
Anupama Parameswaran : వైట్‌డ్రెస్‌లో పవర్ ఫుల్ లుక్స్‌తో.. అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు..
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా వైట్ డ్రెస్ లో పవర్ ఫుల్ లుక్స్ తో పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 nimisham.in

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా వైట్ డ్రెస్ లో పవర్ ఫుల్ లుక్స్ తో పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె అనుపమ కాంట్రవర్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి శంకర్ (Aditi Shankar).. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హీరో కార్తి సరసన ‘విరుమన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత ‘మావీరన్, ‘నేసియప్పా’ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా అర్జున్ దాస్ సరసన ఆమె నటించిన రొమాంటిక్ డ్రామా ‘వన్స్‌మోర్’ ఈ నెల 27న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి శంకర్, ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) - ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) కాంట్రవర్సీపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై అదితి శంకర్ పూర్తిస్థాయిలో అనుపమకు మద్దతుగా నిలిచారు. ‘‘అనుపమ చూపించిన ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలామంది తమకు జరిగిన అన్యాయాన్ని, బాధను మనసులోనే దాచుకుని కుమిలిపోతారు. కానీ అనుపమ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వాస్తవాలను బయటకు మాట్లాడింది. ఆమె చెప్పిన విషయాలపై కొందరిలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ, ఆమె మాటల్లో నాకు పూర్తి నిజాయితీ కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి మానసిక క్షోభను అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను ఓపెన్‌గా మాట్లాడి అందరికీ అవగాహన కల్పించింది. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల చాలామందికి ఒక స్పష్టత వచ్చిందని నమ్ముతున్నాను’’ అని అదితి పేర్కొన్నారు. అలాగే చిత్రసీమలో తన కెరీర్ ప్రయాణంపై వస్తున్న కామెంట్లపై కూడా ఆమె స్పందించారు. చిత్రపరిశ్రమలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఎందుకు చేశారని చాలామంది అడుగుతున్నారని చెబుతూ.. సంఖ్య కంటే కంటెంట్ ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మనం

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్టు 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లేదని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సినిమాలోని భారీ దృశ్య ప్రభావాల పనులకు మరింత సమయం అవసరం కావడంతో ‘భోగి’ రిలీజ్ వాయిదా నిర్ణయానికి వచ్చారు. పీరియడ్ ప్రపంచాన్ని, భారీ యాక్షన్ సన్నివేశాలను అత్యుత్తమ నాణ్యతతో చూపించేందుకు ఎక్కడా రాజీ పడకూడదని చిత్రబృందం భావిస్తోంది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. గతంలో ‘భోగి’ సినిమాను ఆగస్టు 28న రక్షాబంధన్ సమయంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులను వేగంగా కొనసాగించారు. ఇప్పటికే సినిమా కోసం రూపొందించిన భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను కూడా చిత్రబృందం పూర్తి చేసింది. అయితే దృశ్య ప్రభావాల పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో ‘భోగి’ రిలీజ్ వాయిదా తప్పలేదు. ముఖ్యంగా 1960ల కాలానికి సంబంధించిన వాతావరణం, యాక్షన్ దృశ్యాల్లో అవసరమైన స్థాయి నాణ్యత కోసం అదనపు సమయం తీసుకుంటున్నారు. దీంతో ఆగస్టు 28 విడుదల లక్ష్యాన్ని వదులుకుని నిర్మాణానంతర పనులకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు. దాదాపు 30 రోజులపాటు సాగిన భారీ క్లైమాక్స్ షెడ్యూల్లో శర్వానంద్ తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ముందుగా జరిగిన 22 రోజుల క్లైమాక్స్ చిత్రీకరణలో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. భారీ సెట్‌పై దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఈ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంత భారీ స్థాయిలో రూపొందించిన సన్నివేశాలకు తగిన దృశ్య నాణ్యత అందించాలనే లక్ష్యమే ‘భోగి’ రిలీజ్ వాయిదాకు ప్రధాన కారణంగా మారింది. ‘భోగి’ కథ 1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగనుంది. శర్వానంద్ ఇందులో ‘గంగా’ అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించనుండగా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్

