాగానాలు మొదలు అయ్యాయి. విజయ్-సంగీత మళ్లీ కలుస్తారంటూ కొంత మంది అంటుండగా, అదేం కాదు కోర్టు వెనుక విడాకుల అంశాన్ని సెటిల్ చేసుకుంటారని ఇంకొందరు చెబుతున్నారు. కాగా.. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. విపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో శ్రేయోభిలాషుల సూచన మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Varanasi : మహేశ్ బాబు బర్త్‌డే.. వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది.. ఇకపై ఈ విషయాన్ని మీడియా ప్రచారానికి, కోర్టు పరిధికి దూరంగా ఉంచి.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇరువర్గాల మధ్య మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరగనున్నట్లు సమాచారం. 1998లో విజయ్, సంగీత తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తరువాత 1999లో చెన్నైలో సంప్రదాయ పద్దతిలో వివాహం జరిగింది. ఈ జంటకు కొడుకు జేసన్ సంజయ్ (25), కుమారై దివ్య సాషా (20) సంతానం

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం అటు తమిళ్ ఇండస్ట్రీలో .. ఇటు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం అటు తమిళ్ ఇండస్ట్రీలో .. ఇటు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరైన సంగీత.. ఈ కేసును ఇకపై కోర్టులో కొనసాగించబోనని వెల్లడించింది. దీంతో విజయ్ అభిమానుల్లో మరోసారి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. విజయ్ రాజకీయ ప్రచారం తలమునకలు అయ్యి ఉన్నప్పుడు సంగీత ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. విజయ్ తో విడాకులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా విజయ్.. త్రిషతో రిలేషన్ లో ఉన్నాడని, అతనితో ఇక కలిసి ఉండడం తనవలన కాదని తేల్చి చెప్పింది. దీంతో పాటు భారీ సంఖ్యలో భరణం కూడా కావాలని కోరింది. ఇక సడెన్ గా ఇప్పుడు ఆమె ప్లేట్ తిప్పేసింది. విడాకుల కేసును వెనక్కి తీసుకుంది. అంటే అప్పుడు సంగీత చేసిన ఆరోపణలన్నీ అబద్ధమా.. ? లేక వారిద్దరి రిలేషన్ ని ఆమె ఒప్పుకుందా.. ? అనే అనుమానాలు ఇండస్ట్రీలో తలెత్తుతున్నాయి. భర్త వేరొక నటితో సంబంధం పెట్టుకొని, ఇద్దరూ కలిసి అన్నీ ఫంక్షన్స్ కి వెళ్తూ.. ఆయన సక్సెస్ కి ఆమె కారణం అని ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా కూడా సంగీత ఇవన్నీ తట్టుకొని విజయ్ తో ఉంటుందా.. ? అంతటి తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత మళ్లీ పాత బంధాన్ని కొనసాగించడానికి ఆమె ఒప్పుకుందా.. ? కుటుంబ పెద్దలు వారిద్దరినీ కూర్చోబెట్టి ఏవిధంగా సంగీతని ఒప్పించారు.. ?