సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు, వివాదాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మధ్య నడిచిన ప్రేమాయణం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు, తన పార్టనర్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే వీరి బ్రేకప్‌కి ధ్రువ్ కారణమంటూ వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి.* యానిమేషన్లో రామాయణం.. ‘మెగా 158’ మేకర్స్‌తో అనిల్ రావిపూడి సరికొత్త ప్రయోగం!తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్‌పై ధృవ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడే ఇక్కడ వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సర్వసాధారణమని నాకు తెలుసు. అలాగని ఇవి నన్ను అస్సలు బాధించలేదని, నాపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పలేను. అయితే జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులకు అండగా నిలవడం, వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీ మార్గంలో ఉన్నప్పుడు, మన విలువలు స్పష్టంగా ఉన్నప్పుడు కాలక్రమేణా ఈ దుష్ప్రచారాలు, విమర్శలన్నీ సమసిపోతాయి" అని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన అభిమానుల మద్దతే ముందుకు నడిపిస్తోందని తెలిపారు.అనుపమ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన గత సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, దాదాపు రెండేళ్ల పాటు ఓ టాక్సిక్ రిలేషన్షిప్లో తీవ్ర మానసిక క్షోభను అనుభవించానని ఆమె వెల్లడించారు. అవతలి వ్యక్తి తన ప్రతి చిన్న విషయాన్ని, కెరీర్ నిర్ణయాలను నియంత్రించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ అనుభవాల వల్ల తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని, బరువు కూడా భారీగా తగ్గిపోయానని ఆవేదన చెందారు. చివరకు తన కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘డ్రాగన్’ చిత్ర ప్రమోషన్లకు కూడా హాజరు కాలేకపోయానని, ఎన్నో మంచి సినిమా అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె పంచుకున్న చేదు జ్ఞాపకాలు నెటిజన్లను కదిలించాయి.* త్వరలోనే స్టోరీ నెరేషన్ చేస్తా... రవితేజతో క్రేజీ కాంబోపై బుచ్చిబాబు ఓపెన్నెటిజన్ల రియాక్షన్.. పాత వీడియోల తవ్వకాలు!ధృవ్ తాజా వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. తనపై ఏర్పడిన నెగిటివీటి తొలగించుకునేందుకే ధృవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్న కొన్ని ఈవెంట్లలోని దృశ్యాలు, పాత వీడియోలను తెరపైకి తెస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అనుపమ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణకు ఇవే నిదర్శనమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ధృవ్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ అంశం మరింత వేడెక్కింది తప్ప వివాదం సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు.