Aditi Shankar: నటి అనుపమ పరమేశ్వరన్ గురించి తాజాగా మరో హీరోయిన్ అదితి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అనుపమ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ గత సంబంధం కారణంగా తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, బాధ గురించి ఆమె ఓపెన్‌గా చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అనుపమ తన గత సంబంధం గురించి మాట్లాడిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. తనకు ఎదురైన పరిస్థితులను దాచకుండా, వాటి గురించి ధైర్యంగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపైనే తాజాగా అదితి శంకర్ స్పందించారు. అనుపమ మాట్లాడిన విధానం తనకు నచ్చిందని ఆమె చెప్పారు. అనుపమ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆమెపై మరింత గౌరవం పెరిగిందని అదితి తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితులు ఉంటాయని, అయితే వాటి గురించి బయటకు చెప్పడం అంత సులభం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి సమయంలో అనుపమ తన అనుభవాన్ని ధైర్యంగా పంచుకోవడం అభినందించాల్సిన విషయమని అన్నారు. ముఖ్యంగా తనకు జరిగిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు అనుపమలో నిజాయితీ కనిపించిందని అదితి పేర్కొన్నారు. ఎదురైన సమస్యలతో కుంగిపోకుండా, వాటి నుంచి బయటకు వచ్చి తన జీవితాన్ని కొనసాగించడం గొప్ప విషయమని చెప్పారు. అనుపమ చెప్పిన విషయాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మరికొందరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చని అదితి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. అనుపమ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా గతంలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. ఆ బంధం కారణంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని, తనను తానే తప్పుపట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పినట్లు సమాచారం. సుమారు రెండేళ్ల పాటు ఆ సంబంధంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్

ఇటీవల తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడి కలకలం రేపింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). అతను తనను మానసికంగా ఎలా వేధించాడో చెప్పింది. మొత్తం తన కంట్రోల్ లో ఉంచుకోవాలని తనకు నరకం చూపించాడని చెప్పింది. ఆమె తాజా ఇంటర్వ్యూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలోని అనేక అంశాలను జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు తమిళ కుర్ర హీరో, మాజీ సూపర్ స్టార్ విక్రమ్ కొడుకు అనేది గుసగుస. ఆమె డైరెక్ట్ గా ధృవ్ విక్రమ్ (Dhurvu Vikram) పేరు చెప్పలేదు కానీ వాళ్ళు రెండేళ్లు డేటింగ్ లో ఉన్నారు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అందుకే ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అలాంటి షాకింగ్ విషయాలు చెప్పేసరికి ఆమె ఇంటర్వ్యూ అంత వైరల్ అయింది. ఇప్పుడు ఇంకో విషయం బయట పెట్టింది. ఇద్దరూ పెళ్లి చేసుకొని గంపెడు పిల్లలను కనాలకుందట. 11 మంది పిల్లలను కనాలని ఆమెకి ఇంతకుముందు కోరిక ఉండేదట. కానీ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ తర్వాత పిల్లలను కనాలనే కోరిక కూడా పోయింది అని చెప్పింది

తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు. తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ (Vikram) కొడుకు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు. హీరోగా లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ కుర్రాడు చేసినవి కొన్ని సినిమాలే అయినా, వివాదాలు మాత్రం లెక్కలేనన్ని ఎదుర్కొంటున్నాడు. ఇక ఈమధ్య నటి అనుపమ పరమేశ్వరన్తో బ్రేకప్, ధృవ్ ఎంత టాక్సిక్ అని ఆమె చెప్పిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఇటీవలే ఈ బ్రేకప్ విషయంపై ధృవ్ స్పందిస్తూ.. ప్రేమించిన వారికి బలం ఇవ్వాలి, ట్రోల్స్ వలన నేను కూడా బాధపడ్డాను అని చెప్పాడు. అయితే ఈ వివాదం ముగియకముందే, సినిమా చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని నిర్మాతలను మోసం చేశాడంటూ మరో వివాదం రగులుకుంది. ఇది పాతదే అయినా మరోసారి వైరల్ గా మారింది. గతంలో ధృవ్ విక్రమ్‌పై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్‌తో ఒక సినిమా ఓకే చేసి.. రూ. 1 కోటి అడ్వాన్స్ తీసుకున్నాడు. దీంతో మేకర్స్ పాటలు, సెట్లు, నటీనటుల ముందస్తు ఖర్చుల కోసం నిర్మాతలు భారీగా డబ్బులు వెచ్చించారు. కానీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి తమకు చెప్పకుండా ధృవ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కరణ్ దర్శకత్వంలో ఓ సినిమాను #DV4 గా అనౌన్స్ చేశాడు. లెక్క ప్రకారం రమేష్ వర్మతో చేయాల్సిన చిత్రమే #DV4 కావాలని, మైత్రీ మూవీస్ ప్రాజెక్ట్ #DV5 అవ్వాలని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై

గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తొలిసారి బహిరంగంగా స్పందించాడు. తన సహనటి అనుపమ పరమేశ్వరన్ గతంలో ఓ రెండేళ్ల సంబంధంలో తాను ఎదుర్కొన్న నియంతృత్వం, నార్సిసిజం గురించి మాట్లాడిన తర్వాత, ఆ వ్యాఖ్యలు ధ్రువ్‌ను ఉద్దేశించేనని పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ధ్రువ్ మౌనం వీడాడు.‘ఇండియా టుడే తమిళ్’ నిర్వహించిన ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ధ్రువ్‌ను.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటున్నారని ప్రశ్నించగా.. "నిజం చెప్పాలంటే, ఈ ప్రచారం నన్ను ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కచ్చితంగా దాని ప్రభావం నాపై పడింది. కానీ, ఇలాంటి సమయంలో వాస్తవానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. మనం ఎవరో, మన విలువేంటో తెలుసుకోవాలి. మనం ప్రేమించే వారిని, మనకు ముఖ్యమైన ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాలి" అని ఆయన అన్నారు.బయటివారి అభిప్రాయాల ప్రభావం తనపై ఎక్కువగా ఉండదని చెబుతూ, "మీరు నిజానికి కట్టుబడి ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏది నిలబెడుతుందో మీకు తెలిసినప్పుడు, బయటివారి విమర్శలు ఓ స్థాయిని దాటి వెళ్లలేవు. మనకు తెలియకుండానే మనం ఒంటరి సైన్యంలా మారతాం. మనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుని, మన అంతర్గత బలాన్ని కాపాడుకుంటాం" అని ధ్రువ్ వివరించాడు.ప్రముఖుల జీవితాల్లో ఇలాంటి పరిశీలన సర్వసాధారణమే అయినా, తన ప్రియమైన వారిని కాపాడుకోవడం, వ్యక్తిగత హద్దులు గీసుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ సంభాషణలో ఆయన ఎక్కడా అనుపమ

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) రీసెంట్ గా తన గత రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన ఆ రిలేషన్లో తాను ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే రిలేషన్ లో ఉన్న వ్యక్తి పేరును అనుపమ ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో ఆమెకు ధృవ్ విక్రమ్(Dhruv vikram)తో ఉన్న రిలేషన్షిప్ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు ఈ కామెంట్స్ ను అతడితో ముడిపెట్టారు. దీంతో ధృవ్ పర్సనల్ లైఫ్ ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. ఈ పరిణామాలపై ధృవ్ విక్రమ్ తాజాగా రియాక్ట్ అవుతూ, తన వ్యక్తిగత విషయాలపై ఇంతటి స్థాయిలో చర్చ జరగడం అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. తాను సాధారణంగా పర్సనల్ లైఫ్ ను బహిరంగంగా మాట్లాడే వ్యక్తిని కాదని, అయినప్పటికీ ప్రస్తుతం తనపై అనవసరమైన ఫోకస్ పెరిగిందనే భావనను వ్యక్తం చేశారు. ప్రతి డిస్కషన్ కు, ప్రతి ఊహాగానానికి రియాక్ట్ అవడం కంటే తన పని, కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. మరోవైపు, అనుపమ తన గత రిలేషన్ తనపై చూపిన ప్రభావాన్ని బహిరంగంగా వివరించినప్పటికీ, ఆమె కామెంట్స్‌లో ధృవ్ విక్రమ్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావనకు రాలేదు. అంతేకాకుండా ఆ సంబంధాన్ని పెళ్లి దిశగా తీసుకెళ్లకుండా తానే ఆపుకున్నానని ఆమె వెల్లడించారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో సోషల్ మీడియా ఊహాగానాలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది

