
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Annamalai reacts on trishan and udhayanidhi stalin row: తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం త్రిష చుట్టునే తిరుగుతున్నాయి. ఇటీవల ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కూడా త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అంతే కాకుండా సీఎం విజయ్ దళపతి తల్లిదండ్రుల పక్కనే కూర్చొవడం కూడా త్రిషకు వారి ఇంట్లో ఏస్థానం ఉందో అందరికి తెలిసినట్లైంది.ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హమీల్ని నెరవేరుస్తునే పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు.
తాజాగా.. బీజేపీ మాజీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అసలు రాజకీయాల్లో లేని వారిపై ఈ విమర్శలు ఏంటని మండిపడ్డారు. డీఎంకే నేత ఉదయ నిధి స్టాలీన్, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్.బీ. ఉదయకుమార్ ఇటీవల త్రిషపై చేసిన వ్యాఖ్యలపై సెటైరికల్ గా స్పందించారు.
రాజకీయాల్లోకి మహిళలను లాగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ఇటీవల కొంత మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారు మహిళల్నిఅనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలు, మహిళల్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం చెన్నైలో నిర్వహించిన 'ఇండియా టుడే రౌండ్‌టేబుల్' సమావేశంలో అన్నామలై పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారాయన్న వాస్తవాన్ని కొంత మంది ఇప్పటికి గ్రహించలేకపోతున్నారన్నారు.
Read more: Assam Govt: అస్సాం ప్రభుత్వం మరో సంచలనం.. రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కట్.!. వీళ్లకు మాత్రమే.!.
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం వంద రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ఆయన తమిళ రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని అన్నామలైప్రశంసించారు. అయిన కూడా.. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. అదే విధంగా ఇంకా సీఎం విజయ్ సర్కారులో స్పష్టమైన దార్శనికత లోపించిందన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారిపై 'బీజేపీ బీ-టీమ్' అంటూ ముద్ర వేయడం సరికాదని అన్నామలై తెల్చి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.