ఇంటర్నెట్ డెస్క్: ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతోన్న ప్రచారం, ఎదురవుతోన్న విమర్శలపై స్పందించారు. నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం తనపై (Dhruv Vikram) వస్తున్న వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నటి పేరు ప్రస్తావించనప్పటికీ.. బ్రేకప్ గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడారు. ‘‘నా బ్రేకప్ తర్వాత ఎదురైన కష్టకాలం నన్ను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసింది. కానీ, నా కుటుంబం, అభిమానులు అందించిన కొండంత ధైర్యం వల్లే నేను దాని నుంచి బయటకు రాగలిగాను. సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పుడే నా వ్యక్తిగత జీవితంపై అందరూ దృష్టి పెడతారని తెలుసు. ఆ సమయంలో మా అమ్మ నాకు ఎప్పటికప్పుడు ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు. ‘‘నిజం చెప్పాలంటే, ఈ ప్రచారం నన్ను అస్సలు ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కానీ, ఇలాంటి సమయంలో మనల్ని మనం ఎక్కువ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనమేమిటో, దేనికోసం నిలబడ్డామో తెలుసుకోవాలి. మనకు నచ్చిన వారిని, మన ప్రాణంగా భావించే ప్రతి విషయాన్ని కాపాడుకోవాలి. మన ప్రవర్తన నిజాయతీగా ఉన్నప్పుడు, ఈ విమర్శలు మనల్ని ఏం చేయలేవు’’ అని అన్నారు. తాను సోషల్ మీడియాలో తక్కువ సమయం గడుపుతానని ధ్రువ్ తెలిపారు. ‘‘నాకు ఎడిటింగ్ చేయడం, వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం. వీడియోలను షూట్ చేసి మ్యూజిక్‌కి తగ్గట్టుగా కట్ చేస్తుంటాను. వాటిని సోషల్ మీడియాలో పంచుకోను కానీ, అది నాకు చాలా ఇష్టమైన పని. సినిమాలు విడుదలయ్యేటప్పుడు ప్రమోషన్స్ ఉన్నప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. మిగిలిన సమయాల్లో పుస్తకాలు చదవడం, సంగీతం వినడంలో మునిగిపోతాను’’ అని చెప్పారు. ఇక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్ గురించి చెప్పిన మాటలు వైరలైన విషయం తెలిసిందే. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నరకం అనుభవించినట్లు చెప్పారు
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు, వివాదాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మధ్య నడిచిన ప్రేమాయణం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు, తన పార్టనర్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే వీరి బ్రేకప్‌కి ధ్రువ్ కారణమంటూ వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి.* యానిమేషన్లో రామాయణం.. ‘మెగా 158’ మేకర్స్‌తో అనిల్ రావిపూడి సరికొత్త ప్రయోగం!తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్‌పై ధృవ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడే ఇక్కడ వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సర్వసాధారణమని నాకు తెలుసు. అలాగని ఇవి నన్ను అస్సలు బాధించలేదని, నాపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పలేను. అయితే జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులకు అండగా నిలవడం, వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీ మార్గంలో ఉన్నప్పుడు, మన విలువలు స్పష్టంగా ఉన్నప్పుడు కాలక్రమేణా ఈ దుష్ప్రచారాలు, విమర్శలన్నీ సమసిపోతాయి" అని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన అభిమానుల మద్దతే ముందుకు నడిపిస్తోందని తెలిపారు.అనుపమ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన గత సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, దాదాపు రెండేళ్ల పాటు ఓ టాక్సిక్ రిలేషన్షిప్లో తీవ్ర మానసిక క్షోభను అనుభవించానని ఆమె వెల్లడించారు. అవతలి వ్యక్తి తన ప్రతి చిన్న విషయాన్ని, కెరీర్ నిర్ణయాలను నియంత్రించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ అనుభవాల వల్ల తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Dhruv Vikram:అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ రిలేషన్షిప్, బ్రేకప్ గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ రెండేళ్ల రిలేషన్షిప్లో తాను మానసిక వేధింపులు, నియంత్రణను ఎదుర్కొన్నట్లు అనుపమ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. అయితే ఆమె తన మాజీ ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆ రిలేషన్షిప్ ధ్రువ్ విక్రమ్తోనేనా అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు, చర్చలపై ధ్రువ్ విక్రమ్ స్పందించారు. ఇటీవల ఓ రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్న ధ్రువ్ విక్రమ్‌ను వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలు తనను ఎంతవరకు ప్రభావితం చేశాయని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. ఇలాంటి విషయాలు తనను అసలు ప్రభావితం చేయలేదని చెప్పడం నిజం కాదని తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. తాను ఎవరో, తన విలువలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని ధ్రువ్ అన్నారు. తనకు ముఖ్యమైన వ్యక్తులు, విషయాలను కాపాడుకోవడంపైనే దృష్టి పెడతానని తెలిపారు. నిజం ఏమిటో తనకు తెలుసు కాబట్టి బయట నుంచి వచ్చే విమర్శలు ఒక స్థాయికి మించి తనను ప్రభావితం చేయలేవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రపంచాన్ని తాను కాపాడుకుంటూ, అంతర్గతంగా బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో తాను ఎక్కువగా యాక్టివ్‌గా లేకపోవడానికి గల కారణాలపై కూడా ధ్రువ్ స్పందించారు. తనకు ఫొటోలు

తమిళ వర్సటైల్ యాక్టర్ నటుడు విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ పేరు ఈమధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. అందాల భామ అనుపమ పరమేశ్వరన్- ధృవ్ ప్రేమాయణం ఎంత ఫేమస్ అయ్యిందో .. వారి బ్రేకప్ మరింత ఫేమస్ అయ్యింది. తమిళ వర్సటైల్ యాక్టర్ నటుడు విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) పేరు ఈమధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)- ధృవ్ ప్రేమాయణం ఎంత ఫేమస్ అయ్యిందో .. వారి బ్రేకప్ మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా అనుపమ.. ధృవ్ పెద్ద టాక్సిక్ అబ్బాయి అని.. రెండేళ్ళు నరకం చూపించాడు అని చెప్పుకొచ్చింది. దీంతో కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం గురించి చర్చ మొదలయ్యింది. ఇంత జరిగినా కూడా ధృవ్ ఈ బ్రేకప్ పై నోరు మెదపలేదు. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై తాజాగా స్పందించాడు. ఇండస్ట్రీలో ఒక నటుడిగా కొనసాగుతున్నప్పుడు వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సహజమేనని, అయితే అలాంటి వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయలేదని చెప్పలేనని అతను బహిరంగంగా అంగీకరించాడు. ఈ సందర్భంగా ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. "నేను చాలా చిన్న వయసులోనే ఈ సినీ పరిశ్రమను నా వృత్తిగా ఎంచుకున్నప్పుడు, ఇక్కడ మన వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన విమర్శలు, పరిశీలనలు ఉంటాయని నాకు ముందే అర్థమైంది. ఇవి నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కానీ మనం ప్రేమించే వ్యక్తులను ఎల్లప్పుడూ బలంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీగా, సత్యం వైపు నిలబడినప్పుడు, మనల్ని నడిపించే సూత్రాలు స్పష్టంగా ఉన్నప్పుడు, ఇలాంటి విమర్శలన్నీ కాలక్రమేణా మాయమవుతాయి'అని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశాడు. తన ప్రయాణంలో ఎదురైన ఒడుదొడుకుల్లో అభిమానులు,మద్దతుదారులు అందించిన ప్రోత్సాహమే తనను

‘ప్రేమించడమే నేను చేసిన పెద్ద తప్పా? అస్సలు నా తప్పేమీ లేకపోయినా నాదే తప్పు అని నమ్మించారు. నా వ్యక్తిత్వం కుంచించుకుపోయేలా చేశారు... హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తూ చేసిన సంచలన వ్యాఖ్యలివి. తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక, అతడిది ఒక 'నార్సిసిస్ట్' (Narcissist) బిహేవియర్ అని ఓపెన్‌గా చెప్పేసింది. అసలు ఇంతకీ అనుపమను అంతగా నరకం చూపించిన ఆ 'నార్సిసిస్ట్ బిహేవియర్' అంటే ఏంటి? ఆ మనస్తత్వం ఉన్నవాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.. నార్సిసిజమ్ అంటే మానసిక శాస్త్రంలో తన గురించి తాను విపరీతమైన గొప్పలు ఊహించుకుంటూ, ఎదుటివారి భావాలను పూర్తిగా తొక్కిపడేసే స్వార్థపూరిత మనస్తత్వం. 'అపరిచితుడు' తరహా ప్రవర్తన (Extreme Mood Swings): అనుపమ చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఒకరోజు విపరీతమైన ప్రేమ చూపుతాడు , మరుసటి రోజే ఏ చిన్న విషయానికైనా రాక్షసంగా మారతాడు. ఆ తర్వాత మళ్లీ తన తప్పు లేనట్లే వచ్చి క్షమాపణలు చెప్పి ఏడుస్తాడు. ఈ విధమైన సైకలాజికల్ డ్రామాతో ఎదుటివారిని అయోమయానికి గురిచేస్తారు. తప్పు వారిదే అయినా, మాటల చాతుర్యంతో ఎదుటివారిపైకి నెట్టేస్తారు. "నీ వల్లే నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది" అని నమ్మించి, ఎదుటివారినే గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తారు. అనుపమ "ఆ రిలేషన్షిప్లో నా వ్యక్తిత్వం కుంచించుకుపోయినట్లు అనిపించింది" అని చెప్పారు. నార్సిసిస్ట్లు తమ భాగస్వామి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిని తమపై మాత్రమే ఆధారపడేలా చేస్తారు. సంబంధంలో ఎంత హింసించినా, బయటి ప్రపంచానికి లేదా చివర్లో మాత్రం తామే బాధితులమని కలరింగ్ ఇస్తారు. భాగస్వామి ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నా వీరికి పట్టింపు ఉండదు. అంతా తమ ఆధిపత్యం, తమ అవసరాల చుట్టూనే తిరగాలని కోరుకుంటారు. నార్సిసిస్ట్ మనస్తత్వం ఉన్నవారితో ప్రేమలో ఉండటం అంటే ప్రతిరోజూ ఒక మానసిక యుద్ధం చేయడమే. ఇలాంటి ప్రవర్తన అమ్మాయిల్లో

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోన్న ఈ అందాలతారకు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ మధ్యన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవిత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అనుపమ. ఇటీవల తన టాక్సిక్ రిలేషన్ షిప్ అలాగే బ్రేకప్ స్టోరీని చెప్పి కన్నీళ్లు పెట్టుకుందీ అందాల తార. తాజాగా తన కోసం, ఆపదలో ఉన్న ఉన్నప్పుడు ఆదుకునే కొందరు హీరోల గురించి చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘ గత కొద్ది రోజుల నుంచి చాలా మంది నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అయితే నాకు ఏ కష్టమొచ్చినా, నేను పూర్తిగా ఆధారపడగలిగే వ్యక్తి దుల్కర్ సల్మానే. నేను డల్‌గా ఉన్న ప్రతిసారీ దుల్కర్ నుంచి నాకు మెసేజ్ వస్తుంది. నేను బాధలో ఉన్న విషయం ఆయనకు ఎలా తెలుస్తుందో అని ఆశ్చర్యపోతుంటాను. కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేసేదాన్ని. దుల్కర్ తర్వాత నేను అంతగా నమ్మే మరో వ్యక్తి టాలీవుడ్ హీరో రామ్ పోతినేని. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది' అనుపమ చెప్పుకొచ్చింది. కాగా దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్ ల మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరు ‘జొమొంటే సువిశేషంగళ్’ ( తెలుగులో అందమైన జీవితం) సినిమాలో కలిసి నటించారు. 2017లో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఇదే సందర్భంగా తన రిలేషన్ షిన్, బ్రేకప్ పై కూడా మాట్లాడింది అనుపమ. 'నార్సిసిస్టిక్ అబ్యూస్ (మానసిక వేధింపుల) అనేది చాలా సైలెంట్‌గా జరుగుతుంది. అలాంటి వాళ్లు ఎప్పుడూ ఇతరులను తమ కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తారు. నా మాజీ ప్రియుడి వల్ల నేను ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాను' అని అనుపమ వాపోయింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు ఈ కింద చదవండి… ఈ మాటలన్నీ అనుపమ పరమేశ్వరన్ చెప్పింది కానీ ఆ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు. ఆమె మాటలను బట్టి ఆమె ఎవరితో రిలేషన్ షిప్ లో ఉందో, అతను ఎవరో ఇట్టే అర్థం అయిపోతోంది. బైసన్ అనే చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా హీరో ధృవ్ విక్రమ్ (హీరో విక్రమ్ కొడుకు)తో డేటింగ్ చేసింది. వారిద్దరూ ఒక పబ్ లో లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటున్న వీడియో కూడా బయటికి వచ్చింది. ఈ సినిమా 2025లో విడుదల అయింది. అంతకు ఏడాది ముందు నుంచే వీరి డేటింగ్ షురూ అయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన “డ్రాగన్” చిత్రం కూడా గతేడాదే విడుదల అయింది. డ్రాగన్ సినిమాని తన బాయ్ ఫ్రెండ్ ఆంక్షల వల్లే ప్రమోట్ చేసుకోలేకపోయాను అని చెప్పింది అంటే అప్పుడు రిలేషన్ లో ఉన్నది ధృవ్ విక్రమ్ తోనే. సో, పేరు చెప్పకపోయినా ఆమె ఇచ్చిన ‘డ్రాగన్’ హింట్ తో ఆమె అతని గురించే మాట్లాడింది అని అర్థం అవుతోంది. ఆమె ఇటీవలే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టింది. నర్మగర్భమైన పోస్టులతోనే ఆమె ధృవ్ తో కటీఫ్ చేసుకుందని తెలిసిపోయింది. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆమెని ఈ పోస్టుల గురించి, బ్రేకప్ గురించి అడిగితే సీరియస్ అయింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ఇంటర్వ్యూలో తాను రెండేళ్లు టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఇప్పుడు చెప్తోంది

స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. గత రెండేళ్లుగా తాను తీవ్ర మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన బ్రేకప్‌తో పాటు ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. మార్పును ముందే గమనించారు.. ‘ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టు వెనుక ఎంతో బాధ ఉంది. గత రెండేళ్లుగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయాను. ఆ సమయంలో నార్సిసిస్టిక్ అబ్యూజ్‌ను ( ఒక వ్యక్తి తన భాగస్వామిని మానసికంగా భావోద్వేగపరంగా వేధించడం) ఎదుర్కొన్నాను’ అని అనుపమ తెలిపారు. నాలో వచ్చిన మార్పుని కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుగానే గుర్తించారు. బ్రేకప్ విషయం బయటకు తెలిసి నెల రోజులే అయినప్పటికీ, తనకు దగ్గరగా ఉన్నవారికి ఈ విషయం ముందే అర్థమైంది’ అని అన్నారు. ‘సోషల్‌మీడియాలో పసుపు రంగు డ్రస్‌లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘అనుపమ ఆత్మహత్య చేసుకుంది’ అని రాసి ఉంటే నాకు మరింత ప్రేమ దక్కేదేమో’ అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ రిలేషన్షిప్ సరైనది కాదని, తాను అందరికీ దూరమవుతున్నానని వారంతా గమనించారని చెప్పారు. నిశ్చితార్థం కోసం.. రిలేషన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తనను మాజీ ప్రియుడు తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని తెలిపారు. మూడు నెలల్లోనే నిశ్చితార్థం గురించి చర్చలు కూడా జరిగాయని చెప్పారు. అయితే, తనకు మరికొంత సమయం కావాలని చెప్పినట్లు వెల్లడించారు.‘నేను నిశ్చితార్థానికి అంగీకరించి ఉంటే ఆ వివాహం చివరకు విడాకుల వరకు వెళ్లేదేమో. ఆ నిర్ణయం తీసుకున్నది కూడా నేనే’ అని స్పష్టం చేశారు. నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మాట్లాడుతూ.. ‘చాలామంది నార్సిసిస్టిక్ వ్యక్తులు తమను తాము ఎక్కువగా ప్రేమిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారిపై వారికి నమ్మకం ఉండదు. వారి జీవితంలోకి ఎవరినీ రానివ్వాలనుకోరు. ఎప్పుడూ గుర్తింపు కోరుకుంటూ ఉంటారు’ అని వివరించారు. కెరీర్‌పై ప్రభావం.. తన వ్యక్తిగత జీవితం

Anupama Parameswaran:నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి తొలిసారి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు రెండేళ్ల పాటు నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఎదురైందని ఆమె వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఆమె చెప్పలేదు. కొంతకాలం క్రితం అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జీవితంలో మనశ్శాంతిని దూరం చేసే విషయాలను వదిలిపెట్టాలని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆమె ఏదైనా రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చారా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు తన జీవితంలో ఏం జరిగిందో ఆమె వివరించారు. తన సోషల్ మీడియా పోస్ట్ గురించి అనుపమ మాట్లాడుతూ, "ఆ పోస్ట్ ఒక్కరోజులో వచ్చిన ఆలోచన కాదు. దాని వెనుక చాలా జరిగింది. రెండేళ్ల బాధ, శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న నష్టాలు ఆ ఒక్క పోస్ట్ వెనుక ఉన్నాయి" అని చెప్పారు. తాను పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు. "నేను సిద్ధంగా ఉన్నప్పుడు, నిజంగా హీల్ అయిన తర్వాతే ఏదైనా చెప్పాలని అనుకున్నాను. నా గురించి, నా జీవితంలో జరుగుతున్న ఒక పెద్ద విషయాన్ని గుర్తించిన ఒక ప్రయాణం అది" అని అనుపమ చెప్పారు. తనకు రెండేళ్ల పాటు నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఎదురైందని ఆమె స్పష్టంగా చెప్పారు. ఈ విషయం గురించి తొలిసారి ఒక వీడియోలో చూసినప్పుడు తనకు చాలా తీవ్రమైన భావోద్వేగం కలిగిందని తెలిపారు. అది చాలా టాక్సిక్ రిలేషన్షిప్ అని, ఆ సమయంలో తన కెరీర్‌పై కూడా ప్రభావం పడిందని చెప్పింది. ముఖ్యంగా డ్రాగన్ వంటి సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా తనను అనుమతించలేదని అనుపమ తెలిపింది. రిలేషన్షిప్ మొదలైన కేవలం మూడు నెలల్లోనే అతని కుటుంబం ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాట్లు కూడా చేసిందని, అయితే అతను వయసులో చాలా చిన్నవాడని ఆమె చెప్పింది

సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. పదేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా కేవలం నటనపైనే దృష్టి పెట్టిన ఈ మలయాళ బ్యూటీ, గత కొంతకాలంగా లవ్ అండ్ బ్రేకప్ రూమర్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఒక ప్రముఖ యువ హీరోతో ఆమె ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారంటూ సినీ వర్గాల్లో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్స్‌పై సైలెంట్‌గా ఉన్న అనుపమ, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గత రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. తన జీవితంలో ఎదురైన ఆ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడిన అనుపమ, గత రెండేళ్ల కాలంలో తాను అనుభవించిన నరకాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. తాను ఒక తీవ్రమైన నార్సిసిస్టిక్ అబ్యూజ్ కు గురయ్యానని, ఒక విషపూరితమైన బంధంలో బందీ అయ్యానని వెల్లడించింది. తన మాజీ ప్రియుడు ఒక రోజు 'రెమో'లా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటూ ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తిగా కనిపించేవాడని, కానీ మరుసటి రోజే విక్రమ్ 'అపరిచితుడు' సినిమాలోని క్యారెక్టర్ లాగా అత్యంత దారుణంగా, క్రూరంగా ప్రవర్తించేవాడని గుర్తుచేసుకుంది. మళ్లీ ఆ తర్వాత రోజు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడని, ఈ సైకిల్ నిరంతరం రిపీట్ అయ్యేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి, క్రమక్రమంగా తనను పూర్తిగా కంట్రోల్ చేయడం ప్రారంభించాడని అనుపమ తెలిపింది. తాను వేసుకునే దుస్తుల నుంచి, సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వరకు ప్రతీ విషయాన్ని ఆయనే నియంత్రించేవాడని పేర్కొంది. ఆఖరికి తాను నటిస్తున్న సినిమాల ఎంపికలోనూ, ప్రమోషన్స్‌కు హాజరయ్యే విషయంలోనూ ఆంక్షలు విధించేవాడని చెప్పింది. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడి

ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన గతానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించింది. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండి 'నార్సిసిస్టిక్ అబ్యూజ్' (మానసిక వేధింపుల)కు గురయ్యానని, శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలను పంచుకున్నప్పటికీ, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె గోప్యంగా ఉంచింది."ప్రేమ పేరుతో నా జీవితంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి, నన్ను పూర్తిగా తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించాడు. నేను ధరించే దుస్తులు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంశాలు, చివరికి ఎంచుకునే సినిమాల విషయంలోనూ ఆయనే ఆంక్షలు విధించేవాడు. నటనకు స్వస్తి పలకాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. పరిచయమైన మూడు నెలలకే నిశ్చితార్థం, వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడు. అది ప్రేమ కంటే నన్ను నియంత్రించే ప్రయత్నంగా అనిపించడంతో వాయిదా వేస్తూ వచ్చాను" అని వివరించింది.ఆ బంధం కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఆందోళనకు గురయ్యానని, ఫలితంగా శారీరకంగానూ కుంగిపోయి బరువు తగ్గానని అనుపమ ఆవేదన వ్యక్తం చేసింది. "షూటింగ్ సెట్స్‌లో క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదాన్ని. తరచూ పానిక్ ఎటాక్స్‌కు గురయ్యేదాన్ని. చివరికి నా సొంత తమ్ముడిని తాకడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. నా కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్న 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ మానసిక వేదన కారణంగానే హాజరు కాలేకపోయాను" అని ఆమె గుర్తుచేసుకుంది.అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ గత కొన్నాళ్లుగా ఓ హీరోతో ప్రేమాయణంలో ఉందని వార్తలు రాగా ఇటీవల కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనుపమ కూడా కొన్నాళ్ళు సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకొని నా లైఫ్ నా రూల్స్, ఎవరూ నన్ను కంట్రోల్ చేయలేరు ఇక అంటూ ఓ పోస్ట్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అనుపమ లవ్ బ్రేకప్ నిజమే అని అంతా అనుకున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి సంచలన విషయాలు తెలిపింది. Also See : Samantha Baby Bump Photos : బేబీ బంప్ తో సమంత.. లేటెస్ట్ ఫోటోలు చూశారా..? అనుపమ మాట్లాడుతూ.. మన పార్టనర్ పక్కన ఉంటే ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తాం. కానీ నేను నా బంధంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో గడిపేదాన్ని. నేను మాములుగా చేసుకునే పనులు కూడా చూసుకునేదాన్ని కాదు. ఏం మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడాల్సి వచ్చేది. రోజూ భయపడుతూనే ఉన్నాను. అతనే నా జీవితం అని నమ్మాను. కానీ మెల్లిమెల్లిగా అతని నిజస్వరూపం బయటపడింది. నన్ను కంట్రోల్ పెట్టేవాడు. నా సినిమా ప్రమోషన్స్ కి కూడా నన్ను వెళ్లనివ్వలేదు. డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ కి అందుకే వెళ్ళలేదు. అతని వల్ల నేను చాలా సినిమాలు వదిలేసుకున్నాను. నా ప్రతి విషయంలో జోక్యం చేసుకునేవాడు. నా సొంత కుటుంబం నుంచి కూడా అతన్ని నేను కాపాడుకున్నాను. కానీ అతను అపరిచితుడిలా ప్రవర్తించేవాడు. అతని వల్ల నేను నా స్నేహితులకు కూడా దూరమయ్యాను. ఎవరైనా నన్ను ప్రేమగా పలకరిస్తే ఏడ్చేసే పరిస్థితిలోకి వచ్చాను. అదొక టాక్సిక్ రిలేషన్ షిప్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. Also See : Ishwarya Vullingala : ఫ్యామిలీతో నటి ఐశ్వర్య

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ , కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌ల మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) ల మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగుతోందని వార్తలు రావడం తెల్సిందే. గతంలో వీరిద్దరూ కలసి ఉన్న ఫోటోలు, కిస్ చేసుకుంటున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చి తీవ్ర దుమారం రేపాయి. ఒకానొక దశలో వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే, అందరూ అనుకున్నట్లుగా ఆ ప్రేమకథ సజావుగా సాగలేదని, ఆ బంధం వెనుక తనకు ఎదురైన చేదు అనుభవాలను, తీవ్రమైన మానసిక వేదనను అనుపమ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనోగతాన్ని బయటపెట్టింది. వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారన్న వార్తలపై అనుపమ స్పందించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. తాను గడిచిన రెండేళ్ల కాలంలో తీవ్రమైన నార్సిసిస్టిక్ అబ్యూజ్, తీవ్ర శారీరక, మానసిక క్షోభను అనుభవించానని తెలిపింది. ప్రారంభంలో ఎంతో ప్రేమను కురిపించిన భాగస్వామి, క్రమంగా తన జీవితంపై, దుస్తుల ఎంపికపై, సోషల్ మీడియా పోస్టులపై, చివరికి సినిమాల ఎంపికపై కూడా తీవ్రమైన నియంత్రణ సాధించడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం 3 నెలల పరిచయంలోనే ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడారని, కానీ అది ప్రేమతో కాకుండా తనను నటన మాన్పించి పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమని గ్రహించి తనే పదే పదే ఎంగేజ్‌మెంట్‌ను వాయిదా వేస్తూ వచ్చానని వివరించింది. అంతేకాకుండా ఈ మానసిక ఒత్తిడి వల్ల తాను డిప్రెషన్, యాంగ్జైటీ మందులు వాడాల్సి వచ్చిందని, తన కెరీర్లోనే పెద్ద హిట్ అయిన డ్రాగన్ సినిమా ప్రమోషన్లకు కూడా వెళ్లలేకపోయానని చెప్పింది. షూటింగ్ స్పాట్లో పానిక్ అటాక్స్ వచ్చి వ్యాన్ లోపలికి
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి